Home Blog Page 42

సుకుమార్ - రామ్ చరణ్ మూవీ మైథాలజికల్ థ్రిల్లర్ గా రాబోతోందా..?మెగా పవర్ స్టార్ ఆ దేవుడిలా కనిపిస్తాడా..?

Ram Charan And Sukumar
Ram Charan And Sukumar

Ram Charan And Sukumar: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఈ మధ్యకాలంలో ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోతున్నాయి. రీసెంట్ గా ఆయన బుచ్చిబాబు దర్శకత్వంలో చేసిన ‘పెద్ది’ సినిమా ప్రేక్షకులను ఆశించిన మేరకు మెప్పించకపోయిన కూడా ఆయన కష్టమైతే వృధాగా పోలేదు. ఆయన ఆ సినిమా కోసం ఎంతలా కష్టపడ్డాడో స్క్రీన్ మీద చూసే ప్రతి ఒక్కడికి కనిపిస్తోంది. సుకుమార్ తో చేయబోతున్న సినిమా విషయంలో కూడా ఆయన విపరీతంగా కష్టపడబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా ఒక మైథలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతుందట. ఇప్పటివరకు ఉన్న ప్రతి హీరో కూడా మైథిలాజికల్ టచ్ ఉన్న సినిమాలతోనే ముందుకు సాగుతున్నారు. ప్రభాస్ కల్కి మూవీలో కర్ణుడిగా కనిపిస్తే మహేష్ బాబు వారణాసిలో రాముడిగా, గాడ్ ఆఫ్ వార్ మూవీలో ఎన్టీఆర్ కుమారస్వామి గా కనిపించబోతున్నాడు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ కూడా పరశురాముడి కనిపించబోతున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి. సుకుమార్ సినిమాలో పరుశురాముడి క్యారెక్టర్ చాలా కీలకపాత్ర వహించబోతుందట. దాన్ని బేస్ చేసుకొనే కథలు రాసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ మూవీలో రామ్ చరణ్ కొద్దిసేపు పరుశురాముడి క్యారెక్టర్ లో కనిపించి మెప్పించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది…

పురాణాల్లో పరుశురాముడి కి చాలా మంచి పేరైతే ఉంది. తనని నమ్ముకున్న వాళ్ళ కోసం రాజా వంశస్థుల యొక్క గర్వాన్ని అణిచివేయడానికి ఆయన ముల్లోకాలు తిరిగి రాజు అనే వాడు లేకుండా ప్రతి ఒక్కరిని నరికి చంపాడు. అలాంటి ఒక వీరత్వం గల రాముడి క్యారెక్టర్ లో రామ్ చరణ్ కనిపించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.

ఇక ఓవరాల్ గా ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందనే విషయం పక్కన పెడితే మైథాలాజికల్ టచ్ తో పరుశురాముడి కథను బేస్ చేసుకొని సినిమా సాగబోతుందట. ఈ మూవీలో రామ్ చరణ్ ఎంతసేపు పరాశరముడిగా కనిపించబోతున్నాడు.

ఈ స్టోరీ మైథాలాజికల్ కథతో ముడిపడి ఉండడానికి గల కారణం ఏంటి అనే విషయాలు తెలియాలంటే సుకుమార్ ఈ విషయం మీద స్పందించాల్సిన అవసరమైతే ఉంది. తొందరలోనే సినిమాకి సంబంధించిన కథను కూడా సుకుమార్ రివిల్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది…

'లెనిన్' మూవీ చూసి హిట్టో? ఫట్టో? చెప్పేసిన స్టార్ డైరెక్టర్...

Lenin Movie Collections
Lenin Movie Collections

Lenin Movie: అక్కినేని అఖిల్ హీరోగా చేసిన చాలా సినిమాలు అతనికి నిరాశను మిగిల్చాయి. ఆయన ఇండస్ట్రీకి వచ్చి 10 సంవత్సరాల పైన అవుతున్నప్పటికి ఇప్పటివరకు సరైన సక్సెస్ ని సాధించలేదు. ఇక ఈనెల 10వ తేదీన లెనిన్ సినిమాతో మరోసారి ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో అఖిల్ ఉన్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా? ప్రేక్షకులను మెప్పించగలుగుతుందా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను శరవేగంగా నిర్వహిస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ ను కనక మనం చూసినట్లయితే అందులో అఖిల్ యాక్టింగ్ చాలా అద్భుతంగా ఉంది అనిపించేలా కనిపించింది. ఇక మొత్తానికైతే ఈ సినిమాలో తన పాత్ర ఓవరాల్ గా ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో చర్చనీయాంశంగా మారింది. ఇక రీసెంట్ గా ఈ సినిమాని కొంతమంది సినిమా ప్రముఖులైతే చూశారు. ఇక ఇప్పటికే ఫస్ట్ కాపీ వచ్చేసింది.

కాబట్టి ఈ సినిమాని కొంతమంది సినిమా ప్రముఖుకులకైతే చూపించారు. అందులో కొంతమంది స్టార్ డైరెక్టర్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ సౌత్ ఈ సినిమాని చూశారట. త్రివిక్రమ్ ఈ సినిమా మీద కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేసినట్టుగా తెలుస్తుంది.

అందులో ఒకటి రెండు చిన్న మార్పులను చెప్పిన త్రివిక్రమ్ ఈ సినిమాతో అఖిల్ ప్రేక్షకులను విశేషంగా మెప్పిస్తాడు అంటూ కొన్ని కామెంట్లు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా అఖిల్ లాంటి హీరో ఇప్పటి వరకు ఒక్క సక్సెస్ లేకుండా ఇన్ని సంవత్సరాల పాటు తన మనుగడను ఎలా కొనసాగిస్తున్నాడు అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే లెనిన్ సినిమా తన మీద విమర్శలు చేసేవారికి సమాధానం చెబుతుందంటూ మరికొంతమంది అఖిల్ అభిమానులు సైతం సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇక లెనిన్ సినిమా అతను అనుకున్న సక్సెస్ ని కట్టబెడుతుందా? తనని స్టార్ హీరోగా మారుస్తుందా? లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…

జగన్ కరెక్ట్ గానే.. తేల్చుకోవాల్సింది ప్రజలే

Jagan Mohan Reddy
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్మోహన్ రెడ్డి రాజధానుల విషయంలో స్పష్టంగా తన స్టాండ్ ను తెలియజేశారు. బంతి ప్రజల కోర్టులో విడిచిపెట్టారు. ఇక తేల్చుకోవాల్సింది ఏపీ ప్రజలే. మావిగన్ అనేది తమ అభిమతమని.. వచ్చే ఎన్నికలు అమరావతి వర్సెస్ మావిగన్ అనే ఎజెండాతో జరుగుతాయని.. చంద్రబాబు అమరావతికి మద్దతు తెలిపితే కూటమికి.. మావిగన్ కు మద్దతు తెలిపితే వైసీపీకి ప్రజలు ఓట్లు వేస్తారని తేల్చి చెప్పారు జగన్. నిజంగా జగన్మోహన్ రెడ్డి పెద్ద సాహసమే చేశారు. తన మావిగన్ ప్రతిపాదన ఏపీ ప్రజలకు నచ్చిందని భావిస్తున్నారు.

* సాహస ప్రకటన..
ముసుగులో గుద్దులాటలు లేకుండా జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయాన్ని ప్రకటించారు. మావిగన్ అనేది తమ రాజధానిగా చెప్పుకొచ్చారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో సైతం పొందుపరుస్తామని తేల్చి చెప్పారు. ఈ నిర్ణయం ప్రకటించడం పెద్ద సాహసం. ఎప్పటికే రాజధానులను మారుస్తున్నారు అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఒక విమర్శ ఉంది. అమరావతిని వ్యతిరేకించి మూడు రాజధానులు అన్నారు. ఇప్పుడు మావిగన్ ఫైనల్ అంటూ మాట్లాడుతున్నారు. నిజంగా దీని ప్రభావం ఏపీ పై పడుతుంది. విద్యాధికులతో పాటు తటస్తులు వైసీపీ వైఖరి పై వ్యతిరేకంగా ఉన్నారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఈ ప్రకటన చేయడం సాహసమే.

* లెక్కచేయని వైనం..
ఒక్క మాటలో చెప్పాలంటే అమరావతిని నిర్వీర్యం చేస్తాం అని జగన్మోహన్ రెడ్డి చెప్పకనే చెప్పారు. ఎన్ని భవనాలు కట్టినా నేలమట్టం చేసి.. మావిగన్ ను అభివృద్ధి చేస్తాం అన్నది జగన్ మాట. 50 వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతుల మాట ఏంటి? 50 వేల కోట్ల రూపాయల రుణం మాట ఏంటి? అంటే తెలియని పరిస్థితి. దాదాపు 15 సంవత్సరాల పాటు రాష్ట్రానికి రాజధాని లేకుండా ఉండడం అంటే దాని వెనుక జగన్ వైఫల్యమే కనిపిస్తోంది. ఆయన ప్రజల్లో ఒక రకమైన విభజన రేఖ తేవాలని ప్రయత్నిస్తున్నట్టు ఉంది. కానీ అమరావతి రాజధాని విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతున్న జగన్మోహన్ రెడ్డి లెక్క చేయకపోవడం ఆ పార్టీ శ్రేణులనే ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.

* మళ్లీ రాజధాని వివాదం..
ఒక రాష్ట్రానికి రాజధాని అవసరమే. కానీ రాజధాని వివాదం అనేది ఎన్ని రోజులు. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. ఏకాభిప్రాయంతో అమరావతి ప్రతిపాదన జరిగింది. కానీ దానికి జై కొట్టారు జగన్. తరువాత మాట మార్చి మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారు. అయినా కట్టలేకపోయారు. ఇప్పుడు మావిగన్ అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో అమరావతిపై జగన్మోహన్ రెడ్డికి ఉన్న ద్వేషం ఎప్పటికప్పుడు బయటపడుతోంది. కానీ వైసీపీలో మాత్రం ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఆ పార్టీ నేతలు తాము అమరావతికి వ్యతిరేకం కాదు అని తేల్చి చెబుతున్నారు. మొన్నటికి మొన్న అమరావతి రైతులకు మద్దతుగా పరామర్శకు వెళితే ప్రతిఘటన ఎదురయింది వారికి. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మావిగన్ ప్రతిపాదన తీసుకొచ్చి రాజధాని రాజకీయం అంశాన్ని సజీవంగా ఉంచారు. ఒక రాష్ట్ర పాలన అంటే కేవలం రాజధాని అన్నట్టు పుష్కరకాలంగా ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. ఒకవైపు అమరావతిలో శాశ్వత నిర్మాణాలు కొనసాగుతుండగా.. ఇప్పుడు జగన్ మావిగన్ ను బలపరచడం చూస్తుంటే మాత్రం ఆయన లో ఉన్న రాజకీయ విధ్వంస ఆలోచనను బయట పెట్టింది.

త్రివిక్రమ్ మీద సీరియస్ గా ఉన్న అల్లు అర్జున్...

Allu Arjun
Allu Arjun

Allu Arjun: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దర్శకుడు సైతం ప్రస్తుతం విభిన్న తరహాలో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఒకప్పుడు ఆయన నుంచి వచ్చే సినిమాలు కామెడీ యాక్షన్ జానర్ లో ఉండేవి. ఆ సినిమాలన్నీ అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చి పెట్టాయి. ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం వెంకటేష్ తో చేస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా విషయంలో ఆయన చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించి ఎలాగైనా తన మార్క్ ను చూపించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే త్రివిక్రమ్ – జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ‘గాడ్ ఆఫ్ వార్’ అనే సినిమా రాబోతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాని రీసెంట్ గా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దాంతో ఈ సినిమా మీద ప్రేక్షకులకు విశేషమైన అంచనాలైతే ఏర్పడ్డాయి. ఇక ఇంతకుముందు ఇదే సబ్జెక్టుని త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో చేయాలని అనుకున్నాడు.

కానీ అల్లు అర్జున్ బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాను ఎన్టీఆర్ తో చేస్తున్నట్టుగా ప్రకటించాడు. ఇక దీంతో అల్లు అర్జున్ చాలావరకు త్రివిక్రమ్ మీద సీరియస్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. కారణం ఏంటి అంటే తనకోసం రాసుకున్న కాన్సెప్ట్ ను వేరే హీరోతో ఎలా చేస్తారు. నేను కమిటైన సినిమాలు పూర్తయిన తర్వాత మీకు డేట్స్ ఇస్తానని చెప్పాను కదా అంటూ త్రివిక్రమ్ మీద కొంత వరకు ఫైర్ అయినట్టుగా తెలుస్తుంది.

ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న హీరోలందరు వాళ్ల స్టార్ట్ డమ్ ను విస్తరించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. కాబట్టి ఏ ఒక్క మంచి సినిమాను మిస్ చేసుకున్నా కూడా వాళ్ళ ఇమేజ్ పడిపోయే ప్రమాదం ఉంది. అందుకే త్రివిక్రమ్ తో సినిమా చేస్తే మినిమం గ్యారంటీగా ఆడుతుందనే ఉద్దేశ్యం ప్రతి ఒక్కరికి ఉంది.

కాబట్టి అల్లు అర్జున్ ఈ సినిమాని మిస్ చేసుకోవడం ఇష్టం లేక త్రివిక్రమ్ మీద సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక వీళ్ళ కాంబోలో మరో సినిమా వచ్చే అవకాశం ఉందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటివరకైతే అల్లు అర్జున్ తో మూడు సినిమాలను చేసి మూడు బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందించిన ఘనత కూడా త్రివిక్రమ్ కే దక్కింది…

ఈ ఐదు రాశుల వారికి ఈరోజు అపారమైన ధన లాభం..

Today July 2 2026 Horoscope
Today July 2 2026 Horoscope

Today July 2 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై ఉత్తరాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు గతంలో కంటే ఇప్పుడు ఆదాయం పెరుగుతుంది. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈ రోజు పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. కొత్తగా ప్రాజెక్టులు చేపట్టే వారికి ఇదే మంచి సమయం. స్నేహితుల నుంచి సహకారం ఉండడంతో అప్పుల నుంచి బయటపడతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఉద్యోగులకు తోటి వారి సహకారం ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు లాభాలు ఉంటాయి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు అనేక రంగాల్లో కలిసి వస్తుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల ముఖ్యమైన పనులను పూర్తి చేసుకుంటారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వ్యాపారులు ఈరోజు కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతారు. గతంలో కంటే ఇప్పుడు ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల సపోర్టు ఉంటుంది. దీంతో పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఇదే మంచి సమయం. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు అపారమైన ప్రయోజనాలు కలిగి అవకాశం ఉంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. నిరుద్యోగులకు అవకాశాలు ఏర్పడతాయి. కొత్తగా ఉద్యోగం మారాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. మానసికంగా బలంగా ఉండడంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. విద్యార్థులకు గురువుల మద్దతు ఉండడంతో పోటీ పరీక్షల్లో రాణిస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.

కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు జాగ్రత్తగా ఖర్చులు చేయాలి. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. కొత్తగా పెట్టుబడును పెట్టడానికి ఇదే మంచి సమయం. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులను కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు అవకాశాలు ఉంటాయి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. గతంలో కంటే ఇప్పుడు అప్పుల నుంచి బయటపడతారు. ఉద్యోగులు కార్యాలయంలో అనుకున్న పనులను పూర్తి చేస్తారు. గతంలో ఉన్న అనుభవాల నుంచి ఇప్పుడు కొత్త పాటలు నేర్చుకుంటారు. వ్యాపారులకు కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఏర్పడుతుంది.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. వ్యక్తిగతంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా బలపడతారు. వ్యాపారులు సన్నిహితుల నుంచి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. వీరికి పెద్దల ఆశీస్సులు ఉంటాయి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈరోజు అనేక రంగాల్లో రాణిస్తారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది. కొత్తగా వస్తువులను కొనుగోలు చేస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. అనవసరమైన వాదనలకు దిగకుండా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టే వ్యాపారులకు ఇదే మంచి సమయం. అధికారుల నుంచి ఉద్యోగులు ఒత్తిడిని ఎదుర్కొంటారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా గడుస్తుంది. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు అపారమైన లాభాలు ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల వల్ల ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు చేపట్టిన ముఖ్యమైన ప్రాజెక్టులను ఈరోజు పూర్తి చేస్తారు.

హృతిక్ రోషన్ కోసం 1000 కోట్ల ప్రాజెక్ట్ ని వదిలేసుకున్న విజయ్ సేతుపతి..

Vijay Sethupathi
Vijay Sethupathi

Vijay Sethupathi: సౌత్ ఇండియా లో హీరో గా , క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా, ఇలా ఎన్నో విభిన్నమైన కోణాలను ఆవిష్కరిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పాటు చేసుకున్న హీరోల్లో ఒకరు విజయ్ సేతుపతి. ఈయనకు తమిళం లో మాత్రమే కాదు , తెలుగు లో కూడా వీరాభిమానులు ఉన్నారు. ఎలాంటి పాత్రని అయినా ఆయన తనదైన స్టైల్ తో , అద్భుతమైన హావభావాలంతో వేరే లెవెల్ కి తీసుకెళ్తుంటారు. అందుకే విజయ్ సేతుపతి కి అంతటి క్రేజ్ ఏర్పడింది. అయితే రీసెంట్ గా ఆయనకు ఒక వెయ్యి కోట్ల వర్త్ ఉన్న సినిమాలో తీరని అన్యాయం జరిగినట్టు తెలుస్తోంది. దీనిపై ఆయన అభిమానులు చాలా ఫైర్ మీద ఉన్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, సూపర్ స్టార్ రజినీకాంత్ , నెల్సన్ కాంబినేషన్ లో ‘జైలర్ 2’ తెరకెక్కిన సంగతి తెలిసిందే.

సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో విడుదలయ్యే ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ , మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ లతో పాటు విజయ్ సేతుపతి కూడా అతిథి పాత్ర పోషించారట. అయితే ఈ కథలో అత్యంత కీలకమైన మరో పవర్ ఫుల్ అతిథి పాత్ర కూడా ఉంది. ఈ పాత్ర కోసం డైరెక్టర్ నెల్సన్ పవన్ కళ్యాణ్ , షారుఖ్ ఖాన్ వంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ని కూడా సంప్రదించారు, కానీ వాళ్ళు నటించడానికి ఒప్పుకోలేదు , చివరికి బాలీవుడ్ సూపర్ స్టార్స్ లో ఒకరైన హృతిక్ రోషన్ ఈ పవర్ ఫుల్ గెస్ట్ రోల్ చేయడానికి ఒప్పుకున్నారట. ఆయన పాత్రకు సంబంధించిన సన్నివేశాలు , అదే విధంగా రజినీకాంత్ కాంబినేషన్ లో వచ్చే హృతిక్ రోషన్ సన్నివేశాలు రీసెంట్ గానే షూట్ చేశారట మేకర్స్.

అనుకున్న దానికంటే హృతిక్ పాత్ర నిడివి చాలా ఎక్కువ వచ్చిందట. ట్రిమ్ చెయ్యాలని చూస్తే , ఒక్క షాట్ కూడా బాగాలేదు అనే విధంగా లేదట. ముఖ్యంగా రజినీకాంత్ , హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు ఫైర్ అనిపించే రేంజ్ లో ఉన్నాయట. అందుకే మేకర్స్ విజయ్ సేతుపతి పాత్రని ట్రిమ్ చెయ్యాలని చూస్తున్నట్టు లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం. అదే కనుక జరిగితే , విజయ్ సేతుపతి కి అన్యాయం జరిగినట్టే, ఆయన అభిమానులు ఆందోళన చెందడం లో ఎలాంటి తప్పు లేదు. విజయ్ సేతుపతి ఈ క్యారెక్టర్ చేయడానికి ముందుకు ఏమి రాలేదు, డైరెక్టర్ స్వయంగా ఆయన్ని రిక్వెస్ట్ చేసి ఈ పాత్రని చేయించారు, అలాంటిది ఇప్పుడు మీ ఇష్టమొచ్చినట్టు మా హీరో సన్నివేశాలు ట్రిమ్ చేస్తామంటే ఎలా అనేది విజయ్ సేతుపతి ఫ్యాన్స్ వాదన. మరోవైపు తన సన్నివేశాలు తొలగిస్తున్న విషయం తెలిసినప్పటికీ విజయ్ సేతుపతి ఎలాంటి నిరాశకు గురి అవ్వలేదట, ఇది చాలా గొప్ప విషయం.

రోజా పై పంచుల వర్షం కురిపించిన అనంత శ్రీరామ్.. లైవ్ లో పరువు పోయిందిగా..

Roja And Ananta Sriram
Roja And Ananta Sriram

Roja And Ananta Sriram: రాజకీయాల్లో మగవాళ్ళు సైతం భయపడే స్థాయిలో తన వాగ్దాటి తో ప్రత్యర్థులపై విరుచుకుపడే రోజా గురించి ప్రత్యేకించి చెప్పాలా?, ఈమె పై విమర్శలు చేయడానికి ఎంతటి వారైనా ఒక్క క్షణం ఆలోచిస్తారు. ఎందుకంటే ఫైర్ బ్రాండ్ పేరుతో ఆమె మాట్లాడితే బూతులు అలా ఉంటాయి మరి. వైసీపీ పార్టీ అధికారం లో ఉన్నప్పుడు ఈమె సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , నారా లోకేష్ వంటి వారిపై ఏ స్థాయిలో విరుచుకుపడేదో మన కళ్లారా చూసాము. వాళ్ళని బూతులతో తిట్టినా సందర్భాలు కూడా ఉన్నాయి. అదే విధంగా కూటమి నేతలపైనా కూడా వినలేని పదాలతో బూతులు తిట్టేది ఈమె. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా ఈమెలో జోష్ , ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదు. ఒకప్పుడు ఎలా అయితే ప్రత్యర్థులపై విరుచుకొని పడేదో , ఇప్పుడు కూడా అలాగే పడుతోంది.

అయితే ఒకపక్క రాజకీయాల్లో యాక్టీవ్ గా ఉంటున్న రోజా, ఈమధ్య కాలంలో టీవీ షోస్ తో కూడా ఫుల్ బిజీ అయిపోయింది. ప్రతీ శని, ఆదివారాల్లో ప్రసారమయ్యే ‘డ్రామా జూనియర్స్ 8’ ప్రోగ్రాం లో రోజా ఒక న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోంది. ఈమెతో పాటు సీనియర్ హీరో శ్రీకాంత్ , ప్రముఖ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వంటి వారు కూడా న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ షోకి సుడిగాలి సుధీర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షో కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా పంచులు అయితే వేరే లెవెల్ లో ఉన్నాయి. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే , రోజా కూడా తనపై వేసే పంచులు చాలా స్పోర్టివ్ గా తీసుకోవడమే. సుడిగాలి సుధీర్ , శ్రీకాంత్ , అనిల్ రావిపూడి వంటి వారు రోజా పై కురిపించే పంచులు వర్షం చూస్తే నవ్వు ఆపుకోలేరు.

గత వారం జరిగిన ఎపిసోడ్ కి ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ గెస్ట్ గా విచ్చేసారు. అనంత్ శ్రీరామ్ రాగానే ‘ఆ ఫ్లూట్ కి కాస్త దూరంగా ఉండండి, ఫ్లూట్ ఎదో , నువ్వేదో తెలియట్లేదు’ అని అంటుంది రోజా. అప్పుడు అనంత శ్రీరామ్ కౌంటర్ ఇస్తూ ‘మీరు కాస్త ఆ డ్రమ్ములకు దూరంగా ఉండండి’ అని అంటారు. అంటే రోజా ని డ్రమ్ తో పోల్చారు అన్నమాట. దీనిని రోజా జోక్ గానే తీసుకుంది కానీ , సోషల్ మీడియా లో మాత్రం టీడీపీ , జనసేన పార్టీ అభిమానులు ఈ వీడియో ని పోస్ట్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

'బిగ్ బాస్ 10' లోకి 'రాజు వెడ్స్ రాంభాయ్' హీరో అఖిల్ రాజ్.. కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్..

Akhil Raj Bigg Boss 10
Akhil Raj Bigg Boss 10

Akhil Raj Bigg Boss 10: ప్రతీ ఏడాది లాగానే ఈ ఏడాది కూడా ‘బిగ్ బాస్’ సీజన్ ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. పైగా గత సీజన్ చాలా పెద్ద బాక్ బస్టర్ హిట్ అవ్వడం , రికార్డు స్థాయిలో టీఆర్ఫీ రేటింగ్స్ ని నమోదు చేయడం తో , ఈసారి సెలబ్రిటీలను చాలా బలంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. నిత్యం సోషల్ మీడియా లో ట్రెండింగ్ లో ఉన్నవాళ్లను, కాంట్రవర్సీలతో సావాసం చేసేవాళ్లను ఈ సీజన్ లో కూడా మనం చూడబోతున్నాము. గత రెండు రోజులుగా ‘రాజు వెడ్స్ రాంభాయ్’ హీరో అఖిల్ రాజ్ చుట్టూ జరుగుతున్న వివాదాలను మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. డెలివరీ బాయ్ పై ఆయన చెయ్యి చేసుకోవడానికి ముందుకు దూసుకొని రావడం పై సోషల్ మీడియా లో పెద్ద చర్చ సాగుతోంది.

తనపై వచ్చిన తీవ్రమైన నెగెటివిటీ ని గమనించిన అఖిల్ రాజ్ , ఆ ఘటన జరిగిన రోజే మరో వీడియో ని విడుదల చేస్తూ, తాను ఎందుకు అలా ప్రవర్తించాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు. ఇది జరిగిన మరుసటి రోజు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కొండాపూర్ లో అఖిల్ రాజ్ కారు పై దాడి చేశారు. అనంతరం తనపై దాడి చేసిన వారిపై అఖిల్ రాజ్ గుచ్చి బౌలి లో పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. అయితే ఈ వివాదం ఇక్కడితో ఆగలేదు , ఇదంతా అఖిల్ రాజ్ క్రియేట్ చేసిన డ్రామా అని , తన మనుషులకు డబ్బులిచ్చి , దాడి జరిగినట్టుగా పోలీసులను , జనాలను నమ్మించే ప్రయత్నం చేసి సానుభూతి పొందాలని చూస్తున్నారని , ఇలా పలు రకాల వాదనలు సోషల్ మీడియా లో వినిపిస్తున్నాయి. అయితే ఇతని పై ‘బిగ్ బాస్’ టీం కన్ను పడినట్టు తెలుస్తోంది.

ఈయన్ని సంప్రదించే ఆలోచనలో ఉన్నారట బిగ్ బాస్ నిర్వాహకులు. మొదటి నుండి బిగ్ బాస్ టీం కాంట్రవర్సీ చేసే సెలబ్రిటీలను తీసుకోవడానికే ఎక్కువగా మొగ్గు చూపిస్తూ వస్తోంది. గతంలో షణ్ముఖ్ జస్వంత్ ని ఈ క్యాటగిరీలోనే తీసుకున్నారు, అదే విధంగా సీజన్ 8 లో శేఖర్ బాషాని కూడా ఇదే క్యాటగిరీలో తీసుకున్నారు. ఇప్పుడు సీజన్ 10 కోసం అఖిల్ రాజ్ ని సంప్రదించే ఆలోచనలో ఉన్నారు, ఒకవేళ సంప్రదిస్తే మాత్రం అఖిల్ రాజ్ ఈ ఆఫర్ ని ఒప్పుకోవడం చాలా బెటర్ అని అంటున్నారు నెటిజెన్స్. ఎందుకంటే అతని చేతుల్లో ఎలాంటి సినిమాలు లేవు , అంతే కాకుండా అతని పేరేంటో కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పూర్తిగా తెలియదు, బిగ్ బాస్ ద్వారా తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యే అవకాశం వచ్చింది , దీన్ని వదులుకోకూడదు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రెమ్యూనరేషన్ కూడా భారీగానే ఆఫర్ చేసే ఆలోచనలో ఉందట బిగ్ బాస్ టీం.

ముదురుతున్న 'యాదగిరిగుట్ట' బోర్డు వివాదం..పాపం చిరంజీవి సతీమణి పరిస్థితి ఇలా అయ్యిందేంటి..

Yadagirigutta Board Controversy
Yadagirigutta Board Controversy

Yadagirigutta Board Controversy: మెగాస్టార్ చిరంజీవి కి ప్రస్తుతం రాజకీయాలతో ఎలాంటి ప్రత్యక్ష , పరోక్ష సంబంధాలు లేవు అనే సంగతి అందరికీ తెలిసిందే. ప్రజారాజ్యం పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత , ఒక 5 ఏళ్ళు యాక్టీవ్ పాలిటిక్స్ లో ఉన్నారు , కానీ ఆ తర్వాత ఆయన రాజకీయాలకు టాటా చెప్పి , సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి , వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీ గా గడుపుతున్నారు. తన తమ్ముడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యినప్పటికీ, జనసేన పార్టీ ద్వారా రాజ్యసభ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా చిరంజీవి రాజకీయాల్లోకి రావాలని అనుకోవడం లేదు. చిరంజీవే రాజకీయాల్లో లేనప్పుడు , ఇక ఆయన సతీమణి సురేఖ కొణిదెల ని రాజకీయ రొచ్చు లోకి లాగి , పెద్ద వివాదం చేస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ ప్రభుత్వం ‘యాదగిరిగుట్ట’ బోర్డు మెంబర్ల జాబితా ని నిన్న విడుదల చేసింది. ఈ జాబితా లో చిరంజీవి సతీమణి సురేఖ పేరు కూడా ఉండడం అందరినీ షాక్ కి గురి చేసింది. కొంతమంది ప్రముఖులు తెలంగాణలోని విశిష్టమైన ఆలయానికి బోర్డు మెంబెర్స్ గా పెట్టడానికి తెలంగాణ వాళ్ళు ఎవ్వరూ దొరకలేదా , ఆంధ్ర ప్రాంతానికి చెందిన మహిళను పెట్టడం వెనుక ప్రభుత్వం ఉద్దేశ్యం ఏమిటి?, ఏ అర్హత ఉందని సురేఖకు ఆ పదవి ని అప్పగించారు అంటూ నిలదీస్తున్నారు నెటిజెన్స్. దీనికి చిరంజీవి ఫ్యాన్స్ నెటిజెన్స్ చాలా ధీటుగా కౌంటర్లు ఇచ్చారు. పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు లో తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఉన్నారు కదా?, అప్పుడు లేవని నోర్లు ఇప్పుడు లేస్తున్నాయి ఏంటి? అంటూ విరుచుకుపడుతున్నారు. సురేఖ గారిని బోర్డు మెంబెర్ గా చేర్చడానికి అనేక కారణాలు ఉన్నాయని, ప్రభుత్వం అంత తేలికగా ఎవరినీ నియమించదు అనే విషయాన్ని గమనించాలంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరికొంతమంది అయితే చిరంజీవి కి , సీఎం రేవంత్ రెడ్డి కి మధ్య అత్యంత సాన్నిహిత్యం ఉండడం వల్లే, చిరంజీవి సిఫార్సు కారణంగా సురేఖకు బోర్డు మెంబెర్ గా చోటు దక్కిందని విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేని సురేఖ పేరు , ఈ ఒక్క కారణం చేత నిన్నటి నుండి సోషల్ మీడియా , మెయిన్ ఎలక్ట్రానిక్ మీడియా లో చాలా గట్టిగా వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ వివాదం ముదురుతుందా ?, లేదా చల్లారుతుందా అనేది చూడాలి. అయితే మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఈ అంశంపై సైలెన్స్ ని మైంటైన్ చేస్తున్నారు. కనీసం ఆయన సీఎం రేవంత్ రెడ్డి కి కృతఙ్ఞతలు కూడా తెలపకపోవడం గమనార్హం.

ప్రభాస్‌కు ఫోన్ చేసిన కేటీఆర్.. "డార్లింగ్" కూడా షాక్..! అసలు షో ఎవరిది? వీడియో వైరల్!

KTR And Prabhas
KTR And Prabhas

KTR And Prabhas: రాజకీయాల్లో ప్రత్యర్థులను ఇరుకున పెట్టే ప్రశ్నలు ఎదుర్కోవడం కేటీఆర్ కు కొత్తేమీ కాదు. కానీ ఈసారి ఆయనను చెమటలు పట్టించింది రాజకీయ ప్రత్యర్థులు కాదు… చిన్నారులు! ‘ది అండర్ 18 వరల్డ్’ అనే గ్రూప్‌తో కేటీఆర్ చేసిన చిట్‌చాట్ ప్రోమో బయటకు రావడంతో సోషల్ మీడియాలో నవ్వుల పూదోటే విరిసింది.

ప్రోమో మొదలైన దగ్గర నుంచే పిల్లల ప్రశ్నలు… కేటీఆర్ ఎక్స్‌ప్రెషన్లు… ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్. “ఇంత టఫ్ ఇంటర్వ్యూ నేను కూడా ఊహించలేదు” అన్నట్లు ఆయన ముఖ కవళికలు కనిపించాయి.

అయితే అసలు ట్విస్ట్ అక్కడే. పిల్లలు అడగగానే కేటీఆర్ నేరుగా హీరో ప్రభాస్‌కు ఫోన్ చేశారు. ఫోన్ ఎత్తగానే అక్కడున్న చిన్నారుల ఆనందానికి అవధుల్లేవు. ప్రభాస్‌తో జరిగిన చిన్న సంభాషణ కూడా ప్రోమోలో హైలైట్‌గా నిలిచింది. “రాజకీయాల్లో కాల్స్ చాలా చూశాం… కానీ డార్లింగ్‌కు డైరెక్ట్ కాల్ ఇదే ఫస్ట్ టైమ్ కదా!” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇక మరో సీన్‌లో ఓ చిన్నారితో కలిసి కేటీఆర్ పుష్-అప్స్ కూడా చేశారు. “పాలిటిక్స్ మాత్రమే కాదు… ఫిట్‌నెస్‌లో కూడా తగ్గేదేలే!” అన్నట్లుగా కనిపించారు. ఇదే సమయంలో ఆయన భార్య ఫోన్ చేయగా… “తర్వాత మాట్లాడతా” అంటూ కాల్ కట్ చేయడం మరో ఫన్నీ మూమెంట్‌గా మారింది. దీంతో సోషల్ మీడియాలో “ప్రభాస్ కాల్ ఓకే… ఇంటి కాల్ వెయిటింగ్!” అంటూ సెటైర్లు పేలుతున్నాయి.

ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్‌గా మారింది. అసలు ఎపిసోడ్‌లో ఇంకెన్ని సర్ప్రైజ్‌లు, పిల్లలు ఇంకెన్ని “బౌన్సర్లు” వేస్తారో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మొత్తానికి… రాజకీయ సభల్లో సీరియస్‌గా కనిపించే కేటీఆర్, పిల్లల ముందు మాత్రం పూర్తి “ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజ్”గా మారిపోయారనే కామెంట్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

 

 

సోషల్ మీడియా లో ట్రోలింగ్స్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉక్కుపాదం.. వీడియో వైరల్..

Pawan Kalyan
Pawan Kalyan

Pawan Kalyan: ఈమధ్య కాలం లో సోషల్ మీడియా లో ట్రోల్స్ లిమిట్ ని దాటుతున్నాయి. సామాన్యుల నుండి సినీ సెలబ్రిటీల వరకు, లోకల్ నాయకుల నుండి నేషనల్ లెవెల్ నాయకుల వరకు , ప్రతీ ఒక్కరు దారుణమైన ట్రోలింగ్స్ ని ఎదురుకుంటున్నారు. ఆడవాళ్లు అనే ఇంకిత జ్ఞానం కూడా లేకుండా, నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తున్నారు. చివరికి ఈ సంస్కృతి ఎక్కడి వరకు వచ్చిందంటే, మన హిందూ దేవుళ్ళ పైన కూడా ట్రోల్స్ వేసే స్థాయికి చేరింది. పవిత్రమైన హైందవ ధర్మాన్ని ఈమధ్య కాలం లో కొంతమంది సెక్యులర్ ముసుగు లో అత్యంత నీచమైన కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల దళిత క్రైస్తవులు మీటింగ్ ని నిర్వహించి జడ శ్రవణ్ కుమార్ , సీవీ రెడ్డి మరియు రావణ్ (ప్రశ్న) వంటి వారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై , డిప్యూటీ స్పీకర్ రఘు రామ కృష్ణం రాజు లపై అత్యంత నీచంగా మాట్లాడారు.

అదే విధంగా గతం లో ఈ రావణ్ అనే జర్నలిస్ట్ పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా మీద కూడా చాలా నీచమైన వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టారు. హైందవ ధర్మాన్ని , శ్రీ రాముడి పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వీటి అన్నిటిని పరిగణలోకి తీసుకొని , ఇతనిపై , సీవీ రెడ్డి పై కేసులు నమోదు చేసిన పోలీసులు , హైదరాబాద్ కి వెళ్లి అరెస్ట్ చేశారు. అందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అయితే సోషల్ మీడియా లో నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడే కొంతమంది నెటిజెన్స్ పై ఉక్కుపాదం మోపాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా బలమైన నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం ఆయన డిప్యూటీ సీఎం కార్యాలయం లో ఒక ప్రత్యేకమైన వ్యవస్థని ఏర్పాటు చేశారు.

దీని గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘ఒక విషయాన్నీ చాలా స్పష్టంగా చెప్తున్నాము. నేరస్థాలుకు, నేరానికి ఎలాంటి కులం , మతం లేదు, రాజకీయ పార్టీ లేదు, తప్పు చేసిన తర్వాత కులం , మతం , ప్రాంతం , రాజకీయ పార్టీల వెనుక దాక్కుకోవాలని చూడకండి. చట్టం ముందు అందరూ సమానులే, సోషల్ మీడియా దుర్వినియోగం వల్ల ఇబ్బంది పడుతున్న వారికి ఒక్కటే భరోసా ఇస్తున్నాం , ఇక నుండి మీరు ఒంటరి కాదు , కూటమి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. డిప్యూటీ సీఎం ఆఫీస్ లో , సోషల్ మీడియా దుర్వినియోగానికి సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేకమైన వ్యవస్థని ఏర్పాటు చేయబోతున్నాము. స్క్రీన్ షాట్స్ , వీడియోస్ మరియు ఇతర డిజిటల్ ఎవిడెన్స్ తో ఫిర్యాదు చేయొచ్చు. ప్రతీ ఫిర్యాదు ని పరిశీలించి , సంబంధిత అధికారులతో చర్చించి , చట్టపరమైన చర్యలు తీసుకుంటాము’ అంటూ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్.

'లెనిన్' నుండి శ్రీలీల ని తప్పించడానికి కారణం అదేనా..? వైరల్ అవుతున్న అఖిల్ కామెంట్స్..

Akhil Akkineni
Akhil Akkineni

Akhil Akkineni: సుమారుగా మూడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత అక్కినేని అఖిల్ మన ముందుకు ‘లెనిన్’ చిత్రం ద్వారా రాబోతున్నారు. మే 1 న విడుదల అవ్వాల్సిన ఈ సినిమా, ఆ తర్వాత జూన్ 25 కి వాయిదా పడింది. అప్పటికీ కూడా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడం తో జులై 10 కి వాయిదా పడింది. విడుదలకు సరిగ్గా 9 రోజుల సమయం ఉండడంతో మూవీ టీం చాలా గట్టిగా ప్రొమోషన్స్ ని మొదలుపెట్టింది. ముందుగా యాంకర్ సుమ తో చేసిన కిచెన్ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఇక నిన్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అఖిల్ మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. అదే విధంగా ట్రైలర్ కి కూడా ఆడియన్స్ నుండి చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అక్కినేని ఫ్యాన్స్ ఆకలి ఈ చిత్రం తో నెరవేరబోతోంది అనే నమ్మకాన్ని ఇచ్చింది ఈ ట్రైలర్.

ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కోసం ముందుగా శ్రీలీల ని ఎంచుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆమె పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు , మొదటి గ్లింప్స్ వీడియో లో కూడా ఆమెకు సంబంధించిన షాట్స్ ఉంటాయి. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ , మధ్యలోనే ఈ సినిమా నుండి ఆమె తప్పుకోవాల్సి వచ్చింది. ఈ విషయం పై ఒక ఇంటర్వ్యూ లో రీసెంట్ గానే అఖిల్ ని ఒక రిపోర్టర్ అడగ్గా , శ్రీలీల మా సినిమాతో పాటు , హిందీ లో సమాంతరంగా రెండు సినిమాల షూటింగ్స్ కి డేట్స్ ఇచ్చింది. ఆ కారణం చేత డేట్స్ క్లాష్ వచ్చి , మాకు షూటింగ్ షెడ్యూల్స్ కొన్ని సందర్భాల్లో క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది.

అందుకే ఆమె ఈ చిత్రం నుండి తప్పుకుంది, ఆమె స్థానం లోకి వెంటనే భాగ్యశ్రీ ని తీసుకున్నాం అంటూ అఖిల్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి విడుదలైన కంటెంట్ మొత్తాన్ని చూస్తుంటే , ఈ చిత్రానికి భాగ్యశ్రీ హీరోయిన్ అయితే తప్ప , ఆ పాత్రకు న్యాయం జరగదు అనేంతలా ఆమె నటించినట్టు అనిపిస్తోంది. తెలుగు అమ్మాయి కాకపోయినా, తెలుగు నేర్చుకొని , ఏకంగా ‘దాన వీర సూర కర్ణ’ చిత్రం లోని పాపులర్ ఎన్టీఆర్ డైలాగ్ ని సైతం ప్రతీ ప్రమోషనల్ ఈవెంట్ లో కొడుతుందంటే , ఆమె డెడికేషన్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ చిత్రం విజయవంతం అవ్వడం అఖిల్ కి ఎంత ముఖ్యమో , భాగ్యశ్రీ కి కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ఇద్దరికీ కూడా కెరీర్ ప్రరంగా ఒక్క హిట్ కూడా లేదు కాబట్టి.

30 ఏళ్లుగా ఎవరెస్ట్‌పై నిశ్శబ్దంగా పడి ఉన్న 'గ్రీన్ బూట్స్'... చివరకు ఇంటికి చేరనున్నాడా?

Everest Mystery
Everest Mystery

Everest Mystery: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం ఎంతోమందికి కల. కానీ అదే శిఖరం కొందరికి శాశ్వత సమాధిగా మారింది. అలాంటి వారిలోనే ఒకరు ప్రపంచవ్యాప్తంగా “గ్రీన్ బూట్స్”గా గుర్తింపు పొందిన ఆ పర్వతారోహకుడు.

దాదాపు 30 ఏళ్లుగా సముద్ర మట్టానికి 27 వేల అడుగుల ఎత్తులో, మంచులో గడ్డకట్టిన ఆ మృతదేహాన్ని వేలాది మంది పర్వతారోహకులు దాటుకుంటూ వెళ్లారు. అతను ఎవరో తెలియకపోయినా, అతని ఆకుపచ్చ బూట్లు మాత్రం ఎవరెస్ట్‌కు ఒక మౌన గుర్తుగా మారాయి.

ఇప్పుడు భారత అధికారులు అతని మృతదేహాన్ని కిందకు తీసుకురావడానికి ప్రత్యేక మిషన్ చేపట్టారు. తాజా డీఎన్‌ఏ పరీక్షల ప్రకారం, ఎన్నేళ్లుగా భావించినట్లుగా అది త్సేవాంగ్ పాల్జోర్‌ది కాకుండా, భారతీయ పర్వతారోహకుడు దోర్జే మోరుప్‌దేనని తేలింది.

ఒకప్పుడు ఎవరెస్ట్ శిఖరాన్ని చేరాలనే కలతో బయలుదేరిన యువకుడు… చివరకు ఆ మంచు పర్వతంలోనే మూడు దశాబ్దాల పాటు నిశ్శబ్దంగా మిగిలిపోయాడు. ఇప్పుడు ఆ అవశేషాలు కుటుంబ సభ్యుల వద్దకు చేరితే, అది కేవలం ఒక మృతదేహం రికవరీ మాత్రమే కాదు… 30 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఓ కుటుంబానికి దక్కే చివరి వీడ్కోలు కూడా అవుతుంది.

కొన్ని కథలు విజయంతో ముగుస్తాయి… మరికొన్ని మాత్రం మంచులో గడ్డకట్టిపోయినా, కాలం గడిచినా మనసులను కదిలిస్తూనే ఉంటాయి. “గ్రీన్ బూట్స్” కథ కూడా అలాంటిదే.

అనసూయ సెగలు.. చూస్తే పొగలు..

Anasuya Photoshoot
Anasuya Photoshoot

కన్నీళ్లు రప్పిస్తున్న ప్రముఖ దర్శకుడు భాగ్యరాజ్ చివరి లేఖ..

Bhagyaraj Last Letter
Bhagyaraj Last Letter

Bhagyaraj Last Letter: తమిళనాడు లో లెజండరీ స్థానాన్ని సొంతం చేసుకున్న ప్రముఖ నటుడు, రచయితా , దర్శకులు భాగ్య రాజ్ తన తుదిశ్వాస ని విడిచిన ఘటన యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లో ముంచేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన ముందు రోజు రాత్రి ఆయన ఎంతో ఉత్సాహం తో ప్రముఖ హీరోయిన్ కుష్బూ కూతురు అవంతిక వివాహానికి హాజరయ్యారు. అలాంటి వ్యక్తి పొద్దున్న లేచేలోపే చనిపోయారు అనే వార్త విని జీర్ణించుకోలేకపోయారు అభిమానులు , సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు. అయితే సోషల్ మీడియా లో భాగ్యరాజ్ కి సంబంధించిన చివరి లేఖ ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది. ఆ లేఖలో ఆయన మాట్లాడిన మాటలు వింటే కన్నీళ్లు ఆగవు. ముఖ్యంగా తన నేత్రాలను దానం చేసే విషయం పై , అదే విధంగా తన కొడుకు గురించి ఆయన మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి.

ఆయన మాట్లాడుతూ ‘మన చుట్టూ ఉన్నవాళ్లను సంతోషపెట్టడం లోనే మన నిజమైన ఆనందం దాగుంది. ఇనీళ్ళ సుదీర్ఘ సినీ ప్రయాణం లో అభిమానులు నాపై చూపించిన అపారమైన ప్రేమ , నన్ను ఎంతగానో ప్రోత్సహించిన అక్కాచెల్లెళ్లు , తల్లులకు , ఇండస్ట్రీ లోని నా సహచరులకు కృతఙ్ఞతలు. మీ ప్రేమని ఎల్లప్పుడూ చూడడం కోసం నా కళ్ళను సజీవంగా ఉంచాను , దయచేసి వాటిని జాగ్రత్తగా చూసుకోండి. నా కోసం మీరంతా కొట్టిన చప్పట్లు నా కొడుకుకి కూడా ఆశీర్వాదం గా మారాలని కోరుకుంటున్నాను. ఈ సుదీర్ఘ సినీ ప్రయాణం లో మీరు నాపై చూపించిన ప్రేమ , ఆదరణ నా కొడుకు శాంతనుపైన కూడా చూపించాలి, నేను శారీరకంగా మీతో ఈరోజు లేకపోయినా నా కళ్ళ ద్వారా అభిమానులను చూస్తూనే ఉంటాను. ఈ శరీరం శాశ్వతం కాదు , ఎదో ఒక రోజు భూమిలో కలిసిపోతుంది , లేదంటే అగ్నికి ఆహుతి అవుతుంది’.

‘చివరికి మిగిలేది బూడిదే , కానీ మనం పంచిన ప్రేమే అసలైన సంపద. నా జీవిత ప్రయాణం లో నన్ను ప్రేమించి , నా కష్టసుఖాల్లో పాలు పంచుకున్న ప్రతీ ఒక్కరికి నేను రుణపడి ఉంటాను. నేను చేసిన మంచి సినిమాలు , కథలు , డైలాగ్స్, చూపించిన మానవత్వం ద్వారా చిరస్థాయిగా జీవిస్తాను ‘ అంటూ చెప్పుకుకొచ్చారు భాగ్యరాజ్. భాగ్యరాజ్ తెలుగు , తమిళ భాషలకు కలిపి దాదాపుగా 25 సినిమాలకు దర్శకత్వం వహించగా, 75 కి పైగా సినిమాల్లో నటించారు. ప్రముఖ హీరోయిన్ పూర్ణిమ ని ప్రేమించిన పెళ్లాడిన ఈయన , ఆ తర్వాత శాంతను కి జన్మనిచ్చారు. ప్రస్తుతం శాంతను తమిళం లో హీరోగా అనేక సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ గా ఉన్నారు.

మీకు సొంత కారు ఉందా.. ఈ 8 విషయాల్లో జాగ్రత్త..ఎందుకంటే..

Car Safety Tips
Car Safety Tips

Car Safety Tips: ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇలాంటి సమయంలో రోడ్లపై నీరు నిల్వ ఉండటం, జారుడు రోడ్లు, తక్కువ విజిబిలిటీ వంటి కారణాలతో కారు ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. ఆ పరిస్థితి రాకుండా ఉండడానికి సొంత కారు ఉన్నవారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. నేటి కాలంలో చాలా మంది సొంత కారును కలిగి ఉన్నారు. అయితే వ్యక్తిగత, కార్యాలయ పనుల కారణంగా కారును పెద్దగా పట్టించుకోరు. కానీ చిన్న నిర్లక్ష్యం పెద్ద ఖర్చులకు కారణం అవుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆటోమోబైల్ నిపుణులు తెలుపుతున్నారు. మరి ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే?

1. టైర్ల ట్రెడ్ తక్కువగా ఉంటే..
వర్షాకాలంలో కారుకు అత్యంత ముఖ్యమైన భాగం టైర్లు. టైర్ల ట్రెడ్ (గ్రిప్) తక్కువగా ఉంటే నీటిపై కారు జారిపోయే ప్రమాదం ఉంటుంది. టైర్లలో సరైన గాలి ఒత్తిడి ఉండేలా చూసుకోవాలి. పాతబడిన లేదా పగుళ్లు వచ్చిన టైర్లను వెంటనే మార్చడం మంచిది. టైర్ల గ్రిప్ బాగుంటే బ్రేకింగ్ కూడా మెరుగ్గా పనిచేస్తుంది.

2. బ్రేకింగ్ చాలా ఇంపార్టెంట్..
వర్షంలో బ్రేకింగ్ దూరం సాధారణ రోజుల కంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బ్రేక్ ప్యాడ్లు, బ్రేక్ ఆయిల్, బ్రేక్ సిస్టమ్‌ను సర్వీస్ చేయించుకోవాలి. అలాగే విండ్‌షీల్డ్ వైపర్లు సరిగా పనిచేయకపోతే ముందు కనిపించదు. వైపర్ బ్లేడ్లు పాడై ఉంటే వెంటనే మార్చాలి. వాషర్ ట్యాంకులో నీరు లేదా క్లీనింగ్ లిక్విడ్ నింపుకోవాలి.

3. హెడ్‌లైట్లు, టెయిల్‌లైట్లు తనిఖీ చేయాలి..
వర్షంలో పొగమంచు, చీకటి కారణంగా విజిబిలిటీ తగ్గుతుంది. అందువల్ల హెడ్‌లైట్లు, ఫాగ్ ల్యాంపులు, ఇండికేటర్లు, టెయిల్‌లైట్లు అన్నీ సక్రమంగా వెలుగుతున్నాయో ముందుగానే పరీక్షించాలి. అవసరమైతే లో-బీమ్ లైట్లను ఉపయోగించడం ఇతర వాహనదారులకు కూడా మీ వాహనం స్పష్టంగా కనిపించేందుకు సహాయపడుతుంది.

4. నీటితో నిండిన రోడ్లపై వెళ్లాల్సి వస్తే..
రోడ్డుపై నీరు నిల్వ ఉందని కనిపిస్తే దాని లోతు తెలియకపోతే ఆ మార్గంలో వెళ్లకపోవడం మంచిది. బలవంతంగా నీటిలోకి కారును తీసుకెళితే ఇంజిన్‌లో నీరు చేరి తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవడం సురక్షితం.

5.సురక్షిత వేగంతోనే డ్రైవింగ్ చేయాలి
వర్షంలో వేగంగా కారు నడపడం ప్రమాదకరం. రోడ్లు జారుడుగా ఉండటంతో అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే కారు అదుపు తప్పే అవకాశం ఉంది. అందువల్ల నెమ్మదిగా ప్రయాణించాలి. ముందు వెళ్తున్న వాహనానికి సాధారణం కంటే ఎక్కువ దూరం పాటించడం మంచిది.

6.ఎలక్ట్రికల్ వ్యవస్థపై..
బ్యాటరీ, వైరింగ్, ఫ్యూజ్‌లు, ఇగ్నిషన్ వ్యవస్థ సరిగా ఉన్నాయో లేదో చెక్ చేయించుకోవాలి. వర్షపు నీరు ఎలక్ట్రికల్ భాగాల్లోకి చేరితే స్టార్టింగ్ సమస్యలు రావచ్చు. కాబట్టి సర్వీస్ సమయంలో ఈ అంశాలను కూడా పరిశీలించడం అవసరం.

7.ఎయిర్ కండిషనింగ్‌…
వర్షంలో కారు అద్దాలపై ఆవిరి పేరుకుపోవడం సాధారణం. దీంతో డ్రైవర్‌కు బయట స్పష్టంగా కనిపించదు. ఈ సమస్యను నివారించేందుకు ఎయిర్ కండిషనర్ లేదా డిఫాగర్‌ను ఉపయోగించాలి. దీంతో అద్దాలు త్వరగా శుభ్రపడతాయి.

8.అత్యవసర సామగ్రి అవసరం..
వర్షాకాలంలో కారులో టార్చ్ లైట్, ఫస్ట్ ఎయిడ్ కిట్, జంప్ స్టార్టర్ కేబుల్స్, టోయింగ్ రోప్, గొడుగు, పవర్ బ్యాంక్, తాగునీరు వంటి అత్యవసర వస్తువులు ఉంచుకోవడం మంచిది. టైర్ పంక్చర్ అయితే ఉపయోగపడే స్టెప్నీ, జాక్, టూల్ కిట్ కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి.

ఒక్క పోస్ట్ తో 'కల్కి 2' హీరోయిన్ ఎవరో చెప్పేసిన ప్రభాస్.. ఈ ట్విస్ట్ అసలు ఊహించలేదు..

Kalki Part 2 Heroine
Kalki Part 2 Heroine

Kalki Part 2 Heroine: ‘కల్కి 2’ చిత్రం నుండి దీపికా పదుకొనే తప్పుకోవడం , ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతున్నది ఎవ్బరు అనే అంశం పై సోషల్ మీడియాలో చాలా రోజుల నుండి చర్చలు నడుస్తున్న సంగతి తెలిసిందే. నిన్న మొన్నటి వరకు సాయి పల్లవి ని ఖరారు చేసినట్టు వార్తలు వచాయి. కానీ ఆ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ మాత్రం ‘ఏదైనా మేము అధికారికంగా చెప్పే వరకు నమ్మకండి , త్వరలోనే కల్కి 2 కి సంబంధించిన వివరాలను తెలియజేస్తాము , సెప్టెంబర్ నుండి నాన్ షెడ్యూల్స్ ఉంటాయి’ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో సాయి పల్లవి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించబోతుంది అనే వార్తలకు చెక్ పడింది. ఇక ఆ తర్వాత సోషల్ మీడియా లో ప్రధానంగా వినిపిస్తున్న పేరు అలియా భట్. బాలీవుడ్ లో ఈమెకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

మన తెలుగు ఆడియన్స్ కి ఈమె #RRR చిత్రం ద్వారా పరిచయమైంది, తెలుగు ఆడియన్స్ లో సోషల్ మీడియా ని ఉపయోగించే యూత్ ఆడియన్స్ కి అలియా భట్ ఎప్పటి నుండో తెలుసు. అయితే ఈమె ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించబోతుందని ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో ప్రచారమైన వార్త. మేకర్స్ ఇప్పటికే ఖరారు చేసారని , ఆమెపై పలు సన్నివేశాల చిత్రీకరణ కూడా జరిగిందంటూ చెప్పుకొచ్చారు. అయితే దీన్ని చాలా మంది అభిమానులు నమ్మలేదు , కానీ నేడు ప్రభాస్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో అలియా భట్ ప్రధాన పాత్ర పోషించిన ‘ఆల్ఫా’ మూవీ ట్రైలర్ ని అప్లోడ్ చేస్తూ మూవీ టీం కి ఆల్ టైం బెస్ట్ చెప్పారు. జులై 3 న విడుదల అవ్వబోతున్న ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని ఈ సందర్భంగా ఆయన మనస్ఫూర్తిగా కోరుకున్నారు.

సాధారణంగా ప్రభాస్ తన మనసుకి బాగా దగ్గరైన వాళ్ళ సినిమాలు విడుదల అయ్యేటప్పుడు శుభాకాంక్షలు చెప్తుంటారు. లేకపోతే తనతో కలిసి పనిచేయబోయే వాళ్ళ సినిమాలు దగ్గర్లో ఉన్నప్పుడు సపోర్ట్ చేస్తుంటారు . ప్రభాస్ కి అలియా భట్ తో ఎలాంటి స్నేహం లేదు, కాబట్టి త్వరలో తనతో కలిసి పని చేయబోతున్న హీరోయిన్ కావడంతో , ఆయన ఇలా పోస్ట్ చేసి ఉండొచ్చని , కల్కి 2 లో హీరోయిన్ గా అలియా భట్ నటిస్తుందని ఈ ఒక్క ఘటన తో నిర్థారించుకోవచ్చని అంటున్నారు విశ్లేషకులు. రాబోయే రోజుల్లో వీటిల్లో ఎంత నిజముందో చూడాలి.