Home Blog Page 61

ఫోల్డబుల్ ఫోన్ హిస్టరీలోనే బలమైన బ్యాటరీ.. త్వరలోనే మార్కెట్లోకి..

Vivo X Fold 6
Vivo X Fold 6

Vivo X Fold 6: Vivo కంపెనీకి చెందిన కొత్త ఫోన్ ఇటీవల చైనాలో లాంచ్ చేయబడింది. ఈ కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫీచర్లు, భారీ బ్యాటరీ సామర్థ్యంతో మార్కెట్లోకి వచ్చింది. ప్రీమియం లుక్ తో పాటు ఆకర్షణీయమైన డిజైన్ కలిగిన ఫోన్ కావాలని అనుకునేవారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఫోన్‌ గురించి పూర్తి వివరాల్లోకి వెళితె…

Also Read: వెంకటేష్ ఆ జానర్ ను టచ్ చేస్తే బాగుంటుందిగా…

చైనాలో జరిగిన ఒక ప్రత్యేక ఈవెంట్‌లో వివో కంపెనీకి చెందిన కొత్త ఫోన్ Vivo X Fold 6 ను లాంచ్ చేశారు. ఇది ఈ కంపెనీ నుంచి వచ్చిన అత్యంత శక్తివంతమైన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా నిలుస్తుంది. రౌండెడ్ కార్నర్లు, ప్రీమియం లుక్‌తో చాలా ఆకర్షణీయంగా ఉన్న ఈ ఫోన్ ‘బ్లూ హోల్’, ‘పోలార్ నైట్’, ‘సాల్ట్ లేక్’ అనే మూడు ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది.

ఈ ఫోన్‌లో అత్యుత్తమమైన డిస్‌ప్లేను అందించారు. ఇందులో 8.02 అంగుళాల ఫోల్డబుల్ శామ్‌సంగ్ M14 AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో పనిచేస్తుంది. బయట వైపు 6.51 అంగుళాల కవర్ డిస్‌ప్లే ఉంది. ఇందులో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. దీంతో పాటు మల్టీ టాస్కింగ్ కోసం ‘ఆరిజిన్ OS 6 ఫోల్డ్’ సాఫ్ట్‌వేర్ కూడా ఉంది.

ఈ ఫోన్‌లోని అతి ముఖ్యమైన ఫీచర్ బ్యాటరీ. ఫోల్డబుల్ ఫోన్లలోనే అత్యధికంగా 7,000mAh బ్యాటరీని కంపెనీ ఇందులో అందించింది. ఇది 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. కెమెరా విషయానికొస్తే.. దీని వెనుక వైపు 200MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా వైడ్, 50MP టెలిఫోటో లెన్స్‌లతో కూడిన పవర్డ్ కెమెరా సెటప్ ఉంది.

ప్రస్తుతానికి ఈ ఫోన్ చైనాలో మాత్రమే లాంచ్ చేయబడింది. దీని ప్రారంభ ధర 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌కు సుమారు 7,999 యువాన్లుగా (సుమారు రూ. 1,11,000) ఉంది. టాప్ వేరియంట్ 16GB RAM + 1TB స్టోరేజ్ వేరియంట్ ధర దాదాపు 10,999 యువాన్ల వరకు ఉంది. ఈ ఫోన్ జూలై 1 నుండి చైనాలో విక్రయానికి అందుబాటులోకి రానుంది.

మటన్ తునకల కోసం.. పొట్టు పొట్టు కొట్టుకున్నరు.. బలగం సినిమా రిపీట్ అయిందిగా..

Mutton Fight
Mutton Fight

Mutton Fight: తెలంగాణలో మటన్ అంటే ఒక ఎమోషన్.. కార్యం ఏదైనా కానీ మటన్ ఉండాల్సిందే. అందులోకి మందు కూడా.. మందు తాగుతూ.. మటన్ తింటూ ఎంజాయ్ చేసేవాళ్ళు చాలామంది. ఇందులో మూలుగ బొక్కల కోసం.. తలకాయ కూర కోసం సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది..

Also Read: వెంకటేష్ ఆ జానర్ ను టచ్ చేస్తే బాగుంటుందిగా

తెలంగాణలో మిగతా మర్యాదలు పక్కన పెడితే.. వేడుకల సమయంలో మటన్ గట్టిగానే పెట్టాలి.. తునకలు కంచం నిండా వెయ్యాలి. తునకలు వేసే విషయంలో ఏదైనా తేడా జరిగితే ఇక అంతే సంగతులు. గొడవ పుడుతుంది.. కొట్లాట దాకా వస్తుంది. అచ్చం బలగం సినిమా లాగా.

బలగం సినిమా వచ్చిన తర్వాత తునకల కోసం జరిగే కొట్లాటలు పెరిగిపోయాయి. అలాగని ఆ సినిమా ఈ కొట్లాటలకు కారణం కాదు. కేవలం మటన్ ముక్కల కోసం మాత్రమే ఈ పంచాయతీ మొత్తం. తాజాగా సూర్యాపేట జిల్లాలో బలగం సీన్ రిపీట్ అయింది. పెళ్లికి సంబంధించిన డిన్నర్లో మటన్ కూర.. మూలుగ బొక్కల కోసం పెద్ద పంచాయతీ నడిచింది. పెన్ పహాడ్ మండలం అనంతరం గ్రామంలో ఒక వివాహం జరిగింది. వివాహం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం విందు నిర్వహించారు. పెళ్ళికొడుకు బంధువులు భోజనం సమయానికి కాకుండా.. కాస్త ఆలస్యంగా వచ్చారు. అప్పటికే దాదాపు పూర్తయింది.

“మేం బంతిలో కూకున్నాం.. ముక్కలు లేవు. బొక్కలు కూడా లేవు. సరిగా బువ్వ కూడా పెట్టడం లేదని” పెళ్ళికొడుకు తరఫు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. అమ్మాయి తరఫు బంధువులతో అగ్రహారం దిగారు..”భోజనం సమయం కాకుండా ఇంత ఆలస్యంగా వస్తే ఎలా.. ఇప్పుడు మటన్ లేదని గొడవ చేస్తే ఎలా..” అంటూ అమ్మాయి తరఫు వాళ్ళు ఎదురు తిరిగారు.. ఈ విషయంలో రెండు వర్గాల మధ్య మాటలు పెరిగాయి. ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. మండపంలోనే గట్టిగా కొట్టుకున్నారు. దీంతో రెండు వర్గాల వారు పోలీస్ స్టేషన్ దాకా వెళ్లారు.. పోలీసులు ఇరు వర్గాల వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వెనక్కి పంపించారు.

మరో యుద్ధానికి అమెరికా, రష్యా సిద్ధం.. సైన్యాన్ని పెంచుకుంటున్న జర్మనీ.. ఏ జరుగుతోంది..

Germany Military
Germany Military

Germany Military: ప్రపంచ ఆటోమొబైల్ రాజధానిగా జర్మనీ దేశానికి పేరు ఉంది. యూరప్ ఖండం లోనే అత్యంత విలాసవంతమైన దేశంగా జర్మనీ కొనసాగుతోంది. జర్మనీ నాటో లో కొనసాగుతున్నప్పటికీ.. స్వయం ప్రతిపత్తిని ఎక్కువగా కోరుకుంటుంది జర్మనీ. అందువల్లే నాటో దేశాలతో అంటి ముట్టినట్టుగా వ్యవహరిస్తూ ఉంటుంది. పైగా రష్యా తో ఉక్రెయిన్ యుద్ధం చేస్తున్నప్పుడు జర్మనీ టచ్ మీ నాట్ అన్నట్టుగానే వ్యవహరించింది. మిగతా దేశాలు యుద్ధానికి సపోర్ట్ చేయగా.. జర్మనీ మాత్రం తన పరిధిలో మాత్రమే వ్యవహరించింది.

Also Read: వెంకటేష్ ఆ జానర్ ను టచ్ చేస్తే బాగుంటుందిగా…

జర్మని కి ఆది నుంచి కూడా రష్యాతో శత్రుత్వం కొనసాగుతోంది. ప్రపంచ యుద్ధాల నుంచి కూడా రెండు దేశాల మధ్య శత్రుత్వం ఉంది. ఇటీవల కాలంలో రష్యా ఉక్రెయిన్ దేశంతో యుద్ధం చేస్తోంది. ఈ యుద్ధం వల్ల రష్యా నష్టపోయింది. దీనికి తోడు జర్మనీ చేయనాతో సంబంధాలను పెంచుకుంది. వాణిజ్యంగా కూడా జర్మనీ అభివృద్ధి చెందుతోంది. సరికొత్త ప్రణాళికలతో దూసుకుపోతోంది. ఆటోమొబైల్ పరిశ్రమల ద్వారా వృద్ధుని మరింత ఎక్కువగా నమోదు చేస్తోంది. వాణిజ్యపరంగా తమ నుంచి జర్మనీ వెళ్తోందని అమెరికా అక్కసు పెంచుకుంది. దీనికి తోడు, రష్యా కూడా జర్మనీ మీద ఆగ్రహంగా ఉంది. అటు అమెరికా.. ఇటు రష్యా రెండు బలమైన దేశాలు. పైగా నాటోలో జర్మనీ పాత్ర అంతంత మాత్రమే. అలాంటప్పుడు ఈ రెండు దేశాలు జర్మనీ మీద యుద్ధం సాగిస్తే అప్పుడు పరిస్థితులు మారిపోతాయి.

జర్మనీ ఈ ప్రమాదాన్ని ముందుగానే అంచనా వేసింది. ఇటీవల కాలంలో అమెరికా జర్మనీ మీద తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. రష్యా కూడా అదే స్థాయిలో కోపాన్ని ప్రదర్శిస్తుంది. దీంతో జర్మనీ ముందు జాగ్రత్త చర్యగా తన సైన్యాన్ని పెంచుకునేందుకు సిద్ధంగా ఉంది. అందువల్లే కేటాయింపులు.. ఇతర వ్యవహారాలు వేగంగా సాగిస్తోంది. దీనికి తోడు నాటో దేశాల భద్రతకు సంబంధించి అమెరికా భారీగానే సహాయం చేస్తోంది. అయితే జర్మనీ మాత్రం తన ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసుకుంటున్న నేపథ్యంలో అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇటీవల కాలంలో ట్రంప్ జర్మనీ మీద అనేక సందర్భాలలో తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అందువల్లే జర్మనీ సైన్యాన్ని పెంచుకునేందుకు అడుగులు వేస్తోంది.

సైనిక శక్తిపరంగా.. ఆయుధ శక్తి పరంగా జర్మనీ అటు రష్యాతో.. ఇటు అమెరికాతో పోటీ పడలేదు. పైగా జర్మనీ దగ్గర సైన్యం కూడా తక్కువగానే ఉంటుంది. జర్మనీ ప్రపంచంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాత్ర పోషించినప్పటికీ.. ఆ తర్వాత పెద్దగా యుద్ధాలు చేసిన దాఖలాలు లేవు. పక్కనున్న దేశాలతో జర్మనీ పెద్దగా స్నేహంగా ఉండదు. అలాగని శత్రుత్వాన్ని కొనసాగించదు. అవసరాల మేరకు మాత్రమే నడుచుకుంటుంది. ఇప్పుడు అమెరికా.. రష్యా కారాలు మీరాలు నూరుతున నేపథ్యంలో.. జర్మనీ తనను తను కాపాడుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. చూడాలి మరి ఈ పరిణామం దేనికి దారితీస్తుందో..

సాయి కృష్ణ కేసు.. సీఐతో పాటు అతడు.. ఆ రాత్రి ఏం జరిగిందంటే

Sai Krishna Case
Sai Krishna Case

Sai Krishna Case: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగర పరిధిలో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో చోటు చేసుకున్న సాయి కృష్ణ కేసులో కీలక విషయాలు తెలుస్తున్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం వేగంగా విచారణ కొనసాగిస్తోంది. అంతేకాదు కృష్ణలంక సీఐ నాగరాజును ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను విచారిస్తున్నారు.

నాగరాజును విచారిస్తున్న క్రమంలో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ పోలీసులు నాగరాజు స్నేహితుడు సురేష్ ను అరెస్ట్ చేశారు. నాగరాజు స్నేహితుడు సురేష్ కు ఈ కేసుతో ఏం సంబంధం.. సాయి కృష్ణ వ్యవహారంలో అతడికి ఏమైనా పాత్ర ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..

ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు సిఐ నాగరాజు స్నేహితుడు సురేష్ ను అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ కేసు మరింత జటిలంగా మారింది. కీలకమైన పరిణామాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో.. సాయి కృష్ణ వ్యవహారంలో ఏం జరిగింది అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

సాయి కృష్ణ మరణించిన తర్వాత అతడి మృతదేహాన్ని మాయం చేయడానికి సురేష్ సహాయం చేశాడని.. సాయి కృష్ణ మృతదేహాన్ని సురేష్ వేరే ప్రాంతానికి తీసుకెళ్లాడని ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు తమ విచారణలో గుర్తించారు.. శ్రీ నాగరాజు సురేష్ అన్ని విధాలుగా సహాయం చేసినట్టు ఆధారాలు ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులకు లభ్యమయ్యాయి.. సిఐ నాగరాజుకు సురేష్ తో ఆర్థికపరమైన సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది.

సాయి కృష్ణ మరణ వార్తను బయటికి రాకుండా ఉండడానికి సురేష్ వారి కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరిగినట్టు తెలుస్తోంది.. కుటుంబ సభ్యులను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి సురేష్ రకరకాల ప్రయత్నాలు చేసినట్టు కూడా సమాచారం.. అయితే ఈ కేసుకు సంబంధించి పూర్తిస్థాయిలో వివరాలు సురేష్ ద్వారా తెలిసే అవకాశం ఉంది. అతడు చెప్పే వివరాల ఆధారంగా ఈ కేసు కు సంబంధించిన మరిన్ని విషయాలు బయటపడతాయని సమాచారం.

షార్ట్ వేసుకోవద్దని జర్మనీలో జర్మనీ లేడీలను అడ్డుకున్న బుర్ఖా మహిళలు.. తెగించేశారు.. వైరల్ వీడియో

Germany
Germany

Germany: ఎవరైనా సరే ఈ భూమ్మీద తమకు నచ్చిన దుస్తులు వేసుకోవచ్చు. తమకు నచ్చిన తిండి తినొచ్చు. తమకు నచ్చినట్టుగా ఉండవచ్చు. ఎందుకంటే మనిషి జీవితంలో స్వేచ్ఛ ఉండాలి. స్వాతంత్రం ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా తన జీవితాన్ని తనకు నచ్చినట్టుగా జీవించాలి. కానీ కొందరికి.. ముఖ్యంగా చాందసవాదులకు ఇటువంటివి అర్థం కావు. దుస్తులు ధరించే విషయంలో ఇబ్బంది పడతారు. తినే తిండి విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తారు. చివరికి వాళ్ళ బతుకులు వాళ్ళ బతుకుతున్నప్పటికీ.. అందులో నిప్పులు పోస్తారు. అటువంటిదే ఈ సంఘటన కూడా.

యూరప్ ఖండంలో జర్మనీ అత్యంత ప్రముఖమైన దేశం. ప్రపంచంలో లగ్జరీ ఆటోమొబైల్ బ్రాండ్లకు ఈ దేశం పెట్టింది పేరు. ఇక్కడ కొంతకాలంగా ముస్లింల జనాభా పెరుగుతోంది. అది ఎంతకు పెరిగిపోయింది అంటే.. ఏకంగా అక్కడి ప్రజలనే ప్రశ్నించి.. రోడ్డుమీద పడేసేంతగా.. తాజాగా జరిగిన ఓ సంఘటన దీనికి బలం చేకూర్చుతోంది.

జర్మనీలోని ఓ ప్రాంతంలో ఓ మహిళ షార్ట్ ధరించి సైకిల్ తొక్కుకుంటూ రోడ్డు మీదకి వచ్చింది. అక్కడ కొంతమంది ముస్లింలు ఉన్నారు. అందులో మహిళలు కూడా ఉన్నారు. వరద కూడా బుర్ఖా ధరించి ఉన్నారు. అది మొత్తం ముస్లింలు నివసించే ప్రాంతం. అక్కడికి వచ్చిన ఆ జర్మనీ యువతిని ముస్లిం మహిళలు అడ్డగించారు.

షార్ట్ ఎందుకు ధరించావు.. ఇక్కడ పూర్తిగా ఇస్లామిక్ దుస్తులు మాత్రమే ధరించాలంటూ ఆమెను ప్రశ్నించారు. దానికి ఆ జర్మనీ యువతి తీవ్రస్థాయిలో మండిపడింది. నాకు నచ్చినట్టు నేనుంటాను.. మీరెవరు ప్రశ్నించడానికి అన్నట్టుగా అడిగింది. దానికివారు ఆగ్రహంతో ఊగిపోయారు. ఇంతలో మరొక యువకుడు అక్కడికి వచ్చాడు. వెంటనే ఆ జర్మనీ యువతిని రోడ్డుమీదికి లాక్కెళ్ళి నెట్టేసి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తున్నాయి. జర్మనీలో జర్మనీ ప్రజలకు కాకుండా ముస్లింలకు ఎందుకు అధికారం.. స్థానికుల మీద వారి ఆధిపత్యం ఏంటి.. ధరించే దుస్తుల విషయాల్లో కూడా ఈ మూర్ఖత్వం ఏంటి అంటూ.. సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.. ఇటువంటి సంఘటనలు మళ్లీ జరగకుండా జర్మనీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమార్తె ఎంత అందంగా ఉందంటే?

Actress Divija Prabhakar
Actress Divija Prabhakar

వ్యూస్ కోసం పిచ్చి లేసి వెర్రిగంతులు వేస్తే.. ఉప్పల్ బాలు తిక్క ఇలా కుదిరింది

Uppal Balu
Uppal Balu

Uppal Balu: సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఉప్పల్ బాలు వీడియోలు వస్తూనే ఉంటాయి. అతడు పిచ్చి గంతులు వేస్తూనే ఉంటాడు. వెర్రి లేచినవాడిగా అరుస్తూనే ఉంటాడు. పైగా వాడి పిచ్చి పిచ్చి వేషాలు.. చిల్లర వివరాలు ఇబ్బంది కలిగిస్తుంటాయి. సోషల్ మీడియాలో కామెంట్లు నెగిటివ్గా వచ్చిన సరే అతడు ఏమాత్రం పట్టించుకోడు. పైగా మరింత మూర్ఖంగా వ్యవహరిస్తూ ఉంటాడు. సోషల్ మీడియాలో సెలబ్రిటీ కావాలని ఉప్పల్ బాలు చేసే పిచ్చి చేష్టలు చాలా ఇబ్బంది కలిగిస్తుంటాయి.

Also Read: వెంకటేష్ ఆ జానర్ ను టచ్ చేస్తే బాగుంటుందిగా…

ఇటీవల ఉప్పల్ బాలు ప్రముఖ పుణ్యక్షేత్రమైన అనంతగిరి వెళ్ళాడు. అక్కడ తన బ్యాచ్ కూడా ఉంది. వేగంగా వెళుతున్న కారు మీద కూర్చున్న అతడు వెర్రి వేషాలు వేశాడు. ప్రమాదకరమైన రీల్స్ చేశాడు. వాటిని సోషల్ మీడియాలోకి ఎక్కించాడు. దీంతో సోషల్ మీడియాలో అతడి తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం అయింది. దట్టమైన అడవిలో ఈ వెర్రి పనులు ఏంటని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ వీడియోలో అటవీ శాఖ అధికారుల దృష్టికి వెళ్లాయి. పైగా అన్నతకి దట్టమైన అటవీ ప్రాంతం. ఇక్కడ శబ్ద కాలుష్యం చేయకూడదు. అంతేకాదు ఇతర ప్రయాణికుల భద్రతకు భంగం కలిగించకూడదు. అది చేశాడు కాబట్టి ఉప్పల్ బాలు.. అతడి అనుచరుల మీద పోలీసులు కేసు పెట్టారు. అదే కాదు అతడు ఉపయోగించిన వాహనాన్ని గుర్తించిన పోలీసులు.. కేసులు పెట్టేందుకు రెడీ అయ్యారు. ఈ వాహనాన్ని సీజ్ చేసేందుకు కూడా అధికారులు వెనుకాడటం లేదు. పర్యావరణానికి.. జంతువులకు ఇబ్బంది కలిగించే పనులు చేస్తే ఊరుకునేది లేదని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఈ సంఘటన చాలామంది సోషల్ మీడియా సెలబ్రిటీలకు గుణపాఠం లాగా ఉంది. పోలీసులు ఇప్పటికే తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీలు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు అటవీ అందాలను ఆస్వాదించి వెళ్లాలని.. అలాకాకుండా ఇలాంటి వేషాలు వేస్తే తాట తీస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఉప్పల్ బాలుకు ఎదురైన అనుభవం చాలామంది సోషల్ మీడియా సెలబ్రిటీలకు గుణపాఠం నేర్పిందని నెటిజన్లు అంటున్నారు.

వెంకటేష్ ఆ జానర్ ను టచ్ చేస్తే బాగుంటుందిగా...

Venkatesh dual role in Adarsha Kutumbam
Venkatesh dual role in Adarsha Kutumbam

Venkatesh : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున నలుగురు నాలుగు పిల్లర్లుగా సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్తున్నారు. సీనియర్ హీరోలుగా ముందుకు దూసుకెళుతున్న వాళ్లు ఒకప్పుడు పెను సంచలనాలను క్రియేట్ చేశారు. వాళ్ల నుంచి ఒక సినిమా వస్తుందంటే అది పక్కాగా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసే సినిమానే అంటూ ప్రేక్షకులైతే నమ్మేవారు. అలాంటి హీరోలు ఈ మధ్యకాలంలో మాస్ కమర్షియల్ సినిమాలపై అడుగులు వేస్తున్నారు ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ అయితే కామెడీ సినిమాలతోనే ముందుకు సాగుతున్నాడు. అలా కాకుండా వెంకటేష్ అద్భుతమైన నటుడని అతను ఎలాంటి పాత్రనైనా సరే అలవోకగా చేసి మెప్పించగలుగుతాడు అంటూ చాలామంది చాలా రకాల కామెంట్లు చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా విక్టరీ వెంకటేష్ ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలు అతనికి మంచి విజయాలను కట్టబెడుతున్నాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో 300 కోట్లకు పైన కలెక్షన్స్ రాబట్టిన ఆయన ఇప్పుడు చేయబోతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాతో మరింత ముందుకు వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అనిల్ రావిపూడి తో మరోసారి జత కడుతున్నాడు. కాబట్టి ఈ సినిమా కూడా ఫ్యామిలీ కామెడీ జానర్ లోనే తెరకెక్కుతుందని తెలుస్తుంది.

ఇక ఇలా కాకుండా వెంకటేష్ డిఫరెంట్ క్యారెక్టర్లలో నటించగలిగితే బాగుంటుందని మలయాళంలో మోహన్ లాల్ డిఫరెంట్ సినిమాలను చేస్తున్నాడు. అతని తరహాలోనే వెంకటేష్ కూడా అలాంటి ఫ్యామిలీ సబ్జెక్ట్ లను, సీరియస్ జానర్ లో ఉన్న సినిమాలు చేస్తే అతనికి ప్రేక్షకుడి నుంచి మంచి గుర్తింపు వస్తుంది. అలాగే సినిమాలు కూడా బాగా ఆడతాయని, కొత్తదనాన్ని పరిచయం చేసిన వాళ్లవుతారంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు…

విక్టరీ వెంకటేష్ సైతం అలాంటి సబ్జెక్టుల కోసం ఎదురుచూస్తున్నాడట. కానీ తన దగ్గరికి వచ్చిన దర్శకులు కేవలం కామెడీ సబ్జెక్ట్స్ మాత్రమే తీసుకొని వస్తున్నారని దానికి తను చేసేది ఏమీ లేక ఆ కథలను ఒప్పుకొని సినిమాలుగా చేస్తున్నానని దానికి ప్రేక్షకులు ఆదరిస్తున్నారని కూడా చెబుతున్నాడు.

ప్రయోగాత్మకమైన సినిమాలు చేయడానికి తను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని కానీ దర్శకులు తనతో ప్రయోగాలు చేయించడానికి రెడీగా ఉన్నారా? లేదా అంటూ వాళ్ళకే సవాళ్లను విసురుతున్నాడు. అతని సవాళ్లను స్వీకరించి ఎవరైనా దర్శకుడు కొత్త కాన్సెప్ట్ తో కథను రెడీ చేసి అతని దగ్గరికి తీసుకెళ్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది…

ఎన్టీఆర్ తో సినిమా చేయాలంటే డైరెక్టర్ కి ఈ క్వాలిటీ ఉండాల్సిందేనా..?

NTR Birthday Special
NTR Birthday Special

Jr NTR : నందమూరి ఫ్యామిలీ మూడో తరం హీరోగా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్… ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్నాడు. ఇంతకుముందు చేసిన సినిమాలను ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలు మరోకెత్తుగా మారబోతున్నాయి. పాన్ ఇండియాలో తన మార్కెట్ ను విపరీతంగా విస్తరించుకోవాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ మధ్య స్టార్ హీరోలందరు భారీ ఎత్తున సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇప్పుడున్న పాన్ ఇండియా హీరోల్లో ఎన్టీఆర్ ఒక్కడే డీలాపడిపోతున్నాడు. దానివల్ల ఆయన రాబోయే సినిమాలతో ఎలాగైనా సరే పెను సంచలనాలను సృష్టించాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

జూనియర్ ఎన్టీఆర్ తో ఒక దర్శకుడు సినిమా చేయాలి అంటే అతనికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఆయన అంతకుముందు చేసిన సినిమా భారీ సక్సెస్ అయి ఉండాలి. అలాగే ఆ దర్శకుడు చెప్పే కథ ఎలివేషన్స్ తో కూడుకొని ఉండాలి…ఇండస్ట్రీ రికార్డు బ్రేక్ అయ్యే కథ మనం చేస్తున్నామని దర్శకుడు నమ్మకాన్నివ్వాలి.

ఇవన్నీ చేసినప్పుడే ఆయన ఒక దర్శకుడితో సినిమా చేయడానికి సిద్ధమవుతాడు అంటూ తన సన్నిహిత వర్గాల నుంచి కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి… ఇక ఏది ఏమైనా కూడా ఈ మధ్యకాలంలో ఆయన నుంచి వచ్చే ప్రతి సినిమాలో ఏదో ఒక డ్రాబ్యాక్ అయితే ఉంటుంది. అందుకే రాబోయే సినిమాతో ప్రేక్షకులను అలరించాలని చూస్తున్నాడు.

మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్యకాలంలో చేసిన సినిమాల కంటే కూడా ఇప్పుడు చేయబోతున్న డ్రాగన్ సినిమా 100 రెట్లు బెటర్ గా ఉండబోతుంది అంటూ ఆయన తన సన్నిహితుల దగ్గర చెబుతున్నాడు. మొత్తానికైతే ప్రశాంత్ నీల్ తో ఆయన క్రియేట్ చేయబోతున్నాడు అనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. డ్రాగన్ సినిమా గ్లింప్స్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సినిమా వరల్డ్ అనేది చాలా పెద్దగా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది…

వెంకటేష్ ఆ దర్శకుడిని వదిలేసి తప్పుచేశాడా..?

Venkatesh movie Balayya did not like
Venkatesh movie Balayya did not like

Venkatesh Movies : కలియుగ పాండవులు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన నటుడు విక్టరీ వెంకటేష్…ఆ మూవీ మంచి విజయాన్ని సాధించడంతో ఆయన వెనక్కి తిరిగి చూడకుండా వరుస సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగాడు. స్టార్ ప్రొడ్యూసర్ అయిన డాక్టర్ డి రామానాయుడు కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ చాలా తక్కువ సమయంలోనే వెంకటేష్ తండ్రి రామానాయుడు అని పిలిపించుకునే స్థాయికి ఎదిగాడు.

తన కెరియర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలను చేసిన వెంకటేష్ ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకున్నాడు. సీనియర్ హీరోలందరిలో కూడా తనకంటూ ఒక డిఫరెంట్ పంథా ను ఎంచుకొని మరి ఆయన ముందుకు దూసుకెళ్తుండడం ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆయన చేస్తున్న సినిమాల విషయంలో ఇంకాస్త క్లారిటిని మెయింటైన్ చేయాలని చూస్తున్నాడు.

వెంకటేష్ ఇంతకుముందు కొంతమంది దర్శకులను రిజెక్ట్ చేసి చాలా తప్పు చేశాడు. ముఖ్యంగా ఒక దర్శకుడిని రిజెక్ట్ చేసినందుకు ఆయన ఇప్పటికి బాధపడుతున్నాడట. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరంటే తేజ కావడం విశేషం…అప్పట్లో తేజ వెంకటేష్ తో ఒక డిఫరెంట్ సబ్జెక్టుని సినిమాగా చేద్దామని ప్లాన్ లో ఉండేవాడు. కానీ వెంకటేష్ మాత్రం ఒకటి రెండు సెట్టింగ్స్ వరకు కథకి ఓకే చెప్పినప్పటికి ఆ తర్వాత నుంచి వెంకటేష్ డైరెక్టర్ తేజ కథ నుంచి పూర్తిగా డివియేట్ అయిపోయినట్టుగా తెలుస్తుంది.

అందువల్లే వాళ్ళ కాంబినేషన్లో సినిమా రాలేదు. ఒకవేళ సినిమా చేసి ఉంటే వెంకటేష్ కెరియర్ ఇంకోలా ఉండేదేమో అని మరికొంతమంది భావిస్తూ ఉంటారు. ఎందుకంటే తేజ సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మూవీ హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలో చేసిన హీరో కి మంచి క్రేజ్ వస్తుంది. అందుకే ఆయన సినిమాల్లో నటించడానికి చాలామంది హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కానీ తేజ మాత్రం కొంతమంది హీరోలతోనే సెలెక్టెడ్ గా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు…

అమెరికా కంటే భారత్‌ బెటర్‌.. అన్ని దేశాలకు దీంతో అర్థమైంది

India vs USA, Cost of Living in India

India vs USA : గతంలోని భ్రమలు, సినిమాల ప్రభావంగత దశాబ్దాల్లో చాలా మంది, ముఖ్యంగా యువత, అమెరికాను జీవిత లక్ష్యంగా భావించేవారు. సినిమాలు, సీరియల్స్, సోషల్‌ మీడియా ద్వారా అక్కడి జీవితం అభివృద్ధి, సౌకర్యాలు, స్వేచ్ఛతో నిండి ఉంటుందని అనుకునేవారు. యూరప్‌ కూడా అదే విధంగా ఆదర్శంగా కనిపించేది. కానీ ఇప్పుడు ఆ దృక్పథం గణనీయంగా మారుతోంది. అమెరికన్లు, యూరోపియన్లు భారత్‌లో జీవన వ్యయాలు చాలా తక్కువగా ఉన్నాయని, అక్కడి జీవితం ఆర్థికంగా సౌకర్యవంతంగా ఉంటుందని గుర్తిస్తున్నారు.

రోజువారీ అవసరాలు, రవాణా, ఆరోగ్య సేవలు చౌక..
భారత్‌లో మెట్రో ఛార్జీలు చాలా సరసంగా ఉంటాయి. ఉదాహరణకు, పెద్ద నగరాల్లో ఒక్కసారి ప్రయాణం కొన్ని పదుల రూపాయల్లోనే సాధ్యం. అదే అమెరికా లేదా యూరప్‌లో రవాణా ఖర్చులు చాలా ఎక్కువ. మందులు, డాక్టర్‌ సంప్రదింపులు భారత్‌లో చాలా తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంటాయి. అక్కడి ఆస్పత్రులు, మందులు లక్షల రూపాయల వరకు వెళ్లవచ్చు. ఆన్‌లైన్‌ సేవలు కూడా భారత్‌లో చాలా చౌకగా ఉన్నాయి. ఇంటర్నెట్‌ డేటా, యాప్స్, డెలివరీ సేవలు కొన్ని రూపాయల్లోనే అందుబాటులో ఉంటాయి. అదే సేవలు విదేశాల్లో ఎక్కువ ఖర్చుతో వస్తాయి. మందులు, ఆరోగ్య సంబంధిత వస్తువులు కూడా భారత్‌లో సరసంగా ఉంటాయి. 2,400 రూపాయలకే నాణ్యమైన కాంటాక్ట్‌ లెన్స్‌లు దొరకడం, ఒక డాలర్‌ విలువకు సమానమైన ఖర్చుతో పూర్తి భోజనం (ఇంట్లో లేదా రెస్టారెంట్‌లో) అందుబాటులో ఉండటం విదేశీయులను ఆకర్షిస్తోంది. వీధి ఆహారం, సూపర్‌ మార్కెట్లు, ఆన్‌లైన్‌ డెలివరీలు రోజువారీ ఖర్చులు బాగా తక్కువ.

సంపాదనలో అవి బెటర్‌.. ఖర్చులో మనం సూపర్‌…
అమెరికా, యూరప్‌లో సంపాదన సామర్థ్యం ఎక్కువ. అక్కడ ఉద్యోగాలు, వేతనాలు సాధారణంగా లక్షల రూపాయల వరకు ఉంటాయి. కానీ ఆ సంపాదనలో ఎక్కువ భాగం ఇల్లు అద్దె, ఆరోగ్య బీమా, రవాణా, ఆహారం వంటి అవసరాలకు వెళ్లిపోతుంది. భారత్‌లో సంపాదన తక్కువగా ఉన్నప్పటికీ, ఖర్చులు చాలా తక్కువ కావడం వల్ల జేబులో ఎక్కువ డబ్బు మిగులుతుంది. ఇది ఒక రకమైన సమతుల్యతను సృష్టిస్తోంది. తక్కువ ఖర్చుతో మంచి నాణ్యత గల ఆహారం, ఆరోగ్య సేవలు, డిజిటల్‌ సౌకర్యాలు పొందడం భారత్‌లో సాధ్యమవుతోంది. ఇది మధ్యతరగతి కుటుంబాలకు, యువతకు ప్రయోజనకరం.

మారుతున్న విదేశీయుల వైఖరి..
భారత్‌ బెటర్‌ అనే అభిప్రాయ మార్పుకు ప్రధాన కారణాలు.. విదేశాల్లో ద్రవ్యోల్బణం పెరగడం, జీవన వ్యయాలు ఎక్కువవడం, భారత్‌లో డిజిటల్‌ విప్లవం, వైద్య సేవల నాణ్యత పెరగడం. భారత్‌ మెడికల్‌ టూరిజం కేంద్రంగా మారింది. చాలా మంది విదేశీయులు ఇక్కడ చికిత్స కోసం వస్తున్నారు. డిజిటల్‌ నోమాడ్స్‌ (రిమోట్‌ వర్కర్స్‌) కూడా భారత్‌ను ఎంచుకుంటున్నారు. అయితే, ఇది కేవలం ఖర్చుల పోలిక మాత్రమే కాదు. విదేశాల్లో మెరుగైన అవస్థాపన, ఉద్యోగ భద్రత, విద్యా నాణ్యత, భద్రత వంటి అంశాలు కూడా ముఖ్యమైనవి. భారత్‌లో కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్, కాలుష్యం, అవస్థాపన సవాళ్లు ఉన్నాయి. అయినప్పటికీ, తక్కువ ఖర్చుతో జీవనం సాగించడం ఇక్కడ సులభం.

సంపాదనలో అమెరికా, యూరప్‌ ముందుంటే, ఖర్చు చేయడంలో భారత్‌ ఆకర్షణీయంగా మారుతోంది. ఈ వాస్తవం భవిష్యత్తులో మరింత చర్చకు దారితీస్తుంది. భారత్‌కు ఇది సానుకూలం. విదేశీ పెట్టుబడులు, టూరిజం, రిమోట్‌ వర్క్‌ అవకాశాలు పెరుగుతాయి. అయితే, దేశం ఇంకా మెరుగుపడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి.

ప్రభాస్ కెరియర్ లో బెస్ట్ మూవీ ఇదేనా..?

Raja Saab advance bookings
Raja Saab advance bookings

Best Prabhas Movie : ‘ఈశ్వర్’ సినిమాతో తన నట ప్రస్థానాన్ని మొదలుపెట్టిన నటుడు ప్రభాస్…ఆ తర్వాత చేసిన సినిమాలతో మంచి విజయాలను సాధించాడు. మొదటి సినిమా యావరేజ్ గా ఆడింది. రెండో సినిమా రాఘవేంద్ర ఫ్లాప్ అయింది. మూడో సినిమా వర్షంతో తన స్టార్ డమ్ మొదలైంది. ఇక అప్పటి నుంచి అతను వెను తిరిగి చూడలేదు. వరుసగా ఛత్రపతి, మున్నా, యోగి, బుజ్జిగాడు, డార్లింగ్, బిల్లా లాంటి సినిమాలతో బాక్సాఫీస్ మీద దండయాత్ర చేశాడు. ఇక ఎప్పుడైతే బాహుబలి సినిమా చేశాడో అప్పటి నుంచి ఆయన పాన్ ఇండియాను శాసించే స్థాయికి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లోనే సినిమాలు చేస్తున్న ప్రభాస్ ఇకమీదట రాబోయే సినిమాలతో కూడా పెను సంచలనాలను క్రియేట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది… ప్రభాస్ కెరియర్ లో ఎన్ని సూపర్ హిట్ సినిమాలు ఉన్నా కూడా ఒక సినిమా మాత్రం క్లాస్, మాస్ అనే లేకుండా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని అలరించింది.

ముఖ్యంగా కమర్షియల్ సినిమాలను ఇష్టపడే వాళ్ళకి ప్రభాస్ నుంచి వచ్చిన ఈ సినిమా ఒక విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి… నిజానికి బాహుబలి సినిమా అందరికి నచ్చింది కానీ కమర్షియల్ గా ప్రభాస్ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ని వాడుకుంటూ మాస్ ప్రేక్షకులకు అతన్ని మరింత దగ్గర చేసిన సినిమా అంటే మిర్చి అనే చెప్పాలి. అతని నుంచి వచ్చిన చివరి కమర్షియల్ సినిమా కూడా అదే కావడం విశేషం…

ఈ సినిమా తర్వాత ఆయన పూర్తిగా బాహుబలి సినిమాకి అంకితం అయిపోయాడు. దాని తర్వాత నుంచి పాన్ ఇండియా రేంజ్ లోనే సినిమాలను చేస్తున్నాడు. పూర్తిగా ప్రభాస్ ని మనం చూసే అవకాశం రాలేకపోయింది. మిర్చిలో మాత్రం ఆయన తన నట విశ్వరూపాన్ని చూపించడమే కాకుండా యాక్షన్ ఎపిసోడ్స్ లో కూడా ప్రేక్షకులందరికి దగ్గరయ్యాడు.

ఇక ఏది ఏమైనా అలాంటి సినిమా మరొకటి రాదని అతని అభిమానులు కూడా చెబుతున్నారు. ఇప్పటికి అతని అభిమానులకి నచ్చిన సినిమా ఏదైనా ఉంది అంటే అది మిర్చి అనే చెబుతున్నారు… ఫ్యూచర్లో ఇలాంటి సినిమా ఏదైనా చేస్తాడా? లేదంటే మళ్ళీ పాన్ ఇండియా బాటలోనే ముందుకు సాగుతాడా? అనేది తెలియాల్సి ఉంది…

పాక్ మాజీ క్రికెటర్ ఇంట్లో ఉగ్ర కలకలం.. షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో లష్కరే తోయిబా టాప్ లీడర్!

Shoaib Akhtar
Shoaib Akhtar

Shoaib Akhtar: షోయబ్‌ అక్తర్‌.. పాకిస్తాన్‌ వెటరన్‌ క్రికెటర్‌.. క్రికెట్‌ అభిమానులకు పరిచయం ఉన్న వ్యక్తి. సూపర్‌ఫాస్ట్‌ బౌలర్‌గా గుర్తింపు పొందిన అక్కర్‌ తక్కువకాలమే క్రికెట్‌లో కొనసాగినా.. భారతీయులకు చాలా సుపరిచితుడు. తాజాగా షోయబ్‌ అక్తర్‌ పెద్ద సోదరుడు షాహిద్‌ అక్తర్‌ ఇటీవల అనారోగ్యంతో మరణించాడు. ఈ విషయాన్ని షోయబ్‌ అక్తర్‌ సోషల్‌ మీడియాలో ఈ వార్తను పంచుకుంటూ ‘నా ప్రియమైన పెద్ద సోదరుడు షాహిద్‌ అక్తర్‌ అల్లాహ్‌ను చేరుకున్నాడు’ పేర్కొన్నాడు. అంత్యక్రియలు జూన్‌ 24, 2026 సందర్భంగా ఇస్లామాబాద్‌లోని హెచ్‌–8 గోర్‌యార్డ్‌లో నిర్వహించినట్లు పేర్కొన్నాడు. అస్ర్‌ ప్రార్థన తర్వాత నమాజ్‌–ఎ–జనాజా జరిగినట్లు తెలుస్తోంది.

లష్కర్‌ ఎ తోయిబా ఉగ్రవాది హాజరు..
ఈ అంత్యక్రియల్లో లష్కర్‌ ఎ తోయిబా సంస్థ రాజకీయ ముఖ్య సలహాదారు, పాకిస్తాన్‌ మర్కజీ ముస్లిం లీగ్‌ (పీఎంఎంఎల్‌)కు చెందిన అనేక మంది నాయకులు హాజరయ్యారు. వారిలో పీఎంఎంఎల్‌ ఇస్లామాబాద్‌ అధ్యక్షుడు ఇనామ్‌ ఉర్‌ రెహ్మాన్‌ కంబోహ్‌ ప్రముఖంగా ఉన్నారు. లష్కర్‌ ఎ తోయిబా డిప్యూటీ చీఫ్‌ సైఫుల్లా కసూరీ కూడా ఈ కార్యక్రమంలో కనిపించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు పీఎంఎంఎల్, లష్కర్‌ ఎ తోయిబా సంబంధిత చానెల్స్‌ ద్వారా అధికారికంగా విడుదలయ్యాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఉగ్ర సంస్థ సభ్యులు బహిరంగంగా వరుసలో నిలబడి ప్రార్థనలు చేస్తున్న దృశ్యాలు చర్చనీయాంశంగా మారాయి.

పహల్గాం దాడి మాస్టర్‌మైండ్‌ కసూరీ..
సైఫుల్లా కసూరీ అలియాస్‌ సైఫుల్లా ఖాలిద్‌ కసూరీ లేదా సైఫుల్లా ఖాసూరీ లష్కర్‌ ఎ తోయిబా సంస్థలో డిప్యూటీ చీఫ్‌గా ఉన్నారు. భారత గూఢచర్య సంస్థలు అతన్ని 2025, ఏప్రిల్‌ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ముఖ్య ఆర్కిటెక్ట్‌గా గుర్తించాయి. ఆ దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. కసూరీ గతంలో భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ, 26/11 తరహా దాడుల బెదిరింపులు చేసినట్లు నివేదికలు ఉన్నాయి. అతను బహిరంగ సభల్లో పాల్గొని, పాకిస్థాన్‌ సైన్యంతో సంబంధాలు ఉన్నట్లు వ్యాఖ్యానించాడు.

పాకిస్తాన్‌లో ఉగ్రవాదుల స్వేచ్ఛా సంచారం..
హఫీజ్‌ సయీద్‌ నేతృత్వంలోని లష్కర్‌ ఎ తోయిబాపై అంతర్జాతీయ నిషేధాలు ఉన్నప్పటికీ, దాని రాజకీయ ముఖ్యరూపం పీఎంఎంఎల్‌ 2024 ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ సంఘటన భారత వ్యతిరేక ఉగ్ర శక్తులకు పాకిస్తాన్‌ సురక్షిత ఆశ్రయంగా మారిందని, వారు ఎటువంటి ఆంక్షలు లేకుండా బహిరంగ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఇప్పటికే ఉన్న ఆరోపణలను మరింత బలపరుస్తోంది. మీడియా, సామాజిక మాధ్యమాల్లో ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉగ్ర సంస్థలు ప్రభావవంతమైన వ్యక్తులు, కుటుంబాలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నట్లు ఈ సంఘటన వెల్లడి చేస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

2011లో అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి విరమించిన షోయబ్‌ అక్తర్‌ ప్రస్తుతం వ్యాఖ్యాతగా, విశ్లేషకుడిగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. అతని కుటుంబ సభ్యులతో ఈ సంబంధాలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ఈ సంఘటన భారత–పాకిస్థాన్‌ సంబంధాలు, ఉగ్రవాద నియంత్రణ విషయంలో మరింత చర్చలకు దారితీస్తోంది. సంబంధిత వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

'ఏడు శనివారాల పూజ’ను ఎలా చేయాలి..వీటి నియామాలేంటి..

Seven Saturdays Puja
Seven Saturdays Puja

Seven Saturdays Puja: హిందూ సంప్రదాయంలో శ్రీ వేంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధిస్తారు. కలియగ దైవంగా భావించి ఈ స్వామిని దర్శించుకోవడానికి పరితపిస్తుంటారు. అయితే ఏడు వరుస శనివారాల పాటు వేంకటేశ్వర స్వామివారికి చేసే ప్రత్యేక పూజతో శని ప్రభావం వల్ల ఎదురయ్యే ఇబ్బందులు తగ్గి, జీవితంలో శుభఫలితాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ శని ప్రభావం తగ్గాలంటే ఏడు శనివారాల పాటు ఏం చేయాలి? వాటిని ఎలా పాటించాలి?

శనివారం శని గ్రహానికి సంబంధించిన రోజుగా భావిస్తారు. అదే సమయంలో శ్రీ వేంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవంగా ఆరాధిస్తారు. శని దోషాలు, అష్టమ శని, ఏలినాటి శని, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ సమస్యలు, కుటుంబ కలహాలు వంటి కష్టాలు తగ్గాలని కోరుతూ అనేక మంది వరుసగా ఏడు శనివారాలు ఈ పూజను నిర్వహిస్తారు. శని ప్రభావం ఉందని భావించే వారు, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారు, వ్యాపారంలో నష్టాలు ఎదుర్కొంటున్నవారు, వివాహం ఆలస్యం అవుతున్నవారు, కుటుంబ శాంతి కోరుకునేవారు, ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కోరేవారు ఈ పూజను చేయవచ్చు. మహిళలు, పురుషులు, కుటుంబ సభ్యులంతా కలిసి కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు.

పూజ ప్రారంభించే విధానం
మొదటి శనివారం ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఇంట్లో లేదా ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి చిత్రపటం లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించి దీపం వెలిగించాలి. పసుపు, కుంకుమ, పూలు, తులసీదళాలు సమర్పించి భక్తితో పూజ చేయాలి. స్వామివారికి పాలు, పండ్లు, లడ్డూ లేదా ఇతర సాత్విక నైవేద్యాలను సమర్పిస్తారు.

పూజ అనంతరం శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శతనామావళి, శ్రీ విష్ణు సహస్రనామం, శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, గోవింద నామస్మరణ, ఓం నమో వేంకటేశాయ నమః మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించడం శ్రేయస్కరంగా భావిస్తారు. కొందరు ప్రతి శనివారం ఆలయ దర్శనం కూడా చేస్తారు.

పాటించాల్సిన నియమాలు
ఏడు శనివారాలు సాధ్యమైనంత వరకు సాత్వికాహారం తీసుకోవాలి. మద్యపానం, మాంసాహారం, అసత్యం, కోపం వంటి వాటికి దూరంగా ఉండాలని ఆచారం. పేదలకు అన్నదానం, నువ్వుల నూనె దీపం వెలిగించడం, గోవులకు ఆహారం పెట్టడం, అవసరమైన వారికి దానం చేయడం కూడా ఈ వ్రతంలో భాగంగా చాలామంది పాటిస్తారు.

ఏడవ శనివారం ప్రత్యేక పూజ నిర్వహించి, వీలైతే శ్రీ వేంకటేశ్వర ఆలయంలో అర్చన చేయించుకోవడం లేదా అన్నదానం నిర్వహించడం ఆనవాయితీ. కొందరు స్వామివారికి తులసీమాల, వెన్న, లడ్డూ వంటి నైవేద్యాలు సమర్పించి మొక్కు తీర్చుకుంటారు.

అప్పులు తగ్గకపోవడం, సంపాదించిన డబ్బు నిలవడం లేదా? ఇలా చేయండి..

Financial Tips
Financial Tips

Financial Tips: కొందరి జీవితాల్లో అప్పులు పెరిగిపోతుంటాయి. ఎంత ఆదాయం వచ్చినా కూడా డబ్బు నిలవకుండా ఉంటుంది. ఇలాంటి వారు జ్యేష్ఠ పౌర్ణమి రోజున శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం, శ్రీ గణపతి కటాక్షం కోసం ‘రుణ విమోచన లక్ష్మీ గణపతి హోమం’ నిర్వహించడం వల్ల కాస్త ఫలితం ఉంటుందని కొందరు పండితులు చెబుతున్నారు. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం ఈ హోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తే అప్పుల బాధలు తగ్గడం, ఆర్థిక స్థిరత్వం పెరగడం, వ్యాపారాభివృద్ధి, కుటుంబ శ్రేయస్సు, విఘ్నాల తొలగింపు వంటి శుభఫలితాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. అయితే ఈ హోమం ఎలా చేయాలి?

జ్యేష్ఠ పౌర్ణమికి ప్రత్యేకత :
హిందూ పంచాంగంలో జ్యేష్ఠ మాస పౌర్ణమికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ రోజు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి, దానధర్మాలు చేయడానికి, హోమాలు, జపాలు, వ్రతాలు ఆచరించడానికి శుభప్రదమైన రోజుగా పరిగణిస్తారు. ఈ పౌర్ణమి రోజున చేసే పూజలు, హోమాలు అనేక రెట్లు ఫలితాన్ని ఇస్తాయని పురాణ విశ్వాసం.

రుణ విమోచన లక్ష్మీ గణపతి హోమం అంటే ఏమిటి?
ఈ హోమంలో విఘ్నాలను తొలగించే శ్రీ గణపతితో పాటు ఐశ్వర్యాన్ని ప్రసాదించే మహాలక్ష్మీదేవిని ఆరాధిస్తారు. ‘రుణ విమోచన’ అంటే అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, జీవనంలో ఎదురయ్యే ఆర్థిక అడ్డంకుల నుంచి విముక్తి కలగాలని ప్రార్థించడం. అందుకే ఈ హోమాన్ని ముఖ్యంగా అప్పుల బాధలు, వ్యాపార నష్టాలు, ధన సమస్యలు ఎదుర్కొంటున్న వారు నిర్వహిస్తారు.

ఈ హోమాన్ని ఎవరు చేయవచ్చు?
ఈ హోమాన్ని గృహస్థులు, వ్యాపారులు, ఉద్యోగులు, కొత్త వ్యాపారం ప్రారంభించేవారు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు, తరచూ ధన నష్టం ఎదురవుతున్నట్లు భావించే వారు చేయవచ్చు. సాధారణంగా కుటుంబ సభ్యులందరూ కలిసి సంకల్పంతో ఈ హోమంలో పాల్గొనడం శ్రేయస్కరంగా భావిస్తారు. హోమం ప్రారంభానికి ముందు గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశ స్థాపన నిర్వహిస్తారు. అనంతరం లక్ష్మీ గణపతి ఆవాహన చేసి ప్రత్యేక మంత్రాలతో హోమాన్ని కొనసాగిస్తారు. హోమకుండంలో నెయ్యి, నవధాన్యాలు, సమిధలు, తామర గింజలు, అక్షతలు, నువ్వులు, కొబ్బరి, బెల్లం, వివిధ పవిత్ర ద్రవ్యాలతో ఆహుతులు సమర్పిస్తారు. చివరగా పూర్ణాహుతి, హారతి, తీర్థప్రసాదాలతో హోమం ముగుస్తుంది.

హోమం చేసే సమయంలో పాటించాల్సిన నియమాలు
హోమం చేసే రోజు ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. సాధ్యమైనంత వరకు ఉపవాసం లేదా సాత్వికాహారం తీసుకోవడం మంచిదని ఆచారం. పూజ సమయంలో మనసు ప్రశాంతంగా ఉంచి, పూర్తి భక్తిశ్రద్ధలతో సంకల్పం చెప్పాలి. వేద మంత్రాల ఉచ్చారణ సరైన విధంగా జరగాలంటే అనుభవజ్ఞులైన పురోహితుల ద్వారా హోమం నిర్వహించడం ఉత్తమం.

అయోధ్య రామమందిరానికి బాబు బెదిరింపు.. తీగ లాగితే డొంక కదిలింది!

Ayodhya Ram Mandir
Ayodhya Ram Mandir

Ayodhya Ram Mandir: కర్ణాటక యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ అధికారులు ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌ జిల్లా పోలీస్‌ స్టేషన్‌కు సంప్రదించి, ఒక యువకుడిని అరెస్టు చేసినట్లు తెలియజేశారు. అతను లక్నౌటీ గ్రామానికి చెందినవాడు. పేరు మహమ్మద్‌ సోహైల్, వయసు 18 సంవత్సరాలు. అతను కర్ణాటకలో పెయింటింగ్, రంగుల పనులు చేసేందుకు వెళ్లినట్లు సమాచారం. దావనగరెలో పని చేస్తుండగా అరెస్టు చేశారు. ఇతను అయోధ్య శ్రీరామ మందిరానికి బెదిరింపు లేఖ ఇంటర్నెట్‌ ద్వారా పంపినట్లు ఒప్పుకున్నాడు. అతని మొబైల్‌ ఫోన్‌లో పాకిస్తాన్‌ అనుకూల రాడికల్‌ గ్రూపులతో సంబంధాలు, వాయిస్‌ మెసేజ్‌లు, ఆయుధాల ఫొటోలు, వాటి సామర్థ్యాల సమాచారం లభ్యమయ్యాయి.

పెద్ద నెట్‌వర్క్‌..
ఈ అరెస్టుకు ముందు కర్ణాటక పోలీసులు జమీమ్‌ఖాన్‌ అనే యువకుడిని అరెస్టు చేశారు. అతనికి ఐఎస్‌ఐతో సంబంధాలు, ఆన్‌లైన్‌ వాట్సాప్‌ గ్రూపులతో అనుబంధాలు ఉన్నట్లు గుర్తించారు. జూన్‌ 4న 24 ఏళ్ల అల్లాభ„Š ను కూడా అరెస్టు చేశారు. ఈ ఇద్దరి ప్రశ్నింపు నుంచి సోహైల్‌కు సంబంధాలు తెలిశాయి. సోహైల్‌తో అనుసంధానమైన ఒక పాకిస్తాన్‌ అనుకూల గ్రూప్‌లో కర్ణాటకలో పని చేసే సహరన్‌పూర్‌కు చెందిన 10 మంది యువకులు ఉన్నట్లు సమాచారం. వారందరూ కూలీలు, పెయింటింగ్, వుడ్‌ వర్క్‌లు చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోనూ ఫరాజ్‌ అనే మరో యువకుడిని అరెస్టు చేశారు. అతను కూడా పాకిస్తాన్‌కు చెందిన సెహజాద్‌ గ్రూపుతో సంబంధాలు కలిగి ఉన్నాడు.

రాడికలైజేషన్‌కు కారణాలు..
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాల నుంచి అనేక మంది యువకులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో నిర్మాణం, పెయింటింగ్, వుడ్‌ వర్క్‌ల కోసం వలస వెళ్తారు. ఇది ఆర్థిక అవసరం వల్ల సహజం. కానీ కొందరు డబ్బు ఆశతో లేదా మతోన్మాదం వల్ల రాడికల్‌ గ్రూపుల్లో చేరుతున్నారు. ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లు, వాట్సాప్‌ గ్రూపులు ద్వారా రిక్రూట్‌మెంట్, సమాచార సేకరణ జరుగుతోంది. కొందరు పేర్లు మార్చుకొని హిందువులుగా వ్యవహరించి అనుమానాలు తప్పించుకోవడం ప్రయత్నిస్తున్నారు. పాకిస్తాన్‌ నుంచి నియంత్రణలో ఉన్న ఈ గ్రూపులు యువతను లక్ష్యంగా చేసుకొని భారత వ్యతిరేక భావాలు, మతోన్మాదం ప్రచారం చేస్తున్నాయి.

భారత్‌లోని సమాచార సేకరణ..
వలస కార్మికుల నెట్‌వర్క్‌ను ఉపయోగించి సమాచార సేకరణ, భవిష్యత్తు ప్రణాళికలు చేస్తున్నారు. ఇలాంటి గ్రూపులను సకాలంలో నియంత్రించకపోతే అల్‌ఫలా యూనివర్సిటీ వంటి సంఘటనలు మళ్లీ జరిగే ప్రమాదం ఉంది. పోలీసులు ఇప్పటికే అంతర్రాష్ట్ర సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నారు. కానీ మరింత బలమైన ఆన్‌లైన్‌ మానిటరింగ్, మైగ్రెంట్‌ కార్మికులపై జాగ్రత్తగా నిఘా, డీరాడికలైజేషన్‌ కార్యక్రమాలు అవసరం. ఈ కేసు దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశం. పోలీసులు ఇచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. యువతను రాడికల్‌ భావాల నుంచి దూరంగా ఉంచడం, వారికి మంచి అవకాశాలు కల్పించడం దీర్ఘకాలిక పరిష్కారం.

ఇలాంటి సంఘటనలు జాగ్రత్తగా పరిశీలించి, భవిష్యత్తులో ఇలాంటి బెదిరింపులు జరగకుండా నిరోధించాలి. పోలీసుల చర్యలు సానుకూలంగా ఉన్నాయి. అయితే సమాజం, కుటుంబాలు కూడా యువతను సరైన దారిలో నడిపించడం చాలా ముఖ్యం.

కట్టుకున్నవాడు కన్నుమూశాడు.. గుండెలు పగిలేలా భార్య రోదన.. ఓ చిన్న అనుమానం.. ఆమె బండారాన్ని బయటపెట్టింది

Nagarkurnool
Nagarkurnool

Nagarkurnool: కట్టుకున్నవాడు కన్నుమూశాడు. తనను ఒంటరిదాన్ని చేసి వెళ్లిపోయాడని ఆయన భర్త గుండెలు పగిలే విధంగా రోదించడం మొదలుపెట్టింది. చూసేవాళ్లకు ఆసన్నివేశం అత్యంత బాధాకరంగా అనిపించింది. బంధువులు ఆమెను ఊరడించే ప్రయత్నం చేశారు. ఆమె ఎంతసేపటికి ఏడుపు ఆపడం లేదు. బంధువులు కూడా ఆమె బాధను అర్థం చేసుకొని వారూ ఏడవడం మొదలుపెట్టారు.

చనిపోయిన ఆ వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు మొదలుపెట్టారు. ఈలోగా అతడికి స్నానం చేయిస్తున్నారు. ఈ క్రమంలో మృతుడి తమ్ముడికి ఒక అనుమానం… ఎందుకంటే తన అన్న మర్మంగాల మీద గాయాలు కనిపించాయి. అవి అతడికి అనుమానాన్ని కలిగించాయి. అది మొదలు పెట్టుకున్నాడు. అంత్యక్రియలు పూర్తికాగానే ఈ విషయాన్ని పోలీసులకు చెప్పాడు. పోలీసులు కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఆ తర్వాత విచారణ మొదలుపెట్టారు. ఫలితంగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నాగర్ కర్నూల్ పట్టణ పరిధిలోని తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామానికి చెందిన అమ్మపల్లి యాదయ్య, అలివేలు దంపతులు జీవిస్తున్నారు. వీరు తమ కూతురిని ఆంజనేయులు అనే వ్యక్తికి వివాహం చేశారు.. ఆంజనేయులు.. అలివేలు మధ్య సభ్య సమాజం తలదించుకునే సంబంధం ఏర్పడింది. ఈ విషయం యాదయ్యకు తెలిసింది. దీంతో అతడు అలివేలును.. అల్లుడిని అనేకసార్లు మందలించాడు. చాలాసార్లు ఈ వ్యవహారం మీద వారింట్లో గొడవలు జరిగాయి. దీంతో అలివేలు ఒక ప్లాన్ రూపొందించింది. యాదయ్యను అంతం చేయాలని నిర్ణయించుకుంది.

ఈనెల 23న యాదయ్య చనిపోయాడు. అతడు చనిపోయిన తీరు అత్యంత అనుమానాస్పదంగా ఉంది. అయితే అతడు గుండెపోటుతో చనిపోయాడని అలివేలు కుటుంబ సభ్యులను నమ్మించింది. అంతే కాదు తాను కూడా గుండెలు పగిలే విధంగా రోధించింది. ఈ నేపథ్యంలో యాదయ్య మృతదేహానికి సాంప్రదాయం ప్రకారం స్నానం చేయిస్తున్నారు. ఆ సమయంలో యాదయ్య మర్మంగాల మీద కనిపించిన గాయాలు అతడి తమ్ముడిలో అనుమానం కలిగించాయి. వెంటనే అతడు తిమ్మాజీపేట పోలీసులకు విషయాన్ని చెప్పాడు.

పోలీసులు ఆ తర్వాత ఈ కేసును తమదైన శైలిలో దర్యాప్తు మొదలుపెట్టారు. అలివేలును గట్టిగా మందలించారు. దీంతో అల్లుడితో తాను సాగిస్తున్న బంధం గురించి అలివేలు బయట పెట్టింది. వివాహేతర సంబంధానికి అడ్డంగా ఉన్నాడని చంపేసినట్టు అలివేలు పోలీసులతో చెప్పింది. ఈ వ్యవహారంలో ఆమె అల్లుడు పాత్ర పై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలివేలును పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. స్థానికంగా ఈ సంఘటన సంచలనం కలిగించింది.