Home Blog Page 311

South Superstars: బీజేపీ చేతుల్లో పవన్.. కాంగ్రెస్ చేతుల్లో విజయ్.. సౌత్ సూపర్ స్టార్స్ పై ఆధారపడిన జాతీయ పార్టీలు..

South Superstars: సౌత్ ఇండియా లో జాతీయ పార్టీలు తమ ఉనికి ని చాటుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. మన సౌత్ లో కాంగ్రెస్ పార్టీ కి మంచి పట్టు ఉంది. తెలంగాణ, కర్ణాటక , కేరళ ప్రాంతాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే నడుస్తున్నాయి. కానీ బీజేపీ మాత్రం కేవలం ఆంధ్ర ప్రదేశ్ లోనే ప్రభుత్వం లో కొనసాగుతుంది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో గౌరవప్రదమైన ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ, బలమైన లీడర్స్ లేకపోవడం తో ప్రభుత్వాలను ఏర్పాటు చేయలేకపోతున్నాయి . మరోపక్క కాంగ్రెస్ పార్టీ తమిళనాడు లో కూడా ప్రభుత్వం లో భాగం కాబోతుంది. రీసెంట్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన విజయ్ కి మద్దతు తెలిపింది కాంగ్రెస్ పార్టీ. త్వరలోనే ప్రభుత్వం లో అక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు కీలక బాధ్యతలు చేపట్టబోతున్నారు. అంటే ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లో మినహా, మిగిలిన సౌత్ రాష్ట్రాల్లో మొత్తం కాంగ్రెస్ పాగా వేసేసింది.

మరోపక్క బీజేపీ కూడా చాపకింద నీరు లాగా విస్తరింపజేసే ప్రయత్నం చేస్తోంది. కేరళ లాంటి రాష్ట్రంలో బీజేపీ 2 స్థానాలు గెలవడం అనేది చిన్న విషయం కాదు. ఇదంతా పక్కన పెడితే సౌత్ రాజకీయాల్లో ఈ రెండు జాతీయ పార్టీలు ఇద్దరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ని ముందు పెట్టుకొని నడిపించాలని చూస్తున్నాయి. అందులో ఒకరు త్వరలో తమిళనాడు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టబోతున్న విజయ్ కాగా, మరొకరు మన ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. విజయ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తో చేతులు కలపడం తో , సౌత్ లో మన తెలుగు రాష్ట్రాలతో సహా , మిగిలిన మూడు రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ కి మద్దతుగా విజయ్ ఎన్నికల ప్రచారం చేస్తాడు. అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా సౌత్ లో ఎప్పుడు ఎన్నికలు జరిగిన బీజేపీ పార్టీ తరుపున ప్రచారంలో పాల్గొంటాడు.

తమిళనాడు ఎన్నికల సమయంలో కూడా ఆయన ప్రచారం చెయ్యాల్సింది. కానీ అనారోగ్య సమస్యల కారణంగా ఆగిపోవాల్సి వచ్చింది. కానీ మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం ఏ స్థాయి ప్రభంజనం క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఏళ్ళ తరబడి గెలవని స్థానాల్లో కూడా సంచలన విజయం సాధించారు బీజేపీ అభ్యర్థులు. అలా దేశ రాజకీయాలను శాసిస్తున్న ఈ రెండు జాతీయ పార్టీలు , ఇప్పుడు ప్రధానంగా ఇద్దరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్, బలమైన ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ , విజయ్ వంటి వారితో చేతులు కలపడం సాధారణమైన విషయం కాదు. వచ్చే ఎన్నికల్లో విజయ్ కాంగ్రెస్ పార్టీ తరుపున ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో ప్రచారంలో పాల్గొనవచ్చు .

Peddi movie sensational update: ‘పెద్ది’ నుండి సెన్సేషనల్ అప్డేట్.. అభిమానులకు ఇక పండగే..

Peddi movie sensational update: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) హీరోగా నటించిన ‘పెద్ది'(Peddi Movie) చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని వచ్చే నెల 4 న విడుదల అయ్యేందుకు అన్ని దారులు క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని రెండు సార్లు వాయిదా వేశారు. మరోసారి ఎక్కడ వాయిదా వేస్తారో అని అభిమానుల్లో టెన్షన్ ఉండేది. కానీ ఆ టెన్షన్ కి తెరదించుతూ, నేడు కాసేపటి క్రితమే ఆ చిత్ర దర్శకుడు బుచ్చి బాబు వేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది . రామ్ చరణ్ అభిమానులను సంబరాలు చేసుకునేలా చేసింది ఈ ప్రకటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ సినిమా సెకండ్ హాఫ్ ఎడిటింగ్ వర్క్ కూడా పూర్తి అయ్యిందట. ఫైనల్ ఎడిట్ ని లాక్ చేసేశామని , జూన్ 3 న ప్రీమియర్ షోస్ కి సర్వం సిద్ధమని చెప్పుకొచ్చాడు.

అంతే కాదు ఎడిటింగ్ రూమ్ నుండి ఆయన అప్లోడ్ చేసిన ఫోటోకి కూడా ఫ్యాన్స్ నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. రామ్ చరణ్ లుక్స్ వేరే లెవెల్ లో ఉన్నాయని , విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఎద్దులబండిపై రామ్ చరణ్ ని చూస్తుంటే, రంగస్థలం వైబ్స్ వస్తున్నాయని అంటున్నారు ఫ్యాన్స్. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన ఐటెం సాంగ్ ని కూడా పూర్తి చేశారు. ఈ ఐటెం సాంగ్ లో శృతి హాసన్ రామ్ చరణ్ తో కలిసి చిందులు వేసింది. అంతే కాకుండా హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా ఈ పాటలో కాసేపు కనిపించబోతుంది అట. చిరంజీవి కొడుకు , కమల్ హాసన్ కూతురు , శ్రీదేవి కూతురు, ఇలా ఈ ముగ్గురు వెండితెర పై చిందులు వేస్తే అభిమానులకు కనులపండుగలాగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వచ్చే నెల 2వ తేదీన హైదరాబాద్ లోని LB స్టేడియం లో గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. అందుకోసం విలేజ్ స్పోర్ట్స్ థీమ్ తో డిజైన్ చేసిన పల్లెటూరి జాతర వైబ్స్ తో ఒక భారీ సెట్ ని కూడా ఏర్పాటు చేయబోతున్నారట. ప్రస్తుతానికి మేకర్స్ పోలీసుల అనుమతి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా తెలియజేయనున్నారు మేకర్స్.

Jagan part time politics: జగన్ పార్ట్ టైం రాజకీయాలు ఎంతకాలం

Jagan part time politics: రాజకీయాలు ఒక వృత్తి. ఒక పద్ధతి ప్రకారం చేస్తేనే దానికి ఒక గుర్తింపు ఉంటుంది. అధికారానికి చేరువ కాగలం. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో పొలిటికల్ ట్రెండ్స్ చూస్తుంటే ఎప్పటికప్పుడు మార్పులు కనిపిస్తున్నాయి. అయితే దానిని అందుకుంటేనే అనుకున్నది సాధించగలం. విజయ్ రెండు సంవత్సరాల క్రితం పార్టీని ఏర్పాటు చేశారు. అంతకంటే ముందే మరో సీనియర్ నటుడు కమల్ హాసన్ సైతం పార్టీని ఏర్పాటు చేశారు. అయితే విజయ్ అంత దూకుడుగా వ్యవహరించలేదు. సినిమాలను పక్కనపెట్టి రాజకీయాలపైనే పూర్తిగా దృష్టిపెట్టారు విజయ్. జీవన్మరణ సమస్య అన్నట్టు పోరాటం చేశారు. అనుకున్నది సాధించగలిగారు. పశ్చిమ బెంగాల్లో బిజెపి నేతలు చేసింది కూడా అదే. ఫుల్ టైం రాజకీయాలు చేసి అక్కడ సక్సెస్ అయ్యారు. అయితే ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అందుకు విరుద్ధంగా ఉన్నారు. ఒకసారి అధికారం చేపట్టి దానికి దూరం అయ్యారు జగన్మోహన్ రెడ్డి. అయినా సరే ఫుల్ టైం పాలిటిక్స్ చేయడం లేదు. వీకెండ్ పాలిటిక్స్ కు పరిమితం అవుతున్నారు.

అప్పట్లో వారికి రాజకీయాలే ఊపిరి..
2019 నుంచి 2024 మధ్య టిడిపి తో పాటు జనసేన విపక్షంలో ఉంది. ఆ సమయంలో చంద్రబాబు రాజకీయాలంటే ఒక ఊపిరిగా పనిచేశారు. లోకేష్ సైతం రాజకీయాలను ఒక వృత్తిగా భావించారు. పవన్ కళ్యాణ్ సైతం రోజువారి జరిగే పరిణామాలపై కూడా స్పందించేవారు. ఆ ముగ్గురితో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దేనిపై స్పందిస్తున్నారు. అలాంటి రాజకీయాలు చేస్తున్నారా? కనీసం ఏ అంశం పైన స్పందిస్తున్నారా? అంటే సమాధానం దొరకని పరిస్థితి. ఎంతవరకు తన పార్టీపై పగ తీర్చుకుంటున్నారు. ప్రతీకార కేసులు పెడుతున్నారు అని ఆరోపణలు చేస్తున్నారే తప్ప.. సమకాలిన అంశాలపై ఆయన స్పందించడం లేదు. జనాల్లోకి వచ్చి తిరగడం లేదు. జనాల సమస్యలను మరింత గట్టిగా అడగడం లేదు. బెంగళూరులో నాలుగు రోజులు.. తాడేపల్లిలో రెండున్నర రోజులు గడిపేసి వెళుతున్నారు. కళ్ళు మూసుకుంటే రెండేళ్లు దాటిపోయాయి. మరో మూడేళ్లు దాటి పోతే మన ప్రభుత్వం వచ్చేస్తుంది అని చెబుతున్నారు. ఫుల్ టైం రాజకీయాలు చేయకుండా పార్ట్ టైం రాజకీయాలకు పరిమితం అవుతున్నారు.

ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ఓడిపోయాయి. ఇదో ట్రెండ్ నడుస్తోంది. అయితే అధికార పార్టీలు ఏదో ఈజీగా ఓడిపోలేదు. అక్కడ విపక్షాలు గట్టి ప్రయత్నాలు చేశాయి. దానిపై సత్ఫలితాలు వచ్చాయి. ఈ ట్రెండ్ను ఇలానే కొనసాగించాలి అంటే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అని భావన కలిగించాలి. కానీ ఎందుకు ఆయన జనం మధ్యకు వచ్చేందుకు పెద్దగా ఇష్టపడడం లేదు. అన్నింటికీ 2027 పాదయాత్రను చూపిస్తున్నారు. అయితే 2017 పాదయాత్ర ఒక ఎత్తు.. ఇప్పుడు ఒక ఎత్తు. ఎందుకంటే అప్పుడు అధికారంలో అంతకు ముందు లేరు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పాలించారు. అందుకే పాదయాత్ర పై కూడా అంతగా నమ్మకం పెట్టుకోకూడదు. అంతకుమించి పార్ట్ టైం రాజకీయాలు చేయకూడదు. ఇక జగన్మోహన్ రెడ్డి ఇష్టం.

Paradise movie budget details: ప్యారడైజ్ బడ్జెట్ అన్ని వందల కోట్లు అయిందా… ఇప్పుడెలా మరి…

Paradise movie budget details: శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్యారడైజ్ సినిమాను మొదట 150 కోట్లు బడ్జెట్ తో చేయాలని అనుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా బడ్జెట్ రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు ఆ బడ్జెట్ భారీగా పెరిగిపోతుందట. సినిమా ఫస్ట్ కాపీ వచ్చే వరకు దాదాపు 250 కోట్ల వరకు ఈ సినిమా బడ్జెట్ అయితే అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే నాని మీద అన్ని వందల కోట్లు పెట్టడం అనేది ఒక వంతుకు రిస్క్ అనే చెప్పాలి. కానీ ఈ సినిమా మీద భారీ బజ్ ఉంది. కాబట్టి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమా ఈజీగా 500 కోట్ల పైన కలెక్షన్స్ ని రాబడుతుందని ప్రతి ఒక్కరికి ఉంది.

కాబట్టి ప్రొడ్యూసర్స్ రిస్క్ చేసిన సరే ఈ సినిమా మీద అంత మొత్తంలో బడ్జెట్ పెట్టడానికి సిద్ధమయ్యారు. ఇక పాజిటివ్ గా ఉన్నంతవరకు ఒకవేళ సినిమా నెగెటివ్ టాక్ ను సంపాదించుకుంటే మాత్రం ప్రొడ్యూసర్ భారీగా నష్టపోవాల్సిన పరిస్థితి అయితే రావచ్చనే ధోరణిలో కూడా మరి కొంతమంది ఆలోచిస్తున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా నాని లాంటి స్టార్ హీరో ఇప్పుడే మాస్ హీరోగా అవతరిస్తున్నాడు. కాబట్టి తన నుంచి వస్తున్న ఏ సినిమా అయిన ప్రేక్షకుడిని నిరాశ పరుచకూడదని అనుకుంటున్నారు. ఇక మొత్తానికైతే నాని ని ఈ సినిమా మాస్ హీరోగా మారుస్తుందా? పాన్ ఇండియాలో తనను స్టార్ హీరోగా నిలబెడుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ ఒక్క సినిమాతో నాని ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తాడు…

తద్వారా తదుపరి సినిమాల విషయంలో కూడా ఆయన చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తూ తన స్టాండర్డ్ ను పెంచుకోవాల్సిన అవసరమైతే ఉంటుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక ప్యారడైజ్ మీద రిస్క్ చేస్తున్నారనే చెప్పాలి. మూవీ బాగా వచ్చిందని చెబుతున్నప్పటికి ఫైనల్ గా ప్రేక్షకులు ఈ సినిమాను చూసి ఎలా రియాక్ట్ అవుతారు. వాళ్లు ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారనేది తెలియాల్సి ఉంది…

Paradise climax fight: ‘ప్యారడైజ్ ‘ క్లైమాక్స్ ఫైట్ ముందు పుష్ప ఎందుకు పనికి రాదా…

Paradise climax fight: నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్యారడైజ్ సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే దర్శకుడు ఈ సినిమాని టాప్ లెవల్లో చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా క్లైమాక్స్ ను రీసెంట్ గా షూట్ చేశారట. ఈ క్లైమాక్స్ ఫైట్ పుష్ప సినిమాని మించి ఉండబోతుందనే వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక డిఫరెంట్ వే లో ఈ సినిమా క్లైమాక్స్ డిజైన్ చేశారట. మోహన్ బాబు ఇందులో విలన్ గా నటిస్తున్న క్రమంలో మోహన్ బాబుకి నానికి మధ్య ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ జరగబోతుంది. దాంతో పాటుగా మరి కొంతమంది ఫైటర్స్ తో ఈ సినిమాలోని ఫైట్ ని అత్యంత అద్భుతంగా చిత్రీకరించినట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ అవ్వబోతున్నాయనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. నాని కెరియర్ లోనే ఇది బిగ్గెస్ట్ సక్సెస్ గా నిలుస్తుందట. సినిమాకి చాలా ఎఫర్ట్స్ పెట్టి మరి సినిమాను చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తుంది.

తను అనుకున్నట్టుగానే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో నిలుస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఆగస్టు 21వ తేదీన ఈ సినిమా థియేటర్స్ కి రానున్న నేపథ్యంలో ఈ మూవీ మీద భారీ బజ్ క్రియేట్ అయింది. మొత్తానికైతే ఈ సినిమాని టాప్ లెవెల్లో నిలబెట్టడానికి చాలామంది తీవ్రంగా కృషి చేస్తున్నారు.

ఇప్పటివరకు ఈ సినిమాకి దక్కిన విజయం ఒకెత్తయితే ఇప్పుడు ఈ సినిమా సాధించబోయే విజయం మరొక ఎత్తుగా మారబోతుంది. ఇక ఆగస్టు 21వ తేదీన ఎన్ని రికార్డులు బ్రేక్ అవ్వబోతున్నాయి అనేది తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా నుంచి వచ్చిన ఆయా షేర్ సాంగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండడంతో సినిమా మీద మరింత బజ్ పెరిగిపోయింది… మొత్తానికైతే నాని – శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో దసర సినిమా వచ్చి సూపర్ సక్సెస్ ని సాధించింది. ఇక అదే విధంగా మరోసారి వీళ్ళిద్దరి కాంబినేషన్ సూపర్ సక్సెస్ అయితే చూడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.

Mamata Banerjee latest political setback: మమతకు దెబ్బమీద దెబ్బ… ఇంకెన్ని షాక్‌లో..

Mamata Banerjee latest political setback: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గ్రాండ్‌ విక్టరీ కొట్టింది. మూడు రాష్ట్రాల్లో జయకేతనం ఎగురవేసింది. బెంగాల్‌లో గెలిచి చరిత్ర సృష్టించింది. మమతాబెనర్జీ కంచుకోటకు బీటలు వారేలా చేసింది. ఎన్నికల ఫలితాల తర్వాత బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎదుర్కొంటున్న పరిస్థితి ఒక సాధారణ ఎన్నికల పరాజయం కాదు. ఇది మమతా బెనర్జీ చుట్టూ నిర్మితమైన రాజకీయ ప్రతిష్ఠకు వచ్చిన గట్టి పరీక్ష అదే సమయంలో పార్టీ అంతర్గత క్రమశిక్షణ ఎంత బలహీనంగా మారిందో కూడా బయటపెడుతోంది. ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోవడం ఏ పార్టీకైనా పెద్ద దెబ్బే. కానీ దాని తర్వాత జరిగిన ఎమ్మెల్యేల గైర్హాజరు, అసమ్మతి వార్తలు, ఫిరాయింపుల భయం ఇవన్నీ కలిస్తే, సమస్య ఓటమితో ఆగిపోదు. అది నమ్మక సంక్షోభంగా మారుతుంది. నాయకత్వం మీద విశ్వాసం నిలవకపోతే, సీట్ల సంఖ్య కంటే ఎక్కువ నష్టం జరుగుతుంది.

వరుస ఎదురు దెబ్బలు..
మమతా బెనర్జీ రాజకీయాల్లో ఎప్పుడూ సంక్షోభాలను అవకాశాలుగా మలచుకున్న నేతగానే గుర్తింపు పొందారు. కానీ ఈసారి ఎదురవుతున్న సమస్యలు వేరే రకం. ప్రత్యర్థి పార్టీల బలం మాత్రమే కాదు, సొంత శిబిరంలో సడలుతున్న ఐక్యత కూడా ఆమెకు పెద్ద సవాలుగా మారింది. సమావేశానికి హాజరుకాకపోయిన ఎమ్మెల్యేల అంశాన్ని కేవలం షెడ్యూల్‌ సమస్యగా తీసుకోవడం సరైన విశ్లేషణ కాదు. ఓటమి తర్వాత పార్టీ భవిష్యత్‌పై సందేహాలు మొదలైన వేళ, ఇలాంటి గైర్హాజరు రాజకీయ సంకేతంగానే చదవాలి. అది నాయకత్వానికి ఇచ్చిన మౌన హెచ్చరిక కావచ్చు, లేదా కనీసం పార్టీ లోపలి అసంతృప్తికి ప్రతీక కావచ్చు.

బీజేపీలోకి వలసలు..
ఇక బీజేపీ వైపు వలసల చర్చ టీఎంసీకి మరింత ప్రమాదకరం. ఒక పార్టీ ఓటమి తర్వాత తన శ్రేణులను కాపాడుకోలేకపోతే, ప్రత్యర్థికి అది అదనపు బలం అవుతుంది. రాజకీయాల్లో గెలుపు ఓటముల కంటే ముఖ్యమైనది కేడర్‌ నమ్మకం. ఆ నమ్మకం దెబ్బతిన్నప్పుడు పార్టీ భవిష్యత్‌ కూడా కుదేలవుతుంది.

అసంతృప్త స్వరాలు..
మమతకు ఇప్పుడు అవసరమైనది రక్షణాత్మక భాష కాదు, పునర్నిర్మాణ దక్కోణం. తప్పును అంగీకరించడం, అసంతృప్త స్వరాలను వినడం, సంస్థాగత నియంత్రణను పునరుద్ధరించడం ఆమె ముందు ఉన్న అసలైన మార్గం. లేకపోతే, ఒకప్పుడు అప్రతిహతంగా కనిపించిన టీఎంసీ, లోపలి బీటల వల్ల మరింత బలహీనపడే అవకాశం ఉంటుంది.

ఇది మమతా బెనర్జీకి ముగింపు అన్న నిర్ధారణ కాదు.. కానీ ఆమె రాజకీయ జీవనంలో అత్యంత కఠినమైన పునఃపరీక్ష మాత్రం ఖచ్చితంగా. ఇప్పుడు ఆమె ఎదుర్కోవాల్సింది ప్రతిపక్షం కాదు, సొంత పార్టీలో చెలరేగిన అనిశ్చితి.

Human Lifespan Increased: శతాబ్దాల ప్రయాణం.. రెట్టింపైన మానవ ఆయుష్షు

Human Lifespan Increased: ఓ కాలంలో సగటు మానవుడు ప్రాణం కోల్పోకుండా నెలలు, సంవత్సరాలు పోరాడాల్సిన పరిస్థితి నుంచి, ఇప్పుడు ప్రపంచ సగటు ఆయుర్ధాయం 72.6 ఏళ్లకు చేరడం అత్యంత ఘనమైన సాంఘిక–వైద్య విజయంగా పరిగణించాలి. 19వ శతాబ్దం ప్రారంభంలో ఎక్కడా సగటు జీవితం 40 ఏళ్లు దాటలేదు అనే విషయం ఆనాటి కఠిన పరిస్థితులను వివరిస్తుంది. నేడు ఆ స్థాయి ద్విగుణీకరణ కావడం మనం చేసిన ఆరోగ్య విప్లవానికి ప్రత్యక్ష సాక్ష్యం.

నాడు 30..
1800 నాటి ప్రపంచం తీవ్ర పేదరికం, పోషకాహారం లేమి, అంటువ్యాధుల భయంతో నిండిన చీకటి కాలం. వైద్య పరిజ్ఞానం శూన్యం కావడంతో మానవుడికి జీవితం అస్థిర విషయంలా మిగిలిపోయింది. పారిశ్రామిక విప్లవం తర్వాత కూడా ఐరోపా, ఉత్తర అమెరికా వంటి ప్రాంతాల్లో ఆయుష్యం 60 ఏళ్ల దగ్గర ఉండగా, ఆఫ్రికా–ఆసియాలో చాలా ప్రాంతాలు 30 ఏళ్ల దాకా పడిపోయాయి. కొన్ని దేశాల్లో 26 ఏళ్ల సగటు మాత్రమే ఉండి, ప్రపంచ ఆరోగ్య అసమానతకు అది చక్కటి ఉదాహరణగా నిలుస్తుంది.

నేడు 72..
1950 తరువాత వైద్య విజ్ఞానం, జనాభా ఆరోగ్య వనరులు, శిశు నైపుణ్య సేవలు ఉబికిపోవడం వల్ల ప్రపంచ స్థాయిలో మరణాల రేటు పడిపోయింది. కేవలం శిశు మరణాలు తగ్గడం మాత్రమే కాదు, పెరుగుతున్న వయసు వారి జీవావధి కూడా పెరగడం ఆధునిక ఆరోగ్య వ్యవస్థ యొక్క సమగ్రతను చూపిస్తుంది. 2019 నాటికి ప్రపంచ సగటు ఆయుర్ధాయం 72.6 ఏళ్లు. ఇది 1950లో ప్రపంచంలోనే ఉన్న అధిక స్థాయి అయిన నార్వేలో 72.3 ఏళ్లను కూడా దాటేసింది.

అసమానత తగ్గినా..
గత శతాబ్దాల్లో ఆరోగ్య స్థాయి పెరుగుదల ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలకే పరిమితమైతే, ఈ రోజు మునుపు వెనుకబడ్డ ప్రాంతాలే వేగంగా ఆరోగ్య లాభాలు పొందుతున్నాయి. దీంతో ప్రపంచ దేశాల మధ్య ఉన్న ఆయుష్య అంతరం కొంతవరకు ఘర్షించింది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ తక్కువ ఆయుష్యం, పరిమిత ఆరోగ్య సౌకర్యాలు ఉన్నప్పుడు, ఈ పురోగతి పూర్తి కాలేదనే వాస్తవం మిగులుతుంది.

మన పూర్వీకుల కంటే రెండింతల కాలం జీవించగలగడం వైద్య శాస్త్రం సాధించిన విజయమే కానీ, అదే సాధన అన్ని వర్గాలకు సమానంగా లభ్యం కావడం ఇప్పటికీ సవాలు. ఇప్పటి సాధించిన దశ ఒక పునాది మాత్రమే. ప్రతీ వ్యక్తికీ నాణ్యమైన, అందుబాటులో ఉన్న వైద్య సౌకర్యాలు అందించడం మన ముందున్న అతిపెద్ద లక్ష్యం. అప్పుడే మానవ ఆయుష్యం పెరిగిన ఈ శతాబ్దాల ప్రయాణం పూర్తి అర్థంలో సార్థకం అవుతుంది.

Vijay father movies with Chiranjeevi: హీరో విజయ్ తండ్రి చిరంజీవి తో ఇన్ని సూపర్ హిట్ సినిమాలు తీశాడా..? ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..

Vijay father movies with Chiranjeevi: సోషల్ మీడియా , ఎలక్ట్రానిక్ మీడియా లలో ఎక్కడ చూసినా ఇప్పుడు విజయ్ పేరే వినిపిస్తోంది. రీసెంట్ గా జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఆయన స్థాపించిన టీవీకే పార్టీ సంచలన విజయం సాధించింది. రేపు లేదా ఎల్లుండి విజయ్ తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నాడు. ఇదంతా పక్కన పెడితే విజయ్ కి , ఆయన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కి సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. అందులో కొన్ని విజయ్ తండ్రి చంద్రశేఖర్ గురించి ఉన్నాయి. చంద్ర శేఖర్ సామాన్యుడు కాదు, తమిళనాడు టాప్ మోస్ట్ లెజండరీ డైరెక్టర్స్ లో ఒకరు. రజినీకాంత్ , కమల్ హాసన్ , విజయ్ కాంత్ ఇలా ఎంతో మంది బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ తో కలిసి ఆయన సినిమాలు చేశాడు . అంతే కాదు DMK పార్టీ అధినేత కరుణానిధి నిర్మించిన చిత్రాలకు కూడా చంద్ర శేఖర్ దర్శకత్వం వహించాడు.

అయితే చంద్ర శేఖర్ కేవలం తమిళ సినిమా ఇండస్ట్రీ కి మాత్రమే పరిమితం అవ్వలేదు. మన టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి తో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించాడు. ‘చట్టానికి కళ్ళు లేవు’, ‘దేవాంతకుడు’, ‘పల్లెటూరి మొనగాడు’. ఆ రోజుల్లో ఈ సినిమాలు సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ గా నిల్చి, చిరంజీవి కి మాస్ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ని తెచ్చి పెట్టాయి. అంతే కాదు చంద్ర శేఖర్ తో చిరంజీవి కి మంచి సాన్నిహిత్యం కూడా ఉంది. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చంద్ర శేఖర్ చిరంజీవి గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

ఆయన మాట్లాడుతూ ‘చిరంజీవి గారిత్ కలిసి పని చేయడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి. నాకు తెలుగు మొదట్లో అసలు వచ్చేది కాదు, కానీ చిరంజీవి గారితో పరిచయం ఏర్పడిన తర్వాత ఆయన నాకు తెలుగు నేర్పించాడు. ‘చట్టానికి కళ్ళు లేవు’ చిత్రం 175 రోజులకు పైగా థియేటర్స్ లో ఆడింది. అందుకు విజయోత్సవ సభ ఏర్పాటు చేశారు. చిరంజీవి గారు అప్పుడు నాతో మీరు స్టేజి మీదకు ఎక్కిన తర్వాత తెలుగు లోనే మాట్లాడాలి అని చెప్పారు. ఆయన ఇచ్చిన ధైర్యం తో తెలుగు లో మాట్లాడాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘చిరంజీవి దర్శకులకు ఎంతో విలువ ఇచ్చే మనిషి. నేను ఏదైనా షాట్ బాగాలేక పోతే ఆయన ముఖం మీదనే చెప్పేవాడిని. ఎన్నిసార్లు టేకులకు వెళ్లినా ఆయన చిరాకు పడేవాడు కాదు , చాలా సౌమ్యంగా ఓకే సార్ అని చెప్పి టేక్ చేసేవాడు. ఇలాంటి వాళ్ళు మన సినీ ఇండస్ట్రీలలో చాలా తక్కువగా ఉంటారు’ అంటూ చెప్పుకొచ్చాడు చంద్ర శేఖర్.

Honda ZR-V premium SUV features: Honda నుంచి ప్రీమియం కారు.. ఫీచర్స్ తెలిస్తే క్యూ కడతారు..

0

Honda ZR-V premium SUV features: ప్రముఖ కార్ల కంపెనీ హోండా తన ప్రీమియం ఎస్‌యూవీ Honda ZR-Vని త్వరలో భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. హోండా లైనప్‌లో ఇది టాప్ ఎండ్ మోడల్‌గా నిలవనుంది. స్టైలిష్ డిజైన్, శక్తివంతమైన ఇంజన్ , అత్యాధునిక ఫీచర్లతో రానున్న ఈ కారు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

హోండా ZR-V బాహ్య రూపం చాలా స్పోర్టీగా, ప్రీమియం లుక్‌తో ఉంటుంది. దీని ముందు భాగంలో ఉండే సిగ్నేచర్ గ్రిల్, షార్ప్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్ దీనికి ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఇస్తాయి. లోపలి భాగం విషయానికి వస్తే.. చాలా క్లీన్, లగ్జరీ ప్యాకేజింగ్‌తో కనిపిస్తుంది. సాఫ్ట్-టచ్ మెటీరియల్స్, విశాలమైన క్యాబిన్, డ్రైవర్‌కు అనుకూలమైన డాష్‌బోర్డ్ సెటప్‌తో ఇది వినియోగదారులకు మంచి ‘ఫీల్-గుడ్’ అనుభూతిని అందిస్తుంది.

కొత్తగా రాబోయే ఈ SUV కారులో అత్యంత కీలకమైన విషయం ఏంటంటే స్ట్రాంగ్-హైబ్రిడ్ పవర్‌ ట్రెయిన్. ఇది 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో పనిచేస్తుంది. ఈ టెక్నాలజీ వల్ల కారు అద్భుతమైన పర్ఫార్మెన్స్‌ను అందించడమే కాకుండా, మైలేజ్ విషయంలో కూడా తన విభాగంలోని ఇతర కార్ల కంటే మెరుగ్గా ఉంటుంది. సిటీ ట్రాఫిక్‌లో ఇది ఎలక్ట్రిక్ మోడ్‌లో నడుస్తూ ఇంధనాన్ని ఆదా చేస్తుంది, హైవేలపై ఇంజన్ పవర్‌ను ఉపయోగించుకుంటుంది.

ఫీచర్ల పరంగా హోండా ఎక్కడా రాజీ పడలేదు. ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్ ఉండే అవకాశం ఉంది. డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు ప్రీమియం ఆడియో సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు ప్రయాణాన్ని మరింత సుఖమయం చేస్తాయి.

సేఫ్టీ విషయంలో హోండా ZR-V అత్యుత్తమ ప్రమాణాలను కలిగి ఉంది. ఇందులో Honda Sensing అనే అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ప్యాకేజీ ఉంటుంది. దీని ద్వారా కొలిషన్ మిటిగేషన్ బ్రేకింగ్ సిస్టమ్ (ఆటోమేటిక్ బ్రేకింగ్), లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, రోడ్ డిపార్చర్ మిటిగేషన్ వంటి ఫీచర్లు డ్రైవర్‌కు రక్షణగా ఉంటాయి. వీటితో పాటు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD మరియు 360-డిగ్రీ కెమెరా వంటి భద్రతా ఫీచర్లు స్టాండర్డ్‌గా వస్తాయి.

అదిరిపోయే పర్ఫార్మెన్స్ తో పాటు అదిరిపోయే మైలేజ్ కోరుకునే వారికి, అలాగే లగ్జరీ ఫీచర్లు ఇష్టపడే వారికి Honda ZR-V ఒక అద్భుతమైన ఆప్షన్‌గా మారనుంది. ఇది భారత మార్కెట్లో హ్యుందాయ్ ట్యూసాన్, జీప్ కంపాస్ వంటి కార్లకు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది.

India strong warning to Pakistan: పాక్‌కు షాక్‌ ఇచ్చి… ప్రపంచానికి మన సత్తా చాటి..

India strong warning to Pakistan: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో అమాయక పర్యాటకులను ఊచకోత చేసిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌తో మన సత్తా ప్రపంచానికి తెలిసింది. ఉగ్రవాదులపై దాడి కారణంగా పాకిస్తాన్‌ తోక ముడిచింది. ఈ నిర్ణయం కేవలం భావోద్వేగ ప్రతిస్పందన కాదు. ఇది వ్యూహాత్మక విజయంగా మారింది. పారిశ్రామిక సౌకర్యాలు, ఉగ్ర స్థావరాలు, ఆయుధ ఎయిర్‌బేసుల వంటి లక్ష్యాలు తీసుకుని చేసిన దాడులు పాకిస్తాన్‌ను ఉలికిపడేలా చేశాయి. ఈ ప్రతీకారం ప్రపంచానికి చూపించింది భారత్‌ ఎంత శక్తివంతంగా మారింది అనే సందేశం.

రణనీతి పునర్‌నిర్వచనం
ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత భారత్‌ యొక్క రణనీతి పునర్‌నిర్వచనమైన విధం గురించి ప్రపంచం అభినందించింది. కేవలం దారుణ దుర్మార్గాలను తీసుకోవడం కాకుండా, శత్రువు యొక్క ఆపరేషన్‌లు, ఆయుధ సౌకర్యాలు అన్నీ ధ్వంసం చేయడం భారత్‌ను అధికారి రాష్ట్రంగా ప్రచారం చేసింది. ఈ దాడుల తర్వాత పాకిస్తాన్‌ కూడా తన రక్షణ వ్యవస్థను పునర్బలహీనం చేస్తుంది. భారత్‌ దృఢంగా తీసుకున్న ప్రత్యుత్తరం తర్వాత ఆ దేశం కాల్పుల విరమణకు బతిమాలుకుంది కూడా ఇది సౌమ్యమైన సందేశంగా పరిగణించాలి.

ఆయుధ టెక్‌నాలజీ, ఎగుమతి వ్యాపారం
ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో ఉపయోగించిన ఆకాశ్, బ్రహ్మోస్, స్వదేశీ రక్షణ వ్యవస్థలు ప్రపంచానికి ఆశ్చర్యం కలిగించుతున్నాయి. ఈ ఆయుధాలు పాకిస్తాన్‌లోని లక్ష్యాలను నేరుగా, సులభంగా, సైన్యం లేకుండా దెబ్బ తీసిన విధం భారత్‌ను ముందుకు నడిపెట్టింది. ఈ ప్రదర్శన తర్వాత ప్రపంచంలోని దేశాలు భారత్‌ ఆయుధ ఎగుమతుల మీద ఆసక్తి పెంచాయి. ఆర్మేనియా, ఇండోనేసియా, ఇతర దేశాలు భారట ఆయుధాలు కొనుగోలు చేయడానికి ఒప్పందాలు చేసుకున్నాయి, ఇది భారత ఆయుధ వ్యాపారం పెంచడానికి సహాయపడింది.

రాజకీయ మరియు సామర్థ్య ప్రభావం
పహల్గాం దాడుల తర్వాత భారత్‌ తీసుకున్న ఈ దూర దాడులు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఇంకా ఎక్కువ మంది దేశాలు భారత్‌పై ఆశ పెట్టుకున్నాయి, ఎందుకంటే ఈ సామర్థ్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాద సమస్యలను ఎదుర్కొనే సైనిక సామర్థ్యాన్ని చూపిస్తుంది. ఈ ప్రతికూలత తర్వాత భారత్‌ తీసుకున్న స్వచ్ఛమైన నిర్ణయం ద్వారా రాజకీయ సంయోజక శక్తిని పెంచుకున్నారు. ఇప్పుడు భారత్‌ ప్రపంచంలోని సైనిక జాబితాలో ప్రముఖ దేశంగా గుర్తించబడుతోంది.

భవిష్యత్తు హెచ్చరిక..
పహల్గాం ఉగ్రదాడుల తర్వాత భారత్‌ తీసుకున్న ఆపరేషన్‌ సిందూర్‌ ప్రతిసమీక్షపై ప్రపంచానికి హెచ్చరిక కూడా ఇచ్చింది. భవిష్యత్తులో ఉగ్రవాదం, దారుణ దాడులు ముఖ్యమైన ఆపరేషన్‌లుగా పరిగణిస్తుంది. ఈ ఆపరేషన్‌ తర్వాత భారత్‌ తన రక్షణ వ్యవస్థలు, సైనిక శక్తి పెంచుకున్న విధం ప్రపంచానికి చూపిస్తోంది. ఈ ప్రదర్శన తర్వాత భారత్‌ ప్రపంచ సైనిక మార్కెట్‌లో ప్రముఖ దేశంగా ఉంటుంది.

ఈ విశ్లేషణ ప్రకారం, పహల్గాం దాడుల తర్వాత ఆపరేషన్‌ సిందూర్‌ భారత్‌ ప్రత్యుత్తరం మన సైనిక సామర్థ్యం పెంచుకున్న విధం ముందుకు నడిపెట్టింది.

India Heatwave 2026: భారత్ నిప్పుల కొలిమి.. దేశానికి పెను విపత్తు రాబోతోందా..

India Heatwave 2026: ప్రస్తుత వేసవి కేవలం ఉష్ణ తరంగం కాదు. వాతావరణ మార్పుల ఫలితంగా మన దేశం ఎదుర్కొంటున్న ఒక పెను సంకేతంగా కనిపిస్తోంది. వేడి గాలులు మున్ముందు మరింత తీవ్రం కానున్నాయి. రోజుల తరబడి అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో 45 డిగ్రీల దగ్గర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అంటే, వాతావరణం కేవలం వార్తగా మిగలకుండా, ఆరోగ్యం, నీరు, జీవనోపాధి, వ్యవసాయం, మౌలిక సదుపాయాల పై ఒత్తిడి పెంచే సంక్షోభంగా మారుతోంది. ఈ పరిస్థితిని పరిష్కరించడానికి కేవలం రాష్ట్ర స్థాయి చొరవలు కాదు, కేంద్ర–రాష్ట్ర సమన్వయంతో జాతీయ కార్యాచరణ అవసరం.

ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం..
ప్రపంచ వాతావరణ సంస్థ నివేదిక ప్రకారం, 1850–1900 కాలం నాటి సగటుకన్నా 2025లో భూమి ఉష్ణోగ్రత దాదాపు 1.43 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పెరిగింది. ఈ పెరుగుదల తో పాటు గడచిన రెండు దశాబ్దాల్లో విద్యుత్–ఇంధన వినియోగానికి 18 రెట్ల ఉష్ణాన్ని సముద్రాలు శోషించడం వల్ల ఆర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాల్లో మంచు రికార్డు స్థాయిలో కరిగిపోతోంది. పర్వత హిమనదాలు కూడా ఎండి పోతున్నాయి. ఈ ప్రపంచీకరణ ధోరణి భారతదేశంపై కూడా గణనీయంగా ప్రతిఫలిస్తోంది. ఆసియా ఖండం ప్రపంచ సరాసరి కన్నా రెట్టింపు వేగంతో వేడెక్కుతోంది. దక్షిణాసియా ప్రపంచంలోనే అత్యంత వేడి ప్రాంతంగా గుర్తించబడింది.

భారత్‌లో ఉష్ణోగ్రతల పెరుగుదల..
భారత్‌లో 1901–1930 కాలం నాటి సగటుతో పోలిస్తే 2015–2024 మధ్య సగటు ఉష్ణోగ్రత దాదాపు 0.9 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగిందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఉత్తర ప్రాంతాల్లో ప్రతి దశాబ్దానికి సుమారు 0.2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పెరుగుతుంది. దేశవ్యాప్తంగా అత్యంత వేడి రోజులు దశాబ్దానికి 5–10 రోజుల చొప్పున పెరుగుతున్నాయి. ఈ పెరుగుదల వల్ల మొదటి రోజులు మాత్రమే అత్యంత వేడి అనుభవించే ప్రాంతాల్లో ఇప్పుడు రోజుల తరబడి తీవ్రమైన వడగాడ్పులు విరుచుకుపడుతున్నాయి. 2010లో ప్రపంచంలో 23 శాతం జనాభా అత్యంత వేడి ప్రాంతాల్లో ఉండగా, ప్రపంచం రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడెక్కితే 2050 నాటికి ఆ భాగం దాదాపు 41 శాతానికి చేరి, 3.79 బిలియన్ మంది ప్రభావితం అవుతారని ఆక్స్‌ఫర్డ్ పరిశోధన హెచ్చరిస్తోంది. భారత్‌ ఇందులో ప్రధాన దేశాల్లో ఒకటిగా కనిపిస్తోంది.

దక్షిణాసియా ప్రధాన లక్ష్యంగా ..
దక్షిణాసియా ప్రపంచ సరాసరి కన్నా రెట్టింపు వేగంతో వేడెక్కుతోంది. 1990–2021 మధ్య అధిక ఉష్ణ పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన మొత్తం మరణాల్లో సగానికి పైగా ఆసియాలోనే చోటు చేసుకున్నాయి. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం, 2030 నాటికి దక్షిణాసియా జనాభాలో 90 శాతం ప్రజలు తీవ్రమైన ఉష్ణ పరిస్థితులను ఎదుర్కొంటారు. భారత్‌లో దాదాపు 57 శాతం జిల్లాలు ఇప్పటికే అత్యంత వేడి వల్ల ఒత్తిడికి గురవుతున్నాయి. హిమాలయాల ప్రాంతాల్లో కూడా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇది వాతావరణం మార్పుల పరిధి కేవలం తీర ప్రాంతాలకు పరిమితం కాదని సూచిస్తోంది.

అధిక ఉష్ణం కార్మికులు, రైతులు, వృద్ధులు, పిల్లలు, కూలీలు, అల్పాదాయ కుటుంబాలను ప్రత్యక్షంగా దెబ్బ తీస్తోంది. డీహైడ్రేషన్, అవయవాల ఒత్తిడి, నిద్రలేమి, ఉత్పాదకత తగ్గుదల, వ్యవసాయ నష్టం, విద్యుత్–ఆరోగ్య వ్యవస్థలపై భారం పడుతుంది.

TVK Vijay: టీవీకే విజయ్ కు గుడ్ న్యూస్.. తమిళనాట కీలక పరిణామం

TVK Vijay: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత తమిళనాడులో 107 స్థానాలతో ఏకైక పెద్ద పార్టీగా టీవీకే ఆవిర్భవించింది. రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చబోతోంది. ద్రవిడ పార్టీల ఆధిపత్యం కొనసాగుతున్న పరిస్థితుల్లో.. తొలిసారిగా కొత్త శక్తి హోదా పొందడం విశేషం. ఈ హోదాతో టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను విజయ్ లేఖ ద్వారా కోరారు. అయితే పూర్తి మెజారిటీతోనే రావాలని గవర్నర్ సూచించారు.

సీపీఐ, వీసీకే మద్దతు..
ప్రస్తుత విశ్లేషణ ప్రకారం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ), విడుథలై చిరుతైగల్ కచ్చి (వీసీకే) ప్రాథమికంగా టీవీకే చీఫ్ విజయ్‌కు అనుకూలంగా ఉంటున్నాయని సూచనలు వస్తున్నాయి. ఈ రెండు పార్టీల దగ్గర ఇద్దరు ఎమ్మెల్యేలు చొప్పున ఉన్నాయి. వీరి మద్దతు స్పష్టమైతే టీవీకేకు సహజ సంఖ్య 116 మెజారిటీకి చేరుకునే సామర్థ్యం ఏర్పడుతుంది. అయితే మ్యాజిక్ ఫిగర్ 118(సులభ మెజారిటీ 234లో) కోసం ఇంకా ఇద్దరు ఎమ్మెల్యేల అవసరం ఉంటుంది.

కాంగ్రెస్ కూడా..
రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సీపీఐ, వీసీకే తోపాటు కాంగ్రెస్ కూడా మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో టీవీకే ఈ సమీకరణలో కాపీ వీసీకే భాగస్వామ్యాన్ని లెక్కకట్టుకుంటోంది. కానీ ఈ రెండు పార్టీలు తమ విధానపర ప్రయోజనాలు, భవిష్యత్తు సంస్థాంతర సంబంధాలను పరిగణించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ ఫలితంగా, తమిళనాడు రాజకీయ భూభాగంలో నూతన సమీకరణ రూపం విభజించుకుందనే చర్చ ప్రారంభమైంది.

రాజకీయ స్థిరత
టీవీకే హోదా ఏకైక పెద్ద పార్టీగా ఉండి, సీపీఐ వీసీకే మద్దతుతో 116 స్థాయికి సమీకరణ సాధించినా, మ్యాజిక్ ఫిగర్ 118 కోసం మరో ఇద్దరు ఎమ్మెల్యేల అవసరం ఉండడం ప్రభుత్వ స్థిరతపై అనిశ్చయం కలిగిస్తుంది. ఈ అనిశ్చయం ప్రభుత్వానికి సంబంధించిన రాజకీయ మార్గదర్శక నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. అందుకు టీవీకే తన విధానాలు, సంస్థాంతర సమీకరణలు స్పష్టంగా ప్రకటించాల్సిన అవసరం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో, తమిళనాడులో విజయ్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటులో సీపీఐ వీసీకేల నిర్ణయానికి ప్రత్యేకత ఉంటుంది.

లోక్ భవన్ లో కీలక పరిణామం..
చెన్నై లోక్ భవన్‌లో తమిళనాడు గవర్నర్ తో దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన చర్చల తర్వాత టీవీకే చీఫ్ విజయ్ బయటకు వచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని విజయ్‌ను అధికారికంగా ఆహ్వానించారు.

Vijay government stability : విజయ్ ప్రభుత్వం స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి?

Vijay government stability : తమిళనాడు ఎన్నికల ఫలితమే గందరగోళంగా ఉంది. ప్రభుత్వ ఏర్పాటు కూడా అంతకన్నా చిల్లరగా మారింది. అక్కడ టీవీకే విజయ్ ప్రభుత్వం ఏర్పడుతుందా? లేదా? అన్న దానిపై క్లారిటీ లేదు. 108 సీట్లు అంటే 10 సీట్లు తగ్గాయి. ఏదో విధంగా ఎమ్మెల్యేలను కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని టీవీకే విజయ్ ప్రయత్నాలు చేస్తున్నారు. మిగిలిన దాంట్లో పీఎంకే చేరుతుందని అంటున్నారు. ఇది అన్నాడీఎంకేతో పొత్తు ఉంది. వీసీకే దళితుల పార్టీ.. మైనార్టీల పార్టీ విజయ్ కు మద్దతు ఇస్తుందని అనుకోవాలి.

కాంగ్రెస్ తప్పితే మిగతా పార్టీల మద్దతు విజయ్ కు రాలేదు. ఇంకో ఆరుగురిని మేనేజ్ చేయాలి. లాంగ్ రన్ లో చాలా తలనొప్పులు ఉంటాయి. అన్నాడీఎంకేతో కలవడం విజయ్ కు బెస్ట్ ఆప్షన్. అన్నాడీఎంకే మెజార్టీ ఎమ్మెల్యేలు విజయ్ కు మద్దతు ఇవ్వాలని అనుకుంటున్నారు. ఎంపీ షన్ముగం నాయకత్వంలో కొంతమంది ఎమ్మెల్యేలు ముందుకొస్తున్నారు. నిజంగా అదే బెటర్ ఆప్షన్.

ఒక పార్టీని మేనేజ్ చేయడం విజయ్ కు ఈజీ. వారికి మంత్రిపదవులు ఎక్కువ ఇస్తే ఉంటారు. కాంగ్రెస్ తో కలవడంతో కేంద్రంతో ఇబ్బందులు తప్పవు. బీజేపీ ప్రభుత్వంతో నిధులు, ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. కాంగ్రెస్ తో వెళ్లితే లాభం కన్నా నష్టం ఎక్కువగా ఉంటుంది.

విజయ్ ప్రభుత్వం స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Pithapuram Varma: పిఠాపురం వర్మపై వేటు.. టిడిపి గట్టి హెచ్చరిక

Pithapuram Varma: రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం జరిగింది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పదవి నుంచి వర్మను కలిగిస్తూ హై కమాండ్ నిర్ణయం తీసుకుంది. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలతోనే తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఈ నిర్ణయానికి వచ్చింది. వర్మను తొలగించి.. టిడిపి పర్యవేక్షణ బాధ్యతలను ముగ్గురు నేతలతో కూడిన కమిటీకి అప్పగించింది. వర్మ వ్యక్తిగత వ్యవహార శైలి కూటమి సమన్వయానికి విఘాతం కలిగిస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కూటమి విషయంలో ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ శ్రేణులకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ వచ్చారు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో టిడిపి నుంచి కూటమికి ఇబ్బంది రాకుండా ఉండేందుకుగాను.. వర్మ పై వేటు వేసింది టిడిపి నాయకత్వం.

* ఎన్నికల్లో సహకరించినా..
మొన్నటి ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గాన్ని పొత్తుల భాగంగా జనసేనకు కేటాయించారు. అయితే తెలుగుదేశం పార్టీకి ఇది బలమైన నియోజకవర్గం. అందుకే వర్మ నేతృత్వంలోని టిడిపి శ్రేణులు అభ్యంతరం తెలిపాయి. కానీ చంద్రబాబు చొరవ తీసుకొని ఒప్పించడంతో పవన్ గెలుపు కోసం కృషి చేశారు వర్మ. అంతవరకు ఓకే కాని ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత.. వర్మ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపించింది. పిఠాపురం నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం ఆయన గట్టి ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో జనసేన నేతలతో ఘర్షణ వైఖరి అనుసరించారు. మొన్ననే జనసేన మాజీ ఎమ్మెల్యే దొరబాబుతో వీధి పోరాటానికి దిగారు. కేవలం ఉద్దేశపూర్వకంగా ప్రోటోకాల్ పేరుతో వర్మ ఘర్షణ వైఖరి అనుసరిస్తున్నారు అని టిడిపికి నివేదికలు అందాయి.

* స్పష్టమైన సంకేతాలు..
కూటమి విషయంలో ఇబ్బందులకు గురి చేస్తే ఎంతటి వారిపైనైనా చర్యలు ఉంటాయని స్పష్టమైన సంకేతాలు పంపింది టిడిపి నాయకత్వం. మొన్నటి ప్రోటోకాల్ రగడ తర్వాత వర్మకు రాష్ట్ర కార్యవర్గంలో చోటు దక్కింది. దీంతో వర్మ విషయంలో టిడిపి నాయకత్వం చూసి చూడనట్టుగా వెళుతుందని ఒక అభిప్రాయం ఏర్పడింది. కానీ ఇప్పుడు దానికి చెక్ చెబుతూ వేగంగా ఇంచార్జ్ పదవి నుంచి వర్మను తొలగించారు. కూటమి విషయంలో ఇబ్బందులకు గురి చేస్తే ఎంతటి వారినైనా విడిచి పెట్టేది లేదని సంకేతాలు పంపింది టిడిపి నాయకత్వం. అయితే వర్మకు చెప్పి తొలగించారా? ఈ ఆదేశాలు వెనుక వర్మ ఎలా స్పందిస్తారు? అనేది తెలియాల్సి ఉంది. కచ్చితంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంది. వర్మ కోసం ప్రయత్నాలు చేస్తుంది. గతంలో కూడా వర్మ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఒక ప్రచారం బలంగా జరిగింది. ఇప్పుడు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి.

Nellore Mahanadu: నెల్లూరులో మహానాడు.. అబ్బబ్బా ఏం ఏర్పాట్లు!

Nellore Mahanadu: నెల్లూరులో మహానాడు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. తొలిసారిగా మహానాడు వేడుకలు ఈ జిల్లాలో జరుగుతుండడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వాస్తవానికి శ్రీకాకుళంలో ఈసారి మహానాడు వేడుకలకు ప్లాన్ చేశారు. కానీ ఉత్తరాంధ్రలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. జూన్లో కానీ.. జూలైలో కానీ ఈ వేడుక జరగనుంది. అయితే ప్రధాని పర్యటన నేపథ్యంలో నెలరోజులు ముందుగానే మహానాడు లాంటి పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం పద్ధతి కాదు అని టిడిపి హై కమాండ్ భావించింది. అందుకే అప్పటికప్పుడు మహానాడు వేదికను నెల్లూరుకు మార్చింది. సహజంగానే నెల్లూరులో టిడిపి నేతలు అంతా సమన్వయంతో ఉన్నారు. అందుకే అక్కడ ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిసారిగా మహానాడు నిర్వహణ బాధ్యతలు రావడంతో రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తున్నారు.

* టిడిపి క్లీన్ స్వీప్
నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మొన్నటి వరకు పట్టు తక్కువ. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తోంది నెల్లూరు జిల్లా. 2014 ఎన్నికల్లో స్వీప్ చేసింది ఆ పార్టీ. 2019లో మాత్రం అదే పరిస్థితి కొనసాగింది. తెలుగుదేశం పార్టీకి దారుణ పరాజయం తప్పలేదు. 2024 లో మాత్రం టిడిపి విజయం సాధించింది ఏకపక్షంగా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి పెద్ద నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. అందుకే అక్కడ టిడిపి బలపడింది. భారీ మెజారిటీతో గెలిచింది. అదే పట్టును కొనసాగించాలన్న ఉద్దేశంతో మహానాడు నిర్వహణ బాధ్యతలను ఆ జిల్లా నేతలకు కట్టబెట్టారు.

* హేమహేమీలు..
అయితే వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీగా ఉన్నారు. నారాయణ మంత్రిగా కొనసాగుతున్నారు. మరో సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి మంత్రిగా ఉన్నారు. వీరందరికంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చాలా దూకుడుగా ఉన్నారు. అందుకే ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్నారు. మహానాడు వేదికకు సంబంధించిన భూమి పూజ కూడా పూర్తి చేశారు. పదుల సంఖ్యలో యంత్రాలతో చదును చేసే పనుల్లో ఉన్నారు. దాదాపు 2200 ఎకరాల్లో మహానాడు సభ కొనసాగనుంది. ఈనెల 27 నుంచి మూడు రోజులపాటు మహానాడు జరగనుంది.. తొలి రెండు రోజులు 25వేల మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది. చివరి రోజు మాత్రం ఏడు లక్షల మంది జనాభా వస్తారని అంచనా. ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు తో పాటు పరిసర పట్టణాలు, ప్రాంతాల్లో లాడ్జిలు, ఫామ్ హౌస్ లను బుక్ చేశారు పార్టీ నేతల కోసం. ఇక కార్యక్రమానికి వచ్చే వారికి పసందైన విందు ఇచ్చేందుకు నెల్లూరు పెద్దారెడ్లు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మర్యాద ఎలా ఉండాలో.. అలా ఉండేలా ప్రణాళిక రూపొందించారు.

Vijay Cycle Campaig: ఎన్టీఆర్, చంద్రబాబు, విజయ్.. సైకిల్ ఎక్కినోడు ఓడిన చరిత్ర లేదు..

Vijay Cycle Campaig: పేదవాడి వాహనం సైకిల్. అయితే ఇప్పుడు సైకిల్ స్థానంలో ద్విచక్ర వాహనాలు రాజ్యమేలుతున్నాయి. కానీ సైకిల్ కి ఉన్న ఆదరణ మాత్రం తగ్గడం లేదు. పైగా సైకిల్ తొక్కడం ఎంతో ఆరోగ్యం కూడా. గమ్యస్థానాలకు చేర్చడమే కాదు… వ్యాయామం రూపంలో ఆరోగ్యాన్ని ఇస్తుంది కూడా సైకిల్. ఇక సైకిల్ దేశంలో సృష్టించిన ప్రభంజనం అంతా కాదు. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన తరువాత.. ఆ పార్టీకి సైకిల్ గుర్తు కేటాయించింది కేంద్ర ఎన్నికల సంఘం. మళ్లీ ఉత్తరప్రదేశ్లో సమాజ్వాది పార్టీకి అదే సింబల్ దక్కింది. యూపీని పక్కన పెడితే ఏపీలో చిరస్మరణీయమైన విజయాలను దక్కించుకుంది సైకిల్ పార్టీ. ఏం ముహూర్తాన సైకిల్ గుర్తు వచ్చిందో కానీ.. అదే సైకిల్ పై ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు నందమూరి తారక రామారావు. తర్వాత చంద్రబాబు సైతం తరచూ తన ఎన్నికల ప్రచారంలో సైకిల్ పై వెళ్లడం ఆనవాయితీ. ఆయన సైతం మంచి విజయాలనే దక్కించుకున్నారు. అయితే వీరిద్దరిని స్ఫూర్తిగా తీసుకున్నారు ఏమో కానీ.. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సైకిల్ పై అలరించారు విజయ్. అక్కడ మిగతా రెండు పార్టీలకు వెనక్కి నెట్టి దూసుకెళ్లారు. అందుకే సైకిల్ తొక్కిన వాడు చరిత్రలో ఓడిపోడు అంటూ సోషల్ మీడియాలో హోరు ఎత్తుతోంది.

* ఎన్టీఆర్ ప్రస్తావన తెస్తూ
వాస్తవానికి తమిళనాడు ఎన్నికల ప్రచారంలో విజయ్ సైకిల్ పై వెళ్లడమే కాదు.. ఆ పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు పేరు కూడా పలుమార్లు ఉచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్టీఆర్ పేరును గుర్తుచేసుకున్నారు. సినిమా వాడు ఏం చేస్తాడు అనే ప్రశ్నకు 9 నెలల కాలంలోనే నందమూరి తారక రామారావు పార్టీ ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. టీవీ కేకు కూడా అదే మాదిరిగా విజయం అందించాలని తమిళనాడు ప్రజలను కోరారు విజయ్. అందుకే దశాబ్దాల చరిత్ర కలిగిన.. డీఎంకే తో పాటు అన్న డీఎంకే ను వెనక్కి నెట్టి మెజారిటీ సీట్లను సొంతం చేసుకున్నారు విజయ్. ప్రస్తుతం విజయ్ నోటి నుంచి వచ్చిన ఎన్టీఆర్ మాటలు… సైకిల్ పై ఎన్నికల ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

* సరిగ్గా క్రెడిట్ చోరీతో..
తమిళనాడులో విజయ్ గెలుపును క్రెడిట్ చోరీ చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి ఫోటోను విజయ్ చూపించారని.. దాని ఫలితంగానే అక్కడి ప్రజలు విజయ్ ను గెలిపించారు అనేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రచారం చేసుకున్న మాటలు. అయితే ఇప్పుడు విజయ్ సైకిల్ పై ఎన్నికల ప్రచారం.. ఆపై ఎన్టీఆర్ ప్రస్తావన తెస్తూ తమిళనాడు ఓటర్లను కోరడం ఇప్పుడు సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోంది. చివరకు నేను సైకిల్ తొక్కుతా అంటూ జగన్మోహన్ రెడ్డి అన్నట్టు.. ఆ పార్టీ సింబల్ ను పెడుతూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి అయితే ఇప్పుడు సైకిల్ అనేది ట్రెండిగా నిలవడం విశేషం.