Home Blog Page 36

అల్పపీడనం.. ఆ జిల్లాలకు రెయిన్ అలెర్ట్!

Heavy Rainfall In Telugu States
Heavy Rainfall In Telugu States

Andhra Pradesh Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన ఉంది. మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే చాన్స్ ఉంది. వాయువ్య బంగాళాఖాతం ఆనుకొని.. ఉత్తర ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాల్లో ఈ అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులపాటు ఉత్తరాంధ్రలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. మిగతా చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళకూడదు అని సూచిస్తున్నారు.

* ఉత్తరాంధ్ర పై ప్రభావం..
ఈ అల్పపీడనం ప్రధానంగా ఉత్తరాంధ్ర పై ప్రభావం చూపుతుంది. దీని ప్రభావంతో ఈరోజు శ్రీకాకుళం, పోలవరం, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వానలు పడే అవకాశం కనిపిస్తోంది. ఈదురుగాలుల ప్రభావం ఉండను ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. అయితే ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. జూన్లో చాలా లోటు కనిపించింది. ఎల్ నినో ప్రభావం అధికంగా ఉంది. రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించాయి. విస్తరించడంలో కూడా మందగమనం కనిపించింది. కానీ తాజా ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది.

* ఆశించిన స్థాయిలో వర్షాలు లేక..
దక్షిణాది రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు. ఉత్తర భారత దేశంలో కూడా వర్షాలు అనుకున్న స్థాయిలో పడటం లేదు. ప్రధానంగా దేశవ్యాప్తంగా 350 కి పైగా జిల్లాల్లో వర్షపాతం లోటు ఉంది.. ఖరీఫ్ సీజన్లో జూన్ కీలకం. నైరుతి రుతుపవనాల ప్రభావంతో జూన్లో విస్తారంగా వర్షాలు పడితేనే ఖరీఫ్ గట్టెక్కేది. అటువంటి జూన్లోనే వర్షాలు ముఖం చాటేయడంతో రైతాంగంలో ఆందోళన నెలకొంది. ఇప్పుడు జూలై మొదటి వారం ప్రవేశించిన ఇంకా వర్షాలు ఆశించిన స్థాయిలో పడటం లేదు. తాజాగా ఇప్పుడు ఈ అల్పపీడన ప్రభావంతో దక్షిణాదిన ఏపీలో ఒడిస్సా తో పాటు పశ్చిమ బెంగాల్ పై ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. సాధారణంగా జూన్ నుంచి నవంబర్, డిసెంబర్ వరకు అల్పపీడనాల ప్రభావం, తుఫాన్లు సంభవిస్తుంటాయి. కానీ ఇంతవరకు వాటి జాడలేదు. తాజాగా ఏర్పడిన ఈ అల్పపీడనం ఎంతవరకు ప్రభావం చూపిస్తుందో చూడాలి.

మోడీకి జపాన్ చెల్లి.. దౌత్యంలో ప్రధానిని మించిన వారిని లేరు..

India Japan Relations
India Japan Relations

India Japan Relations: 1893లో అమెరికాలోని చికాగోలో జరిగిన ప్రపంచ మత సమావేశంలో స్వామి వివేకానందుడు చేసిన ప్రసంగం భారతదేశం పట్ల ప్రపంచ వైఖరిని మార్చివేసింది. ‘సోదర సోదరీమణులారా‘ అని ప్రారంభించిన ఆ సంబోధన ఆ కాలంలో అసాధారణం. అది గౌరవం, సమానత్వం, సానుభూతి యొక్క సంకేతం. పది నిమిషాల సమయం మించినా ప్రతినిధులు ఆసక్తిగా విన్నారు. ఇది భారతదేశ సంస్కృతి, ఆధ్యాత్మికతను ప్రపంచం ముందు గౌరవపూర్వకంగా ప్రదర్శించింది. మనం ఈ క్షణాన్ని పుస్తకాల్లో చదువుతాం, కానీ దాని ప్రభావం ఇప్పటికీ ఉంది.

ఆధునిక దౌత్యంలో మోదీ శైలి…
ఇప్పుడు మన కళ్లెదుటే జరిగిన ఒక సంఘటన ఈ చారిత్రక సందర్భాన్ని గుర్తుకు తెస్తుంది. జపాన్‌ ప్రధాని సనాయే తకాచీ (జపాన్‌ మొదటి మహిళా ప్రధాని) భారతదేశానికి మొదటి అధికారిక పర్యటనకు వచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెను ‘చోటి బెహెన్‌‘ (చిన్న సోదరి) అని సంబోధించారు. ఆమె ఆశ్చర్యపోయి సంతోషించి, ‘మీరు నన్ను అందమైన చిన్న సోదరి అని పిలిచారు‘ అని స్పందించి, సంబంధం జీవితకాలం కొనసాగాలని, సోదర సోదరి బంధంలో అభివృద్ధి చెందాలని కోరారు. ఇది కేవలం పదాలు కాదు. దౌత్య సంబంధాలను మరింత వ్యక్తిగతం, హృదయస్పర్శి చేసి, విశ్వాసాన్ని పెంచే ప్రయత్నం. జపాన్‌తో రక్షణ, సాంకేతికత, ఇన్వెస్ట్‌మెంట్, ఎనర్జీ రంగాల్లో ఒప్పందాలు, సహకారాలు జరిగాయి. వివేకానందుడి విధానం లాంటి ఈ గౌరవపూర్వక సంబోధన భారతదేశ సాంస్కృతిక విలువలను (వసుధైవ కుటుంబకం) ఆధునిక దౌత్యంలో ప్రతిబింబిస్తుంది.

ఇటలీ ప్రధాని మెలోనీతో వీడియో వైరల్‌…
కొన్ని వారాల క్రితం ఇటలీ పర్యటనలో మోదీ, జార్జియా మెలోనీతో జరిగిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. మోదీ మెలోనీకి పార్లే మెలోడీ టాఫీలు బహుమతిగా ఇచ్చి, పేర్ల మధ్య ఆటలాంటి సంబోధన చేశారు. ఇది లైట్‌–హార్టెడ్, స్నేహపూర్వక సంజ్ఞ. అయితే కొన్ని భారతీయ మీడియా సంస్థలు దీనిని అతిగా సంచలనం చేసి, వ్యక్తిగత సంబంధాలు, రిలేషన్‌ గురించి అనవసరమైన చర్చలు, వక్రీకరణలు చేశాయి. ఇది దౌత్య సారాంశాన్ని (బైలాటరల్‌ సంబంధాలు, సహకారాలు) కాకుండా వ్యక్తిగత కోణంలోకి తీసుకెళ్లింది.

జపాన్‌ ప్రధానిని అందమైన సోదరిగా…
ఇప్పుడు ఇలాంటి సంబోధన జపాన్‌ ప్రధానికి చేసినప్పుడు, భారతీయ మీడియా ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్న. మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించి, ఈ సంబోధనను వివేకానందుడి వారసత్వంగా, దౌత్య విశ్వాస నిర్మాణంగా చూడాలి. లేదా మళ్లీ సంచలనాత్మకంగా, వ్యక్తిగతంగా మార్చి, ఒకే రకమైన ద్వంద్వ ప్రమాణాలు చూపించాలా?

దౌత్యంలో భాష ఒక శక్తివంతమైన సాధనం. వివేకానందుడు చేసినట్లు, ‘సోదరి/సోదరుడు‘ వంటి సంబోధనలు గోడలను కూల్చి, సానుభూతి, విశ్వాసం పెంచుతాయి. మోదీ ఈ శైలిని అనుసరించడం ద్వారా భారతదేశం సాంస్కృతిక లోతును ప్రపంచ నాయకులతో పంచుకుంటున్నారు. తకాచీ సానుకూల స్పందన దీనిని నిరూపిస్తుంది. మెలోనీ వీడియోలో జరిగినట్లు, ఇది పబ్లిక్‌ డిస్కోర్స్‌ను హాని చేస్తుంది.

వివేకానందుడి నుంచి మోదీ వరకు ఈ సోదర సంబోధనలు భారతదేశం శాశ్వతమైన విలువలను చూపుతాయి. గౌరవం, స్నేహం, మానవీయ బంధం. ఇవి ఒప్పందాల కంటే మించి, దీర్ఘకాలిక సంబంధాలను నిర్మిస్తాయి. మీడియా ఇప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసి, సంచలనం కాకుండా సారాంశం మీద దృష్టి పెట్టాలి. అప్పుడే పబ్లిక్‌కు నిజమైన అవగాహన కలుగుతుంది.

జగన్ మావిగన్ పై రగిలిపోతున్న మాజీ మంత్రి!

Dharmana Prasada Rao
Dharmana Prasada Rao

Dharmana Prasada Rao: రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారు కొందరు నాయకులు. కానీ ఏపీలో రాజకీయాలు మారిపోవడంతో వారి బాధ అంతా కాదు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రస్థాయి నేతలుగా చలామణి అయ్యారు. చాలా స్వేచ్ఛగా రాజకీయాలు చేశారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంట్రీ తో చాలామంది నేతల తలరాతలు మారిపోయాయి. రాజకీయాల్లో ఉన్నామంటే ఉన్నాం అన్నట్టు వారి వ్యవహార శైలి ఉంది. పదవులు సైతం ఉన్నా అధికారం వెలగబెట్టలేని పరిస్థితి వారిది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలతో వారు సతమతం అవుతున్నారు. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో పలుచన అవుతున్నారు. రాజధానుల అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి వైఖరితో విసిగి వేసారి పోతున్నారు కొంతమంది సీనియర్లు. అటువంటి వారిలో ధర్మాన ప్రసాద రావు ముందుంటారు. జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉండే ధర్మాన.. అదే జగన్మోహన్ రెడ్డి కింద పని చేయాల్సి వచ్చింది. ప్రత్యామ్నాయం లేకపోవడంతో జగన్ విధానాలను సమర్థించాల్సి వచ్చింది. ఇప్పుడు అవే చేటు తెస్తున్నాయి.

* విశాఖ రాజధానిపై ప్రచారం..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రిగా వ్యవహరించారు ధర్మాన ప్రసాదరావు. తొలి మూడేళ్లు ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో మౌనమునిగా మారిపోయారు. మంత్రి పదవి ఇచ్చేసరికి యాక్టివయ్యారు. జగన్మోహన్ రెడ్డి మంచితనాన్ని చాటి చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆయనకు విశాఖ పాలన రాజధాని అస్త్రం దొరికింది. గ్రామాల్లో ఏకంగా సభలు ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర కోసం విశాఖను రాజధానిగా చేర్చారని.. ఆయన రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు ఆ మాటలను విశ్వసించలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించలేదు.

* డిఫెన్స్ లో మాజీమంత్రి..
అయితే జగన్మోహన్ రెడ్డి మావిగన్ స్టాండ్ తీసుకోవడంతో ధర్మాన ప్రసాదరావు లాంటివారు డిఫెన్స్ లో పడిపోయారు. వాస్తవానికి 2014 ముందు ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ పార్టీ నేతగా ఉంటూ.. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన చెప్పే మాటకు విశ్వాసం, విశ్వసనీయత ఉండేది. మంచి వాగ్దాటితో ప్రజా సమస్యలకు పరిష్కారం చూపగల నాయకుడిగా పేరు ఉండేది. ఎప్పుడైతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి.. జగన్మోహన్ రెడ్డి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం.. అవి ఎప్పటికప్పుడు మారిపోతుండడంతో ధర్మాన ప్రసాదరావు వ్యక్తిత్వాన్ని డ్యామేజ్ చేసేలా చేశాయి. వాస్తవానికి ధర్మాన ప్రసాదరావు జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని విభేదిస్తారన్న కామెంట్ ఉంది. జగన్ వైఖరిని పెద్దగా ఇష్టపడరని కూడా అనుచర వర్గం చెబుతుంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో.. గత్యంతరం లేని స్థితిలో జగన్ పంచన చేరారు అని కూడా కామెంట్స్ ఉన్నాయి. కానీ అదే జగన్ విధానాలను బలంగా బలపరిచి ధర్మాన ప్రసాదరావు మరింత బలహీనం అయ్యారు. విశాఖ రాజధాని విషయంలో అతి చేశానని.. మావిగన్ స్టాండ్ తో జగన్మోహన్ రెడ్డి దారుణంగా దెబ్బతీశారన్న ఆవేదనతో ఉన్నారట ధర్మాన. చూడాలి ధర్మాన ఎలా ముందుకు వెళ్తారో..

'భోగా'పురమే.. రియల్ జోరు!

Bhogapuram Airport
Bhogapuram Airport

Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానుంది. మరి కొద్ది రోజుల్లోనే ప్రారంభోత్సవంతో జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. దాదాపు పనులన్నీ పూర్తి కావడంతో ప్రారంభోత్సవానికి ముస్తాబయింది. ఉత్తరాంధ్ర తలరాతను మార్చబోతోంది ఈ విమానాశ్రయం. అయితే ఎయిర్పోర్ట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. విజయనగరం జిల్లా సరిహద్దులతోపాటు భోగాపురం చుట్టుపక్కల పది కిలోమీటర్ల పరిధిలో భూములతో పాటు ఇళ్ల స్థలాలు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టేందుకు భారీగా ముందుకు వస్తున్నారు.

* అత్యాధునిక విల్లాలు..
సాధారణంగా వెంచర్లలో ప్లాట్లు విక్రయిస్తుంటారు. కానీ భోగాపురంలో ఓపెన్ ప్లాట్ల వెంచర్ల స్థానంలో.. సరికొత్తగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కమర్షియల్ విల్లా ప్రాజెక్టులు, లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలు వెలుస్తున్నాయి. ఎయిర్పోర్ట్ కారిడార్ ఆనుకొని ఉన్న జాతీయ రహదారికి ఇరువైపులా.. వందల ఎకరాల్లో ఆధునిక టౌన్షిప్ ల నిర్మాణాలు ఊపందుకున్నాయి. విమానాశ్రయ కార్యకలాపాలు ప్రారంభమైతే.. ఈ ప్రాంతం ఒక పెద్ద ఎకానమిక్ హబ్ గా మారనుంది. ప్రధానంగా ప్రీమియం నివాస గృహాలకు, కమర్షియల్ స్పేస్ కు డిమాండ్ విపరీతంగా పెరిగింది.

* ఆస్తిపై పెట్టుబడులు..
ఉత్తరాంధ్రలో వలసలు ఎక్కువ. ఆపై చదువుకున్న వారు సైతం విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాలలో స్థిరపడిన వారు ఉన్నారు. అటువంటి వారంతా భోగాపురం పరిసర ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఉన్నత రంగాల్లో స్థిరపడిన వారు మాత్రం కమర్షియల్ విల్లాలు, లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలు కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. ప్లాట్ లతోపాటు వెళ్లాలని ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. తమ సొంత గడ్డపై అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం పక్కనే స్థిరాస్తి కలిగి ఉండడాన్ని గొప్పగా భావిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ధర పెరుగుతుందన్న ఆశతో ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు.

* మూడు జిల్లాలపై ప్రభావం..
ఒక్క భోగాపురం మాత్రమే కాదు విజయనగరం జిల్లాలోని రెండు మూడు నియోజకవర్గాలతో పాటు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లో సైతం రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంటుంది భోగాపురం విమానాశ్రయ నిర్మాణంతో. భూములతో పాటు ఇళ్ల స్థలాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లు కూడా భారీగా జరుగుతున్నాయి. ఉత్తరాంధ్రలోని ఉమ్మడి మూడు జిల్లాలకు ప్రధాన కేంద్రంగా మారనుంది భోగాపురం. భవిష్యత్తులో భోగాపురం ఒక నగరంగా అవతరించునుంది. వారం వారం ఇక్కడి చదరపు గజం ధరలు మారుతుండడంతో స్థానిక రైతులు, భూ యజమానులకు ఊహించని రీతిలో ఆర్థిక ప్రయోజనం చేకూరుతోంది.

లక్షన్నర హెక్టార్లలో బంగారం.. ఏపీలో తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత

Andhra Pradesh Gold Mines
Andhra Pradesh Gold Mines

Andhra Pradesh Gold Mines: దేశంలో ఇప్పుడు అందరి చూపు ఏపీపై ఉంది. ఎందుకంటే వరుసగా బంగారుగనులు వెలుగు చూస్తున్నాయి. మొన్ననే కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం ఖనిజ తవ్వకాలు, ఉత్పత్తి మొదలైంది. అయితే ఇప్పుడు ఏపీలో రాయలసీమ ప్రాంతంలో భారీగా బంగారం ఖనిజం నిల్వలు ఉన్నాయని జాతీయ ఖనిజాన్వేషణ అభివృద్ధి ట్రస్ట్ భావిస్తోంది. అందుకే పెద్ద ఎత్తున ఖనిజాన్వేషణ చేయాలని నిర్ణయించింది. ఒకటి కాదు రెండు కాదు రాష్ట్రంలో 14 ప్రాంతాల్లో బంగారం గని నిల్వలు ఉన్నాయన్నది ఒక అంచనా. 1.58 లక్షల హెక్టార్లలో బంగారు నిక్షేపాలు ఉండే అవకాశం ఉందన్న అంచనా తో ఈ అన్వేషణ మొదలు పెడుతోంది జాతీయ ఖనిజాన్వేషణ అభివృద్ధి ట్రస్ట్.

* మూడు దశాబ్దాల పరిశోధనలు..
కర్నూలు జిల్లాలో బంగారు గనికి సంబంధించి మూడు దశాబ్దాలకు పైగా పరిశోధనలు జరిగాయి. ఇప్పుడు ఈ 14 ప్రాంతాల్లో నాలుగు దశల్లో అన్వేషణ చేపట్టనున్నారు. ఇక్కడి మట్టి, రాళ్లు పరిశీలించి బంగారు నిక్షేపాలు లభించేందుకు ఉండే అవకాశాన్ని నిర్ధారిస్తారు. దీనిని జియాలాజికల్ 4 దశ అంటారు. సగటున నాలుగు వందల మిల్లీమీటర్లకు ఒకటి చొప్పున బోరు హోల్స్ వేసి.. భూమి లోపల నుంచి నమూనాలు తీసి పరిశీలిస్తారు. దీనిని g3 దశగా పేర్కొంటారు. అప్పుడు సానుకూల ఫలితాలు వస్తే g2కి వస్తారు. జీ 2 లో సగటున ప్రతి 200 మీటర్ల దూరానికి ఒక బోర్ హోల్స్ వేసి అన్వేషిస్తారు. ఇది విజయవంతం అయితే కనీస లీజులు కేటాయించి.. మైనింగ్ కు వీలు కల్పిస్తారు. ఈ ప్రక్రియను జీ1 గా పేర్కొంటారు.
* ప్రధానంగా రాయలసీమ ప్రాంతాల్లో బంగారు గనులు ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది. శ్రీ సత్య సాయి జిల్లా నంబలపూలకుంట మండలం జౌకుల గ్రామ పరిధిలో 1000 హెక్టార్ల చొప్పున ఆరు బ్లాకులుగా విభజించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఇక్కడ ఖనిజాన్ వేసిన ప్రారంభం అయ్యింది. అలాగే రామగిరిలో గతంలో భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ గనులు ఉండేవి. ఇప్పుడు వాటిని ఆనుకునే 2000 హెక్టార్లలో అన్వేషణకు గతంలో ముంబైకి చెందిన ఆంధ్ర మైనింగ్ కార్పొరేషన్ కు అనుమతి ఇచ్చారు.
* చిత్తూరు జిల్లా చిగురుకుంట, సన్నతంలో 273 హెక్టార్లలో 22 లక్షల టన్నుల బంగారు ఖనిజం ఉంటుందని గతంలో గుర్తించారు. ఇక్కడ 12,500 కేజీల బంగారం ఉంటుందని భావిస్తున్నారు. గతంలో దీనిని కేంద్ర ఖనిజాభివృద్ధి సంస్థకు కేటాయించారు. కానీ తవ్వకాలు చేయలేకపోయింది. తాజాగా దీనికి వేలం వేస్తున్నారు. మొత్తానికి అయితే ఏపీ ఇప్పుడు బంగారు గనిగా మారిపోయింది.

వైసీపీ నేతల గుండెల్లో మావి'గన్'!

YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: వైయస్ జగన్మోహన్ రెడ్డి మావిగన్ స్టాండ్ తీసుకున్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికలు అమరావతి వర్సెస్ మావిగన్ అన్న అజెండాతో జరుగుతాయని తేల్చి చెప్పారు. అయితే దీనిపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కానీ ఇకనుంచి మావిగన్ స్టాండ్ మీద మాట్లాడాలని రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆదేశాలు అందాయి. భవిష్యత్తులో మచిలీపట్నం- విజయవాడ- గుంటూరును కలుపుకొని మావిగన్ రాజధానిని అభివృద్ధి చేస్తామని చెప్పాలని వైసీపీ శ్రేణులకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందాయి. మావిగన్ ప్రతిపాదనకు సంబంధించి నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించుకోవాలని కూడా భావిస్తున్నారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఈ విషయంలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అయితే వైసీపీ నేతలు తలెత్తుకోలేకపోతున్నారు.

* ఇప్పుడు ఎలా చెబుతాం..
మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అయితే అధికారంలో ఉన్నప్పుడు గ్రామాల్లో సభలు నిర్వహించి ఈ ప్రాంతానికి రాజధాని వస్తుందని చెప్పారు. విశాఖ పాలన రాజధానిగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించారని.. ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోతాయని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు మావిగన్ అంటే ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ప్రజలకు చెప్తామని ధర్మాన ప్రసాదరావు తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విశాఖ వైసిపి నేతలకు ఈ విషయంలో చుక్కలు కనిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలోకి వెళ్లి మావిగన్ అంటే ప్రజలు నవ్వుతారని.. వెటకారం చేస్తారని చెప్పుకొస్తున్నారు. అందుకే ప్రజలకు తాము చెప్పలేమని తేల్చి చెబుతున్నారు.

* విద్యాధికుల అభ్యంతరం..
సమాజంలో చీలిక తేవాలన్న జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం ఇది అని మేధావులు తేల్చి చెబుతున్నారు. అమరావతి రాజధానిపై ఇంకా విషం చిమ్మడం అంత మంచిది కాదు అని సూచిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం వినే రకం కాదు. కచ్చితంగా ఆయన మావిగన్ పైనే ముందుకు వెళ్తారు. అయితే ఆయన నుంచి వచ్చే కామెంట్స్ ఇప్పుడు మరి ఇబ్బందికరంగా మారుతున్నాయి. మావిగన్ మా స్టాండ్ అని చెబుతూనే విజయవాడ మా రాజధాని అంటూ నిన్నే మాట్లాడారు. ఒకవైపు అమరావతి రాజధాని పనులు జరుగుతుండగా.. ఇలా రాజధానిని మార్చేస్తామని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రకటన కొన్ని వర్గాల్లో ప్రభావం చూపిస్తుందని వైసీపీ నేతలు ఆందోళనతో ఉన్నారు. అందుకే మావిగన్ విషయంలో ప్రజలను కన్వెన్స్ చేయలేమని తేల్చి చెబుతున్నారు.

ప్రశ్న రావన్ ను అరెస్టు చేసి.. జడ శ్రావణ్ ను ఎందుకు వదిలేసినట్టు?

Jada Sravan
Jada Sravan

Jada Sravan Kumar: ఏపీలో ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం కల్పిస్తోంది. దానికి కారణం మతపరమైన కామెంట్స్. ముఖ్యంగా దళిత క్రైస్తవ మహాసభలో జడ శ్రావణ్ కుమార్ తో పాటు ప్రశ్న రావణ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారానికి దారి తీసాయి. ఈ నేపథ్యంలో ప్రశ్న రావణ్ అరెస్టు జరిగింది. కానీ జడ శ్రావణ్ కుమార్ పై కేసుతో సరిపెట్టారు. దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఈ విషయంలో బాధపడుతున్నారు. ప్రశ్న రావణ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. జడ శ్రావణ్ కుమార్ మాత్రం రఘురామకృష్ణం రాజును వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. బాడీ షేమింగ్ గురించి కూడా మాట్లాడారు. అయితే తనపై ఇంతలా విరుచుకుపడిన జడ శ్రావణ్ కుమార్ పై కేవలం కేసు మాత్రమే నమోదయి అరెస్టు జరగకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు రఘురామకృష్ణంరాజు.

* ఆకివీడు ఆలయ ఘటనతో..
ఆకివీడు ఆలయ ఘటన నేపథ్యంలో రఘురామకృష్ణం రాజు హిందుత్వ వాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అదే సమయంలో చాలా ప్రశ్నలు వేశారు ఒక వేదిక ప్రారంభించి. అయితే దీనిపై భిన్న వాదనలు వినిపిస్తూ వచ్చాయి. అయితే రఘురామకృష్ణంరాజుకు వ్యతిరేకంగా దళిత క్రైస్తవ సభను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో జడ శ్రావణ్ కుమార్ రఘురామకృష్ణం రాజును హెచ్చరిస్తూ నాలుక కోస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దానిని పిఠాపురం పవన్ కళ్యాణ్ కు బహూకరిస్తానని కూడా తేల్చి చెప్పారు. ఇక ప్రశ్న రావణ్ చేసిన వ్యాఖ్యలు మరింత అభ్యంతరకరంగా ఉన్నాయి. ఈ తరుణంలో వారిద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. వారి విషయంలో కూటమి ప్రభుత్వం ఎందుకు వెనక్కి తగ్గుతుందో తెలియడం లేదని ఎక్కువ మంది ప్రశ్నించారు. ఈ తరుణంలో ఆ ఇద్దరిపై కేసులు నమోదయ్యాయి. ప్రశ్న రావణ్ అరెస్ట్ కూడా జరిగింది. కానీ జడ శ్రావణ్ కుమార్ విషయంలో మాత్రం అరెస్టు జరగకపోవడం ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో రఘురామకృష్ణంరాజు జడ శ్రావణ్ కుమార్ అరెస్ట్ జరగకపోవడం పై ఆవేదన వ్యక్తం చేశారు.

* వైసిపి లైన్ లో శ్రావణ్ కుమార్..
గత కొంతకాలంగా జడ శ్రావణ్ కుమార్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లైన్లో మాట్లాడుతున్నారు. 2024 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచారు. అమరావతి లాంటి అంశాలపై నిత్యం మాట్లాడేవారు. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం టిడిపి నాయకత్వంతో విభేదాలు వచ్చాయి. టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జడ శ్రావణ్ కుమార్ ప్రశ్నించడం ప్రారంభించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార మీడియాతో పాటు సోషల్ మీడియా జడ శ్రావణ్ కుమార్ ను ప్రోత్సహించడం ప్రారంభించింది. టీవీ డిబేట్లో సైతం కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు శ్రవణ్ కుమార్. ఈ తరుణంలో ఆకివీడు ఆలయ ఘటనలో రఘురామకృష్ణం రాజు దూకుడుగా వ్యవహరించారు. దీంతో జడ శ్రావణ్ కుమార్ ఈ ఘటనపై స్పందిస్తూ రఘురామకృష్ణంరాజును టార్గెట్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు దళిత క్రైస్తవ మహాసభలో శ్రావణ్ కుమార్ తో పాటు ప్రశ్న రావణ్ సైతం అనుచిత వ్యాఖ్యలు చేశారు. మీరు విషయంలో ప్రభుత్వం చూసి చూడనట్టుగా వెళ్ళింది. కానీ అది అసమర్థత కింద వస్తుందని భావించి కేసులు నమోదు చేసింది. అయితే వీరిపై కేసులు, అరెస్టులకు రాష్ట్రంలో ఒక రకమైన వాతావరణాన్ని క్రియేట్ చేయాలని విపక్షం చూస్తోందన్న అనుమానాలు ఉన్నాయి. అందుకే ప్రారంభంలో పెద్దగా పట్టించుకోలేదు ప్రభుత్వం. ప్రశ్న రావణ్ ను కట్టడి చేసేందుకు అరెస్టు జరగగా.. జడ శ్రావణ్ కుమార్ విషయంలో మాత్రం వేచి చూసే ధోరణి కనిపిస్తోంది ప్రభుత్వంలో. అయితే దీనిపై రఘురామకృష్ణం రాజు ఆవేదనతో ఉన్నట్టు కనిపిస్తున్నారు. చూడాలి ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో..

భీమ్ రెడ్డి.. అవినీతిలో బాహుబలి.. ఆస్తులు వందల కోట్లు.. లెక్కించడానికి కావాలి ప్రత్యేక యంత్రాలు

Bheem Reddy
Bheem Reddy

Bheem Reddy: ఆయన పేరు భీమిరెడ్డి.. తెలంగాణ పోలీస్ శాఖలో డిఎస్పి. డిజిపి ఆఫీసులో స్టేషనరీ వింగ్లో పనిచేస్తూ ఉంటారు. ఈయన ఇంట్లో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు మొదలుపెట్టారు. భారీగా సోదాలు చేశారు. ఈ సోదాలలో ఏకంగా వందల కోట్ల ఆస్తులను అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు.

పోలీస్ శాఖలో ఈ స్థాయిలో అక్రమ సంపాదన ఉంటుందా అని ఏసీబీ అధికారులు నోటి మీద వేలుసుకుంటున్నారు. అసలు ఇంతటి సంపాదన ఎలా సాధ్యమంటూ ఆశ్చర్యపోతున్నారు. భీమ్ రెడ్డికి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఆస్తులు ఉన్నాయి. హైదరాబాద్.. వికారాబాద్.. జహీరాబాద్.. గచ్చిబౌలి.. రంగారెడ్డి.. శంషాబాద్ ప్రాంతాలలో భారీగా ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాంతాలలో పోలీసులు ప్రత్యేకంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల సమయంలో పోలీసులకు ఒక డైరీ లభించింది. ఆ డైరీలో భీమిరెడ్డికి సంబంధించిన బినామీల చిట్టా ఉన్నట్టు సమాచారం. ఆ బినామీలలో దాదాపు 15 మంది దాకా ఉన్నట్టు తెలుస్తోంది.

భీమ్ రెడ్డికి సంబంధించిన ఒక బినామీ ఇంట్లో నుంచి ఏసీబీ అధికారులు వేగంగా 40 లక్షల వరకు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా.. ఇతర రాష్ట్రాలలో కూడా భీమిరెడ్డి భారీగా పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. గచ్చిబౌలి ప్రాంతంలో అత్యంత విలాసవంతమైన బహుళ అంతస్తుల భవనాన్ని తన కూతురి పేరు మీద భీమిరెడ్డి కొనుగోలు చేశారు. బెంగళూరుకు దగ్గరగా ఉన్న ఓ ప్రాంతంలో ఏకంగా ఎకరం భూమి ఉన్నట్టు తెలుస్తోంది. దీని విలువ కూడా భారీగా ఉన్నట్టు సమాచారం. ఓపెన్ ప్లాట్లు.. సాగు భూములు కూడా భీమిరెడ్డి పేరు మీద ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు అనేక రకాల ల్యాండ్ డాక్యుమెంట్లను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని కూడా భారీగా కూడబెట్టినట్టు ప్రచారం జరుగుతోంది.

భీమిరెడ్డి అక్రమ సామ్రాజ్యం అత్యంత పెద్దదిగా ఉంది. బ్యాంకు లాకర్లు మాత్రమే కాకుండా.. బినామీ ఖాతాలు కూడా ఉన్నాయి. ఈ ఆస్తులను మొత్తం లెక్కించడానికి ఇంకా రెండు నుంచి మూడు రోజుల వరకు పట్టే అవకాశం ఉంది. భీమిరెడ్డి.. పోలీస్ శాఖలో అవినీతి అనకొండ అని.. అక్రమ ఆస్తులను సంపాదించడంలో బాహుబలి అని.. ఏసీబీ అధికారులు చెబుతున్నారు. అతడిని త్వరలోనే అధికారికంగా అరెస్ట్ చేస్తామని.. రిమాండ్ కు తరలిస్తామని పేర్కొన్నారు.

ఐదు సీట్లు.. 25 కోట్లు..జడ శ్రావణ్ అసలు ముఖచిత్రం ఇదీ

Jada Sravan Kumar
Jada Sravan Kumar

Jada Sravan Kumar: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొద్దిరోజులుగా చర్చ మొత్తం జడ శ్రావణ్ చుట్టూ తిరుగుతోంది. ఇటీవల అతడు దళిత క్రైస్తవుల సదస్సు నిర్వహించారు. ఈ నేపథ్యంలో తాను డిప్యూటీ సీఎం అవుతానని ప్రకటించారు. అంతేకాదు, ఇకనుంచి దళిత క్రైస్తవులు జడ శ్రావణ్ తాలూకా అని చెప్పుకునే రోజు వస్తుందని పేర్కొన్నారు. ఆ వేదిక మీద రాజకీయ పరంగా కూడా ఆయన విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

శ్రావణ్ ఇటీవల ప్రశ్న రావణ్ అనే వ్యక్తికి అండగా నిలిచారు. ప్రశ్న రావణ్ ప్రముఖంగా సీఎం చంద్రబాబు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తన పరిధి దాటి మాట్లాడుతున్నారు. దీంతో ప్రశ్న రావణ్ పై అనేకమంది ఫిర్యాదులు చేశారు. ఆ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కూడా మొదలుపెట్టారు. ఈ ప్రక్రియలో భాగంగా ప్రశ్న రావణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రశ్న రావణ్ కు జడ శ్రావణ్ అండగా నిలిచారు. ఆయనకు సపోర్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఏపీ పోలీసులు అక్రమంగా ప్రశ్న
రావణ్ ను అరెస్ట్ చేశారని ఆరోపించారు జడ శ్రావణ్.

జడ శ్రావణ్ కు వైసిపి సపోర్ట్ ఇవ్వడం.. సాక్షి మీడియాలో కీలక ప్రాధాన్యం లభిస్తున్న నేపథ్యంలో.. శ్రావణ్ అసలు రూపం బయట పెట్టడానికి మహాసేన రాజేష్ తెరపైకి వచ్చారు. కీలక విషయాలను వెల్లడించారు. దళితులను కుల, మత వివాదాలకు జడ శ్రావణ్ వాడుకుంటున్నారని.. వారిని బలి పశువులుగా చేస్తున్నారని మాడిపడ్డారు. దళితులకు చెడ్డ పేరు తీసుకొచ్చే అధికారం శ్రావణ్ కు లేదని రాజేష్ మండిపడ్డారు..”జడ శ్రవణ్, యూట్యూబర్ ప్రశ్న రావణ్ వైసిపికి పెయిడ్ ఆర్టిస్టులు.. జగన్ దళితుల మధ్య వివాదాలు సృష్టించడానికి వీరిద్దరిని వాడుకుంటున్నారు.. రావణ్ పవన్ కళ్యాణ్ మీద అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. చట్ట ప్రకారమే వారి మీద పోలీసులు చర్యలు తీసుకున్నారు.. వేరే పేర్లతో సమావేశాలు పెట్టుకుని.. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడుతున్నారు.. శ్రవణ్ ఆల్రెడీ ఒక పార్టీ పెట్టుకున్నారు. అలాంటప్పుడు ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పకుండా.. డిప్యూటీ సీఎం అవుతానని చెప్పడం ఏంటని” రాజేష్ ప్రశ్నించారు.

“గత ఎన్నికల్లో ఐదు సీట్లను.. 25 కోట్లను జడ శ్రావణ్ అడిగారు. దానికి చంద్రబాబు ఒప్పుకోలేదు. చంద్రబాబు ఒప్పుకోలేదని విమర్శలకు దిగాడు. అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. వీరి మీద కాకినాడ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తాం. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడుతున్న శ్రవణ్ విధానాలను ఎండగడతామని” రాజేష్ పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహారం రాజేష్ వర్సెస్ శ్రవణ్ అన్నట్టుగా మారిపోయింది. రాజేష్ ప్రతి అంశాన్ని ఉదాహరణలతో బయట పెట్టడంతో శ్రవణ్ అసలు రూపం బయటపడింది. రాజేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన నేపథ్యంలో శ్రావణ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

సాయి కృష్ణ కేసు.. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో దొరికిన ఫోన్.. అందు లోనే అంతా ఉంది..

Sai Krishna Case
Sai Krishna Case

Sai Krishna Case: రౌడీ షీటర్ సాయి కృష్ణ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.. ఇప్పటిదాకా ఈ కేసును విచారిస్తున్న పోలీసులకు.. కీలక విషయాలు తెలిసినప్పటికీ.. కేసును మలుపు తిప్పే అసలు సంగతి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ కేసులో మరిన్ని పెద్ద తలకాయలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

సాయి కృష్ణ కనిపించకుండా పోయిన తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇవన్నీ కూడా ఇన్స్పెక్టర్ నాగరాజు.. హెడ్ కానిస్టేబుళ్ళు అశోక్ కుమార్, నాని మధ్య చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఒక మొబైల్ షాప్ నుంచి వీరంతా కూడా లాభ కంపెనీకి సంబంధించిన కీప్యాడ్ ఫోన్ కొనుగోలు చేశారు. అందులో ఏమాత్రం పని చేయని జియో సిమ్ కార్డ్ ఏర్పాటు చేశారు. వీటిని విజయవాడ నగరంలోని గవర్నర్పేట ప్రాంతంలో ఎన్టీఆర్ కాంప్లెక్స్ లో కొనుగోలు చేసినట్టు సమాచారం. వాస్తవానికి జియో సిమ్ లు అన్ని స్మార్ట్ ఫోన్లలో పనిచేస్తుంటాయి. కీప్యాడ్ ఫోన్లలో సిమ్ వేసినప్పుడు.. ఆ కంపెనీకి సంబంధించిన డివైస్ లో అమర్చినప్పుడు మాత్రమే పనిచేస్తూ ఉంటాయి. అయితే సాయి కృష్ణ వ్యవహారంలో పోలీసులు ఇలా ఎందుకు చేశారు అనే దానిమీద ఇంతవరకు క్లారిటీ లేదు. లావా ఫోన్లో జియో సిమ్ వేసి.. కావాలని కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్ వి ఆర్ దగ్గర వదిలేసారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దర్యాప్తు పక్కదారి పడుతుందని.. దానిని అలా చేయడానికి ఇలా చేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ సాంకేతికంగా దర్యాప్తు గంగా చేస్తే అసలు విషయం బయట పడుతుందని తెలుస్తోంది.

ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాలకు అనుసంధానించిన ఎన్విఆర్.. హార్డ్ డిస్క్. నిర్వహణ మొత్తం ఇన్స్పెక్టర్ ఛాంబర్ లోనే ఉంటుంది. వాటిని పరిశీలించాలంటే కచ్చితంగా ఇన్స్పెక్టర్ అనుమతి ఉండాలి. ఆయన ఆదేశాలు ఇవ్వడంతోనే హార్డ్ డిస్క్ లు మార్చినట్టు తెలుస్తోంది.. వీటిని సౌత్రిక టెక్నాలజీస్ అనే కంపెనీ వీటిని ఏర్పాటు చేసింది. కానిస్టేబుళ్లు అశోక్, నాని వీటిని అత్యంత తెలివిగా తొలగించి.. అదే సంవత్సర సంబంధించిన హార్డ్ డిస్క్ లు కొత్త వాటిని ఏర్పాటు చేశారు. వాటిపై సీరియల్ నెంబర్లు పరిశీలించినప్పుడు ఈ మార్చిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది.. సౌత్రిక కంపెనీ ఏర్పాటుచేసిన సీరియల్ నెంబర్లు.. అశోక్ , నాని ఏర్పాటుచేసిన హార్డ్ డిస్క్ సీరియల్ నెంబర్లు సరి పోలడం లేదు. ఫుటేజీని మాయం చేయడానికి ఇలా చేశారని తెలుస్తోంది.

మార్కాపురం నుంచి మే 6న సాయి కృష్ణను కృష్ణలంక తీసుకొచ్చారు. అప్పటినుంచి మే 8 వరకు అనేక దృశ్యాలు సీసీ కెమెరాలు నిక్షిప్తమయ్యాయి. ఆ తర్వాత ఆ ఫుటేజీ మొత్తం తొలగించాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. వాటిని తొలగించాలంటే కచ్చితంగా యూజర్ ఐడి.. పాస్వర్డ్ తెలిసి ఉండాలి.. సురక్ష ప్రాజెక్టులో భాగంగా కమిషనరేట్ లో వీటిని ఏర్పాటు చేశారు. అంతేకాదు ఐ టి వి భాగంలో సీసీ కెమెరాల యూజర్ ఐడి, పాస్వర్డ్లు స్టోర్ చేశారు. స్టేషన్లో ఈ వివరాలు ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఒకవేళ హార్డ్ డిస్క్ అలానే ఉంటే డాటా మొత్తం రిట్రైవ్ చేసే అవకాశం ఉంటుంది. ఇదంతా ఎందుకని ఒక సాంకేతిక నిపుణుడిని తీసుకొచ్చి హార్డ్ డిస్క్ లు తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేశారు.. పాత హార్డ్ డిస్క్ లను తగలబెట్టారని సమాచారం.

సంజు శాంసన్ తస్మాత్ జాగ్రత్త.. చాప కింద నీరులా వైభవ్ సూర్య వంశీ

Sanju Samson
Sanju Samson

Sanju Samson: టీమిండియాలో ముఖ్యంగా టి20 ఫార్మాట్లో విపరీతమైన పోటీ ఉంది. ఒక ఆటగాడికి అవకాశం లభించడమే అత్యంత కష్టంగా ఉంటే.. వచ్చిన అవకాశాన్ని నిలుపుకోకపోతే అంతే సంగతులు. ఒకసారి బయటికి వెళ్లిపోతే.. మళ్లీ ఆ స్థానాన్ని దక్కించుకోవడం అంత సులభం కాదు. మేనేజ్మెంట్ టి20 ఫార్మేట్ లో ఆటగాళ్లకు చోటు ఇవ్వడంలో ముఖ్యంగా ఐపీఎల్ లో చూపించిన ప్రదర్శనను ప్రామాణికంగా తీసుకుంటున్నది. అలాంటప్పుడు ఆటగాళ్లు చోటు సంపాదించడమే కాదు.. దక్కించుకున్న చోటు కోసం స్థిరమైన ఆట తీరు ప్రదర్శించాల్సిన అవసరం ఉంది.

టీమ్ ఇండియాలో ప్రస్తుతం ఓపెనర్ సంజు శాంసన్ తీవ్రమైన ఇబ్బంది పడుతున్నాడు. ఐర్లాండ్ సిరీస్ లో వరుసగా విఫలమయ్యాడు. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన తొలి t20 మ్యాచ్లో కూడా బ్యాట్ ఎత్తేశాడు. వాస్తవానికి టి20 వరల్డ్ కప్ లో అతడు చూపించిన ప్రదర్శన ఆధారంగా జట్టులో చోటు లభించింది. కానీ ఇప్పుడు.. అతడి విఫల ప్రదర్శన చోటుకే ఎసరు తీసుకొచ్చే విధంగా ఉంది. ఇప్పటికే మేనేజ్మెంట్ అతడికి మూడు అవకాశాలు ఇచ్చింది. ఇంకా మరికొన్ని అవకాశాలు ఇస్తుందో లేదో తెలియదు గాని.. ఇంగ్లాండ్ జట్టుతో జరిగే రెండవ టి20 మ్యాచ్లో సంజు తనను తాను నిరూపించుకో లేకపోతే స్థానాన్ని వైభవ్ సూర్య వంశీ త్యాగం చేయాల్సి ఉంటుంది.

ఐర్లాండ్ జట్టు మీద కేవలం 5, 0 పరుగులు మాత్రమే చేశాడు సంజు. ఇంగ్లాండ్ జట్టు మీద తొలి మ్యాచ్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేయగలిగాడు. ఆడితేనేమో గొప్పగా ఆడుతున్నాడు. లేకుంటేనేమో విఫలమవుతున్నాడు. పైగా ఓపెనర్ గా రంగంలోకి దిగుతున్న అతడు.. త్వరగా విఫలమయి వెంటనే వెనక్కి వస్తున్నాడు.. అతడు అలా అవుట్ కావడం మిగతా ప్లేయర్లను తీవ్రమైన ఇబ్బందికి గురిచేస్తుంది.. సంజు మీద విమర్శలు వస్తున్నప్పటికీ కోచ్ గౌతమ్ గంభీర్.. కెప్టెన్ అయ్యర్ అతడికి సపోర్ట్ ఇస్తున్నారు. అయితే ఈ సపోర్ట్ ఎంత కాలమో సాగదు. వరుసగా అతడు విఫలమైతే.. మేనేజ్మెంట్ కూడా అవకాశాలు ఇవ్వదు. టి20 వరల్డ్ కప్ హీరో అని పొగిడిన వారే.. జీరో అంటూ తిరస్కరిస్తారు. అందులో ఏమాత్రం అనుమానం లేదు.

సంజు విఫలమవుతున్న నేపథ్యంలో అతడి స్థానంలో సూర్య వంశీకి అవకాశం కల్పించాలని డిమాండ్ల వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ట్రై సిరీస్ ఫైనల్ మ్యాచ్లో సూర్య వంశీ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. టీమిండియా కు ట్రోఫీ ని అందించాడు. అంతేకాదు ఐర్లాండ్ జట్టుతో జరిగిన సిరీస్ కు ఎంపిక అయ్యాడు. కానీ సీనియర్ ప్లేయర్లు ఉండడంతో అతనికి ఆడే అవకాశం లభించలేదు. ఇప్పుడు సంజు విఫలమవుతున్న నేపథ్యంలో అతడికి చోటు కల్పించాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ మేనేజ్మెంట్ సంజుకు ఒకటి లేదా రెండు అవకాశాలు ఇచ్చి.. అందులో కూడా అతడు సఫలం కాకపోతే.. అతడి స్థానాన్ని సూర్య వంశీతో భర్తీ చేసే అవకాశం లేకపోలేదు.

ఇప్పటికే ఆకలిగా ఉన్న పులి మాదిరిగా ఎదురుచూస్తున్నాడు సూర్య వంశీ. వచ్చిన అవకాశాన్ని అతడు ఏమాత్రం వదులుకోడు. ఎందుకంటే శ్రీలంక ప్లేయర్లు ఫైనల్ మ్యాచ్ ముందు తనను గెలికితే.. ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చాడో అందరికీ తెలుసు. తనకు ప్లేయింగ్ 11 లో అవకాశం ఇవ్వకపోతే.. సూర్యవంశీ లో ఎంతటి కసి దాగి ఉందో అందరికీ తెలుసు. అవకాశం ఇచ్చి చూపిస్తే మాత్రం టి20 క్రికెట్ మొత్తాన్ని తగలబెట్టే దమ్ము సూర్య వంశీకి ఉంది. అందువల్ల సంజు జాగ్రత్త పడాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడాలి.

నరేంద్ర మోడీ స్ట్రాంగ్ డెసిషన్.. ఒక్క దెబ్బతో పాకిస్తాన్, చైనాకు చెక్..

Narendra Modi
Narendra Modi

Narendra Modi: ఒకే ఒక్క నిర్ణయం.. భారతదేశాన్ని మరింత బలోపేతం చేసింది. నరేంద్ర మోడీ తీసుకున్న ఒకే ఒక్క స్టెప్ మన శత్రుదేశాలైన చైనా, పాకిస్తాన్ కు ఏకకాలంలో చెక్ పెట్టింది. ఫలితంగా భారతదేశ చరిత్రలోనే సరికొత్త అధ్యాయం సాధ్యమైంది. ఇదంతా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దూర దృష్టి వల్ల.

మన దేశానికి పాకిస్తాన్, చైనాతో నిత్యం గొడవలే. పహల్గాం ఘటన వల్ల మన దేశం ఎంతగా ఇబ్బంది పడింది.. పాకిస్తాన్ చేసిన ఉగ్రవాదం వల్ల ఎంత నరకం చూసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన మీద దాడులు చేయడానికి పాకిస్తాన్ దేశానికి చైనా ఆయుధాలు సరఫరా చేస్తూనే ఉంటుంది. చైనాతో గతంలో గాల్వాన్ లోయలో పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది. అటు చైనాతో.. ఇటు పాకిస్తాన్ దేశంతో నిత్యం మనకు ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి.

ఈ రెండు దేశాల వల్ల భారత్ నిత్యం ఇబ్బందులు పడుతూనే ఉంటుంది. అందువల్లే మన దేశ సైన్యాన్ని బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ డిఫెన్స్ కొనుగోళ్లకు సంబంధించి శుక్రవారం అత్యున్నత కీలకమైన సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో దాదాపు లక్ష కోట్ల కంటే ఎక్కువ విలువైన డిఫెన్స్ ప్రాజెక్టులకు ఆమోదం వ్యక్తం చేయబోతున్నారు. త్రివిధ దళాల ఆధునీకరణతో పాటు.. ఇంకా అత్యంత కీలకమైన ఆయుధాలను భారత్ సమకూర్చుకుంటుంది.

ఈ కేటాయింపుల్లో ఎక్కువ శాతం ఇండియన్ ఆర్మీకి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్టం చేస్తారని సమాచారం. 300 k9 వజ్ర శతఘ్ని ని నిర్మిస్తారని తెలుస్తోంది. అయితే ఇండియన్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ వీటిని తయారు చేస్తున్నాయి. అంతేకాకుండా లాయిటరింగ్ మ్యూనిషన్స్ ను కూడా సేకరిస్తారని తెలుస్తోంది.

శత్రు దేశాల నుంచి వైమానిక దాడులు గనుక ఎదురైతే.. వాటిని తిప్పి కొట్టడానికి రష్యా నుంచి అత్యంత ఆధునికమైన వెర్బా మ్యాన్ ప్యాడ్స్ కొనుగోలు చేస్తారు. ఇవి శత్రు దేశాలకు సంబంధించిన విమానాలను.. హెలికాప్టర్లను.. డ్రోన్లను గాలిలోనే కూల్చి వేస్తాయి. మన దేశానికి సంబంధించిన యుద్ధ ట్యాంకులు.. సాయుధ వాహనాల భద్రత కోసం.. అత్యంత శక్తివంతమైన ఆక్టివ్ ప్రొటెక్షన్ సిస్టమ్స్ కొనుగోలు పై ఈ సమావేశంలో చర్చిస్తారని సమాచారం.

ఇది మాత్రమే కాకుండా లాంగ్ రేంజ్ స్టాండ్ ఆఫ్ మిస్సయిల్స్.. ఎయిర్ టు ఎయిర్ రీ ఫ్యూయలింగ్ ఎయిర్ క్రాఫ్ట్ కొనుగోలు.. స్వయం ప్రతిపత్తి ఉన్న వాహనాలు.. అత్యంత భారీ రకానికి చెందిన టార్పేడోలు.. వంటి వాటిని కొనుగోలు చేస్తారని తెలుస్తోంది. అయితే ఇవన్నీ కూడా మేక్ ఇన్ ఇండియా లోనే తయారు చేస్తారని సమాచారం.

గర్భంతో సమంత జిమ్ లో ఎక్సర్సైజ్... వైరల్ వీడియో...

Samantha Pregnancy
Samantha Pregnancy

Samantha Pregnancy: గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న వాళ్ల లో సమంత మొదటి స్థానంలో ఉంటుంది. ఆమె తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో నటించి నటిగా గొప్ప గుర్తింపుని తెచ్చుకుంది. గత సంవత్సరం డిసెంబర్లో రాజ్ నిడిమోరు ను పెళ్లి చేసుకుంది. రాజ్ నిడిమోరు డైరెక్షన్ చేసిన ఫ్యామిలీ మెన్ సిరీస్ లో సమంత నటించింది. అప్పుడే వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఏర్పడడంతో అక్కినేని నాగచైతన్య కు విడాకులు ఇచ్చి రాజ్ ను పెళ్లి చేసుకుంది.

ఇక ఏది ఏమైనా కూడా సమంత ఇప్పుడు చాలా హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తుంది. రీసెంట్ గా మా ఇంటి బంగారం సినిమాతో సక్సెస్ ని అందుకున్న ఆమె ప్రెగ్నెంట్ అనే విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేసింది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆమె జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ కనిపించిన వీడియో కూడా సోషల్ మీడియా వైరల్ అవుతుంది. నిజానికి ఈ వీడియోని సమంత ఇన్ స్టా లో పోస్ట్ చేసింది.

ఇలాంటి వర్కౌట్ ప్రెగ్నెన్సీ సమయంలో చేయడం కరెక్టేనా అంటూ చాలామంది చాలా రకాల కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది వైద్యులు కూడా దీని మీద స్పందించారు. పొట్ట మీద ఎఫెక్ట్ పడకుండా వర్కౌట్స్ చేస్తే పర్లేదని దానివల్ల ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువ రెస్ట్ తీసుకోవడం వల్ల బిపి, షుగర్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వర్కౌట్ చేయడం వల్ల అవన్నీ కంట్రోల్ లో ఉంటాయని కొంతమంది చెబుతున్నారు.

అలాగే ఇలాంటి వర్కౌట్స్ చేయడం వల్ల నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని డెలివరీ సమయంలో వచ్చే నడుము నొప్పి సమస్యలు కూడా పెద్దగా బాధించవని కొంతమంది వైద్య నిపుణులైతే సలహాలను ఇస్తున్నారు. సమంత ప్రెగ్నెన్సీ టైంలో కూడా వర్కౌట్స్ చేస్తూ ఎలాంటి హెల్త్ పరమైన ఇబ్బందులు రాకుండా చూసుకుంటుంది అంటూ తన అభిమానులు ఆనంద పడుతున్నారు…

WhatsApp కొత్త ఫీచర్ అంత డేంజరా.. అందుకే కేంద్రం బ్రేక్ వేసిందా..

WhatsApp Username Feature

WhatsApp Username Feature : ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్. దీని మాతృసంస్థ మెటా మరో కొత్త ఫీచర్‌ను తీసుకురావడానికి సిద్ధమైంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ మొబైల్ నంబర్‌ను ఇతరులతో పంచుకోకుండానే చాటింగ్ చేసే అవకాశం కల్పించాలని చూస్తోంది. ఇందుకోసం Username వ్యవస్థను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అయితే ఈ ఫీచర్‌పై భారత్ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ మెటాకు నోటీసు జారీ చేసింది. ఈ ఫీచర్ అమలును తాత్కాలికంగా నిలిపివేయాలని, మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) ఆదేశించినట్లు సమాచారం. అసలు ఈ ఫీచర్ పై కేంద్రం ఎందుకు ఆందోళన చెందుతోంది? దీని వల్ల ఉండే ప్రమాదాలేంటి?

వాట్సాప్ Username ఫీచర్ అంటే ఏమిటి?
ప్రస్తుతం వాట్సాప్‌లో ఎవరితోనైనా చాట్ చేయాలంటే వారి మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి. కొత్త Username ఫీచర్ అందుబాటులోకి వస్తే, ప్రతి యూజర్ తనకు నచ్చిన ప్రత్యేకమైన యూజర్‌నేమ్‌ను సృష్టించుకోవచ్చు. ఆ యూజర్‌నేమ్ ద్వారానే ఇతరులు సంప్రదించగలుగుతారు. దీంతో మొబైల్ నంబర్‌ను ఎవరికీ తెలియజేయాల్సిన అవసరం ఉండదు. దీంతో వ్యక్తిగత గోప్యత మరింత మెరుగుపడుతుందని మెటా చెబుతోంది.

ప్రైవసీకి ఉపయోగమే.. కానీ ప్రమాదాలు కూడా ఉన్నాయా?
యూజర్ల వ్యక్తిగత సమాచారం రక్షించడంలో ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నప్పటికీ, ఇదే వ్యవస్థను సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేసే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మొబైల్ నంబర్ కనిపించకుండా కేవలం యూజర్‌నేమ్‌తో అకౌంట్ నడపడం వల్ల అసలు వ్యక్తిని గుర్తించడం కష్టమవుతుంది. దీంతో మోసగాళ్లు, హ్యాకర్లు, డిజిటల్ అరెస్ట్ ముఠాలు, ఫిషింగ్ నేరగాళ్లు నకిలీ పేర్లతో ప్రజలను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందని కేంద్రం భావిస్తోంది.

కేంద్రం ఎందుకు నోటీసు ఇచ్చింది?
ఈ ఫీచర్ వల్ల సైబర్ మోసాలు పెరిగే అవకాశం ఉందనే కారణంతో మెటాకు నోటీసులు పంపింది. భారత్‌లో ఈ ఫీచర్‌ను అమలు చేసే ముందు భద్రతా అంశాలపై పూర్తి వివరణ ఇవ్వాలని, అలాగే ప్రస్తుతం రోల్‌అవుట్‌ను నిలిపివేయాలని సూచించింది. యూజర్ల భద్రతకు ఎలాంటి ముప్పు ఉండదని మెటా నిరూపించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఎలా దుర్వినియోగం చేయవచ్చు?
ఉదాహరణకు, ఒక మోసగాడు ప్రముఖ సినీ నటి లేదా ప్రముఖ నటుడి పేరుతో యూజర్‌నేమ్ సృష్టించి మీకు మెసేజ్ పంపవచ్చు. ‘అత్యవసరంగా డబ్బు అవసరం ఉంది’ అంటూ నమ్మించే ప్రయత్నం చేయవచ్చు. మొబైల్ నంబర్ కనిపించకపోవడంతో అది నిజమైన అకౌంట్ అని కొందరు నమ్మే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో డబ్బు పంపితే నేరుగా మోసగాళ్ల చేతిలో పడే ప్రమాదం ఉంది.

పాఠశాలలు, ప్రభుత్వ అధికారులు పేర్లతో కూడా మోసాలు
అలాగే ఒక స్కూల్ పేరుతో యూజర్‌నేమ్ సృష్టించి ‘మీ పిల్లల స్కూల్ ఫీజును ఈ కొత్త బ్యాంక్ ఖాతాలో జమ చేయండి’ అంటూ సందేశం పంపవచ్చు. అలాగే జిల్లా కలెక్టర్, పోలీస్ అధికారి లేదా ప్రభుత్వ శాఖ పేరుతో కూడా నకిలీ మెసేజ్‌లు పంపే అవకాశం ఉంటుంది. అలాంటి సందేశాలను నిజమని నమ్మి డబ్బు బదిలీ చేస్తే భారీ నష్టం జరిగే అవకాశం ఉంది.

డిజిటల్ అరెస్ట్ మోసాలకూ అవకాశం
ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో జరుగుతున్న మోసాలు పెరుగుతున్నాయి. నకిలీ పోలీసు అధికారులు, సీబీఐ లేదా ఇతర ప్రభుత్వ సంస్థల పేరుతో వీడియో కాల్స్, మెసేజ్‌లు పంపి ప్రజలను బెదిరించి డబ్బు వసూలు చేస్తున్నారు. Username ఫీచర్ అమల్లోకి వస్తే ఇలాంటి మోసాలకు మరింత ఊతం లభించే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది.

మెటా స్పందన ఏంటి?
మెటా ఈ ఫీచర్‌ను యూజర్ల గోప్యతను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లు చెబుతోంది. నకిలీ అకౌంట్లను గుర్తించే భద్రతా వ్యవస్థలు, రిపోర్టింగ్ టూల్స్, వెరిఫికేషన్ వంటి అంశాలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. అయితే భారత ప్రభుత్వం లేవనెత్తిన భద్రతా సందేహాలపై మెటా అధికారికంగా వివరణ ఇవ్వాల్సి ఉంది.

'ఓజీ 2' నుండి ప్రకాష్ రాజ్ అవుట్.. ఆ స్థానంలోకి రాబోతున్న నటుడు ఎవరంటే..

OG Prakash Raj Character
OG Prakash Raj Character

OG 2 : పవన్ కళ్యాణ్ అభిమానులు , ప్రేక్షకులు ‘ఓజీ 2’ మూవీ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఏ రేంజ్ లో ఊగిపోతుంటారో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. కేవలం ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వీడియో రాగానే సోషల్ మీడియా మొత్తం ఊగిపోయింది. వేల సంఖ్యలో ఎడిటింగ్స్ తో అభిమానులు సోషల్ మీడియా ని షేక్ చేసి వదిలారు. ఒక టీజర్, లేదా ట్రైలర్ విడుదలైతే ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో , ఆ రేంజ్ రెస్పాన్స్ కేవలం ప్రకటన కి సంబంధించిన వీడియో కి వచ్చింది. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు , ఈ సినిమా రేంజ్ ఏంటి అనేది . ఇకపోతే ఈ ‘ఓజీ’ చిత్రం లో ప్రకాష్ రాజ్ సత్య దాదా గా నటించిన సంగతి అందరికీ తెలిసిందే.

ఓజాస్ గంభీర కి గాడ్ ఫాదర్ రోల్ లో ఆయన అద్భుతంగా నటించారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ రాజకీయ పరంగా ఏ రేంజ్ విబేధాలు పెట్టుకున్నారో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. రాజకీయ పరంగా ప్రకాష్ రాజ్ హద్దులు దాటి మరీ పవన్ కళ్యాణ్ ని ‘వాడు..వీడు’ అంటూ సంబోధించారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ప్రకాష్ రాజ్ ని పట్టించుకోలేదు. ఇప్పటికీ ఆయన్ని ఒక నటుడిగా గౌరవిస్తూనే ఉన్నారు. అయితే ‘ఓజీ 2’ లో ప్రకాష్ రాజ్ తో కలిసి నటించడానికి ఇప్పటికీ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా, ఆయన అభిమానులకు మాత్రం అసలు ఇష్టం లేదు. ఎట్టి పరిస్థితి లోనూ ప్రకాష్ రాజ్ ని ఈ సినిమా నుండి తొలగించాల్సిందే అంటూ మండిపడుతున్నారు. అయితే ఈమధ్య కాలంలో పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ని బాగా ఉపయోగిస్తున్నారు. బయట జరిగే వాస్తవాలను తెలుసుకుంటున్నారు.

అందుకే ‘ఓజీ 2’ లో ప్రకాష్ రాజ్ పాత్రని తొలగించాల్సిందిగా డైరెక్టర్ సుజిత్ కి ఆదేశించినట్టు తెలుస్తోంది. అంటే ‘ఓజీ 2’ లో సత్య దాదా పాత్ర చనిపోయినట్టుగా చూపించే ఆలోచనలో ఉన్నారట. ఒకవేళ ఆ పాత్ర అత్యవసరం అనిపిస్తే , ఆయన స్థానం లోకి బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ని తీసుకోవాల్సిందిగా సూచించారట పవన్ కళ్యాణ్. ఇందులో ఎంత మాత్రం నిజముందో రాబోయే రోజుల్లో తెలియనుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఫుల్ బిజీ గా ఉన్నారు డైరెక్టర్ సుజిత్. ఈ ఏడాది నవంబర్ నుండి ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానుంది.

విజయ్ దేవరకొండ ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేదు అంటూ ఎమోషనల్ అయిపోయిన నిర్మాత..

Vijay Deverakonda
Vijay Deverakonda

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ హీరో గా నటించిన సినిమాల్లో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా , కనీసం ఫుల్ రన్ లో 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది. ఆ కారణం చేత నిర్మాతకు భారీ రేంజ్ లో నష్టం వచ్చింది. ఈ చిత్రాన్ని నిర్మించింది మరెవరో కాదు , అభిషేక్ నామా. ఈయన గతం లో ‘కత్తికేయ 2’ చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రీసెంట్ గా ఆయన ‘నాగబంధం’ అనే చిత్రాన్ని నిర్మిస్తూ దర్శకత్వం కూడా వహించారు. రేపు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమోషన్స్ లో భాగంగా ఆయన అనేక ఇంటర్వ్యూస్ ఇచ్చారు.

ఒక ఇంటర్వ్యూ లో ఆయన విజయ్ దేవరకొండ పై చాలా తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడుతూ ‘విజయ్ దేవరకొండ తో నేను వరల్డ్ ఫేమస్ లవర్ అనే చిత్రాన్ని నిర్మించాను. భారీ డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. నేను చాలా పెద్ద మొత్తమే నష్టపోయాను. అయినప్పటికీ నేను విజయ్ దేవరకొండ కి ఇచ్చిన రెమ్యూనరేషన్ లో ఒక్క పైసా కూడా వెనక్కి ఇవ్వమని అడగలేదు. ఆ నష్టాన్ని రీకవర్ చేసుకోవడానికి మా బ్యానర్ లో ఒక సినిమా చేస్తానని ఆయన మాట ఇచ్చారు. 3 సంవత్సరాలు దాటింది , ఇప్పటి వరకు ఆ అంశం పై కనీస స్పందన లేదు’ అంటూ చెప్పుకొచ్చారు అభిషేక్ నామా. అయితే ఒక్కోసారి కమిట్మెంట్స్ లో భాగంగా మర్చిపోయి ఉండొచ్చు , ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసే విజయ్ దేవరకొండ స్వయంగా అభిషేక్ కి ఫోన్ చేసి సినిమా చేద్దామని చెప్పొచ్చేమో చూద్దాం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఆయన దర్శకత్వం వహించిన ‘నాగబంధం’ సినిమా విషయానికి వస్తే , ఇందులో హీరో హీరోయిన్లు గా విరాట్ కర్ణ, నభా నటేష్ నటించారు. అనంత పద్మనాభస్వామి ఆలయ రహస్యాన్ని ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. బడ్జెట్ దాదాపుగా 100 కోట్ల రూపాయిల వరకు ఖర్చు చేసి ఉంటారని అంచనా. ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కూడా భారీ గానే జరిగింది. మరి రేపు ఆడియన్స్ నుండి ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

'ఓజీ 2' ఫోటో షూట్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో..

Pawan Kalyan OG 2 Video
Pawan Kalyan OG 2 Video

Pawan Kalyan OG 2 Video: పవన్ కళ్యాణ్ కి సినిమాలపై ప్రస్తుతం ఒకప్పుడు ఉన్న ఆసక్తి లేదు అనే విషయం అందరికీ తెలిసిందే. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కేవలం ఆయన పార్ట్ టైం యాక్టర్ గా మాత్రమే కొనసాగుతున్నారు. తన తోటి హీరోలు లాగా పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ చేసేంత సమయం ఆయనకు ప్రస్తుతం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఆయన ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఆయన ప్రతీ క్షణం జనాలకు సంబంధించినదే. ఇలాంటి సమయంలో షూటింగ్స్ కి ఒకప్పటి లాగా డేడికేటెడ్ గా సమయాన్ని కేటాయించలేని పరిస్థితి , ఎదో డబ్బుల కోసం , నెల రోజుల డేట్స్ లో చుట్టేసే రేంజ్ కథలను మాత్రమే ఆయన ఎంచుకుంటూ వెళ్తున్నారు. కానీ సరైన టాలెంటెడ్ డైరెక్టర్ దొరికితే మాత్రం , ఆయన పూర్తి స్థాయిలో డెడికేషన్ చూపిస్తున్నారు. అందుకు బెస్ట్ ఉదాహరణ ‘ఓజీ’.

ఈ సినిమా కోసం కేవలం ఆయన 28 రోజుల డేట్స్ ని మాత్రమే కేటాయించారు. అయినప్పటికీ కూడా డైరెక్టర్ సుజిత్ తన అద్భుతమైన టేకింగ్ తో , పవన్ కళ్యాణ్ ని నెవెర్ బిఫోర్ రేంజ్ లో చూపించి , బాక్స్ ఆఫీస్ ని షేక్ అయ్యేలా చేశారు. సుజిత్ టాలెంట్ కి ముగ్దుడైన పవన్ కళ్యాణ్ , ‘ఓజీ 2’ చేయడానికి సిద్దమయ్యాడు. రీసెంట్ గానే ఈ క్రేజీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించారు కూడా. అందుకు ఫ్యాన్స్ , ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియా మొత్తం ఒక రేంజ్ లో ఊగిపోయింది. ఈ సినిమాపై పవన్ కళ్యాణ్ ఎంత ఆసక్తితో ఉన్నాడంటే , ప్రత్యేకంగా ఫోటో షూట్స్ కూడా ఇచ్చేంత అన్నమాట. సుజిత్ తో మీటింగ్ జరిగిన రోజే ఆయన ఒక ఫోటో షూట్ ఇచ్చారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

పవన్ కళ్యాణ్ ఇలా ఒక సినిమాకు ప్రత్యేకంగా ఫోటో షూట్ ఇవ్వడం జరిగింది ‘పంజా’ కి మాత్రమే. ఆ తర్వాత ‘ఓజీ’ మూవీ షూటింగ్ సమయం లో కూడా ముంబై బీచ్ వద్ద ఆయన ఫోటో షూట్ లో పాల్గొన్నాడట , కానీ ఈ రేంజ్ లో మాత్రం కాదట. పవన్ కళ్యాణ్ ఫోటో షూట్ కి సంబంధించిన విజువల్స్ ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. అభిమానులకు ఈ విజువల్స్ ఒక కనులపండుగ లాంటిది. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది నవంబర్ నెల నుండి ప్రారంభం అవ్వబోతుందట. సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.