రేవంత్.. యూత్ ఫాలోయింగ్ ఉన్న లీడర్. కొడంగల్ టైగర్.. ఏదైనా సమస్య పరిష్కారానికి ఎక్కడి వరకైనా పోదాం పద అంటూ తెగువ చూపే నాయకుడు. ఏ పార్టీలో ఉన్నా తన వాగ్ధాటితో అందరినీ ఆకట్టుకునే శైలిలీ ప్రసంగాలు చేయడంలో ధిట్ట. ఉత్సాహం, పోరాటం, ఆరాటం కలిగిన నేత. అదే సమయంలో రాజకీయ ప్రత్యర్థుల గుండెల్లో నిద్రపోయే పర్సన్. ఇలా ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్నారు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. రెండో సారి టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేసరికి తుడిచిపెట్టుకుపోతున్న కాంగ్రెస్ ఎంతో కొంత బూస్ట్ ఇచ్చింది రేవంత్‌రెడ్డి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు ఎక్కడ ఆయనకు పీసీసీ ప్రెసిడెంట్ పదవి వస్తుందోనని కాంగ్రెస్ సీనియర్లంతా కూడగట్టుకొని అడుగడుతునా ప్రయత్నం చేస్తున్నట్లు బహిరంగంగా తెలిసిన విషయమే. కానీ.. రేవంత్ మాత్రం వాటిని లెక్కచేయకుండా తనదైన శైలిలో ముందుకు సాగుతున్నాడు. ఒకానొక సందర్భంలో కొత్త పార్టీ పెడుతాడంటూ ప్రచారాలు వినిపిస్తున్నాయి.
Also Read : కేసీఆర్ ఇమేజ్ ముందు బీజేపీ నిలిచేనా
టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల అవినీతి వ్యవహారం వెలుగులోకి తెస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ క్రమక్రమంగా వారి ఇమేజీని డ్యామేజ్ చేస్తూ రేవంత్ పైచేయి సాధిస్తున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా కేసీఆర్ సర్కార్ బండారం బయటపెడుతూనే ఉన్నారు. అయితే అనూహ్యంగా ఆయన త్వరలోనే కాంగ్రెస్ నుంచి తప్పుకుంటారని, కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారని ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్‌లో ఉన్న గ్రూపు రాజకీయాలు కారణంగా ముందు ముందు మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయని, స్వపక్షంలోని విపక్షాన్ని నిత్యం ఎదుర్కోవడం పెద్ద తలనొప్పి వ్యవహారంగా రేవంత్ అంచనాకు వచ్చారు. దీనికితోడు జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ ఇబ్బందులు పడుతుండటం, ముందు ముందు మరింత బలహీనం అయ్యే ప్రమాదం ఉండడంతో సొంత పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అసలు రేవంత్‌కు సొంత పార్టీ ఆలోచన రావడానికి టీడీపీ అధినేత చంద్రబాబు కారణమనే విషయమూ ఇప్పుడిప్పుడే బయటికి వస్తోంది.
టీడీపీ లీడర్ చంద్రబాబు సలహాలు సూచనలతోనే కొత్తపార్టీ పెట్టేందుకు రేవంత్ సిద్ధమవుతున్నారట. రేవంత్ రాజకీయంగా పైకి ఎదిగితే, తనకు బద్ధశత్రువుగా ఉన్న కేసీఆర్‌ను రాజకీయంగా పతనం చేయవచ్చనే అభిప్రాయంతో బాబు రేవంత్‌ను దువ్వుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. రేవంత్ పార్టీ కనుక పెడితే, రెడ్డి సామాజిక వర్గం అంతా ఏకమై, ఆయనకు మద్దతుగా నిలబడతారని, అలాగే నాయకులు లేక అల్లాడుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా రేవంత్ పార్టీలో చేరుతారని, ఇలా అనేక లెక్కలను బయటకు తీసి చంద్రబాబు రేవంత్‌కు నూరిపోశారట. ఇప్పటికే రేవంత్ బాబు మధ్య పార్టీ ఏర్పాటుకు సంబంధించి తీవ్రమైన చర్చ జరిగినట్లు, బాబు నైతిక మద్దతుతోనే రేవంత్ కథన రంగంలోకి దూకుతున్నట్టుగా తెలుస్తోంది.
అయితే.. రేవంత్ కొత్త పార్టీ పెట్టి సీఎం అవుదామనుకుంటున్నారా..? కొత్త పార్టీ ఆయనకు ఏ మేరకు కలిసివస్తుంది..? కొత్త పార్టీని నడిపించడం అంత ఈజీ అవుతుందా..? చంద్రబాబుతో పొత్తు ఏ మేరకు సత్ఫలితాలిస్తుంది..? ఇప్పటికే ఆంధ్రాలోనూ మైలోజ్ కోల్పోయిన బాబు సలహాలు సూచనలు రేవంత్‌కు ఏ మేరకు పనిచేస్తాయి..? వేచి చూద్దాం.
Also Read : బ్రేకింగ్ : మంత్రి హరీష్ రావుకు కరోనా పాజిటివ్