Homeక్రైమ్‌Maharashtra Shocking Crime: నచ్చకపోతే చెప్పేయాలి.. అంతం చేసే క్రూరత్వం ఏంటి

Maharashtra Shocking Crime: నచ్చకపోతే చెప్పేయాలి.. అంతం చేసే క్రూరత్వం ఏంటి

Maharashtra Shocking Crime: వెనకటి రోజులో పెద్దలు కఠినంగా ఉండేవారు. పిల్లల విషయంలో ప్రతి నిర్ణయం వారు మాత్రమే తీసుకునేవారు. కేవలం తాము తీసుకునే నిర్ణయానికి తల ఊపే అవకాశం మాత్రమే పిల్లలకు ఇచ్చేవారు. దీనివల్ల నాటి కాలంలో పెద్దల మాటకు ఎదురులేకుండా పోయేది. అందువల్లే పిల్లలు భయంతో ఉండేవారు. క్రమశిక్షణను కలిగి ఉండేవారు. తద్వారా దారణమైన ఘటనలు.. ఘోరమైన ఉదంతాలు జరిగేవి కావు. ఇప్పటి కాలంలో పూర్తిగా మనుషుల వ్యవహార శైలి మారిపోయింది. పెద్ద కుటుంబాలు […]

Maharashtra Shocking Crime: వెనకటి రోజులో పెద్దలు కఠినంగా ఉండేవారు. పిల్లల విషయంలో ప్రతి నిర్ణయం వారు మాత్రమే తీసుకునేవారు. కేవలం తాము తీసుకునే నిర్ణయానికి తల ఊపే అవకాశం మాత్రమే పిల్లలకు ఇచ్చేవారు. దీనివల్ల నాటి కాలంలో పెద్దల మాటకు ఎదురులేకుండా పోయేది. అందువల్లే పిల్లలు భయంతో ఉండేవారు. క్రమశిక్షణను కలిగి ఉండేవారు. తద్వారా దారణమైన ఘటనలు.. ఘోరమైన ఉదంతాలు జరిగేవి కావు.

ఇప్పటి కాలంలో పూర్తిగా మనుషుల వ్యవహార శైలి మారిపోయింది. పెద్ద కుటుంబాలు కనిపించడం లేదు. కుటుంబాలలో పెద్దలు వృద్ధాశ్రమాలకు పరిమితమవుతున్నారు. యువత ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. తమ వ్యక్తిత్వాన్ని విహంగం మాదిరిగా తిప్పుతున్నారు. దీనివల్ల వారు ఇబ్బంది పడడమే కాకుండా.. కుటుంబంలో మిగతా వారికి కూడా కన్నీరు మిగుల్చుతున్నారు. ఇటువంటి సంఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఘోరం మరోసారి సభ్య సమాజాన్ని ప్రశ్నిస్తోంది.

మహారాష్ట్రలోని పూణేలో ఫియాన్సీ చేతిలో వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యకు గురయ్యాడు. కేతన్ కు సియా అనే యువతితో వివాహం కుదిరింది. మరి కొద్ది రోజుల్లో వారిద్దరికీ పెళ్లి జరగబోతోంది. ఈ పెళ్లిని అత్యంత ఘనంగా జరపడానికి కేతన్ ప్రణాళికలు రూపొందించుకున్నాడు. ప్రత్యేకంగా రాజస్థాన్లోని ఉదయపూర్ లో 17 కోట్లు పెట్టి ప్యాలస్ బుక్ చేశాడు.. బంధువులను తీసుకురావడానికి హెలికాప్టర్లు కూడా సిద్ధంగా ఉంచాడు. తన పెళ్లి గురించి ఎన్నో కలలు కంటున్నా అతడిని సియా తన ప్రేమికుడితో కలిసి అంతం చేసింది.

పూణే కు సుదూర ప్రాంతంలో ఉన్న ఒక కోట వద్దకు తీసుకెళ్లిన సియా.. తన ప్రేమికుడి సహాయంతో కేతన్ ను లోయలోకి తోసివేసింది. అతడు అందులో పడిపోయి చనిపోయాడు. వాస్తవానికి ఈ ఘటన కంటే ముందు నాలుగు రోజుల క్రితమే అతడిని అదే లోయలో తోసివేసి చంపడానికి ప్రయత్నించినట్టు కేతన్ తండ్రి ఆరోపిస్తున్నాడు. మరోవైపు కేతన్ చనిపోయిన తర్వాత సియా ఇన్ స్టా గ్రామ్ లో విషాదకరమైన పోస్టులు పెట్టింది. మరోవైపు సోషల్ మీడియాలో సియా కు కేతన్ ప్రపోజ్ చేసిన వీడియో.. హగ్ చేసుకున్న వీడియోలు కలకలం సృష్టిస్తున్నాయి. కాగా.. కేతన్ నచ్చకపోతే సియా ముందే చెప్పాలి.. అంతేగాని ఇలా చంపడం ఏంటని సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper