Home Blog Page 8342

గ్రేటర్ లో ‘ముందస్తు’ ఎన్నికలు?


సీఎం కేసీఆర్ వ్యూహాలు ప్రత్యర్థులకు అందని విధంగా ఉంటాయి. ఊహించని విధంగా ప్రత్యర్థులను దెబ్బకొట్టడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య.. ఎవరూ ఊహించని విధంగా సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందుస్తుగా వెళ్లి ఘన విజయం సాధించారు. ఐదేళ్ల పదవీ కాలం పూర్తి కావడానికి ఇంకా ఐదారు నెలల సమయం ఉండగానే కేసీఆర్ ముందుస్తు ఎన్నికల వెళ్లి అందరికీ షాకిచ్చారు. ప్రతిపక్షాలకు ఏమాత్రం తెరుకునే ఛాన్స్ ఇవ్వకుండా కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది.

Also Read: అదే జరిగితే.. హైదరాబాద్ లో తట్టుకోగలమా?

ఐదునెలల పాలనపోతే పోయింది గానీ టీఆర్ఎస్ సర్కారుకు మరో ఐదేళ్ల పదవీ కాలం లభించింది. ఇదంతా కేసీఆర్ చాణిక్యం వల్లే సాధ్యమైంది. పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే టీఆర్ఎస్ ఎన్నికలకు వెళితే పరిస్థితి వేరేలా ఉండేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కేసీఆర్ ముందుచూపు కారణంగానే టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికల్లో విజయం సాధించిందనే టాక్ టీఆర్ఎస్ వర్గాల్లోనూ వ్యక్తమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో ప్రతిపక్షాలు టీఆర్ఎస్ పార్టీకి రానున్న గ్రేటర్ ఎన్నికల్లో షాక్ ఇవ్వాలని భావిస్తున్నాయి. అయితే కేసీఆరే ఆ పార్టీలకు గట్టి షాకిచ్చేందుకు రెడీ అవుతున్నారనే టాక్ విన్పిస్తోంది.

వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే టీఆర్ఎస్ నేతల్లో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పర్యటనలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో హడావుడి చేస్తున్నారు. ప్రజలు కోరిందే తడువుగా పనులు చేసిపెడుతూ ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. మరోవైపు టీఆర్ఎస్ గ్రేటర్లో ఓ సర్వే చేయించినట్లు తెలుస్తోంది. ఎక్కడెక్కడ టీఆర్ఎస్ బలహీనంగా ఉంది.. ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్లకు ఉన్న పలుకుబడి.. ప్రజాదరణ వంటి అంశాలతో ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి అభిప్రాయం సేకరించినట్లు సమాచారం. ఈమేరకు మార్పులు చేర్పులు చేసేందుకు వ్యూహాలు రచిస్తోంది.

Also Read: టీఆర్ఎస్ వేటకు కాంగ్రెస్ కుదేలు

గతంలో గ్రేటర్లో వంద సీట్లను గెలుస్తామని ప్రకటించగా 99సీట్లు సాధించింది. ఈసారి కూడా వంద సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పరిస్థితుల్లో వ్యతిరేకత ఉండటంతో టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుందని ఆలోచిస్తుంది. గ్రేటర్లో ఇప్పటికే భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తోంది. నాలుగైదు నెలల్లో అన్ని పనులు పూర్తి చేసేలా సన్నహాలు చేస్తోంది. దీంతో డిసెంబరు నెలలోనే ఎన్నికల వెళితే ఏమేరకు తమకు కలిసి వస్తుందని టీఆర్ఎస్ అంచనా వేసుకుంటోంది.

కాంగ్రెస్, బీజేపీలు ఇంకా ప్రచార బరిలో దిగలేదు. దీంతో వీలైనంత త్వరగానే టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి ముందస్తు ఎన్నికలను వెళ్లాలని భావిస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసొచ్చినా ముందస్తు గెలుపు మంత్రం.. గ్రేటర్లో ఏమేరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే..!

నాగార్జున వైల్డ్‌ డాగ్‌ లుక్‌ అదుర్స్‌.. షూటింగ్‌ ఎప్పుడంటే


టాలీవుడ్‌ కింగ్‌ అక్కినేని నాగార్జున నిత్య యవ్వనుడు. ఫిట్‌నెస్‌ అంటే ప్రాణం ఇచ్చే నాగ్‌ అరవై దాటినా ఇంకా కుర్రాడిగానే కనిపిస్తున్నాడు. ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడుతున్నాడు. నాగ్ ఈ రోజు 61 పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా అభిమానులకు బహుబతి ఇచ్చాడు యువ సామ్రాట్‌. నాగ్‌ ప్రస్తుతం వైల్డ్ డాగ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. అహిశోర్ సొలోమాన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అక్కినేని అందగాడు ఎన్‌ఐఏ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నాడు. నాగ్‌ బర్త్‌డే ను పురస్కరించుకొని వైల్డ్‌ డాగ్‌ యూనిట్‌ ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ను రిలీజ్‌ చేసింది.

Also Read: పవన్‌ బర్త్‌డే స్పెషల్‌… ఓ సర్ప్రైజ్‌, ఓ సస్పెన్స్‌

ఏసీపీ విజయ్‌ వర్మ అలియాస్‌ వైల్డ్‌ డాగ్‌ పాత్రలోని నాగ్‌ లుక్‌ను రివీల్‌ చేసింది. ఓ ఆపరేషన్‌లో పాల్గొన్న నాగార్జున భారీ గన్‌ పట్టుకొని షూట్‌ చేయడానికి రెడీగా ఉన్న లుక్‌ అదిరిపోయింది. ఎన్‌ఐఏ ఏసీపీగా నాగ్‌ 12 మిషన్స్‌ పూర్తి చేశాడని పోస్టర్పై రాశారు. దాంతో, ఈ మూవీలో నాగ్‌ పవర్ఫుల్‌ పోలీసుగా కనిపించనున్నాడు. ఇక, ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రధారుల వివరాలను యూనిట్‌ రివీల్‌ చేసింది. బిగ్‌బాస్‌ కంటెస్టంట్‌ అలీ రెజా, బాలీవుడ్‌ నటి సయామీ ఖేర్ తదితరులు కూడా ఎన్‌ఐఏ ఏజెంట్స్‌గా కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో నాగ్‌ సరసన బాలీవుడ్‌ నటి దియా మిర్జా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తయింది. కరోనా కారణంగా చిత్రీకరణ ఆగిపోయింది. మిగిలిన భాగాన్ని షూట్‌ చేయడం కోసం నాగ్‌ రెడీ అయిపోయాడు. ఈ సోమవారం నుంచే తిరిగి ప్రారంభమవుతుందని ట్వీట్‌ చేశాడు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న ఈ మూవీని నిజ ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. వచ్చే ఏడాది విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నాడు.

Also Read: నాగార్జున కు బ్యూటిఫుల్ బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన ‘లవ్ స్టోరీ’ టీమ్

మరోవైపు కరణ్‌ జోహార్ ప్రొడ్యూస్‌ చేస్తున్న హిందీ యాక్షన్‌ ఫాంటసీ ఫిల్మ్‌ ‘బ్రహ్మాస్త్ర’లో అమితాబ్‌ బబ్చన్‌, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్‌లతో కలిసి నాగ్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే, హిందీ హిట్ మూవీ ‘రైడ్‌’ను తెలుగులో రీమేక్‌ చేయాలని చూస్తున్నాడు.ఇక, తన తండ్రి పుట్టిన రోజున అక్కినేని నాగచైతన్య కొత్త సినిమాను అనౌన్స్‌ చేశాడు. మనం లాంటి బ్లాక్‌ బస్టర్ అందించిన విక్రమ్‌ కె కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ అనే సినిమాలో చైతూ హీరోగా నటిస్తున్నాడు. దిల్‌ రాజు ప్రొడ్యూస్‌ చేస్తున్న ఈ మూవీ టైటిల్‌ను ఈ రోజు రివీల్‌ చేశారు. చైతూకు ఇది 20వ సినిమా కావడం విశేషం.

ఇన్ టాక్ : తెదేపా సోషల్ మీడియా vs సోము వీర్రాజు !

గత కొన్ని సంవత్సరాలుగా దేశ రాజకీయాల్లో సోషల్ మీడియా పాత్ర ఎక్కువైపోయింది. ఇక ఆంధ్రప్రదేశ్ వంటి దక్షిణాది రాష్ట్రాల్లో అయితే అది గ్రౌండ్ లెవెల్ లో ప్రజలను ఉత్సాహపరిచేందుకు కావచ్చు, మభ్యపెట్టడం లో కావచ్చు, అబద్ధపు ప్రచారంలో చేయడంలో కావచ్చు లేదా ఒక పార్టీ పై వారికున్న భావనను మరింత బలపరిచేందుకు కావచ్చు…. ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇక ఇలాంటి సమయంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పై టీడీపీ సోషల్ మీడియా విపరీతంగా విరుచుకుపడుతోంది.

కన్నా లక్ష్మీనారాయణ బిజెపి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు టీడీపీ సోషల్ మీడియా అసలు అతనిని పట్టించుకోలేదు కానీ వీర్రాజు పై మాత్రం పెద్ద యుద్ధమే చేస్తోందట. కన్నా లక్ష్మీనారాయణ ఉన్నప్పుడు వైసిపి సోషల్ మీడియా అతనిపై తీవ్రంగా విరుచుకుపడింది. టిడిపి కి అనుకూలంగా రాజకీయం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేసింది. టిడిపి తొత్తు అని జనాలను విపరీతంగా నమ్మించగా…. బిజెపి అధిష్టానం లక్ష్మీనారాయణను పదవినుండి తొలగించడానికి కూడా కారణం అదే అని ప్రచారం సాగించింది.

ఇప్పుడు ప్రస్తుతం ఇదే ప్లాన్ ను టీదిపి మీడియా అమలుచేస్తోంది. అటు చానల్స్ తో పాటు ఇటు సోషల్ మీడియా వారు కూడా సోము వీర్రాజు ని టార్గెట్ చేసి వైసీపీ బంటు అని నిరూపించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే దీనిపై చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసే పరిస్థితి కూడా వచ్చిందని సమాచారం.

ఇక సోము వీర్రాజు మాత్రం ఇవేమి పట్టించుకోకుండా రాష్ట్రంలో ఏకధాటిగా ముందుకు దూసుకెళ్తున్నారు. వైసీపీ నుంచి అధికారం వదులుకొని ఎవరూ రారు కాబట్టి టిడిపిని విచ్ఛిన్నం చేసే దిశగా ఆయన ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. టిడిపి రాష్ట్ర ప్రజలకు చేసిన అన్యాయాలను ఎత్తి చూపుతూనే సరైన ప్రత్యామ్నాయం తామే అన్న వాదనను కూడా ఎప్పటికప్పుడు నిరూపిస్తూ ప్రజల్లో బలంగా తీసుకెళ్తున్నారు. మరి ప్రజలు టిడిపి సోషల్ మీడియా వర్సెస్ సోము వీర్రాజు యుద్ధంలో ఎవరిని సపోర్ట్ చేస్తారో చూడాలి.

నాగార్జున కు బ్యూటిఫుల్ బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన ‘లవ్ స్టోరీ’ టీమ్


ఈ రోజు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున పుట్టినరోజు. నేటితో నాగ్ 61వ వ‌సంతంలో అడుగుపెడుతున్న సంద‌ర్భంగా అక్కినేని అభిమానుల హృదయాల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. యువ సామ్రాట్ నాగచైతన్య , సాయి పల్లవి జంటగా సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తీస్తున్న మూవీ ‘‘లవ్ స్టోరీ’’. ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ రోజు కింగ్ నాగార్జున బర్త్ డే సందర్భంగా ‘‘లవ్ స్టోరీ’’ మేకర్స్ ఆయన కు శుభాకాంక్షలు తెలుపుతూ సినిమా నుండి ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో నాగ చైతన్య,సాయి పల్లవి లు చాలా ప్లజెంట్ గా హ్యాపీగా కనిపిస్తున్నారు.

Also Read: నాగ్ ‘బ‌ర్త్ డే’కి చైతు నుండి ‘థాంక్యూ’!

ఇంకా 15 రోజుల షూటింగ్ మినహా సినిమా అంతా కంప్లీట్ అయింది.పరిస్థితులు అనుకూలించిన తర్వాత షూటింగ్ మొదలు పెట్టి.సరైన సమయంలో మూవీని థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంట గా నటిస్తున్న ఈ మూవీలో రాజీవ్ కనకాల,ఈశ్వరీ రావు,దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

చెన్నై టీమ్‌కు మరో షాక్..‌ ఐపీఎల్‌ నుంచి తప్పుకున్న సురేశ్‌ రైనా

0


ప్రతిష్టాత్మక ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌ పదమూడో సీజన్‌ దగ్గర పడుతున్న కొద్దీ షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19వ తేదీన మొదలవ్వాల్సిన ఈ మెగా లీగ్‌కు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా భారత జట్టు మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుకు వరుసగా రెండో షాక్‌ తగిలింది. ప్రస్తుతం ఆ జట్టు దుబాయ్‌లో ప్రత్యేక హోటల్లో ఉంది. అక్కడి స్థానిక ప్రభుత్వం, బీసీసీఐ మార్గనిర్దేశాల మేరకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆ జట్టులో ఏకంగా ఒక ప్లేయర్ సహా 13 మంది కరోనా బారిన పడ్డారన్న విషయం కలకలం సృష్టించింది. ఆ షాక్‌ నుంచి టీమ్‌ కోలుకోక ముందే మరో ఎదురు దెబ్బ తగిలింది.  సి ఎస్ కే స్టార్ ప్లేయర్, ఆల్‌రౌండర్ సురేశ్ రైనా ఈ సీజన్‌కు దూరమయ్యాడు. టీమ్‌మేట్స్‌తో కలిసి దుబాయ్‌ వెళ్లిన అతను తిరిగి స్వదేశానికి వచ్చేశాడు. వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్‌ నుంచి అతను వైదొలిగాడు. ఈ విషయాన్ని సి ఎస్ కే టీమ్‌ సీఈఓ కాశీ విశ్వనాథన్‌ ధ్రువీకరించారు.

Also Read: ధోనీ టీమ్‌లో 13 మందికి కరోనా.. ఐపీఎల్‌పై నీలినీడలు!

‘సురేశ్‌ రైనా వ్యక్తిగత కారణాల వల్ల ఇండియాకు తిరిగొచ్చాడు. ఈ సీజన్‌ మొత్తానికి అతడు అందుబాటులో ఉండబోడు. ఈ సమయంలో రైనాకు, అతని కుటుంబానికి చెన్నై సూపర్‌ కింగ్స్‌ నుంచి పూర్తి మద్దతు ఉంటుంది’ అని విశ్వనాథ్‌ ప్రకటించారు. విశ్వనాథ్‌ ప్రకటన బట్టి రైనా కుటుంబంలో ఒకరు తీవ్ర ఆనారోగ్యానికి గురయ్యారని, అందుకే అతను హుటాహుటిన దుబాయ్‌ నుంచి ఇండియాకు తిరిగొచ్చేశాడని ఐపీఎల్‌ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు జట్టులో చాలా మంది కరోనా బారిన పడడంతో ఆందోళన చెందడం వల్లే ఈ స్టార్ క్రికెట్ టోర్నీ లో ఆడకూడదని నిర్ణయించుకున్నాడన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సి ఎస్ కే కెప్టెన్‌ ధోనీతో రైనా చాలా సన్నిహితంగా ఉంటాడు. ధోనీ, రైనాలను క్రికెట్‌ సర్కిల్స్‌లో రామలక్ష్మణులుగా పోలుస్తారు. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు ధోనీ రిటైర్మెంట్‌ ప్రకటించిన రోజే నిమిషాల వ్యవధిలో అతనూ ఆటకు గుడ్‌బై చెప్పాడు. ఐపీఎల్‌పై దృష్టి పెట్టిన ఈ ఇద్దరూ చాలా రోజుల నుంచి ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి రైనా టోర్నీకి దూరం కావడం వెనుక బలమైన కారణం ఉండి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నేడు ఖేల్ రత్న అందుకోనున్న రోహిత్ శర్మ

0


ప్రముఖ హకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ పుట్టిన రోజును పురస్కరించుకొని ప్రతీయేటా కేంద్రం జాతీయ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. జాతీయస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఆగస్టు 29న క్రీడా పురస్కారాలతో సత్కరిస్తోంది. ఈసారి దేశంలో కరోనా మహ్మమరి కారణంగా తొలిసారి ఈ కార్యక్రమాన్ని వర్చువల్ గా నిర్వహిస్తున్నారు. మొత్తంగా 74మంది క్రీడాకారులకు కేంద్రం అవార్డులను అందజేయనుంది.

Also Read: ధోనీ టీమ్‌లో 13 మందికి కరోనా.. ఐపీఎల్‌పై నీలినీడలు!

ఈ ఏడాది రాజీవ్ ఖేల్ రత్నకు ఐదుగురిని ఎంపిక చేశారు. క్రికెట్ నుంచి భారత వైస్ కెప్టెన్, డ్యాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ ఉన్నారు. 2019లో రోహిత్ శర్మ క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన చూపించినందుకు బీసీసీఐ అతడిని ఖేల్ రత్నకు సిఫార్సు చేసింది. అవార్డు కమిటీ రోహిత్ కు అవార్డుకు ఎంపిక చేసింది. దీంతో నేడు రోహిత్ శర్మకు కేంద్రం అవార్డు అందజేస్తోంది. ఖేల్ రత్న అందుకోనున్న నాలుగో క్రికెటర్ గా రోహిత్ రికార్డు సృష్టించాడు. రోహిత్ కంటే ముందుగా సచిన్ టెండుల్కర్, ధోని, విరాట్ కోహ్లీలు ఖేల్ రత్న అవార్డును అందుకున్నారు.

రోహిత్ పాటు రాజీవ్ ఖేల్ రత్నకు రెజ్లింగ్ నుంచి వినేశ్ పొగట్, హకీ నుంచి రాణి రాంపాల్, టేబుల్ టెన్నిస్ నుంచి మనిక బాత్ర, పారా అథెటిక్స్ నుంచి మరియప్పన్ ఎంపికయ్యారు. అదేవిధంగా అర్జున అవార్డుకు 27మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. వీరిలో క్రికెట్ నుంచి ఫాస్టు బౌలర్ ఇషాంత్ శర్మ ఎంపికయ్యాడు. గతేడాది టెస్టులో మంచి ప్రతిభ చూపించినందుకు ఇషాంత్ ను బీసీసీఐ అర్జున అవార్డుకు సిఫార్సు చేసింది.

Also Read: ‘గాల్లో’ ఎగరాలంటే మాస్కు ఉండాల్సిందే..!

ఇషాంత్ శర్మతోపాటు దీప్తి శర్మ క్రికెట్ నుంచి ఎంపికైంది. ఆర్చరీ నుంచి అతాను దాస్, అథ్లెట్ నుంచి ద్యుతీ చంద్, సందీప్, బ్యాడ్మింటన్ నుంచి చిరాగ్ శెట్టి, సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, ఫుట్ బాల్ నుంచి సందేశ్, గోల్ఫ్ నుంచి అదితి అశోక్, బాస్కెట్ బాల్ నుంచి విశేష్, బాక్సింగ్ నుంచి సుబేదార్ కౌశిక్, లోవ్లినా, హాకీ నుంచి అక్షదీప్ సింగ్, దీపిక, ఈక్వెస్ట్రైన్ నుంచి శావంత్ అజయ్ కబడ్డీ నుంచి దీపక్, ఖోఖో నుంచి సుందర్ ఎంపికయ్యారు.

రోయింగ్ నుంచి దత్తు బాబన్, షూటింగ్ నుంచి మనుబాకర్, సౌరబ్ చౌదరి, టెబుల్ టెన్నిస్ నుంచి మధురిక, టెన్నిస్ నుంచి దివిజ్ శరణ్, వింటర్ స్పోర్ట్స్ నుంచి శివ కేశవన్, రెజ్లింగ్ నుంచి దివ్య, రాహుల్, పారా స్మిమ్మింగ్ నుంచి నారాయణ యాదవ్, పారా షూటింగ్ నుంచి మనీశాలు అర్జున అవార్డులకు ఎంపికయ్యారు. వీరందరికీ కేంద్రం నేడు అవార్డులను అందజేయనుంది.

అదే జరిగితే.. హైదరాబాద్ లో తట్టుకోగలమా?


మహానగరం హైదరాబాద్ కు వచ్చే సెప్టెంబర్ నుంచి ముప్పు పొంచి ఉంది. ఇన్నాళ్లు ప్రజా రవాణా లేకుంటేనే కేసులు వేలల్లో నమోదవుతున్నాయి. అదే ప్రజా రవాణా మొదలైతే పరిస్థితి ఎలా ఉంటుందోనన్న భయం అందరినీ వెంటాడుతోంది. కేంద్రం తాజాగా అన్ లాక్ 4.0లో మెట్రో సర్వీసులు, సిటీ బస్సులకు అనుమతి ఇస్తుంది. కోటి జనాభా ఉన్న హైదరాబాద్ లో ప్రజలకే అవే నిత్యావసరం. మరి ఇంత మంది ప్రజా రవాణా ఉపయోగిస్తే కరోనా కల్లోలం ఖాయం. ఇప్పటికే పెరుగుతున్న కేసులు భయపెడుతుంటే.. సెప్టెంబర్ 1 నుంచి తీవ్రత ఎలా ఉంటుందనే భయం అందరినీ వెంటాడుతోంది.

Also Read: రాజాసింగ్ కు అసలు భద్రత ఎందుకు పెంచారో తెలుసా?

కొవిడ్‌ కేసులు పెరుగుతున్న కొలదీ దేశంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు విడతల వారీగా లాక్‌ డౌన్‌ అమలు చేశాయి. గత మూడు నెలలుగా అన్‌లాక్‌ ప్రక్రియ నడుస్తోంది. ప్రస్తుతం అన్‌లాక్‌ 3.0 నడుస్తుండగా మరో రెండు రోజుల్లో ఇది ముగియనుంది. తదుపరి దేశంలో అన్‌లాక్‌ 4.0 షురూ కానుంది. అయితే.. ఈ 4.0లో కేంద్రం మెట్రో రైళ్లు నడుపుకునేందుకు పర్మిషన్‌ ఇచ్చింది. ఇక మెట్రో రైళ్లు షురూ కాగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా హైదరాబాద్‌ సిటీలో బస్సులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడానికి రెడీ అయ్యింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికుల్లో భయం మొదలైంది.

కొవిడ్‌ కేసులు రాష్ట్రంలో ఇప్పటికే లక్షా 20 వేలకు చేరువ కాగా.. ఇందులో మేజర్‌‌ కేసులు హైదరాబాద్‌ మహానగరంలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సిటీ సర్వీసులు ప్రారంభిస్తే తమకు కొవిడ్‌ ప్రమాదం తప్పదని ప్రజలతోపాటు ఆర్టీసీ కార్మికుల్లో ఆందోళన కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 600 మందికి పైగా ఆర్టీసీ సిబ్బంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. వీరిలో 40 మంది వరకు చనిపోయారని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. నగరంలో సిటీ బస్సులు నడవకపోయినప్పుడే కేసుల సంఖ్య ఇలా ఉంటే.. ఇక సిటీ సర్వీసులు ప్రారంభమైతే సంఖ్య ఇంకా ఎలా ఉంటుందోనని కార్మిక సంఘాలూ ఆవేదన చెందుతున్నాయి. ప్రస్తుతం స్టాఫ్‌ అందరూ కూడా రొటేషన్‌ పద్ధతిలో డ్యూటీకి హాజరవుతున్నారు. ముందుముందు రెగ్యులర్‌‌గా రావాల్సి ఉంటుంది. దీనికితోడు జిల్లాల్లో లాగా ఇక్కడ విశాలమైన డిపోలు ఉండవు. ఇరుకిరుకుగా ఉంటాయి. నిలబడేందుకు కూడా ఖాళీ స్థలం ఉండదు. ప్రయాణికుల్లో కానీ.. స్టాఫ్‌లో కానీ ఎవరైనా వైరస్‌ బారిన పడి బస్సుల్లో ప్రయాణిస్తే మిగితా వారందరికీ అంటుకునే ప్రమాదం ఉంది.

ప్రస్తుతం జిల్లాల్లో నడుస్తున్న బస్సుల్లో ప్రయాణికులు పెద్దగా కనిపించడం లేదు. మెజార్టీ బస్సులు ఖాళీగానే తిరుగుతున్నాయి. కానీ.. హైదరాబాద్‌ మహానగరంలో సిటీ సర్వీసులు ప్రారంభమైతే అలాంటి పరిస్థితి ఉండదు. ఏ బస్సు చూసినా ప్రయాణికులతో కిటకిటలాడాల్సిందే. ఇప్పటికే నగరంలో ట్రాఫిక్‌ కూడా పెద్ద ఎత్తున పెరిగింది. ఇక ఈ బస్సులు కూడా ప్రారంభమైతే ట్రాఫిక్‌ మరింత పెరుగుతుంది. అటు మెట్రో ప్రయాణికులు.. ఇటు బస్సు ప్రయాణికులు ఎవరినీ ఆపలేం. ఈ నేపథ్యంలో కరోనాను ఎలా కట్టడి చేయగలమన్నా ప్రశ్న ఉదయిస్తోంది.

Also Read: పీవీకి మరో అరుదైన గౌరవాన్నిచ్చిన కేసీఆర్

వీటన్నింటికి తోడు ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లదే ‘కీ’ రోల్‌. వీరిలో 55 ఏళ్ల పైబడ్డ వారే రాష్ట్రవ్యాప్తంగా 20 వేల మంది ఉన్నారు. 13 వేల మంది మహానగరంలోనే ఉన్నారు. ఇప్పటికైతే కరోనా బారిన పడి చనిపోతోంది 50+ ఏజ్‌ ఉన్న వారే. దీంతో వీరిలో టెన్షన్‌ మరింత ఎక్కువగా కనిపిస్తోంది. సిటీ సర్వీసులు ప్రారంభిస్తే ప్రాణాలు కాపాడుకోవడానికి సెలవులు పెట్టడానికే నిర్ణయించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రజల సంగతి చెప్పడానికి భయానకంగా ఉంది. కరోనా కేసులు పెరిగితే హైదరాబాద్ లో ఏం చేయాలన్న దానిపై సర్కారులోనూ చిత్తశుద్ధి లేదు. సో ఈ ఉత్పాతాన్ని ఎలా తట్టుకోగలమో చూడాలి మరీ..

టీఆర్ఎస్ వేటకు కాంగ్రెస్ కుదేలు


తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టు ఉన్న జిల్లా ఏదైనా ఉందంటే అది నల్గొండ జిల్లానే. తెలంగాణ ఏర్పడ్డ కొత్తలో తెలంగాణ వ్యాప్తంగా సత్తా చాటిన టీఆర్ఎస్ పార్టీ నల్గొండలో మాత్రం కాంగ్రెస్ ధాటికి నిలవలేకపోయింది. అప్పుడు ఆ జిల్లాలో ఒక్క జగదీష్ రెడ్డి మాత్రమే గెలవగలిగాడు.. మంత్రి అయ్యాడు. అయితే రెండో దఫా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ట్రెయిన్ రివర్స్ అయ్యింది. టీఆర్ఎస్ మెజార్టీ స్థానాలు గెలవగా.. కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక స్థానానికి పరిమితమైంది.

Also Read: రాజాసింగ్ కు అసలు భద్రత ఎందుకు పెంచారో తెలుసా?

2018 ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ సత్తా చాటింది. నల్గొండ జిల్లా కాంగ్రెస్ ఉద్దండులు, ఫైర్ బ్రాండ్స్ లను సైతం మట్టి కరిపించింది. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రెడ్డి సహా బడా బడా కాంగ్రెస్ ఉద్దండులు ఓడిపోయారు.. ఇప్పుడు టీఆర్ఎస్ మళ్లీ వేట మొదలుపెట్టడంతో కాంగ్రెస్ పట్టున్న ఓ నియోజకవర్గంలో కూడా ఆ పార్టీ తుడుచుపెట్టుకుపోతోందట..

నల్గొండ జిల్లా నుంచి కాంగ్రెస్ తరుఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారట.. ఆ నియోజకవర్గంలో తన సన్నిహితులు, విధేయులను ఒక్కరొక్కరుగా కోల్పోతున్నాడు. అంతా టీఆర్ఎస్ లోకి కట్ట కట్టుకొని వెళుతుండడంతో రాజగోపాల్ రెడ్డికి దిక్కుతోచడం లేదు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ గెలిచింది ఒక్క మునుగోడులోనే.. మిగిలిన అన్ని అసెంబ్లీ సీట్లు టీఆర్ఎస్ గెలిచింది. కోమటిరెడ్డి గెలవగానే బీజేపీలోకి చేరతున్నట్టు హల్ చల్ చేశాడు. అనంతరం ఇప్పుడు కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నాడు. నిలకడలేని కోమటిరెడ్డిపై నమ్మకం లేక తాజాగా ఇప్పుడు నియోజకవర్గంలోని జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్ లు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ లో చేరారు. దీంతో కోమటిరెడ్డి తన మద్దతు దారులను పెద్ద ఎత్తున కోల్పోయాడట.. ఇప్పుడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే తప్ప కాంగ్రెస్ నేతల ఉనికే ప్రశ్నర్థకంగా ఉందట..

Also Read: పీవీకి మరో అరుదైన గౌరవాన్నిచ్చిన కేసీఆర్

ఇలా కాంగ్రెస్ పట్టున్న నియోజకవర్గంలోనూ కోమటిరెడ్డిపై అపనమ్మకంతో నేతలంతా టీఆర్ఎస్ లో చేరిపోయారు. కాంగ్రెస్ లోనే ఉంటానని కోమటిరెడ్డి చెబుతున్నా ఇప్పుడు ఆ పార్టీకి నల్గొండ జిల్లాలో నూకలు చెల్లినట్టేనని కాంగ్రెస్ వాదులే వాపోతున్నారు. ఇలా కాంగ్రెస్ బలమున్న నల్గొండ జిల్లాలోనే ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకం కావడం నిజంగా విచిత్రమే మరీ..

నాగ్ ‘బ‌ర్త్ డే’కి చైతు నుండి ‘థాంక్యూ’!


ఈ రోజు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున పుట్టినరోజు. నేటితో నాగ్ 61వ వ‌సంతంలో అడుగుపెడుతున్న సంద‌ర్భంగా అక్కినేని అభిమానుల హృదయాల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఇక నాగ్ బర్త్ డేకి ఆయన అభిమానులు కోసం.. ప్రస్తుతం ఆయనతో సినిమాలు చేస్తున్న మేకర్స్ నుండే కాకుండా చైతు సినిమాల నుండి కూడా కానుక‌లు అందాయి. వైల్డ్ డాగ్ మూవీ టీమ్ తో పాటు చైతు చేస్తోన్న ల‌వ్ స్టోరి టీమ్ నుంచి ఇప్పటికే కానుక‌లు అందిన సంగతి తెలిసిందే. అయితే వీటినిటి కంటే కూడా తాజాగా శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ నాగ్ ఫ్యాన్స్ కి చైతు కొత్త సినిమాతో డీసెంట్ గిఫ్ట్ ఇచ్చింది.

Also Read: అవిటివాడిగా నారా రోహిత్ !

యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెకంటేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ పై విక్ర‌మ్ కె.కుమార్ దర్శకత్వంలో `థాంక్యూ` అనే సినిమా త్వ‌ర‌లో ప్రారంభం అవుతుందని..మేకర్స్ టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ అధికారికంగా ప్రకటించింది. పైగా అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా న‌టిస్తున్న 20వ సినిమా ఇది. ఇష్క్‌, మ‌నం, 24 వంటి వైవిధ్య‌మైన చిత్రాల‌ను రూపొందించిన విక్ర‌మ్ కె.కుమార్ నుండి ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్‌రాజు ఆధ్వర్యంలో శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి నిర్మాత‌లుగా ఈ సినిమా రాబోతుంది.

చైతును ఈ సినిమాలో ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌ని స‌రికొత్త‌ స్టైల్లో ప్రెజెంట్ చేసేలా సినిమా ఉంటుందని.. పైగా చైతు కోసం విక్ర‌మ్ అదిరిపోయే స్టోరీ తీసుకున్నాడని.. సినిమా మొత్తానికే చైతు క్యారెక్టర్ హైలైట్ అయ్యేలా ఉంటుందని తెలుస్తోంది. గతంలో వీరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన క్లాసిక్ మూవీ మ‌నం భారీ విజ‌యం సాధించిన రికార్డ్ గురించి తెలిసిందే. మళ్లీ ఇన్నేళ్లకు చైతు – విక్రమ్ నుండి అలాంటి క్లాసిక్ మూవీ రాబోతోందట. అన్నట్లు త్వ‌ర‌లోనే ఈ సినిమాలోని ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల గురించి పూర్తి వివ‌రాలు తెలియనున్నాయి. ఇక ఈ సినిమాలో నాగ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

దుబ్బాకలో టీఆర్ఎస్ ‘సేఫ్’ గేమ్


కరోనా ఎంట్రీ తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. కరోనాకు ముందు రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ధీటైనా పార్టీ లేదని.. కేసీఆర్ తో తలపడే నాయకుడే లేడనే టాక్ రాష్ట్రమంతటా విన్పించింది. ఇలాంటి సమయంలో రాష్ట్రంలో కరోనా ఎంట్రీ ఇచ్చింది. తొలినాళ్లలో కరోనా కట్టడిని కేసీఆర్ బాగానే కట్టడి చేసినట్లు కన్పించినా ఆ తర్వాత ఆయనే కొద్దిరోజులపాటు కన్పించకుండా పోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. సర్కార్ కరోనా విషయంలో చేతులెత్తేసిందనే ఆరోపణలను ప్రతిపక్షాలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాయి. కరోనా టైంలోనే సచివాలయం కూల్చివేత వంటి పనులు చేపట్టి ప్రభుత్వం విమర్శలు మూటకట్టుకుంది.

Also Read: పీవీకి మరో అరుదైన గౌరవాన్నిచ్చిన కేసీఆర్

దీంతో రాష్ట్రంలో టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు మొదలైందని ప్రతిపక్షాలు అంచనా వేస్తున్నాయి. క్రమంగా టీఆర్ఎస్ పై ప్రజల్లో వ్యతిరేకత వస్తున్న తరుణంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృత్యువాత పడ్డారు. దీంతో దుబ్బాకలో ఉప ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇది టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కావడంతో తిరిగి ఆ సీటును దక్కించుకోవడం కేసీఆర్ కు ప్రతిష్టాత్మకంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో ఆ ప్రభావం దుబ్బాక ఉప ఎన్నికపై పడే ప్రభావం కన్పిస్తోంది.

ఇప్పటివరకు రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా గులాబీ జెండానే ఎగిరింది. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ట్రాక్ రికార్డు ఆ పార్టీకి కలిసొచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మొదలైన వ్యతిరేక ప్రభావం దుబ్బాకపై పడకుండా చూడగలిగితే దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుపు సులభమేనని ఆపార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో టీఆర్ఎస్ ఎలాంటి రిస్కు తీసుకోకుండా సేఫ్ గేమ్ ఆడేందుకే మొగ్గుచూపుతుంది.

దుబ్బాక ఉప ఎన్నిక బాధ్యతను టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావుకే అప్పగించేందుకు కేసీఆర్ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా హరీష్ రావు ధీటుగా ఎదుర్కొని విజయం సాధించి పెడుతారని కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో అతడికే ఉప ఎన్నిక బాధ్యతను అప్పగించనున్నారని టీఆర్ఎస్ వర్గాల్లో టాక్ విన్పిస్తోంది.

Also Read: కరోనా దెబ్బకు అప్పులపాలు అయిపోతారు : వైద్య శాఖ మంత్రి ఈటెల

ప్రస్తుత పరిస్థితుల్లో దుబ్బాకలో టీఆర్ఎస్ అభ్యర్థిగా రామలింగారెడ్డి ఫ్యామిలీకే ఛాన్స్ దక్కుతుందని తెలుస్తోంది. 2004, 2008, 2014, 2018లో రామలింగారెడ్డి గెలిచారు. దీంతో ఈ నియోజకవర్గంలో ఆయనకు మంచిపట్టు ఉంది. దీంతో రామలింగారెడ్డి ఫ్యామిలీలో టికెట్ ఇస్తేనే సెంటిమెంట్ కలిసి వస్తుందని గులాబీ బాస్ ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగానే రామలింగారెడ్డి భార్య సుజాత లేదా ఆయన కుమారుడు సతీశ్‌రెడ్డికి ఛాన్స్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో ఇతరులకు టికెట్ ఇస్తే జనాల్లో వ్యతిరేకత వచ్చి ప్రతిపక్షాలు పుంజుకునే అవకాశం ఉంటుందని టీఆర్ఎస్ భావిస్తుంది. దీంతో ఆ కుటుంబంలో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి. అయితే కేసీఆర్ పార్టీ అభ్యర్థిని ఇప్పుడే ప్రకటించి.. ప్రచారానికి పంపుతారా? లేదా నోటిఫికేషన్ వచ్చాక ఆయనే నేరుగా రంగంలోకి దిగుతారా? అనేది వేచి చూడాల్సిందే..!

రాజాసింగ్ కు అసలు భద్రత ఎందుకు పెంచారో తెలుసా?


రాజాసింగ్.. తెలంగాణలో గెలిచిన ఏకైక బీజేపీ ఎమ్మెల్యే . ఆయన హిందుత్వ వాదంతోనే గెలిచారు. అదే హిందుత్వవాదంతో చెలరేగిపోతుంటారు.. ఎంఐఎం అంటేనే రాజాసింగ్ కు అస్సలు గిట్టదు. మున్సిపల్ ఎన్నికల్లో అదే ఎంఐఎంపై తీవ్ర వ్యాఖ్యలు చేసి కలకలం రేపారు. ఎంఐఎంపై ఇప్పటికీ విరుచుకుపడుతూనే ఉంటారు. ఎంఐఎం కేంద్ర కార్యాలయం దారుసలాంలో జాతీయ జెండా ఎగురవేసి జనగణమన పాడాలని.. ఇద్దరు ఒవైసీ బ్రదర్స్ ఇకపై వందేమాతరమూ పాడాల్సిందేనని హెచ్చరికలు పంపేంతటి ధైర్యం రాజాసింగ్ కు ఉంది..

Also Read: పీవీకి మరో అరుదైన గౌరవాన్నిచ్చిన కేసీఆర్

పక్కా ముస్లిం వ్యతిరేకిగా ముద్రపడ్డ రాజాసింగ్ భద్రతకు ఇప్పుడు పెను ముప్పు వాటిల్లింది. ఆయన ఇటీవల పట్టుబడ్డ ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో పేరు ఉండడంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆయనకు భద్రత పెంచుతున్నట్టు సిటీ కమిషనర్ అంజనీకుమార్ తాజాగా రాజాసింగ్ కు లేఖ రాశారు.

రాజాసింగ్ టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో భాగంగా బైక్ పై ర్యాలీలు చేయడం ఆయన అలవాటు. ఈ క్రమంలోనే ఆయనను ఉగ్రవాదులు చంపాలని ప్లాన్ చేశారని పోలీసుల విచారణలో తేలిందట.. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ బైక్ పైన తిరగవద్దంటూ హైదరాబాద్ కమిషనర్ రాజాసింగ్ ను లేఖలో తాజాగా కోరారు. బైక్ పైన తిరగడం రాజాసింగ్ ప్రాణాలకు ముప్పు అని.. ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని ఉపయోగించాలని రాజాసింగ్ ను అంజనీకుమార్ అభ్యర్థించారు.

ఈ సందర్భంగా రాజాసింగ్ రక్షణ కోసం కత్తి లాంటి చురుకైన గన్ మెన్లను తాజాగా నియమించారు. ఆయన గన్ మెన్లకు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చామని సీపీ అంజనీకుమార్ తెలిపారు. ఈ క్రమంలోనే రాజాసింగ్ గన్ మెన్ లకు అత్యాధునిక కొత్త వెపన్స్ కూడా సమకూర్చారు.

ఇక అడిషనల్ డీసీపీ రాజాసింగ్ ఇంటివద్దకు వెళ్లి ఇంటి చుట్టుపక్కల ఎవరున్నారు.? గన్ షూటింగ్ కు అనుకూలంగా ఉందా అని సమీక్షించారు. ఆయన భద్రత చర్యలను పర్యవేక్షించారు. ఇంటి వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. అందరినీ ఆరాతీసి అందరి ఇళ్లను చెక్ చేశారు.

Also Read: కరోనా దెబ్బకు అప్పులపాలు అయిపోతారు : వైద్య శాఖ మంత్రి ఈటెల

ఇక రాజాసింగ్ తనకున్న భద్రతను సడన్ గా ఎందుకు పెంచారని.. తనకు ముప్పు ఉందని తెలిసినా గన్ లైసెన్స్ ఎందుకు ఇవ్వలేదని పోలీసులను ప్రశ్నించారు. ఎవరి నుంచి? ఎక్కడి నుంచి తనకు ప్రాణహాని ఉందో తెలుపాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. రెండేళ్లు అయినా తనకు గన్ లైసైన్స్ ఎందుకు ఇవ్వడం లేదని మండిపడ్దారు. దీనిపై అమిత్ షాకు ఫిర్యాదు చేస్తానన్నారు.

అయితే హైదరాబాద్ లో ఇటీవల పోలీసుల సీక్రెట్ ఆపరేషన్ లో ఉగ్రవాదులు పట్టుబడ్డారు. వారు విధ్వంస రచనతోపాటు పలువురి హత్యకు కుట్రపన్నారని విచారణలో తేలింది. అందులో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను చంపేందుకు ప్లాన్ చేశారని తెలిసింది. దీంతోనే రాజాసింగ్ కు భద్రతను పోలీసులు పటిష్టం చేశారని ‘కాన్ఫిడెన్షియల్ లేఖ’లో పోలీసులు వివరించారు. ఆ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

పేకాట శిబిరం వెనుక మంత్రి?


రాష్ట్రంలో అధికార పక్షం ఎమ్మెల్యేలు, మంత్రులు చట్ట వ్యతిరేక వ్యవహారాలకు పాల్పడుతుండటం సర్వత్రాచర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజుల కిందట గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫా గోదాములో నిషేదిత గుట్కా తయారు చేస్తున్న విషయాన్ని పోలీసులు బయట పెట్టారు. ఈ విషయంలో తనకు సంబంధం లేదని గోదామును లీజులు ఇచ్చనట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. తాజాగా కర్నూలు జిల్లాలో ఒక మంత్రి స్వగ్రామంలో ఆయన సోదరుడే పేకాట శిభిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమాచారం తెలిసి పేకాట శిబిరం నిర్వహకులను అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపై దాడి చేయడం విశేషం.

Also Read: అట్టడుగు స్థానంలో ఏపీ..! ఇలా ఉంటే కష్టమే జగన్

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరి జయరాం సొంత ఊరు చిప్పగిరి మండలం గుమ్మనూరు గ్రామం. అయితే ఇక్కడ కొద్ది రోజులుగా ఇక్కడ భారీ స్థాయిలో పేకాట శిభిరాలు నిర్వహిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా అధికారిక అనుమతిలో నడుస్తున్న పేకాట క్లబ్ లు మూతబడ్డాయి. దీంతో పేకాట రాయుళ్లు పేకాట ఆడేందుకు ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్న వారికి గుమ్మనూరు పేకాట శిబిరం గురించి తెలిసి అక్కడికి చేరుకుంటున్నారు. అయితే ఇక్కడకు కేవలం రాష్ట్ర వాసులే కాదు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి పేకాట రాయుళ్లు ఖరీదైన కార్లలో వస్తు పేకాట ఆడి వెళుతున్నట్లు తెలుస్తోంది.

కర్నూలు జిల్లాలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. కరోనా కేసులు అత్యధికంగా నమోదైన జిల్లాల్లో రెండవ స్థానంలో ఉంది. ఇక్కడ 42,257 కేసులు నమోదవగా ఇప్పటికీ 6,969 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రతి రోజు 700 నుంచి 900 కొత్త కేసులు నమోదవుతున్న తరుణంలో ఇక్కడ పేకాట శిబిరం నిర్వహిస్తూ లాక్ డౌన్ నిబంధనలను నిర్వాహకులు ఉల్లంగించారు. పోలీసులు పేకాట శిబిరంపై దాడికి రాగా పేకాట శిబిరం నిర్వాహకులు, స్థానికులు కొందరు పోలీసులపై దాడి చేసే సమయంలో తాము మంత్రి అనుచరులమని చెప్పడం విశేషం. ఈ దాడిలో కానిస్టేబుల్ తోపాటు ఎస్ఐ సమీర్ బాషాకు గాయాలయ్యాయి.

Also Read: ‘రక్తపాత దినోత్సవం ఎఫెక్ట్’ : సాయి రెడ్డికి రక్త కన్నీరు తెప్పించింది

మరోవైపు మంత్రి గుమ్మనూరి జయరాం మాత్రం ఈ వ్యవహారంలో తనకు, తన కుటుంబ సభ్యులకు ఎటువంటి సంబంధం లేదని ప్రకటించారు. మంత్రి స్వగ్రామంలో ఆయనకు తెలియకుండా ఈ తంతు జరుగుతుందా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ వ్యవహారంలో పోలీసుల పేకాట శిబిరం వద్ద రూ.5.34 లక్షల నగదు, 35 కార్లు, 35 మంది నిందితుల్ని పోలీసులు గుర్తించారు. పోలీసులపై దాడి చేసిన వారిని గుర్తించి అరెస్టు చేసేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టించింది. ఈ క్రమంలో 32 మందిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. వీరిలో మంత్రి సోదరుడు ఉన్నట్లు సమాచారం.

పవన్ కళ్యాణ్ సైలెన్స్ వెనుక ఇంత వైలెంటా?


ఏదైనా పెద్ద పనిచేస్తుంటే.. ‘ఎంత సైలెంట్ గా ఉంటే.. దాని ప్రతిఫలం అంత వైలెంట్’గా వస్తుందంటారు. రాజకీయవర్గాల్లో చేసే ఏ పెద్ద పని అయినా ప్రత్యర్థులు తెలుసుకోకుండా.. వ్యూహాత్మకంగా చేయాలి.. ఏది మన కేసీఆర్ ‘ఓటుకు నోటు’లో చంద్రబాబును ఇరికించిన చందంగా చేయాలన్నమాట.. బయటపడే వరకు ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా ఉంచాలి.. బయటపడ్డాక నోరెళ్లబెట్టడం అందరి వంతవుతుంది.

Also Read: అట్టడుగు స్థానంలో ఏపీ..! ఇలా ఉంటే కష్టమే జగన్

ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ మౌనం వెనుక కూడా పెద్ద కథే ఉందని విశ్వసనీయ సమాచారం. పవన్ కళ్యాణ్ ఏదో మాలధారణ చేసుకొని ఏపీ రాజకీయాలకు దూరం జరగడం వెనుక బీజేపీ ప్లాన్ ఉందన్నది జనసేన నుంచి లీకైన వార్తలను బట్టి తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీపై అస్సలు కాన్ సెంట్రేషన్ చేయడం లేదు. కనీసం అప్పుడో ఇప్పుడో స్పందించే ట్విట్టర్ లోనైనా ట్వీట్ చేయడం లేదు. పవన్ కళ్యాణ్ ఇంతటి నిశ్శబ్ధం ఎప్పుడూ చూడలేదు. ఇన్నాళ్లు ఆయన కరోనా కారణంగా ఏపీలో అడుగుపెట్టలేదు అని అంతా భావించారు. ఏపీలో ఎన్ని సమస్యలున్నా.. ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ పోరాడుతున్న పవన్ మాత్రం ఇటు వైపు చూడడం లేదు. దీనివెనుక కారణం ఏంటని ఆరాతీయగా అసలు విషయం బయటపడిందట..

పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో మౌనం దాల్చడం వెనుక ప్రధాన కారణం కేంద్రంలోని బీజేపీ సూచనలేనన్న ప్రచారం సాగుతోంది. బీజేపీ వాళ్లు ఇంకొన్ని రోజులు సైలెంట్ గా ఉండమని పవన్ కు చెప్పారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.. ఎందుకంటే బీజేపీ బలపడాలంటే ఇప్పుడే జరగాలని.. టీడీపీలో అసమ్మతి వాళ్లను చేర్చుకోవాలని పెద్ద ప్లాన్ వేసిందట…. ఆ తర్వాత జనసేనను బీజేపీలో కలిపేసుకొని ఇంకా బలపడాలని బీజేపీ ప్లాన్ చేసిందని వినికిడి.

Also Read: ‘రక్తపాత దినోత్సవం ఎఫెక్ట్’ : సాయి రెడ్డికి రక్త కన్నీరు తెప్పించింది

టీడీపీని నిర్వీర్యం చేయడానికి వైసీపీ కూడా సహకారం అందిస్తోందట.. అందుకే తాజాగా టీడీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల పై కేసులు, వారి మైనింగ్ లీజుల రద్దు సహా టీడీపీ నేతలను అభద్రతభావానికి గురిచేసి వారందరినీ బీజేపీలో చేరడానికి అవకాశం కల్పిస్తోందని టాక్..

ఇదంతా పూర్తయ్యాక జనసేనను విలీనం చేసుకొని పవన్ ను బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా మార్చి సోము వీర్రాజు సారథ్యంలో 2024లో ఏపీ అధికారం చేపట్టాలని బీజేపీ ప్లాన్ చేసిందని సమాచారం.. ఇదంతా వర్కవుట్ కావాలంటే ప్రస్తుతానికి జనసేనాని సైలెంట్ గా ఉండాలని సూచించారట.. అందుకే పవన్ కళ్యాణ్ మాల ధరించి ఆధ్మాత్మికంలో మునిగిపోయారని.. ఇంకొద్ది రోజులు ఏపీ వంక చూడరని అంటున్నారు.

సందిగ్ధంలో దర్శకుడు.. ‘సాయి పల్లవి’నా.. ‘కీర్తి సురేష్’నా.. ?


చాలా సంవత్సరాలు నుండి మన హీరోలలో కొంతమంది హీరోలకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే హీరోయిన్స్ దొరకడం లేదు. వాళ్ళల్లో బాలయ్య, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలు ఉన్నారు, గోపీచంద్‌, మంచు విష్ణు లాంటి జూనియర్ హీరోలు ఉన్నారు. మొత్తానికి హీరోయిన్ సమస్య అనేది తెలుగు ఇండస్ట్రీలో ఆనవాయితీగా వస్తోంది. అయితే ఏ బాలయ్య లాంటి సీనియర్ కి హీరోయిన్ సమస్య అంటే సహజమే కదా అనుకోవచ్చు.. కానీ, గోపిచంద్ లాంటి హీరోకి కూడా అదే సమస్య అంటే కాస్త ఆలోచించతగ్గ అంశమే. నిజానికి ప్రెజెంట్ ఉన్న చాలామంది హీరోయిన్స్ లో సగంమంది గోపిచంద్ హైట్ కి, ఇమేజ్ కి సెట్ అవ్వరు. అనుష్క, పూజా హెగ్డే లాంటి వారు సెట్ అయినా, వాళ్ళను పెట్టుకునే మార్కెట్ అండ్ బడ్జెట్ గోపిచంద్ సినిమాకి ప్రస్తుతం లేకపాయే.

Also Read: పవన్‌ బర్త్‌డే స్పెషల్‌… ఓ సర్ప్రైజ్‌, ఓ సస్పెన్స్‌

అందుకే గోపిచంద్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో రూపొందనున్న ‘అలిమేలుమంగ వేంకటరమణ’లో హీరోయిన్ కోసం ఎప్పటినుండో వెతుకుతున్నా ఇంకా ఎవరు ఓకే కాలేదు. రాశి ఖన్నా చేస్తానని ముందుకు వచ్చినా, అలిమేలు మంగ పాత్ర మీదే సినిమా నడుస్తోంది. మరి అలాంటి కీలక పాత్రలో సరిగ్గా ఎక్స్ ప్రెషన్స్ ను కూడా పలికించలేని రాశిని పెట్టుకుంటే, సినిమాకి లాస్ అనేది దర్శకుడు తేజ ఆలోచన. అందుకే తేజ మొదటినుండి ఈ పాత్రకు కాజల్ అగర్వాల్ నే అనుకుంటూ వచ్చాడు. తానూ అడిగితే కాజల్ కాదనదు, కాజల్ కూడా తేజ కోసం ఈ సినిమా చేస్తానని చెప్పింది కూడా. కాకపోతే మరో ఏడాది దాకా డేట్స్ లేవని అంది.

ప్రస్తుతం కాజల్‌ చేతిలో ‘మోసగాళ్లు’, ‘ఆచార్య’, ‘ముంబయి సాగా’, ‘భారతీయుడు2’తో పాటు మరో బాలీవుడ్‌ సినిమా అలాగే విజయ్ మాస్టర్ 2 కూడా ఉంది. ఈ సినిమాలన్ని పూర్తి అయ్యాక గాని, కాజల్ మరో సినిమా చేయలేదు. ఆ రకంగా గోపిచంద్ సినిమాకి కాజల్ దూరం అయిపోయింది. తాను రాసుకున్న అలిమేలు మంగ పాత్రకు న్యాయం చేయాలంటే కచ్చితంగా టాలెంటెడ్ హీరోయినే అయి ఉండాలి. ఈ క్రమంలోనే తేజ,.మొదట హీరోయిన్ కీర్తి సురేష్ అయితే బాగుంటుందని ఆమెను అప్రోచ్ అయితే, కీర్తి నో చెప్పింది.

Also Read: ‘ఎన్టీఆర్’కి రాజకీయాలే వ్యాపారం అట !

ఇప్పటికే వరుస సినిమాలు ఒప్పుకున్నానని వివరణ ఇచ్చే సరికి, తేజ, సాయి పల్లవిను ఫైనల్ చేయటానికి ఆమెకు కథ కూడా చెప్పాడు. ఇక ఆల్ మోస్ట్ సాయి పల్లవి ఫిక్స్ అనుకునేలోపు, మళ్లీ కీర్తి సురేష్ ఈ సినిమా చేస్తానని టచ్ లోకి వచ్చిందట. ఇప్పుడు వీరిద్దరిలో ఎవర్ని తీసుకోవాలో అని తేజ సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది.

జగన్ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఇది ! ఇంకో మాట లేదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో కరోనా ప్రబలిన మొదట్లో పారాసెట్మాల్ ట్యాబ్లెట్, బ్లీచింగ్ పౌడర్ దీనిని నివారిస్తాయని.. అసలు ఇబ్బందే అవసరం లేదని చెప్పినప్పుడు అందరూ అతనిని విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే వైసిపి వారు అందుకు కొన్ని శాస్త్రీయపరమైన రుజువులు పెట్టి తామేదో గొప్ప పని చేశాము అని విర్రవీగారు. అసలు విషయం వేరే… బ్లీచింగ్ పౌడర్ వేరే అని సబ్జెక్టు తెలిసిన వారికి అర్థమైంది.

Also Read : పేకాట శిబిరం వెనుక మంత్రి?

ఇక ఈ వాదన అంతా పక్కన పెడితే…. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందుతోందని మొదటి నుండి మనం వింటూనే ఉన్నాం. కొన్ని నెలలు ఎన్ని కేసులు నమోదయ్యాయి అని గమనిస్తూ ఉన్నాం, చర్చలు పెట్టుకున్నాం, డిబేట్లు జరుపుకున్నాం…. చివరికి రోజూ ఉండేదే కదా అని మనకి మనం సర్దిచెప్పుకొని అలా ముందుకు సాగిపోతూ ఉన్నాం. తీరా చూస్తే ఒక్కసారిగా దేశంలో నెంబర్ 2 స్థానానికి ఆంధ్రప్రదేశ్ ఎగబాకింది. అదికూడా ఏ అభివృద్ధిలోనో…. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లోనో కాదు.

ఒక్క మెట్రో సిటీ కూడా లేని ఆంధ్ర ప్రదేశ్ అత్యధిక కరోనా పాజిటివ్ కేసులో రెండ్వ స్థానాన్ని సాధించిందంటే చిన్న ఘనత కాదు. అందుకు వైసిపి ప్రభుత్వమే కారణం. అందరూ అనుకున్నట్టే మొదటి రాష్ట్రంలో మహారాష్ట్ర ఉంది. ఇప్పటివరకు తమిళనాడు రెండవ స్థానంలో ఉండేది. అయితే ప్రతిరోజూ వరుసగా 10,000కి పైగా కేసులను నమోదు చేసుకుంటూ…. ఏపీ ప్రభుత్వం తమిళనాడుని వెనక్కి నెట్టేసింది. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక కోవిడ్ హాట్ స్పాట్ లు గా ఉన్నాయి. కానీ వారు ఎంతో నిబద్ధతతో వైరస్ ను కంట్రోల్ చేయగలిగారు కానీ ఏపీలో మాత్రం కట్టు తప్పింది.

అదేమన్నా అంటే… రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కనీసం ఒక్కసారైనా కరోనా సోకుతుందని వైసీపీ లీడర్లు పుసుక్కున అనేసారు. అసలు కరోనా వ్యాప్తి నివారణే ప్రథమ లక్ష్యం. దానిని ప్రజలమధ్య సోకనివ్వకుండా నివారించగలిగితే మరణాలు తగ్గుతాయి. మరణాల రేటు తగ్గుతుంది. అంతేగాని ఇన్ఫెక్ట్ అయిన వారు వేలల్లో ఉంటూ డాక్టర్లు వందల సంఖ్యలో ఉండి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ప్రభుత్వం చేస్తున్న ఈ పనులకు, తీసుకుంటున్న నిర్ణయాలు మధ్య ప్రజలు నలిగిపోతున్నారు.

Also Read : పవన్ కళ్యాణ్ సైలెన్స్ వెనుక ఇంత వైలెంటా?

ఇలాంటి క్లిష్ట సమయంలో…. అదీ దేశంలోనే అత్యధిక కేసుల లిస్టులో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉన్న సమయం….లో అమరావతి గొడవ, రాజధాని గొడవ, విశాఖ గొడవ, గెస్ట్ హౌస్ లో గొడవ, కౌలు గొడవ, భూముల గొడవ.. ఇంకా మరెన్నో….! ముందు ప్రజల ప్రాణాలు ముఖ్యమా? మన పంతాల ముఖ్యమా? రోజుకి వంద మంది మరణిస్తున్నారు. దీనిపై ఆమనం ప్రత్యేకంగా లోచిస్తున్నది ఏమీ లేదు. ఏపీలో మరణాల సంఖ్య అనూహ్యంగా పెరగడం పై కేంద్రం కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది.

అసలక్కడ ఏం జరుగుతోంది అంటూ ఏపీ సర్కార్ కు లేఖ రాసింది. కానీ వీరు మాత్రం తిరుగు లేఖలో మాకు రాజధాని కావాలి…. అది కావాలి…. ఇది కావాలి…. మీ అపాయింట్మెంట్ కావాలి…. వచ్చి మీరు శంకుస్థాపన చేయాలి అని రాస్తున్నారు. అసలు కరోనా నివారణకు ప్రత్యేక చర్యలు ఏమి తీసుకుంటున్నారో చెప్పడంలేదు. కరోనా అన్నది అందరికీ వస్తుంది…. పోతుంది అన్న తమ పాలసీని నమ్ముకున్నట్లుంది ఏపీ ప్రభుత్వం. దీనికన్నా అవాంఛనీయం, అమానుషం ఇంకేముంటుంది?

Also Read : అట్టడుగు స్థానంలో ఏపీ..! ఇలా ఉంటే కష్టమే జగన్