Home Blog Page 55

మహేష్ బాబు ప్రొడ్యూస్ చేసిన 'రావు బహదూర్' మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసిందిగా...

Rao Bahadur 4 Days Collection
Rao Bahadur 4 Days Collection

Rao Bahadur review: ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన దర్శకుడు వెంకటేష్ మహా చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ పెను సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఇండస్ట్రీలో ఈ సినిమాకు భారీ పాపులారిటి దక్కింది. ఇక అలాంటి క్రమంలోనే ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరు సినిమా అద్భుతంగా ఉందని కామెంట్స్ చేశారు. దాంతో ఒక్కసారిగా వెంకటేష్ మహా టాప్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇక అలాంటి క్రమంలోనే ఆ తర్వాత చేసిన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో ఇప్పుడు మహేష్ బాబు ప్రొడ్యూసర్ గా ‘రావు బహదూర్’ అనే సినిమాని చేస్తున్నాడు. సత్యదేవ్ ఈ సినిమాలో మెయిన్ లీడ్ లో నటిస్తుండడం విశేషం… అయితే ఈ సినిమాను రీసెంట్ గా ఇండస్ట్రీలో ఉన్న సినిమా పెద్దలకైతే చూపించారు.

ఈ మూవీ చూసినా చాలా మంది దీనిమీద చాలావరకు పాజిటివ్ రివ్యూస్ అయితే ఇస్తున్నారు. ఈ సినిమా చాలా ఎక్సైటింగ్ గా ఉందంటూ వాళ్లు కామెంట్స్ చేస్తుండటం విశేషం… ముఖ్యంగా సత్యదేవ్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి… రీసెంట్ంగా సుకుమార్ సైతం ఈ సినిమాని చూసి ఈ సినిమా మీద తను కామెంట్స్ చేస్తున్నాడు.

ఈ మూవీ మామూలు సినిమా కాదని ఇది భారీ విజయం సాధిస్తుంది అంటూ ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఒక వ్యక్తి వందల సంవత్సరాల పాటు ఎలా జీవించి ఉంటున్నాడు అనే కాన్సెప్ట్ ని ఈ సినిమాలో చాలా అద్భుతంగా చిత్రీకరించారట.

మరి ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరు ఒక కొత్త అనుభూతిని పొందుతారని చెబుతుండడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలని దర్శకుడు వెంకటేష్ మహా ప్రయత్నం చేస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా సక్సెస్ ని సాధిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం జూలై 3 వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే…

విజయ్ దేవరకొండ రణబాలి ఆ వర్గం ప్రేక్షకులకు నచ్చే అవకాశం లేదా..?

Ranabaali
Ranabaali

Ranabaali: విజయ్ దేవరకొండ హీరోగా చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఇప్పటివరకు ఆయన పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి లాంటి సినిమాల్లో తెలంగాణ స్లాగ్ లో నటించి మెప్పించాడు. ఇప్పుడు ఆయన డిఫరెంట్ జానర్ లో నటించి మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలో ‘రణబాలి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అనంతపురం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. హిస్టారికల్ పీరియడ్ ను తీసుకొని ఈ సినిమా లను తెరకెక్కిస్తున్నారు. ఈ విషయంలో కూడా విజయ్ దేవరకొండ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక ఈ సినిమాలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుండటం విశేషం… పెళ్లి తర్వాత వీళ్ళిద్దరు కలిసి నటిస్తున్న సినిమా కూడా ఇదే కావడంతో ఈ మూవీకి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ అతన్ని టాప్ లెవల్లో నిల్చో బెట్టాయి. ఇక ఇప్పుడు చేస్తున్న సినిమాతో ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్ర యాస ల మీద కొన్ని వివాదాలైతే నడుస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ రణబాలి అనే మూవీలో అనంతపురం స్లాంగ్ మాట్లాడుతూ కనిపించబోతున్నాడు. మరి ఈ సినిమా తెలంగాణ ప్రేక్షకులను ఎలా అలరించబోతుంది.

ఇప్పటివరకు తెలంగాణ యాస లోనే మాట్లాడి ప్రేక్షకులని మెప్పించిన విజయ్ దేవరకొండ ఇప్పుడు అనంతపురం స్లాంగ్ లో మాట్లాడి ఎలా మెప్పిస్తాడు. దానిని తెలంగాణ ప్రేక్షకులు ఎలా తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తానికైతే విజయ్ దేవరకొండ మరొక డిఫరెంట్ అటెంప్ట్ చేస్తున్నాడు.

దాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే దానిమీదనే అతని సక్సెస్ అనేది ఆధారపడి ఉంది. ఇక దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ సైతం ఇంతకుముందు చేసిన ట్యాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. కాబట్టి ఈ రెండు సినిమాలకు మించి ఈ సినిమా ఉండబోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి…ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు…

'ఓజీ 2' లో పవన్ కళ్యాణ్ పెంపుడు జంతువు 'డ్రాగన్' కాదా..? అసలు నిజం ఏంటంటే..

OG 2
OG 2

OG 2: గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతున్న టాపిక్ ‘ఓజీ 2’. మూవీ టీం నుండి కేవలం ఒక ప్రకటన వీడియో వచ్చిందంతే, ఇక సోషల్ మీడియా మొత్తం దాని గురించే టాపిక్ జరిగింది. ముఖ్యంగా జెన్ జీ ఆడియన్స్ అయితే మెంటలెక్కిపోతున్నారు. ఈ ప్రకటన వీడియో లో సుజిత్ పవన్ కళ్యాణ్ కి సన్నివేశాలను వివరిస్తూ ‘స్నో బ్లడ్ అయిపోతుంది.. అప్పుడు ఓజాస్ గంభీర అని అంటారు.. అదే ఇంట్రడక్షన్ షాట్ ‘ అని అంటాడు. ఆ షాట్ కి AI విజువల్స్ ని జోడిస్తూ సోషల్ మీడియా లో మీమర్స్ మరియు అభిమానులు రకరకాల ఎడిటింగ్స్ చేశారు. ఇలాగే వదిలేస్తే త్వరలో సినిమానే AI లో చేసి విడుదల చేసేట్టు ఉన్నారు. ఇదే ప్రకటన వీడియో లో ‘ఇందులో హీరో కి ఒక పెట్ ఉంటుంది అన్నమాట’ అని అనగానే బ్యాక్ గ్రౌండ్ లో డ్రాగన్ ని చూపిస్తారు.

అది చూడగానే నెటిజెన్స్ ఇందులో గంభీర కి డ్రాగన్ పెట్ అంటూ ఎన్నో ఫన్నీ ఎడిటింగ్స్ చేశారు, ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అభిమానులు డ్రాగన్ మీద చాలా ఆశలు , అంచనాలే పెట్టుకున్నారు. అయితే అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ఏమిటంటే ఇందులో గంభీర కి పెట్ ఉంటుంది అన్న విషయం వాస్తవమే కానీ , అది డ్రాగన్ కాదని తెలుస్తోంది. ఈ చిత్రం లో డ్రాగన్ కి సంబంధించిన సన్నివేశాలు చాలానే ఉంటాయట కానీ , అది పెట్ మాత్రం కాదట. గంభీర కి పెట్ గా చీటా ఉంటుందని సమాచారం. అప్పట్లో సమురాయ్ క్లాన్ కి చెందిన వాళ్ళు చిరుత పులి ని పెంచుకునేవారట. శత్రు సైన్యాలను ఎదురుకోవడం కోసం అలా చేసేవారట.

‘ఓజీ 2’ చిత్రం మొత్తం ‘ఓజాస్ గంభీర’ తండ్రి ‘జై గంభీర’ కి సంబంధించిన బ్యాక్ స్టోరీ అని తెలుస్తోంది. అంటే సమురాయ్ కాలం నాటి సన్నివేశాలని ఈ ప్రీక్వెల్ స్టోరీ లో చూపించబోతున్నారు అన్నమాట. అందుకే ఇవన్నీ ఉంటాయని తెలుస్తోంది. కాబట్టి అభిమానులు డ్రాగన్ గంభీర పెట్ అని భారీ ఆశలు పెట్టుకోకండి , అలా పెట్టుకుంటే నిరాశ చెందుతారు , సినిమా విడుదల తర్వాత ఫ్లాప్ టాక్ వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు విశ్లేషకులు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ 70 శాతం కి పైగా పూర్తి అయ్యిందట. నవంబర్ మొదటి వారం నుండి ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలు అవుతుందని, పవన్ కళ్యాణ్ ఈ సీక్వెల్ కోసం 70 రోజుల కాల్ షీట్స్ ఇచ్చారని సమాచారం.

యూత్ కు గేమింగ్.. ఉద్యోగులకు భారీ బ్యాటరీ అందించే.. రూ.25 వేల లోపు టాప్ 5 ఫోన్లు ఇవే..

Gaming phones
Gaming phones

Gaming phones: భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. ఇదే సమయంలో మొబైల్స్ ధరలు కూడా పెరుగుతున్నాయి. అయితే చాలా మంది బడ్జెట్ లో ఫోన్ కొనాలని చూస్తారు. ఇలాంటి సమయంలో రూ. 25,000 బడ్జెట్ సెగ్మెంట్‌కు ఎప్పుడూ విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అయితే ఫోన్ ధర తక్కువగా ఉన్నప్పటికీ ప్రీమియం ఫీచర్లు, పవర్‌ఫుల్ ప్రాసెసర్లు, అద్భుతమైన బ్యాటరీ లైఫ్‌ను ఇచ్చే మొబైల్స్ మార్కెట్లో ఉన్నాయి. అలాంటి వాటిలో టాప్ 5 మొబైల్స్ గురించి తెలుసుకుందాం..

మోటో జీ67 పవర్:
మోటోరోలా నుంచి వచ్చిన ఈ ఫోన్ బ్యాటరీ ప్రియులకు ఒక వరం అనుకోవచ్చు. ఎందుకంటే ఇందులో 7,000mAh బ్యాటరీని అందించారు. ఇది 30W టర్బోచార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ మొబైల్ లో 50MP మెయిన్ కెమెరా, ముందు వైపు 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 6.7 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. దీని ధర 22,999గా ఉంది.

రియల్‌మి పి4ఎక్స్ 5జీ:
రియల్‌మి తమ ‘P’ సిరీస్‌లో భాగంగా ఈ పవర్‌ఫుల్ 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇందులో గేమింగ్ , మల్టీటాస్కింగ్ కోసం మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌ను వాడారు. ఇందులో 6.72అంగుళాల డిస్ ప్లే ఉండి.. 144Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. ఇందులో 7,000mAh బ్యాటరీ 45W ఛార్జింగ్ సపోర్ట్ చేయనుంది. దీని వెనుక 50MP డ్యుయల్ కెమెరా సెటప్ అమర్చారు.దీనిని రూ. 23,499 ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.

వివో టీ4:
స్లిమ్ డిజైన్‌ కావాలని అనుకునే వారికి వివో T4 బెస్ట్ ఛాయిస్. ఇందులో 7,300mAh భారీ బ్యాటరీ ని అమర్చడం విశేషం. అలాగే స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 5జీ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. 50MP మెయిన్ కెమెరా, ముందు వైపు 32MP సెల్ఫీ కెమెరాలను కేటాయించారు. దీని 6.77 అంగుళఆల కర్వ్‌డ్ లాంటి ప్రీమియం డిస్‌ప్లే యూజర్లను బాగా ఆకట్టుకుంటుంది. దీనిని రూ.23,499 చెల్లించి కొనుగోలు చేయొచ్చు.

మోటో జీ96:
ఎలాంటి అనవసరమైన యాప్స్ లేకుండా సులువుగా వాడేందుకు వీలుగా మోటో జీ96 ని డిజైన్ చేశారు. రోజువారీ పనులకు, సోషల్ మీడియా వాడకానికి సరిపోయే పవర్‌ఫుల్ 5జీ ప్రాసెసర్, మంచి కలర్ ప్రొడక్షన్ ఇచ్చే డిస్‌ప్లే, నమ్మకమైన కెమెరా సెటప్ ఇందులో ఉన్నాయి. తక్కువ ధరలో ఎక్కువ ర్యామ్ ఆశించేవారికి ఇది సరైన ఎంపిక. దీని ధర రూ.20,999 నుంచి ప్రారంభం అవుతుంది.

పోకో ఎమ్‌8:
పర్ఫార్మెన్స్ ,బడ్జెట్ కాంబినేషన్‌లో పోకో ఎప్పుడూ ముందుంటుంది. ఆ సిరీస్‌లో వచ్చిన పోకో M8 యువతను, ముఖ్యంగా గేమర్లను టార్గెట్ చేస్తూ లాంచ్ అయింది. విలక్షణమైన పోకో సిగ్నేచర్ డిజైన్, మల్టీటాస్కింగ్‌కు ఇబ్బంది లేని ప్రాసెసర్, రోజంతా నిలిచే బ్యాటరీ మరియు ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. రూ. 22 వేల బడ్జెట్‌లో మంచి గేమింగ్ మరియు స్టైలిష్ లుక్ ఆశించే వారికి ఈ ఫోన్ 8/10 రేటింగ్‌తో గట్టి పోటీని ఇస్తోంది.

అమెరికా–ఇరాన్‌ దాడులు నిలిపివేత.. ఖతార్‌ కేంద్రంగా కీలక సమావేశం!

America Iran
America Iran

America Iran: శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత పశ్చిమాసియా ప్రాంతంలో ఏర్పడిన ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో అమెరికా, ఇరాన్‌ దేశాలు పరస్పరం సైనిక చర్యలను వెంటనే ఆపివేయాలని నిర్ణయించాయి. ఇటీవల కుదిరిన ఒప్పందాన్ని కొనసాగించి ఉద్రిక్తతలను తగ్గించేందుకు రెండు దేశాలు మంగళవారం ఖతార్‌లో ఉన్నతాధికారుల సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. ఈ చర్చలు హర్మూజ్‌ జలసంధి సమస్యపై సాంకేతిక స్థాయిలో కొనసాగుతున్నంత వరకు దాడులు చేయకూడదని ఇరు దేశాలు అంగీకరించాయి. అమెరికా సీనియర్‌ అధికారులు సైనిక కార్యకలాపాలను తక్షణం నిలిపివేయడానికి సమ్మతించినట్లు వెల్లడించారు. హర్మూజ్‌ జలసంధిలో నౌకలు ఎలాంటి అడ్డంకులు లేకుండా స్వేచ్ఛగా ప్రయాణించగలవని వారు స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వల్ల ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన ఆ జలసంధి మార్గం సురక్షితంగా కొనసాగుతుందని నమ్మకం వ్యక్తమవుతోంది.

ఇరాన్‌ అణు కార్యక్రమంపై చర్చలు..
ఇరాన్‌ అణు కార్యక్రమాలపై మొదట స్విట్జర్లాండ్‌లో జరపాలని భావించినప్పటికీ, ఇటీవలి ఉద్రిక్తతల కారణంగా వేదికను ఖతార్‌ రాజధాని దోహాకు మార్చారు. ఈ సమావేశాల గురించి అమెరికా వైపు నుంచి అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడి కాలేదు. అయితే రెండు దేశాలు ఇటీవల కుదిరిన ఒప్పందాన్ని కాపాడుకునేందుకు చొరవ చూపుతున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలే రెండు దేశాల డీల్‌..
అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధాన్ని ముగించేందుకు ఇటీవల ఒప్పందం కుదిరింది. దీంతో హర్మూజ్‌ జలసంధి ద్వారా చమురు రవాణా తిరిగి ప్రారంభమైంది. కానీ రెండు రోజుల క్రితం ఇరాన్‌ బలగాలు చమురు తీసుకెళ్తున్న ఖరీదైన వాణిజ్య నౌకపై డ్రోన్‌లతో దాడి చేశాయి. ఒక డ్రోన్‌ కార్గో నౌకను తాకడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. దీంతో ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు అమెరికా ఇరాన్‌ యొక్క క్షిపణి, డ్రోన్‌ నిల్వ స్థావరాలపై వైమానిక దాడులు చేపట్టింది. ఇరాన్‌ కూడా గల్ఫ్‌ ప్రాంతంలోని అమెరికా స్థావరాలపై ప్రతీకార చర్యలు తీసుకుంది. రెండు రోజుల పాటు జరిగిన ఈ పరస్పర చర్యలతో యుద్ధం మళ్లీ మొదలవుతుందనే ఆందోళన వ్యక్తమైంది. అయితే ఇరు దేశాలు నష్టాలను అరికట్టేందుకు, ఉద్రిక్తతలు మరింత పెరగకుండా చర్యలు తీసుకున్నాయి.

హర్మూజ్‌ జలసంధిలో నౌకల స్వేచ్ఛా ప్రయాణం కొనసాగించడం, ఇటీవలి ఒప్పందాన్ని రక్షించడం రెండు దేశాలకు ప్రాధాన్యత అని అధికారులు తెలిపారు. ఈ నిర్ణయాలు ప్రపంచ ఇంధన మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ కారును ఇప్పుడే కొనండి.. లేకుంటే చాలా నష్టపోతారు..

Maruti Brezza
Maruti Brezza

Maruti Brezza: భారత కార్ల మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ SUVలలో Maruti Suzuki కంపెనీ నుంచి ఆకట్టుకునే కార్లు మార్కెట్లోకి వస్తుంటాయి. అయితే వీటి అమ్మకాలు సజావుగా ఉన్నప్పటికీ వినియోగదారులను ఆకర్షించడానికి కంపెనీ భారీ ఆఫర్ ను ప్రకటించింది. జూన్ నెలలో మారుతి కంపెనీకి చెందిన Brezzaను కొనుగోలు చేస్తే రూ.55,000 వరకు ప్రయోజనాలను ప్రకటించింది. ఈ ప్రయోజనాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం..

మారుతి బ్రెజ్జా కారుపై మొత్తం రూ.55,000 వరకు ప్రయోజనాలు ఉండనున్నాయి. ఇందులో రూ.25,000 వరకు నేరుగా క్యాష్ డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో కారు ఎక్స్‌షోరూమ్ ధరపై నేరుగా తగ్గింపు లభిస్తుంది. ఇప్పటికే ఉన్న కారును ఇచ్చి కొత్త బ్రెజ్జా కొనుగోలు చేసే కస్టమర్లకు రూ.25,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. పాత కారును మార్చుకోవాలనుకునే వారికి ఈ ఆఫర్ ద్వారా అదనపు ఆదా అవుతుంది. పాత, ఉపయోగించలేని వాహనాన్ని ప్రభుత్వ స్క్రాపేజ్ విధానం కింద తొలగించి కొత్త బ్రెజ్జాను కొనుగోలు చేసే వారికి రూ.15,000 వరకు స్క్రాపేజ్ బోనస్ అందిస్తోంది.

కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే అర్హత కలిగిన ఉద్యోగులకు రూ.5,000 వరకు కార్పొరేట్ బెనిఫిట్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆపర్లు కొత్త SUV కొనుగోలు చేయాలనుకునే వారికి, ఇప్పటికే ఉన్న కార్లను మార్చుకునేవారికి మంచి అవకాశం. ఈ ఆఫర్లు బ్రెజ్జా పెట్రోల్ వేరియంట్లతో పాటు CNG వేరియంట్లకూ వర్తిస్తాయి. పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో CNG మోడల్ కొనుగోలు చేయాలనుకునే వారికి కూడా ఇదే ప్రయోజనాలు అందుబాటులో ఉండటం విశేషం.

ఈ డిస్కౌంట్లు అన్ని వేరియంట్లకు ఒకే విధంగా ఉండకపోవచ్చు. నగరం, డీలర్‌షిప్, స్టాక్ లభ్యత, కొనుగోలు విధానం ఆధారంగా ఆఫర్లలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. అలాగే క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా స్క్రాపేజ్ బోనస్ వంటి కొన్ని ప్రయోజనాలు ఒకేసారి కాకుండా నిబంధనల ప్రకారం వర్తించవచ్చు.

కాంపాక్ట్ SUV కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి జూన్ నెలలో మారుతి బ్రెజ్జాపై ప్రకటించిన ఈ ప్రత్యేక ఆఫర్లు మంచి ఆదా చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ముఖ్యంగా పాత కారును ఎక్స్ఛేంజ్ చేయాలనుకునేవారు లేదా కార్పొరేట్ బెనిఫిట్స్‌కు అర్హులైన వారు మరింత ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశం ఉంది. కొనుగోలు చేసే ముందు సమీప డీలర్‌ను సంప్రదించి, తమకు వర్తించే ఖచ్చితమైన ఆఫర్లు, నిబంధనలను తెలుసుకోవడం మంచిది.

గేమింగ్ కోసం అదిరిపోయే డిస్ ప్లే.. భారీ బ్యాటరీ.. ఈ ఫోన్ గురించి తెలుసుకోవాల్సిందే..

Vivo X Fold 6
Vivo X Fold 6

Vivo X Fold 6: ప్రముఖ మొబైల్ కంపెనీ Vivo నుంచి సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ చైనా మార్కెట్లో విడుదలయింది. ప్రీమియం డిజైన్, మునుపెన్నడూ లేని భారీ బ్యాటరీ, అదిరిపోయే డిస్‌ప్లే ఫీచర్లతో ఈ ఫోన్ టెక్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా రోజూ మొబైల్ లపై ఎక్కువగా వర్క్ చేసే వారికి ఇది ఉపయోపడుతుందని అంటున్నారు. అయితే దీని ధర ఎంత? భారత్ లోకి ఎప్పుడోస్తుంది? ఆ వివరాల్లోకి వెళితె..

Vivo నుంచి మార్కెట్లోకి Vivo X Fold 6 రిలీజ్ అయింది. ఈ మొబైల్ డిస్‌ప్లే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇందులో 8.02 అంగుళాల AMOLED ఫోల్డబుల్ స్క్రీన్‌ ఉండనుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో పాటు 5000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్ ను అందించడంతో స్మూత్ స్క్రోలింగ్ కు పనిచేస్తుంది. ఫోన్ మడతపెట్టి ఉన్నప్పుడు వాడుకోవడానికి బయట వైపు 6.51 అంగుళాల కవర్ డిస్‌ప్లే ఉంటుంది.

సాధారణంగా ఫోల్డబుల్ ఫోన్లలో బ్యాటరీ సామర్థ్యం తక్కువగా ఉంటుంది. కానీ ఈ ఫోన్‌లో 7,000mAh భారీ సిలికాన్ కార్బన్ బ్యాటరీని అందించారు. పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ మడత విప్పినప్పుడు కేవలం 4.4mm మందంతో ఎంతో స్లిమ్‌గా ఉంటుంది. దీనికి తోడు 80W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 40W వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉండడంతో బిజీగా ఉండేవారికి అనుగుణంగా ఉంటుంది.

వివో తన ఫోల్డబుల్ సిరీస్‌లో మొదటిసారిగా స్నాప్‌డ్రాగన్‌ను పక్కనపెట్టి మీడియాటెక్ చిప్‌సెట్‌ను వాడింది. ఇందులో భాగంగా ఇందులో 3nm మీడియాటెక్ డైమెన్సిటీ 9500 సూపర్‌ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. దీంతో ఇది గేమింగ్, మల్టీటాస్కింగ్‌ కోసం ఉపయోగించేవారికి సపోర్టుగా ఉండనుంది. సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే.. ఇందులో లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.

ఫోటోగ్రఫీ పరంగా.. వివో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200MP శామ్‌సంగ్ ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం బయటి కవర్ స్క్రీన్ పైన 20MP కెమెరాలను కేటాయించారు.త్వరలోనే భారత్ లోకి వచ్చే ఈ ఫోన్ 12GB రామ్ + 256GB 7,999 యువాన్లు (సుమారు రూ.1,11,000)గా ఉంది.

35 ఏళ్లలోపు పిల్లలు కాకపోతే...

Fertility
Fertility

Fertility: భారత దేశంలో ప్రస్తుతం చాలా మంది దంపతులు ఉన్నత చదువులు, ఉద్యోగాల్లో స్థిరపడటం, ఆర్థిక భద్రత, వ్యక్తిగత లక్ష్యాలు వంటి కారణాలతో పిల్లలను కనడాన్ని వాయిదా వేస్తున్నారు. అయితే కుటుంబ ప్రణాళికను చాలా ఆలస్యం చేయడం వల్ల భవిష్యత్తులో సంతానోత్పత్తికి సంబంధించిన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని ఫెర్టిలిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా 35 ఏళ్లు, పురుషులు 40 ఏళ్ల తరువాత ఫెర్టిలిటీ క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఈ వయసు దాటిన తరువాత సంతానం జరిగినా.. అనేక సమ్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలేం జరగుతుందంటే?

ముఖ్యంగా మహిళల్లో 35 ఏళ్లు దాటిన తర్వాత ఫెర్టిలిటీ సమస్యను ఎదుర్కొంటారు. మహిళలు పుట్టుకతోనే నిర్దిష్ట సంఖ్యలో అండాలను (Eggs) కలిగి ఉంటారు. వయసు పెరిగే కొద్దీ ఈ అండాల సంఖ్య మాత్రమే కాకుండా వాటి నాణ్యత కూడా తగ్గిపోతుంది. 35 ఏళ్ల తర్వాత ఈ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. దీనివల్ల గర్భం ధరించే అవకాశాలు తగ్గడమే కాకుండా గర్భస్రావం, క్రోమోజోమ్ లోపాలు, శిశువులో జన్యుపరమైన సమస్యలు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.

పురుషుల్లోనూ 40 ఏళ్లు దాటిన వీర్యకణాల (Sperm) సంఖ్య, చురుకుదనం, నాణ్యత క్రమంగా తగ్గుతాయి. దీంతో గర్భధారణ ఆలస్యం కావడం, గర్భస్రావం ప్రమాదం పెరగడం, కొన్ని జన్యుపరమైన సమస్యల అవకాశాలు కూడా అధికమవుతాయని వైద్యులు చెబుతున్నారు.

వయసు పెరిగిన తర్వాత గర్భం దాల్చడం వల్ల గర్భధారణ సమయంలో అధిక రక్తపోటు, గర్భకాల మధుమేహం, ప్రీమెచ్యూర్ డెలివరీ, సిజేరియన్ అవసరం పెరగడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే IVF వంటి ఫెర్టిలిటీ చికిత్సల అవసరం కూడా పెరగవచ్చు. వయసు పెరిగేకొద్దీ ఈ చికిత్సల విజయావకాశాలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

వివాహం ఆలస్యమైనా లేదా పిల్లలను కొన్ని సంవత్సరాలు వాయిదా వేయాలని భావిస్తున్న జంటలు 35 ఏళ్లు వచ్చేలోపే ఫెర్టిలిటీ హెల్త్ చెక్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మహిళల్లో అండాశయాల సామర్థ్యాన్ని అంచనా వేసే పరీక్షలు, హార్మోన్ పరీక్షలు, అల్ట్రాసౌండ్ ద్వారా పరిస్థితిని తెలుసుకోవచ్చు. పురుషులు వీర్యపరీక్ష చేయించుకోవడం ద్వారా ఫెర్టిలిటీ స్థితిని తెలుసుకోవచ్చు.

కేవలం వయసు మాత్రమే కాదు, జీవనశైలి కూడా ఫెర్టిలిటీపై ప్రభావం చూపుతుంది. ధూమపానం, మద్యం సేవించడం, అధిక బరువు, ఒత్తిడి, సరైన నిద్ర లేకపోవడం, పోషకాహార లోపం వంటి అంశాలు పురుషులు, మహిళలు ఇద్దరిలోనూ సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా ఫెర్టిలిటీని మెరుగుపరచుకోవచ్చు.

మహేష్ బాబు లో ఆ క్వాలిటీ అంటే చిరంజీవి కి చాలా ఇష్టమట...

Mahesh Babu
Mahesh Babu

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు…ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి… కెరియర్ స్టార్టింగ్ లో డిఫరెంట్ సినిమాలను చేసిన మహేష్ బాబు ఇప్పుడు మాత్రం కమర్షియల్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. గత కొన్ని రోజులుగా ఆయన నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించడం లేదు. దాంతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించాలని అనుకున్న మహేష్ బాబు ఎట్టకేలకు రాజమౌళితో జతకట్టాడు. వారణాసి సినిమా విషయంలో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది తెలియాలంటే మరికొద్ది రోజులపాటు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ కి ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభించింది. హాలీవుడ్ లో సైతం ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు అంటే ఈ సినిమా ఏ రేంజ్ బజ్ ను క్రియేట్ చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా రాజమౌళి లాంటి దర్శకుడు ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది.

ఈ విషయంలో చాలా కేర్ తీసుకుని రాజమౌళి సినిమాలో అంతకుమించిన ఎఫర్ట్స్ పెడుతున్నారట. ఇక ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి మహేష్ బాబు లకు మధ్య చాలా మంచి సన్నిహిత సంబంధం ఉంది. వీరిద్దరు చాలా సందర్భాల్లో కలుసుకున్నారట. మహేష్ బాబుకి వాళ్ళ నాన్న కృష్ణ గారి తర్వాత అత్యంత ఇష్టమైన హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది చిరంజీవి గారే కావడం విశేషం…

ఇక అప్పుడప్పుడు చిరంజీవి – మహేష్ బాబు కలిసినప్పుడు సినిమాల గురించి చర్చిస్తూ ఉంటారట. ఏదైనా ఫంక్షన్ లో కలిసినప్పుడు కూడా సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారట. మహేష్ బాబులో చిరంజీవికి బాగా నచ్చిన క్వాలిటి ఏంటంటే మహేష్ బాబు పెద్దలను గౌరవిస్తూ ఉంటాడు.

ఆ విషయంలో మహేష్ అత్యుత్తమమైన వ్యక్తిత్వం కలిగిన వాడు అంటూ చిరంజీవి ఎప్పుడు తన సన్నిహితుల దగ్గర గాని, తన కుటుంబం దగ్గర గాని మహేష్ బాబు ప్రస్తావన వచ్చిన ప్రతిసారి చెబుతాడట. మొత్తానికైతే వాళ్ళ తండ్రికి తగ్గ తనయుడు అనే పేరు సంపాదించుకున్నాడు అంటూ చిరంజీవి పలు సందర్భాల్లో మహేష్ బాబు గురించి ప్రస్తావించడం విశేషం…ఇక ప్రస్తుతం ఈ విషయాన్ని తెలుసుకున్న మహేష్ బాబు అభిమానులు ఆనందపడుతున్నారు…

చమురు ట్యాంకర్‌పై దాడి.. అమెరికా–ఇరాన్‌ మధ్య మళ్లీ ఉద్రికతలు!

US Iran
US Iran

US Iran: అమెరికా–ఇరాన్‌ మధ్య శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత కూడా ఇరు దేశాల మధ్య మళ్లీ దాడులు మొదలయ్యాయి. ఇరాన్‌పై అమెరికా దాడి చేసింది. దీంతో ఇరాన్‌ అమెరికా అనుకూల దేశాలపై ప్రతీకార దాడులు చేసింది. ఈ క్రమంలో పనామా జెండా ఎగురవేస్తున్న కికు అనే చమురు నౌకపై డ్రోన్‌ దాడి జరిగింది. ఆ నౌకలో సుమారు రెండు మిలియన్‌ బ్యారెళ్ల ముడి చమురు ఉండగా, సిబ్బంది ఎవరికీ హాని కలగలేదు. ఈ ఘటన తర్వాత అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ఇరాన్‌లోని పది ముఖ్యమైన సైనిక లక్ష్యాలపై వైమానిక దాడులు చేసింది.

అమెరికా వరుస దాడులు..
నిఘా వ్యవస్థలు, సమాచార మార్పిడి నెట్‌వర్కులు, వైమానిక రక్షణ కేంద్రాలు, డ్రోన్‌ల నిల్వ స్థావరాలు, సముద్రంలో గనులు పరవడం వంటి సామర్థ్యాలపై అమెరికా దాడులు జరిపింది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇరాన్‌ మళ్లీ దాడులకు దిగిందని అమెరికా ఆరోపణ చేసింది.

ట్రంప్‌ హెచ్చరికలు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌పై తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. కాల్పుల విరమణను ఇరాన్‌ పదేపదే ఉల్లంఘిస్తోందని ఆరోపించిన ఆయన, అవసరమైతే పూర్తి స్థాయి యుద్ధం ద్వారా ఇరాన్‌ను ముగించేస్తామని స్పష్టం చేశారు. అలాంటి పరిస్థితి వస్తే ఇరాన్‌ అనే దేశం ఇకపై ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఖ్చీ హర్ముజ్‌ జలసంధిపై తమ పూర్తి నియంత్రణ ఉందని మరోసారి స్పష్టం చేశారు. నియమాలు ఉల్లంఘించే నౌకలు సమస్యలకు కారణమవుతాయని హెచ్చరించారు. అదే సమయంలో ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ నేవీ కమాండర్‌ గల్ఫ్‌ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు త్వరలోనే తీవ్ర సమస్యలను ఎదుర్కొంటాయని బెదిరించారు.

గల్ఫ్‌ దేశాల్లో దాడులు..
అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ కువైట్‌లోని అలీ అల్‌ సలేం ఎయిర్‌ బేస్, బహ్రెయిన్‌లోని అమెరికా ఐదో నౌకాదళ స్థావరంపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు ప్రకటించింది. కువైట్‌ సైన్యం తమ వైమానిక రక్షణ వ్యవస్థలు ఆ దాడులను విజయవంతంగా తిప్పికొట్టాయని తెలిపింది. గల్ఫ్‌ దేశాల్లో సైరన్లు మోగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.

తీవ్ర సైనిక ఉద్రికతల మధ్య కూడా శాంతి చర్చలకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. స్విట్జర్లాండ్‌లో జరిగిన అవగాహన ఒప్పందం తర్వాత 60 రోజుల వ్యవధిలోనే దాడులు మళ్లీ మొదలవడంతో చర్చలు నిలిచిపోయాయి. అయితే ఖతార్, పాకిస్తాన్‌ మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్‌ ప్రతినిధులు మళ్లీ చర్చలకు సిద్ధమయ్యారు. ఈ వారంలోనే దోహాలో హర్ముజ్‌ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలు, సముద్ర భద్రత, కాల్పుల విరమణ అమలుపై చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఈ చర్చలు ఫలితాలిస్తే ప్రాంతంలో యుద్ధ ముప్పు కొంత తగ్గే అవకాశం ఉంది.

 

బాలయ్య ఒకప్పుడు చేసిన తప్పు ఇప్పుడు చేయడం లేదుగా....

Balakrishna
Balakrishna

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తుంటాడు. కెరియర్ స్టార్టింగ్ లో డిఫరెంట్ సినిమాలను చేసిన ఆయన ఒకానొక సందర్భంలో మాస్ సినిమాలకు మాత్రమే పరిమితమైపోయాడు. బీ,సీ సెంటర్లో బాలయ్య బాబు సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులందరు ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండేవారు. మరి అలాంటి బాలయ్య ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన దర్శకులను కాకుండా కథలను నమ్మి ముందుకు సాగుతున్నాడు. ఒకప్పుడు ఆయన కేవలం దర్శకులను మాత్రమే నమ్మి సినిమాలు చేసేవాడు. కథల గురించి పెద్దగా ఆలోచించేవాడు కాదు. ఇక ఆ క్రమంలోనే అతనికి కొన్ని ఇండస్ట్రీ హిట్ సినిమాలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు తన కెరియర్ ను గాడిలో పెట్టుకునేంతలా వరుసగా సక్సెసు లైతే రాలేకపోయాయి.

ఇక దాంతో ఇప్పుడు సీనియర్ దర్శకులు, కుర్ర డైరెక్టర్లు అనే తేడా లేకుండా కథ బాగుంటే వాళ్లతో సినిమాలు చేయడానికి ఆయన ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక అలాంటి బాలయ్య రాబోయే రోజుల్లో ఎలాంటి పెను సంచలనాలను క్రియేట్ చేయబోతున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన సక్సెస్ లు ఒకెత్తయితే ఇప్పుడు సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ఇక తన లాంటి నటుడు సక్సెస్ లను దక్కించుకోవడానికి డిఫరెంట్ సబ్జెక్టుల వైపు అడుగులు వేస్తున్నాడు. ఇదొక మంచి పరిణామమే అంటూ అతని అభిమానులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబుకి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. సీనియర్ హీరోగా గుర్తింపు పొందుతున్నప్పటికి ఇప్పటికి వరుసగా నాలుగు విజయాలను సాధించాడు. ‘అఖండ 2’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన కూడా బాలయ్య బాబు యాక్టింగ్ కి చాలా మంచి క్రేజ్ దక్కింది…

అనిల్ రావిపూడి తన సినిమాల్లో రాజేంద్ర ప్రసాద్ ను తీసుకోకపోవడానికి కారణం ఇదేనా..?

Anil Ravipudi
Anil Ravipudi

Anil Ravipudi: ప్రస్తుతం కమర్షియల్ సినిమాలను చేయడంలో సిద్ధహస్తుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు అనిల్ రాయపూడి… తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో వరుసగా తొమ్మిది విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. రాజమౌళి తర్వాత అంతటి గొప్ప ఘనతను సాధించిన దర్శకుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇప్పుడు చేస్తున్న సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు అనిల్ రావిపూడి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గానే కొనసాగుతున్నాడు. ఇక తన రెండో సినిమా అయిన సుప్రీమ్ నుంచి సరిలేరు నీకెవరు సినిమా వరకు చేసిన ప్రతి సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ను తీసుకున్నాడు. ఆ తర్వాత నుంచి ఏమైందో తెలియదు గానీ రాజేంద్రప్రసాద్ ను తన సినిమాలో తీసుకోవడం లేదు. ఇక వీళ్లిద్దరి మధ్య కొంతవరకు విభేదాలు వచ్చాయి. అందువల్లే అనిల్ రావిపూడి రాజేంద్రప్రసాద్ తీసుకోవడం లేదని కొంతమంది అంటుంటే మరి కొంతమంది మాత్రం తనకి సరిపడా క్యారెక్టర్ ఉండటం లేదు. అందువల్లే అతన్ని ఆయన సినిమాల్లోకి తీసుకోవడం లేదని ఇంకొంతమంది చెబుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్టులు, దర్శకుల మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉన్నప్పుడే వాళ్లిద్దరి మధ్య సినిమాలో అవకాశాలైతే వస్తాయి.

వీళ్లిద్దరి మధ్య ఎవరికి ఏది జరిగినా కూడా మనస్పర్ధలు వచ్చి ఒకరికొకరు విడిపోయే ప్రమాదం ఉంది. ఇక కొంతమంది దర్శకుడు మాత్రం కేవలం సినిమాల వరకే వాళ్ళ ఫ్రెండ్షిప్ ని పెట్టుకుంటారు. అందులో మంచి క్యారెక్టర్ ఉంటే వల్ల చేత నటిమజేస్తారు అంత తప్ప వాళ్లతో క్లోజ్ గా మూవ్ అయ్యే అవకాశాలైతే లేవు. ఇక ఈ లెక్కన అనిల్ రావిపూడి – రాజేంద్రప్రసాద్ చాలా క్లోజ్ గా మూవీ అయ్యారు.

వాళ్ళ మధ్య బాండింగ్ ఎలా ఉండేదంటే ఒక సందర్భంలో రాజేంద్రప్రసాద్ సైతం అనిల్ నా కొడుకు లాంటివాడు అంటూ కామెంట్స్ చేయడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అలాంటి బాండింగ్ ఉన్న వాళ్ళు మరోసారి కలిసి ఎందుకు సినిమా చేయడం లేదనే రీతిలో కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి.

నిజానికి అనిల్ రావిపూడి ప్రతి సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కోసం సపరేట్ క్యారెక్టర్ రాసేంత స్కోప్ ఉంటుంది. ఎందుకంటే అనిల్ చేసేవన్నీ కామెడీ సినిమాలే కాబట్టి తను కూడా మంచి కామెడీ చేయగలుగుతాడు. అందువల్లే వీళ్ళిద్దరికి బాగా సింక్ అయింది. ఇక ఫ్యూచర్ లో రాబోయే సినిమాలతో చేసే అవకాశం ఉందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…

 

ఎన్టీఆర్ డ్రాగన్ విషయంలో ప్రశాంత్ నీల్ అనుసరిస్తున్న వైఖరి ఎవ్వరికి నచ్చడం లేదా. .?

Jr NTR
Jr NTR

Jr NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. స్టార్ హీరోలందరు పాన్ ఇండియా నేపథ్యంలో సినిమాలను చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమా విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఎలాంటి సినిమాలు చేసిన కూడా తనకంటూ ఒక ఐడెంటిటిని తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు. తన తోటి హీరోలందరు పాన్ ఇండియాలో ఇండస్ట్రీ హిట్లను నమోదు చేస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటివరకు ఒక్క ఇండస్ట్రీ హిట్టును కూడా కొట్టలేకపోయాడు. దానివల్ల ఆయన మీద భారీగా ప్రెజర్ పెరుగుతుంది. దాంతో తన అభిమానులు సైతం అతని నుంచి ఒక ఇండస్ట్రీ హిట్ వస్తే చూడాలని ఆసక్తిగా ఉన్నారు. ఇక డ్రాగన్ సినిమా విషయంలో ఆయన అదే కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ సినిమా ఎలాగైనా సరే ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసే మూవీ అవుతుందనే ఉద్దేశ్యంతోనే ఆలోచిస్తున్నారట. ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమా ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ ను రాబడుతుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

ఇక ప్రస్తుతం ఈ సినిమా దర్శకుడు అయిన ప్రశాంత్ నీల్ సినిమా కోసం అనుసరిస్తున్న విధానం ఎవరికి నచ్చడం లేదట.జూనియర్ ఎన్టీఆర్ ని ఇప్పటికే డిఫరెంట్ గెటప్ లో చూపించిన ఆయన మరో కొత్త గెటప్ లోకి మారమని చెప్పాడట. దాంతో ఇప్పటికే రెండు డిఫరెంట్ గెటప్ ల్లో కనిపించినప్పటికి ఎన్టీఆర్ తన మెకోవర్ ను చూపించాడు.

ఇక ఇప్పుడు కొత్త గెటప్ లో రెడీ అవ్వాలి అంటే దానికి ఇంకా సమయం పట్టే అవకాశమైతే ఉంది. ఇక సినిమా షూటింగ్ అనుకున్న సమయానికి అయిపోతుందా? ఈ సినిమాని అనుకున్న డేట్ కి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాగలుగుతారా? లేదా అనేది కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరిలో చర్చనీయాంశంగా మారింది.

ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను రాబట్టడం వల్ల ఈ సినిమాని చూస్తున్న ప్రతి ఒక్కరు సక్సెస్ ని సాధిస్తాడు అంటూ ఒక కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ సైతం ఈ సినిమా కోసమే భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా మేకోవర్ కోసం ఎంతలా అయినా సరే కష్టపడడానికి రెడీగా ఉన్నాడట. ఇక ప్రశాంత్ నీల్ సైతం ఎన్టీఆర్ ను విపరీతంగా వాడుతున్నట్టుగా తెలుస్తుంది…

రామ్ చరణ్ కి ఇప్పుడైనా ఎలాంటి సినిమాలు చేయాలో తత్వం బోధపడిందా..?

Ram Charan
Ram Charan

Ram Charan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ మరే హీరో కి లేదనే చెప్పాలి. తన కొడుకు అయిన రామ్ చరణ్ సైతం పాన్ ఇండియాలో పెను సంచలనాన్ని క్రియేట్ చేస్తున్నాడు. మొదటి సినిమాతోనే తన సత్తా చాటుకున్న రామ్ చరణ్ రెండో సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేశాడు. ఇక తనను మించిన హీరో మరెవరు లేరు అనేంతలా పేరు ప్రఖ్యాతలను కూడా సంపాదించుకున్నాడు. అలాంటి రామ్ చరణ్ ఇప్పుడు ప్రపంచ స్థాయి ప్రేక్షకులను సైతం అలరించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో చేసిన ‘పెద్ది’ సినిమాలో అతను చాలా వరకు హార్డ్ వర్క్ చేసిన కూడా ఆ సినిమా మిక్స్డ్ టాక్ ను సంపాదించుకోవడంతో భారీ విజయం సాధించలేక పోయింది. ఇప్పటివరకు ఈ సినిమా 500 కోట్ల వరకు కలెక్షన్స్ ని రాబట్టిందనే వార్తలు వస్తున్నప్పటికి అందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయంలో కూడా సరైన క్లారిటి రావడం లేదు.

మొత్తానికైతే రామ్ చరణ్ కి ఇప్పుడు తత్వం బోధపడిందని చాలామంది చెబుతున్నారు. భారీ స్టార్ డమ్ ఉన్న హీరో డిఫరెంట్ అటెంప్ట్ చేయాలి. కానీ ఒక కమర్షియల్ హీరో ప్రయోగాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని సైతం కొంతమంది సినిమా మేధావులు రామ్ చరణ్ కి చెబుతున్నారు.

ఇక పెద్ది సినిమాతో ఇప్పుడు చేయబోయే స్క్రిప్ట్ విషయంలో తను చాలా జాగ్రత్తగా ఉండాలనే నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. గత సంవత్సరం గేమ్ చేంజర్ సినిమాతో బొక్క బోర్లా పడ్డ రామ్ చరణ్ ఇప్పుడు ఈ సినిమాతో కొంతవరకు పర్లేదు అనిపించిన కూడా తన రేంజ్ సక్సెస్ అయితే సాధించలేకపోయాడు.

ఇక సుకుమార్ డైరెక్షన్లో చేయబోతున్న సినిమా విషయంలో అయిన ఎలాంటి తప్పులు చేయకుండా ఉంటే బాగుంటుందని మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… వరుసగా రామ్ చరణ్ సక్సెస్ ను సాధిస్తేనే తను టాప్ లెవెల్ కి వెళ్తాడు. లేకపోతే తను చాలా వరకు డౌన్ అయిపోయే ప్రమాదమైతే ఉంది…

ఖమేనీ అంత్యక్రియలు.. మొజ్తబా వస్తారా..?

Khamenei funeral
Khamenei funeral

Khamenei funeral: ఇరాన్‌ మాజీ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీకి చివరి నివాళులు అర్పించేందుకు అవసరమైన సన్నాహాలు జరుగుతున్నాయి. జూలై 4 నుంచి 9 వరకు టెహ్రాన్‌లో ప్రారంభమయ్యే కార్యక్రమాలు ఖోమ్‌లో మతపరమైన నివాళులతో కొనసాగి, మష్హద్‌లోని పవిత్ర స్థలంలో ఖననంతో ముగుస్తాయి. ఈ నేపథ్యంలో కొత్త సుప్రీం లీడర్‌ బహిరంగ ప్రత్యక్షతపై ఆసక్తి నెలకొంది. అమెరికా–ఇజ్రాయెల్‌ దాడుల తర్వాత అత్యున్నత మతపరమైన పదవిని చేపట్టిన మొజ్తబా ఖమేనీ ఇప్పటివరకు ఒక్క బహిరంగ సభలోనూ పాల్గొనలేదు. దేశ ప్రజలను ఉద్దేశించి ఏ వీడియో సందేశం లేదా ఆడియో ప్రసంగం కూడా విడుదల చేయలేదు. దీంతో ఆయన నాయకత్వ సామర్థ్యం, అధికార నిర్వహణపై వివిధ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఆరోగ్యం, గాయాలపై ఊహాగానాలు
ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో మొజ్తబా ఖమేనీకి ముఖం, కాళ్లకు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. ఆ తర్వాత ఆయన ప్రజల ముందుకు రాకపోవడంతో ఆరోగ్య పరిస్థితి గురించి అనేక సందేహాలు ఎదురవుతున్నాయి. జూలై 4న టెహ్రాన్‌లో ప్రారంభమయ్యే అంత్యక్రియల్లో ఆయన హాజరవుతారా అనేది ప్రస్తుతం ప్రధాన ప్రశ్నగా మారింది.

ప్రపంచ నాయకుల హాజరు..
ఖమేనీ అంత్యక్రియలకు రష్యా, చైనా, టర్కీ, ఖతర్, ఇరాక్, లెబనాన్‌ వంటి దేశాల అధినేతలు లేదా ప్రతినిధులు హాజరు కావచ్చని సమాచారం. అమెరికా, ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంగా ఈ వేడుకలు అత్యంత సున్నితమైనవిగా మారాయి.

అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్‌ తన భద్రతా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేసింది. కీలక భవనాలు, అణు కేంద్రాలు, సైనిక స్థావరాల వద్ద అప్రమత్తత పెంచింది. ఈ నాయకత్వ మార్పులు మధ్యప్రాచ్య రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మహేష్ బాబు విషయంలో వాళ్ళు రాంగ్ గా ఆలోచిస్తున్నారా..?

Mahesh Babu
Mahesh Babu

Mahesh Babu: టైర్ వన్ హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. ఈయన ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీకే పరిమితమయ్యాడు. కానీ రాజమౌళితో చేస్తున్న ‘వారణాసి’ సినిమాతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. 1500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో మహేష్ బాబు తీవ్రమైన కసరత్తులు చేస్తున్నాడు… ఇక ఇదంతా చూస్తున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీ సైతం మహేష్ బాబు రేంజ్ మారబోతుంది అనే ఒక అంచనాలో ఉన్నారు. అయితే బాలీవుడ్ దర్శకులు కొందరు మహేష్ బాబుతో ఇప్పుడు సినిమాలు చేయడానికి అలాగే అతనికి కథలు వినిపించే ప్రయత్నం చేస్తున్నారట. ఇక మరికొంతమంది మాత్రం మహేష్ బాబును పట్టించుకోవడంలేదనే వార్తలు కూడా వస్తున్నాయి.

ఇక ఏది ఏమైనా కూడా వారణాసి సినిమా వచ్చిన తర్వాత మాత్రం మహేష్ బాబు రేంజ్ అయితే తప్పకుండా మారిపోతుంది. ఆయన ఇండియాలోనే టాప్ హీరోగా మారిపోతాడు. ప్రేక్షకులను సైతం మెప్పించి వాళ్ల మన్ననలను పొందే కెపాసిటి కూడా మహేష్ బాబుకి ఉంది. కాబట్టి ఆయనకి ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఆదరణ రాబోతుంది అనేది కూడా కీలకంగా మారబోతుంది.

ప్రస్తుతం మహేష్ బాబు చేస్తున్న సినిమాల విషయంలో ఆయన క్లారిటిని మెయింటైన్ చేస్తున్నప్పటికి పూర్తిగా ఆయన తన పంథా ను మార్చి రాబోయే సినిమాలతో డిఫరెంట్ సబ్జెక్టులను ఎంచుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక వారణాసి సినిమాలో 5 గెటప్పుల్లో నటిస్తున్న మహేష్ బాబు తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నారట. మొత్తానికైతే మహేష్ బాబు నటనలో చాలా వైవిధ్యాన్ని చూపిస్తాడనే విషయం మనందరికి తెలిసిందే…

ఇక తను 5 గెటప్పుల్లో కనిపించడం ఉంటే మామూలు విషయం కాదు. రాజమౌళి దగ్గరుండి మరి తనకు కావాల్సినట్టుగా హీరోలతో నటింపజేస్తున్నాడు. కాబట్టి మహేష్ బాబు తో సైతం అలాంటి నటనను తీసుకువచ్చే ప్రయత్నంలో రాజమౌళి బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది… రాజమౌళి ఈ సినిమాతో సక్సెస్ ను సాధిస్తే తన రేంజ్ కూడా మారిపోతుంది. ప్రపంచ స్థాయిలో ఉన్న హీరోలందరు అతనితో నటించడానికి ఆసక్తి చూపిస్తారు…

అయోధ్య విరాళాలు మాయం.. రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు

Ayodhya donations missing case
Ayodhya donations missing case

ayodhya donations scam : కోట్లాదిమంది హిందువుల విశ్వాసమైన రాముడికి అయోధ్యలో ఆలయ నిర్మాణంలో ఇచ్చిన విరాళాలు దారి మళ్లి పోయాయి. ఒకటి కాదు, రెండు కాదు కోట్ల సమ్మకు లెక్కలు లేకుండా పోయాయి. ఈ వ్యవహారం మొదట్లో చిన్నది అనుకున్నప్పటికీ.. తవ్వితీస్తుంటే భారీగా అక్రమాలు కనిపిస్తున్నాయి. తద్వారా ఇందులో ఒకరిద్దరు మాత్రమే కాదని.. చాలామందికి హస్తము ఉందని తెలుస్తోంది.

అయోధ్య విరాళాలకు సంబంధించి అక్రమాలకు పాల్పడిన వారిలో అను కల్ప్ మిశ్రా కీలక సూత్రధారి అని తెలుస్తోంది. ఇతడి బామ్మర్ది లవకుశ కూడా భారీగా వెనకేసుకున్నట్టు సమాచారం. వీరిది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బసవ గ్రామం. ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు విచారణ చేసినప్పుడు దిగ్బ్రాంతి కరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనుకల్ప్ భారీగా భవనాలను నిర్మించాడని.. విలాసవంతమైన వాహనాలను కొనుగోలు చేశాడని తెలుస్తోంది. పొలాలు.. స్థలాలు కొనుగోలు చేసినట్టు సమాచారం. అతడి బావమరిది లవకుశ కూడా భారీగా వెనకేసుకున్నట్టు తెలుస్తోంది.

అను కల్ప్ అక్రమ వ్యవహారాల గురించి అతని తాత రాజేంద్రప్రసాద్ పోలీసులు సమాచారం ఇచ్చాడు. గడచిన ఏప్రిల్ 30న అను కల్ప్ సొంత గ్రామంలో అత్యంత భారీ ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించాడు. దీనికి చంపత్ రాయ్ కూడా హాజరయ్యారు. తీర్ధ క్షేత్ర ట్రస్ట్ నుంచి కూడా భారీగా పెద్దలు హాజరయ్యారు. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడానికి అను కల్ప్ కు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి అని విషయం పట్ల సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అను కల్ప్ ఇటీవల అతి పెద్ద వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేశాడు. గత ఏడాది ఏకంగా 65 లక్షలు వెచ్చించి అయోధ్యలో అత్యంత భారీ ఇంటి నిర్మించాడు. గతంలో ఇతడు ఒక బ్యాంకులో ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగిగా పని చేసేవాడు. అతడు ఇంత సొమ్ము సంపాదించడానికి ప్రధాన కారణం అక్రమాలేనని తెలుస్తోంది. ఇతడి బామ్మర్ది లవకుశ మొదటిదాకా ఒక అద్దం ఇంట్లో ఉండేవాడు. ఇప్పుడు అతడు విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకున్నాడు. అందులో ఖరీదైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు.

వచ్చిన విరాళాలను నమోదు చేయకపోవడం.. బ్యాంకులో జమ చేసే డబ్బులలో ఎక్కువ నోట్లు పెట్టి.. ఆ తర్వాత బ్యాంకు వద్దకు వెళ్లకముందే ఆ నోట్లను తీసుకొని.. వీరు తమ జేబులో వేసుకునేవారు. అలా భారీగా డబ్బులు దోచుకున్నారు. బంగారు నగలు.. ఇతర ఖరీదైన కానుకలు కూడా వీరు తస్కరించారు. ఫలితంగా రాముడికి చెందకుండా.. విలువైన కానుకలు మొత్తం వీరి జేబుల్లోకి వెళ్లాయి.