Home Blog Page 54

మొదటి రోజు కంటే 10 వ రోజు ఎక్కువ వసూళ్లు.. చరిత్ర తిరగరాసిన 'మా ఇంటి బంగారం'..

Maa Inti Bangaram 13 Days Collections
Maa Inti Bangaram 13 Days Collections

Maa Inti Bangaram Collections : సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం జోరు ఏమాత్రం తగ్గలేదు. ఈ రేంజ్ వసూళ్లు వస్తాయని సమంత మరియు మూవీ టీం కలలో కూడా ఊహించి ఉండరు. కేవలం రీకవరీ అయితే చాలని అనుకున్నారు , కట్ చేస్తే 10 రోజుల్లో బయ్యర్స్ కి మూడింతల లాభాలను తెచ్చి పెట్టింది ఈ చిత్రం. గమ్మత్తు ఏంటంటే ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన వసూళ్ల కంటే 10 వ రోజు వచ్చిన వసూళ్లు ఎక్కువ ఉండడమే. మొదటి రోజు ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 2 కోట్ల 20 లక్షల రూపాయిలు రాగా, 10 వ రోజు ఏకంగా 2 కోట్ల 24 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లు వచ్చాయి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం.

10 రోజుల్లో నైజాం ప్రాంతం నుండి 12 కోట్ల 6 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఆంధ్ర ప్రదేశ్ + సీడెడ్ ప్రాంతాల నుండి 9 కోట్ల 10 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 21 కోట్ల 16 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, 36 కోట్ల 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా తమిళనాడు నుండి 1 కోటి 78 లక్షలు రాగా, కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 4 కోట్ల 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్ నుండి అయితే ఈ చిత్రానికి 9 కోట్ల 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 37 కోట్ల 24 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 75 కోట్ల 55 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

మరో 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను ఈ చిత్రం రాబట్టగలిగితే , సౌత్ ఇండియా లోనే లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలుస్తుంది. అంతే కాకుండా సమంత కి లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ శాశ్వతంగా ఉండిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం 12 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి , నైజాం ప్రాంతం నుండే 12 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రావడం గమనార్హం. ఫుల్ రన్ లో కచ్చితంగా 15 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టే సత్తా ఈ చిత్రానికి ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

ఒక పక్షి సంతతిని కాపాడేందుకు.. ఈ మహిళ చేసిన పనికి ప్రధాని మోడీ ఫిదా

Hargila Bird Conservation

Hargila Bird Conservation : కాలుష్యం పెరిగిపోతుంది. అడవులు తగ్గిపోతున్నాయి. అభివృద్ధి వేటుకు పచ్చటి చెట్లు నేల కూలిపోతున్నాయి. అడవులు తగ్గిపోతే.. వాటి ఆధారంగా బతికే పక్షులు కూడా మనుగడ కోల్పోతాయి. చివరికి విలుప్త జాబితాలో చేరిపోతాయి. అందులో ఈ పక్షి కూడా చేరింది. కాకపోతే ఆ పక్షిని కాపాడేందుకు ప్రభుత్వాలు ముందుకు రాలేదు. కొందరు మహిళలు నడుం బిగించి ముందుకు వచ్చారు. తద్వారా ఆ పక్షి మనుగడ మొదలైంది. సంతతి పెరిగింది. వారు చేసిన ఆ పని ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఫిదా చేసింది.

మనదేశంలోని ఈశాన్య ప్రాంతంలో అత్యంత కీలకమైన అస్సాం రాష్ట్రంలో హార్గిలా పక్షులు ఒకప్పుడు విపరీతంగా ఉండేవి. వీటి రూపం విచిత్రంగా ఉండేది. అయితే వీటిని అక్కడి ప్రజలు దురదృష్టానికి సంకేతంగా భావించేవారు. అందువల్ల వీటిని వేటాడేవారు. ఇవి ఎదురుగా వస్తే కీడు జరుగుతుందని భయపడేవారు. ఈ పక్షులు కదంబం చెట్ల మీద ఎక్కువగా ఉండేవి. ఈ పక్షుల సంతతి పెరుగుతున్న నేపథ్యంలో అస్సాం ప్రజలు కదంబం చెట్లను నరికి వేయడం మొదలుపెట్టారు. ఫలితంగా హర్గిలా పక్షుల సంఖ్య తగ్గిపోవడం మొదలైంది. వాస్తవానికి ఈ పక్షులు పర్యావరణానికి ఎటువంటి హాని చేయవు. పైగా ఇవి పారిశుద్ధ్య కార్మికుల పాత్ర పోషిస్తూ ఉంటాయి.

చనిపోయిన జంతువుల కళేబరాల మీద ఇవి వాలిపోతూ ఉంటాయి. కళేబరాల మాంసాన్ని తింటుంటాయి. ఈ విధంగా పర్యావరణానికి మేలు చేకూర్చుతాయి. వీటి సంఖ్య తగ్గిపోవడంతో ప్రముఖ జీవ శాస్త్రవేత్త పూర్ణిమ దేవి ఒక ఉద్యమాన్ని అస్సాంలో మొదలుపెట్టారు.. 2007లో ఆమె దీనిని మొదలుపెట్టారు. హర్గిలా సంతతి పక్షులను వేటాడకుండా అస్సాం రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో ప్రచారం చేశారు. కొంతమంది మహిళలను ఎంచుకొని హర్గిలా ఆర్మీ ఏర్పాటు చేయించారు. వారికి ఈ పక్షుల గొప్పతనం గురించి వివరించారు. గ్రామస్తులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయించారు. అంతేకాదు కదంబం మొక్కలను విరివిగా నాటేందుకు ప్రయత్నాలు చేశారు. ఆమె చేసిన ప్రయత్నాలు విజయవంతమయ్యాయి. కాలగర్భంలో కలిసిపోతున్న హర్గిలా సంతతి పెరగడం మొదలైంది. ఇప్పుడు ఆ పక్షులు అక్కడ వేల సంఖ్యకు చేరుకున్నాయి. అంతేకాదు చనిపోయిన జంతువుల కళేబరాలు లేకుండా చేస్తున్నాయి. తద్వారా అస్సాం రాష్ట్రం పరిశుభ్రంగా కనిపిస్తోంది.

పూర్ణిమ దేవి చేసిన సాహసం.. అస్సాం రాష్ట్రంలో హర్గిలా పక్షుల సంతతి పెరగడం వంటి పరిణామాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రముఖంగా ప్రస్తావించారు. అస్సాంలో ఈ మహిళలు చేసిన పని దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. ఇటువంటి వారి వల్లే ప్రకృతి గొప్పగా ఉంటుందని.. పర్యావరణం సకల జంతువులతో వర్ధిల్లుతూ ఉంటుందని పేర్కొన్నారు..

ఎన్టీఆర్ 'గాడ్ ఆఫ్ వార్' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది..ఇది కదా మాస్ అంటే..

Jr NTR God of War

Jr NTR God of War : పాన్ ఇండియా లెవెల్ లో ప్రస్తుతం ఫాంటసీ , పురాణాల స్టోరిలకు ఏ రేంజ్ డిమాండ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా మన టాలీవుడ్ ఆడియన్స్ ఇలాంటి సినిమాల కోసం ఎప్పటి నుండో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు మనం శ్రీ మహావిష్ణువు , రాముడు , శ్రీకృష్ణుడు ,పరమశివుడు, సాయి బాబా , జీసస్, వినాయకుడు స్టోరీలను వెండితెర పై చూసాము. కానీ కార్తికేయ స్వామి జీవిత చరిత్ర మాత్రం ఇప్పటి వరకు మనం చూడలేదు. ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ కూడా ఈ దేవుడి పై సినిమాలు కానీ , సీరియల్స్ కానీ తీయలేదు. ఈయన మహత్యల ఆధారంగా సినిమాలు వచ్చాయి కానీ , ఈయన జీవిత చరిత్ర మీద మాత్రం సినిమా రాలేదు. అందుకే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పాన్ ఇండియా లెవెల్ లో ఈ కార్తికేయ స్వామి జీవిత చరిత్రకు సంబంధించి ఒక కథ ని రెడీ చేశారు.

ఈ చిత్రాన్ని ముందుగా ఎన్టీఆర్ తోనే చెయ్యాలని అనుకున్నారు , ఆ తర్వాత అల్లు అర్జున్ కి షిఫ్ట్ అయ్యింది , ఇప్పుడు మళ్లీ చేతుల్లోకి వచ్చింది. కాసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన జరిగింది. ‘శివ పుత్రుడు, పార్వతీ మాత గర్వం, తిరుగులేని కమాండర్’ అంటూ ఎన్టీఆర్ పవర్ ఫుల్ పదాలను ఉపయోగిస్తూ , ఈ చిత్రానికి సంబంధించిన థీమ్ పోస్టర్ ని విడుదల చేశారు. ఈ పోస్టర్ లో కార్తికేయ స్వామి చేతిలో ఉండే ఆయుధాన్ని మనం చూడొచ్చు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో జూనియర్ ఎన్టీఆర్ కి ఇది రెండవ చిత్రం. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ తెరకెక్కిన ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో అందరికీ తెలిసిందే.

మళ్లీ ఇన్నాళ్లకు వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఈ చిత్రం తెరకెక్కబోతుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తారని అంతా అనుకున్నారు , కానీ అనిరుద్ సంగీతం అందించనున్నారు. ‘దేవర’ తర్వాత ఎన్టీఆర్ సినిమాకు ఆయన పని చేయబోతుండడం తో అభిమానుల్లో అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటి వరకు మన టాలీవుడ్ స్టార్ హీరోల్లో పవన్ కళ్యాణ్ , ప్రభాస్ వంటి వారు మాత్రమే దేవుళ్ళు గా కనిపించారు. ఇప్పుడు ఎన్టీఆర్ కనిపించబోతున్నారు , సరిగ్గా తీస్తే ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 2000 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పురాణాలపై అపార జ్ఞానం ఉన్నటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని ఎలా తీయబోతున్నాడో చూడాలి.

ప్రభుత్వ సొమ్ము మరీ.. సీఎంకు ఉందని కోటి పెట్టి స్క్రీన్ లు పెట్టుకున్న మంత్రులు

Telangana Secretariat News

Telangana Cabinet Ministers : రాష్ట్రానికి సంబంధించి పరిపాలన సాగించే సచివాలయంలో అందరి మంత్రులకు.. అధికారులకు పేషీలు ఉంటాయి. ముఖ్యమంత్రికి విశాలవంతమైన ఛాంబర్ ఉంటుంది. దానికి తోడు అతిపెద్ద ఎల్ఈడి స్క్రీన్ ఉంటుంది. దానిద్వారా ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్.. ఇతరత్రా అంశాలను చర్చిస్తారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఇది కొనసాగుతోంది. గతంలో ఉన్న ముఖ్యమంత్రులు కేవలం కేవలం ఎల్ఈడి స్క్రీన్ ల ద్వారానే ఈ వ్యవహారాలను సాగించేవారు.

కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత భారీ ఎల్ఈడి స్క్రీన్ లను ఏర్పాటు చేశారు. నాడు ప్రగతిభవన్లో.. ఆ తర్వాత కొత్త సచివాలయంలో కేసీఆర్ ఈ సదుపాయాన్ని కల్పించుకున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నాటి కెసిఆర్ మాదిరిగానే అతిపెద్ద ఎల్ఈడి స్క్రీన్ నుంచి వివిధ రకాల వ్యవహారాలు సాగిస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలను దీని ద్వారానే పరిశీలిస్తున్నారు. ఈ ఎల్ఈడి స్క్రీన్ ద్వారానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఇటీవల మహిళా సంఘాల నేతలతో ముఖ్యమంత్రి ఇలానే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు..

ముఖ్యమంత్రి వరకైతే పెద్దగా ఇబ్బంది లేదు. కానీ తెలంగాణ సచివాలయంలో ఇద్దరు మంత్రులు ముఖ్యమంత్రి స్థాయిలోనే సదుపాయాలు కోరుకుంటున్నారు. ఈ విషయం భారత రాష్ట్ర సమితి అనుకూల సోషల్ మీడియా వింగ్ ద్వారా బయటికి వచ్చింది. ఇది ఆరోపణ లేదా వాస్తవంగా జరిగిందేనా అనే విషయాలను పక్కన పెడితే.. మొత్తానికి అయితే ఆ ఇద్దరు మంత్రుల వ్యవహారం రచ్చ రచ్చ అవుతోంది. ఆ ఇద్దరు మంత్రులు తమకు సొంతంగా ఎల్ఈడి స్క్రీన్లు కావాలని.. ముఖ్యమంత్రి స్థాయిలోనే తమకు సదుపాయాలు కల్పించాలని కోరారు.

వాస్తవానికి ఆ మంత్రుల ఛాంబర్ లో ఎల్ఈడి టీవీలు ఉన్నాయి. ఇతర మంత్రులు కూడా అటువంటి టీవీల ద్వారానే తమ శాఖలకు సంబంధించిన వ్యవహారాలు కొనసాగిస్తున్నారు. కానీ ఈ ఇద్దరు మంత్రులు మాత్రం భిన్నంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి స్థాయిలోనే తమకు కూడా అతిపెద్ద ఎల్ఈడి స్క్రీన్లు ఉండాలని.. సదుపాయాలు కూడా కల్పించాలని ఒత్తిడి తీసుకురావడంతో.. అధికారులకు తప్పలేదు. తట్టుకోలేక ఆ ఇద్దరు మంత్రులకు కూడా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. వీటికోసం భారీగానే ఖర్చుపెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఇంత ఖర్చు పెట్టి ఆ స్థాయిలో సదుపాయాలు ఏర్పాటు చేస్తే.. ఆ మంత్రులు వాటి ద్వారా సాగించే వ్యవహారాలు కూడా అంతంత మాత్రమేనని తెలుస్తోంది. ముఖ్యమంత్రి స్థాయిలో సదుపాయాలు కోరుకున్న ఆ మంత్రులు.. భవిష్యత్తు కాలంలో ఏం చేస్తారో తెలియడం లేదని సచివాలయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

కేతన్ నుంచి రూ.కోటి తీసుకొని.. ప్రియుడి బిజినెస్ కోసం ఇచ్చి మరీ కడతేర్చిన సియా

Ketan Agarwal Case
Ketan Agarwal case

Ketan Agarwal case: పూణే స్థిరాస్తి వ్యాపారి కేతన్ అగర్వాల్ కేసు రకరకాల మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే అతడికి కాబోయే భార్య సియా.. ఆమె ప్రియుడు ప్రధాన అభియోగాలు ఎదుర్కొంటున్నారు. వీరిద్దరూ కలిసి కేతన్ ను చంపేసినట్టు పోలీసులు ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించారు. ఈ నేపథ్యంలో ఈ కేసు కు సంబంధించి మరిన్ని సాక్ష్యాలను… ఆధారాలను సేకరించడానికి విచారణ జరుపుకున్నారు.

ఇప్పటికే పోలీసులు సియా ప్రియుడు చేతన్ ను కోట వద్దకు తీసుకెళ్లారు. అక్కడ సీన్ రిక్రియేషన్ చేశారు. తద్వారా మరిన్ని ఆధారాలు సేకరించారు. డమ్మీ బొమ్మలు పెట్టి.. కోట చివరి అంచున దానిని ఏర్పాటు చేశారు. కేతన్ ను ఎలా లోయలోకి తోసి వేసింది.. దానికి ముందు ఏం చేసింది.. అనే విషయాలను పూర్తిగా చేతన మాటల్లోనే తెలుసుకున్నారు. అతడు చెబుతుండగా ఆ స్టేట్మెంట్ మొత్తం రికార్డ్ చేసుకున్నారు.

ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత పోలీసులకు ఈ కేసులో మరొక కీలక విషయం తెలిసింది.. పెళ్లి నవంబర్లో జరగాల్సి ఉండగా.. దానికంటే ముందుగానే సియా కేతన్ దగ్గరనుంచి కోటి రూపాయలు తీసుకుంది. పెళ్లి ఖర్చుల కంటూ అతని ముందు బుకాయించింది. ఆ కోటి రూపాయలను సియా తన ప్రియుడు చేతన్ కు ఇచ్చింది. వారిద్దరు వేసుకున్న ప్లాన్ లో ఈ డబ్బులు వసూలు కూడా ఒక భాగమని తెలుస్తోంది.. అంతేకాదు కేతన్ ను చంపేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు వారిద్దరు సాధారణంగా ఉండాలని అనుకున్నారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల అనంతరం పెళ్లి చేసుకోవాలని సీఎం, చేతన్ భావించారు. వాస్తవానికి సియా కేతన్ దగ్గర్నుంచి కోటి రూపాయలు తీసుకున్న తర్వాత వాటితో షాపింగ్ చేయలేదు. ఆ డబ్బులను తన ప్రియుడికి ఇచ్చింది..

చేతన్ ది అంతగా ఆర్థిక స్థిరమైన కుటుంబం కాదు. పైగా అతడు జీవితంలో స్థిరపడేందుకు చాలా సమయం పడుతుంది. దానికి పెట్టుబడి కావాలి. అందువల్లే సియా కేతన్ దగ్గర్నుంచి కోటి రూపాయలు తీసుకొని తన ప్రియుడికి ఇచ్చింది. తన ప్రియుడిని ఆర్థికంగా సెటిల్ చేయడానికి ఆమె ఈ డబ్బులు ఇచ్చినట్టు తెలుస్తోంది.. డబ్బులు తీసుకున్న తర్వాత.. అతడిని అంతం చేసేందుకు వీరిద్దరూ పకడ్బందీగా ప్రణాళికల రూపొందించారు. జూన్ 4న చంపాలని అనుకున్నారు. కానీ ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు. జూన్ 14న మరోసారి ప్రయత్నించారు.. అది కూడా విఫలమైంది. జూన్ 18న ఈసారి పకడ్బందీగా ప్లాన్ వేసి.. కొండ చివరి అంచు వరకు తీసుకెళ్లి.. అతడిని అందులో నుంచి తోసివేశారు. అతడు చనిపోయాడు అని నిర్ధారించుకున్న తర్వాతే అక్కడి నుంచి బయటికి వచ్చారు. ఆ తర్వాత డ్రామా ప్లే చేయడం మొదలుపెట్టారు.

'ఈ నగరానికి ఏమైంది 2' విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్.. వైరల్ అవుతున్న ప్రోమో..

Ee Nagaraniki Emaindi 2
Ee Nagaraniki Emaindi 2

Ee Nagaraniki Emaindi 2: యూత్ ఆడియన్స్ కి బాగా ఇష్టమైన సినిమాల్లో ఒకటి ‘ఈ నగరానికి ఏమైంది’. తరుణ్ భాస్కర్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా ఆరోజుల్లో పెద్దగా ఆడలేదు , యావరేజ్ రేంజ్ లో ఆడింది కానీ, ఓటీటీ లోకి వచ్చిన తర్వాత మాత్రం నేటి తరం యూత్ ఆడియన్స్ ని ఒక రేంజ్ లో అలరించింది ఈ చిత్రం. ఒక్క మాటలో చెప్పాలంటే కల్ట్ క్లాసిక్ స్టేటస్ ని సంపాదించుకుంది. అందుకే ఈ చిత్రాన్ని కొన్నేళ్ల తర్వాత రీ రిలీజ్ చేయగా, మొదటిసారి విడుదల చేసినప్పుడు ఎంత వసూళ్లు వచ్చాయో , అంతకు మించిన వసూళ్లు రావడం గమనార్హం. మేకర్స్ కి ఈ చిత్రం పై ఆడియన్స్ లో ఇంత క్రేజ్ ఉందా అనే విషయం కూడా అప్పుడే అర్థమైంది. ఇంత క్రేజ్ ఉన్నప్పుడు , ఆ బ్రాండ్ ని ఉపయోగించుకోకుండా ఎవరైనా ఉంటారా చెప్పండి?.

అందుకే తరుణ్ భాస్కర్ ఈ చిత్రానికి సీక్వెల్ ని ప్రకటించారు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది నవంబర్ 19 న విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్నీ బ్రాండ్ న్యూ ప్రోమో ద్వారా ప్రకటించారు మేకర్స్. స్నేహితులు చాలా కాలం తర్వాత రీ యూనియన్ అవ్వడం , ఒక కారులో ట్రిప్ కి బయలుదేరుతున్నట్టు ఈ ప్రోమో లో చూపించారు. ఈ చిత్రానికి ‘ENE రిపీట్’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. మొదటి భాగం లో కనిపించిన నటీనటులంతా ఇందులో కూడా కనిపించబోతున్నారు, ఒక్క సాయి సుశాంత్ తప్ప. ఆయనకు బదులుగా మాగంటి శ్రీనాథ్ నటిస్తున్నారు. ఈరోజు విడుదల చేసిన ప్రోమో లో అతను కూడా కనిపించారు. రీసెంట్ గానే ఇతను పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో కూడా కీలక పాత్ర పోషించారు. అంతకు ముందు కూడా అనేక సూపర్ హిట్ చిత్రాల్లో వైవిద్యభరితమైన పాత్రలు పోషించి మంచి గుర్తింపు ని తెచ్చుకున్నారు.

అయితే మొదటి భాగాన్ని నిర్మించిన సురేష్ బాబు , రెండవ భాగం లో మాత్రం భాగం అవ్వడం లేదు. ఆయనకు బదులుగా సృజన యర్రబోలు , సందీప్ నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించే బాధ్యతలు చేపట్టారు. మొదటి భాగం కంటే ఫన్నీ గా, యూత్ ఆడియన్స్ చిరకాలం గుర్తించుకునేలా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దుతున్నారు డైరెక్టర్ తరుణ్ భాస్కర్. మరి అప్పటి మ్యాజిక్ రిపీట్ అవుతుందా లేదని అనేది చూడాలి. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న విశ్వక్ సేన్ కి ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వడం ఆయనకు కెరీర్ కి చాలా ముఖ్యం. చూడాలి మరి , ఈ చిత్రం ఏ మేరకు సక్సెస్ అవుతుంది అనేది.

'వారణాసి' చిత్రం లోని హైలైట్స్ లీక్ చేసిన రాజమౌళి.. సినిమాలో అవే కీలకం..

Varanasi movie
Varanasi movie

Varanasi movie: రాజమౌళి సినిమా అంటేనే ప్రేక్షకులకు అమితాసక్తి ఉంటుంది. అలాంటిది ఆయన అడ్వెంచర్ , టైం ట్రావెల్, రామాయణం వంటి కాన్సెప్ట్స్ ని కలిపి ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుంది?, హైప్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించడం కూడా కష్టమే . అలాంటి హైప్ ప్రతిరూపమే ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ చిత్రం. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7 న ప్రపంచవ్యాప్తంగా అన్ని ఫారిన్ భాషల్లో విడుదల కాబోతుంది. అక్టోబర్ నెలలోపు షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేస్తామని ఇప్పటికే రాజమౌళి ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. ఇకపోతే రీసెంట్ గానే ఆయన ‘ఆన్సీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్’ లో పాల్గొన్నారు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ లో రాజమౌళి ‘వారణాసి’ గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

ఆయన మాట్లాడుతూ ‘మా వారణాసి సినిమాలో ఆఫ్రికా అడవుల్లో ఉండే జంతువుల క్రూరత్వం తో పాటు, అంటార్కిటికాలోని మంచు పర్వతాల్లో ఉండే చల్లదనం కూడా చూపించబోతున్నాము. రామాయణం లోని పాత్రలు , మధ్యలో ప్రకృతి విలయాలు , టైం ట్రావెల్ వంటి కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాము. ముఖ్యంగా ఈ చిత్రంలో ఫాంటసీ తో ముంచెత్తే అద్భుతమైన విన్యాసాలు ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తాయి. వీటి అన్నిటికంటే తండ్రి కొడుకుల మధ్య ఉండే అద్భుతమైన అనుభందం , వారి మధ్య ఏర్పడే భావోద్వేగాలు ఈ కథకు మూలం. అక్కడి నుండే ఈ సినిమా ఫాంటసీ జర్నీ మొదలు అవుతుంది’ అంటూ చెప్పుకొచ్చారు రాజమౌళి. మహేష్ బాబు ఇది వరకు ప్రకాష్ రాజ్ తో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా దూకుడు చిత్రం లో వీళ్లిద్దరు తండ్రి కొడుకులుగా ఎంత అద్భుతంగా నటించారో మనమంతా చూసాము.

మళ్లీ ఇన్ని రోజులకు వీళ్లిద్దరి మధ్య ప్రేమానుబంధాలను వెండితెర పై గ్రాండ్ స్కేల్ లో చూసే అదృష్టం ఆడియన్స్ కి కలగబోతుంది. ఇందులో మహేష్ బాబు తన తండ్రి ప్రకాష్ రాజ్ ఆశయాన్ని ఛేదించడానికి ఎంత దూరమైనా వెళ్లే కొడుకు పాత్రలో కనిపించబోతున్నారు. అందుకోసం ఆయన కాలాన్ని కూడా దాటాల్సి వస్తుంది. అందుకు ఎదురయ్యే పరిస్థితులను ఈ చిత్రం లో మనమంతా చూడబోతున్నాము. అక్టోబర్ నెలలో షూటింగ్ ని పూర్తి చేసి , డిసెంబర్ నుండి నాన్ స్టాప్ గా ప్రొమోషన్స్ చెయ్యాలని రాజమౌళి ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తోంది. దాదాపుగా 2000 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆడియన్స్ ని ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. ఈ చిత్రం లో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా , మలయాళం స్టార్ హీరో పృథ్వి రాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు.

సినిమా ఇండస్ట్రీ లో గోదావరి జిల్లాల వాళ్ళ ఆధిపత్యం ఉండడానికి కారణం ఇదే...

Tollywood industry
Tollywood industry

Tollywood industry: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇప్పుడైతే ఇండస్ట్రీ లో టాప్ లెవల్లో ముందుకు సాగుతుంది. ఇక ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో రెండు రాష్ట్రాలలో ఉన్న అన్ని ఏరియాల నుంచి దర్శకులు, హీరోలు,టెక్నీషియన్స్ ఉన్నారు. కానీ ఒకప్పుడు మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే గోదావరి జిల్లాల వారిదే ప్రత్యేకమైన స్థానంగా ఉండేది. ముఖ్యంగా తూగోజి, పగోజి ప్రాంతాల్లో ఉన్న వాళ్లు ఇండస్ట్రీలో రాణించడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే వాళ్లకి ధవలేశ్వరం ప్రాజెక్టు ఉండడం వల్ల నీటి కొరత ఉండేది కాదు. దాంతో సంవత్సరానికి రెండు మూడు పంటలు పండించేవారు. దాంతో వాళ్ళ దగ్గర అవసరానికి మించిన డబ్బులు ఉండేవి వాటితో కొంతమంది పిల్లలను చదివిస్తే మరి కొంతమంది తమకున్న కళలలో రాణించాలనే ప్రయత్నం చేసేవారు. ఇక అందులో భాగంగానే వాళ్లు సినిమా ఇండస్ట్రీ మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి అవకాశం దొరికింది. ఇక అలాగే ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ మద్రాస్ లోనే ఉండేది… వాళ్లకు మద్రాస్ వెళ్లడానికి రైలు సౌకర్యం అలాగే రోడ్డు సౌకర్యం ఉండడంతో తరచుగా వాళ్ళు మద్రాస్ వెళ్లి వస్తుండేవారు. ఇక వాళ్లకు మద్రాస్ దగ్గరైపోయింది. దాంతో అక్కడికి వెళ్లి సినిమా ప్రయత్నాలు చేసి సక్సెస్ సాధించడానికి వాళ్ళకి ఎక్కువ ఆస్కారం ఉండేది…

ఆ సమయంలో మిగతా ప్రాంతాల వాళ్ళు మూడు పూటల తిని బతకడమే కష్టంగా ఉండేది. వాళ్లకు సరైన నీటి సౌకర్యం కూడా లేక ఇబ్బందులు పడుతూ బతుకును ఈడ్చుకుంటూ రావాల్సిన పరిస్థితి ఏర్పడడంతో వాళ్ళు ఎవరు సినిమాల మీద పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు. ఇక గోదావరి జిల్లాలు అందంగా ఉంటాయి.

కాబట్టి కొన్ని సినిమాల షూటింగ్ లను అక్కడే జరిపించడం వల్ల ఆ షూటింగ్స్ చూసిన ప్రతి ఒక్కరు సినిమా వాళ్ళ క్రేజ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకొని మనం కూడా ఇండస్ట్రీకి వెళ్లాలనే ఒక కుతూహలం పుట్టేది… ఇలా సినిమా ఇండస్ట్రీ మద్రాసు నుంచి హైదరాబాద్ కి వచ్చిన తర్వాత కూడా ఎక్కువగా గోదావరి జిల్లాల వాళ్లే ఇండస్ట్రీలో స్థిరపడి ఉండటం వల్ల వాళ్ళ సహకారంతో చాలామంది ఇండస్ట్రీకి వచ్చి స్థిరపడ్డారు.

ముఖ్యంగా దాసరి నారాయణ రావు లాంటి దర్శకుడు సైతం తన ఏరియా వాళ్ళను ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ తన శిష్యులుగా జాయిన్ చేయించుకోవడం అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించింది. ఇక ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది ఇప్పటికి దాసరి శిష్యులమే అని చెప్పుకుంటూ ఉంటారు. రాజమౌళి, సుకుమార్, వివి వినాయక్, త్రివిక్రమ్, శ్రీను వైట్ల లాంటి దర్శకులు సైతం గోదావరి జిల్లాలకు చెందిన వారే కావడం విశేషం…

భగభగలాడుతున్న యూరప్‌.. రికార్డు వేడితో ఐస్‌లా కరుగుతున్న రోడ్లు, రైలు పట్టాలు.. ఎందుకీ వైపరీత్యం?

Europe heatwave
Europe heatwave

Europe heatwave: యూరప్‌ ఖండం భగభగ మండుతోంది. తీవ్రమైన వేడిమి ప్రభావంతో సాధారణ జీవితం అస్తవ్యస్తంగా మారుతోంది. ఉష్ణోగ్రతలు అన్ని రికార్డులను బద్దలు కొడుతుండటంతో రోడ్లు కరిగిపోవడం, రైల్వే పట్టాలు వంకరలు తిరగడం, రవాణా వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతినడం వంటి సమస్యలు విస్తృతంగా నమోదవుతున్నాయి. పలు దేశాల్లో 40 డిగ్రీల సెల్సియస్‌ను అధిగమించిన ఉష్ణోగ్రతలు ప్రజలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయి. పశ్చిమ యూరప్‌ నుంచి మొదలైన ఈ వేడిమి క్రమంగా మధ్య, తూర్పు భాగాలకు విస్తరించి అనేక దేశాల్లో అన్ని కాలాల రికార్డులను ఛేదించింది. డెన్మార్క్‌లో 1874 తర్వాత ఇప్పటికీ అత్యధికంగా 37 డిగ్రీలు నమోదైంది. స్విట్జర్లాండ్‌లో 38.8 డిగ్రీలు, చెక్‌ రిపబ్లిక్‌లో 40.8 డిగ్రీలు అన్ని కాలాల అత్యధిక ఉష్ణోగ్రతగా నమోదయ్యాయి. యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో జూన్‌ నెలలోనే 37.3 డిగ్రీలు చరిత్రాత్మకంగా అత్యధికంగా నమోదైంది.

జర్మనీ, ఫ్రాన్స్‌లో దెబ్బతిన్న మౌలిక సదుపాయాలు..
జర్మనీలో వేడిమి కారణంగా ఆటోబాన్‌ హైవేలపై కాంక్రీట్‌ స్లాబ్స్‌ పేలిపోవడంతో అనేక రహదారులు మూసివేయాల్సి వచ్చింది. ఫ్రాన్స్‌లో రోడ్లు కరిగిపోవడం, విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు, రైళ్ల ఆలస్యాలు తీవ్ర స్థాయిలో నమోదయ్యాయి. అణు విద్యుత్‌ కేంద్రాల్లో కూలింగ్‌ సమస్యల కారణంగా ఉత్పత్తిని తగ్గించాల్సి వచ్చినప్పటికీ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు తెలిపారు.

ఆసుపత్రులపై భారీ ఒత్తిడి..
తీవ్ర వేడిమి ప్రభావంతో ఆసుపత్రులు భారీ ఒత్తిడికి గురవుతున్నాయి. ఫ్రాన్స్‌లో వేలాది మంది వేడిమి సంబంధిత ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రులను ఆశ్రయించగా, అత్యవసర వైద్య సేవలు అప్రమత్త స్థితిలో ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రజా కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. జర్మనీలో ఒక నర్సింగ్‌ హోమ్‌ను ఖాళీ చేయాల్సి వచ్చింది. ఒక వ్యక్తి మరణించిన ఘటనలో వేడిమి కారణమా అనేది ఇంకా స్పష్టం కాలేదు. ఇటలీ, యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో ఎరుపు, నారింజ అప్రమత్త సంకేతాలు కొనసాగుతున్నాయి. పలు నగరాల్లో ప్రజలు నీడ కోసం ఆశ్రయాలు వెతుకుతున్నారు. ఫౌంటెన్ల వద్ద సమయం గడుపుతున్నారు. ఇదే సమయంలో నదులు, సరస్సుల్లో స్నానానికి వెళ్లిన కొందరు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా నమోదయ్యాయి.

పెరుగుతున్న మరణాలు..
ఇటీవలి సంవత్సరాల్లో యూరప్‌లో వేడిమి కారణంగా మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఫ్రాన్స్‌లో మాత్రమే సుమారు 1,000కి పైగా అదనపు మరణాలు నమోదయ్యాయి. ప్యారిస్‌ ప్రాంతంలో మరణాల సంఖ్య వేగంగా పెరిగిందని కొన్ని నివేదికలు తెలిపాయి. జర్మనీ, పోలాండ్, చెక్‌ రిపబ్లిక్, హంగేరీ వంటి దేశాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. యూరప్‌ మొత్తం మీద లక్షలాది మంది తీవ్రమైన వేడికి గురయ్యారు. గత సంవత్సరాల అంచనాల ప్రకారం, 2024లో యూరప్‌లో సుమారు 62,775 మంది వేడిమి సంబంధిత మరణాలు జరిగాయి. 2022–2023 వేసవి కాలాల్లో లక్షల సంఖ్యలో ఇలాంటి మరణాలు నమోదయ్యాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

ప్రతీ సంవత్సరం వేడిమి కారణంగా మరణాలు పెరుగుతున్న ధోరణి కనిపిస్తోంది. 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులు ఈ వేడిమి వల్ల ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు తగ్గకపోవడం పరిస్థితిని మరింత తీవ్రం చేస్తోంది.

పాకిస్తాన్‌ దొంగదెబ్బ.. నెత్తురొడిన ఆఫ్గాన్‌ సరిహద్దు!

Pakistan Afghanistan
Pakistan Afghanistan

Pakistan Afghanistan: పాకిస్తాన్‌–ఆఫ్గానిస్తాన్‌ మధ్య ఇటీవల తాత్కాలిక శాంతి ఒప్పందం జరిగింది. దీంతో ఇరు దేశాల మధ్య పరస్పరదాడులు ఆగిపోయాయి. అంతకుముందు టీటీపీ(తెహ్రీక ఎ తాలిబాన్‌ పాకిస్తాన్‌) సంస్థ ఉగ్రవాదులు లక్ష్యంగా పాకిస్తాన్‌ ఆఫ్గానిస్తాన్‌పై దాడులు చేసింది. వైమానిక దాడులతో విరుచుకుపడింది. దీంతో వృద్ధులు, చిన్నపిల్లలు మరణించారు. ఆఫ్గాన్‌ ప్రభుత్వం పాకిస్తాన్‌పై ప్రతిదాడులు చేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల్లో నష్టం జరిగింది. ఖతార్‌ చొరవతో ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. తాజాగా పాకిస్తాన్‌ అమెరికా–ఇరాన్‌ మధ్య శాంతి ఒప్పందం కుదిర్చింది. కానీ పాకిస్తాన్‌ వైమానిక దళం ఆఫ్గానిస్థాన్‌ సరిహద్దు ప్రాంతాలపై అర్ధరాత్రి దాడులు చేపట్టింది. పక్తికా, పక్తియా, కునార్‌ ప్రాంతాల్లో జరిగిన ఈ చర్యల్లో మొదటి దశలో జనావాసాలు, మసీదులు లక్ష్యంగా మారాయి. సహాయక చర్యలు కొనసాగుతున్న సమయంలోనే రెండో దశ దాడులు జరగడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. స్థానిక వర్గాల ప్రకారం, 25 నిమిషాల వ్యవధిలో రెండు దశల్లో దాడులు జరిగాయి.

35 మంది మృతి.. వందకు పైగా క్షతగాత్రులు.

ఈ దాడుల్లో కనీసం 35 మంది ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్‌ వైపు ఈ మృతులంతా నిషేధిత సంస్థకు చెందిన వ్యక్తులని పేర్కొంటోంది. అయితే ఆఫ్గాన్‌ అధికారులు మాత్రం మృతుల్లో ఎక్కువ మంది అమాయక పౌరులే ఉన్నారని, వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని చెబుతున్నారు. గాయపడిన వారి సంఖ్య వందకు మించిందని సమాచారం.

పాకిస్తాన్‌ సమర్థన.. ఆఫ్గాన్‌ తీవ్ర నిరసన
పాకిస్తాన్‌ ప్రభుత్వం ఈ చర్యలను ఉగ్రవాద స్థావరాలపై జరిగిన ఇంటెలిజెన్స్‌ ఆధారిత ఆపరేషన్లుగా సమర్థించుకుంటోంది. దేశంలో ఇటీవల జరిగిన దాడులకు ప్రతిస్పందనగా టీపీపీ అనుబంధ గ్రూపులపై చర్యలు తీసుకున్నట్లు అధికారులు వాదిస్తున్నారు. అయితే ఆఫ్గానిస్తాన్‌ ప్రభుత్వం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ, పౌర ప్రాంతాలపై జరిగిన దాడులను ‘‘అక్రమ చర్యలు’’గా అభివర్ణించింది.

డబుల్‌ ట్యాప్‌ వ్యూహం..
మొదటి దాడి తర్వాత సహాయక బృందాలు, వైద్య సిబ్బంది చేరుకునే సమయంలోనే రెండోసారి దాడి జరగడం వల్ల ‘‘డబుల్‌ ట్యాప్‌’’ వ్యూహం అమలు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. మానవ హక్కుల సంస్థలు ఈ పద్ధతిని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. అంతర్జాతీయ చట్టాల్లో ఇది ప్రత్యేకంగా నిషేధించబడకపోయినా, జెనీవా కన్వెన్షన్‌ స్పిరిట్‌కు విరుద్ధమని విమర్శలు వస్తున్నాయి.

2021 తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు నిరంతరం దెబ్బతింటున్నాయి. తరచూ సరిహద్దు ఉద్రిక్తతలు, పరస్పర ఆరోపణలు కొనసాగుతుండటంతో ప్రాంతంలో అస్థిరత నెలకొంది. గతంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాలు కూడా పూర్తి స్థాయిలో నిలబడలేకపోయాయి. తాజా ఘటనలతో సరిహద్దు గ్రామాల్లో భయాందోళన వాతావరణం ఏర్పడింది. అంతర్జాతీయంగా కూడా ఈ ఘటనలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

 

పొత్తుతో కాదు.. ఒంటరిగా గెలిచి చూపించండి.. టీ బీజేపీ నేతలకు నితిన్ నబీన్ క్లాస్?

Nitin Nabin
Nitin Nabin

Nitin Nabin: రెండు రోజుల పర్యటన నిమిత్తం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ హైదరాబాద్‌కు వచ్చారు. పార్టీ పరిస్థితి.. బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు.. అంతర్గత కుమ్ములాట, కూటములు, ఆధిపత్య ధోరణి తదితర అంశాలపై కీలక సమావేశాలు నిర్వహించారు. ఆదివారం ఆలస్య రాత్రి జరిగిన సమావేశంలో పార్టీ నాయకులతో విస్తృతంగా చర్చించారు. పార్టీ ప్రస్తుత పనితీరును సమీక్షించిన అనంతరం రాబోయే ఎన్నికలకు ముందు గ్రౌండ్‌ లెవల్‌ సమన్వయాన్ని బలోపేతం చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు ఎదుర్కొంటున్న సవాళ్లు, అవకాశాలపై వివరణాత్మక చర్చ జరిగింది.

పశ్చిమ బెంగాల్‌ విజయం నుంచి పాఠాలు..
పార్టీ కష్టమైన రాజకీయ పరిస్థితుల్లో కూడా ఎదగగలదని నబీన్‌ ఉదాహరణగా పశ్చిమ బెంగాల్‌ను పేర్కొన్నారు. అక్కడి సవాళ్లను అధిగమించి బీజేపీ ఎలా బలపడిందో వివరించి, తెలంగాణలో కూడా అలాంటి అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రజల మనసు మారుతోందని, అనుకూలమైన వాతావరణం ఏర్పడుతోందని ఆయన స్పష్టం చేశారు. పార్టీలో అంతర్గత జాప్యాలు, పనిచేయని నాయకత్వం కొనసాగితే పురోగతి సాధ్యం కాదని నబీన్‌ హెచ్చరించారు. బయటి సహాయం కోసం ఎదురు చూడకుండా, తామే విజయవంతమైన పరిస్థితులను నిర్మించుకోవాలని నాయకులకు సూచించారు. స్థానిక రాజకీయ కార్యకలాపాలపై వివరణాత్మక నివేదికలు తన వద్ద ఇప్పటికే ఉన్నాయని గుర్తు చేస్తూ, ఆ ఆధారంగానే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పార్టీ క్రమశిక్షణకు ప్రాధాన్యం..
పార్టీ క్రమశిక్షణను అత్యంత ప్రాధాన్యతగా భావించాలని, వ్యక్తిగత నాయకత్వం దాని తర్వాతనే వస్తుందని నబీన్‌ స్పష్టం చేశారు. నాయకులు వ్యక్తిగత ప్రాధాన్యతల కంటే పార్టీ లక్ష్యాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు మరింత క్రమశిక్షణతో పని చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్, రాబోయే మున్సిపల్‌ ఎన్నికలపై ఎక్కువ దృష్టి పెట్టాలని కార్యకర్తలను ఆదేశించారు. రాష్ట్రంలోని ముఖ్యమైన పట్టణ సంస్థల్లో విజయం సాధించేందుకు అన్ని స్థాయిల్లో సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మొత్తంగా పొత్తులు, ఇతర బయటి నుంచి ఇచ్చే మద్దతు కోసం ఎదురు చూడకుండా ఈ ఎన్నికల్లో బలమైన సంకల్పంతో ముందుకు సాగాలని, పార్టీ శక్తిని నిరూపించాలని నబీన్‌ దిశానిర్దేశం చేశారు.

నాని లెక్క మారిపోయిందా..? తన సినిమాల బడ్జెట్ పెంచాల్సిందేనా..?

Nani
Nani

Nani: అష్టా చమ్మా సినిమాతో హీరోగా పరిచయమైన నాని మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత నుంచి చిన్న చిన్న సినిమాలను చేస్తూ వచ్చిన నాని ఒకానొక సందర్భంలో స్టార్ హీరోగా మారే అవకాశాన్ని దక్కించుకున్నాడు. స్టార్ డైరెక్టర్లతో సైతం సినిమాలు చేయడానికి ఆయనకి అవకాశం దొరకడం అంతలోనే అతను టాప్ హీరోగా మారిపోవడం చకచక జరిగిపోయాయి. మాస్ లో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకోవడానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఇంతకుముందు దసరా అనే సినిమా చేశాడు. ప్రస్తుతం ఇప్పుడు మరోసారి శ్రీకాంత్ దర్శకత్వంలోనే ప్యారడైజ్ సినిమాలో నటిస్తుండటం విశేషం…ఈ సినిమాతో ఎలాగైనా సరే తనకంటూ ఒక స్టార్ డమ్ ను విస్తరించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనను మించిన నటుడు మరెవరు లేరు అనేంతలా పేరు ప్రఖ్యాతలను కూడా తెచ్చుకోవడానికి ఆయన తహతహలాడుతున్నాడు… ప్యారడైజ్ సినిమాతో నాని రేంజ్ మారబోతోంది. తన తదుపరి సినిమాల విషయంలో కూడా ఆయన చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. తన సినిమాలకి దాదాపు 200 నుంచి 300 కోట్లకు వరకు బడ్జెట్ ని కేటాయించడానికి కూడా ప్రొడ్యూసర్లు ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది.

ప్యారడైజ్ సినిమా విషయంలోనే ఆయన చాలా క్లారిటిగా ఉన్నాడు. కాబట్టి ఈ సినిమా ఎలాగైనా సరే నెక్స్ట్ లెవెల్ సక్సెస్ ని సాధిస్తుందనే ఒక దృఢ సంకల్పంతో నాని ముందుకు దూసుకెళ్తుండటం విశేషం… ఇక యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న టైర్ వన్ హీరోలందరితో పోటీ పడడానికి నాని సిద్ధమవుతున్నాడు.

ఇక ప్యారడైజ్ సినిమా అతన్ని ఎంతలా మార్చేస్తుంది సూపర్ సక్సెస్ అయి భారీ కలెక్షన్స్ ని కొల్లగొడుతుందా? లేదంటే అనుకున్న మేరకు సక్సెస్ ని సాధించలేకపోతుందా? అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక నాని రేంజ్ మాత్రం ఈ సినిమాతో పక్కగా మరబోతుందంటూ చాలా మంది చాలా రకాల కామెంట్స్ చేస్తున్నారు…

ప్రభాస్ కి ఉన్న ప్రాబ్లం ఏంటి..? ఫాస్ట్ గా సినిమాలు చేయకపోవడానికి కారణం ఏంటంటే..?

Prabhas
Prabhas

Prabhas: రెబల్ స్టార్ కృష్ణంరాజు నటవారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక రెండో సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన కూడా వర్షం సినిమాతో తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఛత్రపతి సినిమాతో మాస్ యాక్షన్ హీరోగా మారిపోయిన ఆయన కమర్షియల్ సినిమాలను డీల్ చేయడంలో అతన్ని మించిన వారు మరెవరు లేరు అనంతలా పేరు సంపాదించుకున్నాడు. ఆయన బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా ప్రేక్షకులను అలరించాడు… ఇక ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేస్తున్న ‘స్పిరిట్’ సినిమాతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులను అలరించాలని చూస్తున్నాడు. ఈ సినిమా పాన్ వరల్డ్ లో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రభాస్ ఈ సినిమా కోసం తీవ్రమైన కసరత్తులు చేస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటే మాత్రం ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపు లభిస్తుంది. లేకపోతే మాత్రం ఆయన చాలావరకు డౌన్ అయిపోయే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ అభిమానులు మాత్రం తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కారణమేమిటి అంటే ప్రభాస్ ఎప్పుడు ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం ఉందంటూ వేరే దేశాలకు వెళుతున్నాడు.

దానివల్ల సినిమా షూటింగ్ లేటవుతుంది. దానికి తోడుగా అతను ఎక్కువగా డూప్ తోనే సినిమా మొత్తాన్ని చేయిస్తున్నాడు అంటూ గతంలో చాలామంది దర్శకులు చేసిన కామెంట్ల మీద కూడా వాళ్ళు ఫెయిర్ అవుతున్నారు. ఎందుకని ప్రభాస్ తను పూర్తి స్థాయిలో డూప్ లేకుండా సినిమాలో నటించలేకపోతున్నాడు. పదే పదే అతనికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి కారణమేంటి?

మిగతా హీరోలందరు బానే ఉంటున్నారు కదా! మొదటి నుంచి స్ట్రాంగ్ బాడీ పెట్టుకున్న ప్రభాస్ ఎందుకని అలా వీక్ అయిపోయాడు అంటూ చాలామంది చాలా రకాల కామెంట్స్ చేస్తున్నారు. దీనిమీద ప్రభాస్ సైతం ఎలాంటి స్పందన తెలియజేయడం లేదు. కారణం ఏదైనా కూడా ప్రభాస్ కి కొంతవరకు కాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తుంది. అందుకే ఆయన ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాడట.

ఇక దానికి సంబంధించిన సర్జరీలను సైతం విదేశాలలో చేయించుకుంటున్నాడు. ఇక వీలైనంత తొందరగా బిజీ అయి తన నుంచి తొందరగా సినిమాలు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఇక దానివల్ల ప్రేక్షకులు సైతం సినిమాలను చూసి ఎంజాయ్ చేయగలుగుతారని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు…

 

మహేష్ బాబు ప్రొడ్యూస్ చేసిన 'రావు బహదూర్' మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసిందిగా...

Rao Bahadur 4 Days Collection
Rao Bahadur 4 Days Collection

Rao Bahadur review: ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన దర్శకుడు వెంకటేష్ మహా చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ పెను సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఇండస్ట్రీలో ఈ సినిమాకు భారీ పాపులారిటి దక్కింది. ఇక అలాంటి క్రమంలోనే ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరు సినిమా అద్భుతంగా ఉందని కామెంట్స్ చేశారు. దాంతో ఒక్కసారిగా వెంకటేష్ మహా టాప్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇక అలాంటి క్రమంలోనే ఆ తర్వాత చేసిన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో ఇప్పుడు మహేష్ బాబు ప్రొడ్యూసర్ గా ‘రావు బహదూర్’ అనే సినిమాని చేస్తున్నాడు. సత్యదేవ్ ఈ సినిమాలో మెయిన్ లీడ్ లో నటిస్తుండడం విశేషం… అయితే ఈ సినిమాను రీసెంట్ గా ఇండస్ట్రీలో ఉన్న సినిమా పెద్దలకైతే చూపించారు.

ఈ మూవీ చూసినా చాలా మంది దీనిమీద చాలావరకు పాజిటివ్ రివ్యూస్ అయితే ఇస్తున్నారు. ఈ సినిమా చాలా ఎక్సైటింగ్ గా ఉందంటూ వాళ్లు కామెంట్స్ చేస్తుండటం విశేషం… ముఖ్యంగా సత్యదేవ్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి… రీసెంట్ంగా సుకుమార్ సైతం ఈ సినిమాని చూసి ఈ సినిమా మీద తను కామెంట్స్ చేస్తున్నాడు.

ఈ మూవీ మామూలు సినిమా కాదని ఇది భారీ విజయం సాధిస్తుంది అంటూ ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఒక వ్యక్తి వందల సంవత్సరాల పాటు ఎలా జీవించి ఉంటున్నాడు అనే కాన్సెప్ట్ ని ఈ సినిమాలో చాలా అద్భుతంగా చిత్రీకరించారట.

మరి ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరు ఒక కొత్త అనుభూతిని పొందుతారని చెబుతుండడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలని దర్శకుడు వెంకటేష్ మహా ప్రయత్నం చేస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా సక్సెస్ ని సాధిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం జూలై 3 వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే…

విజయ్ దేవరకొండ రణబాలి ఆ వర్గం ప్రేక్షకులకు నచ్చే అవకాశం లేదా..?

Ranabaali
Ranabaali

Ranabaali: విజయ్ దేవరకొండ హీరోగా చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఇప్పటివరకు ఆయన పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి లాంటి సినిమాల్లో తెలంగాణ స్లాగ్ లో నటించి మెప్పించాడు. ఇప్పుడు ఆయన డిఫరెంట్ జానర్ లో నటించి మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలో ‘రణబాలి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అనంతపురం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. హిస్టారికల్ పీరియడ్ ను తీసుకొని ఈ సినిమా లను తెరకెక్కిస్తున్నారు. ఈ విషయంలో కూడా విజయ్ దేవరకొండ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక ఈ సినిమాలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుండటం విశేషం… పెళ్లి తర్వాత వీళ్ళిద్దరు కలిసి నటిస్తున్న సినిమా కూడా ఇదే కావడంతో ఈ మూవీకి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ అతన్ని టాప్ లెవల్లో నిల్చో బెట్టాయి. ఇక ఇప్పుడు చేస్తున్న సినిమాతో ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్ర యాస ల మీద కొన్ని వివాదాలైతే నడుస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ రణబాలి అనే మూవీలో అనంతపురం స్లాంగ్ మాట్లాడుతూ కనిపించబోతున్నాడు. మరి ఈ సినిమా తెలంగాణ ప్రేక్షకులను ఎలా అలరించబోతుంది.

ఇప్పటివరకు తెలంగాణ యాస లోనే మాట్లాడి ప్రేక్షకులని మెప్పించిన విజయ్ దేవరకొండ ఇప్పుడు అనంతపురం స్లాంగ్ లో మాట్లాడి ఎలా మెప్పిస్తాడు. దానిని తెలంగాణ ప్రేక్షకులు ఎలా తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తానికైతే విజయ్ దేవరకొండ మరొక డిఫరెంట్ అటెంప్ట్ చేస్తున్నాడు.

దాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే దానిమీదనే అతని సక్సెస్ అనేది ఆధారపడి ఉంది. ఇక దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ సైతం ఇంతకుముందు చేసిన ట్యాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. కాబట్టి ఈ రెండు సినిమాలకు మించి ఈ సినిమా ఉండబోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి…ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు…

'ఓజీ 2' లో పవన్ కళ్యాణ్ పెంపుడు జంతువు 'డ్రాగన్' కాదా..? అసలు నిజం ఏంటంటే..

OG 2
OG 2

OG 2: గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతున్న టాపిక్ ‘ఓజీ 2’. మూవీ టీం నుండి కేవలం ఒక ప్రకటన వీడియో వచ్చిందంతే, ఇక సోషల్ మీడియా మొత్తం దాని గురించే టాపిక్ జరిగింది. ముఖ్యంగా జెన్ జీ ఆడియన్స్ అయితే మెంటలెక్కిపోతున్నారు. ఈ ప్రకటన వీడియో లో సుజిత్ పవన్ కళ్యాణ్ కి సన్నివేశాలను వివరిస్తూ ‘స్నో బ్లడ్ అయిపోతుంది.. అప్పుడు ఓజాస్ గంభీర అని అంటారు.. అదే ఇంట్రడక్షన్ షాట్ ‘ అని అంటాడు. ఆ షాట్ కి AI విజువల్స్ ని జోడిస్తూ సోషల్ మీడియా లో మీమర్స్ మరియు అభిమానులు రకరకాల ఎడిటింగ్స్ చేశారు. ఇలాగే వదిలేస్తే త్వరలో సినిమానే AI లో చేసి విడుదల చేసేట్టు ఉన్నారు. ఇదే ప్రకటన వీడియో లో ‘ఇందులో హీరో కి ఒక పెట్ ఉంటుంది అన్నమాట’ అని అనగానే బ్యాక్ గ్రౌండ్ లో డ్రాగన్ ని చూపిస్తారు.

అది చూడగానే నెటిజెన్స్ ఇందులో గంభీర కి డ్రాగన్ పెట్ అంటూ ఎన్నో ఫన్నీ ఎడిటింగ్స్ చేశారు, ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అభిమానులు డ్రాగన్ మీద చాలా ఆశలు , అంచనాలే పెట్టుకున్నారు. అయితే అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ఏమిటంటే ఇందులో గంభీర కి పెట్ ఉంటుంది అన్న విషయం వాస్తవమే కానీ , అది డ్రాగన్ కాదని తెలుస్తోంది. ఈ చిత్రం లో డ్రాగన్ కి సంబంధించిన సన్నివేశాలు చాలానే ఉంటాయట కానీ , అది పెట్ మాత్రం కాదట. గంభీర కి పెట్ గా చీటా ఉంటుందని సమాచారం. అప్పట్లో సమురాయ్ క్లాన్ కి చెందిన వాళ్ళు చిరుత పులి ని పెంచుకునేవారట. శత్రు సైన్యాలను ఎదురుకోవడం కోసం అలా చేసేవారట.

‘ఓజీ 2’ చిత్రం మొత్తం ‘ఓజాస్ గంభీర’ తండ్రి ‘జై గంభీర’ కి సంబంధించిన బ్యాక్ స్టోరీ అని తెలుస్తోంది. అంటే సమురాయ్ కాలం నాటి సన్నివేశాలని ఈ ప్రీక్వెల్ స్టోరీ లో చూపించబోతున్నారు అన్నమాట. అందుకే ఇవన్నీ ఉంటాయని తెలుస్తోంది. కాబట్టి అభిమానులు డ్రాగన్ గంభీర పెట్ అని భారీ ఆశలు పెట్టుకోకండి , అలా పెట్టుకుంటే నిరాశ చెందుతారు , సినిమా విడుదల తర్వాత ఫ్లాప్ టాక్ వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు విశ్లేషకులు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ 70 శాతం కి పైగా పూర్తి అయ్యిందట. నవంబర్ మొదటి వారం నుండి ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలు అవుతుందని, పవన్ కళ్యాణ్ ఈ సీక్వెల్ కోసం 70 రోజుల కాల్ షీట్స్ ఇచ్చారని సమాచారం.

యూత్ కు గేమింగ్.. ఉద్యోగులకు భారీ బ్యాటరీ అందించే.. రూ.25 వేల లోపు టాప్ 5 ఫోన్లు ఇవే..

Gaming phones
Gaming phones

Gaming phones: భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. ఇదే సమయంలో మొబైల్స్ ధరలు కూడా పెరుగుతున్నాయి. అయితే చాలా మంది బడ్జెట్ లో ఫోన్ కొనాలని చూస్తారు. ఇలాంటి సమయంలో రూ. 25,000 బడ్జెట్ సెగ్మెంట్‌కు ఎప్పుడూ విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అయితే ఫోన్ ధర తక్కువగా ఉన్నప్పటికీ ప్రీమియం ఫీచర్లు, పవర్‌ఫుల్ ప్రాసెసర్లు, అద్భుతమైన బ్యాటరీ లైఫ్‌ను ఇచ్చే మొబైల్స్ మార్కెట్లో ఉన్నాయి. అలాంటి వాటిలో టాప్ 5 మొబైల్స్ గురించి తెలుసుకుందాం..

మోటో జీ67 పవర్:
మోటోరోలా నుంచి వచ్చిన ఈ ఫోన్ బ్యాటరీ ప్రియులకు ఒక వరం అనుకోవచ్చు. ఎందుకంటే ఇందులో 7,000mAh బ్యాటరీని అందించారు. ఇది 30W టర్బోచార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ మొబైల్ లో 50MP మెయిన్ కెమెరా, ముందు వైపు 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 6.7 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. దీని ధర 22,999గా ఉంది.

రియల్‌మి పి4ఎక్స్ 5జీ:
రియల్‌మి తమ ‘P’ సిరీస్‌లో భాగంగా ఈ పవర్‌ఫుల్ 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇందులో గేమింగ్ , మల్టీటాస్కింగ్ కోసం మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌ను వాడారు. ఇందులో 6.72అంగుళాల డిస్ ప్లే ఉండి.. 144Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. ఇందులో 7,000mAh బ్యాటరీ 45W ఛార్జింగ్ సపోర్ట్ చేయనుంది. దీని వెనుక 50MP డ్యుయల్ కెమెరా సెటప్ అమర్చారు.దీనిని రూ. 23,499 ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.

వివో టీ4:
స్లిమ్ డిజైన్‌ కావాలని అనుకునే వారికి వివో T4 బెస్ట్ ఛాయిస్. ఇందులో 7,300mAh భారీ బ్యాటరీ ని అమర్చడం విశేషం. అలాగే స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 5జీ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. 50MP మెయిన్ కెమెరా, ముందు వైపు 32MP సెల్ఫీ కెమెరాలను కేటాయించారు. దీని 6.77 అంగుళఆల కర్వ్‌డ్ లాంటి ప్రీమియం డిస్‌ప్లే యూజర్లను బాగా ఆకట్టుకుంటుంది. దీనిని రూ.23,499 చెల్లించి కొనుగోలు చేయొచ్చు.

మోటో జీ96:
ఎలాంటి అనవసరమైన యాప్స్ లేకుండా సులువుగా వాడేందుకు వీలుగా మోటో జీ96 ని డిజైన్ చేశారు. రోజువారీ పనులకు, సోషల్ మీడియా వాడకానికి సరిపోయే పవర్‌ఫుల్ 5జీ ప్రాసెసర్, మంచి కలర్ ప్రొడక్షన్ ఇచ్చే డిస్‌ప్లే, నమ్మకమైన కెమెరా సెటప్ ఇందులో ఉన్నాయి. తక్కువ ధరలో ఎక్కువ ర్యామ్ ఆశించేవారికి ఇది సరైన ఎంపిక. దీని ధర రూ.20,999 నుంచి ప్రారంభం అవుతుంది.

పోకో ఎమ్‌8:
పర్ఫార్మెన్స్ ,బడ్జెట్ కాంబినేషన్‌లో పోకో ఎప్పుడూ ముందుంటుంది. ఆ సిరీస్‌లో వచ్చిన పోకో M8 యువతను, ముఖ్యంగా గేమర్లను టార్గెట్ చేస్తూ లాంచ్ అయింది. విలక్షణమైన పోకో సిగ్నేచర్ డిజైన్, మల్టీటాస్కింగ్‌కు ఇబ్బంది లేని ప్రాసెసర్, రోజంతా నిలిచే బ్యాటరీ మరియు ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. రూ. 22 వేల బడ్జెట్‌లో మంచి గేమింగ్ మరియు స్టైలిష్ లుక్ ఆశించే వారికి ఈ ఫోన్ 8/10 రేటింగ్‌తో గట్టి పోటీని ఇస్తోంది.