Home Blog Page 29

బొత్స ఔట్.. ఆ రెండింటి పై జగన్ సీరియస్!

Botsa Satyanarayana
Botsa Satyanarayana

Botsa Satyanarayana: వైసీపీలో బొత్సను పక్కన పెడతారా? శాసనమండలి లో విపక్ష నేత పదవి నుంచి తప్పిస్తారా? కొత్త వ్యక్తికి ఆ పదవి అప్పగిస్తారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల బీజేపీకి చెందిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కాపులకు ప్రాధాన్యత లేదని విమర్శించారు. సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు ప్రాధాన్యత తగ్గించేసారని ఆరోపించారు. కేవలం అనారోగ్య పరిస్థితులు కారణంగా ఆయనను తప్పిస్తారని కూడా గత కొద్దిరోజులుగా ప్రచారం సాగుతోంది. ఆ పదవిని ఓ మహిళా నేతతో భర్తీ చేస్తారని కూడా టాక్ నడుస్తోంది. గతంలో రెండు సార్లు శాసనమండలిలోనే బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.

* తగ్గిన యాక్టివ్..
అయితే జగన్మోహన్ రెడ్డితో బొత్స కలిసింది తక్కువ అని తెలుస్తోంది. గతం మాదిరిగా బొత్స యాక్టివ్ గా ఉండడం లేదని కూడా ప్రచారంలో ఉంది. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. సొంత నియోజకవర్గ చీపురుపల్లిలో ప్రభుత్వం పై ఆందోళన కార్యక్రమంలో మాట్లాడుతుండగా కుప్పకూలిపోయారు. ఆ సమయంలోనే బొత్స అనారోగ్యంపై రకరకాల ప్రచారం నడిచింది. అయితే తరువాత యాక్టివ్ అయ్యారు. కానీ శాసనమండలిలో సైతం అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయన ఆరోగ్య రీత్యా రాజకీయాల నుంచి తప్పించాలని కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డిని కోరినట్లు వార్తలు వచ్చాయి. అటు తర్వాత మళ్లీ కోలుకున్న బొత్స యాక్టివ్ అయ్యారు. మొన్నటికి మొన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కాపు నేతల సమావేశాల్లో కూడా పాల్గొన్నారు. అయితే క్రియాశీలక రాజకీయాలనుంచి ఆయన తప్పుకుంటారు అన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో ఉంది.

* తగ్గుతున్న పట్టు..
బొత్స మునుపటి మాదిరిగా రాజకీయాలు చేయలేకపోతున్నారు. ఆయన కుటుంబానికి సైతం రాజకీయ పట్టు తగ్గుతోంది. మొన్నటికి మొన్న విజయనగరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ భవన వివాదం తలెత్తింది. ప్రైవేటు స్థలంలో వైసీపీ కార్యాలయ భవనం ఏర్పాటు చేశారనేది ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా పూసపాటి రాజవంశీయుల ప్రైవేటు భూమిని ప్రభుత్వ భూమిగా మార్చి.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 33 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వడం జరిగింది. దీనిపై రాజవంశీయుడిగా అశోక్ గజపతిరాజు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అది ప్రైవేటు భూమి అని తేలితే కచ్చితంగా కార్యాలయ భవనాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రస్థాయిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇది డ్యామేజ్ కలిగించే విషయం. అయితే బాధ్యతాయుతమైన మంత్రి స్థానంలో ఉంటూ అప్పట్లో బొత్స నిర్లక్ష్యంగా వ్యవహరించారని జగన్మోహన్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. ఒకవైపు అనారోగ్యం, ఇంకోవైపు బొత్స ఫ్యామిలీ పట్టు తగ్గడంతో జగన్ పునరాలోచనలో పడినట్లు సమాచారం. అందుకే శాసనమండలి విపక్ష నేత పదవి నుంచి ఆయనకు సాగనంపుతారని తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.

అయ్యన్నపాత్రుడు వారసుడు రెడీ!

Ayyannapatrudu Chintakayala
Ayyannapatrudu Chintakayala

Chintakayala Ayyannapatrudu: ఏపీలో అత్యంత ప్రతిష్టాత్మక నియోజకవర్గాల్లో నర్సీపట్నం ఒకటి. ఉమ్మడి విశాఖ జిల్లాలో నర్సీపట్నం నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. సుదీర్ఘకాలం ఆ నియోజకవర్గ నుంచి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. టిడిపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో పని చేస్తూ వచ్చారు అయ్యన్నపాత్రుడు. కేవలం రెండుసార్లు మాత్రమే ఓటమి చవిచూశారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన ప్రతిసారి మంత్రి పదవి చేపడుతూ వచ్చారు. ఈసారి మాత్రం అసెంబ్లీ స్పీకర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో అయ్యన్నపాత్రుడు వారసుడిపై బలమైన చర్చ నడుస్తోంది. ఎందుకంటే అయ్యన్నపాత్రుడు క్రియాశీలక రాజకీయాలకు దూరం అని ప్రకటించారు. దీంతో ఆయన వారసుడు ఎవరు అనే దానిపై విస్తృత చర్చ నడుస్తోంది.

* పెద్ద కుమారుడు విజయ్ రాజ్యసభకు..
ఇప్పటివరకు అయ్యన్నపాత్రుడి రాజకీయ వారసుడిగా కుమారుడు విజయ్ బరిలో దిగుతారని ప్రచారంలో ఉండేది. అందుకు తగ్గట్టుగానే గత పుష్కర కాలంగా ఆయన కుమారుడు విజయ్ చాలా యాక్టివ్ గా ఉంటున్నారు పార్టీలో. అయితే మొన్ననే ఆయన రాజ్యసభకు ఎంపికై పార్లమెంటులో అడుగుపెట్టారు. ఆరేళ్ల పాటు ఎంపీ పదవిలో కొనసాగుతారు. అందుకే వచ్చే ఎన్నికల్లో నర్సీపట్నం అసెంబ్లీ బరిలో విజయ్ దిగే అవకాశం లేదు. అలాగని చింతకాయల కుటుంబాన్ని కాదని వేరొకరు పోటీ చేయలేరు అక్కడ. ఈ తరుణంలో అక్కడ వచ్చే ఎన్నికల్లో పోటీకి రెండో కుమారుడు రాజేష్ ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. నర్సీపట్నం నియోజకవర్గాన్ని వేరొకరికి ఇస్తే నెగ్గుకు రావడం కష్టం. అదే చింతకాయల కుటుంబం బరిలో దిగితే చాలా సులువుగా విజయం సొంతం చేసుకోవచ్చు అనేది చంద్రబాబు ఆలోచన. వచ్చే ఎన్నికల్లో అటు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయ్.. ఇటు చింతకాయల అయ్యన్నపాత్రుడు సాయంతో టిడిపి అభ్యర్థిగా బరిలో దిగే రెండో కుమారుడు రాజేష్ ఈజీగా బయటపడతారన్న విశ్లేషణలు ఉన్నాయి.

* సుదీర్ఘ నేపథ్యం..
నర్సీపట్నం అనేది చింతకాయల కుటుంబానికి పెట్టని కోట. 1983 ఎన్నికల్లో తొలిసారిగా టిడిపి నుంచి పోటీ చేసి గెలిచారు అయ్యన్నపాత్రుడు. నాటి ఎన్టీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు. 1985, 1989, 1994, 1999, 2004, 2014, 2024 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా గెలిచారు అయ్యన్న. 2009, 2019లో మాత్రం ఓడిపోయారు. టిడిపి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి మంత్రి పదవి దక్కించుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు పొలిటికల్ గా రిటైర్మెంట్ కావాలని సిద్ధపడుతున్నారు. ఇప్పటికే పెద్ద కుమారుడు ఎంపీగా రాజ్యసభకు వెళ్లారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా చిన్న కుమారుడుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇలా ఎలా చూసుకున్నా అయ్యన్నపాత్రుడు రాజకీయంగా అదృష్టవంతుడే.

కారులో కొబ్బరి బొండాం పెట్టడమే పాపం అయింది.. చూస్తుండగానే ఓ ప్రాణం..

Car Accident
Car Accident

Car Accident: ప్రమాదం ఏ రూపంలో ముంచుకు వస్తుందో తెలియదు. ఏ విధంగా చంపేస్తుందో తెలియదు. చివరికి ఘోరం జరిగిపోయిన తర్వాత బాధపడి ఉపయోగము ఉండదు. ఇప్పుడు ఈ వ్యక్తి పరిస్థితి కూడా అలానే మారిపోయింది. చూస్తుండగానే విగత జీవి గా మారిపోవడంతో కుటుంబ సభ్యులు కంటికి ధారగా విలపిస్తున్నారు.

రాజమండ్రికి చెందిన హరి ప్రసాద్ కు సంబంధించిన బంధువులు హైదరాబాదులో ఉంటున్నారు. ఆ బంధువుల అబ్బాయి వివాహం హైదరాబాదులో జరిగింది. వివాహానికి హాజరయ్యేందుకు హరి ప్రసాద్ హైదరాబాద్ వెళ్ళాడు. హైదరాబాదులో పెళ్లి చూసుకొని.. విజయవాడకు తిరుగు ప్రయాణమయ్యాడు. అతడు విజయవాడ వెళుతుండగా మధ్యలో తాగొచ్చని కొబ్బరి బొండాలను కొట్టించాడు. వాటిని కారులో పెట్టాడు. ఈ క్రమంలో కొబ్బరి బొండం జారీ క్లచ్, బ్రేక్ ఫెడల్స్ కింద ఇరుక్కుపోయింది. ఈ విషయం హరిప్రసాద్ గుర్తించలేదు. కొబ్బరి బొండం కారులో పెట్టి అతడు ఆ తర్వాత మర్చిపోయాడు. ఇంటికి వెళ్లే ఆత్రుతలో ఉండిపోయాడు.

కారు వేగంగా వెళ్తున్న క్రమంలో ఒక ట్రక్కు ఎదురుగా వచ్చింది. ఆ సమయంలో హరి ప్రసాద్ ద్ బ్రేక్ వేయడానికి ప్రయత్నించాడు. ఆ బ్రేక్ కింద కొబ్బరి బొండం ఇరుక్కుపోయింది. దీంతో బ్రేక్ వేసే అవకాశం లేకుండా పోయింది. కనీసం క్లచ్ కూడా పట్టుకుని సౌలభ్యం లేకపోయింది. బ్రేక్ పడకపోవడంతో హరిప్రసాద్ ట్రక్కును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో హరిప్రసాద్ అక్కడికక్కడే చనిపోయాడు. కొబ్బరి బోండాలు కనుక లేకపోతే హరిప్రసాద్ బతికేవాడు. ఈ సంఘటన వాహనదారులకు ఒక గుణపాఠం లాగా నిలుస్తోంది. డ్రైవింగ్ సీట్ దగ్గర ఎటువంటి వస్తువులు వాహనదారులు ఉంచుకోవద్దని ఈ సంఘటన నిరూపిస్తోంది.

హరిప్రసాద్ కొట్టించిన కొబ్బరి బోండాలు చిన్న పరిమాణంలో ఉన్నాయి. అధికారులు వెళ్తున్న వేగానికి బ్రేక్ మధ్యలో ఇరుక్కుపోయాయి. అందువల్లే హరి ప్రసాద్ కు బ్రేక్ వేసే అవకాశం లేకుండా పోయింది. కనీసం క్లచ్ పట్టుకునే సౌలభ్యం కూడా లేకపోయింది. ఫలితంగా హరిప్రసాద్ దుర్మరణం పాలు కావాల్సి వచ్చింది.. ట్రక్కును కారు వేగంగా ఢీకొట్టడంతో హరిప్రసాద్ తీవ్రగాయాల పాలయ్యాడు. రక్తస్రావం అధికంగా జరగడంతో అతడు సంఘటనా స్థలంలోనే చనిపోయాడు.

రిలీజ్ కు రెడీ అవుతున్న రెడ్ మీ కొత్త ఫోన్.. ఫీచర్లు తెలిస్తే మతిపోతుంది..

Redmi 17 5G
Redmi 17 5G

Redmi 17 5G: Xiaomi సబ్ బ్రాండ్ రెడ్‌మి నుంచి త్వరలో రాబోతున్న లేటెస్ట్ బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ Redmi 17 5G. ఈ మొబైల్ గ్లోబల్ వైజ్ గా రిలీజ్ కు సిద్ధమవుతోంది. అయితే అధికారిక ప్రకటన కంటే ముందే ఈ ఫోన్ గురించి మలేషియాకు చెందిన SIRIM, తైవాన్‌కు చెందిన NCC వంటి అంతర్జాతీయ సర్టిఫికేషన్ వెబ్‌సైట్లలో కనిపిస్తుంది. వీటి ప్రకారం.. ఈ కొత్త ఫోన్ లో బ్యాటరీ, ఛార్జింగ్, స్టోరేజ్ వేరియంట్లకు సంబంధించిన అత్యంత కీలకమైన వివరాలు బయటకు వచ్చాయి. అవేంటో చూద్దాం..

Redmi 17 5G ఫోన్ బ్యాటరీ విభాగంలో భారీ అప్‌గ్రేడ్‌ కానుంది. ఇందులో 7,500mAh సామర్థ్యం గల భారీ సిలికాన్ కార్బన్ బ్యాటరీని అందించబోతున్నట్లు సమాచారం. ఈ బ్యాటరీకి 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. గత మోడల్ రెడ్‌మి 15 5G (7,000mAh బ్యాటరీ, 33W ఛార్జింగ్) తో పోలిస్తే ఈ కొత్త ఫోన్ బ్యాటరీ లైఫ్, ఛార్జింగ్ స్పీడ్ పరంగా చాలా పెద్ద అప్‌గ్రేడ్ అని చెప్పవచ్చు.

ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు నాలుగు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. వాటిలో 4GB ర్యామ్ ప్లస్ 64GB స్టోరేజ్, 4GB ర్యామ్ ప్లస్ 128GB స్టోరేజ్, 4GB ర్యామ్ ప్లస్ 256GB స్టోరేజ్, 8GB ర్యామ్ ప్లస్ 256GB స్టోరేజ్ ఉన్నాయి. ఈ ఫోన్ దుమ్ము ధూళి, నీటి బిందువుల నుంచి రక్షణ కోసం IP64 రేటింగ్ ను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా ఇందులో 5G, Wi-Fi, బ్లూటూత్, NFC తో పాటు USB టైప్-C పోర్ట్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.

రెడ్‌మి 17 5G లో హై రిఫ్రెష్ రేట్ తో LCD డిస్‌ప్లే, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 సిరీస్ ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది. కెమెరా విషయానికి వస్తే.. వెనుక వైపు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ తో పనిచేస్తుంది. అలాగే సాఫ్ట్‌వేర్ పరంగా ఇది ఆండ్రాయిడ్ ఆధారిత సరికొత్త HyperOS తో రన్ కానుంది. అంతర్జాతీయంగా వేర్వేరు చోట్ల సర్టిఫికేషన్లు పూర్తి చేసుకుంటుండటంతో, షావోమి సంస్థ ఈ రెడ్‌మి 17 5Gని అతి త్వరలోనే మార్కెట్లోకి లాంచ్ చేసే అవకాశం కనిపిస్తోంది.

ఎవరెస్ట్‌ ఎత్తయిన శిఖరం కాదు.. దానికన్న ఎత్తయినది ఇదే.. దీని చరిత్ర ఇదీ!

Olympus Mons Vs Everest
Olympus Mons Vs Everest

Olympus Mons Vs Everest: మౌంట్‌ ఎవరెస్ట్‌ ఈ పేరు తెలియనివారు ఉండదు. ఎందుకంటే 8,849 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పర్వతంగా ప్రసిద్ధి చెందింది. ఈ శిఖరాన్ని అధిరోహించేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది అధిరోహించారు. అయితే దీనికన్నా ఎత్తయిన శిఖరాన్ని ఇటీవలే గుర్తించారు. ఎవరెస్టు రికార్డు అంతరిక్షంలోకి వెళ్తే ఈ రికార్డు చాలా చిన్నదిగా కనిపిస్తుంది. మార్స్‌ గ్రహంపై ఉన్న ఒలింపస్‌ మోన్స్‌ అనే భారీ అగ్నిపర్వతం సుమారు 21,900 మీటర్ల ఎత్తుతో ఉంది. అంటే ఇది ఎవరెస్ట్‌ కంటే దాదాపు రెండున్నర రెట్లు ఎత్తయినది. ఈ ఒక్క పర్వతం మాత్రమే ఎవరెస్ట్‌ను సులభంగా మించిపోతుంది. ఇది భూమి, మార్స్‌ మధ్య ఉన్న భౌతిక పరిస్థితుల తేడాను స్పష్టంగా చూపిస్తోంది.

ఒలింపస్‌ మోన్స్‌ ఎలా ఏర్పడింది?
ఒలింపస్‌ మోన్స్‌ ఒక షీల్డ్‌ అగ్నిపర్వతం. అంటే ఇది విస్తృతమైన, సాపేక్షంగా చదునైన ఆకారంలో ఏర్పడినది. భూమిపై టెక్టానిక్‌ ప్లేట్లు నిరంతరం కదులుతూ ఉంటాయి. ఇది అగ్నిపర్వతాలు ఒకే చోట ఎక్కువ కాలం పెరగకుండా నిరోధిస్తుంది. కానీ మార్స్‌పై టెక్టానిక్‌ ప్లేట్లు లేవు. ఒకే ప్రాంతంలో లక్షల సంవత్సరాలు లావా నిరంతరం బయటకు వచ్చి పేరుకుపోయి ఈ పర్వత నిర్మాణం ఏర్పడింది. ఇది మార్స్‌ గ్రహం భౌగోళిక చరిత్రను ప్రతిబింబిస్తోంది.

ఒలింపస్‌ మోన్స్‌ పరిమాణం..
ఒలింపస్‌ మోన్స్‌ అడుగు భాగం మాత్రమే అమెరికాలోని అరిజోనా రాష్ట్రం అంత విస్తీర్ణంలో ఉంటుంది. ఇంత భారీ నిర్మాణం కూలిపోకుండా ఉండటానికి మార్స్‌పై గురుత్వాకర్షణ భూమికంటే తక్కువగా ఉండటం కీలకం. తక్కువ గురుత్వాకర్షణ వల్ల భారీ నిర్మాణాలు మరింత ఎత్తు వరకు పెరగగలుగుతాయి. భూమిపై ఇలాంటి నిర్మాణం ఉంటే దాని బరువు వల్ల అది కూలిపోయేది. ఈ తేడా గ్రహాల మధ్య ఉన్న భౌతిక నియమాలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.

సౌర కుటుంబంలో భిన్నంగా..
ఒలింపస్‌ మోన్స్‌ సౌర కుటుంబంలోని గ్రహాలు ఎలా విభిన్నంగా పరిణామం చెందాయో చూపిస్తోంది. భూమిపై టెక్టానిక్‌ కార్యకలాపాలు జీవులకు అనుకూలమైన వాతావరణాన్ని నిర్వహించడంలో సహాయపడతాయి. మార్స్‌పై అలాంటి కార్యకలాపాలు లేకపోవడం వల్ల ఇలాంటి భారీ నిర్మాణాలు ఏర్పడ్డాయి, కానీ ఆ గ్రహం నేడు చల్లబడిపోయి, పొడిగా మారింది. ఇది మనకు భవిష్యత్తులో మార్స్‌ను అధ్యయనం చేసేటప్పుడు, లేదా ఇతర గ్రహాలపై మానవ నివాసం గురించి ఆలోచించేటప్పుడు ముఖ్యమైన సూచనలు ఇస్తుంది. ఈ సమాచారం నాసా సహా అనేక శాస్త్రీయ సంస్థలు ఎన్నో సంవత్సరాలుగా నిర్ధారించిన వాస్తవం. ఇది విశ్వం గురించి మన అవగాహనను మరింత లోతుగా చేసే శాశ్వతమైన విజ్ఞానం. అంతరిక్షం గురించి తెలుసుకునే కొద్దీ, మన భూమి ఎంత ప్రత్యేకమైనదో, అదే సమయంలో విశ్వం ఎంత విశాలమైనదో అర్థమవుతుంది.

సౌర కుటుంబంలో అత్యంత ఎత్తయిన పర్వతం మార్స్‌పైనే ఉండటం మనకు ఒక ముఖ్యమైన సందేశం ఇస్తుంది. ఎవరెస్ట్‌ మన గర్వం అయితే, ఒలింపస్‌ మోన్స్‌ విశ్వం అపారమైన అద్భుతాలను గుర్తుకు తెస్తుంది. భవిష్యత్తులో మార్స్‌ మిషన్లు ఇలాంటి రహస్యాలను మరింత విపులంగా వెల్లడించే అవకాశం ఉంది.

పూణే వ్యాపారి కేతన్ కేసు.. నిన్నేమో మిడిల్ ఫింగర్ చూపించింది.. ఈరోజేమో ఇలా.. సియా మామూలుది కాదు..

Siya Ketan Case
Siya Ketan Case

Siya Ketan Case: పూణే వ్యాపారవేత్త కేతన్ హత్య కేసుకు సంబంధించి ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. కేతన్ ను పూణేకు చాలా దూరంలో ఉన్న ఒక కోట మీద నుంచి లోయలో పడి చనిపోయాడు. అతడు అలా చనిపోవడానికి కారణం సియా, ఆమె ప్రియుడు చేతన్. వీరిద్దరూ ఒక ప్రణాళిక ప్రకారం అతడిని చంపేశారు. గతంలో రెండు పర్యాయాలు అతడిని చంపడానికి ప్రయత్నించారు. అవి విఫలం కావడంతో.. చివరికి అతడిని ఆ కోట వద్దకు పిలిపించి.. లోయలోకి నెట్టివేసి చంపేశారు.

అతడిని చంపే ప్రణాళిక ఇద్దరు కలిసి రూపొందించారు. దారుణంగా లోయలోకి తోసివేశారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. అంతేకాదు, కాబోయే భార్యలతో కూడా మగవాళ్లకు ఏ స్థాయిలో ప్రమాదం ఉందో ఈ సంఘటన నిరూపించింది. సియా, చేతన్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత.. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తుండగా కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడిని చంపడానికి అనేక పర్యాయాలుగా వీరిద్దరూ ప్రణాళికలు రూపొందించారని.. కోటి రూపాయల వరకు వసూలు చేశారని.. మధ్యలో ఇంకొక వ్యక్తి సహాయం కూడా తీసుకున్నారని.. ఇలా రకరకాల నిజాలు వెలుగులోకి వచ్చాయి

ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు సీన్ రిక్రియేషన్ చేశారు. ఈ సందర్భంగా సియా మీడియా ప్రతినిధులను చూసి మిడిల్ ఫింగర్ చూపించింది. అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించింది. అయితే ఈ కేసులో ఇంకా కొన్ని నిజాలను బయటికి రాబట్టాల్సిన నేపథ్యంలో విచారణ అధికారులు సియా, చేతన్ కు పాలి గ్రాఫ్ టెస్ట్ నిర్వహించాలని భావించారు. అయితే ఈ టెస్టుకు వారిద్దరూ ఒప్పుకుంటేనే నిర్వహించాలని కోర్టు పోలీసులకు సూచించింది. వారి దగ్గర నుంచి అంగీకారం లభించకపోవడంతో.. కోర్టు వారిద్దరిని 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడికి పంపించింది. వారిద్దరు ప్రస్తుతం ఎర్రవాడ జైల్లో ఉన్నారు.

ఈ కేసులో చేతన్, సియా రహస్య సంకేతాలతో చాటింగ్ చేశారని తెలుస్తోంది.. పోలీసులకు దొరకకుండా ఉండడానికి అత్యంత పకడ్బందీగా వ్యవహరించారు. సియా ఏకంగా స్పై ఫోన్ ఉపయోగించింది. ఆ ఫోన్ ను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు ఎటువంటి సాంకేతిక ఆధారాలు లభించకుండా ఉండడానికి వారిద్దరు కోడ్ భాష, రహస్య సంకేతాలతో చాటింగ్ చేశారు.. ఈ విషయాలను గుర్తించిన పోలీసులు వాటిని డీకోడ్ చేసే పనిలో పడ్డారు. కోర్టు వారిద్దరి కస్టడీ పొడగించిన నేపథ్యంలో.. మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

లంగా ఓణీ.. నేటితో రద్దై పోనీ.. సుప్రీత అందాలు

Supritha latest photos
Supritha latest photos

ఓటీటీ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చేసిన 'పెద్ది'.. ఎందులో చూడాలంటే..

Peddi OTT Release
Peddi OTT Release

Peddi OTT Release: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది ‘ చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 350 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచాయి. కొత్త సినిమాలు విడుదల అయ్యినప్పటికీ కూడా ఈ సినిమా థియేట్రికల్ రన్ ఇంకా ఆగలేదు. ఇప్పటికీ డీసెంట్ గానే రన్ అవుతూ వస్తోంది. వీకెండ్ అయితే కొన్ని ప్రాంతాల్లో హౌస్ ఫుల్స్ ని కూడా నమోదు చేసుకుంటుంది ఈ చిత్రం. తెలుగు రాష్ట్రాల్లో ఒక్క ‘పుష్ప 2’, #RRR సినిమాల మినహా , మిగిలిన సినిమాల రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి రామ్ చరణ్ సత్తా అంతో మరోసారి అందరికీ అర్థం అయ్యేలా చేసింది. అలాంటి చిత్రం ఇప్పుడు గ్రాండ్ గా ఓటీటీ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.

విడుదలకు ముందు ఈ సినిమాకు సంబంధించినం డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ సుమారుగా 160 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. సాధారణంగా వాళ్ళ అగ్రీమెంట్స్ థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాల తర్వాత , ఓటీటీ లో స్ట్రీమింగ్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలి అనే విధంగా ఉంటాయి. కానీ ‘పెద్ది’ చిత్రానికి అలాంటి ఆంక్షలు పెట్టలేదు. 6 వారాల తర్వాత ఓటీటీ లో విడుదల చేసుకునేలా అగ్రిమెంట్ చేసుకున్నారు, అంటే జులై 16 న ఈ చిత్రం ఓటీటీ లోకి రావాలి. కానీ థియేట్రికల్ రన్ ఈ వీకెండ్ తో ముగిసే సూచనలు కనిపించడం తో 5 వారాలకు, అనగా జులై 9 న ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయబోతున్నారు. తెలుగు , తమిళం , కన్నడ మరియు మలయాళం భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.

హిందీ వెర్షన్ మాత్రం జులై 16 న విడుదల అవుతుందట. ఎందుకంటే హిందీ వెర్షన్ థియేట్రికల్ రిలీజ్ సినిమాలకు ఓటీటీ విండో కనీసం 6 వారాలు ఉండాలి , లేదంటే నేషనల్ మల్టీ ప్లెక్స్ థియేటర్స్ లో విడుదల ఉండదు. ఓవరాల్ గా థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రానికి ఓటీటీ ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఇకపోతే ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ సుకుమార్ తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. దసరా నుండి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. రంగస్థలం తో రూరల్ బ్యాక్ డ్రాప్ తో మన ముందుకు వచ్చిన ఈ కాంబినేషన్ , ఇప్పుడు స్టైలిష్ యాక్షన్ డ్రామా తో మన ముందుకు రాబోతుంది.

మూడు చైనా యాప్‌లపై కేంద్రం కొరడా.. వాళ్లు మారరంతే!

China Apps Banned
China Apps Banned

China Apps Banned: కోవిడ్‌ సమయంలో గాల్వన్‌ ఘటనతో చైనా–భారత్‌ సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. ఇటీవలే భారత్, చైనా దగ్గరవుతున్నాయి. గతంలో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా వస్తువులు, యాప్‌లపై కేంద్రం కొరడా ఝళిపించింది. సంబంధాల పునరుద్ధరణతో మళ్లీ వ్యాపారం సంబంధాలు మెరుగు పడుతున్నాయి. ఈ క్రమంలో చైనా యాప్‌లతో ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో ఈ–రిక్షా డ్రైవర్లు రోడ్డుపై వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా వాహనాలు నిలిచిపోతున్న సంఘటనలు పెరిగాయి. ఇది స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా రిమోట్‌గా నియంత్రించడం వల్ల జరుగుతోందని తేలింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ప్రాంక్‌ వీడియోలు ఈ సమస్యను బయటపెట్టాయి. వీటిలో ప్రజలు బ్లూటూత్‌ ద్వారా దగ్గర్లోని ఈ–రిక్షా బ్యాటరీకి కనెక్ట్‌ అయి, ఒక్క ట్యాప్‌తో డిశ్చార్జ్‌ ఫంక్షన్‌ను ఆఫ్‌ చేసి వాహనాన్ని ఆపేస్తున్నట్లు చూపించారు. డ్రైవర్లు మధ్యలో నిలిచిపోయి, ప్రయాణికులను ఇబ్బంది పెట్టి, రోజువారీ ఆదాయం కోల్పోతున్నారు. కొన్ని సందర్భాల్లో డ్రైవర్లు కన్నీళ్లు పెట్టుకున్నట్లు కూడా వీడియోలు వచ్చాయి. ఇది కేవలం ప్రాంక్‌ కాదు – డ్రైవర్ల జీవనోపాధిని, రోడ్డు భద్రతను ప్రభావితం చేసే తీవ్రమైన సమస్యగా మారింది.

యాప్‌లలో భద్రతా లోపాలు..
ఈ సమస్యకు కారణమైన యాప్‌లు చైనా కంపెనీలు అభివృద్ధి చేసిన బ్యాటరీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ యాప్‌లు. ప్రధానంగా BAT-MS(షెన్‌జెన్‌ గ్రీనర్జీ టెక్నాలజీ అభివృద్ధి చేసినది), Losiji, Epoch Li-ion (Epoch-i-ion) వంటి మూడు యాప్‌లు గుర్తించబడ్డాయి. కొన్ని నివేదికల్లో SMART BMS వంటి మరిన్ని యాప్‌లు కూడా ప్రస్తావించబడ్డాయి. లిథియం–అయాన్‌ బ్యాటరీల వోల్టేజ్, ఉష్ణోగ్రత, ఛార్జింగ్‌ సైకిల్స్, బ్యాటరీ ఆరోగ్యం వంటి వివరాలను మానిటర్‌ చేయడం. కానీ చాలా తక్కువ ధరల ఈ–రిక్షా బ్యాటరీలలో పాస్‌వర్డ్‌ లేదా ఏదైనా ధృవీకరణ లేదు. బ్లూటూత్‌ పరిధిలో ఉన్న ఎవరైనా యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని కనెక్ట్‌ అయి, బ్యాటరీ డిశ్చార్జ్‌ను ఆఫ్‌ చేయవచ్చు. ఒక్క ట్యాప్‌తో వాహనం పూర్తిగా నిలిచిపోతుంది. ఇది హార్డ్‌వేర్‌ లోపం, యాప్‌ సెక్యూరిటీ లోపం కలిపి ఏర్పడిన ప్రమాదకరమైన కాంబినేషన్‌.

కేంద్ర ప్రభుత్వం చర్యలు..
సోషల్‌ మీడియాలో వీడియోలు వైరల్‌ అయిన వెంటనే కేంద్రం త్వరితగతిన స్పందించింది. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గూగుల్‌ ప్లే స్టోర్, యాపిల్‌ యాప్‌ స్టోర్‌ల నుంచి చైనా యాప్‌లను తొలగించాలని ఆదేశించింది. ఐటీ సెక్రటరీ కృష్ణన్‌ ఈ చర్యను నిర్ధారించారు. ఏదైనా ఇతర యాప్‌ ఇలాంటి దుర్వినియోగానికి ఉపయోగపడితే కూడా బ్లాక్‌ చేస్తామని హెచ్చరిక చేశారు. ఢిల్లీ ప్రభుత్వం కూడా ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారా విచారణ ఆదేశించింది. ఇది అనధికృత యాక్సెస్‌గా ఐటీ చట్టం కింద నేరం కావచ్చని సైబర్‌ నిపుణులు అభిప్రాయపడ్డారు.

సైబర్‌ భద్రత లోపాలు..
ఈ సంఘటన ఎలక్ట్రిక్‌ వాహనాల సైబర్‌ భద్రతలో ఎంత పెద్ద లోపాలు ఉన్నాయో చూపిస్తోంది. తక్కువ ధరల చైనా బ్యాటరీలు భద్రతా ఫీచర్లు లేకుండా తయారు చేయడం వల్ల ఇలాంటి దుర్వినియోగం సాధ్యమైంది. డ్రైవర్లు చాలా మంది రోజువారీ కూలీలు లేదా రెంట్‌కు వాహనం తీసుకున్నవారు. ఒక్క రోజు ఆదాయం కోల్పోయి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఇది హరాస్‌మెంట్‌ లేదా ఎక్స్‌టార్షన్‌గా కూడా మారిందని నివేదికలు ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్న త్వరిత చర్య అభినందనీయం. ఇది పౌరుల రక్షణపై నిబద్ధతను చూపిస్తోంది. అయితే, ఇది తాత్కాలిక పరిష్కారం మాత్రమే. టరీలలో తప్పనిసరిగా పాస్‌వర్డ్‌ లేదా మల్టీ ఫ్యాక్టర్‌ ఆథెంటికేషన్‌ ఉండాలి.

ఆధునిక సాంకేతికత ఎంత ఉపయోగకరంగా ఉన్నా, భద్రతా లోపాలు ఉంటే అది ఆయుధంగా మారుతుంది. జాతీయ భద్రత, ప్రజా రవాణా భద్రతకు సంబంధించిన ఈ సమస్యను తీవ్రంగా పరిగణించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు రాకుండా చూడాలి.

తెలుగులో రీమేక్ కానున్న హాలీవుడ్ సెన్సేషన్ 'అబ్సెషన్'.. హీరో, హీరోయిన్లు ఎవరంటే..

Obsession Telugu Remake
Obsession Telugu Remake

Obsession Telugu Remake: రీసెంట్ గా హాలీవుడ్ లో ‘అబ్సెషన్’ అనే చిత్రం ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కేవలం 7 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2800 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా 13 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేసింది. ఇప్పటికీ థియేటర్స్ లో ఈ చిత్రం విజయవంతంగానే నడుస్తోంది , కానీ ముందుగా అనుకున్న డీల్ ప్రకారం ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ రీసెంట్ గానే రెంట్ పద్దతి లో విడుదల చేసింది.

ఓటీటీ ఆడియన్స్ నుండి కూడా రెస్పాన్స్ అదిరిపోయింది. ఇలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని ఇప్పుడు మన టాలీవుడ్ లో రీమేక్ చెయ్యాలని చూస్తున్నారట మేకర్స్. ప్రముఖ టాప్ నిర్మాత ఈ సినిమాకు సంబంధించిన రీమేక్ రైట్స్ ని సొంతం చేసుకున్నట్టు సమాచారం. ‘అబ్సెషన్’ చిత్రం లో మైఖేల్ జాన్సన్ , ఇదే నవారెత్తే హీరో హీరోయిన్లు గా నటించారు. తెలుగు వెర్షన్ లో ఈ పాత్రలను కిరణ్ అబ్బవరం , పూజ హెగ్డే చేయబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఒరిజినల్ వెర్షన్ లో హీరోయినే విలన్ అనే సంగతి ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరికి తెలిసే ఉంటుంది. సూపర్ నేచురల్ పవర్ కారణంగా హీరోయిన్ అలా సైకో లాగా మారిపోతుంది. ఇలాంటి నెగెటివ్ క్యారెక్టర్ లో పూజా హెగ్డే ఎలా నటించబోతుందో చూడాలి. ఇప్పటి వరకు ఆమె గ్లామర్ రోల్స్ లోనే నటించింది.

ఆమె నటనని బయటపెట్టే బలమైన పాత్రలు ఇప్పటి వరకు చేయలేదు. అలాంటిది ఇప్పుడు ఏకంగా ఇంతటి భయంకరమైన నెగెటివ్ రోల్ ఆఫర్ వచ్చేసరికి ఆమె వెంటనే ఓకే చెప్పేసినట్టు తెలుస్తోంది. అయితే ఇంగ్లీష్ లో ఉందో , తెలుగులో కూడా అలా మక్కీకి మక్కీ దింపితే ఫలితం తారుమారు అవ్వొచ్చు. అందుకే మన తెలుగు ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగా కొన్ని మార్పులు , చేర్పులు చేసి ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొని రావాలని చూస్తున్నారట. డైరెక్టర్ ఎవరు అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.

జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్న 'స్పిరిట్' షూటింగ్.. ఇప్పటి వరకు ఎంత శాతం పూర్తి అయ్యిందంటే..

Prabhas Spirit Movie
Prabhas Spirit Movie

Prabhas Spirit Movie: పాన్ ఇండియా హీరోల్లో ప్రస్తుతం ప్రభాస్ అంత వేగంగా ఏ హీరో కూడా సినిమాలు చేయలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతీ ఏడాది ఈయన ద్వారా వెయ్యి కోట్ల బిజినెస్ జరుగుతోంది. ఏడాదికి కనీసం రెండు సినిమాలు విడుదల అయ్యేలా చూస్తాడు ప్రభాస్. గత ఏడాది ఒక్క సినిమా కూడా విడుదల చేయలేకపోయారు కానీ , ఈ ఏడాది మాత్రం ఆయన నుండి రెండు సినిమాలు రాబోతున్నాయి. ఇప్పటికే సంక్రాంతి కానుకగా ‘రాజా సాబ్’ విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రానికి 180 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక ఈ ఏడాది డిసెంబర్ 3 న ఆయన నుండి ‘ఫౌజీ’ అనే చిత్రం విడుదల కాబోతుంది. హను రాఘవపూడి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ పీరియాడికల్ లవ్ స్టోరీ పై యూత్ ఆడియన్స్ భారీ ఆశలే పెట్టుకున్నారు.

ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో అభిమానుల్లోనూ , ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న చిత్రం ‘స్పిరిట్’. ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద సునామీ నే క్రియేట్ అవుతుంది , అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సినిమా షూటింగ్ అప్పుడే 70 శాతం కి పైగా పూర్తి అయ్యిందని , కేవలం 30 శాతం షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉందని , వచ్చేనెల రెండవ వారం లోపు టాకీ పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తి అవుతుందని అంటున్నారు. సందీప్ వంగ ఈ చిత్రాన్ని తన కెరీర్ లోనే అత్యంత వేగంగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకోబోతున్న సినిమాగా ‘స్పిరిట్’ ని నిలబోతున్నారు అట. ప్రభాస్ కూడా నాన్ స్టాప్ గా ఈ సినిమాని పూర్తి చేయడానికి డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

అయితే ఈ చిత్రం ‘ఫౌజీ’ విడుదలైన మూడు నెలల గ్యాప్ లోనే రాబోతుంది. అంటే ‘ఫౌజీ’ చిత్రం పై గట్టి ప్రభావమే ఓపెనింగ్స్ లో చూపించే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే ప్రభాస్ అభిమానులు ‘స్పిరిట్’ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు కాబట్టి, ఇప్పటి వరకు ‘ఫౌజీ’ పై ఎలాంటి అంచనాలు , హైప్ క్రియేట్ అవ్వలేదు కాబట్టి. స్పిరిట్ షూటింగ్ జెట్ స్పీడ్ లో జరగడం చూస్తుంటే , ఎట్టి పరిస్థితిలోనూ ఈ చిత్రాన్ని మార్చి 5, 2027 న విడుదల చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారట. ఒకవేళ చెప్పిన సమయానికి ఈ సినిమా విడుదలైతే మాత్రం ఓపెనింగ్స్ కలలో కూడా ఊహించని రేంజ్ లో ఉంటాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కొన్ని ప్రాంతాల్లో కచ్చితంగా వారణాసి కి కూడా కష్టమయ్యే నంబర్స్ ఈ సినిమాకు నమోదు అవుతాయని అంటున్నారు.

వందేభారత్‌లో కోరాస్‌ కమాండోలు.. అసలు కారణం ఇదే

Vande Bharat Express
Vande Bharat Express

Vande Bharat Express: అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభమైంది. ఏడాదిలో కేవలం రెండు మూడు నెలలు మాత్రమే అమరనాథ్‌ మంచు శివలింగం దర్శనమిస్తుంది. మిగతా రోజులు మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ యాత్ర ప్రారంభం కాగానే ఏటా లక్షల మంది స్వామి దర్శనానికి వెళ్తుంటారు. కఠిన వాతావరణ పరిస్థితులు ఉన్నా ఒక్కసారైనా స్వామివారిని దర్శించుకోవాలని యాత్రకు వెళ్తారు. ఈ యాత్రకు వెళ్లేవారికి ఉగ్రవాదుల నుంచి ప్రమాదం పొంచి ఉంది. గతంలో ఉగ్రవాదులపై దాడులుచేసిన ఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఈసారి అమరనాథ్‌ యాత్రీకుల భద్రతపై ప్రత్యేక దృష్టిపెట్టింది. జమ్మూ–శ్రీనగర్‌ మార్గంలో నడుస్తున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో భద్రతను మరింత బలోపేతం చేసేందుకు రైల్వే రక్షణా విభాగం ప్రత్యేక చర్యలు తీసుకుంది. అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లే భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడంతో ఈ మార్గంలో రైలు ప్రయాణం చేసే వారి భద్రతపై దృష్టి సారించారు.

కోరాస్‌ కమాండోలతో సెక్యూరిటీ…
రైల్వే రక్షణ దళం(ఆర్‌పీఎఫ్‌) ఏర్పాటు చేసిన ప్రత్యేక కమాండో బలగం ‘కోరాస్‌’ (CORAS-Commandos for Railway Security) ఏర్పాటు చేశారు. వీరు అధునాతన ఆయుధాలు, ఆధునిక శిక్షణ పొంది ఉంటారు. రైలు ప్రయాణాల్లో ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనా వెంటనే స్పందించేలా రూపొందించారు. జమ్మూ–శ్రీనగర్‌ వందేభారత్‌లో వీరిని మోహరించడంతో రైలులోని భద్రతా వ్యవస్థ మరింత బలపడింది. సాధారణంగా రైల్వే పోలీసులతో పాటు ఇప్పుడు ఈ ఎలైట్‌ బృందం కూడా రంగంలో ఉంది. అమర్‌నాథ్‌ యాత్ర సీజన్‌లో జమ్మూ–శ్రీనగర్‌ మార్గంలో రైలు ప్రయాణం చేసే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు మల్టీలేయర్డ్‌ భద్రతా వ్యవస్థను అమలు చేశారు. కోరాస్‌ కమాండోలు రైలులో పహారా కాస్తూ, అధునాతన ఆయుధాలతో సిద్ధంగా ఉన్న వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.

ప్రయాణికుల్లో సంతోషం..
రైలులో అధునాతన ఆయుధాలతో కమాండోలు ఉండటం చూసి చాలా మంది ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇలాంటి భద్రతా ఏర్పాట్లు ఉంటే మనం నిశ్చింతగా ప్రయాణం చేయవచ్చు’ అని వారు అభిప్రాయపడుతున్నారు. రైల్వే రక్షణ దళం చర్యపై సానుకూల స్పందనను ప్రతిబింబిస్తున్నాయి. భద్రతా బలగాలు కనిపించడం వల్ల భక్తుల్లో విశ్వాసం పెరిగిందని నిపుణులు అంటున్నారు.

జమ్మూ–కాశ్మీర్‌ వంటి సున్నితమైన ప్రాంతంలో రైలు భద్రతను బలోపేతం చేయడం చాలా కీలకం. అమర్‌నాథ్‌ యాత్ర వంటి పెద్ద ఎత్తున జరిగే మతపరమైన కార్యక్రమాల సమయంలో భక్తుల సంఖ్య పెరగడం వల్ల రైలు మార్గాల్లోనూ అపాయాలు పెరిగే అవకాశం ఉంటుంది. కోరాస్‌ కమాండోల వంటి ప్రత్యేక బలగాలను మోహరించడం ద్వారా రైల్వే అధికారులు నివారణాత్మక చర్యలు తీసుకుంటున్నారు. ఈ చర్య భద్రతా దృక్పథం నుంచి మాత్రమే కాకుండా పర్యాటక రంగానికి కూడా మంచి సంకేతం. భక్తులు, ప్రయాణికులు నిశ్చింతగా ప్రయాణించగలిగితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు, పర్యాటకానికి దోహదపడుతుంది.

రైల్వే భద్రతా విభాగం తీసుకున్న ఈ నిర్ణయం ప్రయాణికుల విశ్వాసాన్ని పెంచడంలో సఫలమవుతుందని నమ్మకం. ఈ వివరాలు ఇటీవలి రైల్వే భద్రతా చర్యలు, యాత్రా సీజన్‌ పరిస్థితుల ఆధారంగా సంకలనం చేయబడ్డాయి. భద్రతా ఏర్పాట్లు మరింత మెరుగుపడాలని అందరూ ఆశిస్తున్నారు.

ఓటీటీ నుండి యూట్యూబ్ లోకి 'కన్నప్ప'.. ఇక నుండి ఉచితంగానే చూడొచ్చు..

Kannappa movie YouTube Release
Kannappa movie YouTube Release

Kannappa movie YouTube Release: మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘కన్నప్ప’. గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ స్టార్స్ గా కొనసాగుతున్న ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి దిగ్గజాలు ఉన్నప్పటికీ కూడా ఈ చిత్రానికి ఆశించిన స్థాయి రెస్పాన్స్ రాలేదు. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఫుల్ రన్ లో 50 కోట్ల రూపాయిల రేంజ్ గ్రాస్ వసూళ్లు 23 కోట్ల రూపాయిల రేంజ్ లో షేర్ వసూళ్లు వచ్చాయి. ఇది మంచు విష్ణు రేంజ్ కి చాలా ఎక్కువ, కానీ పెట్టిన బడ్జెట్ కి అది చాలా తక్కువ. అయితే విడుదల తర్వాత ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ సంస్థ కొనుగోలు చేసింది. ఆడియన్స్ నుండి థియేటర్స్ లో కాస్త పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రాన్ని మంచి రేట్ కి కొనుగోలు చేసింది అమెజాన్ ప్రైమ్ సంస్థ.

దీంతో మంచు విష్ణు పెట్టిన బడ్జెట్ కొంత వరకు రీకవర్ అయ్యింది. కానీ ఇంకా ఈ చిత్రం రీకవరీ అవ్వడానికి 50 కోట్ల రూపాయలకు పైగానే అవసరం ఉంది. అందుకే మంచు విష్ణు ఈ చిత్రాన్ని నేరుగా తన కంపెనీ యూట్యూబ్ ఛానల్ లో విడుదల చెయ్యాలని నిర్ణయించుకొని , నిన్న విడుదల చేశారు. అవా ఎంటర్టైన్మెంట్స్ అనే యూట్యూబ్ ఛానల్ లో ఈ చిత్రాన్ని ఉచితంగానే వీక్షించవచ్చు. ఈమధ్య కాలం లో యూట్యూబ్ లో మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి. తద్వారా రెవిన్యూ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉంది. రీసెంట్ గానే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన ‘జయ జానకి నాయక’ చిత్రానికి ఏకంగా 1 బిలియన్ కి పైగా వ్యూస్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ వ్యూస్ ద్వారా రెవిన్యూ కోట్లలోనే ఉంటుంది. ఇప్పుడు ‘కన్నప్ప’ చిత్రానికి కూడా ఇదే రేంజ్ రెస్పాన్స్ ని ఊహిస్తున్నారు మంచు విష్ణు. ఈ చిత్రాన్ని అప్లోడ్ చేసిన 18 గంటల్లో దాదాపుగా లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇది మంచి రెస్పాన్స్ అని చెప్పొచ్చు , రాబోయే రోజుల్లో మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వస్తాయి. మరి మంచు విష్ణు పెట్టిన బడ్జెట్ ఇలా అయినా రీకవరీ అవుతుందో లేదో చూడాలి. ఇకపోతే రీసెంట్ గానే ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రీ రిలీజ్ చేశారు. కానీ రెస్పాన్స్ మాత్రం సూన్యం. కనీసం ఒక్క టిక్కెట్ కూడా అమ్ముడుపోలేదు. ఇది మంచు విష్ణు కి పెద్ద షాక్ అనే చెప్పాలి , మరి యూట్యూబ్ లో రాబోయే రోజుల్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూద్దాం.

బిజెపిలో చేరికలు.. ఆ ఎంపీ ప్రకటనతో వైసీపీలో ప్రకంపనలు!*

AP BJP
AP BJP

AP BJP: బిజెపి ఎంపీ సీఎం రమేష్ కీలక ప్రకటన చేశారు. ఏపీ బీజేపీలో భారీ చేరికలు ఉంటాయని ప్రకటించారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు.. తరువాత చాలామంది నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. అయితే కూటమి పార్టీలో అవకాశం దక్కని వారు మాత్రమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. జనసేన సైతం చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చేరికలకు గాను ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పుడు బిజెపి సైతం చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా సీఎం రమేష్ ఈ ప్రకటన చేయడంతో ప్రకంపనలు రేగుతున్నాయి. దానికి కారణం లేకపోలేదు. ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కంఫర్ట్ గా లేని నాయకులు చాలామంది ఉన్నారు. అటువంటి వారిని బిజెపి ఆకర్షించే ప్రయత్నంలో ఉందని ప్రచారంలో ఉంది.

* బెంగాల్ వ్యవహారాల్లో..
బెంగాల్ రాజకీయాల గురించి అందరికీ తెలిసిన విషయమే. దాదాపు అక్కడ 59 మంది ఎమ్మెల్యేలు మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ కి గుడ్ బై చెప్పారు. మరో 20 మంది ఎంపీలు వేరు శిబిరం పెట్టారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఒక ప్రాంతీయ పార్టీలో విలీనం అయి ఎన్ డి ఏ లో చేరిపోయారు. ఈ చేరికల వెనుక సీఎం రమేష్ కీలక పాత్ర పోషించారు. జాతీయస్థాయిలో సైతం సీఎం రమేష్ పాత్ర పెరిగింది బెంగాల్ వ్యవహారాలతో. అందుకే ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏపీలో దెబ్బతీసే బాధ్యతను బిజెపి పెద్దలు సీఎం రమేష్ కు అప్పగించినట్లు తెలుస్తోంది.

* ఆ సీనియర్లంతా గుడ్ బై..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన నేతలు ఉన్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు పేరు మోసిన నేతలు చాలామంది ఉన్నారు. వారంతా తెలుగుదేశం పార్టీ వ్యతిరేక భావజాలం ఉన్నవారే. సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీతో పోరాటం చేసిన వారే. వారు టిడిపిలో చేరుతామంటే కుదరదు. అందుకే ప్రత్యామ్నాయంగా ఇప్పుడు బిజెపి వైపు చూస్తున్నట్లు ప్రచారంలో ఉంది. అయితే చాలామంది వైసిపి సీనియర్లు బిజెపిలోకి వస్తామంటే టిడిపి అభ్యంతరం తెలిపింది. మళ్లీ ఎన్నికల ముంగిట వారంతా వైసీపీలోకి యూటర్న్ తీసుకుంటారని.. బిజెపిని వైసిపి దగ్గరకు చేరుస్తారన్న అనుమానాలతోనే అప్పట్లో అలా వ్యవహరించింది. అయితే ఇప్పుడు వైసీపీని దెబ్బతీసే ప్రణాళిక తో కూటమి ముందుకు వెళ్తోంది. జనసేనతో పాటు బిజెపిలో చేరికలకు టిడిపి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు బిజెపి తరఫున సీఎం రమేష్ రంగంలోకి దిగారు. సీనియర్ మోస్ట్ వైసిపి నేతలను బిజెపిలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అదే జరిగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ పడటం ఖాయం.

ప్రశ్న రావణ్ కేసుల్లో ఊహించని ట్విస్ట్.. అసలు లోపం అదే!

Prashna Ravan Case
Prashna Ravan Case

Prashna Ravan Case: ఏపీలో మతం మాటున జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల ఓ సభలో ప్రశ్న రావణ్ చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ పై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయి. అయితే మతం మాటున, రాజకీయాల మాటున చేసే వ్యాఖ్యలు మరింత శ్రుతిమిస్తుండడంతో పోలీస్ శాఖ స్పందించింది. ప్రశ్న రావణుని అరెస్టు చేసింది. ఒక కేసులో బెయిల్ లభిస్తుంటే.. మరో కేసులో అరెస్ట్ చేస్తోంది. దీంతో కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ప్రశ్న రావణ్. అయితే ప్రభుత్వ వ్యూహం ఏంటో తెలియదు కానీ ఒక వ్యూహాత్మక లోపం మాత్రం ఈ విషయంలో బయటపడుతోంది.

* కేసుల మీద కేసులు..
ప్రశ్న రావణ్ తప్పు చేశారని పోలీసులు భావిస్తున్నారు. అందుకే అరెస్టులు చేస్తున్నారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ జనసైనికులు ఆయనపై మండిపడుతున్నారు. దాడులు చేస్తున్నారు. కోడిగుడ్లు రువ్వుతున్నారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు అంతలా తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. దానిని ఎవరు సమర్ధించలేరు కూడా. కానీ ఆయనకు బెయిల్ లభిస్తుందటమే.. ఆయనపై నమోదవుతున్న.. నమోదు చేస్తున్న కేసులు పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే వ్యక్తుల కంటే ఆయన వ్యవస్థలపై మాట్లాడారు. మనుషుల నమ్మకాలపై మాట్లాడారు. హిందూ దేవుళ్ళతో పాటు దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వాటిపై ఫిర్యాదులు చేసి.. ఆ కేసుల్లో రావణ్ ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెడితే మంచి ఫలితమే ఉంటుంది. ఈ విషయంలో కోర్టులు కూడా సీరియస్ గా వ్యవహరించే ఛాన్స్ ఉంటుంది.

* వాటిపై ఫిర్యాదు చేస్తేనే..
ప్రశ్న రావణ్ హిందూ దేవుళ్ళతో పాటు దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఎప్పుడైతే దళిత క్రైస్తవ సభలో పవన్ కళ్యాణ్ పై ప్రశ్న రావణ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం.. అవి వివాదాస్పదం కావడంతో.. రావణ్ గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. హిందూ సమాజం కూడా ఆయనపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. పైగా కేంద్ర ప్రభుత్వం నడిచే బిజెపి అనుబంధ సంస్థలు గా ఉన్న ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ రంగంలోకి దిగి.. హిందూ సంఘాల ప్రతినిధులతో కేసులు పెట్టిస్తే అవి న్యాయస్థానాల్లో నిలబడతాయి కూడా. కానీ చంద్రబాబును తిట్టాడనో.. పవన్ కళ్యాణ్ పై రెచ్చిపోయాడనో కేసులు పెడితే అవి న్యాయస్థానాల్లో నిలబడవు. అందుకే ఆ విఫల ప్రయత్నం నుంచి సఫల ప్రయత్నంలోకి మారాలంటే హిందూ దేవుళ్ళపై, దేవతలపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఆసరాగా తీసుకొని ఫిర్యాదులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

అవి వేసుకోండి..బెడ్ మీద రెచ్చిపోండి.. తర్వాత ఫుట్ బాల్ ఆడి గెలవండి

FIFA World Cup
FIFA World Cup

FIFA World Cup: ఇటువంటి ఆఫర్ వస్తే ఏ జట్టు ప్లేయర్లకు అయినా సరే పండగే. పైగా స్వయంగా మేనేజ్మెంట్ ఇలాంటి పనిచేయమని చెప్పడం.. దగ్గరుండి ప్రోత్సహించడం మామూలు విషయం కాదు. దీంతో ఆ ప్లేయర్లలో ఉత్సాహం ఆకాశాన్ని తాకుతోంది.. ఎప్పుడెప్పుడు ఆ పని చేయాలా అనే తాపత్రయం పెరిగిపోతోంది. ఈ విషయం బయటికి రావడంతో.. మీడియాలో ప్రధానంగా ప్రసారం కావడంతో.. చర్చ మరింత రంజుగా సాగుతోంది.

ప్రస్తుతం ఫిఫా వరల్డ్ కప్ సాగుతోంది. ఇప్పటికే చాలా వరకు మ్యాచులు ముగిసిపోయాయి. కీలక మ్యాచ్లకు రంగం సిద్ధమైంది. చాలావరకు జట్లు ఇంటిదారి పట్టాయి. గొప్పగా ఆడిన జట్లు ముందుకు సాగాయి. ఇకపై జరిగే ప్రతి మ్యాచ్ కూడా ఒక వార్ లాగే ఉంటుంది. ఈ రణంలో గెలవాలి అంటే కచ్చితంగా ఆటగాళ్లు ఒత్తిడి లేకుండా ప్రదర్శన చేయాలి. అది జరగాలంటే ఆటగాళ్ల మీద ఒత్తిడి ఉండకూడదు. ఆ ఒత్తిడిని దూరం చేయడానికి ఇంగ్లాండ్ మేనేజ్మెంట్ తన ప్లేయర్లకు ఒక అనుకోని అదృష్టాన్ని కల్పించింది. అద్భుతమైన వరాన్ని ప్రసాదించింది.

ఇంగ్లాండ్ జట్టు ప్లేయర్లు రౌండ్ 16 లో భాగంగా ఈనెల 6న మెక్సికోతో పోటీ పడబోతోంది. ఈ మ్యాచ్ కంటే ముందు ఇంగ్లాండ్ ప్లేయర్లు వ** మాత్రలు వాడబోతున్నారు. వీటిని వేసుకున్న తర్వాత.. ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ జీవిత భాగస్వాములు.. స్నేహితురాళ్ల తో వారు పడకమీద అద్భుతమైన పోరాటం సాగించవచ్చు. ఆ పోరాటం సాగించిన తర్వాత ప్లేయర్ల మీద ఒత్తిడి తగ్గుతుందని మేనేజ్మెంట్ భావిస్తోంది.

ఈ మ్యాచ్ మెక్సికోలోని ఎస్టా డియో స్టేడియంలో జరుగుతుంది. ఈ స్టేడియం సముద్రమట్టానికి 7350 అడుగుల ఎత్తులో ఉంటుంది. అక్కడ మామూలు వాతావరణ కంటే ఎక్కువ ఒత్తిడి పూరితమైన వాతావరణం ఉంటుంది. అక్కడ సాధారణం కంటే ఎక్కువ అలసట ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ఆల్టిట్యూడ్ సిక్ నెస్ ను అధిగమించాలంటే ఇంగ్లాండ్ ప్లేయర్లు కచ్చితంగా అది వాడాలని మేనేజ్మెంట్ సూచించింది. దాన్ని వాడిన తర్వాత.. భార్యలు.. గర్ల్ ఫ్రెండ్స్ తో ఆ కార్యక్రమం పూర్తి చేసుకోవాలని సూచిస్తోంది.. దీనివల్ల ప్లేయర్ల మీద ఒత్తిడి తగ్గుతుంది.. ఆట మీద పూర్తిస్థాయిలో మనసు లగ్నం చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు ఆల్టిట్యూడ్ సిక్ నెస్ ను దూరం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
image.png

కవితకు ఎన్నికల సంఘం కోలుకోలేని షాక్‌..

TRS Party Name Dispute
TRS Party Name Dispute

TRS Party Name Dispute: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తనయ, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ, భారత రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఎన్నికల సంఘం షాక్‌ ఇచ్చింది. పార్టీలో ఏర్పడిన అంతర్గత విభేదాలతో కవితను బీఆర్‌ఎస్‌(పాత టీఆర్‌ఎస్‌) నుంచి బయటకు పంపించారు. దీంతో తెలంగాణలో కొన్నాళ్లు పర్యటించిన కవిత. ఇటీవలే కొత్త పార్టీ పెట్టింది. తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్‌) ఏర్పాటు చేశారు. ఈమేరకు ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశారు. పార్టీ జెండా, ఎజెండా కూడా కవిత ప్రకటించారు. ఈ పార్టీకి తెలంగాణ రాష్ట్ర హక్కుల పరిరక్షణ, ఉద్యమ వారసత్వం కొనసాగించడం వంటి లక్ష్యాలు ప్రకటించారు.

ఏప్రిల్‌ 25 పార్టీ ప్రకటన..
ఈ ఏడాది ఏప్రిల్‌ 25న మేడ్చల్‌లోని అద్వయ కన్వెన్షన్‌ సెంటర్‌లో కవిత తన కొత్త పార్టీని ప్రారంభించి, పేరును తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్‌ఎస్‌) అని ప్రకటించారు. ఇది పాత టీఆర్‌ఎస్‌(తెలంగాణ రాష్ట్ర సమితి – ఇప్పుడు బీఆర్‌ఎస్‌) వారసత్వాన్ని ఉపయోగించుకునే ప్రయత్నంగా చూశారు. ఈ ప్రకటనతోనే రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. జనవరిలోనే కవిత ఎన్నికల సంఘానికి ఐదు ప్రత్యామ్నాయ పేర్లు సమర్పించారు. ఏప్రిల్‌ 25 ప్రకటన తర్వాత ఎన్నికల సంఘం పేరు సారూప్యత కారణంగా పరిశీలన చేపట్టింది. బీఆర్‌ఎస్‌ సహా కొన్ని పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. దీంతో ఎన్నికల సంఘం తెలంగాణ రక్షణ సేన అనే పేరుకు (ఆమె సమర్పించిన ఎంపికల్లో ఒకటి) ప్రాథమిక ఆమోదం ఇచ్చింది. ఏప్రిల్‌ 30న ఎన్నికల సంఘం అధికారులు బంజారాహిల్స్‌లోని కవిత నివాసానికి వెళ్లి లేఖ అందజేశారు.

ఈసీకి అభ్యంతరాల వెల్లువ
ప్రాథమిక ఆమోదం తర్వాత జూన్‌ 2026లో ఎన్నికల సంఘానికి 600 నుంచి 700 వరకు అభ్యంతరాలు వచ్చాయి. బీఆర్‌ఎస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. టీఆర్‌ఎస్‌ పేరు తెలంగాణ ఉద్యమంతో ముడిపడి ఉంది. గ్రామాల్లో ప్రజలు ఇప్పటికీ బీఆర్‌ఎస్‌ను టీఆర్‌ఎస్‌ గానే గుర్తిస్తున్నారు. కొత్త పార్టీకి ఇదే పేరు ఇస్తే ఓటర్లలో గందరగోళం కలుగుతుంది అని వాదించింది. మహారాష్ట్ర సోలాపూర్‌కు చెందిన మరో సంస్థ కూడా ఇదే పేరుపై హక్కు కోరుతూ దరఖాస్తు చేసింది. ఎన్నికల సంఘం ఇప్పటికీ అభ్యంతరాలను పరిశీలిస్తోంది. చివరి ఆమోదం ఇంకా పెండింగ్‌లో ఉంది.

మూడు ప్రత్యామ్నాయ పేర్లు కోరిన ఈసీ..
టీఆర్‌ఎస్‌పై తీవ్ర అభ్యంతరాలు ఉన్న నేపథ్యంలో ఈసీ కవితకు లేఖ రాసింది. 15 రోజుల్లో మూడు కొత్త పేర్లు సూచించాలని తెలిపింది. గడువులోగా పేర్లు ఇవ్వకుంటే పార్టీ దరఖాస్తు క్లోజ్‌ చేస్తామని పేర్కొంది. టీఆర్‌ఎస్‌ పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉండటం వల్ల బీఆర్‌ఎస్‌ అభ్యంతరం సహజం. కవిత ఈ పేరును ఉపయోగించడం ద్వారా పాత మద్దతుదారులను ఆకర్షించాలని భావించినట్లు కనిపిస్తోంది. అయితే ఓటర్ల అయోమయం నివారించడం ఎన్నికల సంఘం బాధ్యత. ఈ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కుటుంబ రాజకీయాల ప్రభావాన్ని, కొత్త పార్టీలు ఎదుర్కొనే సవాళ్లను గుర్తు చేస్తోంది. బీఆర్‌ఎస్‌కు ఇది మరిన్ని ఇబ్బందులు కలిగించవచ్చు. కవితకు ఇదిసొంత రాజకీయ గుర్తింపు నిర్మించుకునే అవకాశం. అభ్యంతరాలు తీరిన తర్వాత పార్టీ రిజిస్ట్రేషన్‌ పూర్తయితే ఆమె రాజకీయ కార్యకలాపాలు మరింత వేగవంతం అవుతాయి.

తెలంగాణలో పార్టీల మధ్య పోటీని, వారసత్వ పోరాటాన్ని తీవ్రతరం చేస్తోంది. ఈ వివరాలు ఎన్నికల సంఘం చర్యలు, పార్టీల అభ్యంతరాలు సంక్లిష్టంగా మార్చాయి. పక్షం రోజుల్లో కవిత ఏం చేస్తుంది అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.