Woman bites Journalist tongue: అతడు ఒక విలేఖరి. వార్తలను సేకరించడం.. ప్రజల సమస్యలకు వార్త రూపం అందించడం అతడి విధి. జర్నలిజనికే మచ్చ తెచ్చే విధంగా ఆ విలేకరి ప్రవర్తించాడు. అతడు చేసిన పని సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. ఈ సంఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనగా మారింది.
ఆ విలేఖరి ఒక ఆటో డ్రైవర్ సహకారంతో ఒక మహిళను హోటల్ గదికి తీసుకువెళ్లాడు. అక్కడ ఆ పని మొదలుపెట్టాడు. అక్కడ ఏం జరిగిందో తెలియదు. వారు ముగ్గురు విపరీతంగా మద్యం తాగారని స్థానికులు చర్చించుకుంటున్నారు. మద్యం తాగిన మైకంలో.. ఆ పనిలో ఉండగా.. ఆమె ఆ విలేఖరి నాలుక కొరికినట్టు తెలుస్తోంది. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం.
సంఘటన కడప జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.. ఆలస్యంగా తెలుగులోకి వచ్చింది. కడప జిల్లాలోని ఒంటిమిట్టలో ఓ వ్యక్తి స్థానికంగా వ్యాపారం చేస్తూ ఉంటాడు. అదేపనిగా విలేకరిగా కూడా పని చేస్తూ ఉంటాడు. ఇద్దరికీ ఒక ఆటో డ్రైవర్ తో చాలా సంవత్సరాల క్రితం నుంచి పరిచయం ఉంది. అయితే ఇతడికి మొదటి నుంచి కూడా ఒక రకమైన కోరికలు ఉండేవి. వాటిని తీర్చుకోవడానికి తనకు ఒక మహిళ కావాలని ఆ ఆటో డ్రైవర్ ను కోరాడు. ఆటో డ్రైవర్ ఒక మహిళను తీసుకొచ్చాడు. వారు ముగ్గురు ఒంటిమిట్ట ప్రాంతంలో హరిత హోటల్ వెళ్లారు. వాస్తవానికి ఆ హోటల్ నిర్వాహకులు అతడికి రూమ్ ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. విలేఖరి కావడంతో అతడు ఒత్తిడి తీసుకొచ్చా. ఆ తర్వాత ఆ ముగ్గురు పీకలదాకా మద్యం తాగారు. ఆ తర్వాత ఆ విలేఖరి, ఆ మహిళ పని మొదలుపెట్టారు. అయితే ఆ మహిళ ఆ విలేకరి నాలుకను బలంగా కొరికినట్టు తెలుస్తోంది. తీవ్రంగా గాయం కావడంతో రక్తం విపరీతంగా వచ్చింది. దీంతో ఆ విలేకరి భయపడి ఆ మహిళను వదిలేసి వెళ్లిపోయాడు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నాడు. నాలుక రెండు ముక్కలుగా విడిపోవడంతో.. 108 లో కడప రిమ్స్ కు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది తరలించారు. ప్రస్తుతం అక్కడ ఆసుపత్రిలో ఆ విలేఖరి చికిత్స పొందుతున్నాడు. వైద్యులు నాలుకకు శస్త్ర చికిత్స చేయించారు. దీంతో అతడు మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. పోలీసులు ఈ ఘటనపై అనేక రకాలుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆటో డ్రైవర్ ఆ మహిళను అక్కడి నుంచి తీసుకెళ్లాడు. రైల్వే స్టేషన్ ప్రాంతంలో వదిలేశాడు.
నాలుక కొరికేంత కోపం ఆమెకు ఇతడి మీద ఉందా.. లేక పనిలో ఉద్రేకానికి వెళ్లి అలా కొరికిందా.. అనే ప్రశ్నలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పరారీలో ఉన్న ఆ మహిళను పట్టుకోడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆటో డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నాడు. అతడిని వారు విచారిస్తున్నారు. హరిత హోటల్ నిర్వాహకులకు పోలీసులు మెమో కూడా జారీ చేశారు.
Sandeep Reddy Vanga angry on Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పై తీవ్రమైన అసహనంతో సందీప్ రెడ్డి వంగ.. కారణం ఏంటంటే..
Sandeep Reddy Vanga angry on Pawan Kalyan: ‘అర్జున్ రెడ్డి’ చిత్రం తో డైరెక్టర్ గా వెండితెర అరంగేట్రం చేసిన సందీప్ రెడ్డి వంగ కు ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ లో అయితే ఈయనకు రాజమౌళి ని మించిన బ్రాండ్ ఇమేజ్, క్రేజ్ ఉంది. ఆయన నుండి సినిమా వస్తుందంటే హీరో ఎవరు అనేది కూడా చూడరు, టికెట్స్ కోసం క్యూలు కట్టేస్తారు ఆడియన్స్. అలాంటి ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న సందీప్ వంగ , యానిమల్ , కబీర్ సింగ్ చిత్రాలతో తన బ్రాండ్ ని మరింత పవర్ ఫుల్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన రెబల్ స్టార్ ప్రభాస్ తో ‘స్పిరిట్’ అనే చిత్రం చేస్తున్నాడు. వచ్చే ఏడాది మార్చ్ లో విడుదలయ్యే ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ లోనే కాదు, ఆడియన్స్ లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది.
ఇదంతా పక్కన పెడితే సందీప్ వంగ మన టాలీవుడ్ లో చిరంజీవి , పవన్ కళ్యాణ్ లకు వీరాభిమాని అనే సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై ఆయనకు ఉన్న ఫ్యానిజం చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు. ప్రతీ పుట్టినరోజుకు పవన్ కళ్యాణ్ కి ఆయన ఎంతో స్పెషల్ గా శుభాకాంక్షలు తెలుపుతూ తన అభిమానాన్ని చాటుకునేవాడు. కానీ గత సంవత్సరం నుండి ఆయన పవన్ కళ్యాణ్ ని అసలు పట్టించుకోవడం లేదు. 2025 లో పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకి శుభాకాంక్షలు తెలపలేదు. అదే విధంగా 2024 లో దేశంలో ఎక్కడా లేని విధంగా నూటికి నూరు శాతం స్ట్రైక్ రేట్ తో సెన్సేషన్ సృష్టించి కూటమి ప్రభుత్వాన్ని స్థాపించి , ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు కూడా సందీప్ వంగ శుభాకాంక్షలు తెలపలేదు. కానీ తమిళనాడు విజయ్ టీవీకే పార్టీ గెలవగానే భారీ లెవెల్ లో ఎలివేషన్స్ ఇస్తూ శుభాకాంక్షలు తెలిపాదం గమనించాల్సిన విషయం.
దీనిపై పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అభిమాని అని చెప్పుకుంటూ, రాజకీయాల్లో విజయం సాధించినప్పుడు పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలపకుండా, పక్క రాష్ట్రానికి చెందిన వాడికి శుభాకాంక్షలు తెలపడం ఏంటి?, నువ్వు ఫ్యాన్ అంటే నమ్మశక్యంగా లేదు అంటూ సందీప్ వంగ ని ట్యాగ్ చేసి తిడుతున్నారు. అయితే సందీప్ వంగ ఎందుకు పవన్ కళ్యాణ్ కి స్పందించలేదు?, టీడీపీ తో కూటమి కట్టడం ఆయనకు నచ్చలేదా ?, లేకపోతే సనాతన ధర్మం స్టాండ్ తీసుకోవడం నచ్చలేదా?, సందీప్ వంగ మౌనం వెనుక అసలు కారణం ఏంటి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.