Homeఎంటర్టైన్మెంట్Modi praises Ram Charan: రామ్ చరణ్ పై ప్రశంసల వర్షం కురిపించిన ప్రధానమంత్రి నరేంద్ర...

Modi praises Ram Charan: రామ్ చరణ్ పై ప్రశంసల వర్షం కురిపించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ట్వీట్ వైరల్..

Modi praises Ram Charan: మెగాస్టార్ చిరంజీవి కి రామ్ చరణ్ ని చూసినప్పుడల్లా ఎంత పుత్రోత్సాహం కలుగుతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 40 ఏళ్ళ తన సుదీర్ఘ సినీ కెరీర్ లో చిరంజీవి కూడా చెయ్యలేని పాత్రలు , ఆయన సాధించలేని రికార్డులు క్రియేట్ చేస్తూ రామ్ చరణ్ గ్లోబల్ వైడ్ గా సొంతం చేసుకుంటున్న ఫేమ్ ని చూసి ఆయన ఎంతగానో మురిసిపోతుంటాడు. నిన్న హైదరాబాద్ లో జరిగిన ‘పెద్ది’ సక్సెస్ ఫంక్షన్ లో […]

Modi praises Ram Charan: మెగాస్టార్ చిరంజీవి కి రామ్ చరణ్ ని చూసినప్పుడల్లా ఎంత పుత్రోత్సాహం కలుగుతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 40 ఏళ్ళ తన సుదీర్ఘ సినీ కెరీర్ లో చిరంజీవి కూడా చెయ్యలేని పాత్రలు , ఆయన సాధించలేని రికార్డులు క్రియేట్ చేస్తూ రామ్ చరణ్ గ్లోబల్ వైడ్ గా సొంతం చేసుకుంటున్న ఫేమ్ ని చూసి ఆయన ఎంతగానో మురిసిపోతుంటాడు. నిన్న హైదరాబాద్ లో జరిగిన ‘పెద్ది’ సక్సెస్ ఫంక్షన్ లో చిరంజీవి తన కొడుకు గురించి గర్వంగా మాట్లాడుతూ ఎంతో సంతోషించాడో మన కళ్లారా చూశాము . సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ ప్రసంగానికి సంబంధించిన వీడియో నే చక్కర్లు కొడుతోంది. ఇదంతా పక్కన పెడితే మొన్న రామ్ చరణ్ ముంబై లో జరిగిన ఒక సమ్మిట్ కి హాజరైన సంగతి తెలిసిందే.

ఈ సమ్మిట్ కి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా హాజరయ్యారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ రామ్ చరణ్ ని ‘న్యూ ఏజ్ మెగాస్టార్’ గా సంబోదించాడు. దీనిపై నిన్న చిరంజీవి సక్సెస్ ఈవెంట్ లో చాలా గొప్పగా చెప్పుకొచ్చాడు. ఇప్పుడు కాసేపటి క్రితమే ఆయన తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కూడా ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టాడు, జనుల గనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ ‘ అనే పద్యాన్ని షేర్ చేసాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘నిన్న మన భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న రిపబ్లిక్ టీవీ కార్యక్రమంలో రామ్ చరణ్ ని న్యూ ఏజ్ మెగాస్టార్ అని సంబోధించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఇలాంటి ప్రతిష్టాత్మక వేదికలపై చరణ్ కి లభిస్తున్న గుర్తింపు , గౌరవం చూస్తుంటే ఒక తండ్రిగా ఎంతో గర్వంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘తన కృషి , అంకితభావం , నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రమే కాదు , దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపు కూడా సంపాదించుకోవడం నిజంగా సంతోషకరం. ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరింపచెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ ఆయన చాలా భావోద్వేగం తో ట్వీట్ వేశారు. దీనిపై సోషల్ మీడియా లో అభిమానులు ఆనందిస్తుంటే , యాంటీ ఫ్యాన్స్ మాత్రం ట్రోల్స్ చేస్తున్నారు. ఇంత చిన్న దానికే చిరు ఇంతలా మురిసిపోతున్నాడు , రేపు నేషనల్ అవార్డు వస్తే ఇక పట్టుకోలేము ఏమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper