Homeఎంటర్టైన్మెంట్మహేష్ కోసం ప్రత్యేకమైన సెట్ స్టార్ట్ !

మహేష్ కోసం ప్రత్యేకమైన సెట్ స్టార్ట్ !


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రానున్న ‘సర్కారు వారి పాట’ సినిమా సెట్ వర్క్ స్టార్ట్ అయింది ఈ రోజు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆర్ట్ డైరెక్టర్ తోట తరుణి ఆధ్వర్యంలో ప్రత్యేకమైన సెంట్రల్ బ్యాంక్ కి సంబంధించిన భారీ సెట్ ను నిర్మిస్తున్నారు. సినిమాలో ఓపెనింగ్ సన్నివేశాలు అన్ని ఈ బ్యాంక్ సెట్ లోనే జరుగుతాయట. ఈ సినిమా కాన్సెప్ట్ కూడా భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూనే సాగుతోందనే మ్యాటర్ ఇప్పటికే బయటకు తెలిసిన విషయం. ఇక ఈ సినిమాలో మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకుగా నటించబోతున్నాడు. అంటే తన తండ్రిని మోసం చేసి వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టడానికి మహేష్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడనేది సినిమాలో మెయిన్ కంటెంట్.

Also Read: దానికి కూడా రష్మికనే రికమెండ్‌ చేసిన విజయ్!

ఈ క్రమంలో మహేష్ వేసే ప్లాన్స్ ఏమిటనే అంశాల చుట్టూ.. అలాగే ఆ బిజినెస్ మెన్ ని ఎలా తన తెలివితో మోసం చేశాడు.. చివరకు ఇలాంటి బిజినెస్ మెన్ లను ఏం చేయాలనే మెసేజ్ తో ఈ సినిమా ముగుస్తోందట. అయితే సినిమా సీరియస్ టోన్ లో సాగకుండా కాస్త కామెడీ యాంగిల్ లోనే ఉంటుందని.. అనగా మహేష్ వేసే ప్లాన్స్ చుట్టూ వచ్చే సీన్స్ ఫుల్ ఎంటర్ టైన్ గా ఉంటాయని సమాచారం. అయినా, సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక కథ ఫిక్స్ చేసాడు అంటే.. ఆ కథలో గుడ్ కంటెంట్ ఉంటుందనేది మహేష్ గురించి బాగా తెలిసిన వాళ్ళు చెప్పే మాట. అందుకే మహేష్ చేసిన ప్లాప్ సినిమాల్లో కూడా మంచి కంటెంటే ఉంటుంది.

Also Read: ఆర్ఆర్ఆర్ పై క్లారిటీ ఇచ్చిన ఆలియా భట్‌

బహుశా అందుకేనేమో మహేష్ ప్లాప్ సినిమాలు కూడా టీవీల్లో టాప్ టీఆర్పీ రేటింగ్ ను తెచ్చుకుంటాయి. ఇక ఈ సినిమాలో మంచి యాక్షన్ తో పాటు థ్రిల్లింగ్ ట్విస్ట్ లు కూడా ఉన్నాయని.. అలాగే ఓ రొమాన్స్ ట్రాక్‌ కూడా ఉందని.. మహేష్ అభిమానులకు ఈ లవ్ స్టోరీ బాగా కనెక్ట్ అవుతుందని మేకర్స్ చెబుతున్నారు. అన్నిటికి మించి చాలా కాలం తర్వాత మహేష్ ఈ సినిమాలో లవర్ బాయ్‌ గా కనిపించబోతున్నాడు. ఈ లవర్ బాయ్ లుక్ కోసమే, మహేష్ తన హెయిర్ స్టైల్ ను కూడా కొత్తగా మార్చుకున్నాడు. ఇప్పటికే మహేష్ మార్చిన కొత్త లుక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. కాగా మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular