భారత్ -అమెరికా దేశాల వ్యవస్థలు,రాజకీయాలు

భారత్ , అమెరికాలు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలు. ఒకటి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పూర్తి ప్రజాస్వామ్య రిపబ్లిక్ దేశమయితే, రెండోది అత్యధిక జనాభా కలిగిన ప్రజాస్వామ్య దేశం. రెండూ కూడా వైవిధ్యభరిత దేశాలే. అమెరికా దాదాపుగా వలసవాదుల దేశమయినా ఇటీవలి కాలంలో వలసలను కట్టడి చేసే పనిలో వుంది. భాషాపరంగా అత్యధికులు ఇంగ్లీష్ మాట్లాడగలిగినా, ఇంటి భాష వచ్చేసరికి దాదాపు 20 శాతం మంది ఇతర భాషలు మాట్లాడతారు. అదే జాతిపరంగా చూస్తే మూడింట రెండువంతులు తెల్లజాతీయులే. 13 శాతం పైగా వున్న నల్ల ( ఆఫ్రికన్ అమెరికన్ల) జాతీయులతో సామాజిక ఘర్షణలు నడుస్తూనే వుంటాయి. ఇక భారత్ లో చూస్తే ఏ ఒక్క భాష పూర్తి ఆధిపత్యంలో లేదు. అన్నింటిలోకి ఎక్కువమంది మాట్లాడే హిందీ భాష 43 శాతం మంది మాత్రమే. జాతిపరంగా అందరూ భారతీయులే అయినా వివాహ సంబంధాలు కులం, మతం, భాష, ప్రాంతం ఆధారంగానే వుంటాయి. ఇక మతపరమైన విభజన చూస్తే అమెరికాలో నూటికి 70 మంది క్రైస్తవ మతాన్ని పాటిస్తారు. విశేషమేమంటే రెండో అతి పెద్ద వర్గం ఏ మతానికి అనుబంధం కాని వాళ్ళు, షుమారు 23 శాతం మంది వుంటారు. అదే భారతదేశానికి వచ్చేసరికి హిందువులు 75 శాతం మంది వుంటారు. రెండో అతిపెద్ద మతస్తులు ముస్లింలు షుమారు 15 శాతం మంది వుంటారు. అమెరికాలో మతపరమైన ఘర్షణలకు ఆస్కారం లేదు. కాకపోతే అందులో ప్రొటెస్టెంట్లు, కాథలిక్కులు, మర్మన్లు గా విడిపోయి వుంటారు. అదే భారత్ లో మతపరమైన ఘర్షణలు జరుగుతూనే వుంటాయి. అసలు దేశమే మతపరంగా రెండు ముక్కలయ్యింది. స్థూలంగా రెండుదేశాల స్వరూపమిది.
Also Read : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలను కాలదన్నుతున్నారు
రెండు దేశాల వ్యవస్థలు ఎలా వున్నాయి?
ఇంతకుముందే చెప్పినట్లు రెండూ ప్రజాస్వామ్య దేశాలే. రెండూ బ్రిటన్ నుండి స్వాతంత్రం పొందిన దేశాలే. భావ స్వేచ్చ, వ్యక్తి స్వేచ్చ, మత స్వేచ్చ ప్రాధమిక హక్కులుగా కలిగిన దేశాలు. రెండు వ్యవస్థల్లోనూ రాష్ట్రాలకు చాలా అంశాల్లో పూర్తి స్వేచ్చ వుంది. ముఖ్యంగా శాంతి భద్రతలు, విద్య, ఆరోగ్యం లాంటి సామాజిక అంశాలు రాష్ట్రాల పరిధిలోనే వుంటాయి. దీనికి రెండు దేశాల్లో చారిత్రక కారణాలే కారణం. అమెరికా స్వాతంత్ర ప్రకటన 13 బ్రిటీష్ కాలనీలు కలిసి ఏర్పాటుచేసుకున్నాయి. అందుకే ఈ కాలనీల ( తదుపరి రాష్ట్రాలు ) హక్కులకు ప్రాధాన్యమిచ్చారు. అలాగే భారత్ కి స్వాతంత్రం వచ్చినప్పుడు బ్రిటీష్ ఇండియా భూభాగంతో పాటు 560 కి పైగా స్వతంత్ర రాజ్యాలు, సంస్థానాలు విలీనమయ్యాయి. వీటి హక్కులను, ప్రత్యేకతలను గుర్తిస్తూ రాష్ట్రాలకు ప్రాధాన్యమిచ్చారు. కాబట్టి రెండు దేశాలు జాతీయంగా కేంద్రీకృతమైనా ఫెడరల్ స్వభావాన్ని కలిగి వున్నాయి.
పరిపాలనాపరంగా చూస్తే అమెరికా విస్తృత అధికారాలు కల్గిన అధ్యక్ష వ్యవస్థతో పాటు శాసన వ్యవస్థ కలిగి వుంది. భారత్ పార్లమెంటరీ వ్యవస్థతో పనిచేస్తూ కేవలం నామమాత్ర అధ్యక్ష వ్యవస్థ కలిగి వుంది. అమెరికాలో అధ్యక్ష పదవికి నాలుగు సంవత్సరాల కొకసారి ప్రత్యక్షఎన్నికలు జరుగుతాయి. ఎన్నికైన రాష్ట్రాల ప్రతినిధులు అధ్యక్షుడ్ని ఎన్నుకుంటారు. అదే భారత్ లో పరోక్ష ఎన్నికల్లో అయిదు సంవత్సరాలకొకసారి రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఇక శాసన వ్యవస్థ చూస్తే రెండు దేశాల్లోనూ రెండు సభల వ్యవస్థ వుంది. కాకపోతే అమెరికా ప్రతినిధుల సభకు రెండేళ్లకొకసారి ఎన్నికలు జరుగుతాయి. అదే మన లోక్ సభకు అయిదేళ్ళకొకసారి జరుగుతాయి. మన లోక్ సభ ఎవరికీ మెజారిటీ లేకపోతే రద్దుచేసి మధ్యంతర ఎన్నికలు జరపవచ్చు. అక్కడ అటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా రెండేళ్ళ కాలపరిమితి వుంటుంది. అమెరికా సెనేట్ కు మన రాజ్య సభకు పోలికలు , తేడాలు వున్నాయి. అక్కడ పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలతో సంబంధం లేకుండా ప్రతి రాష్ట్రానికి రెండే సెనేట్ సీట్లు వుంటాయి. కానీ మనకు రాష్ట్ర జనాభాని బట్టి సీట్లు కేటాయించారు. రెండు సభలూ శాశ్వత సభలే , రద్దు కావు. రెండింటిలోనూ సభ్యునికి ఆరేళ్ళ కాల పరిమితి వుంటుంది. ప్రతి రెండు సంవత్సరాలకు మూడింట ఒక వంతు మంది పదవీ విరమణ చేస్తారు. అయితే అధికారాల్లో తేడావుంది. అధ్యక్షుడి క్యాబినెట్ పదవులు, న్యాయమూర్తుల నియామకాలు ఇతర ముఖ్యమైన పదవులు అధ్యక్షుడి నియామకం తర్వాత సెనేట్ ఆమోదించాల్సి వుంటుంది. ప్రతినిధుల సభకు సంబంధం లేదు. అంటే సెనేట్ కీలకమైన సభగా చెప్పొచ్చు. మిగతా అధికారాలు సమానమే. అదే మన రాజ్య సభ కు ద్రవ్య బిల్లుల్లో లోక్ సభ తో సమాన అధికారాలు లేవు. మిగతా అధికారాలు సమానమే. ఇంకో ప్రధాన తేడా. అక్కడ సెనేటర్లు రాష్ట్రాలనుంచి ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు. అదే మన రాజ్య సభ సభ్యుల్ని రాష్ట్ర అసెంబ్లీ సభ్యులు ఎన్నుకుంటారు. అమెరికాలోనూ ఒకనాడు రాష్ట్ర అసెంబ్లీ సభులే ఎన్నుకునే వారు. తర్వాత దశలో ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరిచే దిశలో భాగంగా ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇంకో తేడా ఏమిటంటే అమెరికాలో ప్రతి రాష్ట్రానికి రెండు శాసన వ్యవస్థలు వున్నాయి. మనకి శాసన మండలి కొన్ని రాష్ట్రాల్లోనే వుంది. దీనికి ఒక విధానమంటూ లేదు. అలాగే అక్కడ రాష్ట్ర గవర్నర్ ని ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారు. కానీ మన దగ్గర ముఖ్యమంత్రిని పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారు. దానితోపాటు మన దగ్గర కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా రాష్ట్రాలకు గవర్నర్ వుంటారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అమెరికా ఎన్నికల గురించి తెలుసుకునేముందు స్థూలంగా అక్కడ పరిపాలనా స్వరూపం కూడా తెలిసివుంటే మరింతగా ఎన్నికల విశ్లేషణ అర్ధమవుతుంది. రెండోది అక్కడి వ్యవస్థలోని కొన్ని మంచి అంశాలు ప్రజాస్వామ్యం బలపడటానికి మనమూ ఆచరించవచ్చు.
Also Read : దేశంలో ఘోరమైన విపత్తు.. భారీ ఆర్థిక ముప్పు?
రాజకీయ వ్యవస్థలు, పార్టీలు ఎలా వున్నాయి?
అమెరికాలో రెండు పార్టీల వ్యవస్థ నెలకొనివుంది. అంటే మిగతా వాళ్ళు పోటీ చేయకూడదని నిషేదమేమీ లేదు, ఇప్పటికీ ఎన్నో పార్టీలు, వ్యక్తులు పోటీ చేస్తూనే వుంటారు. కాకపోతే గెలవటం అంత తేలికేమీ కాదు. భూ విస్తీర్ణ పరంగా అతి పెద్ద దేశం. అప్పట్లో అంత దూరం తిరగటానికి, ప్రచారం చేయటానికి నిధులు అందరికీ కష్టం. కాబట్టి రెండు పార్టీలలో సమీకృత మయ్యారు. ఇప్పుడు టివీ లు వచ్చిన తర్వాత ప్రచారం కొత్త పుంతలు తొక్కింది. అయినా ప్రచారానికి, ప్రకటనలకి లక్షల డాలర్ల ఖర్చు అవుతుంది. అదే మన భారతదేశంలో అధ్యక్షునికి, గవర్నర్లకి ప్రత్యక్ష ఎన్నికలు లేవు పార్లమెంటు, అసెంబ్లీ లో ఎవరికి మెజారిటీ సభ్యుల మద్దత్తు వుంటే వారు ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడుతున్నారు. కాబట్టి ఇక్కడ బహుళ పార్టీ వ్యవస్థకు అవకాశాలు వున్నాయి.
ప్రస్తుతం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు , ప్రతినిధుల సభ ఎన్నికలు, మూడింట ఒకవంతు సెనేట్ ఎన్నికలు నవంబర్ 3న జరగబోతున్నాయి. ఇందులో రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ లు పోటీ పడుతున్నాయి. డెమోక్రటిక్ పార్టీ మద్దత్తు ప్రధానంగా తూర్పు, పశ్చిమ కోస్తా ప్రాంతాల్లో అలాగే నగర ప్రాంతాల్లో వుంది. డెమోక్రటిక్ పార్టీ కి తెల్ల జాతీయుల తో పాటు నల్ల జాతీయులు, ఇస్పానిక్కులు, ఆసియా మూలాల దేశీయులు మద్దతిస్తున్నారు. అదే రిపబ్లిక్ పార్టీ కి మధ్య అమెరికా ప్రాంతాలు, గ్రామీణ , సెమి అర్బన్ ప్రాంతాలు మద్దతిస్తున్నాయి. రిపబ్లికన్ పార్టీకి ప్రధానంగా తెల్ల జాతీయుల మద్దత్తు మాత్రమే వుంది. మిగతా వారి మద్దత్తు నామమాత్రంగానే వుంది. మొట్టమొదటిసారి భారతీయులు రెండుగా గణనీయంగా చీలే అవకాశముంది. కానీ మనవాళ్ళు ఎన్నికల్ని ప్రభావితం చేసే పరిస్థితి లేదు. శ్వేత జాతీయేతర్ల లో ఇస్పానిక్కుల్లో ఓ మేరకు రిపబ్లికన్ పార్టీ చీల్చుకొనే అవకాశముంది. ఇంకో ప్రధానమైన విషయం , పార్టీల అంతర్గత ప్రజాస్వామ్యం. ఈ రెండు పార్టీల తరఫున పోటీచేసే అధ్యక్ష అభ్యర్ధులను ఆ పార్టీ సభ్యులే అంతర్గత ఎన్నిక ద్వారా నిర్ణయిస్తారు.
మరి భారత్ లో చూస్తే ప్రధాన పార్టీ అయిన బిజెపి హిందీ ప్రాంతాలు, పశ్చిమ ప్రాంతాల్లో బలంగా వుండేది. అలాగే ఒకనాడు నగర ప్రాంతాలకే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు హిందీ యేతర ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లోనూ చొచ్చుకు పోయింది. అలాగే బిజెపి ప్రధానంగా హిందువుల వోట్ల మద్దత్తు తోనే వుంది. ముస్లిం, క్రైస్తవుల్లో నామ మాత్ర మద్దత్తునే చూరగొంది. అదే కాంగ్రెస్ ఒకనాడు విస్తృత ప్రాంతాల్లో వున్నా ప్రస్తుతం దాని ప్రభావం పరిమితంగానే వుంది. కాకపోతే దాని ఓటర్లు అన్ని మతాల్లోనూ సమానంగా వున్నారు. ఒకవిధంగా ప్రస్తుతం దేశంలో బిజెపి కి సమవుజ్జీ పోటీ ఇచ్చే పార్టీ లేదు. ఆ లోపం ప్రస్ఫుటంగా కనబడుతుంది.
ఇవీ స్థూలంగా భారత్ , అమెరికా వ్యవస్థల మధ్య వున్న సామిప్యాలు, వైరుధ్యాలు. కాబట్టి మక్కికి మక్కీగా అక్కడకి, ఇక్కడకీ రాజకీయాల్లో పోల్చుకొని చూడలేము. ఈ నేపధ్యాన్ని గమనం లో వుంచుకొని అమెరికా ఎన్నికల వాతావరణాన్ని పరిశీలిద్దాం. మన భారతీయ అమెరికన్ల ఆలోచనలు, భారత-అమెరికా సంబంధాలు ఈ ఎన్నికలకు ఏ విధంగా ముడిపడి వున్నాయో వచ్చే వ్యాసంలో పరిశీలిద్దాం.
Also Read : తెలంగాణ చారిత్రక సౌధం.. కరిగిపోతోందా?
మీడియా రంగంలోకి బీజేపీ? ఆ రెండు చానెళ్లతో చర్చలు!

రాజకీయాలను.. మీడియాలను విడదీయలేం.. సొంతంగా మీడియా ఉంటేనే రాజకీయాల్లో రాణించగలం. ఇప్పుడు తెలుగు నాట చూసుకున్నా.. కేంద్రంలో చూసుకున్నా.. ప్రతీపార్టీకి బలమైన మీడియా ఉంది.
తెలంగాణలో టీఆర్ఎస్ కు నమస్తే తెలంగాణ దినపత్రిక, టీన్యూస్ చానెల్ సొంతంగా ఉండగా.. టీవీ9 లాంటి పెద్ద చానెల్ సపోర్టు ఉంది. ఇక ఏపీలో వైసీపీకి సాక్షి మీడియా, టీడీపీకి ఏబీఎన్, ఈనాడు సహా పలు మీడియా చానెళ్ల మద్దతు ఉంది. మీడియా చేతిలో లేకుంటే ఏ పార్టీ కూడా ప్రజల్లోకి వెళ్లిలేకపోతుందని.. అందుకే రాజకీయాల్లో సక్సెస్ కావాలంటే మీడియా సపోర్టు అవసరమని అన్ని పార్టీలు భావించి పలు మీడియా సంస్థల్లో తెరవెనుక పెట్టుబడులు పెడుతుంటాయి.
Also Read : గ్రేటర్ పై కన్నేసిన బీజేపీ.. వ్యూహమెంటీ?
ఈ క్రమంలోనే తెలంగాణలో బలపడాలని ఆశిస్తున్న బీజేపీ కూడా ఇప్పుడు మీడియా రంగంలోకి అడుగుపెట్టాలని డిసైడ్ అయినట్టు తెలిసింది. తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు కుదేలవుతున్న వేళ టీఆర్ఎస్ కు ప్రత్యామ్మయంగా బీజేపీ ఎదుగుతోంది. ఈ క్రమంలోనే పార్టీకి మద్దతు అవసరం అని బీజేపీ భావిస్తోంది. బలమైన మీడియా ఉంటే తప్పా బీజేపీని ప్రజల్లోకి తీసుకెళ్లలేమని కమలదళం భావిస్తోంది. తమకు కేంద్ర నాయకత్వం నుంచి ఇప్పటికే ఆమోదం లభించిందని.. మీడియాలను కొనడానికి యోచిస్తున్నామని తెలంగాణ బీజేపీ నాయకులు అంటున్నారు.
తెలంగాణలో బీజేపీ రెండు మధ్యస్థాయి చానెళ్లను కొనడానికి రెడీ అయ్యిందని సమాచారం. బీజేపీ అనుకూల వైఖరితో ఉడే జర్నలిస్టులను, సీఈవోను, చీఫ్ ఎడిటర్ ను నియమించాలని శూలశోధన మొదలు పెట్టినట్టు తెలిసింది. ఈ చానెళ్ల యాజమాన్యాలతో ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్టు చెబుతున్నారు.బీజేపీ కేంద్రంలోని పెద్దలతో ఈ చానెళ్ల యజమానులతో మాట్లాడిస్తూ వారిని ఒప్పించడానికి ప్రయత్నిస్తోందని విశ్వసనీయంగా తెలిసింది.
ప్రస్తుతం తెలంగాణలో రెండు మీడియా సంస్థలను కొనే పనిలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రం హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించినట్టు తెలిసింది. కాగా ఈ చానెల్ లను స్వాధీనం చేసుకోవడానికి.. వాటిని నడపడానికి బీజేపీలోని కొంతమంది వ్యాపారులను ఒప్పించారని వార్తలు వస్తున్నాయి.
2024 ఎన్నికలకు ముందు మీడియాలో బలమైన గొంతుకగా బీజేపీని మలచాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ రెండు చానెళ్లలో ఒకటి స్థానిక చానెల్. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. మరొకటి తమిళనాడులో హెడ్ ఆఫీస్ కలిగి ఉంది. ఈ రెండింటిని కొనేందుకు బీజేపీ చర్చలు జరుపుతోందని సమాచారం.
-నరేశ్
Also Read : బై బై గణేశా.. సందడి లేకుండానే విగ్రహాల నిమజ్జనం
బై బై గణేశా.. సందడి లేకుండానే విగ్రహాల నిమజ్జనం

రాష్ట్రంలో కరోనా ఎఫెక్ట్ కారణంగా గణేశ్ నవరాత్రులు కళతప్పిపోయాయి. ప్రతియేటా అంగరంగ వైభవంగా కొనసాగే ఉత్సవాలు ఈసారి సాదాసీదాగా జరిగాయి. పల్లెపల్లెనా.. వీధివిధినా కన్పించే గణేశ్ విగ్రహాలు ఈసారి పెద్దగా కన్పించలేదు. కరోనా నిబంధనల కారణంగా ఉత్సవ కమిటీ నిర్వహాకులు ఈసారి పెద్దగా ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. దీంతో కిందటేడాది కంటే ఈసారి గణేష్ విగ్రహాలు సంఖ్య భారీగా తగ్గిపోయింది. ప్రతీయేటా హాట్ కేకుల్లా అమ్ముడుపోయే గణేష్ విగ్రహాలు ఈసారి పెద్దగా అమ్ముడుపోక వ్యాపారులు కూడా నష్టపోయినట్లు తెలుస్తోంది.
Also Read : బాలయ్య మంత్రం.. కరోనా పరార్ అవాల్సిందే?
కరోనా నిబంధనల కారణంగా ప్రజలంతా ఈసారి ఇళ్లల్లోనే గణేషుడికి పూజలు నిర్వహించుకున్నారు. పలువురు కరోనా నిబంధనలు పాటిస్తూ అక్కడక్కడ గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేశారు. పోలీసుల సూచనలను పాటిస్తూ నవరాత్రుల్లో గణేషుడికి పూజలు నిర్వహించారు. కొద్దిరోజులుగా గణేష్ విగ్రహాల నిమజ్జనం కొనసాగుతోంది. ఈమేరకు పోలీస్ యంత్రాంగం కూడా గణేష్ నిమజ్జనానికి తగిన ఏర్పాట్లు చేసింది.
నేటితో నవరాత్రులు ముగిస్తుండటంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలో గణేశ్ విగ్రహాలు నిమజ్జనానికి తరలి వెళుతున్నారు. ఇక హైదరాబాద్ నగరంలో నిర్వహించే గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని చూడటానికి ఇతర ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో జనాలు తరలివచ్చేవారు. అయితే ఈసారి ట్యాంకుబండ్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనం సాదాసీదాగా కొనసాగేలా కన్పిస్తున్నాయి. గత వారం నుంచి హైదరాబాద్లో నిమజ్జనం కార్యక్రమం కొనసాగుతోందని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఇప్పటికే 30వేల విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు తెలిపారు.
ఈమేరకు గణేష్ నిమజ్జన కార్యక్రమ ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. నిమజ్జనం కోసం ప్రత్యేకంగా 21 క్రేన్లను ట్యాంక్ బండ్ లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మంగళవారం రాత్రి వరకు 5 ఫీట్ల కంటే ఎక్కువ ఎత్తున్న 165విగ్రహాలు.. 3నుంచి 5ఫీట్ల వరకు ఉన్న 1,239.. 3 ఫీట్ల కంటే తక్కువ ఉన్న 1842విగ్రహాలు నిమజ్జనం కాబోతున్నాయని తెలిపారు. 1500పైగా పోలీసులతో భద్రతా ఏర్పాటు చేసినట్లు సీపీ పేర్కొన్నారు. ట్యాంక్‌బండ్‌పై ఇతర వాహనాలకు అనుమతి లేదని, పలుచోట్ల ట్రాఫిక్ డైవర్షన్ చేశామని.. ప్రజలంతా పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. దీంతో గణేష్ నిమజ్జనం హడావుడి లేకుండానే మమ అనిపించేస్తున్నారు. మాయదారి మహమ్మరి వల్ల ఈ ఏడాది అన్ని పండుగలు కళతప్పిపోవడం శోచనీయంగా మారింది.
Also Read : కరోనా వైరస్ నుంచి రక్షించే ఏకైక విటమిన్ ఇదే!
చంద్రబాబు, టీడీపీకి జగన్ మరో భారీ షాక్?

సీఎం జగన్ ఎన్నికల హామీలోనూ భూ సర్వే చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు సమగ్ర భూసర్వేకు పూనుకున్నారు. ఇప్పటికే అసెంబ్లీలో ఈ బిల్లును ఆమోదించారు. కేసీఆర్ బాటలో ఏపీ సీఎం జగన్ పయనిస్తూ ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అప్పుడెప్పుడో బ్రిటీష్ ప్రభుత్వ హాయాంలో ఏపీలో 120 ఏళ్ల క్రితం తయారు చేసిన భూరికార్డుల ప్రక్షాళనకు నడుం బిగించారు. సమగ్ర భూముల రీసర్వేకు శ్రీకారం చుట్టారు.
జనవరి 1, 2021 నుంచి ఏపీలో సమగ్ర భూసర్వే చేపట్టి 2023 ఆగస్టు నాటికి పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భూ సర్వే వివాదాల పరిష్కారానికి మొబైల్ ట్రిబ్యూనల్స్ ఏర్పాటు చేసి వివాదాలు పరిష్కరించాలని సూచించారు. గ్రామ సభల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. సర్వేయర్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలని డ్రోన్లు, రోవర్లు,సర్వే రాళ్లు ఉపయోగించి భూ సర్వే చేయాలని అధికారులకు జగన్ సూచించారు. భూ సమగ్ర సర్వేతో రికార్డులు ప్రక్షాళన చేసి భూ యజమానులకు భరోసా కల్పించడంతోపాటు టీడీపీ నేతల బినామీల గుట్టు రట్టు చేసేలా భూముల సర్వేకు జగన్ శ్రీకారం చుట్టినట్టు తెలిసింది.
ప్రధానంగా జగన్ తీసుకున్న ఈ స్టెప్ టీడీపీ శిబిరంలో గుబులు పుట్టిస్తోంది. బినామీలతో అమరావతిలో భూములు కొట్టేసిన వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. చంద్రబాబు హయాంలో అమరావతి సహా చాలా భూములను కొల్లగొట్టారన్న ఆరోపణలు వచ్చాయి. విశాఖ భూకుంభకోణం, చుక్కల భూముల వ్యవహారం, అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ సహా చాలా భూవివాదాలు వచ్చాయి.
సమగ్ర భూసర్వేలో బినామాలనే అసలు పట్టదారులుగా గుర్తిస్తే వెనుకున్న వారు నిండా మునుగుతారు. బయటపడితే వారి బండారం బయటపడుతుంది. ఇలా టీడీపీ గుట్టురట్టు చేయడానికే జగన్ ఈ భూ సమగ్ర సర్వే చేపట్టినట్టు తెలుస్తోంది.బ్రేకింగ్ : పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ప్రకటన !

కరోనా వైరస్ నుంచి రక్షించే ఏకైక విటమిన్ ఇదే!

ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరు సరైన పౌష్టికాహారం తీసుకోవాలి. దీంతో పాటు విటమిన్లు, జింక్ మరియు యాంటీ బయోటిక్స్ ఖచ్చితంగా ఉపయోగించాలి. కరోనా సమయంలో పౌష్టిక ఆహారంతో పాటు ప్రత్యేకంగా విటమిన్స్ ను కూడా తీసుకోవడం ద్వారా వైరస్ వ్యాప్తిని కొంతమేరకు అరికట్టవచ్చని కొన్ని అధ్యనాల్లో వెల్లడైంది.
Also Read : బాలయ్య మంత్రం.. కరోనా పరార్ అవాల్సిందే?
కరోనా వైరస్ ని నివారించే విటమిన్స్ లో మొదటి స్థానం విటమిన్ సి, డి, జింక్ టాబ్లెట్లకు ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ విటమిన్స్ మాత్రమే కాదు మరొక విటమిన్ కూడా కరోనా వైరస్ ను అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఆ విటమిన్ ఏంటి? ఎలా ఉపయోగపడుతుంది అనెడి ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకోండి.
ఆ విటమిన్ ఏంటి అంటే? విటమిన్ బి కాంప్లెక్స్. విటమిన్ బి కాంప్లెక్స్ లో దాదాపు ఎనిమిది రకాల విటమిన్లు ఉన్నాయ్. అవే బి1, బి2, బి3, బి5, బి6, బి7, బి9, బి12. ఈ విటమిన్లు శరీరం పని తీరుకు దోహదం చేస్తాయ్. విటమిన్ బి కణాల పనితీరును, జీవక్రియ రేటును, రోగనిరోధక శక్తి పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. నిరోధక సైటో కైనిన్ స్థాయిలను తగ్గిస్తుంది.
విటమిన్ బి శ్వాసక్రియ రేటును పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సైంటిస్టులు విటమిన్ బి కరోనా బాధితులకు సహాయ పడుతుందని తేల్చి చెప్పారు. విటమిన్ బి తీసుకున్న వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని కరోనాని నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఇక ఈ విటమిన్ బి’ని గుడ్లు, పాలు, ఆకుకూరలు, బీన్స్ వంటి వాటిలో మనం సమృద్ధిగా పొందవచ్చు.
Also Read : వంద కోట్ల ఆఫర్ వద్దనుకున్న ‘మాస్టర్’?
కేసీఆర్ సార్.. హిందువులపై ఎందుకీ పక్షపాతం?

దశాబ్దాల కొట్లాట తర్వాత అయోధ్య రాముడు కొలువుదీరుతున్న ఆనందం దేశమంతా ఉంది. ముస్లిం అయినా కూడా మొఘల్ చక్రవర్తి వారసుడు అయోధ్య రాముడి భూమిపూజకు వెండి ఇటుకను బహూకరించాడు. దేశమంతా మత సామరస్యం వెల్లివిరుస్తున్న వేళ తెలంగాణలో మాత్రం ఒక వర్గానికి కాపాలా కాస్తూ మరో వర్గం సంప్రదాయలను తుంగలో తొక్కుతున్న తీరు సగటు హిందుత్వ వాదుల మనసులను తొలిచేస్తోంది. దేశమంతా ఒక ఎత్తు అయితే.. తెలంగాణలో మాత్రం మరో ఎత్తు అన్న చందంగా పరిపాలన సాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాకెందుకీ శిక్ష.. మావి పండుగలు కావా అని మెజార్టీ ప్రజలు ఇప్పుడు కేసీఆర్ సర్కార్ ను ప్రశ్నిస్తున్నారు.
Also Read : మీడియా రంగంలోకి బీజేపీ? ఆ రెండు చానెళ్లతో చర్చలు!
తెలంగాణలో కొలువు దీరింది ఎంఐఎం పార్టీ కాదు.. ప్రజలు ఎన్నుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి. కానీ టీఆర్ఎస్ అంటే ఇప్పుడు ‘తెలంగాణ రజాకర్ సర్కార్’గా మారిపోయిందని బీజేపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. వారి విమర్శలకు ఉదాహరణలు కూడా చూపుతున్నారు.
తెలంగాణలో కొలువుదీరిన కేసీఆర్ సర్కార్ హిందూ పండుగలకు నానా రకాల ఆంక్షలు, నిబంధనలు, కట్టుబాట్లు పెట్టి పండుగను శోభయామనంగా చేసుకోనివ్వడం లేదన్నది అందరి నుంచి వ్యక్తమవుతున్న ప్రధాన విమర్శ.. అదేంటని ప్రశ్నిస్తే.. కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఈ నిబంధనలు అంటున్నారు. ఈ క్రమంలో ‘శ్రీరామ నవమి పండుగ నుంచి మొదలు పెడితే.. హనుమాన్ జయంతి, బోనాలు, గణేష్ చతుర్తి, నవరాత్రులను’ కూడా జరుపుకోనీయకుండా నిషేధించారు కేసీఆర్ సర్కార్. కరోనా భయానికి జనాలు కూడా సరేనని సహకరించారు. కానీ ఇప్పుడు అదే కేసీఆర్ సర్కార్.. ఇతర మతాల పండుగలకు సెక్యూరిటీ కల్పించి మరీ నిర్వహించడం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. కరోనా ఒక వర్గం వారికి వర్తించదా అని ఇదే ప్రజలు కేసీఆర్ సర్కారును ప్రశ్నిస్తున్నారు.
తాజాగా హైదరాబాద్ లో ‘మెహర్రం’ పండుగను ఘనంగా జరుపుకున్నారు. జరుపుకోవడాన్ని ఎవరూ ఖండించరు. మతసామరస్యంతో హిందువులు కూడా ఈ పండుగను అందరూ స్వాగతించారు. కానీ విచిత్రం ఏంటంటే.. ఈ మొహర్రం వేడుకలకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడం.. ముందూ వెనుకాల పోలీస్ కాన్వాయ్ వెళుతూంటే వారి ఊరేగింపులు నిర్వహించారు. కరోనా వేళ ప్రజలు గుమిగూడే దేన్ని చేయవద్దని ఇదే తెలంగాణ సర్కార్ అల్టీమేటం జారీ చేసింది. ఈ క్రమంలోనే గణేష్ నవరాత్రులను కూడా నిషేధించింది. కానీ ఇదే మొహర్రం వేడుకలకు హైదరాబాద్ లో ప్రజలు పోటెత్తారు. తండోపతండాలు రోడ్ల మీదకు వచ్చి వేడకలు చేసుకున్నారు.
Also Read : 139మంది రేప్ కేసులో మాటమార్చిన బాధితురాలు..!
కరోనా పెరుగుతున్నా .. షూటింగ్ స్టార్ట్ చేశాడు !

బాలయ్య మంత్రం.. కరోనా పరార్ అవాల్సిందే?

దివంగత మహానటుడు ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ రూటే సపరేటు.. ఈ విషయం అందరికీ తెల్సిందే. ఆయన సినిమాలు కూడా విభిన్నంగా ఉంటాయి. ఎవరికీ సాధ్యంకానీ పనులన్నీంటి బాలయ్యే ఒక్కడే చేసేస్తుంటాడు. ఆయన ఫ్యాన్స్ కూడా వీటిని తెగ ఎంజాయ్ చేస్తుంటారు.. అయితే ఆయన సినిమాలకు.. వ్యక్తిగత జీవితానికి ఏమాత్రం పోలికలేదని బాలయ్య చాలాసార్లు నిరూపించారు.
Also Read : జగన్ చేతకాని తనమే ఏపీ దుస్థితికి కారణమంటున్న ఆర్కే?
బాలయ్య మ్యానరిజం కూడా చాలా సేపరేట్ గా ఉంటుంది. ఆయన ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతారని.. నచ్చితే నొత్తిన పెట్టుకుంటారు.. నచ్చకపోతే ఏమాత్రం పట్టించుకోరు.. అంతేకాకుండా బాలయ్య అధ్యాత్మిక భావాలు ఎక్కువ. ఎప్పుడు చూసిన పురణాల గురించి.. పద్యాల గురించి ప్రస్తావిస్తుంటారు. ఇక ఆయన మాటల్లో ఎక్కువగా ‘ఆరోజుల్లో నాన్నగారు.. నందమూరి వంశం’ టాపిక్ లే విన్పిస్తుంటాయి.
ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూనే హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతోన్నారు. కరోనా కారణంగా గత ఐదునెలలుగా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్న బాలకృష్ణ సోమవారం హిందూపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. టీడీపీ హయాంలో ఏపీకి రాజధాని లేకునప్పటికీ తెలంగాణ కంటే ఎక్కువ ఆదాయం వచ్చిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి కంటే కేవలం కక్ష సాధింపులే ఎక్కువగా కన్పిస్తున్నాయన్నారు. అభివృద్ధిలో ప్రభుత్వం అందరినీ కలుపుకోవాలని సూచించారు.
Also Read : ‘జీఎస్టీ’పై జగన్ కు మరోదారి లేదా?
ఇక హిందూపురం నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే సీఎం జగన్ కు లేఖరాశానని.. అవసరమైతే ముఖ్యమంత్రిని కలిసి విన్నవిస్తానని చెప్పారు. తన నియోజకవర్గంలో సొంత నిధులతో నిర్మిస్తున్న కోవిడ్ ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రికి రూ.55లక్షల విలువ చేసే వైద్య పరికరాలు, మందులు పంపిణీ చేశారు.
నియోజకవర్గంలో ఘనస్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి బాలయ్య వారికి కరోనా మంత్రం పఠించాలని సూచించారు. ‘అస్మిన్ పరాత్మన్ నను పాదకల్పే త్వమిత్థముత్థాపిత పద్మయోనిః అనంతభూమా మమ రోగరాశిం నిరుంధి వాతాలయవాస ! విష్ణో!’ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే కరోనా రాదన్నారు. ప్రజలంతా ఈ మంత్రాన్ని పఠించాలని సూచించారు. దీంతో బాలయ్య మంత్రం వేస్తే.. కరోనా ఏంటీ.. దానమ్మ మొగుడైనా పరార్ కావాల్సిందేననే సెటైర్లు విన్పిస్తున్నాయి.
Also Read : జగన్ దగ్గరకు పోతా అంటున్న బాలయ్య… బాబు తట్టుకోగలడా?
జగన్ దగ్గరకు పోతా అంటున్న బాలయ్య… బాబు తట్టుకోగలడా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టిడిపి నేత, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కలుస్తాను అని అంటున్నాడు. చాలా కాలం తర్వాత హైదరాబాద్ నుండి తన సొంత నియోజకవర్గం హిందూపురం కి వెళ్ళిన బాలయ్య ప్రభుత్వ ఆసుపత్రి కి తన తరఫున 50 లక్షల విలువైన మందులను, కొన్ని వైద్య పరికరాలను అందించాడు. అలాగే ఇదే సందర్భంగా తను త్వరలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యే హోదాలో కలుస్తాను అని ప్రకటించారు.
Also Read : బాలయ్య మంత్రం.. కరోనా పరార్ అవాల్సిందే?
హిందూపురంలో మెడికల్ కాలేజీ విషయమై సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలవాలని బాలయ్య చెప్పుకొచ్చారు. తాము ప్రతిపక్షంలో ఉన్నామని…. నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనులపై ఊరికే ఉండలేం అని.. ప్రభుత్వాన్ని అడుగుతాం అని… అవసరమైతే పోరాటం చేస్తా,అని బాలకృష్ణ వ్యాఖ్యానించడం గమనార్హం. ఇప్పటికే మెడికల్ కాలేజీ కి సంబంధించి సంబంధిత ఏపీ రాష్ట్ర మంత్రి తో మాట్లాడినట్టు బాలకృష్ణ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వం పై ఇదే సందర్భంగా ఆయన విమర్శలు కూడా గుప్పించారు.
“గడిచిన ఏడాది కాలంలో రాష్ట్రంలో కనీస అభివృద్ధి కూడా జరగలేదు. కక్ష సాధింపు ఒక్కటే కనబడింది. ఇక రాష్ట్ర అభివృద్ధిపై ప్రభుత్వ పెద్దలు దృష్టి పెట్టడం లేదు” అని ఆయన అన్నారు. చంద్రబాబు హయాంలో ఏపీ అభివృద్ధిలో తెలంగాణ తో పోటీపడింది కానీ…. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం పరిస్థితి చాలా దయనీయంగా ఉందని బాలయ్య అన్నారు. కరోనా కారణంగా ఇది వరకే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా కుదరలేదు అని…. ఇక త్వరగా వెళ్ళి ఆయనను కలుస్తానని బాలయ్య చెప్పడం విశేషం.
ఇదిలా ఉంటే బాలయ్య విమర్శించే క్రమంలో వైసీపీ శ్రేణులు ఎప్పుడూ సంయమనం పాటిస్తూ ఉంటారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా నందమూరి బాలకృష్ణ కు వీరాభిమాని. కడప టౌన్ ప్రెసిడెంట్‌గా వైఎస్ జగన్ పేరుతో కూడిన ఒకప్పటి హోర్డింగ్‌ల తాలూకు ఫొటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంటాయి. ఇక్కడ విషయం ఏమిటంటే జగన్ ను కలిసేందుకు బాలయ్య కి చంద్రబాబు అనుమతిని ఇస్తారా అన్నది సందేహంగా మారింది. ఇప్పటికే వైసీపీ నేతలు బాలకృష్ణని కలుస్తుండడంతో చంద్రబాబు చిర్రుబుర్రులాతున్నాడు. అలాంటిది ఏకంగా మెడికల్ కాలేజీ విషయమై బాలయ్య వైసిపి అధినేత తో మాట్లాడడం బాబుకి రుచించకపోవచ్చు. మరి బాలకృష్ణ ప్రయత్నాలకు చంద్రబాబు మోకాలడ్డకుండా ఉంటారా…?
Also Read : జగన్ చేతకాని తనమే ఏపీ దుస్థితికి కారణమంటున్న ఆర్కే?
వంద కోట్ల ఆఫర్ వద్దనుకున్న ‘మాస్టర్’?

తమిళ హీరో సూర్య నటించిన ‘ఆకాశమే నీ హద్దురా’ మూవీని ఇటీవలే అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. ఈ చిత్రం అక్టోబర్ 30 ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలో ఇళయదళపతి విజయ్ నటించిన ‘మాస్టర్’ మూవీకి ఒక ఓటీటీ సంస్థ 100కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఆఫర్ కు నిర్మాత ఒప్పుకోలేదని ప్రచారం జరుగుతోంది. కొంత ఆలస్యమైనా ఈ మూవీని థియేటర్లలోనే రిలీజ్ చేయాలని చిత్రబృందం ఆలోచిస్తోంది.
తమిళ ఖైదీ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ‘మాస్టర్’ మూవీని తెరకెక్కించాడు. ఇందులో విజయ్ ద్విపాత్రభిమానం చేయనున్నాడు. గ్యాంగ్ స్టర్ గా.. ప్రొఫెసర్ గా కన్పించబోతున్నాడు. విలన్ పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. విజయ్ గత చిత్రం ‘బిగిల్’ తమిళంతోపాటు తెలుగులో భారీ విజయం సాధించింది. ఇండియాలోనే ఈ మూవీ 200కోట్ల మార్క్ దాటేసిందన్ టాక్ ఉంది. దీంతో ‘మాస్టర్’ మూవీని థియేటర్లలోనే విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఏప్రిల్ 9న విడుదల కావాల్సి ఉండగా కరోనా మూవీ వాయిదా పడింది.
బిగ్ బాస్-4 లోకి అల్లరి నరేష్ హీరోయిన్..!

బిగ్ బాస్ సీజన్ – 4 ప్రేక్షకులను అలరించేందుకు ముస్తాబవుతోంది. కరోనా నేపథ్యంలో సినిమా హాళ్ళు మూతపడి ఎంటర్టైన్మెంట్ కరువైన ప్రేక్షకులందరికీ ఈ బుల్లితెర రియాల్టీ షో ఎంతోకొంత ఆకలి తీరుస్తుందని అందరి నమ్మకం. అయితే ఈ మోస్ట్ పాపులర్ షో హిట్ కావాలంటే… ఎన్ని ఆసక్తికరమైన టాస్క్ లు, గేమ్స్, మైండ్ గేమ్స్ ఉన్నా కూడా అందులో పాల్గొనే కంటెస్టెంట్స్ కూడా అదే రేంజ్ సమర్ధత కలిగిన వారు అయి ఉండాలి.
Also Read : పోలీస్ గా దర్శనమిచ్చిన హాట్ బ్యూటీ !
వాళ్ళు అరుస్తుంటే ప్రేక్షకులు కూడా వారితో కలిసి పూనకం వచ్చినట్లు రెచ్చిపోవాలి.. వారి ఏడుస్తుంటే జాలి పడాలి లేదా వారు వాదిస్తుంటే వాళ్ళకి సపోర్ట్ చేయాలి…. సోషల్ మీడియాలో వారి తరఫున పోస్టులు వేయాలి. అంతటి ఇంపాక్ట్ చేయగల సెలబ్రిటీలు మాత్రమే బిగ్ బాస్ షో కి అర్హత పొందుతారు. అయితే ఇప్పటికే ఇదే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్ అంటూ ఇప్పటికే ఎన్నో లిస్ట్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. వాటిల్లో కామన్ గా.. కన్ఫర్మ్ అయిపోయిన పేర్లు కూడా కొన్ని ఉన్నాయి.

సింగర్ గీతా మాధురి భర్త నందు, పూనం బజ్వా, అపూర్వ, ప్రియా వడ్లమాని యామిని భాస్కర్ వంటి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు వీరందరి తోపాటు జతకట్టేందుకు చివరి నిమిషంలో అల్లరి నరేష్ నటించిన సూపర్ హిట్ కామెడీ చిత్రం ‘సుడిగాడు’ హీరోయిన్ మోనాల్ గజ్జర్ కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేస్తోంది అంటూ వార్తలు వస్తున్నాయి.
చాలా మంది అందగత్తెలతో ఈ సీజన్ బిగ్ బాస్ ను ప్యాక్ చేసిన నిర్వాహకులు… నాలుగో సీజన్ కు ఈమె మరింత రెట్టింపు అందాన్ని… ప్రేక్షకులకు ఆసక్తిని తీసుకుని వస్తుందని భావిస్తున్నారు. ఏదైనా మోనాల్ కు తోడుగా మరి కొంత మంది అందగత్తెలు హౌస్ లో సందడి చేయబోతున్నారు. వీరితోపాటు తను ఎలా సఖ్యతగా ఎలా ఉంటుంద్దో… ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి…!
Also Read : వంద కోట్ల ఆఫర్ వద్దనుకున్న ‘మాస్టర్’?
పోలీస్ గా దర్శనమిచ్చిన హాట్ బ్యూటీ !











