
కరోనా కాలంలో ప్రతీఒక్కరు ఇంటికే పరిమితం అవడంతో కొద్దిరోజులుగా టెలివిజన్ ప్రసారాలను భారీ టీఆర్పీ వచ్చింది. ఇది నిర్వాకులకు శుభవార్తే అయినప్పటికీగా తాజాగా ప్రకటించిన టీఆర్పీ రేటింగ్ మాత్రం అన్ని ఛానళ్లకు షాకిచ్చాయి. 34వ వారానికి సంబంధించిన రేటింగ్స్ గత వారంతో పోలిస్తే 540పాయింట్ల నుంచి 413కు పడిపోయింది. న్యూస్, ఎంటటైన్మెంట్ అనే తేడా లేకుండా అన్ని కార్యక్రమాలు టీఆర్పీలో వెనుకబడటంపై బిగ్ బాస్ నిర్వాహకులు సైతం ఆలోచనలు పడినట్లు తెలుస్తోంది.
‘స్టార్ మా’లో ఈ ఆదివారం నుంచి ‘బిగ్ బాస్-4’ సీజన్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో నిర్వహాకులతోపాటు మా యాజమాన్యం భారీ అంచనాలను పెట్టుకుంది. ‘బిగ్ బాస్-4’ కోసం గత కొద్దిరోజులుగా స్టార్ మా విపరీతంగా పబ్లిసిటీ చేసింది. అయితే కార్యక్రమం రోజున మాత్రం ఛానల్ యాజమాన్యం అనుకున్న టీఆర్పీని ఆదుకోలేదని తెలుస్తోంది. దీంతో నిర్వహాకులు సైతం ఆలోచనలో పడ్డారు. కార్యక్రమాన్ని మరింత హుషారుగా నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు.
ఈ సమయంలోనే స్టార్ మాలోని ‘కార్తీక దీపం’ సీరియల్ టాప్ ప్లేసులో దూసుకెళుతోంది. అత్యధిక టీఆర్పీతో కార్తీక దీపం మొదటి ఆరు స్థానాల్లో నిలువడం గమనార్హం. 18పాయింట్లకు పైగా వ్యూయర్ షిప్ సాధించి ఎప్పటిలానే నెంబర్ వన్ సీరియల్‌గా కార్తీక దీపం తొలి స్థానాన్ని నిలబెట్టుకుంది. వంటలక్క మీద అభిమానంతోనే ప్రేక్షకులంతా టీవీలకు అతుక్కుపోతున్నారు. దీంతో ఆ సీరియల్ టాప్ ప్లేసులో దూసుకెళుతూ సత్తా చాటుతోంది.
తాజాగా బిగ్ బాస్ షో ప్రారంభమైంది. త్వరలోనే ఐపీఎల్ మ్యాచులు ప్రారంభం కానుండటంతో టీవీ టీఆర్పీలు పెరిగే అవకాశం కన్పిస్తుంది. లాక్డౌన్ సమయంలో అందరు ఇళ్లకే పరిమితం కావడంతో టీఆర్పీ రేట్ అమాంతం పెరగడంతో టీవీ ఛానళ్లు సంబరాలు చేసుకున్నాయి. అయితే కిందటి వారంలో వర్షాలు బాగాపడటం.. విద్యుత్ సరఫరాలో అంతరాయం.. డీటీహెచ్ సిగ్నల్స్ సరిగా లేకపోవడంతో టీఆర్పీ రేట్ తగ్గిందని టెలివిజన్లు ఛానళ్లు అంచనా వేస్తున్నాయి.
టీఆర్పీ ఒకవారం పెరగడం.. మరోక వారం తగ్గడం కామనేనని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా బిగ్ బాస్ సీజన్ కూడా ప్రారంభం కావడంతో టీఆర్పీ పెరుగుతుందని పలువురు అంచనా వేస్తున్నారు. అయితే టీఆర్పీ రేటులో బిగ్ బాస్.. వంటలాక్కను బీట్ చేస్తాడా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది.