
ఏపీ సర్కార్ కు వ్యతిరేకంగా హైకోర్టు చీవాట్లు పెట్టడం ఇటీవల కాలంలో కామన్ అయిపోయింది. జగన్ సర్కార్ ఏ నిర్ణయం చేపట్టిన దానిపై పలువురు కోర్టుకు వెళ్లడం.. హైకోర్టు మందలించడం షరా మమూలుగా మారింది. జగన్ కు హైకోర్టులో ఎదురుదెబ్బలు తగిలినప్పుడల్లా టీడీపీకి చెందిన ఎల్లో మీడియా, టీడీపీ నేతలు సంబరాలు చేసుకోనేవారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఎల్లోమీడియాను సైతం హైకోర్టు తాజాగా చీవాట్లు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
Also Read: చంద్రబాబు, టీడీపీకి జగన్ మరో భారీ షాక్?
విజయవాడకు చెందిన కిలారి నాగశ్రవణ్ ఇటీవల హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. ప్రభుత్వ ప్రకటనల్లో జగన్ సర్కార్ వివిక్ష చూపుతోందని.. సీఎం ఫొటోను పెద్దగా వాడుతున్నారంటూ పిల్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన ధర్మాసన విచారణ చేపట్టింది. పిల్ దాఖలు చేసిన వ్యక్తిని ఘాటుగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
‘ప్రభుత్వం ఇచ్చే ప్రకటనల్లో దివంగత సీఎం(వైఎస్ రాజశేఖరరెడ్డి) ఫొటో ఎందుకు ఉండొద్దు.. ఇలా అని ఏ నిబంధనల్లో ఉంది? సుప్రీంకోర్టు తీర్పులోనూ ఎక్కడా అలా పేర్కొనలేదే..! ఆయన ఫొటో ఉంటే తప్పేంటి? ఆయన కూడా రాష్ట్రానికి సీఎంగా సేవలందించారు కదా! అంటూ ప్రశ్నించింది. ప్రభుత్వ ప్రకటనల్లో మీకు అభ్యంతరాలు ఉంటే సుప్రీంకోర్టుకే వెళ్లి చెప్పుకోండంటూ’ హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఈ సందర్భంగా పిటినర్ తరపు న్యాయవాది మాట్లాడుతూ ప్రకటన జారీ విషయంలో సుప్రీంకోర్టు నిబంధనలు విరుద్ధంగా ప్రభుత్వం నడుచుకుంటుందని చెప్పారు. ప్రకటనలపై కేంద్ర, రాష్ట్రాలు ఏమైనా మార్గదర్శకాలు రూపొందించాయా అంటూ ప్రశ్నించింది. సుప్రీం నిబంధనలు ఖరారు చేస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాటించాల్సిందేనని చెప్పింది. దానికి విరుద్ధంగా నడుచుకుంటే హైకోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొంది. ప్రకటనల విషయంలో కేంద్ర, రాష్ట్రాలు మార్గదర్శకాలు ఏం చేయలేదని పిటిషనర్ హైకోర్టు తెలుపడంతో సుప్రీంకే వెళ్లి తేల్చుకోవాలంటూ తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది.
Also Read: బాలయ్య మంత్రం.. కరోనా పరార్ అవాల్సిందే?
దీనిపై ప్రభుత్వం తరుఫున వాదిస్తున్న అడ్వొకేట్ జనరల్ పిటినర్ వెనుక చంద్రబాబు ఉన్నారని.. ఇదంతా టీడీపీ రాజకీయంలో భాగమేనని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గత చంద్రబాబు పాలనలో ప్రకటనలు ఇచ్చినపుడు పసుపు రంగు వాడరంటూ ఓ ప్రకటనను ధర్మసనానికి చూపించారు. అప్పుడు పిటిషనర్ ఎందుకు హైకోర్టును ఆశ్రయించలేదని ప్రశ్నించారు. రాజకీయ దురుద్దేశంలో భాగంగానే పిటిషనర్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారని మండిపడ్డారు.
కాగా ఈ పిల్ ను సుప్రీం ధర్మాసనానికి పంపుతామని చెబుతూనే హైకోర్టు పరోక్షంగా పిటిషనర్ దారుడిని చీవాట్లు పెట్టింది. ఎప్పుడు ప్రభుత్వాన్ని చీవాట్లు పెట్టే హైకోర్టు ఎల్లోమీడియాకు షాక్ ఇవ్వడం విశేషం. ఇప్పటికే ఎల్లోమీడియాకు గట్టి షాకిస్తున్న జగన్ కు హైకోర్టు తీర్పు తనకు అనుకూలంగా రావడంతో వాటికి మరింత ఇబ్బందులు ఎదురయ్యేలా కన్పిస్తున్నాయి.