Home Blog Page 56

చమురు ట్యాంకర్‌పై దాడి.. అమెరికా–ఇరాన్‌ మధ్య మళ్లీ ఉద్రికతలు!

US Iran
US Iran

US Iran: అమెరికా–ఇరాన్‌ మధ్య శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత కూడా ఇరు దేశాల మధ్య మళ్లీ దాడులు మొదలయ్యాయి. ఇరాన్‌పై అమెరికా దాడి చేసింది. దీంతో ఇరాన్‌ అమెరికా అనుకూల దేశాలపై ప్రతీకార దాడులు చేసింది. ఈ క్రమంలో పనామా జెండా ఎగురవేస్తున్న కికు అనే చమురు నౌకపై డ్రోన్‌ దాడి జరిగింది. ఆ నౌకలో సుమారు రెండు మిలియన్‌ బ్యారెళ్ల ముడి చమురు ఉండగా, సిబ్బంది ఎవరికీ హాని కలగలేదు. ఈ ఘటన తర్వాత అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ఇరాన్‌లోని పది ముఖ్యమైన సైనిక లక్ష్యాలపై వైమానిక దాడులు చేసింది.

అమెరికా వరుస దాడులు..
నిఘా వ్యవస్థలు, సమాచార మార్పిడి నెట్‌వర్కులు, వైమానిక రక్షణ కేంద్రాలు, డ్రోన్‌ల నిల్వ స్థావరాలు, సముద్రంలో గనులు పరవడం వంటి సామర్థ్యాలపై అమెరికా దాడులు జరిపింది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇరాన్‌ మళ్లీ దాడులకు దిగిందని అమెరికా ఆరోపణ చేసింది.

ట్రంప్‌ హెచ్చరికలు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌పై తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. కాల్పుల విరమణను ఇరాన్‌ పదేపదే ఉల్లంఘిస్తోందని ఆరోపించిన ఆయన, అవసరమైతే పూర్తి స్థాయి యుద్ధం ద్వారా ఇరాన్‌ను ముగించేస్తామని స్పష్టం చేశారు. అలాంటి పరిస్థితి వస్తే ఇరాన్‌ అనే దేశం ఇకపై ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఖ్చీ హర్ముజ్‌ జలసంధిపై తమ పూర్తి నియంత్రణ ఉందని మరోసారి స్పష్టం చేశారు. నియమాలు ఉల్లంఘించే నౌకలు సమస్యలకు కారణమవుతాయని హెచ్చరించారు. అదే సమయంలో ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ నేవీ కమాండర్‌ గల్ఫ్‌ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు త్వరలోనే తీవ్ర సమస్యలను ఎదుర్కొంటాయని బెదిరించారు.

గల్ఫ్‌ దేశాల్లో దాడులు..
అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ కువైట్‌లోని అలీ అల్‌ సలేం ఎయిర్‌ బేస్, బహ్రెయిన్‌లోని అమెరికా ఐదో నౌకాదళ స్థావరంపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు ప్రకటించింది. కువైట్‌ సైన్యం తమ వైమానిక రక్షణ వ్యవస్థలు ఆ దాడులను విజయవంతంగా తిప్పికొట్టాయని తెలిపింది. గల్ఫ్‌ దేశాల్లో సైరన్లు మోగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.

తీవ్ర సైనిక ఉద్రికతల మధ్య కూడా శాంతి చర్చలకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. స్విట్జర్లాండ్‌లో జరిగిన అవగాహన ఒప్పందం తర్వాత 60 రోజుల వ్యవధిలోనే దాడులు మళ్లీ మొదలవడంతో చర్చలు నిలిచిపోయాయి. అయితే ఖతార్, పాకిస్తాన్‌ మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్‌ ప్రతినిధులు మళ్లీ చర్చలకు సిద్ధమయ్యారు. ఈ వారంలోనే దోహాలో హర్ముజ్‌ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలు, సముద్ర భద్రత, కాల్పుల విరమణ అమలుపై చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఈ చర్చలు ఫలితాలిస్తే ప్రాంతంలో యుద్ధ ముప్పు కొంత తగ్గే అవకాశం ఉంది.

 

బాలయ్య ఒకప్పుడు చేసిన తప్పు ఇప్పుడు చేయడం లేదుగా....

Balakrishna
Balakrishna

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తుంటాడు. కెరియర్ స్టార్టింగ్ లో డిఫరెంట్ సినిమాలను చేసిన ఆయన ఒకానొక సందర్భంలో మాస్ సినిమాలకు మాత్రమే పరిమితమైపోయాడు. బీ,సీ సెంటర్లో బాలయ్య బాబు సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులందరు ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండేవారు. మరి అలాంటి బాలయ్య ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన దర్శకులను కాకుండా కథలను నమ్మి ముందుకు సాగుతున్నాడు. ఒకప్పుడు ఆయన కేవలం దర్శకులను మాత్రమే నమ్మి సినిమాలు చేసేవాడు. కథల గురించి పెద్దగా ఆలోచించేవాడు కాదు. ఇక ఆ క్రమంలోనే అతనికి కొన్ని ఇండస్ట్రీ హిట్ సినిమాలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు తన కెరియర్ ను గాడిలో పెట్టుకునేంతలా వరుసగా సక్సెసు లైతే రాలేకపోయాయి.

ఇక దాంతో ఇప్పుడు సీనియర్ దర్శకులు, కుర్ర డైరెక్టర్లు అనే తేడా లేకుండా కథ బాగుంటే వాళ్లతో సినిమాలు చేయడానికి ఆయన ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక అలాంటి బాలయ్య రాబోయే రోజుల్లో ఎలాంటి పెను సంచలనాలను క్రియేట్ చేయబోతున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన సక్సెస్ లు ఒకెత్తయితే ఇప్పుడు సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ఇక తన లాంటి నటుడు సక్సెస్ లను దక్కించుకోవడానికి డిఫరెంట్ సబ్జెక్టుల వైపు అడుగులు వేస్తున్నాడు. ఇదొక మంచి పరిణామమే అంటూ అతని అభిమానులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబుకి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. సీనియర్ హీరోగా గుర్తింపు పొందుతున్నప్పటికి ఇప్పటికి వరుసగా నాలుగు విజయాలను సాధించాడు. ‘అఖండ 2’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన కూడా బాలయ్య బాబు యాక్టింగ్ కి చాలా మంచి క్రేజ్ దక్కింది…

అనిల్ రావిపూడి తన సినిమాల్లో రాజేంద్ర ప్రసాద్ ను తీసుకోకపోవడానికి కారణం ఇదేనా..?

Anil Ravipudi
Anil Ravipudi

Anil Ravipudi: ప్రస్తుతం కమర్షియల్ సినిమాలను చేయడంలో సిద్ధహస్తుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు అనిల్ రాయపూడి… తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో వరుసగా తొమ్మిది విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. రాజమౌళి తర్వాత అంతటి గొప్ప ఘనతను సాధించిన దర్శకుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇప్పుడు చేస్తున్న సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు అనిల్ రావిపూడి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గానే కొనసాగుతున్నాడు. ఇక తన రెండో సినిమా అయిన సుప్రీమ్ నుంచి సరిలేరు నీకెవరు సినిమా వరకు చేసిన ప్రతి సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ను తీసుకున్నాడు. ఆ తర్వాత నుంచి ఏమైందో తెలియదు గానీ రాజేంద్రప్రసాద్ ను తన సినిమాలో తీసుకోవడం లేదు. ఇక వీళ్లిద్దరి మధ్య కొంతవరకు విభేదాలు వచ్చాయి. అందువల్లే అనిల్ రావిపూడి రాజేంద్రప్రసాద్ తీసుకోవడం లేదని కొంతమంది అంటుంటే మరి కొంతమంది మాత్రం తనకి సరిపడా క్యారెక్టర్ ఉండటం లేదు. అందువల్లే అతన్ని ఆయన సినిమాల్లోకి తీసుకోవడం లేదని ఇంకొంతమంది చెబుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్టులు, దర్శకుల మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉన్నప్పుడే వాళ్లిద్దరి మధ్య సినిమాలో అవకాశాలైతే వస్తాయి.

వీళ్లిద్దరి మధ్య ఎవరికి ఏది జరిగినా కూడా మనస్పర్ధలు వచ్చి ఒకరికొకరు విడిపోయే ప్రమాదం ఉంది. ఇక కొంతమంది దర్శకుడు మాత్రం కేవలం సినిమాల వరకే వాళ్ళ ఫ్రెండ్షిప్ ని పెట్టుకుంటారు. అందులో మంచి క్యారెక్టర్ ఉంటే వల్ల చేత నటిమజేస్తారు అంత తప్ప వాళ్లతో క్లోజ్ గా మూవ్ అయ్యే అవకాశాలైతే లేవు. ఇక ఈ లెక్కన అనిల్ రావిపూడి – రాజేంద్రప్రసాద్ చాలా క్లోజ్ గా మూవీ అయ్యారు.

వాళ్ళ మధ్య బాండింగ్ ఎలా ఉండేదంటే ఒక సందర్భంలో రాజేంద్రప్రసాద్ సైతం అనిల్ నా కొడుకు లాంటివాడు అంటూ కామెంట్స్ చేయడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అలాంటి బాండింగ్ ఉన్న వాళ్ళు మరోసారి కలిసి ఎందుకు సినిమా చేయడం లేదనే రీతిలో కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి.

నిజానికి అనిల్ రావిపూడి ప్రతి సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కోసం సపరేట్ క్యారెక్టర్ రాసేంత స్కోప్ ఉంటుంది. ఎందుకంటే అనిల్ చేసేవన్నీ కామెడీ సినిమాలే కాబట్టి తను కూడా మంచి కామెడీ చేయగలుగుతాడు. అందువల్లే వీళ్ళిద్దరికి బాగా సింక్ అయింది. ఇక ఫ్యూచర్ లో రాబోయే సినిమాలతో చేసే అవకాశం ఉందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…

 

ఎన్టీఆర్ డ్రాగన్ విషయంలో ప్రశాంత్ నీల్ అనుసరిస్తున్న వైఖరి ఎవ్వరికి నచ్చడం లేదా. .?

Jr NTR
Jr NTR

Jr NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. స్టార్ హీరోలందరు పాన్ ఇండియా నేపథ్యంలో సినిమాలను చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమా విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఎలాంటి సినిమాలు చేసిన కూడా తనకంటూ ఒక ఐడెంటిటిని తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు. తన తోటి హీరోలందరు పాన్ ఇండియాలో ఇండస్ట్రీ హిట్లను నమోదు చేస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటివరకు ఒక్క ఇండస్ట్రీ హిట్టును కూడా కొట్టలేకపోయాడు. దానివల్ల ఆయన మీద భారీగా ప్రెజర్ పెరుగుతుంది. దాంతో తన అభిమానులు సైతం అతని నుంచి ఒక ఇండస్ట్రీ హిట్ వస్తే చూడాలని ఆసక్తిగా ఉన్నారు. ఇక డ్రాగన్ సినిమా విషయంలో ఆయన అదే కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ సినిమా ఎలాగైనా సరే ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసే మూవీ అవుతుందనే ఉద్దేశ్యంతోనే ఆలోచిస్తున్నారట. ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమా ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ ను రాబడుతుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

ఇక ప్రస్తుతం ఈ సినిమా దర్శకుడు అయిన ప్రశాంత్ నీల్ సినిమా కోసం అనుసరిస్తున్న విధానం ఎవరికి నచ్చడం లేదట.జూనియర్ ఎన్టీఆర్ ని ఇప్పటికే డిఫరెంట్ గెటప్ లో చూపించిన ఆయన మరో కొత్త గెటప్ లోకి మారమని చెప్పాడట. దాంతో ఇప్పటికే రెండు డిఫరెంట్ గెటప్ ల్లో కనిపించినప్పటికి ఎన్టీఆర్ తన మెకోవర్ ను చూపించాడు.

ఇక ఇప్పుడు కొత్త గెటప్ లో రెడీ అవ్వాలి అంటే దానికి ఇంకా సమయం పట్టే అవకాశమైతే ఉంది. ఇక సినిమా షూటింగ్ అనుకున్న సమయానికి అయిపోతుందా? ఈ సినిమాని అనుకున్న డేట్ కి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాగలుగుతారా? లేదా అనేది కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరిలో చర్చనీయాంశంగా మారింది.

ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను రాబట్టడం వల్ల ఈ సినిమాని చూస్తున్న ప్రతి ఒక్కరు సక్సెస్ ని సాధిస్తాడు అంటూ ఒక కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ సైతం ఈ సినిమా కోసమే భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా మేకోవర్ కోసం ఎంతలా అయినా సరే కష్టపడడానికి రెడీగా ఉన్నాడట. ఇక ప్రశాంత్ నీల్ సైతం ఎన్టీఆర్ ను విపరీతంగా వాడుతున్నట్టుగా తెలుస్తుంది…

రామ్ చరణ్ కి ఇప్పుడైనా ఎలాంటి సినిమాలు చేయాలో తత్వం బోధపడిందా..?

Ram Charan
Ram Charan

Ram Charan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ మరే హీరో కి లేదనే చెప్పాలి. తన కొడుకు అయిన రామ్ చరణ్ సైతం పాన్ ఇండియాలో పెను సంచలనాన్ని క్రియేట్ చేస్తున్నాడు. మొదటి సినిమాతోనే తన సత్తా చాటుకున్న రామ్ చరణ్ రెండో సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేశాడు. ఇక తనను మించిన హీరో మరెవరు లేరు అనేంతలా పేరు ప్రఖ్యాతలను కూడా సంపాదించుకున్నాడు. అలాంటి రామ్ చరణ్ ఇప్పుడు ప్రపంచ స్థాయి ప్రేక్షకులను సైతం అలరించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో చేసిన ‘పెద్ది’ సినిమాలో అతను చాలా వరకు హార్డ్ వర్క్ చేసిన కూడా ఆ సినిమా మిక్స్డ్ టాక్ ను సంపాదించుకోవడంతో భారీ విజయం సాధించలేక పోయింది. ఇప్పటివరకు ఈ సినిమా 500 కోట్ల వరకు కలెక్షన్స్ ని రాబట్టిందనే వార్తలు వస్తున్నప్పటికి అందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయంలో కూడా సరైన క్లారిటి రావడం లేదు.

మొత్తానికైతే రామ్ చరణ్ కి ఇప్పుడు తత్వం బోధపడిందని చాలామంది చెబుతున్నారు. భారీ స్టార్ డమ్ ఉన్న హీరో డిఫరెంట్ అటెంప్ట్ చేయాలి. కానీ ఒక కమర్షియల్ హీరో ప్రయోగాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని సైతం కొంతమంది సినిమా మేధావులు రామ్ చరణ్ కి చెబుతున్నారు.

ఇక పెద్ది సినిమాతో ఇప్పుడు చేయబోయే స్క్రిప్ట్ విషయంలో తను చాలా జాగ్రత్తగా ఉండాలనే నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. గత సంవత్సరం గేమ్ చేంజర్ సినిమాతో బొక్క బోర్లా పడ్డ రామ్ చరణ్ ఇప్పుడు ఈ సినిమాతో కొంతవరకు పర్లేదు అనిపించిన కూడా తన రేంజ్ సక్సెస్ అయితే సాధించలేకపోయాడు.

ఇక సుకుమార్ డైరెక్షన్లో చేయబోతున్న సినిమా విషయంలో అయిన ఎలాంటి తప్పులు చేయకుండా ఉంటే బాగుంటుందని మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… వరుసగా రామ్ చరణ్ సక్సెస్ ను సాధిస్తేనే తను టాప్ లెవెల్ కి వెళ్తాడు. లేకపోతే తను చాలా వరకు డౌన్ అయిపోయే ప్రమాదమైతే ఉంది…

ఖమేనీ అంత్యక్రియలు.. మొజ్తబా వస్తారా..?

Khamenei funeral
Khamenei funeral

Khamenei funeral: ఇరాన్‌ మాజీ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీకి చివరి నివాళులు అర్పించేందుకు అవసరమైన సన్నాహాలు జరుగుతున్నాయి. జూలై 4 నుంచి 9 వరకు టెహ్రాన్‌లో ప్రారంభమయ్యే కార్యక్రమాలు ఖోమ్‌లో మతపరమైన నివాళులతో కొనసాగి, మష్హద్‌లోని పవిత్ర స్థలంలో ఖననంతో ముగుస్తాయి. ఈ నేపథ్యంలో కొత్త సుప్రీం లీడర్‌ బహిరంగ ప్రత్యక్షతపై ఆసక్తి నెలకొంది. అమెరికా–ఇజ్రాయెల్‌ దాడుల తర్వాత అత్యున్నత మతపరమైన పదవిని చేపట్టిన మొజ్తబా ఖమేనీ ఇప్పటివరకు ఒక్క బహిరంగ సభలోనూ పాల్గొనలేదు. దేశ ప్రజలను ఉద్దేశించి ఏ వీడియో సందేశం లేదా ఆడియో ప్రసంగం కూడా విడుదల చేయలేదు. దీంతో ఆయన నాయకత్వ సామర్థ్యం, అధికార నిర్వహణపై వివిధ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఆరోగ్యం, గాయాలపై ఊహాగానాలు
ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో మొజ్తబా ఖమేనీకి ముఖం, కాళ్లకు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. ఆ తర్వాత ఆయన ప్రజల ముందుకు రాకపోవడంతో ఆరోగ్య పరిస్థితి గురించి అనేక సందేహాలు ఎదురవుతున్నాయి. జూలై 4న టెహ్రాన్‌లో ప్రారంభమయ్యే అంత్యక్రియల్లో ఆయన హాజరవుతారా అనేది ప్రస్తుతం ప్రధాన ప్రశ్నగా మారింది.

ప్రపంచ నాయకుల హాజరు..
ఖమేనీ అంత్యక్రియలకు రష్యా, చైనా, టర్కీ, ఖతర్, ఇరాక్, లెబనాన్‌ వంటి దేశాల అధినేతలు లేదా ప్రతినిధులు హాజరు కావచ్చని సమాచారం. అమెరికా, ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంగా ఈ వేడుకలు అత్యంత సున్నితమైనవిగా మారాయి.

అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్‌ తన భద్రతా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేసింది. కీలక భవనాలు, అణు కేంద్రాలు, సైనిక స్థావరాల వద్ద అప్రమత్తత పెంచింది. ఈ నాయకత్వ మార్పులు మధ్యప్రాచ్య రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మహేష్ బాబు విషయంలో వాళ్ళు రాంగ్ గా ఆలోచిస్తున్నారా..?

Mahesh Babu
Mahesh Babu

Mahesh Babu: టైర్ వన్ హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. ఈయన ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీకే పరిమితమయ్యాడు. కానీ రాజమౌళితో చేస్తున్న ‘వారణాసి’ సినిమాతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. 1500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో మహేష్ బాబు తీవ్రమైన కసరత్తులు చేస్తున్నాడు… ఇక ఇదంతా చూస్తున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీ సైతం మహేష్ బాబు రేంజ్ మారబోతుంది అనే ఒక అంచనాలో ఉన్నారు. అయితే బాలీవుడ్ దర్శకులు కొందరు మహేష్ బాబుతో ఇప్పుడు సినిమాలు చేయడానికి అలాగే అతనికి కథలు వినిపించే ప్రయత్నం చేస్తున్నారట. ఇక మరికొంతమంది మాత్రం మహేష్ బాబును పట్టించుకోవడంలేదనే వార్తలు కూడా వస్తున్నాయి.

ఇక ఏది ఏమైనా కూడా వారణాసి సినిమా వచ్చిన తర్వాత మాత్రం మహేష్ బాబు రేంజ్ అయితే తప్పకుండా మారిపోతుంది. ఆయన ఇండియాలోనే టాప్ హీరోగా మారిపోతాడు. ప్రేక్షకులను సైతం మెప్పించి వాళ్ల మన్ననలను పొందే కెపాసిటి కూడా మహేష్ బాబుకి ఉంది. కాబట్టి ఆయనకి ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఆదరణ రాబోతుంది అనేది కూడా కీలకంగా మారబోతుంది.

ప్రస్తుతం మహేష్ బాబు చేస్తున్న సినిమాల విషయంలో ఆయన క్లారిటిని మెయింటైన్ చేస్తున్నప్పటికి పూర్తిగా ఆయన తన పంథా ను మార్చి రాబోయే సినిమాలతో డిఫరెంట్ సబ్జెక్టులను ఎంచుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక వారణాసి సినిమాలో 5 గెటప్పుల్లో నటిస్తున్న మహేష్ బాబు తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నారట. మొత్తానికైతే మహేష్ బాబు నటనలో చాలా వైవిధ్యాన్ని చూపిస్తాడనే విషయం మనందరికి తెలిసిందే…

ఇక తను 5 గెటప్పుల్లో కనిపించడం ఉంటే మామూలు విషయం కాదు. రాజమౌళి దగ్గరుండి మరి తనకు కావాల్సినట్టుగా హీరోలతో నటింపజేస్తున్నాడు. కాబట్టి మహేష్ బాబు తో సైతం అలాంటి నటనను తీసుకువచ్చే ప్రయత్నంలో రాజమౌళి బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది… రాజమౌళి ఈ సినిమాతో సక్సెస్ ను సాధిస్తే తన రేంజ్ కూడా మారిపోతుంది. ప్రపంచ స్థాయిలో ఉన్న హీరోలందరు అతనితో నటించడానికి ఆసక్తి చూపిస్తారు…

అయోధ్య విరాళాలు మాయం.. రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు

Ayodhya donations missing case
Ayodhya donations missing case

ayodhya donations scam : కోట్లాదిమంది హిందువుల విశ్వాసమైన రాముడికి అయోధ్యలో ఆలయ నిర్మాణంలో ఇచ్చిన విరాళాలు దారి మళ్లి పోయాయి. ఒకటి కాదు, రెండు కాదు కోట్ల సమ్మకు లెక్కలు లేకుండా పోయాయి. ఈ వ్యవహారం మొదట్లో చిన్నది అనుకున్నప్పటికీ.. తవ్వితీస్తుంటే భారీగా అక్రమాలు కనిపిస్తున్నాయి. తద్వారా ఇందులో ఒకరిద్దరు మాత్రమే కాదని.. చాలామందికి హస్తము ఉందని తెలుస్తోంది.

అయోధ్య విరాళాలకు సంబంధించి అక్రమాలకు పాల్పడిన వారిలో అను కల్ప్ మిశ్రా కీలక సూత్రధారి అని తెలుస్తోంది. ఇతడి బామ్మర్ది లవకుశ కూడా భారీగా వెనకేసుకున్నట్టు సమాచారం. వీరిది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బసవ గ్రామం. ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు విచారణ చేసినప్పుడు దిగ్బ్రాంతి కరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనుకల్ప్ భారీగా భవనాలను నిర్మించాడని.. విలాసవంతమైన వాహనాలను కొనుగోలు చేశాడని తెలుస్తోంది. పొలాలు.. స్థలాలు కొనుగోలు చేసినట్టు సమాచారం. అతడి బావమరిది లవకుశ కూడా భారీగా వెనకేసుకున్నట్టు తెలుస్తోంది.

అను కల్ప్ అక్రమ వ్యవహారాల గురించి అతని తాత రాజేంద్రప్రసాద్ పోలీసులు సమాచారం ఇచ్చాడు. గడచిన ఏప్రిల్ 30న అను కల్ప్ సొంత గ్రామంలో అత్యంత భారీ ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించాడు. దీనికి చంపత్ రాయ్ కూడా హాజరయ్యారు. తీర్ధ క్షేత్ర ట్రస్ట్ నుంచి కూడా భారీగా పెద్దలు హాజరయ్యారు. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడానికి అను కల్ప్ కు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి అని విషయం పట్ల సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అను కల్ప్ ఇటీవల అతి పెద్ద వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేశాడు. గత ఏడాది ఏకంగా 65 లక్షలు వెచ్చించి అయోధ్యలో అత్యంత భారీ ఇంటి నిర్మించాడు. గతంలో ఇతడు ఒక బ్యాంకులో ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగిగా పని చేసేవాడు. అతడు ఇంత సొమ్ము సంపాదించడానికి ప్రధాన కారణం అక్రమాలేనని తెలుస్తోంది. ఇతడి బామ్మర్ది లవకుశ మొదటిదాకా ఒక అద్దం ఇంట్లో ఉండేవాడు. ఇప్పుడు అతడు విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకున్నాడు. అందులో ఖరీదైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు.

వచ్చిన విరాళాలను నమోదు చేయకపోవడం.. బ్యాంకులో జమ చేసే డబ్బులలో ఎక్కువ నోట్లు పెట్టి.. ఆ తర్వాత బ్యాంకు వద్దకు వెళ్లకముందే ఆ నోట్లను తీసుకొని.. వీరు తమ జేబులో వేసుకునేవారు. అలా భారీగా డబ్బులు దోచుకున్నారు. బంగారు నగలు.. ఇతర ఖరీదైన కానుకలు కూడా వీరు తస్కరించారు. ఫలితంగా రాముడికి చెందకుండా.. విలువైన కానుకలు మొత్తం వీరి జేబుల్లోకి వెళ్లాయి.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మన స్టార్ హీరోలు మిస్ చేసుకున్న సినిమాలు ఇవేనా..?

Sekhar Kammula
Sekhar Kammula

Sekhar Kammula: తెలుగు సినిమా ఇండస్ట్రిలో డిఫరెంట్ టేస్ట్ ఉన్న దర్శకులలో శేఖర్ కమ్ముల ఒకరు. కెరీర్ మొదటి నుంచి కూడా ఆయన తను అనుకున్న పంథాలోనే సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రేక్షకులను తన దారిలోకి తీసుకొచ్చి సక్సెస్ లను సాధించడంలో ఆయన పూర్తిస్థాయిలో విజయాన్ని సాధించాడు. ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు…ఇక కెరియర్ స్టార్టింగ్ నుంచి కూడా శేఖర్ కమ్ముల కొత్త వాళ్లతోనో లేదంటే పెద్దగా ఇమేజ్ లేని హీరోలతో సినిమాలు చేస్తున్నాడు. మరి ఆయన స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం ఎందుకు అందుకోలేకపోతున్నాడు అంటూ గతంలోనే కొన్ని వార్తలైతే వచ్చాయి.

మొదటి నుంచి కూడా స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి కథలను వినిపించాడు. కానీ స్టార్ హీరోలకు తనపై నమ్మకం లేకపోవడంతో వాళ్ళు అతనికి సినిమాలు చేసే అవకాశమైతే ఇవ్వడం లేదు. మొదటగా గోదావరి, ఫిదా లాంటి సినిమాలను మహేష్ బాబుతో చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు.

కానీ ఆయన మాత్రం తనకు డేట్స్ ఇవ్వలేదు. ఇక లీడర్ సినిమాని నాగార్జునతో చేయాలని అనుకున్నప్పటికి అప్పుడు నాగార్జున బిజీగా ఉండటం వల్ల అతనికి డేట్స్ ఇవ్వలేకపోయాడు. ఇక దానికి తోడుగా రీసెంట్ గా మరో రెండు మూడు కథలతో సీనియర్ హీరోలతో సినిమాలను చేయాలని అనుకున్నప్పటికి వాళ్లు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదట.

గత సంవత్సరం వచ్చిన ‘కుబేర’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన ఇప్పుడు మరోసారి తన సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన ‘హ్యాపీ డేస్’ కి సీక్వెల్ ను తీయాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి తను అనుకున్నట్టుగానే ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకొని ప్రేక్షకులందరిలో ఒక చెరగని ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నాడట. ఇక రాబోయే రోజుల్లో శేఖర్ కమ్ముల స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం ఉందా లేదంటే కొత్త హీరోలతోనే సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను సాధిస్తాడా అనేది తెలియాల్సి ఉంది…

చిరంజీవి ఆ ఒక్క దర్శకుడిని వదిలేసి అందరిని నమ్ముతున్నాడు... కారణమేంటంటే..?

Chiranjeevi
Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలతో మరింత ముందుకు దూసుకెళ్లాలనే ప్రయత్నంలో ఉన్నాడు. 70 సంవత్సరాల పైబడిన వయసులో కూడా ఆయన యంగ్ హీరోలకు పోటీని ఇస్తున్నాడు అంటే మామూలు విషయం కాదు. తన లాంటి హీరో ఇండస్ట్రీలో మరొకరు ఉండరు అనేది వాస్తవం. ఇక ఏది ఏమైనా కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో చిరంజీవికి భారీ సక్సెసు లైతే రాలేకపోతున్నాయి. కారణం ఏంటి అంటే ఆయనలోని పూర్తి స్థాయి నటుడిని వాడుకునే దర్శకుడు అతనికి దొరకడం లేదు. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేటప్పుడు పూరి జగన్నాధ్ తో ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలైతే వచ్చాయి. కానీ అది కార్యరూపం దాల్చలేదు… ఇప్పటికే చిరంజీవి ఇండస్ట్రీలో ఉన్న యంగ్ డైరెక్టర్లకు సీనియర్ డైరెక్టర్లకు సైతం అవకాశాలను ఇస్తున్నాడు. కానీ పూరీ జగన్నాధ్ మాత్రం పట్టించుకోవడం లేదు. గతంలో చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చే క్రమంలో 150 సినిమాలు చేయడానికి పూరి జగన్నాధ్ చాలా వరకు సన్నాహాలు చేశాడు.

కానీ చిరంజీవి అతన్ని రిజెక్ట్ చేశాడు. దానికి తోడుగా రీమేక్ సినిమాను నమ్ముకొని వివి వినాయక్ కి అవకాశాన్ని ఇచ్చాడు. ఖైదీ నెంబర్ 150 సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ మంచి విజయాన్ని సాధించినప్పటికి చిరంజీవి నటనలోని వేరియేషన్స్ ను ఈ సినిమాలో చూపించలేకపోయింది… ఇక ఆ తర్వాత ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.

ఇక రీసెంట్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ మీద దండయాత్ర చేశాడు. ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు మరోసారి బాబీ డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత మరో ఇద్దరు కుర్ర దర్శకులతో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పుడప్పుడే పూరి తో సినిమాలు చేసే అవకాశామైతే లేనట్టుగా తెలుస్తుంది… పూరి సైతం ప్రస్తుతం ఫామ్ లో లేకపోవడం వల్ల చిరంజీవి అతనికి సినిమా ఇవ్వడం లేదని మరోసారి అతను సక్సెస్ లను సాధించి లైమ్ లైట్ లోకి వస్తే తప్పకుండా అతనికి అవకాశాలు వచ్చే ఛాన్స్ లు ఉన్నాయి అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు…

 

విజయ్ ప్రభుత్వం కూలడం ఖాయం... కౌంట్ డౌన్ స్టార్ట్..

tvk vijay government : అధికారంలో ఉన్న పార్టీ దానిని సుస్థిరం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అధికారం లేని పార్టీ దానిని దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఎవరి పనులు వారివే. ఎవరి లక్ష్యాలు వారివే. ఎవరి ఉద్దేశాలు వారివే. అయితే అధికారం అనేది విపరీతమైన స్వేచ్ఛను.. అంతకుమించిన సౌలభ్యాలను ఇస్తుంది. అందువల్లే రాజకీయ పార్టీలు అధికారం కోసం ఎన్ని అడ్డదారులైనా సరే తొక్కుతుంటాయి. విమర్శలు.. ఆరోపణలు.. వ్యూహాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చేస్తుంటాయి.

రాజకీయం అనేది ఒక పరమపద సోపానం లాంటిది. రెండు నిచ్చెనలు ఎక్కి పైకి చేరుకోగానే.. లాగేసే పాములు చాలా ఉంటాయి. అలాంటి పాములను చూసుకుంటూ జాగ్రత్తగా నిచ్చెనలు ఎక్కుతూ ఉండాలి. అలా కాకుండా నిర్లక్ష్యంగా ఉంటే పాములు లాగేస్తాయి.. అవసరమైతే కింద పడేసి తొక్కుతాయి. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. అందువల్లే అక్కడి పరిణామాలు ప్రతిరోజు జాతీయస్థాయి మీడియాలో కనిపిస్తున్నాయి. వినిపిస్తున్నాయి .

తమిళనాడులో ఈసారి ఏ పార్టీకి కూడా అధికారాన్ని సొంతంగా దక్కించుకునే స్థాయిని ప్రజలు ఇవ్వలేదు. పైగా ఈసారి ద్రావిడ రాజకీయాలకు భిన్నంగా అక్కడి ప్రజలు తీర్పు ఇచ్చారు. విజయ్ టీవీకే పార్టీ అధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ.. పొత్తులు కుదుర్చుకొని అధికారంలోకి వచ్చింది. అందువల్ల అక్కడ రాజకీయం రసవత్తరంగా మారుతుంది. ఇప్పటికే డిఎంకె అధినేత స్టాలిన్ టీవీకే ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది.. అంతేకాదు, టీవీకే పార్టీ ప్రభుత్వం కూలిపోతుందని.. కౌంట్ డౌన్ మొదలైందని.. ప్రజలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని స్టాలిన్ పిలుపునిచ్చారు. స్టాలిన్ ఇలా మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. విజయ్ ప్రభుత్వం కొలువుదిరిన తొలి రోజుల్లోనే స్టాలిన్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు.

జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం తమిళనాడులో ప్రభుత్వం కూలిపోతే డీఎంకే.. అన్నా డీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని తెలుస్తోంది. వాస్తవానికి విజయ్ కి కాంగ్రెస్, ఐయూఎంఎల్, కమ్యూనిస్టులు గనుక సపోర్ట్ చేయకపోతే కచ్చితంగా డీఎంకే, అన్నా డీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత టీవీ కే అధినేత విజయ్ చాకచక్యంగా అడుగులు వేయడంతో ఆ రెండు పార్టీల పొత్తుకు బ్రేక్ పడింది. ఒకవేళ స్టాలిన్ చెప్పినట్టుగా ప్రభుత్వం కూలిపోతే డీఎంకేకు అన్న డీఎంకే సపోర్ట్ చేస్తుందా.. ఇప్పటికే ఈ రెండు పార్టీలలో చీలికలు వచ్చాయి. కొంతమంది నేతలు విజయ్ కి బహిరంగంగానే మద్దతు పలుకుతున్నారు. అలాంటప్పుడు వారి సపోర్టు వీరికి ఏ విధంగా లభిస్తుంది.. ఐయూఎంఎల్.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు విజయ్ మంత్రి పదవులు ఇచ్చారు. పెద్దగా అసమ్మతి కూడా లేదు. అలాంటప్పుడు స్టాలిన్ విజయ్ ప్రభుత్వం కూలిపోతుందని ఎలా చెబుతారని టీవీకే నేతలు అంటున్నారు. వయసు మరలిపోయింది కాబట్టి.. స్టాలిన్ అలా మాట్లాడుతున్నారని టీవీ కె నేతలు ఎద్దేవా చేస్తున్నారు.

నాగ చైతన్య కెరీర్ హైయెస్ట్ కలెక్షన్స్ ని దాటేసిన 'మా ఇంటి బంగారం'.. 10 రోజుల్లో వచ్చిన గ్రాస్ ఎంతంటే..

Samantha warning to Naga Chaitanya
Samantha warning to Naga Chaitanya

Samantha vs Naga Chaitanya : ఒకే ఒక్క దెబ్బతో సమంత తనని విమాశ్రయించేవాళ్ల నోరు మూయించడం తో పాటు , వ్యక్తిగతంగా , కెరీర్ పరంగా ఎప్పుడూ చూడనంత సంతోషాన్ని చూసింది. ఆమెని అభిమానించే వాళ్లకు సమంత గూస్ బంప్స్ మూమెంట్స్ ఇచ్చింది అనే చెప్పాలి. పూర్తి వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గానే ఆమె ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రం చేసిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ జూన్ 19 న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ వసూళ్లను రాబడుతూ , ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురయ్యేలా చేసింది. ఈ ఏడాది ఇప్పటి వరకు విడుదలైన సినిమాల్లో , అత్యధిక లాభాలను రాబట్టిన ఏకైక సినిమాగా ఈ చిత్రం సరికొత్త రికార్డు ని నెలకొల్పింది. అందుకు కారణం ప్రీ రిలీజ్ బిజినెస్ తక్కువకి చేయడం వల్లే.

బయ్యర్స్ కి పెట్టిన ప్రతీ పైసాకు కేవలం 10 రోజుల్లోనే మూడింతల లాభాలను రాబట్టింది ఈ చిత్రం. ఇకపోతే ఈ సినిమాతో సమంత మరోసారి తాను అక్కినేని ఫ్యామిలీ కంటే చాలా పెద్ద స్టార్ అని నిరూపించుకుంది. ముఖ్యంగా తన స్టార్ స్టేటస్ నాగ చైతన్య ని మించినది అని సమంత ఈ చిత్రం తో అందరికీ అర్థం అయ్యేలా చేసింది. నాగ చైతన్య హీరో గా నటించిన ‘తండేల్’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 54 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు , 100 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి , ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. ఇక సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం కేవలం 10 రోజుల్లోనే 75 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. ఈ వీకెండ్ తో కచ్చితంగా 100 కోట్ల గ్రాస్ మార్కు ని దాటుతుందని మేకర్స్ బలంగా చెప్తున్నారు.

అదే కనుక జరిగితే ‘తండేల్’ మూవీ రికార్డు పోయినట్టే. ‘తండేల్’ చిత్రం లో హీరోయిన్ సాయి పల్లవి అనే విషయం అందరికీ తెలిసిందే. ఈమెకు కూడా ప్రత్యేకమైన స్టార్ స్టేటస్ ఉంది కాబట్టి , ‘తండేల్’ కలెక్షన్స్ సోలో నాగ చైతన్య సినిమా అనే లెక్కల్లోకి రాదు , కానీ ‘మా ఇంటి బంగారం’ మాత్రం సోలో సమంత మూవీ లెక్కల్లోకి వస్తుంది. అంతే కాదు , ఈ సినిమా షూటింగ్ సమయం లోనే ఆమె గర్భం దాల్చింది అట. అప్పట్లో సమంత , నాగ చైతన్య విడాకులకు కారణం ఆమె ప్రెగ్నన్సీ అయ్యేందుకు ఒప్పుకోకపోవడమే అని పెద్ద ప్రచారమే జరిగింది. కానీ ఇప్పుడు గర్భం దాల్చి తన తప్పేమి లేదని ప్రజలకు చెప్పకనే చెప్పింది. ఇలా తనపై ఉన్న రూమర్స్ కి చెక్ పెడుతూనే , మరోపక్క కెరీర్ పరంగా భారీ బ్లాక్ బస్టర్ ని అందుకొని లేడీ సూపర్ స్టార్ గా తన స్థానాన్ని పదిలం చేసుకుంది సమంత.

ప్రముఖుల భద్రతను కట్ చేసిన రేవంత్‌రెడ్డి.. అసలు కారణం ఇదే!

CM Revanth Reddy
CM Revanth Reddy

Revanth Reddy : తెలంగాణలో రెండు రోజులుగా భద్రత కుదింపు అంశంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మాజీ ఐపీఎస్, బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ సెక్యూరిటీని తెలంగాణ ప్రభుత్వం కుదించింది. దీంతో ప్రవీణ్‌కుమార్‌ను చంపాలని రేవంత్‌ సర్కార్‌ చూస్తోందని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ నేతలు కూడా దీటుగా సమాధానం ఇస్తున్నారు. నిబంధనల మేరకే సెక్యూరిటీ కుదించామని పేర్కొంటున్నారు. భయం ఉంటే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.

తగ్గిన మావోయిస్టుల ప్రభావం..
రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావం గణనీయంగా తగ్గిన నేపథ్యంలో
తెలంగాణ ప్రభుత్వం సుమారు 100 మంది ప్రముఖులకు అందిస్తున్న భద్రతను తొలగించాలని నిర్ణయించింది. ఈ చర్య భద్రతా వనరులను మరింత సమర్థవంతంగా వినియోగించడానికి తీసుకున్న నిర్ణయంగా చూడవచ్చు. రాష్ట్రంలో మావోయిస్టు సంస్థల ప్రభావం, కార్యకలాపాలు గత కొన్నేళ్లుగా బాగా తగ్గాయి. ఇది పోలీసు విభాగం చేపట్టిన వివిధ చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక ప్రజల సహకారం వల్ల సాధ్యమైంది. ఈ మార్పు కారణంగా ప్రభుత్వం కొంతమంది ప్రముఖులకు అందిస్తున్న అదనపు భద్రత అవసరం లేదని భావించింది.

భద్రతా తొలగింపు వివరాలు..
ప్రభుత్వం 100 మంది ప్రముఖులకు అందిస్తున్న బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలు, గన్‌మెన్‌లు వంటి సౌకర్యాలను ఉపసంహరించుకోవాలని అధికారులను ఆదేశించింది. ఇంతకు ముందు కొందరికి ‘‘వన్‌ ప్లస్‌ వన్‌’’ స్థాయి భద్రత ఉండగా, మరికొందరికి ‘‘టూ ప్లస్‌ టూ’’ స్థాయి భద్రత ఉండేది. ఇప్పుడు ఈ సౌకర్యాలను తగ్గించాలని నిర్ణయించారు. ఈ కొత్త నిబంధనలు జులై 1 నుంచి అమలులోకి రానున్నాయి.

ప్రస్తుత భద్రతా వ్యవస్థ..
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం దాదాపు 600 మంది ప్రముఖులకు వివిధ స్థాయిల్లో భద్రత అందిస్తోంది. ఈ జాబితాలో రాజకీయ నాయకులు, మాజీ మంత్రులు, ఇతర ముఖ్య వ్యక్తులు ఉన్నారు. మావోయిస్టు ముప్పు తగ్గినందున ఈ జాబితాను సమీక్షించి, అవసరం లేని వారికి భద్రతను తగ్గించడం ద్వారా ప్రభుత్వం వనరులను ఆదా చేయాలని చూస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర భద్రతా పరిస్థితిలో మెరుగుదలను సూచిస్తుంది. మావోయిస్టు సమస్యను ఎక్కువగా అదుపులో ఉంచినందున భద్రతా వనరులను ఇతర ముఖ్యమైన అవసరాలకు మళ్లించవచ్చు. అయితే ఈ తొలగింపు కొందరు ప్రముఖుల్లో ఆందోళన కలిగించే అవకాశం ఉంది. అదే సమయంలో ఈ చర్య ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. భద్రతా సిబ్బందిని, వాహనాలను మరింత అవసరమైన ప్రాంతాలకు ఉపయోగించవచ్చు. అయితే భద్రత తొలగించిన వారి వ్యక్తిగత భద్రతా పరిస్థితిని కూడా ప్రభుత్వం నిరంతరం సమీక్షించాల్సిన అవసరం ఉంది.

వివేక్ ఆత్రేయ విషయంలో వెనకడుగు వేస్తున్న స్టార్ హీరోలు... కారణం ఏంటంటే...

Vivek-Athreya
Vivek-Athreya

Vivek Athreya Movies : తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇప్పటివరకు చాలామంది స్టార్ హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు. ఇక దర్శకులు సైతం వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి ని సంపాదించి పెట్టుకోవడమే లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తున్నారు. యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ సైతం ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. కెరియర్ మొదటి నుంచి కూడా స్క్రీన్ ప్లే మీద ఎక్కువ ఫోకస్ చేసి సినిమాలను చేస్తున్న ఆయన ఇప్పుడు మాత్రం స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. కెరియర్ మొదటి నుంచి కూడా ఆయన శ్రీ విష్ణు, నాని లాంటి హీరోలతోనే సినిమాలు చేశాడు. కానీ ఇప్పుడు బాలయ్య బాబు కి కథనైతే వినిపించాడు. కానీ బాలయ్య ఆ కథను రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక దాంతో కోలీవుడ్ స్టార్ హీరో అయిన సూర్యతో వివేక్ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. ఇక ప్రస్తుతం సూర్య కూడా తెలుగు దర్శకుల మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. మన వాళ్లతో సినిమాలు చేయడానికి ఆయన ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇప్పటికే వెంకీ అట్లూరి డైరెక్షన్ లో విశ్వనాధ్ అండ్ సన్స్ అనే సినిమాని చేస్తున్న ఆయన ఇప్పుడు వివేక్ ఆత్రేయకి సైతం డేట్స్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. తెలుగులో ఉన్న స్టార్ హీరోలు అతన్ని పట్టించుకోకపోవడానికి గల కారణం ఏంటి అంటే ఆయన ఇప్పటివరకు చిన్న సినిమాలను చేశాడు.

అలాగే పెద్ద హీరోల ఇమేజ్ ను హ్యాండిల్ చేయగలిగే కెపాసిటి అతనికి ఉందా? లేదా అనే ధోరణిలోనే మన వాళ్ళు చాలా రకాలుగా ఆలోచిస్తున్నారని వాళ్ళకంటూ ఒక క్లారిటి వస్తే మాత్రం మన హీరోలు సైతం అతనికి డేట్స్ ఇస్తారని ఆ విషయంలో తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకుంటున్నా క్రమంలో మన తెలుగు దర్శకులు మాత్రం అతన్ని పట్టించుకోవడం లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక వివేక్ ఆత్రేయ తను చేయబోయే సినిమాతో ఎలాంటి పెను సంచలనాన్ని క్రియేట్ చేస్తాడనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

 

'గాడ్ ఆఫ్ వార్' అప్డేట్ ఏంటి..? ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సాయంత్రం రెడీగా ఉండండి..

ntr-god-of-war-movie-update-official-announcement-today-evening

NTR God Of War : జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. కెరియర్ మొదట్లోనే మాస్ హీరోగా అవతరించిన ఆయన ఆ తర్వాత చేసిన సినిమాలతో కొంతవరకు ప్లాప్ లను ముట్టగట్టుకున్నాడు. అయినప్పటికి ఆయన ఎక్కడా తడబడకుండా వరుస సక్సెస్ లను సాధించాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు. టైర్ వన్ హీరోల్లో తను కూడా ఒకడిగా వెలుగొందుతుండటం విశేషం… ఇక జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గాడ్ ఆఫ్ వార్ ‘ అనే సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాతో ఎలాగైనా సరే తన సత్తా ఏంటో చూపించాలనే ప్రయత్నంలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు.

తను అనుకున్నట్టుగానే త్రివిక్రమ్ ఈ సినిమాని ఎన్టీఆర్ తో చేస్తున్నాడా? లేదంటే అల్లు అర్జున్ తో చేయబోతున్నాడా అనే విషయంలో సరైన క్లారిటి అయితే రావడం లేదు. మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఈ సినిమా ఎన్టీఆర్ తోనే చేస్తున్నారు అంటూ ఒక క్లారిటి కి వచ్చేశారు. తాజాగా దీనిపై అప్టేట్ వచ్చింది.

ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా నుంచి నేడు సాయంత్రం 5:04 గంటలకు అధికారిక ప్రకటన విడుదల కానుంది. ఈ విషయాన్ని నిర్మాత నాగవంశీ తన X ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ అనౌన్స్‌మెంట్‌ను Jr. NTR అధికారిక ట్విటర్ (X) అకౌంట్ నుంచి విడుదల చేయనున్నట్లు తెలిపారు. ‘అరవింద సమేత వీరరాఘవ’ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్–ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడం, అలాగే కుమారస్వామి కథతో తెరకెక్కనుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమాని నిర్మించబోతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలతో పెద్దగా సక్సెస్ లనైతే సాధించలేకపోతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకొని టాప్ డైరెక్టర్ గా మారాల్సిన అవసరమైతే ఉంది. లేకపోతే మాత్రం ఆయన చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు…

ఇక మొత్తానికైతే ఈ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ ను ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానులు తీవ్రంగా సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ పోస్టర్ కూడా చాలా అద్భుతంగా ఉండడంతో గాడ్ ఆఫ్ వార్ సినిమా ఎన్టీఆర్ తోనే ప్రకటించబోతున్నారు అనే విషయం పైన ప్రతి ఒక్కరికి క్లారిటి వచ్చింది…

పవన్ కళ్యాణ్ ను సీఎం గా చూడాలని అదిరిపోయే కథ రెడీ చేసిన స్టార్ డైరెక్టర్...

Pawan Kalyan CM Seat Pressure
Pawan Kalyan CM Seat Pressure

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చాలామంది దర్శకులు సినిమాలు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆచితూచి ముందుకు అడుగులు వేస్తున్నాడు. ఈ సంవత్సరం ఇప్పటికే హరీష్ శంకర్ దర్శకత్వంలో చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఫ్లాప్ అయింది. దాంతో రాజకీయ రంగంలో ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో కూడా తన అభిమానుల్లో నిరాశపరచకూడదనే ఉద్దేశ్యంతో అవకాశం దొరికిన ప్రతిసారి మంచి కథలతో సినిమాలు చేయాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఆయన సురేందర్ రెడ్డి తో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికి ఆ మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుందనే విషయంలో సరైన క్లారిటి రావడం లేదు. ఇక డైరెక్టర్ సుజీత్ సైతం ఓజీ 2 ఉంటుందంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. దాంతో ఈ సినిమా షూటింగ్ లో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. ఇక మరో దర్శకుడు పవన్ కళ్యాణ్ సీఎం గా చూపించడానికి ఒక అద్భుతమైన కథ కూడా రాసుకున్నారట. మరి ఆ డైరెక్టర్ కి పవన్ కళ్యాణ్ సినిమా చేసే అవకాశాన్ని ఇస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…

ఇంతకీ ఆ దర్శకుడు ఎవరంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న శంకర్ కావడం విశేషం… ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా ఆయన చాలావరకు ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఇంతకుముందు ఆయన రామ్ చరణ్ తో ‘గేమ్ చేంజర్’ అనే సినిమా చేశాడు.

ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తానని అనుకున్నాడు కానీ ఆ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో శంకర్ భారీ విమర్శలనైతే మూటగట్టుకున్నాడు. దాంతో అతనితో సినిమాలు చేయడానికి ఎవరు ఆసక్తి చూపించడం లేదు. కానీ అతను పవన్ కళ్యాణ్ తో మాత్రం ఒక అదిరిపోయే కథతో సినిమా చేస్తానని చెబుతున్నాడు. ఒకప్పుడు ఒకే ఒక్కడు మూవీ తో సంచలనాన్ని క్రియేట్ చేసిన ఆయన ఇప్పుడు మరోసారి అలాంటి పాయింట్ తో వచ్చి సూపర్ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు.

ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో అలాంటి సినిమా చేస్తానని తన సన్నిహితుల దగ్గర చెబుతున్నారట. అలాగే పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తే తన కథను కూడా వినిపించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది… వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

మనదేశంలో ఒకరికి ముగ్గురున్నారట.. సర్వేలో దిమ్మతిరిగే నిజాలు

Fake Relationships
Fake Relationships

Relationship Survey : ఇటీవల కాలంలో మీడియాలో వార్తలు చూస్తే.. పేపర్లో పేజీలు తిరిగేస్తుంటే.. వివాహేతర సంబంధాల గురించి వార్తలు చూస్తూనే ఉన్నాం. అనైతికమైన బంధాల వల్ల జరిగే దారుణాల గురించి వింటూనే ఉన్నాం. వాటి వల్ల ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి.. ఎన్ని దారుణాలు చోటుచేసుకుంటున్నాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ జనాలు మారడం లేదు. కనీసం వాటిని తప్పు కూడా అనుకోవడం లేదు. మనుషుల్లో నైతికత కోల్పోవడంతో ఇటువంటి చాటుమాటు వ్యవహారాలు సాగిపోతున్నాయి.

మనుషుల్లో అనైతికమైన బంధాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇండిపెండెంట్ ఏజెన్సీ గ్లోబల్ పాపులేషన్ రివ్యూ అనే సంస్థ ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో దారుణమైన నిజాలు వెలుగు చూసాయి. మొత్తంగా 50 దేశాలలో ఈ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచ సగటు తొమ్మిదిగా తేలింది. ఈ జాబితాలో టర్కీ మొదటి స్థానంలో నిలిచింది. ఈ దేశంలో ఒక వ్యక్తి 14.5 మంది భాగస్వాములను కలిగి ఉన్నాడని తేలింది. ఇది కేవలం సగటు మాత్రమే. టర్కీ తర్వాత ఆస్ట్రేలియా 13.3 మంది.. న్యూజిలాండ్ 13.2 మంది భాగస్వాములతో మిగతా స్థానంలో నిలిచాయి. ఐస్లాండ్ 13.0.. దక్షిణాఫ్రికా 12.5.. ఫిన్లాండ్ 12.4.. నార్వే 12.1, ఇటలీ 11.8.. స్వీడన్ 11.8.. స్విట్జర్లాండ్ 11.1 భాగస్వాములను కలిగి ఉన్నాయి..

ఈ జాబితాలో అమెరికా 10.7తో 12 స్థానంలో ఉంది.. ఇంగ్లాండ్ 9.8 సగటుతో 21 స్థానంలో ఉంది. అయితే అమెరికాలో అందరూ పత్తితులు కాదు. ప్రాంతాన్ని బట్టి ఈ సంఖ్య మారింది. లూసియాన్న రాష్ట్రంలో ఏకంగా ఈ సంఖ్య 10.7 గా ఉంది. ఇక యుట రాష్ట్రంలో ఈ సగటు 2.6 గా మాత్రమే ఉంది. ఎందుకంటే ఇక్కడ సంప్రదాయాలను పాటిస్తారు. ఇక ఆశ ఖండంలో ముఖ్యంగా మనదేశంలో ఈ సంఖ్య తక్కువగా ఉంది. ఈ జాబితాలో చివరి స్థానంలో ఉంది. భారతీయులు తమ జీవితకాలంలో సగటున కేవలం ముగ్గురు మాత్రమే లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. కుటుంబ సాంప్రదాయాలు.. వివాహ వ్యవస్థ.. కట్టుబాట్లు వంటి వాటి ద్వారా భారత్ ఈ స్థానంలో ఉంది. పెళ్లికి ముందు లైంగిక వ్యవహారాలు భారత్ లో నిషేధం. సమాజం కూడా వీటిని ఆమోదించదు. అందువల్లే మనదేశంలో ఇలాంటి పరిస్థితి ఉంది. ఆసియాలో మిగతా దేశాల్లో కూడా ఇటువంటి విధానాల కొనసాగుతున్న అని తెలుస్తోంది. ఆసియా ఖండంలో హాంకాంగ్ లో 3.7.. వియత్నాంలో 3.2 , చైనాలో 3.2 తమ జీవితకాలంలో అక్కడి ప్రజలు లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నట్టు తెలుస్తోంది.