
కొన్ని రోజుల క్రితం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీకి మొదటి స్థానం వచ్చింది ఆ సమయంలో టీడీపీ, వైసీపీ పార్టీలు తమ వల్లే ఏపీకి మొదటి స్థానం వచ్చిందని గొప్పలు చెప్పుకున్నాయి. తమ పార్టీలే ఫస్ట్ ర్యాంక్ రావడానికి కారణమని విశ్లేషణలు సైతం ఇచ్చాయి. అయితే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీకి తొలి ర్యాంకు రాగా అక్ష్యరాస్యత విషయంలో బీహార్ కంటే తక్కువ ర్యాంకులో ఏపీ ఉంది.
Also Read : జగన్ ను ఢీకొంటున్న ఒకే ఒక్కడు ఇతడు!
అయితే అటు తెలుగుదేశం పార్టీ నేతలు, వైసీపీ నేతలు అక్షరాస్యత విషయంలో వచ్చిన ర్యాంకుల గురించి ప్రస్తావించడం గమనార్హం. సాధారణంగా దేశంలో అక్షరాస్యత విషయంలో కేరళ తొలి స్థానంలో బీహార్ చివరి స్థానంలో నిలుస్తూ ఉంటాయి. అయితే ఈ సంవత్సరం మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యతలో చివరి స్థానంలో ఉండటం గమనార్హం. 96.2 అక్షరాస్యత శాతంతో కేరళ తొలి స్థానంలో ఉంది.
బీహార్ రాష్ట్ర అక్షరాస్యత రేటు 70.9 శాతం కాగా ఏపీ అక్షరాస్యత శాతం 66.4 శాతం కావడం గమనార్హం. అక్షరాస్యతలో జాతీయ సగటుతో పోలిస్తే ఏపీ అధ్వాన్నమైన పరిస్థితిలో ఉండటం గమనార్హం. జాతీయ అక్షరాస్యత సగటు 77.7 శాతం కాగా ఏపీ అక్షరాస్యత శాతం దాదాపు 10 శాతం తక్కువగా ఉండటం గమనార్హం. జగన్ సర్కార్ విద్య కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా, వివిధ పథకాలు అమలు చేస్తున్నా అనుకున్న ఫలితాలను సాధించడంలో విఫలమవుతోంది.
జగన్ సర్కార్ ఇప్పటికైనా ఈ ర్యాంక్ విషయంలో దృష్టి పెట్టాల్సి ఉంది. అక్షరాస్యత విషయంలో ఇతర రాష్ట్రాలు ముందుకెళుతుంటే ఏపీ వెనుకబడటానికి గల కారణాలను అన్వేషించాల్సి ఉంది. లేకపోతే మాత్రం భవిష్యత్తులో ఏపీ అక్షరాస్యత శాతం మరింత దిగజారే అవకాశం ఉంది.
Also Read : బాబుకు షాక్.. అమరావతిపై జగన్ సీబీ‘ఐ’!