
ఇతర రాజకీయ నాయకులతో పోలిస్తే గంటా శ్రీనివాసరావు చేసే రాజకీయాలు ఎప్పుడూ చిత్రవిచిత్రంగా ఉంటాయి. ఆయన ప్రతిసారి పోటీ చేసే నియోజకవర్గంలో మార్పును కోరుకుంటూ ఉండటంతో పాటు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా ఉండటానికి కుదిరితే ఆ పార్టీలో చేరడానికి మొగ్గు చూపుతూ ఉంటారు. అయితే గంటాకు వైసీపీలో చేరడానికి సమయం అనుకూలించడం లేదనే చెప్పాలి.
Also Read : జగన్ ను ఢీకొంటున్న ఒకే ఒక్కడు ఇతడు!
2019 ఎన్నికల ముందు నుంచి వైసీపీలో చేరడానికి గంటా శ్రీనివాసరావు ప్రయత్నిస్తున్నారు. 2019 ఎన్నికల ముందు గంటా శ్రీనివాసరావు శిష్యుడు ఆవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరడంతో ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే ఎన్నికల ఫలితాల తరువాతైనా పార్టీ మారాలని గంటా ప్రయత్నిస్తుంటే ఆయనకు అనుకోని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి వల్లే వైసీపీలో గంటా చేరిక అంతకంతకూ ఆలస్యమవుతోందని తెలుస్తోంది.
గంటా విజయసాయిరెడ్డి ద్వారా పార్టీలో చేరే ప్రయత్నం చేసి ఉంటే అనుకూల ఫలితాలు ఉండేవని… అలా కాకుండా బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి నేతల ద్వారా గంటా ప్రయత్నం చేయడంతో ఆయనకు జగన్ నుంచి పార్టీలోకి గ్రీన్ సిగ్నల్ లభించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో గంటా సన్నిహితులు విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం వల్లే ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడిందని తెలుస్తోంది.
అందువల్లే గంటా విజయసాయిరెడ్డిని ప్రసన్నం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నా ఆయన ప్రయత్నాలు ఫలించడం లేదు. గంటా ఈ సంవత్సరం చివరి నాటికి వైసీపీలో చేరడం సాధ్యం కాకపోతే బీజేపీలోకి వెళ్లాలని అనుకుంటున్నారు. మరి గంటా వైసీపీలో చేరతాడో లేదో విజయసాయిరెడ్డి గంటా విషయంలో మెత్తబడతాడో లేదో చూడాల్సి ఉంది.
Also Read : బాబుకు షాక్.. అమరావతిపై జగన్ సీబీ‘ఐ’!