Homeబిజినెస్Motorola Edge 70 Max features: అధునాతన ఫీచర్లు.. అద్భుతమైన డిజైన్..Motorola కొత్త ఫోన్ చూశారా..

Motorola Edge 70 Max features: అధునాతన ఫీచర్లు.. అద్భుతమైన డిజైన్..Motorola కొత్త ఫోన్ చూశారా..

Motorola Edge 70 Max features: Motorola కంపెనీ నుంచి అత్యంత శక్తివంతమైన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ రాబోతుంది. ‘Motorola Edge 70 Max’ పేరుతో వస్తున్న ఈ మొబైల్ గురించి ఇప్పటికే ప్రకటించడంతో కొత్తగా ఫోన్ కొనేవారిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్కెట్లో ఉన్న ప్రీమియం ఫోన్‌లకు ఇది గట్టి పోటీ ఇచ్చేలా ఉందని కొందరు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. అధునాతన ఫీచర్లు, అద్భుతమైన డిజైన్ ను కలిగి ఉన్న ఈ ఫోన్ గురించి […]

Motorola Edge 70 Max features: Motorola కంపెనీ నుంచి అత్యంత శక్తివంతమైన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ రాబోతుంది. ‘Motorola Edge 70 Max’ పేరుతో వస్తున్న ఈ మొబైల్ గురించి ఇప్పటికే ప్రకటించడంతో కొత్తగా ఫోన్ కొనేవారిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్కెట్లో ఉన్న ప్రీమియం ఫోన్‌లకు ఇది గట్టి పోటీ ఇచ్చేలా ఉందని కొందరు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. అధునాతన ఫీచర్లు, అద్భుతమైన డిజైన్ ను కలిగి ఉన్న ఈ ఫోన్ గురించి పూర్తి వివరా్లోకి వెళితె..

మోటోరోలా ఎడ్జ్ 70 సిరీస్ నుంచి ‘మాక్స్’ స్మార్ట్‌ఫోన్ రాబోతుంది. దీని పర్ఫార్మెన్స్ సరికొత్త రికార్డులు సృష్టించనుందని అంటున్నారు. ఇందులో క్వాల్‌కామ్ Snapdragon 8 Gen 5 చిప్‌సెట్‌ ఉండనుంది. దీంతో గేమింగ్, మల్టీ టాస్కింగ్ తో పాటు ఏఐ (AI) ఫీచర్లను ఉపయోగించే వారికి ఈ ప్రాసెసర్ చాలా ఉపయోగపడుతుంది. ఇందులో లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ ‘Hello UI’ ఉండనుంది.

ఈ కొత్త ఫోన్ లో 6.82 అంగుళాలOLED LTPO డిస్‌ప్లే ఉండనుంది. ఇది 2K రిజల్యూషన్ తో పనిచేస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేయడం వల్ల స్క్రోలింగ్, విజువల్స్ చాలా స్మూత్‌గా ఉంటాయి. ఈసారి మోటోరోలా ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్ , అల్ట్రా-స్లిమ్ బెజెల్స్‌తో ప్రీమియం లుక్‌ను అందించబోతోంది. గ్లాసియర్ బ్లూ, ఒనిక్స్ బ్లాక్ మరియు సేజ్ గ్రీన్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది.

కెమెరా విభాగంలో మోటోరోలా ఎడ్జ్ 70 మాక్స్ ఎక్కడా తగ్గడం లేదు. దీని వెనుక భాగంలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉన్న 50MP సోనీ లిటియా ప్రధాన కెమెరాను అమర్చినట్లు తెలుస్తోంది. దీంతో పాటు అల్ట్రా వైడ్, టెలిఫోటో లెన్స్‌లు కూడా ఉండనున్నాయి. చీకటిలో సైతం స్పష్టమైన, హై-క్వాలిటీ ఫోటోలను తీయడానికి ఈ కెమెరా సెటప్ అద్భుతంగా పని చేస్తుంది. ఇక సెల్ఫీల కోసం ముందు భాగంలో 32MP కెమెరాను కేటాయించినట్లు తెలుస్తోంది.

ఈ ఫోన్‌లో 8000mAh బ్యాటరీని అమర్చనున్నట్లు గ్యాడ్జెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇంత పెద్ద బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. దీంతో మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉండే అవకాశం ఉంది. దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం IP68/69 రేటింగ్ ఉండనుంది.

భారత మార్కెట్లో ఈ Motorola Edge 70 Max ధర సుమారు రూ. 54,999 నుండి రూ. 59,999 మధ్య ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. శాంసంగ్, వన్‌ప్లస్ వంటి బ్రాండ్ల ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లకు తక్కువ ధరలోనే గట్టి పోటీ ఇవ్వడమే లక్ష్యంగా మోటోరోలా ఈ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే అంతర్జాతీయంగా మరియు భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేయనుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper