సానియా అందాల విందు
'రుషికొండ'కు గ్లోబల్ టెండర్!
Rushikonda Global Tender: రుషికొండ భవనాలపై ప్రభుత్వం ఎట్టకేలకు ఒక నిర్ణయానికి వచ్చింది. తీవ్ర తర్జనభర్జన నడుమ ఆ భవనాలను లీజుకు ఇచ్చేందుకు ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారికంగా గ్లోబల్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భవన సముదాయాన్ని ఎలా వినియోగించాలి అనే దానిపై తీవ్ర చర్చ నడిచింది. దీనిపై మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటయింది. పలుమార్లు సమావేశమైన ఆ మంత్రుల కమిటీ చివరకు లీజులకు ఇవ్వడమే మేలన్న నిర్ణయానికి వచ్చింది. అందుకే అంతర్జాతీయ స్థాయిలో ఈ భవన సముదాయానికి లీజు వండర్లను ఆహ్వానిస్తోంది ప్రభుత్వం. దీనికి సంబంధించిన టెండర్ నోటిఫికేషన్ జారీ అయింది. దీంతో గత కొద్ది రోజులుగా నెలకొన్న సందిగ్ధతకు తెరపడినట్లు అయింది. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో దాదాపు 500 కోట్ల రూపాయల వ్యయంతో భారీ భవన సముదాయాలను.. అంతర్జాతీయ స్థాయి వసతులతో నిర్మించారు. కానీ ఎందుకు నిర్మించారో అధికారికంగా వెల్లడించలేదు.
* పర్యాటక ల్యాండ్ మార్క్..
విశాఖ నగరానికి ఒక పర్యాటక ల్యాండ్ మార్క్ గా ఉండేది రుషికొండ. దాదాపు ఏడాదికి ఐదు కోట్ల రూపాయలకు పైగా పర్యాటక శాఖకు ఆదాయం వచ్చేది. అటువంటి రుషికొండను గుండు కొట్టించింది వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. 500 కోట్ల రూపాయల వ్యయంతో భారీ భవన సముదాయాలను నిర్మించింది. అప్పట్లో పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా ఈ నిర్మాణాలు జరిపినట్లు ఆరోపణలు వచ్చాయి. అయినా లెక్క చేయలేదు వైసిపి ప్రభుత్వం. విశాఖలో పాలన రాజధానిగా నిర్ణయించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పాలన కోసం అప్పట్లో నిర్మించినట్లు ఆరోపణలు వచ్చాయి. అనధికారికంగా మంత్రులు ప్రకటనలు చేశారు కానీ.. అప్పటి ప్రభుత్వం మాత్రం ఈ రుషికొండ విషయంలో గోప్యంగానే వ్యవహరించింది.
* మంత్రివర్గ ఉప సంఘం..
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రుషికొండ భవన సముదాయాల వినియోగం ఎలా చేయాలనే దానిపై ప్రభుత్వం ఆలోచన చేసింది. మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న తరుణంలో… లీజులకు ఇవ్వాలని భావించింది ప్రభుత్వం. అంతర్జాతీయ స్థాయి లగ్జరీ రిసార్ట్ లేదా ఫైవ్ స్టార్ హోటల్గా మార్చాలని ప్రభుత్వ ఆలోచన. సహజ సిద్ధమైన సముద్రపు వ్యూ ఉన్న ఈ భవనాలను పర్యాటక రంగంలో సరికొత్త ఐకాన్ గా తీర్చిదిద్దేందుకు ఏపీ టూరిజం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. వాస్తవానికి ఈ భవనాలను లీజుకు తీసుకునేందుకు తాజ్, ఒబెరాయ్, లీలా వంటి పలు అంతర్జాతీయ దిగ్గజ హోటల్ బ్రాండ్ గ్రూపులు ఆసక్తి చూపాయి. అయితే క్షేత్రస్థాయిలో ఈ ప్రాజెక్టును పరిశీలించిన తర్వాత కొన్ని సాంకేతిక, మౌలిక సదుపాయాలలో లోపాలు చూసి వెనక్కి తగ్గాయి. ప్యాలెస్ ఆవరణలో ఉన్న ఖాళీ స్థలాన్ని.. అదనపు గదుల నిర్మాణం కోసం వాడుకునేందుకు పర్యావరణ, కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలు అద్దంకిగా మారాయి. దీనికి తోడు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భారీ ప్యాలెస్ లో కమర్షియల్ హోటల్ బిజినెస్ కు అవసరమైన గదుల సంఖ్య చాలా తక్కువ. అందుకే ఆ బ్రాండ్ కంపెనీలు సైతం వెనక్కి తగ్గుతున్నాయి. ఒక అంతర్జాతీయ స్థాయిలో బ్రాండ్ హోటల్ గా మార్చాలి అనుకుంటే అంతర్గతంగా భారీ మార్పులు, చేర్పులు చేయాల్సి ఉంటుంది. ఎక్కువ గదులు లేకపోతే కమర్షియల్ గా వర్క్ అవుట్ కాదనే ఉద్దేశంతోనే కొంత వెనుకడుగు వేసాయి.
* లీజుల కోసం..
గ్లోబల్ టెండరింగ్ విధానం ద్వారా అంతర్జాతీయ బ్రాండ్ హోటల్ సంస్థలకు లీజులకు ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది. అందుకే ఏపీటీడీసీ అంతర్జాతీయ హోటల్ రంగ నిపుణుల సలహాతో నిబంధనలను కొంత సరళతరం చేసింది. ప్రముఖ హోటల్స్ ముందుకు వస్తే భవనాల అంతర్గత మార్పులు, నిబంధనల ప్రకారం లీజు నిబంధనలు అనుకూలంగా మార్చి ఇచ్చేసి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ భవనాలకు సంబంధించి టెండర్ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేసి.. ప్రముఖ గ్లోబల్ బ్రాండ్ కు ప్యాలెస్ బాధ్యతలు కట్టబెట్టాలని చూస్తోంది ప్రభుత్వం. చూడాలి మరి ఏం జరుగుతుందో..
ఎదుగుతున్న రాయలసీమ!
Rayalaseema Development: రాయలసీమ నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు. రాయలసీమ కేంద్రంగా ఎందరో రాజకీయాలు చేశారు. కానీ ఆ స్థాయిలో రాయలసీమ మాత్రం అభివృద్ధి చెందలేదు. కానీ కూటమి వచ్చిన తరువాత రాయలసీమ రూపురేఖలు మారుతున్నాయి. దశాబ్దాలుగా కేవలం కాగితాలకే పరిమితమై, రాజకీయ శంకుస్థాపనల డ్రామాతో విసిగిపోయిన కడప స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో ఎట్టకేలకు ఒక బలమైన ముందడుగు పడింది. ఈరోజు కడప స్టీల్ ప్లాంట్ కు శ్రీకారం చుట్టనున్నారు. ఇది కేవలం కొబ్బరికాయలు కొట్టే మరో సాంప్రదాయక భూమి పూజ కాదు. పక్కాగా నిర్మాణ పనుల ప్రారంభోత్సవం. జిందాల్ ఆధ్వర్యంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ తొలి దశ ఉత్పత్తిని అత్యంత వేగంగా అందుబాటులోకి తెచ్చేలా ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఇది నిజంగా రాయలసీమ చరిత్రలో సువర్ణ అధ్యాయం. ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలతో వివాదాల మయంగా మారిన రాయలసీమ.. ఇప్పుడు పారిశ్రామికంగా.. రాయల పరిశ్రమల సీమగా రూపాంతరం చెందుతూ ఉండడం శుభపరిణామం.
* శ్రీ సిటీ కీలక పాత్ర..
ఉత్పత్తి రంగానికి సంబంధించిన పరిశ్రమలు రాయలసీమలో ఏర్పాటు అవుతున్నాయి. అయితే ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా నిలబెట్టడంలో శ్రీ సిటీ కీలక పాత్ర పోషించింది. గ్లోబల్ కంపెనీలకు క్యారాఫ్ అడ్రస్ గా మారింది. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతున్న పరిశ్రమల జాతర ఒక ఎత్తు అయితే.. ఇటీవల ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వచ్చిన పెట్టుబడులు మరో ఎత్తు. రాయల్ ఎన్ఫీల్డ్, హీరో మోటో కార్ఫ్ వంటి దిగ్గజ సంస్థలు రాయలసీమలో వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో తమ ప్లాంట్లను నిర్మించాయి. వేలాదిమంది స్థానిక యువతకు, గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించాయి. గతంలో వచ్చిన కియా మోటార్స్ అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించింది. అయితే ప్రస్తుతం శ్రీ సిటీ ఉమ్మడి చిత్తూరు జిల్లా పారిశ్రామిక వైభవానికి సరికొత్త కేంద్రంగా మారింది.
* గ్రీన్ ఎనర్జీ రంగంలో..
అన్నింటికీ మించి రాయలసీమ గ్రీన్ ఎనర్జీ రంగంలో దేశంలోనే టాప్ హబ్ గా మారింది. కర్నూలు, నంద్యాల జిల్లాలో గ్రీన్ కో, ఆర్సలర్ మిట్టల్, ఐర్ఈడిఏ భాగస్వామ్యంతో ప్రపంచంలో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టులు వేగం గా రూపుదిద్దుకుంటున్నాయి. గతంలో వెనుకబడిన ప్రాంతంగా.. కరువు సీమగా ముద్రపడిన రాయలసీమ.. ఇప్పుడు పరిశ్రమలకు స్వర్గధామంగా మారింది. అటు బెంగళూరు ఐటి, ఆటోమొబైల్ క్యారీడర్.. ఇటు చెన్నై పోర్టులకు కనెక్టివిటీ ఉండడంతో రాయలసీమ కు ప్లస్ పాయింట్ గా నిలుస్తోంది. ప్రధానంగా ఖనిజ సంపద, ఇనుప ఖనిజం, సున్నపురాయి నిల్వలు భారీ సిమెంట్, స్టీల్ పరిశ్రమలకు బలమైన పునాదులుగా మారాయి. బలమైన రాజకీయ సంకల్పం, స్థిరమైన పారిశ్రామిక విధానాలతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుండడంతో రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధి సాధ్యం అవుతుంది.
జగన్ ను పక్కన పెట్టేసిన సాక్షి!
YS Jagan Sakshi: వైయస్ జగన్మోహన్ రెడ్డి మావిగన్ స్టాండ్ తీసుకున్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో అమరావతి వర్సెస్ మావిగన్ అనే అజెండాతో ప్రజలు ఓట్లు వేస్తారని స్పష్టం చేశారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఏపీ ప్రజలతోపాటు మీడియా, అన్ని వర్గాలు సీరియస్ గా తీసుకున్నాయి. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మీడియా మాత్రం పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. అయితే అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ సంచలన నిర్ణయం తీసుకుంటే సొంత మీడియా సంస్థ సాక్షితో పాటు వైసీపీ సోషల్ మీడియా వింగ్ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. జగన్ పిలుపునిచ్చిన మావిగన్ వర్సెస్ అమరావతి అనే ప్రధాన నినాదాన్ని పక్కన పెట్టి.. ఆయన ప్రెస్మీట్లో వాడిన హే రామ్.. సేవ్ ఆంధ్ర అనే అంశాన్ని బ్యానర్ స్టోరీ గా మార్చేశారు.
* మావిగన్ పై ప్రాధాన్యత తగ్గించి..
జగన్ ఇలా ప్రకటన చేస్తే సాక్షి ఈశ్వర్ అలా రెచ్చిపోతారు. కానీ ఎందుకో జగన్మోహన్ రెడ్డి చేసిన మావిగన్ వ్యాఖ్యలను సాక్షిలో పెద్దగా హైలెట్ కాలేదు. పార్టీ అధినేత లైన్ తీసుకుంటే.. దానిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన సొంత మీడియానే ఎందుకు ఇంత సైలెంట్ అయింది? దీని వెనుక ఉన్న వ్యూహం ఏంటి? ఆ వ్యూహదారులు ఎవరు అంటే సజ్జల పేరు వినిపిస్తోంది. అయితే మావిగన్ అనే మాత పార్టీ శ్రేణులకు నచ్చలేదన్న టాక్ కూడా ఉంది. మరోవైపు జగన్ మాట్లాడే కంటెంట్ విషయంలో మొత్తం వ్యవహారం సజ్జల రామకృష్ణారెడ్డి టీం చూస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో మూడు రాజధానుల సెంటిమెంట్ పనిచేయలేదు. ఇప్పుడు అనవసరంగా అమరావతిని టార్గెట్ చేస్తే ఉత్తరాంధ్రతో పాటు కోస్తాలో పార్టీకి డ్యామేజ్ తప్పదని సజ్జల వర్గం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు జగన్ ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు సజ్జల దానిని ఫిల్టర్ చేసే పనిలో ఉన్నట్లు స్పష్టం అవుతోంది.
* వైసీపీ శ్రేణుల్లో గందరగోళం..
జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ తో పాటు ప్రకటనలు సాక్షి మీడియాలో పతాక స్థాయిలో రాకపోవడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక రకమైన గందరగోళం నడుస్తోంది. అధినేత కీలకమైన పొలిటికల్ లైన్ తీసుకున్నప్పుడు సొంత మీడియా దానికి బ్రాండింగ్ ఇవ్వాలి. కానీ జగన్ ప్రకటనలకు సాక్షి మీడియాలో కత్తెర వేస్తున్నారు. మూడు రాజధానుల నిర్ణయం తీసుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మావిగన్ అంటూ చేస్తున్న కొత్త ప్రతిపాదనపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒక స్థిరమైన క్యాపిటల్ పాలసీ లేకుండా ఇలాంటి ప్రకటనలు చేయడం ఏంటని అంతర్గత సమావేశాల్లో అసహనంతో ఉన్నారు. అందుకే ఎందుకైనా మంచిదని సాక్షి వార్త ప్రాధాన్యతను తగ్గించిందన్నది వినిపిస్తున్న మాట. జగన్ తీసుకునే నిర్ణయాలు, ఇచ్చే స్లోగన్లు క్షేత్రస్థాయి వాస్తవాలకు దూరంగా ఉంటున్నాయని సొంత క్యాడరే గ్రహించింది. అందుకే సాక్షి సైతం జగన్మోహన్ రెడ్డి ప్రకటనను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా వ్యూహం అని స్పష్టమవుతుంది.
వీళ్ళు మామూలు పోలీసులు కాదు.... బ్లాక్ మనీని.. వైట్ మనీగా మార్చేస్తారు..
Black Money Scam: శివాజీ సినిమా చూశారా.. లేదా మల్లన్న సినిమా చూశారా.. పోనీ ఏవైనా హిందీ వెబ్ సిరీస్ లు చూశారా.. అందులో కొంతమంది వ్యక్తులు ఒక చిరిగిన 10 రూపాయల నోటు తీసుకొస్తారు. ఆ నోటును వేరే వ్యక్తులకు ఇస్తారు. ఆ రెండు నోట్లు సరిపోలుతాయి. అప్పుడు కట్టలకు కట్టలు నోట్ల బ్యాగులు బయటికి వస్తాయి. ఒకటి కాదు రెండు కాదు.. వందల కోట్లు చేతులు మారుతాయి. ఇదంతా బ్లాక్ మనీ.. మొత్తం తెల్లగా మారే ప్రయత్నం. దీని వెనక ఏం జరుగుతుంది.. ఎలా జరుగుతుంది.. ఎవరు ఉన్నారు అనే విషయాలను దర్శకులు మనకు అర్థమయ్యేలాగా చెబుతారు.
వాస్తవానికి నల్ల డబ్బును తెల్లగా మార్చడం కష్టమైన పని. దీనికోసం అనేక రకాల అడ్డంకులను దాటుకోవాలి. అత్యంత పలుకుబడి ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. కానీ దీనిని సాధ్యమను నిరూపించారు కొంతమంది. ఇక్కడ దురదృష్టం ఏంటంటే పోలీసులకు దొరికిపోయారు. చివరికి అన్ని మూసుకొని జైలు గోడల మధ్య బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీసులు 12 మందిని పట్టుకున్నారు. ఇందులో ఇద్దరు పరారీలో ఉన్నారు. కల్లూరు ఏసీపీ వసుంధర చెప్పిన వివరాల ప్రకారం.. జూన్ నెల 25న కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందిన కుర్ర గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును సత్తుపల్లి సిఐ శ్రీహరి స్వీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ప్రత్యేకమైన బృందాలతో గాలింపు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గంగారం శివారు ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తుండగా 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తే అసలు నలుపు వ్యవహారం బయటపడింది.
ఏలూరు జిల్లాలోని వెంకటాపురం ప్రాంతానికి చెందిన చంటిబాబు అనే వ్యక్తి ఒక ముఠా ను నిర్వహిస్తున్నాడు. ఇతడు మరో 13 మందితో కలిసి ఒక బృందాన్ని ఏర్పాటు చేశాడు. వీరంతా కూడా రకరకాల సిమ్ కార్డులు ఉపయోగించి అమాయకులకు ఫోన్ చేసేవారు. తాము రియల్ ఎస్టేట్ వ్యాపారులమని.. తమబద్ధ బ్లాక్ మనీ భారీగా ఉందని.. అదంతా వైట్ గా చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేవారు. ముందుగా 10 లక్షలు గనుక ఇస్తే 40 లక్షలు బ్యాంకు అకౌంట్లో వేస్తామని ఆశ చూపించేవారు. అలా ముందుగా ఒక ప్రాంతానికి బాధితులను పిలిపించేవారు. ఆ తర్వాత వారు నగదు తీసుకొస్తే.. ఫేక్ కరెన్సీ నింపిన బ్యాగు ఇచ్చేవారు.. అయితే ఈ ముఠాలో కొంతమంది నిజమైన పోలీసులు.. కొంతమంది నకిలీ పోలీసులు ఉండేవారు. వారంతా కూడా అక్కడికి చేరుకొని దాడులు మొదలుపెట్టేవారు. డబ్బు మొత్తం తీసుకొని పారిపోయేవారు. ఇలా అనేక ప్రాంతాల్లో మోసం చేశారు.
ఈ వ్యవహారంలో పోలీస్ శాఖకు చెందిన కానిస్టేబుళ్లు ముల్లగిరి వర్ధన్.. ఆర్ఎస్ఐ కేశవరావు ఉన్నారు. పోలీసులు అత్యంత లోతుగా దర్యాప్తు చేసి దాదాపు 17.6 లక్షల నగదు.. మూడు కార్లు.. ఒక స్కూటీ.. కొన్ని సెల్ ఫోన్లు.. పోలీసులు వాడే దుస్తులు.. హ్యాండ్ క్యాప్స్.. నకిలీ కరెన్సీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పరారీలో ఇద్దరు ఉన్నారు. వారిని కూడా పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
యువతే లక్ష్యంగా 2029 ఎన్నిక వ్యూహాలు.. ప్లాన్ వర‍్కవుట్ అయ్యేనా?
2029 Elections: రాజకీయ పార్టీల మద్దతు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. తాజాగా కాక్రోచ్ జనతా పారీ‍్ట పేరిట ఒక ఆందోళన జరిగింది. నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై ఈ సంస్థ నిర్వహించిన కాక్రోచ్ జనతా పార్టీ సంస్థలకు సోషల్ మీడియాలో వచ్చిన హైప్, మద్దతు క్షేత్రస్థాయిలో లేదు. క్రమంగా దాని ప్రభావం తగ్గుతోంది. యువకులు, తల్లిదండ్రులు కూడా దానికి దూరమవుతున్నారు.మొదట్లో మీడియా ఎక్కువగా కవరేజ్ ఇచ్చినప్పటికీ, ఇప్పుడు ఆ ఆసక్తి తగ్గింది. నిరసనలు, ఉద్యమాలకు మునుపటి స్థాయిలో మద్దతు రావడం లేదు.
సోషల్ మీడియా ద్వారా..
రాబోయే మూడేళ్లలో 2029 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని విపక్షాలు యువ ఉద్యమాలపై దృష్టి పెడుతున్నాయి. కాంగ్రెస్, ఆప్ వంటి పార్టీలు యువతను ఆకట్టుకునే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. సోషల్ మీడియా ద్వారా ఓటర్ల మనసులను నెమ్మదిగా ప్రభావితం చేయడం ఈ వ్యూహంలో భాగం. 2029లో మొదటిసారి ఓటు వేసే యువకులు మోదీ ప్రధాని అయినప్పటి నుంచి పెరిగిన తరం. వారిని ప్రభావితం చేయడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు కీలకంగా మారాయి. తమిళనాడులో నటుడు విజయ్ అభిమాన సంఘాలు యువతను సమీకరించి రాజకీయ మార్పుకు దోహదపడినట్లు ఉదాహరణలు ఉన్నాయి. ఇలాంటి మోడల్‌ను ఇతర రాష్ట్రాల్లో కూడా అనుసరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
రైతు సమస్యల నుంచి యువత వైపు..
గతంలో రైతు ఉద్యమాలు విపక్షాలకు బలమైన సాధనంగా ఉండేవి. 2024 ఎన్నికల్లో ఇది పెద్ద ప్రభావం చూపుతుందని భావించినా, ఆ ఉద్యమాల నాయకులు పార్టీలు పెట్టి పోటీ చేసినప్పుడు ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో విపక్షాలు రైతుల్లో బీజేపీపై వ్యతిరేకత పెరగలేదని గ్రహించి, ఇప్పుడు యువతను ప్రధాన లక్ష్యంగా చేసుకున్నాయి. పేదలు, మహిళలు వంటి వర్గాల్లో బీజేపీకి ఉన్న మద్దతును దృష్టిలో ఉంచుకుని, యువత ద్వారా బలహీనపరచాలని ప్రయత్నిస్తున్నాయి. సోషల్ మీడియా ద్వారా యువతలో అసంతృప్తిని పెంచి, బీజేపీని లక్ష్యంగా చేసుకునే వ్యూహం ఇది.
బీజేపీ ముందున్న సవాళ్లు..
ఈ మార్పులు బీజేపీకి కొత్త సవాళ్లను తెస్తున్నాయి. యువతను తమ వైపుకు నిలబెట్టుకోవడం రాబోయే రోజుల్లో కీలకం కావచ్చు. సోషల్ మీడియా శక్తిని ఉపయోగించి విపక్షాలు యువతలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటే, బీజేపీ కూడా యువత సమస్యలు ఉద్యోగాలు, విద్య, నైపుణ్యాలపై దృష్టి పెంచి, వారిని ఆకర్షించే కార్యక్రమాలు చేపట్టాలి. రాజకీయాల్లో సోషల్ మీడియా పాత్ర పెరిగిన నేపథ్యంలో, కేవలం సంప్రదాయ పద్ధతులతో సరిపోదు.
2029 ఎన్నికలు యువత ఓట్లపై ఎక్కువగా ఆధారపడి ఉండబోతున్నాయి. విపక్షాలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తుంటే, బీజేపీ తన బలాలను కాపాడుకుంటూ యువతను తమవైపు తిప్పుకునే వ్యూహాలను రూపొందించాలి. ఇది రాజకీయాల్లో తరం మార్పు, డిజిటల్ ప్రభావాన్ని ప్రతిబింబిస్తోంది.
అల్పపీడనం.. ఆ జిల్లాలకు రెయిన్ అలెర్ట్!
Andhra Pradesh Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన ఉంది. మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే చాన్స్ ఉంది. వాయువ్య బంగాళాఖాతం ఆనుకొని.. ఉత్తర ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాల్లో ఈ అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులపాటు ఉత్తరాంధ్రలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. మిగతా చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళకూడదు అని సూచిస్తున్నారు.
* ఉత్తరాంధ్ర పై ప్రభావం..
ఈ అల్పపీడనం ప్రధానంగా ఉత్తరాంధ్ర పై ప్రభావం చూపుతుంది. దీని ప్రభావంతో ఈరోజు శ్రీకాకుళం, పోలవరం, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వానలు పడే అవకాశం కనిపిస్తోంది. ఈదురుగాలుల ప్రభావం ఉండను ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. అయితే ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. జూన్లో చాలా లోటు కనిపించింది. ఎల్ నినో ప్రభావం అధికంగా ఉంది. రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించాయి. విస్తరించడంలో కూడా మందగమనం కనిపించింది. కానీ తాజా ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది.
* ఆశించిన స్థాయిలో వర్షాలు లేక..
దక్షిణాది రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు. ఉత్తర భారత దేశంలో కూడా వర్షాలు అనుకున్న స్థాయిలో పడటం లేదు. ప్రధానంగా దేశవ్యాప్తంగా 350 కి పైగా జిల్లాల్లో వర్షపాతం లోటు ఉంది.. ఖరీఫ్ సీజన్లో జూన్ కీలకం. నైరుతి రుతుపవనాల ప్రభావంతో జూన్లో విస్తారంగా వర్షాలు పడితేనే ఖరీఫ్ గట్టెక్కేది. అటువంటి జూన్లోనే వర్షాలు ముఖం చాటేయడంతో రైతాంగంలో ఆందోళన నెలకొంది. ఇప్పుడు జూలై మొదటి వారం ప్రవేశించిన ఇంకా వర్షాలు ఆశించిన స్థాయిలో పడటం లేదు. తాజాగా ఇప్పుడు ఈ అల్పపీడన ప్రభావంతో దక్షిణాదిన ఏపీలో ఒడిస్సా తో పాటు పశ్చిమ బెంగాల్ పై ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. సాధారణంగా జూన్ నుంచి నవంబర్, డిసెంబర్ వరకు అల్పపీడనాల ప్రభావం, తుఫాన్లు సంభవిస్తుంటాయి. కానీ ఇంతవరకు వాటి జాడలేదు. తాజాగా ఏర్పడిన ఈ అల్పపీడనం ఎంతవరకు ప్రభావం చూపిస్తుందో చూడాలి.
మోడీకి జపాన్ చెల్లి.. దౌత్యంలో ప్రధానిని మించిన వారిని లేరు..
India Japan Relations: 1893లో అమెరికాలోని చికాగోలో జరిగిన ప్రపంచ మత సమావేశంలో స్వామి వివేకానందుడు చేసిన ప్రసంగం భారతదేశం పట్ల ప్రపంచ వైఖరిని మార్చివేసింది. ‘సోదర సోదరీమణులారా‘ అని ప్రారంభించిన ఆ సంబోధన ఆ కాలంలో అసాధారణం. అది గౌరవం, సమానత్వం, సానుభూతి యొక్క సంకేతం. పది నిమిషాల సమయం మించినా ప్రతినిధులు ఆసక్తిగా విన్నారు. ఇది భారతదేశ సంస్కృతి, ఆధ్యాత్మికతను ప్రపంచం ముందు గౌరవపూర్వకంగా ప్రదర్శించింది. మనం ఈ క్షణాన్ని పుస్తకాల్లో చదువుతాం, కానీ దాని ప్రభావం ఇప్పటికీ ఉంది.
ఆధునిక దౌత్యంలో మోదీ శైలి…
ఇప్పుడు మన కళ్లెదుటే జరిగిన ఒక సంఘటన ఈ చారిత్రక సందర్భాన్ని గుర్తుకు తెస్తుంది. జపాన్ ప్రధాని సనాయే తకాచీ (జపాన్ మొదటి మహిళా ప్రధాని) భారతదేశానికి మొదటి అధికారిక పర్యటనకు వచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెను ‘చోటి బెహెన్‘ (చిన్న సోదరి) అని సంబోధించారు. ఆమె ఆశ్చర్యపోయి సంతోషించి, ‘మీరు నన్ను అందమైన చిన్న సోదరి అని పిలిచారు‘ అని స్పందించి, సంబంధం జీవితకాలం కొనసాగాలని, సోదర సోదరి బంధంలో అభివృద్ధి చెందాలని కోరారు. ఇది కేవలం పదాలు కాదు. దౌత్య సంబంధాలను మరింత వ్యక్తిగతం, హృదయస్పర్శి చేసి, విశ్వాసాన్ని పెంచే ప్రయత్నం. జపాన్‌తో రక్షణ, సాంకేతికత, ఇన్వెస్ట్‌మెంట్, ఎనర్జీ రంగాల్లో ఒప్పందాలు, సహకారాలు జరిగాయి. వివేకానందుడి విధానం లాంటి ఈ గౌరవపూర్వక సంబోధన భారతదేశ సాంస్కృతిక విలువలను (వసుధైవ కుటుంబకం) ఆధునిక దౌత్యంలో ప్రతిబింబిస్తుంది.
ఇటలీ ప్రధాని మెలోనీతో వీడియో వైరల్…
కొన్ని వారాల క్రితం ఇటలీ పర్యటనలో మోదీ, జార్జియా మెలోనీతో జరిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మోదీ మెలోనీకి పార్లే మెలోడీ టాఫీలు బహుమతిగా ఇచ్చి, పేర్ల మధ్య ఆటలాంటి సంబోధన చేశారు. ఇది లైట్–హార్టెడ్, స్నేహపూర్వక సంజ్ఞ. అయితే కొన్ని భారతీయ మీడియా సంస్థలు దీనిని అతిగా సంచలనం చేసి, వ్యక్తిగత సంబంధాలు, రిలేషన్ గురించి అనవసరమైన చర్చలు, వక్రీకరణలు చేశాయి. ఇది దౌత్య సారాంశాన్ని (బైలాటరల్ సంబంధాలు, సహకారాలు) కాకుండా వ్యక్తిగత కోణంలోకి తీసుకెళ్లింది.
జపాన్ ప్రధానిని అందమైన సోదరిగా…
ఇప్పుడు ఇలాంటి సంబోధన జపాన్ ప్రధానికి చేసినప్పుడు, భారతీయ మీడియా ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్న. మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించి, ఈ సంబోధనను వివేకానందుడి వారసత్వంగా, దౌత్య విశ్వాస నిర్మాణంగా చూడాలి. లేదా మళ్లీ సంచలనాత్మకంగా, వ్యక్తిగతంగా మార్చి, ఒకే రకమైన ద్వంద్వ ప్రమాణాలు చూపించాలా?
దౌత్యంలో భాష ఒక శక్తివంతమైన సాధనం. వివేకానందుడు చేసినట్లు, ‘సోదరి/సోదరుడు‘ వంటి సంబోధనలు గోడలను కూల్చి, సానుభూతి, విశ్వాసం పెంచుతాయి. మోదీ ఈ శైలిని అనుసరించడం ద్వారా భారతదేశం సాంస్కృతిక లోతును ప్రపంచ నాయకులతో పంచుకుంటున్నారు. తకాచీ సానుకూల స్పందన దీనిని నిరూపిస్తుంది. మెలోనీ వీడియోలో జరిగినట్లు, ఇది పబ్లిక్ డిస్కోర్స్‌ను హాని చేస్తుంది.
వివేకానందుడి నుంచి మోదీ వరకు ఈ సోదర సంబోధనలు భారతదేశం శాశ్వతమైన విలువలను చూపుతాయి. గౌరవం, స్నేహం, మానవీయ బంధం. ఇవి ఒప్పందాల కంటే మించి, దీర్ఘకాలిక సంబంధాలను నిర్మిస్తాయి. మీడియా ఇప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసి, సంచలనం కాకుండా సారాంశం మీద దృష్టి పెట్టాలి. అప్పుడే పబ్లిక్‌కు నిజమైన అవగాహన కలుగుతుంది.
జగన్ మావిగన్ పై రగిలిపోతున్న మాజీ మంత్రి!
Dharmana Prasada Rao: రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారు కొందరు నాయకులు. కానీ ఏపీలో రాజకీయాలు మారిపోవడంతో వారి బాధ అంతా కాదు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రస్థాయి నేతలుగా చలామణి అయ్యారు. చాలా స్వేచ్ఛగా రాజకీయాలు చేశారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంట్రీ తో చాలామంది నేతల తలరాతలు మారిపోయాయి. రాజకీయాల్లో ఉన్నామంటే ఉన్నాం అన్నట్టు వారి వ్యవహార శైలి ఉంది. పదవులు సైతం ఉన్నా అధికారం వెలగబెట్టలేని పరిస్థితి వారిది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలతో వారు సతమతం అవుతున్నారు. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో పలుచన అవుతున్నారు. రాజధానుల అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి వైఖరితో విసిగి వేసారి పోతున్నారు కొంతమంది సీనియర్లు. అటువంటి వారిలో ధర్మాన ప్రసాద రావు ముందుంటారు. జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉండే ధర్మాన.. అదే జగన్మోహన్ రెడ్డి కింద పని చేయాల్సి వచ్చింది. ప్రత్యామ్నాయం లేకపోవడంతో జగన్ విధానాలను సమర్థించాల్సి వచ్చింది. ఇప్పుడు అవే చేటు తెస్తున్నాయి.
* విశాఖ రాజధానిపై ప్రచారం..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రిగా వ్యవహరించారు ధర్మాన ప్రసాదరావు. తొలి మూడేళ్లు ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో మౌనమునిగా మారిపోయారు. మంత్రి పదవి ఇచ్చేసరికి యాక్టివయ్యారు. జగన్మోహన్ రెడ్డి మంచితనాన్ని చాటి చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆయనకు విశాఖ పాలన రాజధాని అస్త్రం దొరికింది. గ్రామాల్లో ఏకంగా సభలు ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర కోసం విశాఖను రాజధానిగా చేర్చారని.. ఆయన రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు ఆ మాటలను విశ్వసించలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించలేదు.
* డిఫెన్స్ లో మాజీమంత్రి..
అయితే జగన్మోహన్ రెడ్డి మావిగన్ స్టాండ్ తీసుకోవడంతో ధర్మాన ప్రసాదరావు లాంటివారు డిఫెన్స్ లో పడిపోయారు. వాస్తవానికి 2014 ముందు ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ పార్టీ నేతగా ఉంటూ.. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన చెప్పే మాటకు విశ్వాసం, విశ్వసనీయత ఉండేది. మంచి వాగ్దాటితో ప్రజా సమస్యలకు పరిష్కారం చూపగల నాయకుడిగా పేరు ఉండేది. ఎప్పుడైతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి.. జగన్మోహన్ రెడ్డి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం.. అవి ఎప్పటికప్పుడు మారిపోతుండడంతో ధర్మాన ప్రసాదరావు వ్యక్తిత్వాన్ని డ్యామేజ్ చేసేలా చేశాయి. వాస్తవానికి ధర్మాన ప్రసాదరావు జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని విభేదిస్తారన్న కామెంట్ ఉంది. జగన్ వైఖరిని పెద్దగా ఇష్టపడరని కూడా అనుచర వర్గం చెబుతుంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో.. గత్యంతరం లేని స్థితిలో జగన్ పంచన చేరారు అని కూడా కామెంట్స్ ఉన్నాయి. కానీ అదే జగన్ విధానాలను బలంగా బలపరిచి ధర్మాన ప్రసాదరావు మరింత బలహీనం అయ్యారు. విశాఖ రాజధాని విషయంలో అతి చేశానని.. మావిగన్ స్టాండ్ తో జగన్మోహన్ రెడ్డి దారుణంగా దెబ్బతీశారన్న ఆవేదనతో ఉన్నారట ధర్మాన. చూడాలి ధర్మాన ఎలా ముందుకు వెళ్తారో..
'భోగా'పురమే.. రియల్ జోరు!
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానుంది. మరి కొద్ది రోజుల్లోనే ప్రారంభోత్సవంతో జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. దాదాపు పనులన్నీ పూర్తి కావడంతో ప్రారంభోత్సవానికి ముస్తాబయింది. ఉత్తరాంధ్ర తలరాతను మార్చబోతోంది ఈ విమానాశ్రయం. అయితే ఎయిర్పోర్ట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. విజయనగరం జిల్లా సరిహద్దులతోపాటు భోగాపురం చుట్టుపక్కల పది కిలోమీటర్ల పరిధిలో భూములతో పాటు ఇళ్ల స్థలాలు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టేందుకు భారీగా ముందుకు వస్తున్నారు.
* అత్యాధునిక విల్లాలు..
సాధారణంగా వెంచర్లలో ప్లాట్లు విక్రయిస్తుంటారు. కానీ భోగాపురంలో ఓపెన్ ప్లాట్ల వెంచర్ల స్థానంలో.. సరికొత్తగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కమర్షియల్ విల్లా ప్రాజెక్టులు, లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలు వెలుస్తున్నాయి. ఎయిర్పోర్ట్ కారిడార్ ఆనుకొని ఉన్న జాతీయ రహదారికి ఇరువైపులా.. వందల ఎకరాల్లో ఆధునిక టౌన్షిప్ ల నిర్మాణాలు ఊపందుకున్నాయి. విమానాశ్రయ కార్యకలాపాలు ప్రారంభమైతే.. ఈ ప్రాంతం ఒక పెద్ద ఎకానమిక్ హబ్ గా మారనుంది. ప్రధానంగా ప్రీమియం నివాస గృహాలకు, కమర్షియల్ స్పేస్ కు డిమాండ్ విపరీతంగా పెరిగింది.
* ఆస్తిపై పెట్టుబడులు..
ఉత్తరాంధ్రలో వలసలు ఎక్కువ. ఆపై చదువుకున్న వారు సైతం విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాలలో స్థిరపడిన వారు ఉన్నారు. అటువంటి వారంతా భోగాపురం పరిసర ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఉన్నత రంగాల్లో స్థిరపడిన వారు మాత్రం కమర్షియల్ విల్లాలు, లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలు కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. ప్లాట్ లతోపాటు వెళ్లాలని ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. తమ సొంత గడ్డపై అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం పక్కనే స్థిరాస్తి కలిగి ఉండడాన్ని గొప్పగా భావిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ధర పెరుగుతుందన్న ఆశతో ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు.
* మూడు జిల్లాలపై ప్రభావం..
ఒక్క భోగాపురం మాత్రమే కాదు విజయనగరం జిల్లాలోని రెండు మూడు నియోజకవర్గాలతో పాటు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లో సైతం రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంటుంది భోగాపురం విమానాశ్రయ నిర్మాణంతో. భూములతో పాటు ఇళ్ల స్థలాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లు కూడా భారీగా జరుగుతున్నాయి. ఉత్తరాంధ్రలోని ఉమ్మడి మూడు జిల్లాలకు ప్రధాన కేంద్రంగా మారనుంది భోగాపురం. భవిష్యత్తులో భోగాపురం ఒక నగరంగా అవతరించునుంది. వారం వారం ఇక్కడి చదరపు గజం ధరలు మారుతుండడంతో స్థానిక రైతులు, భూ యజమానులకు ఊహించని రీతిలో ఆర్థిక ప్రయోజనం చేకూరుతోంది.
వైసీపీ నేతల గుండెల్లో మావి'గన్'!
YS Jagan Mohan Reddy: వైయస్ జగన్మోహన్ రెడ్డి మావిగన్ స్టాండ్ తీసుకున్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికలు అమరావతి వర్సెస్ మావిగన్ అన్న అజెండాతో జరుగుతాయని తేల్చి చెప్పారు. అయితే దీనిపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కానీ ఇకనుంచి మావిగన్ స్టాండ్ మీద మాట్లాడాలని రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆదేశాలు అందాయి. భవిష్యత్తులో మచిలీపట్నం- విజయవాడ- గుంటూరును కలుపుకొని మావిగన్ రాజధానిని అభివృద్ధి చేస్తామని చెప్పాలని వైసీపీ శ్రేణులకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందాయి. మావిగన్ ప్రతిపాదనకు సంబంధించి నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించుకోవాలని కూడా భావిస్తున్నారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఈ విషయంలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అయితే వైసీపీ నేతలు తలెత్తుకోలేకపోతున్నారు.
* ఇప్పుడు ఎలా చెబుతాం..
మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అయితే అధికారంలో ఉన్నప్పుడు గ్రామాల్లో సభలు నిర్వహించి ఈ ప్రాంతానికి రాజధాని వస్తుందని చెప్పారు. విశాఖ పాలన రాజధానిగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించారని.. ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోతాయని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు మావిగన్ అంటే ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ప్రజలకు చెప్తామని ధర్మాన ప్రసాదరావు తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విశాఖ వైసిపి నేతలకు ఈ విషయంలో చుక్కలు కనిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలోకి వెళ్లి మావిగన్ అంటే ప్రజలు నవ్వుతారని.. వెటకారం చేస్తారని చెప్పుకొస్తున్నారు. అందుకే ప్రజలకు తాము చెప్పలేమని తేల్చి చెబుతున్నారు.
* విద్యాధికుల అభ్యంతరం..
సమాజంలో చీలిక తేవాలన్న జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం ఇది అని మేధావులు తేల్చి చెబుతున్నారు. అమరావతి రాజధానిపై ఇంకా విషం చిమ్మడం అంత మంచిది కాదు అని సూచిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం వినే రకం కాదు. కచ్చితంగా ఆయన మావిగన్ పైనే ముందుకు వెళ్తారు. అయితే ఆయన నుంచి వచ్చే కామెంట్స్ ఇప్పుడు మరి ఇబ్బందికరంగా మారుతున్నాయి. మావిగన్ మా స్టాండ్ అని చెబుతూనే విజయవాడ మా రాజధాని అంటూ నిన్నే మాట్లాడారు. ఒకవైపు అమరావతి రాజధాని పనులు జరుగుతుండగా.. ఇలా రాజధానిని మార్చేస్తామని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రకటన కొన్ని వర్గాల్లో ప్రభావం చూపిస్తుందని వైసీపీ నేతలు ఆందోళనతో ఉన్నారు. అందుకే మావిగన్ విషయంలో ప్రజలను కన్వెన్స్ చేయలేమని తేల్చి చెబుతున్నారు.
భీమ్ రెడ్డి.. అవినీతిలో బాహుబలి.. ఆస్తులు వందల కోట్లు.. లెక్కించడానికి కావాలి ప్రత్యేక యంత్రాలు
Bheem Reddy: ఆయన పేరు భీమిరెడ్డి.. తెలంగాణ పోలీస్ శాఖలో డిఎస్పి. డిజిపి ఆఫీసులో స్టేషనరీ వింగ్లో పనిచేస్తూ ఉంటారు. ఈయన ఇంట్లో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు మొదలుపెట్టారు. భారీగా సోదాలు చేశారు. ఈ సోదాలలో ఏకంగా వందల కోట్ల ఆస్తులను అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు.
పోలీస్ శాఖలో ఈ స్థాయిలో అక్రమ సంపాదన ఉంటుందా అని ఏసీబీ అధికారులు నోటి మీద వేలుసుకుంటున్నారు. అసలు ఇంతటి సంపాదన ఎలా సాధ్యమంటూ ఆశ్చర్యపోతున్నారు. భీమ్ రెడ్డికి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఆస్తులు ఉన్నాయి. హైదరాబాద్.. వికారాబాద్.. జహీరాబాద్.. గచ్చిబౌలి.. రంగారెడ్డి.. శంషాబాద్ ప్రాంతాలలో భారీగా ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాంతాలలో పోలీసులు ప్రత్యేకంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల సమయంలో పోలీసులకు ఒక డైరీ లభించింది. ఆ డైరీలో భీమిరెడ్డికి సంబంధించిన బినామీల చిట్టా ఉన్నట్టు సమాచారం. ఆ బినామీలలో దాదాపు 15 మంది దాకా ఉన్నట్టు తెలుస్తోంది.
భీమ్ రెడ్డికి సంబంధించిన ఒక బినామీ ఇంట్లో నుంచి ఏసీబీ అధికారులు వేగంగా 40 లక్షల వరకు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా.. ఇతర రాష్ట్రాలలో కూడా భీమిరెడ్డి భారీగా పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. గచ్చిబౌలి ప్రాంతంలో అత్యంత విలాసవంతమైన బహుళ అంతస్తుల భవనాన్ని తన కూతురి పేరు మీద భీమిరెడ్డి కొనుగోలు చేశారు. బెంగళూరుకు దగ్గరగా ఉన్న ఓ ప్రాంతంలో ఏకంగా ఎకరం భూమి ఉన్నట్టు తెలుస్తోంది. దీని విలువ కూడా భారీగా ఉన్నట్టు సమాచారం. ఓపెన్ ప్లాట్లు.. సాగు భూములు కూడా భీమిరెడ్డి పేరు మీద ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు అనేక రకాల ల్యాండ్ డాక్యుమెంట్లను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని కూడా భారీగా కూడబెట్టినట్టు ప్రచారం జరుగుతోంది.
భీమిరెడ్డి అక్రమ సామ్రాజ్యం అత్యంత పెద్దదిగా ఉంది. బ్యాంకు లాకర్లు మాత్రమే కాకుండా.. బినామీ ఖాతాలు కూడా ఉన్నాయి. ఈ ఆస్తులను మొత్తం లెక్కించడానికి ఇంకా రెండు నుంచి మూడు రోజుల వరకు పట్టే అవకాశం ఉంది. భీమిరెడ్డి.. పోలీస్ శాఖలో అవినీతి అనకొండ అని.. అక్రమ ఆస్తులను సంపాదించడంలో బాహుబలి అని.. ఏసీబీ అధికారులు చెబుతున్నారు. అతడిని త్వరలోనే అధికారికంగా అరెస్ట్ చేస్తామని.. రిమాండ్ కు తరలిస్తామని పేర్కొన్నారు.
















