ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళ ఆమె.. ఒక మామూలు కుటుంబం నుంచి సరైన కనీస సౌకర్యాలు కూడా లేని ఒక ఆడపిల్ల.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించడం వెనుకున్న కష్టం గురించి, ఆమె వెనుకున్న పట్టుదల గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. ఆమె కరణం మల్లీశ్వరి. వెండితెరపై బయోపిక్స్ హవా నడుస్తోన్న ఈ కాలంలో ఇలాంటి గొప్ప వ్యక్తుల జీవిత చరిత్ర, వారి వారి గొప్పతనాన్ని చెప్పకపోతే ఎలా..? వాళ్ళు సాధించిన విజయాలను వెండితెరపై చూపించకపోతే ఎలా..? అందుకే నేటితరం ప్రేక్షకుల కోసం ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళ కరణం మల్లీశ్వరి బయోపిక్ ను కోన వెంకట్ నిర్మిస్తున్నారు. అయినా మల్లీశ్వరి అంటే అవార్డులు కాదు.. ఒక స్ఫూర్తి. ఆమె సాధించిన వాటి వెనుక ఉన్న కన్నీళ్లు కష్టాలు అవరోధాలు అన్నిటికి మించి కంటతడి పెట్టించే ఎన్నో అంశాలు ఆమె జీవితంలో ఉన్నాయి.
Also Read: డ్రగ్స్ వ్యవహారంలో ప్రభాస్ హీరోయిన్ అరెస్ట్ ?
అయితే ఈ బయోపిక్ గురించి కరణం మల్లీశ్వరి మనోగతం వింటుంటేనే.. మారుమూల గ్రామాల్లోని నిరుపేద ఆడపిల్లలకు గొప్ప స్ఫూర్తిలా అనిపిస్తోంది. ఆడపిల్లనైతే మాత్రం కొన్నిటికే పరిమితం అని ఎందుకు అనుకోవాలి ? నేను నా చిన్నతనంలో ఇలాగే అనుకున్నాను. ఎవరేమన్నా లక్ష్యపెట్టకుండా కష్టపడ్డాను. కానీ నాకు కండలు తిరిగిన దేహం లేదు, దేహం కోసం కొండంత బరువులు ఎత్తేదాన్ని. బలం కోసం అందరూ ఆహారం తింటారని నేను అప్పుడు అనుకోలేదు. మనకు ఉన్న దానిలోనే మనం సాధించాలి అనుకున్నాను. నేను నా శారీరక సామర్థ్యం కోసం నిరంతరం వ్యాయామాలు చేసేదాన్ని. అలాగే అప్పట్లో నా ఆహారం ఏమిటో తెలుసా అంబలి. అలాగే బచ్చలికూర, మునగాకు ఇవే నాకు అప్పట్లో ప్రొటిన్ ఫుడ్. ఏమైనా నా మనోబలమే ముందుకు నడిపింది నన్ను. నా దారిలో కూడా ఎవరికీ తెలియని ముళ్లపొదలు అడ్డొచ్చాయి. నాకు కూడా రాళ్లు గుచ్చుకున్నాయి. అన్నీ ఓర్చుకున్నా. ఏదైనా సాధించాలి అంటే.. ముందు ఓపిక ఉండాలి.. అన్నిటికీ మించి కష్టాలను భరించడం నేర్చుకోవాలి. అంతేగాని ఎవ్వరికీ దాసోహం కాకండి’ అంటూ కరణం మల్లీశ్వరి తెలిపింది.
Also Read: బ్రేకింగ్: సుశాంత్ కేసులో రియా అరెస్ట్
మొత్తానికి కరణం మల్లీశ్వరి జీవితంలో కూడా చాలా విశేషాలు ఉన్నట్లు ఉన్నాయి. అప్పట్లో ఆమెకు కూడా వేధింపులు ఎదురయ్యాయి అట. వాటిని ఆమె ఎలా ఎదుర్కొంది అనే అంశాన్ని కూడా ఈ సినిమాలో చూపించనున్నారు. నిజానికీ కరణం మల్లీశ్వరి బయోపిక్ మాట ఇప్పటిది కాదు. ఐదేళ్లుగా చిత్రబృందం ఈ బయోపిక్ చేయాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంది. రచయిత, నిర్మాత కోన వెంకట్, దర్శకురాలు సంజనారెడ్ఢి ఎట్టకేలకు ఈ బయోపిక్ ను నవంబర్ నుండి మొదలుపెట్టాలని చూస్తున్నారు. ఏదో రెగ్యులర్ సినిమా ఫార్ములాతో కాకుండా, ఆడపిల్లలకు స్ఫూర్తి కలిగించేలా ఈ బయోపిక్ ను కోన వెంకట్ సిద్ధం చేస్తున్నారట.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Olympic medallist karnam malleswaris biopic latest updates
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com