Homeబిజినెస్Vivo X Fold 6 latest features: ఈ ఫోన్ రోజంతా వాడినా.. వెంటనే ఛార్జింగ్...

Vivo X Fold 6 latest features: ఈ ఫోన్ రోజంతా వాడినా.. వెంటనే ఛార్జింగ్ చేసుకోవచ్చు..

Vivo X Fold 6 latest features: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ Vivo X Fold 6 ను చైనా మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధమైంది. అయితే ఇప్పటికే ఈ ప్రీమియం బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ ధరలు, వేరియంట్లపై చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘వేబో’ ద్వారా లీక్ కావడంతో ఈ ఫోన్ గురించి హాట్ టాఫిక్ అయింది. అంతేకాకుండా కెమెరా, ఫర్ఫామెన్స్ విషయంలోనూ ఈ ఫోన్ గురించి […]

Vivo X Fold 6 latest features: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ Vivo X Fold 6 ను చైనా మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధమైంది. అయితే ఇప్పటికే ఈ ప్రీమియం బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ ధరలు, వేరియంట్లపై చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘వేబో’ ద్వారా లీక్ కావడంతో ఈ ఫోన్ గురించి హాట్ టాఫిక్ అయింది. అంతేకాకుండా కెమెరా, ఫర్ఫామెన్స్ విషయంలోనూ ఈ ఫోన్ గురించి ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఈ ఫోన్ ఎలా ఉందంటే?

వివో ఎక్స్ ఫోల్డ్ 6 మొత్తం నాలుగు స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులోకి రానుంది. గత మోడల్ ఎక్స్ ఫోల్డ్ 5 తో పోలిస్తే ఈసారి మెమరీ కాంపోనెంట్స్ ధరలు పెరగడం వల్ల దీని ధరలలో భారీ మార్పు కనిపిస్తోంది. 12GB RAMతో పాటు 256GB స్టోరేజ్ ధర 9,999 యువాన్లు (ఇండియన్ కరెన్సీలో రూ. 1,40,000)గా నిర్ణయించారు. టాప్ వేరియంట్ 16GB RAM, 1TB స్టోరేజ్ 12,499 యువాన్లు (సుమారు రూ.1,75,000).

ఫోల్డబుల్ ఫోన్లలోనే అత్యంత శక్తివంతమైన పర్ఫార్మెన్స్ అందించడం కోసం వివో ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9500 సూపర్ ఎడిషన్ చిప్‌సెట్‌ను ఉపయోగించబోతోంది. ప్రత్యేకంగా పెద్ద స్క్రీన్లు, లార్జ్-స్కేల్ AI ఫీచర్ల కోసం ఈ 3nm ప్రాసెసర్‌ను డెవలప్ చేశారు. సాధారణంగా ఫోల్డబుల్ ఫోన్లు సన్నగా ఉండటం వల్ల వాటిలో బ్యాటరీ సామర్థ్యం తక్కువగా ఉంటుంది. కానీ వివో ఈ కొత్త ఫోన్ లో 7,000mAh బ్యాటరీని అమర్చినట్లు తెలుస్తోంది. ఈ బ్యాటరీ, ఎంత వాడినా సింగిల్ ఛార్జ్‌పై 9.8 గంటల పాటు నిరంతరాయంగా నడుస్తుందని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి.

వివో ఎక్స్ ఫోల్డ్ 6 మినీ DSLR లా పనిచేస్తుందని కంపెనీ టీజ్ చేసింది. ఇందులో సామ్‌సంగ్‌తో కలిసి సంయుక్తంగా డెవలప్ చేసిన 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అమర్చారు. అలాగే 50MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉండనున్నాయి. డిస్‌ప్లే విషయానికొస్తే.. లోపలి భాగంలో 8.02 అంగుళఆల ఫోల్డబుల్ OLED స్క్రీన్ అందించారు. జూన్ 26 చైనా లాంచ్ తర్వాత ఈ ఫోన్ గ్లోబల్ మరియు భారత మార్కెట్లలో ఎప్పుడు విడుదలవుతుందనే దానిపై స్పష్టత రానుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper