Home Blog Page 77

రామ్ చరణ్ పై ప్రశంసల వర్షం కురిపించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ట్వీట్ వైరల్..

Modi praises Ram Charan
Modi praises Ram Charan

Modi praises Ram Charan: మెగాస్టార్ చిరంజీవి కి రామ్ చరణ్ ని చూసినప్పుడల్లా ఎంత పుత్రోత్సాహం కలుగుతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 40 ఏళ్ళ తన సుదీర్ఘ సినీ కెరీర్ లో చిరంజీవి కూడా చెయ్యలేని పాత్రలు , ఆయన సాధించలేని రికార్డులు క్రియేట్ చేస్తూ రామ్ చరణ్ గ్లోబల్ వైడ్ గా సొంతం చేసుకుంటున్న ఫేమ్ ని చూసి ఆయన ఎంతగానో మురిసిపోతుంటాడు. నిన్న హైదరాబాద్ లో జరిగిన ‘పెద్ది’ సక్సెస్ ఫంక్షన్ లో చిరంజీవి తన కొడుకు గురించి గర్వంగా మాట్లాడుతూ ఎంతో సంతోషించాడో మన కళ్లారా చూశాము . సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ ప్రసంగానికి సంబంధించిన వీడియో నే చక్కర్లు కొడుతోంది. ఇదంతా పక్కన పెడితే మొన్న రామ్ చరణ్ ముంబై లో జరిగిన ఒక సమ్మిట్ కి హాజరైన సంగతి తెలిసిందే.

ఈ సమ్మిట్ కి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా హాజరయ్యారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ రామ్ చరణ్ ని ‘న్యూ ఏజ్ మెగాస్టార్’ గా సంబోదించాడు. దీనిపై నిన్న చిరంజీవి సక్సెస్ ఈవెంట్ లో చాలా గొప్పగా చెప్పుకొచ్చాడు. ఇప్పుడు కాసేపటి క్రితమే ఆయన తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కూడా ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టాడు, జనుల గనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ ‘ అనే పద్యాన్ని షేర్ చేసాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘నిన్న మన భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న రిపబ్లిక్ టీవీ కార్యక్రమంలో రామ్ చరణ్ ని న్యూ ఏజ్ మెగాస్టార్ అని సంబోధించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఇలాంటి ప్రతిష్టాత్మక వేదికలపై చరణ్ కి లభిస్తున్న గుర్తింపు , గౌరవం చూస్తుంటే ఒక తండ్రిగా ఎంతో గర్వంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘తన కృషి , అంకితభావం , నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రమే కాదు , దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపు కూడా సంపాదించుకోవడం నిజంగా సంతోషకరం. ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరింపచెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ ఆయన చాలా భావోద్వేగం తో ట్వీట్ వేశారు. దీనిపై సోషల్ మీడియా లో అభిమానులు ఆనందిస్తుంటే , యాంటీ ఫ్యాన్స్ మాత్రం ట్రోల్స్ చేస్తున్నారు. ఇంత చిన్న దానికే చిరు ఇంతలా మురిసిపోతున్నాడు , రేపు నేషనల్ అవార్డు వస్తే ఇక పట్టుకోలేము ఏమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఆరేళ్ల పాపపై ఘోరం.. ఒక్క ఆధారం లేదు.. "మేరీ" వచ్చింది.. కథ మొత్తం మారిపోయింది..

Mary solves six year old child case
Mary solves six year old child case

Mary solves six year old child case: ఇది సభ్య సమాజం తలదించుకునే సంఘటన. మనిషి పుట్టుక పుట్టిన ప్రతి ఒక్కరు బాధపడే ఘటన. ఆరు సంవత్సరాల బాలికపై ఓ దుర్మార్గుడు దారుణానికి పాల్పడ్డాడు. ఆ ఘోరం మామూలుది కాదు. మాటలకందనిది. అంతటి క్రూరమైన ఘటనకు పాల్పడిన అతడు.. దర్జాగా తప్పించుకుని తిరుగుతున్నాడు. పోలీసులకు ఫిర్యాదు అందినప్పటికీ ఆధారం లేకపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పోలీసులకు తట్టిన ఒక ఆలోచన కేసు స్వరూపాన్ని మొత్తం మార్చేసింది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంబాల్ జిల్లా బాబ్రా ప్రాంతంలో ఓ ఆరు సంవత్సరాల బాలికపై ఓ దుర్మార్గుడు దారుణానికి పాల్పడ్డాడు. వాడి పేరు సందీప్. ఆ ఘోరానికి పాల్పడిన తర్వాత వాడు అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు రంగంలోకి దిగారు. అత్యంత వేగవంతంగా విచారణ చేపట్టారు. అక్కడ ఒక స్కార్ఫ్ మినహా పెద్దగా ఆధారాలు లేవు. సీసీ కెమెరాలు కూడా లేకపోవడంతో ఈ కేసు అత్యంత సవాల్ గా మారింది. ఆధారాలు దొరకపోవడంతో పోలీసులు అయోమయంలో పడ్డారు.

కేసు ను త్వరగా పరిష్కరించాలని పోలీసులు వెంటనే.. ఒక అద్భుతమైన ఆలోచనకు శ్రీకారం చుట్టారు. మేరీ అనే జాగిలాన్ని రంగంలోకి దింపారు. అది అద్భుతమైన జాగిలం. ఏదైనా వెంటనే పసిగడుతుంది. అంతేకాదు క్షణాల్లోనే దాని చాకచక్యంతో పోలీసులకు ఆధారాలను అందిస్తుంది. ఈ కేసులో కూడా అలానే వ్యవహరించింది. మేరీని రంగంలోకి దింపడమే ఆలస్యం.. అది సంఘటన స్థలం వద్ద లభించిన స్కార్ఫ్ వాసన చూసి వెంటనే పరుగులు పెట్టింది. కేవలం నిమిషాల వ్యవధిలోనే ఆ దుర్మార్గుడిని పట్టించింది.

స్కార్పు వాసన చూసిన మేరీ సందీప్ ఇంటి వైపు పరుగులు పెట్టింది. పోలీసులు దానిని అనుసరించారు. ఇదే క్రమంలో సందీప్ పోలీసులను చూసి పారిపోవడం మొదలు పెట్టాడు. దీంతో వెంటనే పోలీసులు కాల్పులు జరిపారు. ఒక బుల్లెట్ సందీప్ కాలు నుంచి దూసుకుపోయింది. సందీప్ ను పట్టించిన మేరీకి పోలీసులు పదివేల రూపాయల చెక్ అందించారు.. సీసీ కెమెరాలు లేవు. ఎటువంటి ఆధారం లేదు. ఒక స్కార్ఫ్ మాత్రమే అక్కడ ఉంది. అయినప్పటికీ పోలీసులు వేగవంతంగా విచారణ చేపట్టారు. త్వరగా ఆ దుర్మార్గుడిని పట్టుకున్నారు.

సొరంగం ఉన్నా మోడీ అందులోంచి ఎందుకు వెళ్లలేదు?

Why Modi did not use Tunnel
Why Modi did not use Tunnel

Why Modi did not use Tunnel: ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 21న నీటి విద్యార్థుల ప్రయాణానికి ఆటంకం కలగకూడదని ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో నిరీక్షించారు. అయితే దీనిపై కొంతమంది సామాజిక మాధ్యమాల్లో ప్రధాని నరేంద్ర మోడీ అత్యధికంగా స్వీయప్రచారం చేసుకుంటున్నారని ఆరోపణలు చేస్తున్నారు. జూన్ 21న నీట్ పరీక్ష జరుగుతున్న సమయంలో మోడీ తన ప్రయాణాన్ని కొద్దిసేపు వాయిదా వేసి ఎయిర్‌పోర్ట్‌లో నిలిచిపోయారని, దీనిని మీడియా దృష్టిని ఆకర్షించడానికి ఉపయోగించుకున్నారని వారు విమర్శిస్తున్నారు. అయితే ఈ విమర్శల వెనుక ఉన్న వాస్తవాలను పరిశీలిస్తే, చాలా వరకు అపోహలు, అసంపూర్ణ సమాచారం కారణంగా ఏర్పడినట్లు కనిపిస్తోంది.

విమర్శల నేపథ్యం..
నీట్ పరీక్ష రోజున మోదీ ఎయిర్‌పోర్ట్‌లో కొంతసేపు ఆగిపోవడం సాధారణ షెడ్యూల్ సర్దుబాటు కావచ్చు. కానీ దీనిని తక్షణం ‘ప్రచారం’గా అభివర్ణించి విమర్శలు చేయడం జరిగింది. ఇలాంటి విమర్శలు తరచూ సందర్భోచిత వాస్తవాలను పూర్తిగా పరిగణనలోకి తీసుకోకుండా ఏర్పడుతున్నాయి. ప్రత్యేకించి, ప్రధాని భద్రతా వ్యవస్థ, విమానాశ్రయాల వినియోగ విధానం వంటి అంశాలు చర్చలోకి రావడం లేదు.

సొరంగ మార్గం ఉందా?
సర్దార్ జంగ్ విమానాశ్రయం నుంచి ప్రధాని నివాసానికి సొరంగ మార్గం ఉంది. దీని నిర్మాణం 2010లో ప్రారంభమై 2014లో పూర్తి చేశారు. ఈ మార్గం పూర్తిగా భద్రతా కారణాలతో నిర్మించబడింది. అయితే జూన్ 21న మోడీ ల్యాండ్ అయినది ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే. సర్దార్ జంగ్ విమానాశ్రయంలో కాదు. అందువల్ల ఆ సొరంగ మార్గం ఈ నిర్దిష్ట సంఘటనకు నేరుగా వర్తించదు.

విమానాశ్రయాల మధ్య దూరం..
ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దేశీయ, అంతర్జాతీయ విమానాలకు ప్రధాన కేంద్రం. విదేశీ ప్రయాణాల సందర్భంగా ప్రధాని సాధారణంగా ఇక్కడే రాకపోకలు చేస్తారు. సర్దార్ జంగ్ విమానాశ్రయం ప్రధానంగా హెలికాప్టర్లు, చిన్న విమానాలు, వీవీఐపీల హెలికాప్టర్ ఆపరేషన్లకు మాత్రమే ఉపయోగపడుతుంది. ప్రధాని మోదీ ఈ విమానాశ్రయాన్ని తన సాధారణ విమాన ప్రయాణాలకు వినియోగించుకోవడం లేదు.

ఇందిరా గాంధీ విమానాశ్రయం నుండి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఒక సురక్షిత స్థానానికి చేరుకుని, అక్కడి నుండి సొరంగ మార్గం ద్వారా నివాసానికి వెళ్లే వీలు ఉన్నప్పటికీ, ఆ రోజు ల్యాండింగ్ ఇందిరా గాంధీ వద్దే జరిగింది. కాబట్టి సొరంగ మార్గం గురించి చేసే చర్చ ఈ సందర్భంలో అసంబద్ధం.

వాస్తవాలను పరిశీలిస్తే, మోదీ ఎయిర్‌పోర్ట్‌లో ఆగడం ప్రచారం కోసం చేసిన చర్య అని నిరూపించడం కష్టం. ఇది భద్రతా ప్రోటోకాల్‌లు, షెడ్యూల్ సర్దుబాట్లు లేదా ఇతర కార్యాచరణ అవసరాల వల్ల జరిగి ఉండవచ్చు. విమర్శకులు విమానాశ్రయాల స్వభావం, ప్రధాని యొక్క సాధారణ ప్రయాణ విధానాలు, భద్రతా వ్యవస్థల గురించి పూర్తి సమాచారం లేకుండా విమర్శలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. వాస్తవాల ఆధారంగా ఆరోపణలు చేయాలి.

పెద్దిరెడ్డి ఫ్యామిలీ సైలెన్స్.. ఏంటి కథ?!

Peddireddy Family
Peddireddy Family

Peddireddy family silence: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్లు తెగ బాధపడుతున్నారట. రెండేళ్లు అవుతున్న జగన్ వైఖరిలో మార్పు రాకపోవడంతో వారు పునరాలోచనలో పడ్డారట. ఇక జగన్ తో నడిస్తే తమకు నష్టం అన్న నిర్ణయానికి వచ్చారట. అందుకే వీలైనంత త్వరగా పార్టీ నుంచి బయట పడాలన్న ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే ప్రయత్నంలోనే ఉంది. కానీ జగన్ వెళ్తున్న మార్గం మాత్రం సీనియర్లకు అంతు పట్టడం లేదు. ఆది నుంచి అదే మార్గంలో వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదని చెప్పి ఏకంగా అసెంబ్లీకి డుమ్మా కొట్టారు. చంద్రబాబు మాదిరిగా సభకు వెళ్లి.. ఆయన భావిస్తున్నట్టుగా అవమానాలు ఎదురైతే.. అప్పుడు బయటకు వచ్చి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాన్ని వినిపించారు సీనియర్లు. కానీ దానిని తిరస్కరించారు జగన్మోహన్ రెడ్డి. అయితే సీనియర్ల మాటలు అస్సలు వినడం లేదు. ఇలా అయితే పుంజుకోవడం కష్టమన్న భావనకు సీనియర్లు వచ్చారు. అందుకే జగన్మోహన్ రెడ్డి మంచి దూరంగా వెళ్లాలని భావిస్తున్నారు. అటువంటి నేతల్లో జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గరగా ఉన్న నేతలు సైతం ఉండడం విశేషం.

పెద్దగా యాక్టివ్ లే..
గత కొంతకాలంగా సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దగా బయటకు కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వంపై ఎటువంటి కామెంట్స్ చేయడం లేదు. ఎంతవరకు ఆయన తన సొంత పనులకు పరిమితం అవుతున్నారు. ఆయన కుమారుడైన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి సైతం అలానే వ్యవహరిస్తున్నారు. జగన్ వెంట అడుగులు వేయడం ద్వారా ప్రయోజనం కంటే నష్టం ఎక్కువ అని వారు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండేటప్పుడు స్వేచ్ఛగా పనిచేసుకునేవారు. పెద్దగా శత్రుత్వం కూడా లేదు. కానీ ఇప్పుడు రాయలసీమ వ్యాప్తంగా పెద్దిరెడ్డికి శత్రువులు తయారయ్యారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి రాయలసీమ బాధ్యతలు కట్టబెడితే… పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఐదేళ్లపాటు బాగానే శ్రమించారు. కానీ మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత పెద్దిరెడ్డి ఫ్యామిలీ పొలిటికల్ గా ఇబ్బందులు పడుతోంది. రాజకీయంగా గౌరవం కూడా తగ్గింది. పోనీ జగన్ మోహన్ రెడ్డికి రాజకీయ సలహాలు ఇస్తే ఆయన పాటించడం లేదు. అందుకే ఆయన వద్ద ఉండటం కంటే బయటకు వెళ్ళిపోవడమే మేలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కానీ ప్రత్యామ్నాయం కనిపించకపోవడం వ్యూహాత్మకంగా సైలెంట్ పాటిస్తోంది.

కేసుల బాధ..
గతంలో ఎన్నడూ లేని విధంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి ఫ్యామిలీ. 2014లో టిడిపి అధికారంలో వచ్చిన సమయంలో కూడా పెద్దిరెడ్డి ఫ్యామిలీ యాక్టివ్గానే పని చేసింది. 2019 నుంచి 24 మధ్య అధికారంలో ఉండడంతో.. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలు తమ మెడకు చుట్టుకున్నాయన్న బాధ పెద్దిరెడ్డి ఫ్యామిలీలో ఉంది. పైగా అవినీతి ఆరోపణలు రావడంతో ప్రజల విశ్వాసం కూడా తగ్గింది వారి పట్ల. అందుకే వైసీపీలో ఉంటే తమకు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని వారు భావించినట్టు ఉన్నారు. పైగా మద్యం కుంభకోణం కేసులో పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి నిందితుడు కూడా. అయితే ఈ కుంభకోణంలో వచ్చిన ప్రయోజనం తక్కువ.. ఇప్పుడు మూల్యం చెల్లించుకుంది ఎక్కువ. జగన్మోహన్ రెడ్డి నిశ్చింతగా ఉన్నారు. తమకు మాత్రం ఇబ్బందులు అన్నది పెద్దిరెడ్డి ఫ్యామిలీలో ఉన్న బాధ. అలాగని ఎప్పటికీ ఇప్పుడు పార్టీని విడిచి పెడితే క్రెడిబిలిటీ తగ్గుతుంది అన్న భయం కూడా ఉంది. అందుకే సమయం కోసం చూస్తున్నారు. అప్పటివరకు పార్టీలో కొనసాగుతున్న సైలెన్స్ పాటిస్తారన్న కామెంట్స్ పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

ఆఫీసులో చురుగ్గా ఉండాలనుకుంటున్నారా.. ప్రతీ గంటకు ఈ పని చేయండి..

Tips to stay energetic in Office
Tips to stay energetic in Office

Tips to stay energetic in Office: ప్రస్తుత కాలంలో చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 10 గంటల పాటు కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేస్తున్నారు. ఈ అలవాటు శరీర ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. అయితే తాజాగా జరిగిన ఓ అధ్యయనం ప్రకారం… ఆఫీసులో పని చేసే వారు చిన్నపాటి అలవాటు ద్వారా మానసికంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఆ అలవాటేంటో చూద్దాం..

అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో, ఎక్కువసేపు కుర్చీలో కూర్చోవడం వల్ల శరీరంపై పడే ప్రతికూల ప్రభావాలను పరిశీలించారు. ఈ పరిశోధనలో పాల్గొన్న వ్యక్తులు ప్రతి గంటకు 5 నిమిషాలు నడిచినప్పుడు వారి శారీరక, మానసిక ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదల కనిపించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. గంటకు 5 నిమిషాల చిన్న నడక కూడా మనసును ఉల్లాసంగా ఉంచుతుందని అధ్యయనం వెల్లడించింది. ఇలా నడవడం వల్ల మెదడుకు రక్తప్రసరణ మెరుగై, ఏకాగ్రత పెరుగుతుంది. ఫలితంగా ఉద్యోగులు మరింత ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. అలాగే పని ఒత్తిడి తగ్గి, మూడ్ కూడా మెరుగుపడుతుంది. దీంతో కార్యాలయంలో ప్రొడక్టివిటీ పెరిగే అవకాశం ఉంటుంది.

ఒకే చోట గంటల తరబడి కూర్చోవడం వల్ల శరీరంలో బిగుతు, కండరాల నొప్పులు, అలసట వంటి సమస్యలు వస్తాయి. అయితే ప్రతి గంటకు కొద్దిసేపు నడవడం ద్వారా శరీరం చురుకుగా మారుతుంది. కాళ్లు, వెన్నెముక, మెడ భాగాలపై ఒత్తిడి తగ్గి శరీరం రిలాక్స్‌గా అనిపిస్తుంది. దీని వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. పరిశోధకుల సూచనల ప్రకారం.. బ్రేక్ సమయంలో తప్పనిసరిగా పనిని పూర్తిగా ఆపాల్సిన అవసరం లేదు. అవసరమైతే నడుస్తూనే ఆఫీస్‌కు సంబంధించిన ఫోన్ కాల్స్ మాట్లాడవచ్చు. అలాగే సహోద్యోగులతో పనికి సంబంధించిన చర్చలు కూడా జరపవచ్చు. దీంతో పని కూడా సాగుతుంది, ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

రోజంతా కుర్చీలో కదలకుండా కూర్చోవడం వల్ల శరీరంలో క్యాలరీలు తక్కువగా ఖర్చవుతాయి. దీని కారణంగా అధిక బరువు, ఊబకాయం సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అంతేకాకుండా గుండె జబ్బులు, అధిక రక్తపోటు, టైప్-2 డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు కూడా అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రతి గంటకు ఫోన్ లేదా కంప్యూటర్‌లో రిమైండర్ పెట్టుకోవడం మంచిది. ఆ సమయంలో 5 నిమిషాలు ఆఫీస్‌లోనే నడవడం, మెట్లు ఎక్కడం లేదా కొద్దిసేపు స్ట్రెచింగ్ చేయడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. రోజువారీ పనుల్లో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో పెద్ద ఆరోగ్య సమస్యలను దూరం పెట్టవచ్చు.

ఈ ఫోన్ రోజంతా వాడినా.. వెంటనే ఛార్జింగ్ చేసుకోవచ్చు..

Vivo X Fold 6 latest features
Vivo X Fold 6 latest features

Vivo X Fold 6 latest features: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ Vivo X Fold 6 ను చైనా మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధమైంది. అయితే ఇప్పటికే ఈ ప్రీమియం బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ ధరలు, వేరియంట్లపై చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘వేబో’ ద్వారా లీక్ కావడంతో ఈ ఫోన్ గురించి హాట్ టాఫిక్ అయింది. అంతేకాకుండా కెమెరా, ఫర్ఫామెన్స్ విషయంలోనూ ఈ ఫోన్ గురించి ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఈ ఫోన్ ఎలా ఉందంటే?

వివో ఎక్స్ ఫోల్డ్ 6 మొత్తం నాలుగు స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులోకి రానుంది. గత మోడల్ ఎక్స్ ఫోల్డ్ 5 తో పోలిస్తే ఈసారి మెమరీ కాంపోనెంట్స్ ధరలు పెరగడం వల్ల దీని ధరలలో భారీ మార్పు కనిపిస్తోంది. 12GB RAMతో పాటు 256GB స్టోరేజ్ ధర 9,999 యువాన్లు (ఇండియన్ కరెన్సీలో రూ. 1,40,000)గా నిర్ణయించారు. టాప్ వేరియంట్ 16GB RAM, 1TB స్టోరేజ్ 12,499 యువాన్లు (సుమారు రూ.1,75,000).

ఫోల్డబుల్ ఫోన్లలోనే అత్యంత శక్తివంతమైన పర్ఫార్మెన్స్ అందించడం కోసం వివో ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9500 సూపర్ ఎడిషన్ చిప్‌సెట్‌ను ఉపయోగించబోతోంది. ప్రత్యేకంగా పెద్ద స్క్రీన్లు, లార్జ్-స్కేల్ AI ఫీచర్ల కోసం ఈ 3nm ప్రాసెసర్‌ను డెవలప్ చేశారు. సాధారణంగా ఫోల్డబుల్ ఫోన్లు సన్నగా ఉండటం వల్ల వాటిలో బ్యాటరీ సామర్థ్యం తక్కువగా ఉంటుంది. కానీ వివో ఈ కొత్త ఫోన్ లో 7,000mAh బ్యాటరీని అమర్చినట్లు తెలుస్తోంది. ఈ బ్యాటరీ, ఎంత వాడినా సింగిల్ ఛార్జ్‌పై 9.8 గంటల పాటు నిరంతరాయంగా నడుస్తుందని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి.

వివో ఎక్స్ ఫోల్డ్ 6 మినీ DSLR లా పనిచేస్తుందని కంపెనీ టీజ్ చేసింది. ఇందులో సామ్‌సంగ్‌తో కలిసి సంయుక్తంగా డెవలప్ చేసిన 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అమర్చారు. అలాగే 50MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉండనున్నాయి. డిస్‌ప్లే విషయానికొస్తే.. లోపలి భాగంలో 8.02 అంగుళఆల ఫోల్డబుల్ OLED స్క్రీన్ అందించారు. జూన్ 26 చైనా లాంచ్ తర్వాత ఈ ఫోన్ గ్లోబల్ మరియు భారత మార్కెట్లలో ఎప్పుడు విడుదలవుతుందనే దానిపై స్పష్టత రానుంది.

9,000mAh బ్యాటరీతో Xiaomi నుంచి సరికొత్త ఫోన్.. మార్కెట్లోకి ఎప్పుడొస్తుందంటే..

Xiaomi Redmi 17 launch date
Xiaomi Redmi 17 launch date

Xiaomi Redmi 17 launch date: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi తన సబ్‌ బ్రాండ్ రెడ్‌మి నుండి సరికొత్త సంచలనానికి తెరలేపబోతోంది. టెక్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ‘రెడ్‌మి నోట్’ సిరీస్‌లో తదుపరి తరం మోడల్స్ రాబోతున్నాయి. తాజా లీకుల ప్రకారం.. కంపెనీ రెడ్‌మి నోట్ 16 సిరీస్‌ను దాటవేసి, నేరుగా రెడ్‌మి నోట్ 17 సిరీస్ ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఈ సీరిస్ లోని ఫోన్లు ఎలా ఉండబోతున్నాయంటే..

షియోమీ 17 సిరీస్ నుంచి వచ్చే నోట్ 17 ఫోన్ లో బ్యాటరీ గురించి ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇందులో ఏకంగా 9,000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని ఉంచారు. అలాగే ఈ సిరీస్‌లో ‘ప్రో మాక్స్’ (Redmi Note 17 Pro Max) మోడల్ మరింత శక్తివంతమైన 10,000mAh బ్యాటరీతో తవిడుదలయ్యే అవకాశం ఉంది.

ఈ ఫోన్ లో క్వాల్కమ్ కంపెనీకి చెందిన స్నాప్‌డ్రాగన్ 6-సిరీస్ చిప్‌సెట్‌ను ఇందులో ఉపయోగించబోతున్నారు. విశ్లేషకుల అంచనా ప్రకారం.. ఇది ఇటీవలే విడుదలైన పవర్‌ఫుల్ అండ్ ఎఫిషియంట్ చిప్ అయిన స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 కావచ్చు. ఈ ప్రాసెసర్ బ్యాటరీ వినియోగాన్ని చాలా వరకు ఆదా చేస్తుంది, దీనివల్ల 9,000mAh బ్యాటరీ బ్యాకప్ మరింత అద్భుతంగా, రోజుల తరబడి వచ్చేలా ఉంటుంది.

ఈ ఫోన్ 1.5K రిజల్యూషన్ కలిగిన ఫ్లాట్ డిస్‌ప్లేతో రానుంది. మల్టీమీడియా లవర్స్ కోసం ఇందులో హై-వాల్యూమ్ అందించే డ్యూయల్ స్టీరియో స్పీకర్లను అమర్చారు. ప్రమాదవశాత్తు కిందపడినా పగలకుండా ఉండేలా డ్రాప్ రెసిస్టెన్స్, అలాగే ఫ్లాగ్‌షిప్ స్థాయి వాటర్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్ (వాటర్‌ప్రూఫ్ రేటింగ్) తో ఈ మిడ్-రేంజ్ ఫోన్ రాబోతోందని తెలుస్తోంది.

ఈ సరికొత్త రెడ్‌మి నోట్ 17 సిరీస్ ఫోన్ మొదట చైనా మార్కెట్లో వచ్చే నెల, అంటే జూలై 2026 లో అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత క్రమంగా భారత్ తో పాటు అంతర్జాతీయ మార్కెట్లలోకి అడుగుపెట్టనుంది. కేవలం మిడ్-రేంజ్ బడ్జెట్‌లోనే లభించే ఈ రెడ్‌మి నోట్ సిరీస్‌లో ఇలాంటి భారీ బ్యాటరీ మరియు ప్రీమియం ఫీచర్లు రానుండటంతో టెక్ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అక్కినేని వారసుల ఆస్తుల విలువెంతంటే..?

Akkineni Family Assets
Akkineni Family Assets

Akkineni Family Assets: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలా వరకు క్లారిటిని మెయింటైన్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే నాగేశ్వరరావు దగ్గర నుంచి అఖిల్ వరకు ఏదో ఒక వైవిధ్యాన్ని ప్రదర్శించే సినిమాలైతే చేస్తున్నారు. నాగేశ్వరరావు తర్వాత నాగార్జున సైతం టాప్ హీరోగా మారాడు. అతని తర్వాత నాగచైతన్య తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఇక వీళ్ల తర్వాత ఇప్పుడు అఖిల్ సైతం టాప్ హీరోగా మారడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నప్పటికి అదేదీ వర్కౌట్ కావడం లేదు.

ఇక ఇదిలా ఉంటే అక్కినేని వారసుల ఆస్తుల విలువ ఎంత అనే న్యూస్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. నిజానికి నాగేశ్వరరావు చాలావరకు సంపాదించి పెట్టాడు. అయితే నాగేశ్వరరావు పెద్ద కొడుకు అయిన అక్కినేని వెంకట్ సైతం బిజినెస్ పనులను చూసుకోవడంలోనే బిజీగా ఉండేవాడు. నాగార్జున హీరో అయిన తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటూ తనకంటూ ఒక స్టేటస్ ను ఏర్పాటు చేసుకున్నాడు.

ఇక ఆ తర్వాత తన కొడుకులను సైతం హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. నాగార్జున హీరో గానే కాకుండా బిజినెస్ మ్యాన్ గా కూడా రాణిస్తూ ఉంటాడు. అందువల్లే అతనికి బీభత్సమైన డబ్బులను సంపాదించే కెపాసిటి ఏర్పడింది. ప్రతి బిజినెస్ లో కూడా ఏదో ఒక రకంగా ఆయన డబ్బులు అర్జిస్తూనే ఉంటాడు…

ఇక తన రెమ్యూనరేషన్ ని కూడా వివిధ బిజినెస్ లో పెట్టుబడులుగా పెట్టి దాన్ని కూడా లాభాల బాట పట్టించే ప్రయత్నం చేస్తుంటాడు. మొత్తానికైతే నాగార్జున ఫ్యామిలీ దగ్గర దాదాపు 6000 కోట్ల వరకు ఆస్తులైతే ఉంటాయి. ఇవి కేవలం నాగార్జున సంపాదించిన ఆస్తులుగానే తెలుస్తుంది. కొడుకులు సైతం సినిమాల ద్వారా పెద్దగా డబ్బులును ఆర్జించకపోయినా కూడా వాళ్ళు కూడా సైడ్ బిజినెస్ లను చేసుకుంటూ భారీ మొత్తంలోనే లాభాలను ఆర్జిస్తుండటం విశేషం…

బిహార్‌లో సామాజిక కార్యకర్త ఎన్‌కౌంటర్‌.. రాష్ట్రవ్యాప్తంగా చర్చ!

Bharat Tiwari Encounter
Bharat Tiwari Encounter

Bharat Tiwari Encounter: బిహార్‌లో ఒక సామాజిక కార్యకర్త మరణం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చలను రేపుతోంది. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలను సోషల్‌ మీడియా ద్వారా ఎత్తి చూపే వ్యక్తి పోలీసు ఎన్‌కౌంటర్‌లో చనిపోవడం వెనుక ఉన్న పరిస్థితులు, వాదనలు, సందేహాలు ఇప్పుడు ప్రధానంగా మారాయి. ఈ ఘటన న్యాయం, పోలీసు బాధ్యత, సామాజిక కార్యకర్తల రక్షణ వంటి ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది.

ఏం జరిగింది?
బిహార్‌లోని భోజ్‌పూర్‌ జిల్లాకు చెందిన భరత్‌ తివారి(భరత్‌ భూషణ్‌ తివారి) అనే 28 ఏళ్ల సామాజిక కార్యకర్త జూన్‌ 17న పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఆయన సోషల్‌ మీడియాలో ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చేవారు. కొన్ని రోజుల క్రితం తన ప్రాణాలకు ముప్పు ఉందని, చంపే ప్రయత్నాలు జరుగుతున్నాయని వీడియోలు పోస్ట్‌ చేశారు. దీంతో గన్‌ కొనుగోలు చేసినట్లు కూడా పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టి ఆపరేషన్‌ చేశారు. ఆయన గన్‌ను పోలీసుల సమీపంలో వేసి లొంగిపోతున్నట్లు కనిపించినట్లు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అయితే కొన్ని నిమిషాల్లోనే ఆయన ఎన్‌కౌంటర్‌లో చనిపోయినట్లు పోలీసులు ప్రకటించారు. పోలీసుల వాదన ప్రకారం ఆయన కాల్పులు జరిపారు, ఆత్మరక్షణ కోసం తాము కాల్పులు జరపాల్సి వచ్చిందని పేర్కొంటున్నారు.

సామాజిక కార్యకర్తగా భరత్‌..
భరత్‌ తివారి నేరస్థుడు లేదా ఉగ్రవాది కాదు. ఆయన సాధారణంగా ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపే కార్యకర్తగా పని చేసేవారు. నది కోత, అవినీతి వంటి సమస్యలపై సోషల్‌ మీడియా ద్వారా అవగాహన కల్పించేవారు. ఇలాంటి వ్యక్తులు ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. వారి గొంతు అణచివేయబడితే, ప్రజా సమస్యలు మరింత దాచబడే ప్రమాదం ఉంటుంది.

పోలీసుల వాదన ఇలా..
పోలీసుల ప్రకారం ఆయన ఆపరేషన్‌ సమయంలో కాల్పులు జరిపారు, అందుకే ప్రతీకార చర్య తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంటున్నారు. మరోవైపు ఆయన కుటుంబం, మద్దతుదారులు ఆయన గన్‌ వేసి సరెండర్‌ అయ్యారని, అప్పుడు కాల్చడం అన్యాయమని వాదిస్తున్నారు. సోషల్‌ మీడియాలో వచ్చిన వీడియోలు ఈ వాదనకు మద్దతు ఇస్తున్నాయని వారు చెబుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో ‘‘సరెండర్‌ అయ్యారా లేదా?’’ అనేది కీలకమైన ప్రశ్న. వీడియో ఆధారాలు ఉంటే వాటిని పూర్తిగా పరిశీలించాలి. ఎన్‌కౌంటర్‌లో మరణం జరిగినప్పుడు ఎల్లప్పుడూ స్వతంత్ర విచారణ అవసరం.

ఎన్‌కౌంటర్‌పై రాజకీయం..
ఈ ఘటనపై రాజకీయ నాయకుల నుంచి∙విభిన్న ప్రతిస్పందనలు వచ్చాయి. ఒక బిహార్‌ మంత్రి ఎన్‌కౌంటర్‌ జరగకూడదని ప్రకటించారు. ముఖ్యమంత్రి సామ్రాట్‌ చౌదరి మాత్రం భరత్‌ తివారి మానసిక స్థితి బాగా లేదని పేర్కొని పోలీసుల చర్యను సమర్థించారు. అయితే విపక్షాల నుంచి ఒత్తిడి పెరగడంతో ప్రభుత్వం రిటైర్డ్‌ జడ్జితో న్యాయ విచారణ ఆదేశించింది. ఎన్‌కౌంటర్‌కు కారణమైన నలుగురు పోలీసులను కూడా సస్పెండ్‌ చేశారు.

ఎన్‌కౌంటర్‌పై సందేహాలు..
ఈ ఘటన చుట్టూ అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.. సరెండర్‌ అవుతున్న వ్యక్తిని ఎందుకు కాల్చారు? మానసిక స్థితి బాగా లేదని ఎవరు నిర్ధారించారు? దీనికి వైద్య ఆధారాలు ఉన్నాయా? భరత్‌ తివారిని లక్ష్యంగా చేసుకుని ప్లాన్‌ ఉందా? ఆయన సామాజిక కార్యకలాపాలు ఎవరికి అసౌకర్యంగా ఉన్నాయి? ఇలాంటి సందేహాలు పోలీసు వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. ఎన్‌కౌంటర్‌లు అవసరమైనప్పుడు కూడా పూర్తి పారదర్శకత ఉండాలి. సామాజిక కార్యకర్తలు ప్రజా సమస్యలను ఎత్తి చూపినందుకు శిక్షించబడకూడదు. మానసిక ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిని సరైన విధంగా నిర్వహించాలి, ఎన్‌కౌంటర్‌తో కాదు.

ఈ ఘటన నుండి నేర్చుకోవాల్సినది ఏమిటంటే సామాజిక కార్యకర్తల రక్షణ, పోలీసు జవాబుదారీతనం, ప్రజా విశ్వాసం నిలబెట్టడం. భరత్‌ తివారి మరణం వెనుక ఉన్న నిజం బయటకు రావాలి. అప్పుడే న్యాయం జరిగినట్లు అవుతుంది.

ఆ రెండింటినీ నమ్ముకున్న దువ్వాడ శ్రీనివాస్!

Duvvada Srinivas
Duvvada Srinivas

Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మరోసారి హాల్ చల్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఓ కేసు విచారణకు హాజరయ్యారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో హిరమండలం పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. కొత్తూరు సర్కిల్ స్టేషన్ పరిధిలో విచారణ జరిగింది. ఈ క్రమంలో రోజంతా హై డ్రామా చోటు చేసుకుంది. అయితే ఈ కేసు వెనుక మంత్రి కింజరాపు అచ్చెనాయుడు ఉన్నారని ఆరోపిస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్. కానీ పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తే జనసేన నేతలు ఫిర్యాదుతో నోటీసులు ఇచ్చారు. మరి అందులో మంత్రికి సంబంధం అంటగట్టారు దువ్వాడ శ్రీనివాస్. మొన్నటివరకు వైసీపీకి చెందిన ధర్మాన సోదరులపై పడ్డారు. ఇప్పుడు కింజరాపు బాబాయ్ అబ్బాయిలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు దువ్వాడ శ్రీనివాస్. దీని వెనుక పక్క రాజకీయ వ్యూహం ఉందన్నది విశ్లేషకుల మాట. పైగా తన సామాజిక వర్గం పేరు చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. అయితే ప్రస్తుతానికి దువ్వాడ శ్రీనివాస్ పొలిటికల్ జంక్షన్ లో ఉన్నారు. కానీ తన అధినేత జగన్మోహన్ రెడ్డి అంటూ చెబుతున్నారు. మళ్లీ వైసీపీలోకి వచ్చేందుకు ఈ ఎత్తుగడ అన్నది విశ్లేషకుల మాట.

* ప్రతి ఎన్నికల్లో ఓటమి..
2001 నుంచి యువజన కాంగ్రెస్ లో పనిచేస్తూ వస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్. 2006లో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అయ్యారు ప్రతి ఎన్నికల్లోను పోటీ చేయడం ఓడిపోవడం పరిపాటిగా మారింది. 2019లో సైతం జగన్ ప్రభంజనం రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చింది. టెక్కలిలో మాత్రం దువ్వాడ శ్రీనివాస్ వైసిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో చట్టసభల్లో అడుగు పెట్టాలన్న దువ్వాడ శ్రీనివాస్ ఆశ తీరలేదు. దీంతో జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన సరే పార్టీలో కొనసాగింపు ఇచ్చారు. కానీ వ్యక్తిగత వివాదాలతో పార్టీకి ఇబ్బంది కలిగించడంతో సస్పెన్షన్ వేటు వేశారు.

* ఇంకా ఏడాది కాలమే..
మరో ఏడాది కాలంలో దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ పదవి పూర్తవుతుంది. ఇంతలోనే వైసీపీలోకి రీఎంట్రీ ఇవ్వాలన్నది దువ్వాడ శ్రీనివాస్ ఆలోచన. అయితే దువ్వాడ పార్టీలోకి వస్తే ధర్మాన సోదరులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆపై పార్టీలో సీనియర్లు సైతం ఆయన రాకను వ్యతిరేకిస్తున్నారు. శాశ్విత వేటు వేద్దాం అంటే ఎమ్మెల్సీగా ఉన్నారు. వచ్చే ఏడాది మార్చి తో ఆయన ఎమ్మెల్సీ పదవి ముగియనుంది. తెలుగుదేశం పార్టీలోకి ఎలాగూ ఎంట్రీ లేదు. జనసేనలో చేరుతామంటే అభ్యంతరాలు ఉన్నాయి. అందుకే పొలిటికల్ జంక్షన్ లో నిలబడ్డారు. ఎమ్మెల్సీ పదవి పూర్తయ్యేలోగా వైసీపీలోకి ఛాన్స్ వస్తే పర్వాలేదు. లేకుంటే తన పరిస్థితి ఇబ్బంది శ్రీనివాస్ కు తెలుసు. అందుకే ఇప్పుడు టిడిపి మంత్రి కింజరాపు అచ్చేనాయుడు ను టార్గెట్ చేసుకున్నారు. అలా అయినా జగన్ తనను తిరిగి పిలుస్తారని భావిస్తున్నారు. మరోవైపు కులం కార్డు ప్రయోగిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి తిరిగి పిలుస్తారా లేదా అన్నది అనుమానమే.

విడుదలైన 5 రోజులకే ఓటీటీ లోకి 'మా ఇంటి బంగారం'.. ఎందులో చూడాలంటే..

Maa Inti Bangaram OTT
Maa Inti Bangaram OTT

Maa Inti Bangaram OTT Release: సమంత ప్రధాన పాత్ర పోషించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కళ్ళు చెదిరే వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఈమధ్య కాలంలో బయ్యర్స్ కి పెట్టిన రూపాయి కి పదింతలు లాభాలు తెచ్చిపెట్టిన సినిమా ఏదైనా ఉందా అంటే , అది ఇదే. 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ స్టేటస్ ని సొంతం చేసుకుంది . ఫుల్ రన్ లో 70 నుండి 100 కోట్ల మధ్యలో గ్రాస్ వసూళ్లు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ చిత్రానికి వర్కింగ్ డేస్ లో కూడా డీసెంట్ రేంజ్ వసూళ్లు నమోదు అయ్యాయి కాబట్టి.

ఇకపోతే ee సినిమాకు సంబంధించిన డిజిటల్ + సాటిలైట్ రైట్స్ మంచి ఫ్యాన్సీ ప్రైజ్ కి అమ్ముడుపోయింది. సాటిలైట్ రైట్స్ ని స్టార్ మా సొంతం చేసుకోగా, డిజిటల్ రైట్స్ ని జియో హాట్ స్టార్ సంస్థ సొంతం చేసుకుంది. నాలుగు వారాల తర్వాత ఈ చిత్రం ఓటీటీ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. అంటే జులై 18 న ఈ చిత్రాన్ని జియో హాట్ స్టార్ లో చూడిచు అన్నమాట. ఒకవేళ రెండవ వీకెండ్ లో మాత్రం బలమైన గ్రాస్ వసూళ్లను నమోదు చేసుకుంటే మాత్రం ఈ చిత్రం ఓటీటీ విడుదల వాయిదా పడే అవకాశాలు ఉంటాయని అంటున్నారు విశ్లేషకులు. థియేటర్స్ లో అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకొని ముందుకు దూసుకెళ్తున్న ఈ చిత్రం , ఓటీటీ లో కూడా అదే రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందా లేదా అనేది తెలియాలంటే వచ్చే నెల వరకు ఆగాల్సిందే.

ఇకపోతే ఈ చిత్రానికి 5 వ రోజున కూడా తెలుగు రాష్ట్రాల నుండి డీసెంట్ స్థాయి వసూళ్లు నమోదు అయ్యినట్టు తెలుస్తోంది. ట్రేడ్ పండితులు అందిస్తున్న లెక్కల ప్రకారం ఈ చిత్రానికి 5 వ రోజున 1 కోటి 28 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. A సెంటర్స్ లో చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉందని, బి , సి సెంటర్స్ లో ఆ హోల్డ్ పడిపోయిందని , మళ్లీ వీకెండ్ లో పైకి లేచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ వీకెండ్ కి ఈ చిత్రం 70 కోట్ల గ్రాస్ మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయట.

సమంత 4 రోజుల్లోనే నాగ చైతన్య హిట్ సినిమా రికార్డు ను బ్రేక్ చేసిందా..? పోటీ మామూలుగా లేదుగా...

Maa Inti Bangaram Box Office
Maa Inti Bangaram Box Office

Maa Inti Bangaram Box Office: సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య పోటీ ఉండడం అనేది సర్వసాధారణం… పర్సనల్ విషయాలను పక్కన పెడితే సినిమాలో పరంగా అయితే ప్రతి ఒక్కరికి పోటీ ఉంటుంది. ప్రస్తుతం సమంత సైతం మా ఇంటి బంగారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా నాలుగు రోజుల్లోనే భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టింది. ఈ సినిమాకి మొదటి షో తోనే పాజిటివ్ టాక్ రావడం ఒకెత్తయితే, ఈ మూవీకి పోటీని ఇచ్చే పెద్ద సినిమాలు కూడా ఏమీ లేకపోవడం కూడా దానికి బాగా కలిసి వచ్చింది. మొత్తానికైతే ఇప్పుడు సమంత తన హవాని కొనసాగిస్తుంది.

ఇక ఇది చూసిన ప్రతి ఒక్కరు నాగచైతన్య హీరోగా వచ్చిన తండేల్ సినిమా సక్సెస్ ని సాధించిన కూడా నాలుగు రోజుల్లో కేవలం 32 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టిందని సమంత సినిమా మాత్రం నాలుగు రోజుల్లోనే 35 కోట్ల వరకు కలెక్షన్స్ ను కొల్లగొట్టిందని నాగచైతన్య కంటే సమంతనే ముందు వరుసలో దూసుకెళ్తుంది అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది కాదు సినిమా సక్సెస్ సాధిస్తే కలెక్షన్స్ వస్తాయి. సినిమా ఫ్లాప్ అయితే మాత్రం పాతాళానికి పడిపోతారు. కాబట్టి వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని సక్సెస్ ఫుల్ సినిమాలకు మాత్రమే ఎక్కువ కలెక్షన్స్ వస్తుంటాయి. కాబట్టి వాటిని ప్రేక్షకులందరు హైలెట్ చేస్తూ చూస్తూ ఉంటారు. ప్రస్తుతం సమంత తన హవాని చూపిస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…

మరో వారం రోజులపాటు ఈ సినిమాకి కలెక్షన్స్ కి డోకా లేదు అంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు… లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంతటి కలెక్షన్స్ ని కొల్లగొడుతుందనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక సమంత సైతం యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మరోసారి తను టాప్ హీరోయిన్ గా మారాలంటే వరుస విజయాలను సాధించాల్సి ఉంటుంది…

అనిల్ రావిపూడి ఈసారి దొరికిపోయేలానే ఉన్నాడు... అదే కథ...కొంచెం మార్చచుగా సామి...

Venkatesh Kalyan Ram Movie
Venkatesh Kalyan Ram Movie

Venkatesh Kalyan Ram Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్లకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ముఖ్యంగా అనిల్ రావిపూడి చేసే సినిమాలకు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ లభిస్తుంది. ప్రస్తుతం ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిద్యమైన కథాంశమైతే ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ప్రేక్షకులు సైతం ఆయన సినిమాలను చూడడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుండటం విశేషం…ఇప్పటి వరకు ఆయన చేసిన తొమ్మిది సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు పదోవ సినిమాని సైతం వెంకటేష్ – కళ్యాణ్ రామ్ లను పెట్టి భారీ మల్టీ స్టారర్ సినిమాగా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేయాలని చూస్తున్నాడు.

రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమా మీదనే ఇప్పుడు భారీ అంచనాలు కూడా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇదంతా చూస్తున్న జనాలు మాత్రం ఈసారి అనిల్ రావిపూడి దొరికిపోయాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆయన ఈసారి సక్సెస్ కొట్టడం చాలా కష్టం అంటూ చాలా మంది చాలా రకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

దీనికి గల కారణం ఏంటంటే ఈసారి కూడా అనిల్ అదే రొటీన్ కాన్సెప్ట్ తో రాబోతున్నాడు అనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుందని కేవలం బ్యాక్ డ్రాప్ మాత్రమే మార్చాడని కథ విషయంలో ఆయన ఏమాత్రం మార్చే అవకాశాలు లేవని ఏదో ఒక పాత సినిమాను తీసుకొని దాన్ని అటు ఇటు చేసి సినిమా చేస్తాడు అంటూ కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. మొత్తానికైతే అని రావిపూడి ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ అయితే క్రియేట్ చేయగలుగుతున్నాడు.

అలాగే ప్రొడ్యూసర్లు సైతం భారీ లాభాలను తీసుకువచ్చే సినిమాలను చేస్తుండటం విశేషం… ఈసారి తను ఏ మ్యాజిక్ చేయబోతున్నాడు. పదోవ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంటాడా? లేదంటే ప్రేక్షకులకు దొరికిపోతాడా అనేది తెలియాలంటే 2027 సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే…

ఎన్డీఏలోకి స్టాలిన్.. పెద్ద ప్రయత్నాల్లో లోకేష్!

Stalin NDA Entry
Stalin NDA Entry

Stalin NDA Entry: రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో కూడా చెప్పలేం. ఎవరికి ఎవరు శత్రువులో.. ఎవరు మిత్రులో కూడా అంచనా వేయలేం. దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఒక్క ఏపీ తప్ప మిగతా నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్, దాని అనుబంధ ప్రభుత్వాలు ఉన్నాయి. అందుకే దక్షిణాదిన మరింత పట్టు బిగించాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. అయితే ఏపీలో మాత్రం టిడిపి కూటమి అధికారంలో ఉంది. కర్ణాటకలో విజయ్ నేతృత్వంలోని టీవీ కి కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే మొన్నటి ఎన్నికల వరకు డీఎంకేతో స్నేహాన్ని కొనసాగించారు జగన్. కానీ ఎప్పుడైతే విజయ్ గెలిచారో.. వైసీపీ నేతలు రూటు మార్చారు. జగన్ సైతం స్టాలిన్ కంటే విజయ్ కు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించారు. జాతీయస్థాయిలో ఎన్డీఏ స్టాండ్ తీసుకున్న టిడిపి స్టాలిన్ తో పాటు విజయ్ ను సైతం రాజకీయ ప్రత్యర్థి గా చూసింది.

* మారిన బిజెపి వైఖరి..
అయితే స్టాలిన్ విషయంలో బిజెపి వైఖరి మారినట్లు తెలుస్తోంది. స్టాలిన్ సైతం ముస్లిం లీగ్ పార్టీని విడిచిపెట్టి ఆశ్చర్యపరిచారు. ఇప్పటికే కాంగ్రెస్ డీఎంకేకు దూరమైంది. తద్వారా బిజెపికి వ్యతిరేకం అన్న అంశాన్ని దాటి బయటకు వచ్చేసింది డిఎంకె. మారిన పరిస్థితుల నేపథ్యంలో విజయ్ బలపడకుండా ఉండాలి అంటే ఎన్డీఏలో చేరడం శ్రేయస్కరమని స్టాలిన్ భావిస్తున్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి. ప్రస్తుతానికి బిజెపి నుంచి తనకు ఇబ్బంది రాకుండా చూసుకోవడంలో స్టాలిన్ సక్సెస్ అయ్యారు. తమిళనాడు రాజకీయాలు తనకు ఇబ్బందికరంగా మారితే స్టాలిన్ ఎన్డీఏ గూటికి చేరుకునే అవకాశం ఉంది.

* డీఎంకే ప్రభుత్వం పై ప్రశంసలు
మరోవైపు స్టాలిన్ కోసం కేంద్ర ప్రభుత్వం లోకేష్ ను ప్రయోగించినట్లు తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి స్టాలిన్ ను విడిచిపెట్టి విజయ్ తో స్నేహం చేస్తున్నారు. అయితే జగన్ కోసం చంద్రబాబుతో ఉన్న మంచి సంబంధాలను వదులుకున్నారు స్టాలిన్. అందుకే లోకేష్ ద్వారా ఎన్డీఏలో చేరేందుకు స్టాలిన్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు ప్రచారం నడుస్తోంది. అందుకు తగ్గట్టుగానే లోకేష్ ఢిల్లీలో జరిగిన ఓ కాంక్లేవ్ లో అప్పటి డిఎంకె ప్రభుత్వాన్ని పొగిడారు. స్టాలిన్ సర్కార్ విధానాలను ప్రశంసించారు. పరిశ్రమలు, పెట్టుబడులు తేవడంలో తమిళనాడు ప్రభుత్వం ఏపీతో పోటీపడేదని.. ఈ క్రమంలో పారదర్శకంగా డీఎంకే ప్రభుత్వం వ్యవహరించేదని.. ఈ విషయాన్ని స్వయంగా పారిశ్రామిక వేత్తలే చెప్పారని ప్రకటించారు లోకేష్ . తద్వారా స్టాలిన్ ను ఎన్డీఏలోకి తెచ్చేందుకు లోకేష్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు ప్రచారం ప్రారంభమైంది ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్లో. మరి ఈ ప్రచారంలో నిజం ఎంత ఉందో తెలియాలి.

నచ్చకపోతే చెప్పేయాలి.. అంతం చేసే క్రూరత్వం ఏంటి

Maharashtra Shocking Crime
Maharashtra Shocking Crime

Maharashtra Shocking Crime: వెనకటి రోజులో పెద్దలు కఠినంగా ఉండేవారు. పిల్లల విషయంలో ప్రతి నిర్ణయం వారు మాత్రమే తీసుకునేవారు. కేవలం తాము తీసుకునే నిర్ణయానికి తల ఊపే అవకాశం మాత్రమే పిల్లలకు ఇచ్చేవారు. దీనివల్ల నాటి కాలంలో పెద్దల మాటకు ఎదురులేకుండా పోయేది. అందువల్లే పిల్లలు భయంతో ఉండేవారు. క్రమశిక్షణను కలిగి ఉండేవారు. తద్వారా దారణమైన ఘటనలు.. ఘోరమైన ఉదంతాలు జరిగేవి కావు.

ఇప్పటి కాలంలో పూర్తిగా మనుషుల వ్యవహార శైలి మారిపోయింది. పెద్ద కుటుంబాలు కనిపించడం లేదు. కుటుంబాలలో పెద్దలు వృద్ధాశ్రమాలకు పరిమితమవుతున్నారు. యువత ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. తమ వ్యక్తిత్వాన్ని విహంగం మాదిరిగా తిప్పుతున్నారు. దీనివల్ల వారు ఇబ్బంది పడడమే కాకుండా.. కుటుంబంలో మిగతా వారికి కూడా కన్నీరు మిగుల్చుతున్నారు. ఇటువంటి సంఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఘోరం మరోసారి సభ్య సమాజాన్ని ప్రశ్నిస్తోంది.

మహారాష్ట్రలోని పూణేలో ఫియాన్సీ చేతిలో వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యకు గురయ్యాడు. కేతన్ కు సియా అనే యువతితో వివాహం కుదిరింది. మరి కొద్ది రోజుల్లో వారిద్దరికీ పెళ్లి జరగబోతోంది. ఈ పెళ్లిని అత్యంత ఘనంగా జరపడానికి కేతన్ ప్రణాళికలు రూపొందించుకున్నాడు. ప్రత్యేకంగా రాజస్థాన్లోని ఉదయపూర్ లో 17 కోట్లు పెట్టి ప్యాలస్ బుక్ చేశాడు.. బంధువులను తీసుకురావడానికి హెలికాప్టర్లు కూడా సిద్ధంగా ఉంచాడు. తన పెళ్లి గురించి ఎన్నో కలలు కంటున్నా అతడిని సియా తన ప్రేమికుడితో కలిసి అంతం చేసింది.

పూణే కు సుదూర ప్రాంతంలో ఉన్న ఒక కోట వద్దకు తీసుకెళ్లిన సియా.. తన ప్రేమికుడి సహాయంతో కేతన్ ను లోయలోకి తోసివేసింది. అతడు అందులో పడిపోయి చనిపోయాడు. వాస్తవానికి ఈ ఘటన కంటే ముందు నాలుగు రోజుల క్రితమే అతడిని అదే లోయలో తోసివేసి చంపడానికి ప్రయత్నించినట్టు కేతన్ తండ్రి ఆరోపిస్తున్నాడు. మరోవైపు కేతన్ చనిపోయిన తర్వాత సియా ఇన్ స్టా గ్రామ్ లో విషాదకరమైన పోస్టులు పెట్టింది. మరోవైపు సోషల్ మీడియాలో సియా కు కేతన్ ప్రపోజ్ చేసిన వీడియో.. హగ్ చేసుకున్న వీడియోలు కలకలం సృష్టిస్తున్నాయి. కాగా.. కేతన్ నచ్చకపోతే సియా ముందే చెప్పాలి.. అంతేగాని ఇలా చంపడం ఏంటని సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు.

పశ్చిమాసియాలో ఇంత భారీగా చమురు నిల్వలు ఎలా వచ్చాయో తెలుసా?*

Middle East Oil Reserves
Middle East Oil Reserves

Middle East Oil Reserves: దేవుడు కొన్ని ఇస్తే.. కొన్ని తీసుకుంటారు అంటారు. మిడిల్‌ ఈస్ట్‌లో దేశాలు ప్రస్తుతం పూర్తి ఎడారి దేశాలు ఇక్కడ వర్షాలు కురవవు. పంటలు పండవు. చివరకు తాగునీరు దొరకడం కూడా కష్టమే. కానీ ఇలాంటి దేశాలకు దేశుడు క్రూడ్‌ బంగారం ఇచ్చాడు. ఈ దేశాల భూగర్భంలో భారీగా చమురు నిల్వలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 90 శాతం దేశాలకు మిడిల్‌ ఈస్ట్‌ దేశాల నుంచే చమురు సరఫరా జరుగుతోంది. అందుకే ఈ దేశాలతో ఏ దేశాలూ వైరం పెట్టుకోవు. మరి ఇంత భారీ మొత్తంలో చమురు నిల్వలు రావడానికి, అక్కడి భౌగోళిక పరిస్థితులతోపాటు చారిత్రక నేపథ్యం కూడా ఉంది.

మిడిల్‌ ఈస్ట్‌ దేశాలు అంటే..
మిడిల్‌ ఈస్ట్‌ దేశాలు ప్రధానంగా సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, కువైట్, యుఏఈ. ప్రపంచంలోని సంప్రదాయిక చమురు నిల్వల్లో సుమారు 48 శాతం వరకు కలిగి ఉన్నాయి. నేడు వేడి ఎడారులుగా కనిపించే ఈ ప్రాంతంలో ఇంత విపరీతమైన క్రూడ్‌ ఆయిల్‌ ఎలా నిల్వలు ఏర్పడడం యాదృచ్ఛికం కాదు. కోట్ల సంవత్సరాల భౌగోళిక చరిత్ర, సముద్రాల నుంచి జరిగిన మార్పులు, టెక్టోనిక్‌ కదలికలు దీనికి కారణం. శాస్త్రవేత్తల పరిశోధనలు ఈ రహస్యాన్ని వెల్లడి చేస్తున్నాయి.

క్రూడ్‌ ఆయిల్‌ ఎలా ఏర్పడుతుంది..
క్రూడ్‌ ఆయిల్‌ ఏర్పడటానికి లక్షల నుంచి కోట్ల సంవత్సరాలు పడుతుంది. సముద్రాల్లోని సూక్ష్మ జీవులు(ప్లాంక్టన్, ఆల్గే), చనిపోయిన చేపలు, సముద్ర వ్యర్థాలు సముద్ర అడుగున చేరుతాయి. ముఖ్యంగా ఆక్సిజన్‌ లేని (అనాక్సిక్‌) పరిస్థితుల్లో ఈ సేంద్రియ పదార్థాలు కుళ్లిపోకుండా సంరక్షించబడతాయి. కాలక్రమేణా భూమి పొరల్లో వచ్చే మార్పుల వల్ల వాటిపై మట్టి, ఇసుక, కార్బోనేట్‌ శిలలు కప్పబడతాయి. లోతైన భూమి అడుగున (సాధారణంగా 2–4 కిలోమీటర్ల లోతు) అధిక ఉష్ణోగ్రతలు, ఒత్తిడి కారణంగా ఈ పదార్థాలు మొదట ‘‘కెరోజెన్‌’’గా మారి, తర్వాత ద్రవ క్రూడ్‌ ఆయిల్‌గా మారుతాయి. ఇది రసాయనిక మార్పు (క్యాటాజెనెసిస్‌). కొన్ని చోట్ల ఎక్కువ ఉష్ణోగ్రత వల్ల గ్యాస్‌గా మారుతుంది. ఈ చమురు సహజంగా పోరస్‌ రాళ్లలోకి వలసపోయి (మైగ్రేషన్‌) నిల్వ అవుతుంది.

నాడు సముద్ర గర్భంలో మిడిల్‌ ఈస్ట్‌…
సుమారు 15 కోట్ల సంవత్సరాల క్రితం (జురాసిక్‌–క్రెటేషియస్‌ కాలం) మిడిల్‌ ఈస్ట్‌ మొత్తం ఒక విశాలమైన, వెచ్చని, నిస్సారమైన సముద్రంగా ఉండేది. దీన్ని టెథిస్‌ సముద్రం అంటారు. ఇది గోండ్వానా, లారేషియా ఖండాల మధ్య ఉండేది. ఈ సముద్రంలో సూక్ష్మ సముద్ర జీవులు సమృద్ధిగా ఉండేవి. వాటి అవశేషాలు అడుగున చేరి, తర్వాతి కాలంలో చమురు ఏర్పడటానికి ప్రధాన ముడి పదార్థంగా మారాయి. శాస్త్రవేత్తలు రాళ్లలోని అవశేషాలు, భూమి పొరల అధ్యయనం ద్వారా ఈ వాస్తవాన్ని నిర్ధారించారు.

ఖండాల కదలికలు, ఆస్ట్రాయిడ్‌ ఘటనలు..
భూమి చరిత్రలో ఆస్ట్రాయిడ్‌లు ఢీకొట్టడం వంటి ఘటనలు జరిగాయి. ఇవి వాతావరణ మార్పులు, జీవుల అంతరించిపోవడానికి కారణమయ్యాయి. అయితే, మిడిల్‌ ఈస్ట్‌ ఆకృతి మారడానికి ప్రధాన కారణం ప్లేట్‌ టెక్టోనిక్స్‌ (ఖండాల కదలికలు). అరేబియన్‌ ప్లేట్‌ ఉత్తరం వైపు కదిలి, యూరేషియన్‌ ప్లేట్‌తో ఢీకొట్టడంతో జాగ్రోస్‌ పర్వతాలు ఏర్పడ్డాయి. ఇది భూమి పొరలను మడతలు పెట్టి (ఫోల్డ్స్, యాంటిక్లైన్స్‌), చమురును నిల్వ చేసే సహజ ‘‘ట్రాప్స్‌’’ (ఉచ్చులు) సృష్టించింది. దీంతో సముద్రం క్రమంగా భూమి అడుగునకు వెళ్లిపోయింది. ఈ ప్రక్రియలో సముద్ర గర్భం నుంచి భూభాగం పైకి లేచింది. ఈ స్థిరమైన భౌగోళిక పరిస్థితులు చమురును సురక్షితంగా నిల్వ చేయడానికి సహాయపడ్డాయి.

ఎడారి ఏర్పాటు, చమురు నిల్వల సంరక్షణ…
మిడిల్‌ ఈస్ట్‌ ఉపరితలం క్రమంగా ఎడారిగా మారింది (వాతావరణ మార్పులు, భౌగోళిక స్థానం కారణంగా). కానీ భూమి అడుగున చమురు నిల్వలు సంరక్షించబడ్డాయి. పోరస్‌ రాళ్లు (లైమ్‌స్టోన్, శాండ్‌స్టోన్‌) చమురును గ్రహించి నిల్వ చేస్తాయి. అంతర్లీనంగా ఉన్న అభేద్య శిలలు (షేల్, సాల్ట్, అన్‌హైడ్రైట్‌) ‘‘క్యాప్‌ రాక్‌’’లుగా పని చేసి చమురు బయటకు రాకుండా అడ్డుకుంటాయి. ఈ ‘‘సోర్స్‌ రాక్‌ – రిజర్వాయర్‌ రాక్‌ – క్యాప్‌ రాక్‌ – ట్రాప్‌’’ అనే నాలుగు అంశాలు సరిగ్గా కలిసినప్పుడే భారీ నిల్వలు ఏర్పడతాయి. మిడిల్‌ ఈస్ట్‌లో ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి.

ప్రపంచంలోని అతిపెద్ద నిల్వలు..
సౌదీ అరేబియాలోని ఘవార్‌ ఆయిల్‌ ఫీల్డ్‌ ప్రపంచంలోనే అతిపెద్దది. ఇలాంటి భారీ నిల్వలు జురాసిక్‌ కాలపు మూల శిలల నుంచి వచ్చాయి. ఇరాన్, ఇరాక్, కువైట్‌లోనూ ఇలాంటి నిల్వలు ఉన్నాయి. ఈ ప్రాంతం స్థిరమైన భౌగోళిక చరిత్రే ఇతర ప్రాంతాల కంటే ఎక్కువ నిల్వలను సృష్టించింది.

ఆర్థిక వైవిధ్యం అవసరం..
ఈ చమురు నిల్వలు అంతులేనివి కావు. ఉత్పత్తి కొనసాగుతున్న కొద్దీ అవి తగ్గిపోతాయి. దీంతో గల్ఫ్‌ దేశాలు తమ ఆర్థిక వ్యవస్థను వైవిధ్యపరచడానికి చర్యలు తీసుకుంటున్నాయి. సౌదీ అరేబియా విజన్‌ 2030 కార్యక్రమం ద్వారా చమురుపై ఆధారపడటం తగ్గించి, పర్యాటకం, వినోదం, సాంకేతికత, పునరుత్పాదక ఇంధనాలు, వాణిజ్యం వైపు మొగ్గు చూపుతోంది. యుఏఈ, కువైట్‌ వంటి దేశాలు కూడా పర్యాటక కేంద్రాలు, స్పోర్ట్స్‌ ఈవెంట్లు, ఆధునిక నగరాల నిర్మాణంపై దృష్టి పెట్టాయి. ఇది భవిష్యత్తులో చమురు ఆదాయం తగ్గినప్పుడు స్థిరమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి సహాయపడుతుంది.

మిడిల్‌ ఈస్ట్‌లోని పెట్రోలియం నిల్వలు కేవలం యాదృచ్ఛికంగా ఏర్పడలేదు. అవి కోట్ల సంవత్సరాల టెథిస్‌ సముద్రం, సూక్ష్మ జీవుల అవశేషాలు, ఖండాల కదలికలు, సరైన భౌగోళిక ట్రాప్స్‌ కలయిక ఫలితం. ఈ విషయం మనకు భూమి యొక్క డైనమిక్‌ స్వభావం, సహజ వనరుల పరిమితి, సుస్థిర అభివృద్ధి అవసరాన్ని గుర్తు చేస్తుంది. భవిష్యత్తులో చమురుపై ఆధారపడటం తగ్గించి, వైవిధ్యపరచడం ద్వారా ఈ దేశాలు మరింత స్థిరంగా ముందుకు సాగవచ్చు.

'ఓజీ 2' లో బాలీవుడ్ టాప్ స్టార్ హీరోయిన్.. ఇక పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ బద్దలే..

OG 2 Movie
OG 2 Movie

OG 2 Movie: పవన్ కళ్యాణ్ అభిమానులు ‘ఓజీ 2’ అప్డేట్ కారణంగా , మళ్లీ ఫుల్ యాక్టీవ్ మోడ్ లోకి వచ్చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ మేనియా నే కనిపిస్తోంది. ‘ఓజీ’ పేరు తీస్తే చాలు , అభిమానులు మొత్తం పూనకాలొచ్చి ఊగిపోతుంటారు. సరైన సమయం లో , సరైన బ్లాక్ బస్టర్ తగలడం చాలా అరుదు. అలాంటి అరుదైన ఘటనలు జరిగినప్పుడు అభిమానుల ఆనందానికి హద్దులే ఉండవు. ఇలాంటి అనుభవాలను పవన్ కళ్యాణ్ తన అభిమానులకు అందించడం లో దిట్ట. అలా ‘ఓజీ’ చిత్రం తో అలాంటి అరుదైన అనుభవాన్ని అందించాడు అభిమానులకు. అందుకే ‘ఓజీ 2’ పై ప్రేక్షకుల్లో ఈ రేంజ్ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా ‘ఓజీ’ క్లిఫ్ హ్యాంగర్ సన్నివేశం , సీక్వెల్ పై అభిమానుల్లో , ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీ ని పెంచాయి.

ఇకపోతే ‘ఓజీ 2’ చిత్రాన్ని స్వయంగా పవన్ కళ్యాణే నిర్మించబోతున్నాడు. పలు సంస్థలు నిర్మాణం లో భాగస్వామ్యం పంచుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి కానీ , ప్రస్తుతానికి అయితే ఏది ఖరారు అవ్వలేదు. ఈ ఏడాది నవంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టడానికి అన్ని విధాలుగా రెడీ అవుతున్నాడు డైరెక్టర్ సుజీత్. ఈ మేరకు ఆయన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టేశాడు. ఈ చిత్రం లో హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన శ్రద్ద కపూర్ ని సంప్రదిస్తున్నట్టు సమాచారం. గతం లో ఈమె ప్రభాస్, సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘సాహూ’ చిత్రం లో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె బాలీవుడ్ లో బిగ్గెస్ట్ బ్రాండ్ గా మారిపోయింది. యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పాటు చేసుకుంది.

ఈమె ‘ఓజీ 2’ లో నటిస్తే బాలీవుడ్ లో కూడా ఈ చిత్రం పై క్రేజ్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు. అయితే పవన్ కళ్యాణ్ ఇచ్చే డేట్స్ కి , ఈమె డేట్స్ సింక్ అవుతాయా లేదా అనేది ఒక్కటే చూడాలి. ఇందులో ఈమె ఓజాస్ గంభీర్ కి తల్లి పాత్రలో కనిపించబోతుంది. ఈమె ఫ్లాష్ బ్యాక్ మొత్తం జపాన్ లోనే ఉంటుంది. ఈమె షెడ్యూల్స్ ఇండియా లో జరిగే అవకాశాలే లేవట. పవన్ కళ్యాణ్ ఈసారి ఫారిన్ షెడ్యూల్స్ కి భారీగానే డేట్స్ ని కేటాయించినట్టు తెలుస్తోంది. మరో నెలరోజుల్లో హీరోయిన్ కి సంబంధించిన అధికారిక అప్డేట్ ని ప్రకటించబోతున్నారట మేకర్స్.