Home Blog Page 8323

జగన్ పై హిందువుల వ్యతిరేకతకు ప్రధాన కారణాలేమిటి?

ఏపీ సీఎం జగన్ స్వతహాగా క్రైస్తవుడని ఇదివరకే ఒప్పుకున్నాడు. సాక్షాత్తూ సాక్షి దినపత్రిక ప్రారంభంలోనే తాను క్రైస్తవుడని జగన్ ప్రకటించుకున్న విషయం అందరికీ తెలిసిందే. అంతేకాదు.. క్రైస్తవుల పవిత్ర స్థలం జేరుసలేంకు నాడు వైఎస్ ఫ్యామిలీ మొత్తం వెళ్లి దర్శించుకుంది. విజయమ్మ చేతిలో అప్పుడప్పుడు శిలువ కనిపిస్తుంది. అయితే ఇది భారతదేశం.. అందరికి మతస్వేచ్ఛ ఉంటుంది. ఎవరు ఏ మతాన్ని అయినా అనుసరించవచ్చు. అందులో తప్పు లేదు. కానీ వేరొకరి మతాన్ని గాయపరిస్తేనే తప్పు.

Also Read: జగన్ తీసుకున్న ఆ నిర్ణయం మళ్లీ ఫెయిల్ కానుందా…?

కానీ ఎందుకోగానీ ఏపీ సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి హిందుత్వ మనోభావాలు దెబ్బతీసేలా పలు సంఘటనలు జరగడం ఆయనపై హిందుత్వ వ్యతిరేకిగా ముద్రపడడానికి కారణమైందనే ప్రచారం ఉంది. ప్రధానంగా కొన్ని హిందుత్వ సంఘాలు, ముఖ్యంగా టీడీపీ, బీజేపీలు ఏపీలో జరిగిన పలు సంఘటనలతో సీఎం జగన్ ను హిందూ వ్యతిరేకిగా ప్రచారం చేశాయి. అయితే జగన్ కావాలని హిందుత్వ వ్యతిరేక పనులు చేయకున్నా.. ఆయన పాలనలో అవి చోటుచేసుకోవడంతో ఆ ముద్రను వేసుకుంటున్నారు.

జగన్ హిందూ వ్యతిరేక ముఖ్యమంత్రిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డిని నియమించినప్పుడు పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ఆయన టీటీడీ నిరర్థక ఆస్తులను అమ్మాలని చూడడంపై బీజేపీ, హిందుత్వ అభిమానులు గుర్రుగా ఉన్నారు.

ఇక చర్చి ఫాదర్లు, మసీదు ముల్లాలకు గౌరవ వేతనం ఇవ్వడం విమర్శలకు తావిచ్చింది. ఆలయాలకు ప్రభుత్వానికి పెద్దమొత్తంలో ఆదాయం వస్తుంది కానీ ఆదాయం రాని వారికి గౌరవ వేతనం ఇవ్వడాన్ని  కొందరు ప్రశ్నించారు. బ్రహ్మణ కార్పొరేషన్ విషయంలో జగన్ సర్కార్ ఏమాత్రం పట్టించుకోలేదు. ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్న అర్చకుల విషయంలో అస్సలు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇది హిందువుల ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది.

ఇక పిఠాపురంలో అమ్మావారి విగ్రహాలు కూల్చివేతలో హిందుత్వ అభిమానులు మండిపడ్డారు. పవిత్ర సంగమంలో హారతి రద్దు, దేవాలయాల భూముల అమ్మకం, ఘాట్ల వద్ద పిండాలకు ధరలు పెంచడం.. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్య మతస్థులకు బాధ్యతలు. ఇతర ప్రముఖ హిందూ దేవాలయాల్లో అన్య మతస్థులకు ఉద్యోగాలు ఇవ్వడం పెద్ద దుమారమే రేపాయి.

జగన్ ప్రభుత్వంలోనే పలు హిందూ ఆలయాల్లో ధరలను పెంచడం కూడా వివాదాస్పదమైంది. తిరుపతినుంచి తిరుమల వెళ్ళే వాహనాల టోల్ ఛార్జీలు పెంపుదల.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వాహనాల పార్కింగ్ ఫీజు 20నుంచి రూ.50 పెంచడం.. పట్టిసీమ వీరభద్రస్వామి గుడికి నడిచి వెళ్తున్న భక్తులనుంచి రూ.20 వసూలు చెయ్యడం దుమారం రేపింది. నడిచి వెళ్ళేవాళ్ళనుంచి డబ్బు వసూలు చెయ్యడం ఏంటో దేవుడికే తెలియాలని అందరూ ఆడిపోసుకున్నారు.   హిందూ పండగల సమయంలో ముఖ్యమైన పుణ్యక్షేత్రాలకు వెళ్ళే బస్సు ఛార్జీలు పెంచడం.  కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలచేత క్రైస్తవ మతానికి చెందిన పాటలు పాడించడం దుమారం రేపింది.

ఢిల్లీ నుంచి వచ్చిన ముస్లిములను కరోనా ఐసొలేషన్ లో ఉంచడానికి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని ఉపయోగించడం తీవ్ర దుమారం రేపింది..   అక్కడికి దగ్గర్లోనే ఇస్లామిక్ యూనివర్సిటీ ఉంది.ఐసొలేషన్ వార్డుగా దాన్ని వాడుకోవచ్చుకదా అని స్థానికులు ఆరోపించారు.  హిందువులంతా కొలిచే తిరుమల స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని వ్యాపార వస్తువుగా మార్చి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అమ్మడాన్ని బీజేపీ సహా హిందూ సంఘాలు ప్రశ్నించాయి.

Also Read: మరో సరికొత్త సంక్షేమ పథకం అమలు చేయబోతున్న జగన్?

అంతర్వేది రథం దగ్ధం సహా పలు హిందువుల మనోభావాలు దెబ్బ తిన్న ఘటనల్లో జగన్ సర్కార్ సరైన చర్యలు తీసుకోలేదని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అంతర్వేది రథం దగ్ధం విషయంలో ప్రభుత్వ ఉదాసీనత విమర్శల పాలైంది. హిందూ ఆలయాల విషయంలో ఎవరు చేస్తున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుందనే దానిపై జగన్ ప్రభుత్వం దృష్టిసారించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.

అయితే జగన్ పాలనలో  కరోనా విషయంలో మంచి మార్కులు పడ్డా.. ఇలాంటి కొన్ని సంఘటనల వల్ల ఆయన ప్రభుత్వంపై మరకపడింది. బీజేపీ, టీడీపీ, హిందుత్వ సంఘాలు ఈ ఘటనలను ఎత్తిచూపాయి. జగన్ స్వతహాగా ఇలాంటి వాటి విషయంలో సంయమనం పాటించినా..ఆయన ప్రభుత్వంపై డ్యామేజ్ మాత్రం బాగా జరిగింది. జగన్ సర్కార్ పై ఈ రకమైన ప్రచారం ఉవ్వెత్తున సాగింది. ఇక టీడీపీ బ్యాచ్ అయితే జగన్ టార్గెట్ గా ఇలాంటివెన్నో వండివర్చారనే ప్రచారం ఉంది.  ఏదో మూల.. ఎవరో చేసినా ఇలాంటి నిర్ణయాలు అంతిమంగా జగన్ ప్రభుత్వంపై పడ్డాయి. జాతీయ స్థాయిలో జగన్ పై హిందుత్వ వ్యతిరేక ముద్రను కొందరు వేశారనే ప్రచారం ఉంది.  మరి ఈ ముద్రను చెరిపేసుకోవడానికి జగన్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తారన్నది వేచిచూడాలి.

బిగ్ బాస్ 4 : ఈ సారి వారిదే డామినేషన్

Bigg Boss 4: This time their domination
బుల్లి తెర రియాలిటీ షోలలో ఎన్ని షోలు ఉన్నా బిగ్ బాస్ షో క్రేజ్ వేరనే చెప్పాలి. మనకు తెలిసిన సెలబ్రిటీలు నిజజీవితంలో ఎలా ఉంటారనే ఆసక్తే అభిమానుల్లో ఈ షో పట్ల క్రేజ్ పెంచుతోంది. అయితే మిగతా సీజన్లతో పోలిస్తే సీజన్ 4లో లేడీస్ డామినేషన్ ఎక్కువగా కనిపిస్తోంది. మూడు సీజన్లలో మేల్ కంటెస్టెంట్లే టైటిల్ విన్ కాగా ఈ సీజన్ లో మాత్రం ఫిమేల్ కంటెస్టెంట్ టైటిల్ విన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Also Read : టీవీ9 దేవి గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

మిగతాగా వాళ్లతో పోలిస్తే ఈ సీజన్ లో గంగవ్వ ప్రత్యేకం. 57 ఏళ్ల గంగవ్వ టాస్కుల్లో ఎలా పాల్గొంటుందో మిగతా కంటెస్టెంట్లకు టఫ్ కాంపీటీషన్ ఏ విధంగా ఇస్తుందో చూడాల్సి ఉంది. ఎప్పుడూ చలాకీగా నవ్వుతూ నవ్విస్తూ కనిపించే అల్లరి లాస్య చీమ ఏనుగు జోక్ లతో వీక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతుందనడంలో ఆశ్చర్యం లేదు. ఇక శృతి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. శృతి అంటే సులభంగా గుర్తు పట్టలేమెమో కానీ జోర్దార్ సుజాత అంటే సులభంగా అర్థమవుతుంది.

తెలంగాణ యాసలో అవలీలగా అద్భుతంగా మాట్లాడే ప్రతిభ సుజాత సొంతం. ఇక రెబల్ గా కనిపించే దేవి నాగవల్లి హౌస్ లో ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది. యూట్యూబ్ లో లక్షల్లో సబ్ స్క్రైబర్లు ఉన్న దేత్తడి హారికకు ఉన్న ఫాలోయింగ్ తక్కువేం కాదు. బోల్డ్ అంటూ ఎంట్రీ ఇచ్చిన అరియానా గ్లోరీ ఎంత బోల్డో ఏ విషయంలో బోల్డో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. బోలెడన్ని వివాదాలతో పాపులర్ అయిన కరాటే కళ్యాణి పంచే వినోదం తక్కువేం కాదు.

చిన్నాచితకా పాత్రల్లో నటించిన దివి కోరుకున్న విధంగా సెలబ్రిటీ స్టేటస్ అందుకుంటుందో కొన్ని వారాలకే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళుతుందో చూడాల్సి ఉంది. ఇక హౌస్ లో మిగతా వాళ్లతో పోలిస్తే మోనాల్ గజ్జర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మిగతా వాళ్లతో పోల్చి చూస్తే క్రేజ్ పరంగా, ఫాలోయింగ్ పరంగా మోనాల్ ముందంజలో ఉంది. సీజన్ 4 టైటిల్ రేసులో మోనాల్ తప్పక ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తుండగా సోషల్ మీడియా సర్వేల్లోనూ ఇదే విషయం ప్రూవ్ అవుతోంది.

Also Read : ఫ్లాష్: సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి కన్నుమూత

‘బిగ్ బాస్’కు టీఆర్పీ షాక్.. ‘వంటలక్క’ను బీట్ చేయగలడా?


కరోనా కాలంలో ప్రతీఒక్కరు ఇంటికే పరిమితం అవడంతో కొద్దిరోజులుగా టెలివిజన్ ప్రసారాలను భారీ టీఆర్పీ వచ్చింది. ఇది నిర్వాకులకు శుభవార్తే అయినప్పటికీగా తాజాగా ప్రకటించిన టీఆర్పీ రేటింగ్ మాత్రం అన్ని ఛానళ్లకు షాకిచ్చాయి. 34వ వారానికి సంబంధించిన రేటింగ్స్ గత వారంతో పోలిస్తే 540పాయింట్ల నుంచి 413కు పడిపోయింది. న్యూస్, ఎంటటైన్మెంట్ అనే తేడా లేకుండా అన్ని కార్యక్రమాలు టీఆర్పీలో వెనుకబడటంపై బిగ్ బాస్ నిర్వాహకులు సైతం ఆలోచనలు పడినట్లు తెలుస్తోంది.

‘స్టార్ మా’లో ఈ ఆదివారం నుంచి ‘బిగ్ బాస్-4’ సీజన్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో నిర్వహాకులతోపాటు మా యాజమాన్యం భారీ అంచనాలను పెట్టుకుంది. ‘బిగ్ బాస్-4’ కోసం గత కొద్దిరోజులుగా స్టార్ మా విపరీతంగా పబ్లిసిటీ చేసింది. అయితే కార్యక్రమం రోజున మాత్రం ఛానల్ యాజమాన్యం అనుకున్న టీఆర్పీని ఆదుకోలేదని తెలుస్తోంది. దీంతో నిర్వహాకులు సైతం ఆలోచనలో పడ్డారు. కార్యక్రమాన్ని మరింత హుషారుగా నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు.

ఈ సమయంలోనే స్టార్ మాలోని ‘కార్తీక దీపం’ సీరియల్ టాప్ ప్లేసులో దూసుకెళుతోంది. అత్యధిక టీఆర్పీతో కార్తీక దీపం మొదటి ఆరు స్థానాల్లో నిలువడం గమనార్హం. 18పాయింట్లకు పైగా వ్యూయర్‌ షిప్‌ సాధించి ఎప్పటిలానే నెంబర్‌ వన్‌ సీరియల్‌గా కార్తీక దీపం తొలి స్థానాన్ని నిలబెట్టుకుంది. వంటలక్క మీద అభిమానంతోనే ప్రేక్షకులంతా టీవీలకు అతుక్కుపోతున్నారు. దీంతో ఆ సీరియల్ టాప్ ప్లేసులో దూసుకెళుతూ సత్తా చాటుతోంది.

తాజాగా బిగ్ బాస్ షో ప్రారంభమైంది. త్వరలోనే ఐపీఎల్ మ్యాచులు ప్రారంభం కానుండటంతో టీవీ టీఆర్పీలు పెరిగే అవకాశం కన్పిస్తుంది. లాక్డౌన్ సమయంలో అందరు ఇళ్లకే పరిమితం కావడంతో టీఆర్పీ రేట్ అమాంతం పెరగడంతో టీవీ ఛానళ్లు సంబరాలు చేసుకున్నాయి. అయితే కిందటి వారంలో వర్షాలు బాగాపడటం.. విద్యుత్ సరఫరాలో అంతరాయం.. డీటీహెచ్ సిగ్నల్స్ సరిగా లేకపోవడంతో టీఆర్పీ రేట్ తగ్గిందని టెలివిజన్లు ఛానళ్లు అంచనా వేస్తున్నాయి.

టీఆర్పీ ఒకవారం పెరగడం.. మరోక వారం తగ్గడం కామనేనని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా బిగ్ బాస్ సీజన్ కూడా ప్రారంభం కావడంతో టీఆర్పీ పెరుగుతుందని పలువురు అంచనా వేస్తున్నారు. అయితే టీఆర్పీ రేటులో బిగ్ బాస్.. వంటలాక్కను బీట్ చేస్తాడా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

టీవీ9 దేవి గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

tv9 devi
బిగ్ బాస్ షోకు టీవీ9కు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత రెండు సీజన్ల నుంచి టీవీ9కు చెందిన యాంకర్ ఎవరో ఒకరు బిగ్ బాస్ షోలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా అదే సెంటిమెంట్ ను కొనసాగిస్తూ బిగ్ బాస్ షోలోకి రాజమండ్రికి చెందిన దేవీ నాగవల్లి ఎంట్రీ ఇచ్చారు. టీవీ యాంకర్ గా దేవీ నాగవల్లి తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమైనా ఆమె వ్యక్తిగత విషయాల గురించి ఎవరికీ పెద్దగా తెలియదు.

Also Read : ఫ్లాష్: సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి కన్నుమూత

జర్నలిజాన్ని ఎంతో ఇష్టపడే దేవీ నాగవల్లి హెయిర్ స్టైల్ కానీ వస్త్రధారణ కానీ భిన్నంగా ఉంటుంది. మాస్ కమ్యూనికేషన్ లో డిప్లమో చేసిన దేవీ నాగవల్లి తన ప్రతిభతో టీవీ9లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంతటి రాజకీయ నాయకుడైనా సినిమా స్టార్ అయినా సూటిగా ప్రశ్నించేతత్వం ఉన్న దేవీ నాగవల్లి నిజ జీవితంలోను ముక్కుసూటిగా వ్యవహరిస్తుందనే పేరుంది. బిగ్ బాస్ షో స్టేజ్ పై నాగార్జునను ప్రశ్నలు వేసి దేవి తన ప్రవర్తన అవతలి వ్యక్తులతో ఎలా ఉంటుందో స్పష్టంగా అర్థమయ్యేలా చేశారు.

అయితే అదే స్టేజ్ పై తనకు సంబంధించిన కీలక విషయాలను దేవీ నాగవల్లి చెప్పుకొచ్చారు. దేవీ నాగవల్లి చూడటానికి చిన్న అమ్మాయిలా కనిపించినా తనకు పెళ్లి అయిందని భర్తతో విడిపోయానని… ఆరు సంవత్సరాల బాబు ఉన్నాడని తెలిపారు. కొన్ని సంవత్సరాల పాటు తాను అమెరికాలో ఉన్నానని వివిధ కారణాల వల్ల అక్కడి నుంచి ఇండియాకు తిరిగొచ్చేశానని ఆమె చెప్పుకొచ్చారు. తాను డబ్బు కోసమే ఈ షోకు వచ్చానని ఖచ్చితంగా విన్నర్ అవుతానని దేవి వ్యాఖ్యానించడం గమనార్హం.

మరి దేవి ఆమె అనుకున్న విధంగా చివరి వరకు బిగ్ బాస్ షోలో నిలిచి విజయం సాధిస్తుందా…? లేక మధ్యలోనే షో నుండి వెళ్లిపోతుందా…? చూడాల్సి ఉంది.

Also Read : బిగ్ బాస్ 4 : ఈ సారి వారిదే డామినేషన్

జగన్ తీసుకున్న ఆ నిర్ణయం మళ్లీ ఫెయిల్ కానుందా…?

Will the decision taken by Jagan fail again

2019 ఎన్నికల ఫలితాల్లో 151 సీట్లతో ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ ప్రజలకు మంచి చేయాలనుకున్నప్పటికీ కొన్ని విషయాల్లో సమయం అనుకూలించడం లేదు. జగన్ ఇళ్ల పట్టాల పంపిణీ నిర్ణయం కానీ జగన్ మూడు రాజధానుల నిర్ణయం కానీ అమలు చేయాలని ప్రయత్నిస్తున్నా వివిధ కారణాల వల్ల ప్రతి సందర్భంలోనూ వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే.

Also Read : మరో సరికొత్త సంక్షేమ పథకం అమలు చేయబోతున్న జగన్?

కోర్టుల్లో జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలపై పిటిషన్లు దాఖలవుతూ ఉండటం వల్ల జగన్ సర్కార్ తీసుకున్న్ నిర్ణయాలకు బ్రేకులు పడుతున్నాయి. గతేడాది టీడీపీ సభ్యుల వల్ల మూడు రాజధానుల బిల్లును శాసన మండలి తిరస్కరించింది. అయితే గవర్నర్ ఆమోదంతో మూడు రాజధానుల నిర్ణయం అమలుకు ఎటువంటి ఆటంకాలు ఉండవని భావించిన జగన్ సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టులో పెద్దఎత్తున పిటిషన్లు దాఖలయ్యాయి.

వరుస స్టేల వల్ల జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని దసరాకు కూడా అమలు చేయడం కష్టమేనని తెలుస్తోంది. జగన్ విజయదశమి సందర్భంగా మూడు రాజధానులను అమలు చేద్దామని భావిస్తున్నా మరోసారి జగన్ నిర్ణయం ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కేంద్రం రాష్ట్ర రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వందే తుది నిర్ణయం అని చెప్పినా కోర్టు మాత్రం మూడు రాజధానుల నిర్ణయం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు.

సుప్రీం కోర్టు సైతం హైకోర్టు స్టేను తొలగించలేమని చెప్పడంతో జగన్ సర్కార్ కు షాక్ తగిలినట్లైంది. విశాఖకు చెందిన స్వరూపానందేంద్ర స్వామీజీ సూచనల మేరకు అక్టోబర్ 25వ తేదీన విశాఖకు రాజధానిని తరలించడానికి జగన్ సిద్ధమవుతున్నా న్యాయపరమైన చిక్కులు ఉండడంతో ఈ సంవత్సరం మూడు రాజధానుల నిర్ణయం అమలు కష్టమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read : జగన్ పై హిందువుల వ్యతిరేకతకు ప్రధాన కారణాలేమిటి?

మరో సరికొత్త సంక్షేమ పథకం అమలు చేయబోతున్న జగన్?

Jagan going to lanch another new welfare scheme

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రోజు నుంచి జగన్ సర్కార్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన పథకాలతో పాటు హామీ ఇవ్వని పథకాలను సైతం అమలు చేస్తూ జగన్ సర్కార్ ప్రజల్లో మంచిపేరు తెచ్చుకుంటోంది. తాజాగా జగన్ సర్కార్ మరో సంచలన పథకం అమలుకు సిద్ధమవుతోంది. వైయస్సార్ సంపూర్ణ పోషణ, వైయస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాల అమలుకు జగన్ సర్కార్ సిద్ధమవుతోంది.

Also Read : జగన్ పై హిందువుల వ్యతిరేకతకు ప్రధాన కారణాలేమిటి?

చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారం అందించే దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది. నేడు ఈ పథకాలను సీఎం జగన్ అందించారు. క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ ఈ ప్రత్యేక పథకాన్ని ప్రారంభించారు. అధికారుల నుంచి ఈ రెండు పథకాల ద్వారా ఇస్తున్న మెనూతో పాటు ఇతర వివరాలను సీఎం జగన్ అడిగి తెలుసుకున్నారు. ఈ పథకాల ద్వారా ఇచ్చే పదార్థాలను రుచి చూశారు.

బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకం అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే జగన్ సర్కార్ గర్భిణులు, బాలింతలు, చిన్నారుల కోసం మధ్యాహ్న భోజన పథకం, బాలామృతం, వైఎస్సార్‌ బాల సంజీవని, వైఎస్సార్ అమృతహస్తం లాంటి పథకాలను అమలు చేస్తోంది. వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకం రాష్ట్రంలోని 8,320 అంగన్‌వాడీ కేంద్రాల్లో అమలు కానుందని తెలుస్తోంది.

ప్రస్తుతం వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాల ద్వారా 66 వేల మంది గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం మూడున్నర వారాల పాటు పాలు, కూరగాయలు, అన్నం, పప్పు అందజేస్తోంది. ప్రభుత్వం ఈ పథకం కోసం 87 కోట్ల రూపాయల చొప్పున ఒక్కొక్క లబ్ధిదారుడికి 1,100 రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధమవుతోంది. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం ద్వారా 47,287 అంగన్వాడీ కేంద్రాల్లో 5.80 లక్షలమంది గర్భిణీలు జగన్ సర్కార్ పాలు, అన్నం, పప్పు, కూరగాయలు, కోడిగుడ్లు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటోంది.

Also Read : జగన్ తీసుకున్న ఆ నిర్ణయం మళ్లీ ఫెయిల్ కానుందా…?

సోనుసూద్‌ కంటే వైఎస్ భారతి లక్ష రెట్లు బెటరా?

వైఎస్‌ భారతి.. ఆంధ్ర, తెలంగాణలో ఇప్పుడు ఆమె గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదేమో. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి. పులివెందులలో శిశువైద్య నిపుణుడు అయిన గంగిరెడ్డి కుమార్తె. బిజినెస్‌ అడ్మినిస్ర్టేషన్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ చేసిన భారతి.. మొన్నటి వరకు వ్యాపారంలో, మీడియాలోనూ కొనసాగారు. భారతి సిమెంట్స్‌ను, సాక్షి తెలుగు దినపత్రికను చూశారు. జగన్‌ సీఎం అయ్యాక వాటి నుంచి తప్పుకొని ఇంటి బాధ్యతలు చూస్తున్నారు. జగన్‌కు చేదోడుగా నిలుస్తున్నారు.

Also Read : జగన్ పై హిందువుల వ్యతిరేకతకు ప్రధాన కారణాలేమిటి?

ఎప్పుడూ ఏదో ఒక వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే సినీ నటుడు పోసాని కృష్ణ మురళి తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనపై, ఆయన సతీమణి భారతిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీలో జనాలకు చాలా సమస్యలున్నాయని, వారిని జగన్ ఆదుకుంటున్నారని చెప్పుకొచ్చారు. విద్యార్థులు, మహిళలు, వెనుకబడిన వర్గాల వారికి చాలా చేస్తున్నారని.. రైతులు, చేనేతలు, ఆటో డ్రైవర్లను ఆదుకున్నారన్నారు. జగన్ పుట్టక ముందే ఆయన కుటుంబం ఇన్‌కమ్ ట్యాక్స్ పే చేస్తోందని అన్నారు. తాను స్వయంగా 15 రోజులు పులివెందుల్లో ఉన్నానని.. అక్కడి జనాలతో మాట్లాడానని తెలిపారు.

పులివెందుల్లో 10 కాలనీలు ఎస్సీ, ఎస్టీలకు ఉండగా.. వారికి స్థలం కొనుగోలు చేసి ఇచ్చి వైఎస్‌ ఫ్యామిలీ ఇళ్లు కట్టించిందని చెప్పారు. వైఎస్ ఫ్యామిలీ 5 లక్షల మందికి కంటి ఆపరేషన్లు చేయించిందన్నారు. వికలాంగులు, మానసిక వికలాంగులకు వైఎస్ భారతి జగన్‌తో కలిసి సొంత డబ్బులతో ప్రత్యేకంగా స్కూల్స్ ఏర్పాటు చేశారని చెప్పారు. ఇవన్నీ ఎవరైనా చెప్పుకుంటారా.. సోనూసూద్ కంటే వైఎస్‌ భారతి లక్ష రెట్లు బెటర్ సేవ చేస్తున్నారు ఎప్పుడైనా ఆమె చెప్పుకున్నారా అంటూ వ్యాఖ్యానించారు.

తాను రాజకీయాల్లో ఉన్నా ఎప్పుడూ ఏ పదవి ఆశించలేదన్నారు. ప్రజారాజ్యం సమయంలో కూడా తాను ఎమ్మెల్యే టికెట్ కావాలని ఎప్పుడూ అడగలేదన్నారు. ఇక ఏపీలో మూడు రాజధానుల విషయంపై స్పందించిన ఆయన.. పరిపాలనా వికేంద్రీకరణ మంచి నిర్ణయమే అన్నారు. అమరావతి రైతులకు కూడా జగన్ న్యాయం చేస్తారన్నారు. ఏపీ సీఎం అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారని.. రాష్ట్రంలో ప్రాజెక్టుల్ని కూడా త్వరగా పూర్తి చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశ పెట్టడం మంచి నిర్ణయం అన్నారు.

డ్రగ్ కేసులో స్టార్ల పేర్లను బయటపెట్టిన రియా చక్రవర్తి?

Riya chakravarthy
Riya chakravarthy

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు అనేక మలుపు తిరుగుతోంది. బాలీవుడ్లోని నెపోటిజం కారణంగానే సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని తొలుత పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అయితే సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని.. అతనిని ఎవరో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ సుశాంత్ సింగ్ తండ్రి, బంధువులు ఆరోపించారు. ఈనేపథ్యంలో సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసును పోలీసులు ఛాలెంజ్ తీసుకొని విచారిస్తున్నారు.

ఈ కేసులో డ్రగ్ మాఫియాకు లింకులు బయటపడటంతో ప్రస్తుతం ఆ దిశగా పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ కేసుపై సీబీఐ, ఈడీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) దర్యాప్తు కొనసాగిస్తుండటంతో రోజుకో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. తీగలాగితే డొంక కదిలిసినట్లు బాలీవుడ్లోని చీకటి కోణాలు ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయి.

డ్రగ్ కేసుతో సంబంధం ఉన్న రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తి, శామ్యూల్ మిరండా, దీపేష్ సావంత్ అను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి విచారించారు. రియా చక్రవర్తి ఆదేశాలతోనే తాను సుశాంత్ సింగ్ కు డ్రగ్ ఇచ్చినట్లు షోవిక్ పోలీసులతో తెలిపినట్లు సమాచారం. దీంతో గత రెండ్రోజులుగా పోలీసులు రియా చక్రవర్తిని అదుపులోకి విచారిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె పలు సంచలన విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది.

సుశాంత్ సింగ్ కోసమే తాను తన సోదరుడి నుంచి డ్రగ్స్ తీసుకున్నట్టు రియా చక్రవర్తి ఎన్‌సీబీ విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే తాను ఎఫ్పుడూ కూడా డ్రగ్ తీసుకోలేదని స్పష్టం చేసినట్లు సమాచారం. అదేవిధంగా డ్రగ్ వ్యాపారి బాసిత్ తనను ఐదు సందర్భాల్లో కలిసాడని.. అతడే తమ ఇంటికి వచ్చేవాడని తెలిపింది. డ్రగ్స్ తో సంబంధం ఉన్న పలువురి బాలీవుడ్ స్టార్ల పేర్లను రియా చక్రవర్తి వెల్లడించినట్లు సమాచారం.

సుమారు 18నుంచి 19మంది పేర్లను రియాచక్రవర్తి వెల్లడించిందని తెలియడంతో బాలీవుడ్లో ప్రకంపనలు మొదలైయ్యారు. ఇక 2016లో సుశాంత్ డ్రగ్స్ గాలానికి చిక్కినట్లు రియా చెప్పడం సంచలనంగా మారింది. ఈ కేసులో పలువురి స్టార్ల పేర్లు తెరపైకి రానుండటంతో మున్ముందు ఈ కేసు ఎలా సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది.

నిమ్మగడ్డ విషయంలో పోసాని సంచలన వ్యాఖ్యలు…?

Posani sensational comments about nimmagadda

ప్రముఖ కమెడియన్, రచయిత, రాజకీయ నేత పోసాని కృష్ణమురళి ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడతారు. మనసులో ఏదీ దాచుకోకుండా ఉన్నదిఉన్నట్లుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. తాజాగా ఒక ప్రముఖ ఛానల్ పోసానిని ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో పోసానిని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వేయాలని సదరు టీవీ ఛానల్ భావించింది. అయితే సదరు ఛానల్ ప్రశ్నలకు కుండ బద్దలుగొట్టినట్లుగా పోసాని సమాధానం ఇచ్చారు.

సదరు ఛానల్ యాంకర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టే జగన్ కు వ్యతిరేకంగా పని చేశారని భావిస్తున్నారా…? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు పోసాని స్పందిస్తూ తనకు నిమ్మగడ్డ వ్యవహార శైలి ఏ మాత్రం నచ్చలేదని… ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ తో చర్చించకుండా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో నిర్ణయం తీసుకోవడం సరికాదని చెప్పారు.

గతంలో ఏ అధికారి నిమ్మగడ్డలా ప్రవర్తించలేదని… ప్రభుత్వంతో చర్చించకుండా నిర్ణయాలు తీసుకోవడం రాజ్యాంగానికి వ్యతిరేకమేనని అన్నారు. జగన్ సర్కార్ పై కేంద్రంలో దురభిప్రాయం కలిగే విధంగా కేంద్రానికి లేఖ రాయాల్సిన అవసరం నిమ్మగడ్డకు ఎందుకుందని ప్రశ్నించారు. జగన్ సర్కార్ పై నిమ్మగడ్డ వాడిన భాష గురించి అధారాలు ఉన్నాయని తెలిపారు.

దేశ ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి శేష‌న్ సిన్సియ‌ర్ ఆఫీస‌ర్ కాబట్టే ఆయనపై చచ్చేంత వరకు విమర్శలు రాలేదని… నిమ్మగడ్డ రమేశ్ విషయంలో మాత్రం విమర్శలు ఎదురవుతున్నాయని చెప్పారు. ఒక కులానికి చెందిన బీజేపీ నాయకులు ఫైవ్ స్టార్ హోటల్ లో నిమ్మగడ్డను కలవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. నిమ్మగడ్డ వాళ్లతో ఏ విషయాల గురించి చర్చించారో బహిరంగంగా చెప్పాలని అన్నారు.

చంద్రబాబు ఆ ప్రాంతంపై ఆశలొదిలేసుకున్నారా…?

Did Chandrababu lose hope in that area ...?

నవ్యాంధ్రలోని 13 జిల్లాల్లో టీడీపీకి బాగా పట్టున్న ఏరియాల్లో ఉత్తరాంధ్ర ఒకటి. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన రోజు నుండి 2014 ఎన్నికల వరకు తెలుగుదేశానికి ఉత్తరాంధ్ర కంచుకోటగా నిలిచింది. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం టీడీపీ కంచుకోట కాస్తా వైసీపీ కంచుకోటగా మారింది. అధికారంలో ఏ పార్టీ ఉన్నా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు టీడీపీ అనుకూల జిల్లాలుగా పేరు తెచ్చుకోగా 2019 ఎన్నికల ఫలితాల తరువాత ఈ జిల్లాలపై వైసీపీ అనుకూల జిల్లాలుగా ముద్ర పడింది.

కాలం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. కొన్ని సందర్భాల్లో బండ్లు ఓడలు ఓడలు బండ్లు అవుతూ ఉంటాయి. ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ ప్రభ తగ్గుతోంది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో ఉన్న 34 సీట్లలో 28 సీట్లు వైసీపీ సొంతమయ్యాయి. విజయనగరం జిల్లాలో టీడీపీకి ఒక్క స్థానం కూడా దక్కలేదు. అయితే ఎన్నికల ఫలితాల తరువాతైనా తప్పులను సరిదిద్దుకుని టీడీపీ అక్కడ బలపడుతోందా…? అంటే కాదనే సమాధానం వినిపిస్తోంది.

బీసీ వర్గాలు వైసీపీకి అనుకూలంగా ఉండగా ఉత్తరాంధ్రలో టీడీపీ ముఖ్యనేతగా చెప్పుకునే అచ్చెన్నాయుడు ఈ.ఎస్.ఐ కుంభకోణంలో ఇరుక్కున్నారు. శ్రీకాకుళం జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష విశాఖలో ఉండి పార్టీ వ్యవహారాలు నడుపుతున్నారు. విశాఖలోని టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు వైసీపీ వైపుకు చూస్తున్నారు. జగన్ ఉత్తరాంధ్రలోని టీడీపీ నాయకులను వైసీపీలోకి ఆహ్వానిస్తే ఆ పార్టీ అడ్రస్ కూడ గల్లంతైనా ఆశ్చర్యాపోవాల్సిన అవసరం లేదు.

చంద్రబాబు అమరావతే రాజధానిగా ఉండాలని చేస్తున్న వ్యాఖ్యలు కూడా టీడీపీ పాలిట శాపంగా మారాయి. బాబు అనుకూల మీడియా విశాఖ విషయంలో రాస్తున్న విషపు రాతలు టీడీపీపై ప్రజల్లో వ్యతిరేకతను పెంచుతున్నాయి. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు ఆ ప్రాంతంపై ఆశలొదిలేసుకున్నారని టీడీపీ వర్గాల్లోనే వినిపిస్తూ ఉండటం గమనార్హం.

ఆ సమయంలో మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

1

These are the precautions that women should take at that time

ప్రతి ఆడవారిలో నెలసరి సమస్య, చాలా ఇబ్బంది పెట్టే సమస్య. ఉద్యోగం చేసే మహిళలు అయితే ఏకంగా సెలవులే తీసుకుంటారు. ఏ తలనొప్పి, చెవి నొప్పి అయితే బయటకు చెప్తారు కానీ, ఇలాంటి సమస్యలు బయటికి చెప్పడానికి సందేహ పడతారు. కానీ ఇలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ సమయంలో నొప్పిని ఎలా ఎదుర్కోవాలి అనేది తెలుసుకుందాం..

Also Read : గుడ్ న్యూస్.. కరోనాను జయించిన ఎస్పీ బాలు

పీరియడ్ మొదటి రోజు ఏదో ఒక కారణం చెప్పి సెలవు ఎలా తీసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాము. ఇలాంటి సమయంలో అదనంగా సెలవలు ఇస్తే బాగుండు అని చాలా మంది భావిస్తూ ఉంటారు. అయితే కొందరు ఆ సెలవులపై విమర్శలు చేస్తున్నారు. ఇటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల పనిచేసేచోట తమకు ప్రాధాన్యత తగ్గుతుందని వారు భావిస్తున్నారు.

ఒకవేళ మీరు వర్కింగ్ ఉమెన్ అయితే ముందుగానే మీ హ్యాండ్ బాగ్ లో శానిటరీ పాడ్ ఉంచుకోవడం మంచిది. సడెన్ గా పీరియడ్ వచ్చినా మీకు హ్యాండిల్ చేయడానికి చాలా సులువుగా ఉంటుంది. నెలసరి సమయంలో అసౌకర్యానికి గురికావడం సహజమే కాబట్టి, మీ శరీరానికి సౌకర్యవంతమైన బట్టలు ధరించడం చాలా మంచిది. లూజ్ ఫిట్టింగ్ క్లాత్ అయితే ఇంకా మరీ మంచిది.

నెలసరి వచ్చినప్పుడు వేడి నీళ్లు తాగడం వల్ల నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. డీహైడ్రేషన్ అనేది నొప్పులను మరింత తీవ్రతరం చేస్తుంది. ఈ సమయంలో ఎక్కువగా నీళ్ళు తాగడం చాలా మంచిది. అలాగే కాఫీ కి బదులుగా హెర్బల్ టీని తాగడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఇంకా అడిషనల్ రిలీఫ్ కోసం మెగ్నీషియం ను సప్లిమెంట్ గా తీసుకోవచ్చు. మెగ్నీషియం కండరాలను రిలాక్స్ చేస్తుంది. కాబట్టి మెగ్నీషియం సమృద్ధిగా దొరికే పండ్లను తీసుకోవడం మంచిది. నువ్వుల నూనెతో పొత్తికడుపు మీద మసాజ్ చేయడం ద్వారా నొప్పిని తగ్గించవచ్చు. రాత్రంతా మెంతులను నీటిలో నానబెట్టి ఆ నీటిని ఉదయాన్నే తాగడం వల్ల కడుపు నొప్పి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

Also Read : పెళ్లికావడం లేదని పెరుగుతున్న ఆత్మహత్యలు

గుడ్ న్యూస్.. కరోనాను జయించిన ఎస్పీ బాలు

sp balasubrahmanyam
సంగీత సామ్రాజ్యంలో పాటల రారాజుగా కొనసాగుతున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇటీవల కరోనా బారిన పడ్డారు. దీంతో కొద్దిరోజులుగా  ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు. ఈ సమయంలోనే ఆయన ఆరోగ్యంపై విషమించడంతో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించాల్సి వచ్చింది. వైద్యుల కృషి ఫలితంగా తాజాగా బాలు కరోనాను జయించారని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ తన ఇన్ స్ట్రా గ్రాంలో ఓ వీడియో పోస్టు చేశాడు.

Also Read : ఫ్లాష్: సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి కన్నుమూత

ఈ వీడియోలో ఆయన ఎస్పీ బాల సుబ్రమణ్యం ఆరోగ్య వివరాలను వెల్లడించారు. ‘నాన్న ఆరోగ్యం గురించి కొద్దిరోజులుగా అప్డేట్ ఇవ్వలేకపోయాయని.. క్షమించండి.. గతంతో పొలిస్తే, నాన్న ఊపిరితిత్తుల పనితీరు మెరుగవడంతో వెంటిలేటర్ తొలగిస్తారని భావించాం.. అయితే ఇంకా ఇన్ ఫెక్షన్ ఉండటంతో తీయలేదు.. అయితే శుభవార్త ఏంటంటే ఆయనకు కరోనా పరీక్షల్లో తాజాగా నెగిటివ్ వచ్చిందని’ తెలిపారు.

ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. త్వరలోనే ఆయన ఊపిరితిత్తుల సమస్య నుంచి కోలుకుంటారనే ఆశాభావాన్ని చరణ్ వ్యక్తం చేశాడు. ఇక వారాంతంలో అమ్మనాన్న వార్షికోత్సవం ఉండటంతో చిన్న సెలబ్రేషన్స్ చేసినట్లు చెప్పాడు. తన తండ్రి ప్రస్తుతం తన ఐపాడ్ లో క్రికెట్, టెన్నిస్ చూస్తున్నారని తెలిపారు. తన తండ్రికి ఫిజియోథెరపీ కొనసాగుతుందని తెలిపారు.

ఇక గత కొద్దిరోజులు ఆయన ఆరోగ్యం నుంచి కోలుకోవాలని దేవుడికి ప్రార్థనలు చేస్తున్న వారిందరికీ ఈ సందర్భంగా చరణ్ కృతజ్ఞతలు తెలిపారు. వారి ప్రార్థనలతో ఆయన మరింత త్వరగా కోలుకుంటారనే ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా కారణంగా ఆగస్టు 5న చైన్నె ఎంజీఎంలో బాలసుబ్రమ్మణ్యం చేరినప్పటి నుంచి అభిమానులు ఆందోళన చెందుతూనే ఉన్నారు. తాజాగా ఆయన కరోనా నెగిటివ్ రావడంతో ఆయన అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు.

Also Read : రియా వెనుక బాలీవుడ్ హీరోలు?

హీరోగారితో ‘గుత్తా జ్వాల’  నిశ్చితార్థం !

'Gutta Jwala' engagement with a hero

మొత్తానికి బ్యాడ్మింటన్‌ స్టార్‌ గుత్తా జ్వాల మళ్ళీ పెళ్లికి రెడీ అయింది. తన కామెంట్లతో తన బిహేవియర్ తో  సోషల్ మీడియాలో ఎప్పుడూ  హాట్ టాపిక్ అవుతూ ఉండే జ్వాల,  గత కొంత కాలంగా  తమిళ యాక్టర్  విష్ణు విశాల్‌ తో డేటింగ్‌ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఇప్పటికే  సోషల్ మీడియాలో  ఫుల్ పాపులారిటీ కూడా సంపాదించేసింది జ్వాల.  ఆ మధ్య  విష్ణు విశాల్‌తో తన రహస్య సంబంధాన్ని బహిరంగానే ధృవీకరించిన జ్వాల..  వివాహం మాత్రం ఇప్పట్లో చేసుకునే ఆలోచన లేదని.. అయితే ప్రేమలో మాత్రం  మేము చాల లోతులో ఉన్నామని, అలాగే మాది గౌరవంతో కూడుకున్న ప్రేమ అని ఇలా తన ప్రేమ గురించి ఓ థీరినే చెప్పింది.
 
అయితే నేడు జ్వాల పుట్టినరోజు.  తన పుట్టినరోజు వేడుక సందర్భంగా గుత్తా జ్వాల – విష్ణు విశాల్‌ జంట నిశ్చితార్థం చేసుకుంది.  ఇంకా పెళ్లి తేదీని ఇంకా ప్రకటించలేదు.  కొత్త సంవత్సర  వేడుకల్లో గుత్తా జ్వాల – విష్ణు విశాల్‌ జంట కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేసిన ఫోటోలు బయటకు రావడంతో,  మొదటిసారి వీరి గురించి అందరికీ తెలిసింది. ఆ తరువాత  విశాల్ విష్ణు తనను ముద్దాడుతున్న ఫోటోను జ్వాలనే  స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తమ మధ్య ఉన్న బంధాన్ని ప్రపంచానికి సగర్వంగా చాటింది జ్వాల. ఎంతైనా జ్వాల ఇలాంటి విషయాల్లో అసలు మొహమాటపడదు.
 
 కానీ, గుత్తా జ్వాల, విష్ణు విశాల్‌ తో ఎఫైర్‌ పై  నెటిజ‌న్లు మాత్రం  రకరకాల నెగిటివ్ కామెంట్స్ చేశారు. విష్ణు విశాల్‌ తన భార్య రజనీతో విడిపోవడానికి కారణం గుత్తా జ్వాలనేనని  విమర్శిస్తున్నారు. కానీ జ్వాల ఇలాంటి విమర్శలను పెద్దగా పట్టించుకోదు అనుకోండి. జ్వాల గతంలో బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు చేతన్‌ ఆనంద్‌ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.  కానీ ఆ బంధం కొద్దికాలానికి పరిమితం అయింది. ఇప్పుడు హీరో విష్ణు విశాల్‌ తో  మళ్ళీ పెళ్లికి రెడీ అయింది.

పెళ్లికావడం లేదని పెరుగుతున్న ఆత్మహత్యలు

దేశంలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. ప్రేమానుబంధాల వైఫల్యం, కుటుంబ కలహాలు, వరకట్న వేధింపులు, అనారోగ్యం, అప్పుల బాధలు, మానసిక వేదనకు గురికావడం, మద్యానికి బానిస కావడం.. కారణం ఏదైనా వాటి పరిష్కారానికి ఆలోచించాల్సింది పోయి ప్రాణాలను కోల్పోతున్నారు. ఇంకా ఈసారి ఆత్మహత్యల లెక్కల్లో వింతగా పెండ్లి కావడం లేదని యువత చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడినట్లు వెల్లడైంది. ఈసారి జాతీయ నేర గణాంకాల మండలి (ఎన్‌సీఆర్‌‌బీ) విడుదల చేసిన తాజా నివేదికలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. గత 11 ఏండ్లలో ఎప్పుడూ లేని విధంగా అత్యధికంగా 2019లోనే సూసైడ్‌ చేసుకున్నారు. 1,39,123 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు.

దేశంలో ఏ సమస్య వచ్చినా అన్నీ పేదవాడికే. ఎన్‌సీఆర్‌‌బీ రిపోర్టులోనూ అదే వెల్లడించింది. ఎక్కువగా పేదలే ఆత్మహత్యలకు పాల్పడినట్లు చెప్పింది. ఈ జాబితా ప్రకారం.. 1,39,123 మందిలో 92,083 మంది చనిపోగా.. వీరంతా లక్షలోపు ఆదాయం ఉన్నవారే. 41,197 మంది రూ.5 లక్షల్లోపు ఆదాయం ఉన్న వారు ఉన్నారంట. మొత్తం ఆత్మహత్య చేసుకున్న వారిలో 95.8 శాతం లక్ష, ఐదు లక్షల్లోపు ఆదాయం ఉన్న వారేనట.

గతంలో 2011లో 1,35,585 మంది బలవన్మరణానికి పాల్పడగా.. ఆ తర్వాత తగ్గాయి. 2017లో 1,29,887 ఆత్మహత్యలే నమోదయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో పరిశీలిస్తే.. గతేడాది తెలంగాణలో 7,675 మంది, ఏపీలో 6,465 మంది సూసైడ్‌ చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా జరిగిన ఆత్మహత్యల్లో 10 శాతం తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. హైదరాబాద్‌ మహానగరంలో 389 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. కాగా.. సగటు పరంగా చూస్తే దేశంలో తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో నిలిచింది. ఫస్ట్‌ మూడు ప్లేసుల్లో ఛత్తీస్‌గఢ్‌ (26.4), కేరళ (24.3), తెలంగాణ (20.6) శాతంతో నిలిచాయి.

అప్పుల బాధతో మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 5,908 ఊపిరి తీసుకుంటే తెలంగాణలో 989 మంది, ఏపీలో 828 మంది బలయ్యారు. పరీక్షలు తప్పామన్న బాధతో 2,744 మంది బలిపీఠం ఎక్కారు. మానసిక ఆందోళనలతో 11,009 మంది, కుటుంబ సమస్యలతో, అనారోగ్యంతో ఆత్మహత్యలు చేసుకున్నారు. కాగా.. పెళ్లి కావడం లేదని 2,331 మంది ప్రాణాలు తీసుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.

కంగనా విషయంలో కేంద్రం సంచలన నిర్ణయం… ?

Center government sensational decision in Kangana case

సాధారణంగా కేంద్రం జెడ్ కేటగిరీ, వై కేటగిరీ భద్రత రాజకీయ నాయకులకు కల్పిస్తుందనే సంగతి తెలిసిందే. అయితే తాజాగా కేంద్ర హోం శాఖ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ కు వై కేటగిరీ భద్రత కల్పించేందుకు సిద్ధమైంది. కంగనా ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్ తో పోలుస్తూ చేసిన వ్యాఖ్యల వల్లే కేంద్ర హోం శాఖ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. కాస్త భోళాతనం ఉన్న కంగనా రనౌత్ ఏ విషయంలోనైనా కుండ బద్దలుగొట్టినట్లుగా మాట్లాడుతుంది.

Also Read : మాజీ హాట్ బ్యూటీకి కరోనా.. ఆ హీరో వల్లే ! 

ముంబైను పీవోకేతో పోల్చటంతో గత కొన్ని రోజులుగా కంగనా రనౌత్ కు పెద్ద ఎత్తున బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. కొందరు ఫోన్ కాల్స్ లో ఆమెను చంపేస్తున్నామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. మరోవైపు కంగనా ఈ నెల 9వ తేదీన ముంబై పర్యటన పెట్టుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కంగనా ముంబై పర్యటన ఏ మాత్రం సేఫ్ కాదని తెలిసినా ఆమె మాత్రం వెనక్కు తగ్గడం లేదు.

ప్రస్తుత పరిస్థితుల్లో కంగనా ముంబై పర్యటన అధికారులను సైతం టెన్షన్ పెడుతుండటం గమనార్హం. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జైరాం థాకూర్ కంగనా సోదరి, తండ్రి తనను వ్యక్తిగతంగా కలిసి కోరడంతో కేంద్రంతో మాట్లాడి వై కేటగిరీ భద్రత ఏర్పాటు చేయించామని అన్నారు. కేంద్ర‌హోం మంత్రిత్వ శాఖ వ‌ర్గాలు కంగానాకు ఒక ప‌ర్స‌న‌ల్ సెక్యూరిటీ ఆఫీస‌ర్‌, 11 మంది పోలీసులు భద్రతగా ఉంటారని తెలిపారు.

జూన్ నెల 14వ తేదీన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ముంబై పోలీసుల విచార‌ణ తీరును ఈ కేసు విషయంలో తప్పు బడుతూ కంగనా చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. అయితే కేంద్రం భద్రత కల్పించినా ఆమె ముంబై పర్యటన విషయంలో ఉత్కంఠ నెలకొంది.

Also Read : ‘బిగ్ బాస్ 4’  కంటెస్టెంట్ల కన్నీటి గాథలు ! 

బిగ్ బాస్ కు చైనా స్పాన్సరరా.. దుమారం?

 తెలుగు రియల్టీ షో బిగ్ బాస్ ఆదివారం ప్రారంభమైంది. ఎన్నో అంచనాల మధ్య ప్రారంభమైన ‘బిగ్ బాస్-4’ తొలిరోజు నుంచి మిక్స్ డ్ టాక్ ను సొంతం చేసుకుంది. బిగ్ బాస్-3 సీజన్ కు హోస్టుగా వ్యవహరించిన కింగ్ నాగార్జుననే నాలుగో సీజన్ కూడా హోస్టుగా వ్యవహరిస్తున్నాడు. డ్యూయల్ రోల్స్ చేస్తూ నాగార్జున హోస్ట్ చేయడం ఆకట్టుకుంది. తొలిరోజు 16మంది కంటెస్టుల పరిచయం కార్యక్రమం సాఫీగా సాగింది.

16వారాలపాటు బిగ్ బాస్-4 సీజన్ సాగనుంది. ఆయా రంగాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న 16మంది కంటెస్టులను బిగ్ బాస్-4 సీజన్లో సందడి చేయనున్నారు. వీరితోపాటు మరికొందరు వైల్డ్ కార్డుతో ఎంట్రీ ఇవ్వనున్నారు. వచ్చేవారం నుంచి బిగ్ బాస్ టాస్కులు ప్రారంభం కానున్నారు. దీంతో బిగ్ బాస్ ప్రేక్షకులను ఎలా అలరిస్తాడో అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ‘బిగ్ బాస్’ నిర్వాహాకులు స్పాన్సర్స్ విషయంలో ఓ తప్పుచేసినట్లు తెలుస్తోంది.

అందరినీ తప్పులను వెతికి పట్టుకొని ఎలిమినేషన్ చేసే ‘బిగ్ బాస్’ తానే ఓ తప్పుచేయడం బుల్లితెర ప్రేక్షకులకు మింగుడు పడటం లేదు. చైనాకు చెందిన ఒప్పోతో బిగ్ బాస్ స్పాన్సర్ షిప్ చేసుకోవడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భారత్-చైనా సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో బీసీసీఐ లాంటి పెద్ద సంస్థలు సైతం ఒప్పోతో స్పాన్షన్ షిష్ ను వదులుకున్నాయి.

కేంద్రం ప్రభుత్వం సైతం చైనాకు చెందిన యాప్స్, కంపెనీల డీల్ రద్దు చేసుకుంది. ఇలాంటి నేపథ్యంలో బిగ్ బాస్ నిర్వహాకులు చైనాకు చెందిన ప్రముఖ మోబైల్ సంస్థ ఒప్పోతో డీల్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ‘బిగ్ బాస్’ ఎలాంటి సమాధానం చెబుతాడో వేచిచూడాల్సిందే..!

మాజీ హాట్ బ్యూటీకి కరోనా.. ఆ హీరో వల్లే ! 

Corona to the former hot beauty .. because of that hero!
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనాకి  ముగింపు ఎప్పుడనేది ఇప్పట్లో ఎవ్వరూ  చెప్పలేని పరిస్థితిలో ఉంది ప్రపంచం. రోజురోజుకూ  కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతోన్నాయి. జనం కూడా కరోనా పాజిటివ్ అనే పదాన్ని తమ రోజువారీ పదాల్లో ఒకటిగా అలవాటు చేసేసుకున్నారు.  మరోపక్క  కరోనాతో పోరాడలేక ప్రాణాలు కోల్పోతున్న వారూ ఉన్నారు. అయితే చాలామంది పదిహేను రోజులకే కరోనా నుండి బయటపడుతుంటంతో ఓ ధైర్యం వచ్చేసింది జనాల్లో. మొత్తానికి ఈ కరోనా సెలబ్రెటీలను కూడా వదిలిపెట్టకుండా  అందర్నీ కమ్మేస్తూ వస్తోంది.
ఇప్పటికే రాజమౌళి అండ్ అయన ఫ్యామిలీతో పాటు బాలీవుడ్ లెజెండ్  ‘బిగ్ బీ అమితాబ్ బచ్చన్’ కుటుంబం పాటు డైరెక్టర్ తేజ, నిర్మాత దానయ్య, హీరోయిన్ జెనీలియా అలాగే స్టార్ హీరో విశాల్, మరియు హీరో అర్జున్ కుమార్తె  నటి ఐశ్వర్య అర్జున్ కూడా కరోనా మహమ్మారి బారిన పడి కోలుకున్నారు.  ఇక నిన్న  బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ కు కరోనా పాజిటివ్ రావడంతో.. ఇక అందరూ అర్జున్ కపూర్ ప్రియసి మాజీ ఐటమ్ బ్యూటీ మలైకా అరోరాకి కూడా కరోనా సోకే అవకాశం ఉందని అనుమానించారు. ఆ అనుమానమే నిజం అయింది,  ఆమెకు కూడా కరోనా వచ్చిందని.. మలైకా సిస్టర్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది.
ఈ  బాలీవుడ్ ముదురు హీరోయిన్  బాలీవుడ్ స్టార్ హీరో  సల్మాన్ ఖాన్ ఇంటి కోడలు అయినా..  అర్జున్ కపూర్ తో ప్రేమలో పడి సల్మాన్ ఇంటి నుండి బయటకు వచ్చేసింది. సల్మాన్ తమ్ముడికి హ్యాండ్ ఇచ్చి మరీ అర్జున్ తో ప్రేమలో మునిగితేలుతుంది. అసలు మలైకాకు టీనేజ్ దాటిన  కొడుకు కూడా ఉన్నాడు. అయినా  మలైకా మాత్రం అర్జున్ కపూర్ తో ఇంకా సన్నిహితంగానే ఉంటుంది. చివరకు అతని ద్వారానే కరోనా కూడా తెచ్చుకుంది.
అసలు ఈ కరోనా ప్రముఖులకు కూడా ఎలా వస్తోందో అర్ధం కావడం లేదు. ఎంతో జాగ్రత్తగా ఉంటూ కరోనా పై పూర్తీ అవగాహన ఉన్న ప్రముఖులకే ఇలా ఈజీగా కరోనా వస్తోన్నప్పుడు ఇక సామాన్యల పరిస్థితి ఏమిటి ?  ఏమైనా ఈ కరోనా  ఆందోళనకు గురి చేస్తోంది. మన  జీవితాల్లో ఇప్పటికే చాల మార్పులు తీసుకువచ్చేసింది.