
ఈ మధ్య కాలంలో ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని తోటి ఉద్యోగులతో రాసలీలలు నడిపిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల బాగోతాలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో తహశీల్దార్ గా పని చేస్తున్న ఒక వ్యక్తి తోటి ఉద్యోగినితో కామకలాపాలు సాగిస్తున్న ఒక వీడియో వైరల్ అయింది. కర్ణాటకలోని కొప్పళ్ల జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉద్యోగినితో కామవాంఛలు తీర్చుకుంటున్న ఉద్యోగికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Read : బైక్, స్కూటర్ కొనుగోలు చేసే వారికి కేంద్రం శుభవార్త…?
పూర్తి వివరాల్లోకి వెళితే కొప్పగిలో ఆరు నెలల క్రితం గురుబసవరాజ్ అనే వ్యక్తి తహశీల్దార్ గా చేరారు. అక్కడ ఒక మహిళా ఉద్యోగినిని ప్రేమ పేరుతో లోబర్చుకుని కామ వాంఛను తీర్చుకున్నారు. అయితే తహశీల్దారు ఉద్యోగితో రాసలీలలు జరుపుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో కలెక్టర్ ఈ ఘటన గురించి విచారణకు ఆదేశించగా పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
పోలీసులు సీసీ ఫుటేజీను పరిశీలించి వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించిన దృశ్యాలు చాలాకాలం నాటివని చెబుతున్నారు. ఎవరైనా కావాలనే ఈ వీడియోను ఇంతకాలం తరువాత సోషల్ మీడియాలో వైరల్ చేసి ఉండవచ్చని చెబుతున్నారు. పోలీసులు తహసీల్దార్ ను, యువతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని తెలుస్తోంది. ఈ ఘటన గురించి స్థానికంగా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది.
Also Read : 2,000 నోట్లు రద్దు అంటూ ప్రచారం.. ఆర్బీఐ ఏం చెప్పిందంటే?