Homeఎంటర్టైన్మెంట్Jr NTR God of War : ఎన్టీఆర్ 'గాడ్ ఆఫ్ వార్' మూవీ ఫస్ట్...

Jr NTR God of War : ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది..ఇది కదా మాస్ అంటే..

Jr NTR God of War : పాన్ ఇండియా లెవెల్ లో ప్రస్తుతం ఫాంటసీ , పురాణాల స్టోరిలకు ఏ రేంజ్ డిమాండ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా మన టాలీవుడ్ ఆడియన్స్ ఇలాంటి సినిమాల కోసం ఎప్పటి నుండో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు మనం శ్రీ మహావిష్ణువు , రాముడు , శ్రీకృష్ణుడు ,పరమశివుడు, సాయి బాబా , జీసస్, వినాయకుడు స్టోరీలను వెండితెర పై చూసాము. కానీ కార్తికేయ స్వామి […]

Jr NTR God of War : పాన్ ఇండియా లెవెల్ లో ప్రస్తుతం ఫాంటసీ , పురాణాల స్టోరిలకు ఏ రేంజ్ డిమాండ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా మన టాలీవుడ్ ఆడియన్స్ ఇలాంటి సినిమాల కోసం ఎప్పటి నుండో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు మనం శ్రీ మహావిష్ణువు , రాముడు , శ్రీకృష్ణుడు ,పరమశివుడు, సాయి బాబా , జీసస్, వినాయకుడు స్టోరీలను వెండితెర పై చూసాము. కానీ కార్తికేయ స్వామి జీవిత చరిత్ర మాత్రం ఇప్పటి వరకు మనం చూడలేదు. ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ కూడా ఈ దేవుడి పై సినిమాలు కానీ , సీరియల్స్ కానీ తీయలేదు. ఈయన మహత్యల ఆధారంగా సినిమాలు వచ్చాయి కానీ , ఈయన జీవిత చరిత్ర మీద మాత్రం సినిమా రాలేదు. అందుకే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పాన్ ఇండియా లెవెల్ లో ఈ కార్తికేయ స్వామి జీవిత చరిత్రకు సంబంధించి ఒక కథ ని రెడీ చేశారు.

ఈ చిత్రాన్ని ముందుగా ఎన్టీఆర్ తోనే చెయ్యాలని అనుకున్నారు , ఆ తర్వాత అల్లు అర్జున్ కి షిఫ్ట్ అయ్యింది , ఇప్పుడు మళ్లీ చేతుల్లోకి వచ్చింది. కాసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన జరిగింది. ‘శివ పుత్రుడు, పార్వతీ మాత గర్వం, తిరుగులేని కమాండర్’ అంటూ ఎన్టీఆర్ పవర్ ఫుల్ పదాలను ఉపయోగిస్తూ , ఈ చిత్రానికి సంబంధించిన థీమ్ పోస్టర్ ని విడుదల చేశారు. ఈ పోస్టర్ లో కార్తికేయ స్వామి చేతిలో ఉండే ఆయుధాన్ని మనం చూడొచ్చు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో జూనియర్ ఎన్టీఆర్ కి ఇది రెండవ చిత్రం. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ తెరకెక్కిన ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో అందరికీ తెలిసిందే.

మళ్లీ ఇన్నాళ్లకు వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఈ చిత్రం తెరకెక్కబోతుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తారని అంతా అనుకున్నారు , కానీ అనిరుద్ సంగీతం అందించనున్నారు. ‘దేవర’ తర్వాత ఎన్టీఆర్ సినిమాకు ఆయన పని చేయబోతుండడం తో అభిమానుల్లో అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటి వరకు మన టాలీవుడ్ స్టార్ హీరోల్లో పవన్ కళ్యాణ్ , ప్రభాస్ వంటి వారు మాత్రమే దేవుళ్ళు గా కనిపించారు. ఇప్పుడు ఎన్టీఆర్ కనిపించబోతున్నారు , సరిగ్గా తీస్తే ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 2000 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పురాణాలపై అపార జ్ఞానం ఉన్నటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని ఎలా తీయబోతున్నాడో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper