Home Blog Page 60

వైఎస్ అవినాష్ రెడ్డి నిష్క్రమణ.. జగన్ కే చెప్పేశారు

YS Avinash Reddy
YS Avinash Reddy

YS Avinash Reddy: కడప జిల్లాలో రాజకీయాలు మారుతున్నాయి. ముఖ్యంగా కూటమి దూకుడుగా ముందుకు సాగుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. గత ఎన్నికల్లో ఎదురైన ఓటమిని తట్టుకొని మళ్లీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేసే క్రమంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో వివాదం సద్దుమణగడం లేదు. రోజురోజుకు ఆ సమస్య పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి తేల్చేసినట్లు ప్రచారం నడుస్తోంది.

* నాలుగు దశాబ్దాలకు పైగా హవా..
కడప జిల్లాలో 1978లో తొలిసారిగా అసెంబ్లీకి పోటీ చేశారు రాజశేఖర్ రెడ్డి. అలా గెలిచిన రాజశేఖర్ రెడ్డి మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించారు. నాటి నుంచి రాజశేఖర్ రెడ్డి కుటుంబ హవా కడప జిల్లాలో కొనసాగుతూ వస్తోంది. రాజశేఖర్ రెడ్డి ది ఉమ్మడి కుటుంబం. ఈ పరిస్థితుల్లో రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో ఒకవైపు రాణిస్తుంటే.. కడప జిల్లా బాధ్యతలు వైయస్ వివేకానంద రెడ్డి చూసేవారు. కుటుంబంలో ఎంతోమంది ఉన్నా వివేకాకు ఛాన్స్ ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి. అన్న ఆదేశాలను క్రమం తప్పకుండా పాటించేవారు వివేకానంద రెడ్డి. ఈ క్రమంలో ప్రస్తుత ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఉన్న రాజకీయంగా పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదు. ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి చనిపోయారో.. నాటి నుంచి వివేకానంద రెడ్డి ప్రాధాన్యత తగ్గించి.. భాస్కర్ రెడ్డి కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి.

* ఆలస్యంగా ఎంట్రీ..
2014 తర్వాత ఒక ప్రత్యేక పరిస్థితుల్లోనే వివేకానంద రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు జిల్లా పై ఉన్న పట్టు దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి తెచ్చుకున్నారు. అయితే రాజశేఖర్ రెడ్డి మాదిరిగా వివేకానంద రెడ్డికి జగన్మోహన్ రెడ్డి పెద్దగా ప్రాధాన్యం కల్పించలేదు. 2019 ఎన్నికల్లో కడప పార్లమెంటు సీటు షర్మిలకు ఇద్దామని ప్రతిపాదించారు వివేకానంద రెడ్డి. అటు తరువాత వివేకానంద రెడ్డి హత్యకు గురి కావడం.. అది రాజకీయ లబ్ధి కోసం చేసిన హత్య అని.. అవినాష్ రెడ్డి తో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి చేయించారంటూ వివేక కుమార్తె సునీత, వైయస్ షర్మిల సైతం ఆరోపించారు. ప్రజల్లోకి ఈ అంశం బలంగా వెళ్ళింది. అవినాష్ రెడ్డి తక్కువ ఓట్లతో మొన్నటి ఎన్నికల్లో బయటపడ్డారు.

* ప్రతికూల అంశాలతో.
అయితే ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసు మళ్లీ రీఓపెన్ అయింది. ఈసారి ఎంపీ అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగించడం ఖాయం. పైగా మునుపటిలా కేంద్ర ప్రభుత్వ సహాయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లేదు. అందుకే ఈసారి దొరికిపోతామని అవినాష్ రెడ్డికి తెలుసు. ఆపై రాజకీయ ప్రత్యర్ధులు బిటెక్ రవి, రెడ్డప్ప గారి మాధవి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి లాంటి వారు పట్టు బిగిస్తున్నారు రాజకీయంగా. మునుపటిలా జిల్లాలో రాజకీయాలు చేయలేమని అవినాష్ రెడ్డి గుర్తించారు. అందుకే జగన్మోహన్ రెడ్డికి తేల్చి చెప్పారు. తనకు బాధ్యతలు నుంచి తప్పించాలని.. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయనని కుండ బద్దలు కొట్టి చెప్పినట్లు ప్రచారం నడుస్తోంది. అందులో ఎంత నిజం ఉందో చూడాలి.

వైసీపీ అమరావతి ఉద్యమాన్ని నమ్ముతారా?

YSRCP
YSRCP

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అమరావతి విషయంలో ఎంత తగ్గితే అంత మేలు. ఎందుకంటే ఆ పార్టీకి అమరావతి పై మాట్లాడే అర్హత కూడా లేదు. అమరావతిని వ్యతిరేకించింది కాకుండా అక్కడి రైతుల ఉద్యమాన్ని ఉక్కు పాదంతో మోపాలని చూసింది జగన్ సర్కార్. అమరావతిని స్మశానంతో పోల్చారు బొత్స లాంటి సీనియర్ నేత. ఇక అమరావతి రైతులు పోరాటం చేస్తే దానిని అడ్డుకునే ప్రయత్నంలో.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన అతి అంతా ఇంతా కాదు. ఇప్పుడు అదే అమరావతి రైతులపై ప్రేమ ఉన్నట్టు మాట్లాడితే మాత్రం నమ్మే స్థితిలో అక్కడి రైతులు లేరు.

* పదేపదే మాట మార్పు..
ఏకాభిప్రాయంతో అమరావతిని ఎంపిక చేశారు చంద్రబాబు. నిండు శాసనసభలో ఆహ్వానించారు జగన్మోహన్ రెడ్డి. కానీ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఈ క్రమంలో ఆందోళనకు గురైన అమరావతి రైతులు పోరాటం చేస్తే దానిని కూడా హేళన చేశారు. మూడు రాజధానులు కట్టలేకపోయారు. అమరావతి రాజధానిని ఐదేళ్లపాటు పడుకోబెట్టరు. అడవిని తలపింప చేశారు. అయితే కూటమి వచ్చిన తర్వాత అమరావతికి కొత్త కళ వచ్చింది. రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో భూ సమీకరణకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డగించే ప్రయత్నం చేస్తోంది. మొన్ననే కొందరు రైతులను పిలిపించుకొని మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు సిఆర్డిఏ భూముల రక్షణ వేదిక పేరుతో వైసీపీ నేతలు అమరావతిలో అడుగుపెట్టారు. అమరావతి రైతుల్లో ఆగ్రహం కట్టలు పెంచుకుంది.

* కొత్తగా ప్రేమ..
అమరావతి విషయంలో ఏం చెప్పినా జగన్మోహన్ రెడ్డి మాటకాని.. వైసిపి నేతలు చెప్పే మాటలకు ప్రజలతో పాటు అమరావతి రైతులు వినే పరిస్థితిలో లేరు. ఒకవేళ అమరావతి రైతులకు నిజంగా న్యాయం చేయాలని వైసిపి ముందుకు వచ్చినా ఫలితం ఉండదు. అంతలా అమరావతి రైతుల నమ్మకాన్ని కోల్పోయింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. మొన్నటికి మొన్న మావిగన్ అనే ప్రతిపాదన చేసి.. ఇప్పుడు సిఆర్డిఏ భూముల రక్షణ పేరుతో రాజకీయాలు మొదలుపెట్టడం ఏంటని అమరావతి రైతులు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు కుట్రలు చేస్తూ.. మరోవైపు మీకు అండగా ఉంటానని ముందుకు వస్తే నమ్మే స్థితిలో లేమని తేల్చి చెబుతున్నారు. అయితే నిన్న ఉండవల్లి జంక్షన్లో అమరావతి రైతుల ఆగ్రహాన్ని స్వయంగా చవిచూశారు వైసీపీ నేతలు. వారు వచ్చారు కాబట్టి సరిపోయింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఇదే తరహాలో ప్రతికూలత రావడం ఖాయం. అందుకే కాబోలు జగన్మోహన్ రెడ్డి ఆ సాహసం చేయలేకపోతున్నారు.

వైభవ్ సూర్య వంశీకి 12 కోట్లు కావాలట.. వామ్మో బుడ్డోడు మహా ఘటికుడే

Vaibhav Suryavanshi
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: 15 సంవత్సరాల బాలుడని.. నూనూగు మీసాలు కూడా రాణి బుడ్డోడని.. ఇప్పటిదాకా మనం వైభవ్ సూర్య వంశీ గురించి చెప్పుకున్నాం కదా. కానీ మనం ఇకనుంచి అతడిని అలా అనకూడదు. ఎందుకంటే పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టుగా.. అతడు చేసే చేష్టలు మామూలుగా లేవు. ఏకంగా కోట్లకు ఎసరు పెట్టాడు. అంతేకాదు రూపాయి తక్కువైనా చేసేది లేదని.. ఇది వ్యాపారం అని చెబుతున్నాడు.

వైభవ్ సూర్య వంశీ ఐపీఎల్ లో ఈ సంవత్సరం గట్టిగానే వెనుక వేసుకున్నాడు. రఫ్ గా ఒక ఆరు కోట్లు జేబులో వేసుకున్నాడు. అంతరంగిక వర్గాల ప్రకారం ఆ లెక్క ఇంకా గట్టిగానే ఉంటుందని సమాచారం. ప్రస్తుతం సూర్య వంశీ కెరియర్ పీక్స్ లో ఉంది. అతడు మైదానంలో అడుగు పెడితే చాలు అదే అదృష్టం అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఇటీవల ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఓడిపోయినప్పటికీ.. కేవలం వైభవ్ సూర్యవంశీని చూసేందుకు మాత్రమే అభిమానులు వచ్చారంటే అతడి రేంజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. టికెట్లు కూడా భారీగా కొనుగోలు చేసి.. సూర్య వంశీ పేరుతో ప్లకార్డులను అభిమానులు పట్టుకొచ్చారు. మైదానంలో ప్రదర్శన చేశారు.

సూర్య వంశీ కి తొలి మ్యాచ్లో మేనేజ్మెంట్ అవకాశం ఇవ్వలేదు. రెండో మ్యాచ్లో అవకాశం ఇవ్వక తప్పడం లేదు. అతడు లేకపోవడం వల్లే టీమిండియా ఓడిపోయిందని ఇప్పటికే మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్ మీద విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండవ మ్యాచ్లో కచ్చితంగా అతడికి అవకాశం లభిస్తుంది.

వైభవ్ సూర్య వంశీ ప్రస్తుతం ఎస్ఎస్ కంపెనీకి సంబంధించిన బ్యాట్ వాడుతున్నాడు. అయితే అతడు త్వరలోనే ఆ కంపెనీకి గుడ్ బై చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే అతడితో ఎంఆర్ఎఫ్ కంపెనీ సంప్రదింపులు జరుపుతోంది. ఎంఆర్ఎఫ్ కంపెనీ సూర్య వంశీకి 6 కోట్లు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు సూర్య వంశీ 12 కోట్లు అయితేనే ఎంఆర్ఎఫ్ కంపెనీకి ఓకే చెబుతానని చెప్పినట్లు సమాచారం. ఇంతవరకు దీనిపై క్లారిటీ రాలేదు. మరోవైపు సూర్య వంశీ.. ఎంఆర్ఎఫ్ కంపెనీ ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. మరి కొద్ది రోజుల్లో వీటిపై క్లారిటీ వస్తుందని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ సూర్య వంశీ 15 సంవత్సరాల వయసులోనే కోట్లు వెనకేసుకుంటున్నాడు. తన తోటి పిల్లలు స్కూల్ కు వెళ్తుంటే.. అతడేమో ఇంటర్నేషనల్ సెలబ్రిటీ అయిపోయాడు. బుడ్డోడు అంటే చిన్నోడు కాదు.. ఇప్పుడు ఎంఆర్ఎఫ్ కంపెనీకి చుక్కలు చూపిస్తున్న బలవంతుడు.

ఆంధ్రజ్యోతి ఆర్కే సార్ ఏమైంది మీకు.. ఎందుకీ మౌనం

RK kothapaluku
RK kothapaluku

RK Kotha Paluku: అమరావతిలో వైసిపి గొడవ.. సాయి కృష్ణ కేసు.. ఆ మధ్య జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ప్రారంభం.. ఆంధ్ర బ్రాండ్ పేరుతో గోల్డ్ బిస్కెట్లు కూడా బయటకు వచ్చాయి.. ఇక తెలంగాణలో ప్రభుత్వానికి ఎస్బిఐ కి మధ్య వివాదం.. చివరికి మెత్తబడిన ఎస్బిఐ.. జాతీయస్థాయిలో పేరు తెచ్చుకుంటున్న రేవంత్ రెడ్డి.. దేశంలో పేరుపొందిన రాజకీయ నాయకులను కలుస్తున్న తీరు.. ఇటీవల రక్షణ శాఖ తెలంగాణ ప్రభుత్వానికి భూములు ఇచ్చింది.. దీని వెనక రేవంత్ రెడ్డి మంత్రాంగం ఉంది.. ఇవే కాదు.. భారత రాష్ట్ర సమితి కీలక నాయకులు హరీష్ రావు.. కేటీఆర్ తెలంగాణ వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. కెసిఆర్ బస్సు యాత్ర చేస్తారని.. కేటీఆర్ పాదయాత్ర చేస్తారని వార్తలు వస్తున్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ విధంగా పరిణామాలు జరుగుతున్నాయి.. ఇక దేశంలో అయోధ్య రామాలయంలో దొంగలు పడ్డారు. భక్తులు సమర్పించిన కానుకలను ఖతం చేశారు.. ఉజ్జయిని ప్రాంతంలో కూడా భూ కుంభకోణాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా బిజెపికి వ్యతిరేకంగా ఉన్నాయి. అలాగని కాంగ్రెస్ కూటమి కూడా గొప్పగా లేదు. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో లుకలుకలు బయట పడుతున్నాయి. ఇన్ని జరుగుతుంటే.. తెలుగు రాష్ట్రాల్లో.. దేశ రాజకీయాల్లో సమూలంగా మార్పులు చోటు చేసుకుంటుంటే.. ఒక జర్నలిస్టుగా మీరు సైలెంట్ గా ఎలా ఉన్నారు ఆంధ్రజ్యోతి ఆర్కే సార్ అలియాస్ వేమూరి రాధాకృష్ణ సార్..

ప్రతి ఆదివారం మీ కొత్త పలుకు లో రాతలు చూడాలని.. అందులో లోపాలను వెతికి పట్టుకోవాలని.. మిమ్మల్ని విమర్శించాలని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్లందర్నీ ఈ వారం మీరు డిసప్పాయింట్ చేశారు. మిగతా పత్రికలు చూడకుండా ఉంటారేమోగాని.. ఆదివారం నాడు మీ కొత్త పలుకు చూడకుండా… చదవకుండా ఉండలేరు. ముఖ్యంగా వైసిపి వాళ్లకు.. భారత రాష్ట్ర సమితి వాళ్లకు అదే పని.. ఎందుకంటే మీరు రాసే రాతలు వారికి ఒక రకమైన హింట్ లాంటివి. వాటి ఆధారంగా వారు ఏమైనా చేస్తారు. పొలిటికల్ గా స్టెప్పులు వేస్తారు. మీ రాతలు ఇంతమందికి ఉపయోగ కలిగిస్తుంటే.. మీరెందుకు సైలెంట్ గా ఉన్నారు.. ఏమైంది ఆర్కే సార్.. నిప్పు కణిక లాంటి మీ అక్షరాలు ఎక్కడ.. విస్పోటనంలాంటి మీ ఉపోద్ఘాతం ఎక్కడ.. దమ్ము అనే పదానికి పర్యాయపదంగా ఉండే మీ శీర్షికలు ఎక్కడ.. మరోసారి మమ్మల్ని డిసప్పాయింట్ చేయకండి ఆర్కే సార్.. చాలా ఇబ్బందిగా ఉంది..

కొత్త పలుకు కు బ్రేక్ ఇవ్వడం ఇదే తొలిసారి కాకపోవచ్చు గాని.. ఇటీవల కాలంలో ఎన్నడు మీరు బ్రేక్ ఇవ్వలేదు. దూకుడుగా రాతలు రాశారు. బీభత్సంగా కొత్త విషయాలను బయటపెట్టారు. ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా అన్ని పార్టీలను వదలకుండా వాయించేశారు. కొన్ని సందర్భాలలో స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు.. స్వీట్ కోటెడ్ రాతలు కూడా రాశారు. ఇవన్నీ చూసి.. చదివి.. నవ్వుకొని.. ఆగ్రహం వ్యక్తం చేసి.. ఇంకా అనేక రకాల హావ భావాలు ప్రదర్శించిన మాకు.. మీరు ఎంటర్టైన్మెంట్ మిస్ చేస్తే ఎలా సార్.. దీన్ని ఎలా జీర్ణించుకోవాలి.. ఎలా అర్థం చేసుకోవాలి.. ‘ఏంటి గ్యాప్ ఇచ్చావ్’? అంటే ‘‘ఇవ్వలా వచ్చింది’’ అనకండి.. ప్లీజ్ ఆర్కే సార్..

కేతన్ కేసు: బట్టతల ఉందనే కాబోయే భర్తను లోయలో నూకేసిందట.. విచారణలో కీలక నిజం

Ketan Agarwal Case
Ketan Agarwal Case

Ketan Agarwal Case: పూణే వ్యాపారి కేతన్ ను అతనికి కాబోయే భార్య సియా హత్య చేసిన విషయం తెలిసిందే. దీనికోసం ఆమె తన ప్రియుడు చేతన్ సహాయం తీసుకుంది. చేతన్, సియా చాలాకాలంగా ప్రేమలో ఉన్నారు. చేతన్ క్రికెటర్ కూడా. అతడు ఆడ క్రికెట్ మ్యాచ్లకు సియా హాజరయ్యేది.. ఎప్పుడైతే కేతన్ తో ఆమె ఎంగేజ్మెంట్ చేసుకుందో.. అప్పటినుంచి చేతన్ ఆమె మీద ఒత్తిడి తేవడం మొదలుపెట్టాడు.. దీంతో చేతన్ తో కలిసి సియా ప్రణాళిక రూపొందించింది. అతడిని అంతం చేయాలని డిసైడ్ అయింది.

గడిచిన మే నెల నుంచి జూన్ 14 వరకు రెండు పర్యాయాలు అతని మీద హత్యాయత్నం చేసింది. కాకపోతే అవి రెండు విఫలమయ్యాయి. జూన్ 18న చేసిన ప్రయోగం మాత్రం విజయవంతమైంది. జూన్ 18న అతడిని లోయలో నుంచి నెట్టివేయడంతో కేతన్ చనిపోయాడు. ఆ తర్వాత సియా మాటలు వేరే విధంగా ఉండడంతో.. అనుమానం వచ్చిన కేతన్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు అనేక రకాలుగా ఆధారాలు సేకరించి.. సియాను అరెస్ట్ చేశారు. ఆమె ప్రియుడు చేతన్ ను కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

విచారణలో సియా అనేక విషయాలను వెల్లడించినట్టు తెలుస్తోంది..” కేతన్ కు బట్టతల ఉంటుంది. అతడు విగ్గు పెట్టుకుంటాడు. అందువల్లే అతడు మీద ఇష్టం పోయింది.. వాస్తవానికి అతడిది ధనవంతులైన కుటుంబం. కానీ నేను చేతన్ తో రిలేషన్ లో ఉన్నాను. కుటుంబ సభ్యులు అడిగితే కేతన్ తో పెళ్లికి ఒప్పుకోవాల్సి వచ్చింది. కానీ ప్రేమికుడి నుంచి ఒత్తిడి ఉండడంతో ఏం చేయాలో తెలియలేదు. అందువల్లే ఇది చేయాల్సి వచ్చిందని” ఆమె పోలీసులతో చెప్పినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది..

మరోవైపు సియా తల్లిదండ్రులు ఈ విషయాన్ని కొట్టి పారేస్తున్నారు. అతడికి బట్ట తల ఉందనే విషయం తన కూతురికి తెలుసని వారు చెబుతున్నారు.. అయినప్పటికీ ఆమె పెళ్లికి ఒప్పుకుందని.. ఎన్నడు కూడా చేతన్ ప్రస్తావన ఇంట్లో తేలేదని.. కనీసం అతడితో మాట్లాడినట్టు కూడా కనిపించలేదని వారు చెబుతున్నారు. మొత్తానికి ఈ కేసు ఎక్కడి నుంచో మొదలై.. చివరికి ఇక్కడ ముగిసింది.

నేడు టీమిండియా కు చావోరేవో.. ఏం జరగనుంది

India Women Vs Australia Women
India Women Vs Australia Women

India Women Vs Australia Women: టి20 వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా ఆదివారం కీలక మ్యాచ్ ఆడబోతోంది. ఆస్ట్రేలియాతో పోటీ పడబోతోంది. ఈ మ్యాచ్ టీమిండియాకు చావో రేవో లాంటిది. ఎందుకంటే ఇటీవల దక్షిణాఫ్రికా జట్టుతో టీమ్ ఇండియా ఓడిపోవడంతో.. పాయింట్లు పరంగా కాస్త వెనుకబడింది. గ్రూపులో ఆస్ట్రేలియా తర్వాత స్థానంలో కొనసాగుతున్నప్పటికీ.. భారత జట్టు సెమీఫైనల్ వెళ్లాలంటే కష్టంగా ఈ మ్యాచ్ గెలవాలి. ఈ మ్యాచ్ గెలవాలంటే టీమిండియా సర్వశక్తులు ప్రదర్శించాలి.

టి20లో ఆస్ట్రేలియా టీం మీడియా కంటే బలమైన జట్టు. దాదాపు ఒకటో స్థానం నుంచి మొదలు పెడితే ఎనిమిదో స్థానం వరకు ఆస్ట్రేలియా బ్యాటర్లు బ్యాటింగ్ చేయగల సమర్థులు. బౌలింగ్లో కూడా ఆ జట్టు అత్యంత భయంకరంగా ఉంది. ఇక ఫీల్డింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆస్ట్రేలియా జట్టు అన్ని విభాగాలలో భారత్ కంటే మెరుగ్గా కనిపిస్తున్న నేపథ్యంలో.. టీమిండియా ప్లేయర్లు వీరోచితమైన పోరాటం చేయాల్సిన అవసరం ఉంది.

ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ స్మృతి విఫలమైంది. ఆస్ట్రేలియా జట్టుతో జరిగే మ్యాచ్లో ఆమె మీద భారీగా అంచనాలు ఉన్నాయి. కెప్టెన్ కౌర్ తన స్థాయి ఆట తీరు ప్రదర్శించలేకపోతోంది. షఫాలీ వర్మ భీకరమైన ఫామ్ లో ఉన్నప్పటికీ.. ఆమెకు అండగా నిలిచే ప్లేయర్లు కరువైపోయారు.. జమీమా ఇప్పటివరకు తన రేంజ్ ఆట తీరు కొనసాగించలేదు. బౌలింగ్లో శ్రీ చరణి అదరగొడుతోంది.. ఫేస్ బౌలింగ్లో టీమ్ ఇండియా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఆస్ట్రేలియాలో జరిగే మ్యాచ్లో టీమిండియా తనలోపాన్ని సవరించుకోవాల్సిన అవసరం ఉంది. మిడిల్ ఆర్డర్ ఇప్పటివరకు ప్రూఫ్ చేసుకోలేకపోయింది. ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్లో మిడిల్ ఆర్డర్ బలపడకపోతే ఫలితం వేరే విధంగా ఉంటుంది.

మరోవైపు ఈ మ్యాచ్ లో టీమిండియా గెలిస్తేనే సెమీ ఫైనల్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది. ఆదివారం నాడు బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ గెలిస్తే టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయినప్పటికీ మెరుగైన నెట్ రన్ రేట్ ఉంటుంది కాబట్టి సెమీఫైనల్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ బంగ్లాదేశ్ మీద దక్షిణాఫ్రికా గెలిచి.. ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోతే అప్పుడు కౌర్ సేన ఇంటికి రావాల్సి ఉంటుంది.. ఎందుకంటే దక్షిణాఫ్రికా గెలిస్తే నెట్ రన్ రేట్ అమాంతం పెరుగుతుంది. ఈ సమీకరణలతో సంబంధం లేకుండా నేరుగా సెమీఫైనల్ వెళ్లాలంటే టీమిండియా కచ్చితంగా ఆస్ట్రేలియా పై విజయం సాధించాల్సిందే.

ఇటీవలి మహిళల వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా ఆస్ట్రేలియాపై సెమీఫైనల్ లో అద్భుతమైన విజయం సాధించింది. నాటి మ్యాచ్లో జెమీమా సూపర్ సెంచరీ తో ఆకట్టుకుంది వరల్డ్ ఛాంపియన్లకు షాక్ ఇచ్చింది. ఫైనల్ మ్యాచ్లో సఫారీ మహిళల మీద భారత్ గెలిచింది. ఈసారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తే టీమిండియా దర్జాగా సెమీఫైనల్ వెళ్తుంది. సాయంత్రం 7:30 నుంచి ఈ మ్యాచ్ లైవ్ ప్రసారమవుతుంది. ఈ మ్యాచ్ లో అందరి కళ్ళు జెమీమా మీద ఉన్నాయి. మరి వాటిని ఆమె ఏ విధంగా అందుకుంటుందో చూడాల్సి ఉంది.

ఈ ఐదు రాశుల వారి ఇంట్లో ఈరోజు డబ్బు ప్రవాహం.. లక్ష్మీదేవి తాండవం చేసే అవకాశం..

Today 28 June 2026 Horoscope
Today 28 June 2026 Horoscope

Today 28 June 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై జేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకోకుండానే ధన లాభం ఉంటుంది. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈ రోజు అనుకున్న పనులను త్వరగా పూర్తి చేస్తారు. గతంలో ఏర్పాటు చేసిన కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. సమాజంలో గౌరవం లభిస్తుంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు వాతావరణం కాస్త ప్రతికూలంగా ఉంటుంది. అనవసరపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. పూర్వీకుల ఆర్థిక సంబంధించి శుభవార్తలు వింటారు. వస్తువు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. ఉద్యోగులకు తోటి వారి సహకారం లభించకపోవచ్చు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈ కొత్తగా పెట్టుబడులు పెడతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు భారీగా లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు వీరి మధ్య విభేదాలు ఉండే అవకాశం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టాలు చేకూరే అవకాశం ఉంది. విద్యార్థుల విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని విజయాలే చేకూరుతాయి. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి చూపుతారు. ఉద్యోగులు తమ తెలివితేటలు ప్రదర్శించడం వల్ల అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కొందరికి పదోన్నతులు కూడా వచ్చే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయం.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని ప్రయోజనాలే జరిగే అవకాశం ఉంది. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులు చేపట్టిన కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను ఈరోజు విజయవంతంగా పూర్తి చేస్తారు. మాటల మాధుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. ఇంట్లోకి అతిధుల రాకతో సందడి ఏర్పడుతుంది.

కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : కన్యారాశి వారికి ఈరోజు సమాజంలో గౌరవం లభిస్తుంది. ఇంటి నిర్మాణానికి అవసరమైనా వస్తువులను కొనుగోలు చేస్తారు. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గతంలో చేపట్టిన కొన్ని ముఖ్యమైన పనులను ఈరోజు పూర్తి చేస్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. దీంతో బిజీగా మారే అవకాశం ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు. వీరికి పెద్దల ఆశీస్సులు ఉంటాయి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు వీరు స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. అనవసరపు ఖర్చులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అనుకోకుండా శుభకార్యానికి హాజరయ్యే అవకాశం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనడానికి సిద్ధమవుతారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. అనవసరపు వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. విద్యార్థులు కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. తల్లిదండ్రుల అండదండలతో వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు సమాజంలో గౌరవం పొందుతారు. పెండింగ్ పనులను పూర్తిచేసే అవకాశం ఉంది. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. శక్తి సామర్థ్యాల మేరకే ఖర్చులు పెట్టాలి. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. చట్టపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు అన్ని విషయాల్లో విజయాలు సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయడం వల్ల సమాజంలో గౌరవం లభిస్తుంది. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు అధిక లాభాలు ఉంటాయి. ఉద్యోగులు ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పదోన్నతులు పొందే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లాలని అనుకునే వారికి ఇదే మంచి అవకాశం. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.

బంగార్రాజులు కాదు.. నమ్మితే నిండా మునిగినట్టే.. హైదరాబాద్ గోల్డ్ మాన్ ల అసలు కథ ఇదీ

Hyderabad Gold Men
Hyderabad Gold Men

Hyderabad Gold Men: పొందూరు కాటన్ వేస్తారు. దానికి తగ్గట్టుగా వైట్ షూ ధరిస్తారు. మెడలో కిలోల కొద్ది బంగారం ధరిస్తారు. చివరికి మహిళలు కూడా అసూయపడే విధంగా బంగారు నగలు వేసుకుంటారు. పశువుల మెడలో వేసే పలుపు తాళ్ల మాదిరిగా బంగారు గొలుసులు ధరించి ట్రెండ్ సెట్టర్లుగా నిలుస్తూ ఉంటారు.

సోషల్ మీడియాలో ప్రత్యేకంగా గ్రూపులు నిర్వహిస్తూ ఉంటారు. సెలబ్రిటీలతో ఫోటోలు దిగుతూ ఉంటారు. సదర్ పండుగలు.. బోనాల పండుగలు.. ఇతర వేడుకల సమయంలో బంగారం ధరించి సందడి చేస్తుంటారు. వివిధ సినిమా ఫంక్షన్ల లో కనిపిస్తూ ఉంటారు. ఆటోగ్రాఫ్ లు ఇస్తూ అదరగొడుతుంటారు. చుట్టూ మళ్ళీ మార్బలంతో హల్ చల్ సృష్టిస్తుంటారు.

ఒకప్పుడు ఇటువంటి బంగార్రాజులు ఒకరి ఇద్దరు మాత్రమే ఉండేవారు. ఇటీవల కాలంలో వీరి సంఖ్య పెరిగిపోయింది. ఓ నివేదిక ప్రకారం హైదరాబాదులో దాదాపు 50 మందికి పైగా ఇటువంటి గోల్డ్ మ్యాన్ లు ఉన్నారు. వీరంతా ఆ స్థాయిలో బంగారం ఎలా సంపాదించారు…. వీరికి ఆ బంగారం ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాల మీద ఆ మధ్య పోలీసులు ఫోకస్ పెట్టడంతో.. వీరి బాగోతం బయటపడింది. తాజాగా తెలంగాణ పోలీసులు అత్తాపూర్ ప్రాంతానికి చెందిన సూర్య కుమార్ అలియాస్ సూర్య భాయ్ ని అరెస్ట్ చేశారు.

సూర్య ఒంటిమీద బంగారం ధరించి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచేవాడు. ఇతడికి సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇతడు ధరించిన బంగారం నిజమని చాలామంది అప్రోచ్ అయ్యారు. అందులో ఒకడిని సూర్య నిండా ముంచాడు. తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని హిమాయత్ నగర్ కు చెందిన ఒక కేఫ్ నిర్వాహకుడికి ఏకంగా 32. 30 లక్షలకు ముంచాడు. ఎంతసేపటికి బంగారం ఇవ్వకపోవడంతో ఆ వ్యక్తి సూర్యను నిలదీశాడు. దీంతో మూడు ఐఫోన్లు ఇచ్చాడు. 20 లక్షలకు చెక్కులు ఇచ్చాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు మళ్లీ ఆ కేఫ్ నిర్వాహకుడు కొంతమందితో కలిసి సూర్య ఇంటికి వెళ్లారు. అక్కడ గొడవ చేయడంతో.. సూర్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. సూర్యను పోలీసులు విచారించగా అతని అసలు రంగు బయటపడింది.

సూర్య ధరించేది నిజమైన బంగారం కాదు. అది పూర్తిగా వన్ గ్రామ్ గోల్డ్. హైదరాబాద్ నగరంలో ఉన్న బంగారు బాబులు మొత్తం ధరించేది వన్ గ్రామ్ గోల్డ్ మాత్రమే. హైదరాబాదు నగరంలో నిజమైన గోల్డ్ ధరించే వారు కేవలం ఇద్దరు మాత్రమేనని తెలుస్తోంది వారు కూడా పాత బస్తిలో ఉంటారని పోలీసులు చెబుతున్నారు. మిగతా వారంతా ఇలా రోల్డ్ గోల్డ్ ధరించి.. జనాలను మోసం చేస్తున్నారని.. సోషల్ మీడియాలో హైప్ కోసం ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు అంటున్నారు. ఇటువంటి వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

పూణే వ్యాపారి కేసు.. చేతన్ తో మా అక్కకు అలాంటి బంధం.. సియా తమ్ముడు మొత్తం చెప్పేశాడు గా

Ketan Agarwal
Ketan Agarwal

Ketan Agarwal: పూణే స్థిరాస్తి వ్యాపారి కేతన్ అగర్వాల్ ఇటీవల కోటపైనుంచి కింద పడి చనిపోయాడు. అయితే అతడిది సహజమరణం కాదు.. దీని వెనక అతనికి కాబోయే భార్య సియా హస్తముంది. సియా చేతన్ అనే వ్యక్తి ప్రేమలో ఉంది. కేతన్ ను చేసుకోవడం సియాకు ఏమాత్రం ఇష్టం లేదు. పైగా అతడు విగ్గు ధరిస్తాడు. అందువల్లే సియా అతడిని హతమార్చింది. గతంలో రెండుసార్లు అతడిని హతమార్చడానికి ప్రయత్నించినప్పటికీ.. ఆ రెండు ప్రయత్నాలు విఫలమయ్యాయి.

కేతన్ చనిపోయిన తర్వాత.. అతడి కుటుంబ సభ్యులకు అనేక అనుమానాలు కలిగాయి. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేతన్ మరణం వెనక అతడికి కాబోయే భార్య సియా.. ఆమె ప్రియుడు చేతన్ హస్తమున్నట్టు తేలింది. అంతేకాదు ఈ హత్య వెనక.. అనేక రకాల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.. చేతన్, సియా చాలాకాలం నుంచి ప్రేమలో ఉన్నారు. కేతన్ తో వివాహం సియాకు ఇష్టం లేదు. కుటుంబ సభ్యులు బలవంతంగా పెళ్లి చేయడానికి ప్రయత్నించడంతో.. అతడి అడ్డు తొలగించుకోవడానికి ఆమె ఈ దారుణానికి పాల్పడింది. దీనికి తోడు ఆమె ప్రియుడు చేతన్ ఒత్తిడి తీసుకురావడంతో.. సియాకు మరో గత్యంతరం లేకుండా పోయింది.

సియా తల్లిదండ్రులు మాత్రం తమ కూతురు అలాంటిది కాదని చెబుతున్నారు. ఆమెకు ఇష్టం ఉండే ఈ పెళ్లి నిర్ణయించామని.. పెళ్లి చేసుకోవడం తనకు అంగీకారమేనని వారు వివరించారు. తమ కూతురు ఇలాంటి పని చేసిందంటే నమ్మలేకపోతున్నామని వారు చెబుతున్నారు. ఒకవేళ తమ కూతురు ఇలాంటి పనిచేసే ఉంటే కఠినంగా శిక్షించాలని వారు కోరుతున్నారు. ఒకవేళ అదే కోట మీద నుంచి ఆమెను కిందకు తోసి చంపేయాలని చెబుతున్నారు.

పోలీసులు సియా తమ్ముడుని అదుపులోకి తీసుకున్నారు. అతడిని 10 గంటల పాటు విచారించారు. సియా సోదరుడు సాహిల్ చెప్పిన విషయాలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. చేతన్ అనేవాడు ఒక క్రికెటర్. అతడు ఆడియో మ్యాచ్లకు సియా వెళ్ళేది. ఈ విషయం ఇంట్లో తెలియకుండా జాగ్రత్తపడేది. ఫోన్ కూడా అత్యంత రహస్యంగా మాట్లాడేది. ఇంట్లో చేతన్ ప్రస్తావన అసలు తెచ్చేది కాదు. ఒకసారి సాహిల్ క్రికెట్ మ్యాచ్ చూసేందుకు గ్రౌండ్ కు వెళ్తే.. అక్కడ సియా కనిపించింది. అంతేకాదు చేతన్ తో అత్యంత చనువుగా ఉంది. ఆ తర్వాత అనేక సందర్భాల్లో సాహిల్ వారిద్దరిని చూశాడు. కాకపోతే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులతో చెప్పలేదు.. క్రికెట్ మ్యాచ్లకు హాజరు కావడం ద్వారా చేతన్ తో సియా సాన్నిహిత్యం పెంచుకుంది. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పలేదు. కేతన్ తో పెళ్లికి నో చెప్పలేదు. అయితే అతడిని అడ్డు తొలగించుకొని.. చేతన్ ను పెళ్లి చేసుకోవాలని సియా అనుకుంది. చివరికి ఇలా దొరికిపోయింది.

తెలుగమ్మాయి అందాలు అదరహో

Eesha Rebba
Eesha Rebba

భారత్ లో తెలుపు కార్లే ఎక్కువ.. వాటినే ఎందుకు కొంటున్నారంటే.

India Car Color Trends
India Car Color Trends

India Car Color Trends: చాలా మంది కార్లు కొనే సమయంలో మైలేజ్ కోసం ఇంజిన్.. స్టైలిష్ గా ఉండడానికి డిజైన్ చూస్తారు. అయితే కొందరు తమకు నచ్చిన కలర్ లో ఉండే కారును మాత్రమే కొనుగోలు చేస్తారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కంపెనీలు సైతం వారికి ఇష్టమైన రంగుల్లో కార్లను మార్కెట్లోకి తీసుకువస్తుంటాయి. అయితే ప్రముఖ అంతర్జాతీయ కెమికల్ మరియు రంగుల తయారీ సంస్థ BASF విడుదల చేసిన తాజా ‘ఆటోమోటివ్ కలర్ పాపులారిటీ రిపోర్ట్’ ప్రకారం, భారతీయ కార్ల మార్కెట్లో రంగుల ఎంపికకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా రంగురంగుల కార్ల హవా పెరుగుతున్నప్పటికీ, భారతదేశంలో మాత్రం వాహనదారులు ఇప్పటికీ తెలుగు రంగు కార్లనే ఎక్కువగా కొంటున్నట్లు తెలుస్తోంది. అలా ఎందుకు కొనుగోలు చేస్తున్నారో తెలుసా..?

భారతదేశంలో కార్ల కొనుగోలుదారులలో అత్యధికులు తెల్ల రంగు కార్లనే ఇష్టపడుతున్నారు. దేశంలో అమ్ముడవుతున్న కార్లలో ఏకంగా 48 శాతం మంది ఈ కార్లనే కొనుగోలు చేస్తున్నట్లు సర్వేలో తేలింది. మన దేశంలో ఉన్న విపరీతమైన ఎండలు, ధూళి వంటి వాతావరణ పరిస్థితుల్లో తెల్ల రంగు కారును మెయింటెన్ చేయడం సులభం కావడం దీనికి ప్రధాన కారణం. అంతేకాకుండా, రీసేల్ (మళ్లీ అమ్మేటప్పుడు) సమయంలో కూడా తెల్ల రంగు కార్లకు మంచి డిమాండ్ మరియు ధర లభిస్తుండటంతో సగానికి పైగా ప్రజలు దీనికే జై కొడుతున్నారు.

వైట్ కలర్ తర్వాత భారతీయులు ఎక్కువగా ఇష్టపడుతున్న రంగు Grey. దాదాపు 17 శాతం మంది ఈ కలర్ కార్లను ఎంచుకుంటుండడంతో ఇది రెండో స్థానంలో నిలిచింది. దీని తర్వాత స్టైలిష్ లుక్ కోసం, ఎలిగెంట్ లుక్ కోసం చూసేవారు సిల్వర్, బ్లాక్ రంగుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ రెండు రంగుల కార్లను 10 శాతం మంది చొప్పున వాడుతున్నట్లు సర్వే తేల్చింది.

అయితే కాస్త ట్రెండీగా, కలర్‌ఫుల్‌గా ఉండాలనుకునే వారు బ్లూ, రెడ్ రంగులను ఎంచుకుంటున్నారు. క్రోమాటిక్ రంగుల విభాగంలో 7 శాతం వాటాతో బ్లూ (నీలం) కలర్ ముందంజలో ఉండగా, 5 శాతం వాటాతో రెడ్ (ఎరుపు) కలర్ తర్వాతి స్థానంలో ఉంది. ముఖ్యంగా యువత, చిన్న హాచ్‌బ్యాక్ కార్లు కొనేవారు ఎరుపు రంగును ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

ఇక మార్కెట్లో చాలా తక్కువ మంది మాత్రమే ఎంచుకునే ప్రత్యేకమైన రంగుల్లో గ్రీన్, బీజ్, ఆరెంజ్ రంగులు ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో వస్తున్న కొత్త SUV మోడల్స్, ఎలక్ట్రిక్ వాహనాల్లో గ్రీన్, డ్యూయల్ టోన్ , మ్యాట్ ఫినిషింగ్ రంగుల వైపు మొగ్గు చూపుతున్నట్లు BASF తెలిపింది.

రెడ్ మీ సిరీస్ నుంచి కొత్త ఫోన్.. అద్భుతమైన ఫీచర్లు.. త్వరపడండి

Redmi Note 17 Pro
Redmi Note 17 Pro

Redmi Note 17 Pro: Xiaomi సబ్‌బ్రాండ్ అయిన రెడ్‌ మీ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ Redmi Note 17 Series మార్కెట్లోకి రావడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా, ఈ సిరీస్‌కు చెందిన రెడ్‌మి నోట్ 17 ప్రో మోడల్ చైనాకు చెందిన ప్రముఖ ‘3C’ సర్టిఫికేషన్ డేటాబేస్‌లో కనిపించింది. ఈ లిస్టింగ్ ద్వారా ఫోన్‌కు సంబంధించిన ఛార్జింగ్, బ్యాటరీ వివరాలు బయటకు వచ్చాయి. ప్రస్తుత కాలంలో ఫొటోగ్రఫీ కోసం కెమెరా కలిగిన ఫోన్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అలాగే రోజూవారీ వినియోగం కోసం బ్యాటరీ బలంగా ఉండే ఫోన్ కావాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అంటున్నారు. ఇంతకీ ఈ ఫోన్ ఎలా ఉందంటే?

చైనా కంపల్సరీ సర్టిఫికేషన్ (3C) వెబ్‌సైట్‌లో రెడ్‌మి నోట్ 17 ప్రో మోడల్ నమోదైంది. ఈ ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రానుంది. ఇది గత ఏడాది వచ్చిన రెడ్‌మి నోట్ 15 ప్రో (45W ఛార్జింగ్) కంటే మెరుగైన అప్‌గ్రేడ్ అని చెప్పవచ్చు. ఈసారి బ్యాటరీ విభాగంలో విప్లవాత్మక మార్పులు చేయబోతోంది. రెడ్‌మి నోట్ 17 ప్రో లో ఏకంగా 9,000mAh భారీ బ్యాటరీని ఉపయోగించనున్నట్లు టెక్ వర్గాలు చెప్తున్నాయి. సిలికాన్-కార్బన్ బ్యాటరీ టెక్నాలజీ సహాయంతో ఫోన్ బరువు కాకుండా ఇంత పెద్ద బ్యాటరీని అమర్చినట్లు తెలుస్తోంది. డిస్‌ప్లే విషయానికి వస్తే.. కర్వ్‌డ్ స్క్రీన్‌లకు స్వస్తి చెప్పి దీనిలో 1.5K రిజల్యూషన్ గల ఫ్లాట్ OLED డిస్‌ప్లేను అందించనున్నారు.

పర్ఫార్మెన్స్ పరంగా.. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ సంస్థకు చెందిన సరికొత్త స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 చిప్‌సెట్‌తో పనిచేసే అవకాశం ఉంది. ఇది రోజువారీ పనులతో పాటు గేమింగ్‌కు బాగా ఉపయోగపడుతుంది. ఫోటోగ్రఫీ కోసం దీని వెనుక భాగంలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉన్న 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అందించనున్నట్లు లీక్‌లు సూచిస్తున్నాయి.

మొదటగా ఈ మొబైల్ చైనా మార్కెట్లో ఈ జూలై లేదా ఆగస్టు నెలల్లో అధికారికంగా విడుదల కానుంది. చైనాలో విడుదలైన కొన్ని నెలల తర్వాతే ఇది భారతదేశంతో పాటు ఇతర అంతర్జాతీయ మార్కెట్లలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.

మూడు పేర్లు.. ఐదు పెళ్లిళ్లు.. ఈ నిత్య పెళ్లి కూతురు ఇలా దొరికింది..

Five Marriages Fraud
Five Marriages Fraud

Five Marriages Fraud: ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఐదు పెళ్లిళ్లు చేసుకుంది. ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుంది. ఒక చోట ఒక పేరు, మరో చోట మరో పేరు..ఇలా పేర్లు మార్చుకుని అందరినీ ఏమార్చింది. పైగా మోసం చేయడంలో కొత్త దారులను అవలంబించింది. ఇలా ఏకంగా ఐదు పెళ్లిళ్లు చేసుకున్న ఈమె బండారం బయట పడింది. ఆమె తీరు చూసి పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. శ్వేత, కీర్తి, మణి..ఈ పేర్లు మొత్తం ఆమెవే. వయసు 27సంవత్సరాలు ఉంటుంది. ఈమెది తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం దొండపుడి.

వజ్రపు మణి ది మొదటినుంచి కూడా విచ్చలవిడి వ్యక్తిత్వం. టీనేజ్ లోనే ఈమె వ్యవహారాలు తార స్థాయి చేరడంతో తల్లిదండ్రులు 2025లో పెద్ద మడుగురులోని కాశేపల్లి కి చెందిన సుధీర్ రెడ్డిని ఈమె వివాహం చేసుకుంది. కొద్దిరోజులపాటు అతనితో బాగానే ఉంది. ఆ తర్వాత అతడికి చెప్పకుండా వెళ్ళిపోయింది. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో సుధీర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు పెద్దవడుగూరు లో కేసు నమోదు చేశారు.

మణి అక్కడినుంచి కర్ణాటక వెళ్ళిపోయింది. అక్కడ మల్లె కుప్పం ప్రాంతంలో ఒక యువకుడికి దగ్గర అయింది. తనకు ఎవరూ లేరని అతని వద్ద నమ్మబలికింది. అతడికి పెళ్లి కాకపోవడం.. ఎన్ని సంబంధాలు చూసినా కుదరకపోవడంతో దొరికింది చాన్స్ అనుకుని పెళ్లి చేసుకున్నాడు.. అతడితో ఆరు రోజులు గడిపింది. సరిగ్గా ఆరు రోజుల తర్వాత మదనపల్లె వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. చీకల బైలు వద్ద ఆమెను అరెస్ట్ చేశారు.

మణి కి కేవలం ఈ రెండు మాత్రమే కాదు.. అంతకుముందు మూడు వివాహాలు జరిగాయి. విజయవాడ నగరానికి చెందిన సుమప్రియ.. అశోక్.. శశికళ.. రామకృష్ణ అనే వ్యక్తులతో కలిసి ఈయన చేతులు కలిపింది. వీరిని మధ్యవర్తులుగా నియమించుకుంది. తనకు ఎదురు కట్నం వచ్చేలాగా పెళ్లి సంబంధాలు కుదుర్చుకునేది. అత్యంత గ్రాండ్ గా పెళ్లి చేసుకునేది. తనకు ఎవరూ లేరని.. నమ్మబలికేది. అంతేకాదు మధ్యవర్తులను దూరపు బంధువులుగా పరిచయం చేసేది. ఆ తర్వాత తనకు ఆస్తులు ఉన్నాయని చెప్పేది. డబ్బులు.. బంగారం వసూలు చేసేది. ఆ తర్వాత కొద్ది రోజులకే అక్కడ నుంచి పారిపోయేది.

తను ఉపయోగించే సిమ్ కార్డులను వెంటనే మార్చేసేది ఆ సిమ్ కార్డులను కూడా వేరే వ్యక్తుల పేరు మీద తీసుకునేది. అందువల్లే పోలీసులకు దొరకకుండా.. తాను మోసం చేసిన వారికి చిక్కకుండా తప్పించుకునే. అయితే సుధీర్ రెడ్డి ఈమె గురించి వెతకడం.. పోలీసులకు ఫిర్యాదు చేయడం.. ఆమె కదలికలపై దృష్టి పెట్టడంతో.. చివరికి దొరికిపోయింది. నేటి కాలంలో వివాహాలు జరగక చాలామంది యువకులు ఇబ్బంది పడుతుంటే.. ఈమె మాత్రం ఏకంగా ఐదు పెళ్లిళ్లు చేసుకుంది. డబ్బులు, బంగారం లాగి ఎస్కేప్ అయ్యేది.

ఇప్పటికిప్పుడు నరేంద్ర మోడీ సీషెల్స్ ఎందుకు వెళ్లినట్టు.. గట్టి ప్లానే వేశారుగా..

Modi Seychelles Visit
Modi Seychelles Visit

Modi Seychelles Visit: ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ దేశానికైనా సరే మరొక దేశంతో దౌత్య సంబంధం అత్యంత అవసరం. ఎందుకంటే ప్రపంచంలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఏ దేశంతో ఎలాంటి సందర్భంలో అవసరం ఏర్పడుతుందో తెలియడం లేదు. అందువల్లే దౌత్య సంబంధాల కోసం ఆయా దేశాల అధినేతలు విదేశాలలో పర్యటిస్తున్నారు. ఈ జాబితాలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ మొదటి స్థానంలో ఉంటారు.

Also Read: అమెరికా కంటే భారత్‌ బెటర్‌.. అన్ని దేశాలకు దీంతో అర్థమైంది

ఇటీవల ఆయన ఫ్రాన్స్ దేశంలో పర్యటించారు. ఇప్పుడు హిందూ మహాసముద్రంలో అత్యంత కీలకమైన సీ షెల్స్ దేశం వెళ్లారు. వాస్తవానికి ఈ దేశం జనాభా చాలా తక్కువ.. గట్టిగా కొడితే 1,40,000 కూడా ఉండదు. ఈ దేశానికి తలసరి ఆదాయం 14,80,000 వరకు ఉంటుంది.. ఈ దేశానికి రాజధానిగా విక్టోరియా నగరం ఉంటుంది. చైనీస్.. ఇండియా.. ఆఫ్రికన్.. బ్రిటిష్.. ఫ్రెంచ్ సంతతికి సంబంధించిన ప్రజలు ఇక్కడ ఎక్కువగా జీవిస్తూ ఉంటారు. మెజారిటీ ప్రజలు క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తుంటారు. ఇక్కడ 5.4% మంది హిందువులు ఉన్నారు. ఇందులో నాలుగు వేలమంది తమిళులు ఉన్నారు.

సీ షెల్స్ దేశానికి నరేంద్ర మోడీ వెళ్ళడానికి ఒక కారణం ఉంది. ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ పాట్రిక్ హేర్మని ఆహ్వానం మేరకు ఆయన
సీ షెల్స్ వెళ్లిపోయారు. సీ షెల్స్ 50వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు నరేంద్ర మోడీ అక్కడికి వెళ్లారు. మూడు రోజులపాటు అక్కడ ఉంటారు..సీ షెల్స్ భారత్ మధ్య ఏకంగా దౌత్య సంబంధాలు ఏర్పడి 50 సంవత్సరాలు అవుతోంది. అందువల్లే నరేంద్ర మోడీ ఈ కీలక పర్యటన సాగిస్తున్నారు.

సీ షెల్స్ అధ్యక్షుడితో నరేంద్ర మోడీ ద్వైపాక్షిక చర్చలు సాగిస్తారు.. డిఫెన్స్, ట్రేడ్, బ్లూ ఎకానమీ, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి వాటిల్లో చర్చలు సాగిస్తారు.

హిందూ మహా సముద్రంలో చైనా దూకుడు కొనసాగిస్తున్న నేపథ్యంలో.. డ్రాగన్ దేశాన్ని నిలువరించడానికి సీ షెల్స్ సహకారం భారతదేశంలో చాలా అవసరం.. మరోవైపు భారత్ నిర్వహిస్తున్న విజన్ మహాసాగర్.. గ్లోబల్ సౌత్ లో సీ షెల్స్ అత్యంత ముఖ్యమైన భాగస్వామి.. అంతేకాదు, సీ షెల్స్ భాగస్వామ్యంతో నిర్మించిన జాయింట్ సీ షెల్ కింద ఏర్పాటుచేసిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నరేంద్ర మోడీ ప్రారంభించారు. గస్తీ నౌకను సీ షెల్స్ దేశానికి మోడీ అందించారు.. ఇక్కడ భారతీయులతో నరేంద్ర మోడీ ప్రత్యేకంగా సమావేశం అవుతారు.

ఫోల్డబుల్ ఫోన్ హిస్టరీలోనే బలమైన బ్యాటరీ.. త్వరలోనే మార్కెట్లోకి..

Vivo X Fold 6
Vivo X Fold 6

Vivo X Fold 6: Vivo కంపెనీకి చెందిన కొత్త ఫోన్ ఇటీవల చైనాలో లాంచ్ చేయబడింది. ఈ కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫీచర్లు, భారీ బ్యాటరీ సామర్థ్యంతో మార్కెట్లోకి వచ్చింది. ప్రీమియం లుక్ తో పాటు ఆకర్షణీయమైన డిజైన్ కలిగిన ఫోన్ కావాలని అనుకునేవారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఫోన్‌ గురించి పూర్తి వివరాల్లోకి వెళితె…

Also Read: వెంకటేష్ ఆ జానర్ ను టచ్ చేస్తే బాగుంటుందిగా…

చైనాలో జరిగిన ఒక ప్రత్యేక ఈవెంట్‌లో వివో కంపెనీకి చెందిన కొత్త ఫోన్ Vivo X Fold 6 ను లాంచ్ చేశారు. ఇది ఈ కంపెనీ నుంచి వచ్చిన అత్యంత శక్తివంతమైన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా నిలుస్తుంది. రౌండెడ్ కార్నర్లు, ప్రీమియం లుక్‌తో చాలా ఆకర్షణీయంగా ఉన్న ఈ ఫోన్ ‘బ్లూ హోల్’, ‘పోలార్ నైట్’, ‘సాల్ట్ లేక్’ అనే మూడు ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది.

ఈ ఫోన్‌లో అత్యుత్తమమైన డిస్‌ప్లేను అందించారు. ఇందులో 8.02 అంగుళాల ఫోల్డబుల్ శామ్‌సంగ్ M14 AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో పనిచేస్తుంది. బయట వైపు 6.51 అంగుళాల కవర్ డిస్‌ప్లే ఉంది. ఇందులో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. దీంతో పాటు మల్టీ టాస్కింగ్ కోసం ‘ఆరిజిన్ OS 6 ఫోల్డ్’ సాఫ్ట్‌వేర్ కూడా ఉంది.

ఈ ఫోన్‌లోని అతి ముఖ్యమైన ఫీచర్ బ్యాటరీ. ఫోల్డబుల్ ఫోన్లలోనే అత్యధికంగా 7,000mAh బ్యాటరీని కంపెనీ ఇందులో అందించింది. ఇది 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. కెమెరా విషయానికొస్తే.. దీని వెనుక వైపు 200MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా వైడ్, 50MP టెలిఫోటో లెన్స్‌లతో కూడిన పవర్డ్ కెమెరా సెటప్ ఉంది.

ప్రస్తుతానికి ఈ ఫోన్ చైనాలో మాత్రమే లాంచ్ చేయబడింది. దీని ప్రారంభ ధర 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌కు సుమారు 7,999 యువాన్లుగా (సుమారు రూ. 1,11,000) ఉంది. టాప్ వేరియంట్ 16GB RAM + 1TB స్టోరేజ్ వేరియంట్ ధర దాదాపు 10,999 యువాన్ల వరకు ఉంది. ఈ ఫోన్ జూలై 1 నుండి చైనాలో విక్రయానికి అందుబాటులోకి రానుంది.

మటన్ తునకల కోసం.. పొట్టు పొట్టు కొట్టుకున్నరు.. బలగం సినిమా రిపీట్ అయిందిగా..

Mutton Fight
Mutton Fight

Mutton Fight: తెలంగాణలో మటన్ అంటే ఒక ఎమోషన్.. కార్యం ఏదైనా కానీ మటన్ ఉండాల్సిందే. అందులోకి మందు కూడా.. మందు తాగుతూ.. మటన్ తింటూ ఎంజాయ్ చేసేవాళ్ళు చాలామంది. ఇందులో మూలుగ బొక్కల కోసం.. తలకాయ కూర కోసం సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది..

Also Read: వెంకటేష్ ఆ జానర్ ను టచ్ చేస్తే బాగుంటుందిగా

తెలంగాణలో మిగతా మర్యాదలు పక్కన పెడితే.. వేడుకల సమయంలో మటన్ గట్టిగానే పెట్టాలి.. తునకలు కంచం నిండా వెయ్యాలి. తునకలు వేసే విషయంలో ఏదైనా తేడా జరిగితే ఇక అంతే సంగతులు. గొడవ పుడుతుంది.. కొట్లాట దాకా వస్తుంది. అచ్చం బలగం సినిమా లాగా.

బలగం సినిమా వచ్చిన తర్వాత తునకల కోసం జరిగే కొట్లాటలు పెరిగిపోయాయి. అలాగని ఆ సినిమా ఈ కొట్లాటలకు కారణం కాదు. కేవలం మటన్ ముక్కల కోసం మాత్రమే ఈ పంచాయతీ మొత్తం. తాజాగా సూర్యాపేట జిల్లాలో బలగం సీన్ రిపీట్ అయింది. పెళ్లికి సంబంధించిన డిన్నర్లో మటన్ కూర.. మూలుగ బొక్కల కోసం పెద్ద పంచాయతీ నడిచింది. పెన్ పహాడ్ మండలం అనంతరం గ్రామంలో ఒక వివాహం జరిగింది. వివాహం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం విందు నిర్వహించారు. పెళ్ళికొడుకు బంధువులు భోజనం సమయానికి కాకుండా.. కాస్త ఆలస్యంగా వచ్చారు. అప్పటికే దాదాపు పూర్తయింది.

“మేం బంతిలో కూకున్నాం.. ముక్కలు లేవు. బొక్కలు కూడా లేవు. సరిగా బువ్వ కూడా పెట్టడం లేదని” పెళ్ళికొడుకు తరఫు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. అమ్మాయి తరఫు బంధువులతో అగ్రహారం దిగారు..”భోజనం సమయం కాకుండా ఇంత ఆలస్యంగా వస్తే ఎలా.. ఇప్పుడు మటన్ లేదని గొడవ చేస్తే ఎలా..” అంటూ అమ్మాయి తరఫు వాళ్ళు ఎదురు తిరిగారు.. ఈ విషయంలో రెండు వర్గాల మధ్య మాటలు పెరిగాయి. ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. మండపంలోనే గట్టిగా కొట్టుకున్నారు. దీంతో రెండు వర్గాల వారు పోలీస్ స్టేషన్ దాకా వెళ్లారు.. పోలీసులు ఇరు వర్గాల వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వెనక్కి పంపించారు.

మరో యుద్ధానికి అమెరికా, రష్యా సిద్ధం.. సైన్యాన్ని పెంచుకుంటున్న జర్మనీ.. ఏ జరుగుతోంది..

Germany Military
Germany Military

Germany Military: ప్రపంచ ఆటోమొబైల్ రాజధానిగా జర్మనీ దేశానికి పేరు ఉంది. యూరప్ ఖండం లోనే అత్యంత విలాసవంతమైన దేశంగా జర్మనీ కొనసాగుతోంది. జర్మనీ నాటో లో కొనసాగుతున్నప్పటికీ.. స్వయం ప్రతిపత్తిని ఎక్కువగా కోరుకుంటుంది జర్మనీ. అందువల్లే నాటో దేశాలతో అంటి ముట్టినట్టుగా వ్యవహరిస్తూ ఉంటుంది. పైగా రష్యా తో ఉక్రెయిన్ యుద్ధం చేస్తున్నప్పుడు జర్మనీ టచ్ మీ నాట్ అన్నట్టుగానే వ్యవహరించింది. మిగతా దేశాలు యుద్ధానికి సపోర్ట్ చేయగా.. జర్మనీ మాత్రం తన పరిధిలో మాత్రమే వ్యవహరించింది.

Also Read: వెంకటేష్ ఆ జానర్ ను టచ్ చేస్తే బాగుంటుందిగా…

జర్మని కి ఆది నుంచి కూడా రష్యాతో శత్రుత్వం కొనసాగుతోంది. ప్రపంచ యుద్ధాల నుంచి కూడా రెండు దేశాల మధ్య శత్రుత్వం ఉంది. ఇటీవల కాలంలో రష్యా ఉక్రెయిన్ దేశంతో యుద్ధం చేస్తోంది. ఈ యుద్ధం వల్ల రష్యా నష్టపోయింది. దీనికి తోడు జర్మనీ చేయనాతో సంబంధాలను పెంచుకుంది. వాణిజ్యంగా కూడా జర్మనీ అభివృద్ధి చెందుతోంది. సరికొత్త ప్రణాళికలతో దూసుకుపోతోంది. ఆటోమొబైల్ పరిశ్రమల ద్వారా వృద్ధుని మరింత ఎక్కువగా నమోదు చేస్తోంది. వాణిజ్యపరంగా తమ నుంచి జర్మనీ వెళ్తోందని అమెరికా అక్కసు పెంచుకుంది. దీనికి తోడు, రష్యా కూడా జర్మనీ మీద ఆగ్రహంగా ఉంది. అటు అమెరికా.. ఇటు రష్యా రెండు బలమైన దేశాలు. పైగా నాటోలో జర్మనీ పాత్ర అంతంత మాత్రమే. అలాంటప్పుడు ఈ రెండు దేశాలు జర్మనీ మీద యుద్ధం సాగిస్తే అప్పుడు పరిస్థితులు మారిపోతాయి.

జర్మనీ ఈ ప్రమాదాన్ని ముందుగానే అంచనా వేసింది. ఇటీవల కాలంలో అమెరికా జర్మనీ మీద తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. రష్యా కూడా అదే స్థాయిలో కోపాన్ని ప్రదర్శిస్తుంది. దీంతో జర్మనీ ముందు జాగ్రత్త చర్యగా తన సైన్యాన్ని పెంచుకునేందుకు సిద్ధంగా ఉంది. అందువల్లే కేటాయింపులు.. ఇతర వ్యవహారాలు వేగంగా సాగిస్తోంది. దీనికి తోడు నాటో దేశాల భద్రతకు సంబంధించి అమెరికా భారీగానే సహాయం చేస్తోంది. అయితే జర్మనీ మాత్రం తన ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసుకుంటున్న నేపథ్యంలో అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇటీవల కాలంలో ట్రంప్ జర్మనీ మీద అనేక సందర్భాలలో తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అందువల్లే జర్మనీ సైన్యాన్ని పెంచుకునేందుకు అడుగులు వేస్తోంది.

సైనిక శక్తిపరంగా.. ఆయుధ శక్తి పరంగా జర్మనీ అటు రష్యాతో.. ఇటు అమెరికాతో పోటీ పడలేదు. పైగా జర్మనీ దగ్గర సైన్యం కూడా తక్కువగానే ఉంటుంది. జర్మనీ ప్రపంచంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాత్ర పోషించినప్పటికీ.. ఆ తర్వాత పెద్దగా యుద్ధాలు చేసిన దాఖలాలు లేవు. పక్కనున్న దేశాలతో జర్మనీ పెద్దగా స్నేహంగా ఉండదు. అలాగని శత్రుత్వాన్ని కొనసాగించదు. అవసరాల మేరకు మాత్రమే నడుచుకుంటుంది. ఇప్పుడు అమెరికా.. రష్యా కారాలు మీరాలు నూరుతున నేపథ్యంలో.. జర్మనీ తనను తను కాపాడుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. చూడాలి మరి ఈ పరిణామం దేనికి దారితీస్తుందో..