Home Blog Page 275

చైనా అప్పుల జాబితాలో 20 దేశాలు.. పాక్ నంబర్ వన్..!

China Debt Countries List
China Debt Countries List

China Debt Countries List: చైనా ప్రపంచ సంపన్న దేశాల్లో రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానం కోసం దూకుడు పెంచింది. ఈ క్రమంలో పలు దేశాలను తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు ఆయా దేశాల బలహీనతను వాడుకుంటుంది. ఆర్థిక అవసరాలు తీర్చేందుకు అప్పులు ఇస్తోంది. వ్యూహాత్మక దేశాల్లో అభివృద్ధి పేరిట పెట్టుబడులు పెడుతోంది. వనరులను తరలించుకుపోతోంది. 2022 నాటికి చైనా అప్పుల జాబితాలో 20 దేశాలు ఉన్నాయి. పాకిస్తాన్ అగ్ర స్థానంలో ఉంది.

పాకిస్తాన్ అగ్ర స్థానం..
చైనా ప్రపంచ మౌలిక పెట్టుబడుల ద్వారా పలు దేశాల వద్ద ఆర్థిక ఆధిక్యత సాధించింది. 2022 డేటా ప్రకారం చైనాకి అత్యధిక బకాయి ఉన్న టాప్ 20 దేశాల్లో పాకిస్తాన్‌ 26.6 బిలియన్ డాలర్లతో అగ్ర స్థానంలో ఉంది. తర్వాత స్థానాల్లో ఆంగోలా, శ్రీలంక, ఇథియోపియా వంటి దేశాలు ఉన్నాయి.

అవసరాల కోసం అప్పులు..
బీజింగ్ నడిపే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీ ఆర్ ఐ) భాగంగా పెద్ద ఎత్తున ఇన్‌‌ఫ్రా ప్రాజెక్టులపై క్రెడిట్ ఇవ్వబట్టి వచ్చే దశల్లో ఆ దేశాలుపై విధ్వంసాత్మక బకాయి ఏర్పడుతోంది. ఈ రుణాలు మెగా పోర్టులు, తూర్పు-పడమటి రహదారులు, డ్యాములు వంటి మనుగడపై ప్రభావాన్ని కలిగించే ఒప్పందాలు. కొన్ని దేశాలు తక్షణ అభివృద్ధి అవసరాల కోసం అప్పులు తీసుకోవటం, పెట్టుబడుల రిటర్న్ అంచనాలు తప్పడంతో డిఫాల్ట్‌-రిస్కు పెరుగుతోంది.

ప్రాంతాల వారీగా ఇలా..
ప్రాంతాల వారీగా పరిశీలిస్తే.. దక్షిణ ఆసియాలో పాకిస్తాన్‌ (26.6 బిలో), శ్రీలంక (8.9 బిలో) వంటి దేశాల్లో రుణభారం జాతీయ రిజర్వులపై, విదేశీ మారక విలువపై తీవ్రమైన ఒత్తిడి సృష్టించింది. శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభం తరువాత కొన్ని ప్రాజెక్టులు చైనా చేతిలోకి వెళ్లాయి. ఆఫ్రికాలో ఆంగోలా (21 బిలో), ఇథియోపియా (6.8 బిలో), కెన్యా (6.7 బిలియన్), జాంబియా (6.1 బిలియన్) వంటివి చైనా క్రెడిట్ ఆధారిత దేశాలు. ఈ దేశాల్లో వార్షిక వనరుల ఆదాయంపై ఆధారపడి రుణ చెల్లింపోలు ఉంటాయి. ఇక లాటిన్ అమెరికా, ఇతర ప్రాంతాల్లో ఈక్వడార్, అర్జెంటినా, బ్రెజిల్ వంటి ప్రాజెక్ట్-ఆధారిత ఒప్పందాలతో చైనా వ్యూహాత్మకంగా ప్రవేశించింది. రీసోర్సెస్ ఎక్స్చేంజ్, ఇంధన ప్రాజెక్టుల రూపంలో అభివృద్ధి చేపడుతోంది.

ఆర్థికం నుండి జియోపొలిటిక్స్.
చైనాకు భారీగా బకాయి ఉన్న దేశాల విదేశీ రిజర్వులు తరిగి పోతున్నాయి. కరెన్సీ విలువ తగ్గడం, ద్రవ్యోల్బణం, దిగుబడి పెరుగుదలలో ఇబ్బందులు పడుతున్నాయి. రుణాలు సక్రమంగా చెల్లించక డిఫాల్ట్ అయితే పోర్టులు, లాజిస్టిక్ హబ్‌లు, మైనింగ్ స్థావరాల లీజు లేదా మేనేజ్‌మెంట్ చైనా సంస్థలు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. తీవ్ర రుణ బాధిత దేశాలు పరిమిత విదేశీ విధాన స్వతంత్రతను చైనా హరించే ప్రమాదం ఉంది. చైనా నిర్దిష్ట విదేశీ రీతులను ప్రోత్సహించేందుకు ఆర్థిక శక్తిని విదేశీ విధానంగా మార్చుకోవచ్చు.

చైనా నుంచి ఒకసారి రుణం తీసుకున్న తర్వాత దాని రాజకీయ, భూభౌతిక, ఆర్థిక పరిమాణం దేశపు స్వతంత్రతపై ఆధిపత్యం కొనసాగునుంది. తక్షణ అభివృద్ధి కోసం రుణం అవసరం అయినప్పటికీ, దీర్ఘకాలికంగా దేశాలు తమ ఆర్థిక వ్యూహాలను బలోపేతం చేసి, స్థానిక ఆదాయాన్ని పెంచే దిశగా దృష్టి పెట్టాలి. లేదంటే ఆ దేశాల ఆర్థిక స్వాతంత్ర్యం ప్రశ్నార్థకమవుతుంది.

సాక్షిని బ్యాన్ చేసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

Sakshi Media
Sakshi Media

Sakshi Media Ban: విశాఖలో సాక్షి మీడియాను బ్యాన్ చేశారు. అలా చేసింది ఎవరో తెలుసా సాక్షాత్ వైసిపి నేత. ఆ మీడియాలో వార్త రావాలంటే ఒక రేటు.. వార్త ప్రచురితం కావాలంటే మరో రేటు అన్నట్టు.. మీడియా ప్రతినిధులు అమ్ముడుపోయారని బాహటంగానే వ్యాఖ్యానిస్తున్నారు ఓ మాజీ ఎమ్మెల్యే. అందుకే తన నియోజకవర్గ వైపు సాక్షి మీడియా ప్రతినిధులు రావద్దు అని గట్టిగానే హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఎవరు ఆ నేత అంటే.. దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. గత కొద్దిరోజులుగా ఆయన సాక్షి మీడియా ప్రతినిధుల పై ఆగ్రహంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి భార్య భారతికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరిస్తున్నారు.

* వైసీపీలో ఓటమి..
తెలుగుదేశం పార్టీలో వరుసగా మూడుసార్లు గెలిచారు వాసుపల్లి గణేష్ కుమార్. 2019లో జగన్ ప్రభంజనంలో సైతం విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. విశాఖ నగరంలోని నాలుగు నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్థులే అప్పట్లో గెలిచారు. మిగతా ముగ్గురు టిడిపిలో కొనసాగారు. కానీ వాసుపల్లి గణేష్ కుమార్ మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి గణేష్ కుమార్ టిడిపిలోకి వస్తారన్న ప్రచారం నడిచింది. కానీ క్యాడర్ అభ్యంతరాలతో ఆయన చేరికకు టిడిపిలో బ్రేక్ పడినట్లు వార్తలు వచ్చాయి ఆ మధ్యన. అయితే ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తిరిగి యాక్టివ్ అయ్యారు కూడా.

* ప్రాధాన్యత లేకపోవడంతో..
కానీ తాను అనుకున్న స్థితిలో సాక్షి మీడియాలో తనకు తగినంత ప్రాధాన్యం లభించడం లేదన్నది వాసుపల్లి గణేష్ కుమార్ ఆవేదన. పేరుకే సాక్షి మీడియా సొంతది అని.. కానీ కనీస స్థాయిలో కవరేజ్ లేకపోవడంతో ఆయన ఆగ్రహంతో ఉన్నారట. పైగా రాజకీయ ప్రత్యర్థులతో సాక్షి ప్రతినిధులు కలిసిపోయారన్న బాధ ఆయనలో ఉందట. అందుకే బాహటంగా ఈ విషయాన్ని చెబుతూ తన నియోజకవర్గ పరిధిలో సాక్షి మీడియా ప్రతినిధులు రావద్దు అని ఆంక్షలు పెట్టారట. అయితే రాష్ట్రవ్యాప్తంగా చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంది. కానీ ముందుగానే ఓపెన్ అయ్యారు వాసుపల్లి గణేష్ కుమార్. అయితే దీనిపై భారతి మేడంకు ఫిర్యాదు చేస్తామని వాసుపల్లి గణేష్ కుమార్ చెబుతుండడం మాత్రం సంచలనంగా మారింది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

ప్రభాస్ స్పిరిట్ తో ఇబ్బందులు పడుతున్నాడా...

Prabhas Spirit Movie
Prabhas Spirit Movie

Prabhas Spirit Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించగలిగే కెపాసిటి ఉన్న హీరోలు ఎంతమంది ఉన్నా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో వచ్చే క్రేజ్ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరిని డామినేట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రభాస్ లాంటి నటుడు తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్నాడు. ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా పాన్ ఇండియాలో పెను సంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. సినిమా హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా వందల కోట్ల కలెక్షన్స్ ను రాబడుతుంటాయి. అతనితో సినిమా చేస్తే సెక్యూర్ జోన్ లో ఉంటామని ప్రొడ్యూసర్లు అందరు అతని డేట్స్ కోసం పోటీ పడుతున్నారు.

ఇక ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కానీ రీతిలో గొప్ప విజయాలను సాధించిన ఆయన ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న ఫౌజీ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన నేపథ్యంలో ఇప్పుడు స్పిరిట్ సినిమా మీదనే ఆయన పూర్తి ఫోకస్ పెట్టాడు.

రీసెంట్ గా ఒక షెడ్యూల్ ని షూట్ చేస్తున్న సందీప్ ఈ సినిమాతో మరో స్థాయికి వెళ్లాలనే ప్రయత్నంలో ఉన్నాడు…
ఈ సినిమా కోసం ప్రభాస్ విపరీతంగా కష్టపడుతున్నాడు. ఒక్కో షాట్ మీద సందీప్ రెడ్డివంగా చాలా స్పెషల్ కేర్ తీసుకొని చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. షాట్ అనుకున్నట్టుగా వచ్చేంతవరకు చిత్రీకరిస్తున్నారట.

కొన్ని షాట్స్ డూప్ తో చేయమని చెప్పినప్పటికి సందీప్ కాంప్రమైజ్ అవ్వకుండా కేవలం ప్రభాస్ తోనే షూట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకోవాల్సింది. కానీ సందీప్ రెడ్డి వంగ కి డూప్ తో చేయడం ఇష్టం లేక ప్రభాస్ డేట్స్ ఇచ్చినపుడు ఆయనతోనే సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. కాబట్టి అందుకోసమే ఈ సినిమా షూట్ లేట్ అవుతుంది…

టీఎంసీ నేత ఇంట్లో బంగారు పరుపు, సోఫా.. పోలీసులు అరెస్ట్ చేశారు గాని.. లేకుంటే కేజీఎఫ్ ను మించిపోయేవాడు..

TMC Leader Gold Bed
TMC Leader Gold Bed

TMC Leader Gold Bed: ప్రభుత్వం ఇచ్చే పింఛన్ లో 300 టీఎంసీ కార్యకర్తలకే. ప్రభుత్వం అందించే డైరెక్ట్ బెనిఫిషరీ స్కీమ్ లో కొంత వాటా వాళ్లకే. ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకంలో వారికి భాగం వెళ్లాల్సిందే. దీనికి బెంగాల్ ప్రజలు పెట్టిన పేరు కట్ మని.

15 సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత.. మమతా బెనర్జీ సంపూర్ణ అధికారాలు వచ్చిన తర్వాత టిఎంసి కార్యకర్తలు జలగల మాదిరిగా జనాల మీద పడ్డారు. వారి రక్త మాంసాలను దోచుకున్నారు. ప్రజల కష్టాన్ని తమకు ఆర్జితంగా మార్చుకున్నారు. ఫలితంగా టీఎంసీ కార్యకర్తలు ఆగర్భ శ్రీమంతులుగా మారిపోయారు. ఇప్పుడు బిజెపి అధికారంలోకి రావడంతో.. వారి అక్రమ లీలలు బయటపడిపోతున్నాయి.

బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు తర్వాత బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ కేసును బిజెపి ప్రభుత్వం అంత సులభంగా తీసుకోవడం లేదు. ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ కేసు పై విచారణ సాగించాలని అధికారులకు సూచించారు. దీంతో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు కీలకమైన విషయాలు తెలిసాయి. బాంబు పేలుడులో టీఎంసీ నేత షమీం అహ్మద్ కీలకపాత్ర పోషించాడని వెలుగులోకి వచ్చింది.

పూర్తి ఆధారాలతో షమీం ఇంట్లో పోలీసులు దాడులు చేశారు. అతడు నివాసం ఉంటున్న నాలుగు అంతస్తుల బిల్డింగ్ లో ఒక సీక్రెట్ ప్లాట్ ఉంది. అందులో బంగారంతో తయారుచేసిన పరుపు.. గోల్డ్ సోఫా.. ఇంకా అనేక రకాల ఖరీదైన వస్తువులు ఉన్నాయి. వాటిని చూసిన అధికారులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు.. వాస్తవానికి షమీం అహ్మద్ టిఎంసిలో చాలా కిందిస్థాయి నాయకుడు. అతడి ఇంట్లోనే ఈ స్థాయిలో బంగారం.. ఖరీదైన వస్తువులు ఉంటే.. ఇక పెద్దపెద్ద నాయకుల ఇళ్లల్లో ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చని బెంగాల్ లోని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మమత ప్రభుత్వం ఉన్నన్ని రోజులు టీఎంసీ కార్యకర్తలు ఇష్టానుసారంగా ప్రవర్తించారు. ప్రజలకు అందించే సంక్షేమ పథకాలలో తమ వాటా తీసుకున్నారు. అభివృద్ధి పథకాలలో కూడా తన భాగాన్ని బెదిరించి మరి లాక్కున్నారు. చూస్తుండగానే కోట్లకు పడగలు ఎత్తిపోయారు. అటు బెంగాల్ రాష్ట్రంలో స్థిరమైన అభివృద్ధి లేకపోవడం.. పెద్ద పెద్ద కంపెనీలు రాకపోవడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. యువత వలసలు వెళ్లే దుస్థితి దాపురించింది. ఇంత జరిగినప్పటికీ మమతలో మార్పు రాలేదు. ప్రజలకు అంతంత మాత్రమే సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఓట్లు దండుకున్నారు. చివరికి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఇబ్బంది పెట్టారు.

మూడు పర్యాయాలు ఇలా అధికారంలోకి వచ్చినప్పటికీ.. చివరిసారి మాత్రం బెంగాల్ ప్రజలు తమ విజ్ఞతను ప్రదర్శించారు. ఫలితంగా టి ఎం సి అధికారానికి దూరమైంది.. వచ్చిన అవకాశాన్ని బిజెపి నేతలు సద్వినియోగం చేసుకుంటున్నారు. టీఎంసీ నేతల బాగోతాలను బయటపెడుతున్నారు. అయితే పశ్చిమ బెంగాల్ లో షమీం అహ్మద్ లాంటి వాళ్ళు చాలామంది ఉంటారని.. వారందరి అక్రమ సంపాదన మొత్తం బయటికి తీస్తామని బిజెపి నాయకులు అంటున్నారు.

మమత చేసిన కంపును.. తొలగించాలంటే బిజెపికి ఐదేళ్లూ సరిపోతాయా..

West Bengal BJP
West Bengal BJP

West Bengal BJP: ఒకడు నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి పోటీ చేస్తేనే చితకబాదాడు. ఈ ఎన్నికల్లో ఈవీఎం యంత్రాల మీద బిజెపి సింబల్ మీద స్టికర్ వేశాడు. చివరికి సెంటు కూడా పూశాడు. ఎన్నికల ప్రక్రియ లైవ్ స్ట్రీమింగ్ రాకుండా చూసుకున్నాడు.

ఇంకొకడు నిత్యం భారతదేశం మీద.. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మీద ఇష్టానుసారంగా రాసేవాడు. ఒక పత్రికను నడిపి.. బంగ్లాదేశ్ కు అనుకూలంగా రాతలు రాసేవాడు. భారతదేశాన్ని తీవ్రస్థాయిలో విమర్శించేవాడు. నరేంద్ర మోడీ అంతమైతేనే దేశానికి పట్టిన పీడ విరగడవుతుందని చెప్పుకునేవాడు.

మరొకడు గూండారాజ్ వ్యవస్థను కొనసాగించేవాడు. మమతా బెనర్జీ.. ఆమె అల్లుడు అభిషేక్ బెనర్జీకి కుడి భుజం లాగా ఉండేవాడు. ఇంకా రకరకాల దారుణాలకు పాల్పడేవాడు.

ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు పశ్చిమ బెంగాల్ వదిలి వెళ్ళిపోయారు. వారిలో కొందరు పోలీసుల చేతిలో అరెస్టు అయ్యారు. మరికొందరు సెంట్రల్ ఏజెన్సీ అధికారుల ఎంక్వైరీలో ఉన్నారు. వీరంతా గడచిన 15 సంవత్సరాల కాలంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని జలగల మాదిరిగా పట్టి పీడించారు. ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. పార్టీ మీటింగ్ ల పేరుతో యుక్త వయసు ఉన్న అమ్మాయిలను రోజుల తరబడి తమ వద్ద ఉంచుకునేవారు. చివరికి ఎవరైనా బిజెపి తరఫున పోటీ చేస్తే చావ బాదేవారు. ఇలా చెప్పుకుంటూ పోతే బెంగాల్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు.

బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఇప్పుడు ఆపరేషన్ వెస్ట్ బెంగాల్ మొదలైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి సువెందు అధికారి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇన్ని రోజులపాటు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఇష్టానుసారంగా సాగిన గుండారాజ్ వ్యవస్థకు చరమగీతం పాడుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు.. నాయకులు చేసిన ఆగడాలను బయటపెడుతున్నారు. బెంగాల్ రాష్ట్రాన్ని పంది కొక్కుల మాదిరిగా దోచుకున్న టీఎంసీ నేతలను శ్రీకృష్ణ జన్మస్థానాలకు పంపిస్తున్నారు.

బెంగాల్ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలతో ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలను ఎక్కడికక్కడ కొడుతూ ఉన్నారు. కనీసం ఆ పార్టీ ఛాయలు కూడా వెస్ట్ బెంగాల్లో కనిపించకూడదని ప్రజలు శపథం పూనారు. ప్రజల నుంచి వస్తున్న నిరసన తట్టుకోలేక టీఎంసీ కార్యకర్తలు బిజెపి నాయకులకు ఫోన్లు చేస్తున్నారు. ప్రజల నుంచి తమను కాపాడాలని విన్నవిస్తున్నారు.

బిజెపి నేతలు ప్రజలకు సర్ది చెబుతున్నారు. మన పని అది కాదని.. ఇంకా వెస్ట్ బెంగాల్ రాష్ట్రాన్ని పూర్తిగా పునర్ నిర్మించే బాధ్యతని భుజాలకు ఎత్తుకోవాల్సి ఉందని.. చెబుతున్నారు. అయితే బిజెపి నాయకులు బయటకి అలా చెప్తున్నప్పటికీ.. మమత చేసిన 15 సంవత్సరాల కంపు తొలగించడానికి ఎన్ని స్వచ్ఛభారత్ లు నిర్వహించాలి.. ఎంతమంది సువెందు అధికారి లు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు తీసుకోవాలి.. ఇప్పుడు ఇవే ప్రశ్నలు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు బెంగాల్ గొప్పగా కనిపించకపోయినప్పటికీ.. వచ్చే రోజుల్లో మాత్రం క్లీన్ బెంగాల్ గా మారడం ఖాయం.

ఎన్టీఆర్ తో స్నేహం చేసి హీరోగా మారిన నటుడు... ఇప్పుడు తారక్ తో మాట్లాడటం లేదు...

NTR
NTR

NTR: నందమూరి ఫ్యామిలీ హీరోలకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో గొప్ప అవకాశాలైతే దక్కుతున్నాయి. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చే ప్రతి హీరో తమదైన రీతిలో సత్తా చాటుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. నందమూరి తారక రామారావు గారి తర్వాత బాలయ్య బాబు ఆ ఫ్యామిలీని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ఇక మూడోవతరం హీరోగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సైతం ఎప్పుడు పాన్ ఇండియా లెవెల్లో నందమూరి ఫ్యామిలీ స్టామినా ఏంటో చూపిస్తున్నాడు.

ఇక ఇదిలా ఉంటే కెరియర్ స్టార్టింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ తో ఫ్రెండ్షిప్ చేసిన ఒక నటుడు హీరోగా మారి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇంతకీ ఆ నటుడు ఎవరు అంటే రాజీవ్ కనకాల కావడం విశేషం…ఇక ఆ సినిమాతో వీళ్ళిద్దరికీ చాలా మంచి పరిచయమైతే కుదిరింది. దాంతో వీరిద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. ప్రతి సినిమాలో రాజీవ్ కనకాలకి ఒక సపరేట్ క్యారెక్టర్ ఉండే విధంగా డిజైన్ చేయించేవారు.

తద్వారా వీళ్ళిద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ అంటూ ఇండస్ట్రీ మొత్తం వీళ్ళ పేర్లు మారుమ్రోగిపోయాయి. దాంతో రాజీవ్ కనకాల కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటించి సక్సెస్ లను సాధించాడు.
ఇక ఏమైందో తెలియదు గానీ గత కొద్ది రోజులుగా వీళ్ళిద్దరి మధ్య సరిగ్గా మాటలు లేవంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. రీసెంట్ గా రాజీవ్ కనకాల ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చాడు.

మా మధ్య ఎలాంటి గొడవలు జరగలేదని మేమిద్దరం చాలా బాగా మాట్లాడుకుంటున్నామని చెప్పాడు. అవకాశం దొరికిన ప్రతిసారి కలుస్తూ చాలా సేపు డిస్కస్ చేసుకుంటూ ఉంటామని కూడా ఆయన చెప్పడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ తో స్నేహం చేసి హీరోగా మారిన రాజీవ్ కనకాల ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సత్తా చాటుతుండటం విశేషం…

తప్పు సహజం.. కానీ అలా సరిదిద్దుకున్న అలీ

Ali Apology
Ali Apology

Ali Apology: ఇటీవల ప్రముఖ కమెడియన్ అలీ క్షమాపణలు చెప్పారు. ఓ సబ్బుల కంపెనీకి ఇచ్చిన యాడ్ పై అభ్యంతరాలు రావడంతో ముందే మేల్కొన్నారు అలీ. దాదాపు 1000 చిత్రాల్లో నటించారు. ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. బుల్లితెరలో చాలా షోలకు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఓ అభ్యంతరకర యాడ్ లో నటించడం విమర్శలకు గురయ్యారు. వెంటనే పరిస్థితిని గమనించి అలీ క్షమాపణలు చెప్పడం విశేషం. నిజంగా అభినందించదగ్గ విషయం కూడా.

* సబ్బుల కంపెనీ ప్రకటనలో..
ముంబాయికి చెందిన ఓ సబ్బుల కంపెనీ.. తన ప్రకటనకు గాను అలీని సంప్రదించింది. ఆ యాడ్లో సంప్రదాయ వస్త్రధారణలో కనిపించారు అలీ. అయితే లక్ష్మీదేవి పూజ మాదిరిగా ఆ సబ్బును పెట్టి అలీ పూజిస్తుంటారు. అయితే ఈ ప్రకటనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అది లక్ష్మీదేవి పూజను విమర్శించినట్టేనని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. అయితే దాదాపు 1000 చిత్రాల్లో నటించిన సీనియారిటీ అలీ ది. ఇటువంటి విమర్శలు వస్తాయని ఆయన భావించలేదు. ఆ విమర్శలు రావడంతో వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగారు అలీ. ఎంత మాత్రం బేషజాలాలకు పోకుండా వెంటనే క్షమాపణలు చెప్పారు. సదరు బొంబాయి కంపెనీ తో మాట్లాడి ఆ ప్రకటనను నిలిపివేయించారు.

* సోషల్ మీడియా పుణ్యమా అని..
ప్రస్తుతం సమాజంలో మతవాదం పెరుగుతోంది అనడానికి ఈ ఘటన ఒక ఉదాహరణ. ప్రధానంగా హిందుత్వవాదం పెరిగింది. అయితే గతంలో మతాల మాటున స్వేచ్ఛ ఉండేది. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని మత రక్షకులు పెరుగుతున్నారు. మతాన్ని రక్షిస్తున్నామన్న స్థితిలో వ్యవహరిస్తున్నారు. తమ మతాన్ని తాము గొప్పగా చూసుకుంటున్న తరుణంలో.. కొన్ని రకాల పరిధిని దాటి వ్యవహరిస్తున్నారు. మనిషి దైనందిన జీవితంలో కూడా మతాన్ని ముడిపెట్టి స్వేచ్ఛను హరిస్తున్నారు. ఇది ఎంత మాత్రం సహేతుకం కాదు. అయితే అలీ నటించిన ప్రకటనపై అభ్యంతరాలు రావడంతో.. ఆయన క్షమాపణలు చెప్పి తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు.

పెద్ది మూవీ స్టోరీ తెలిసిపోయింది...శివ రాజ్ కుమార్ పాత్ర ఆ క్యారెక్టర్ ను పోలి ఉందిగా...

Ram Charan Peddi Collections
Ram Charan Peddi Collections

Peddi Film Story: మెగాస్టార్ తనయుడిగా తనకంటు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు రామ్ చరణ్…ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్ నిల్చోబెట్టాయి. ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలను తీసుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన పెద్ది సినిమా చేశాడు. ఈ సినిమా జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ముఖ్యంగా శివరాజ్ కుమార్ లాంటి నటుడు సైతం ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు… ఒక ఊరి కోసం జరిగే ఒక పోరాటంలో హీరో ఎలా తన ఊరుని గెలిపించాడు. తద్వారా తను ఎలా గెలిచాడు అనేది ఈ సినిమా స్టోరీగా తెలుస్తుంది. ఇక ఇందులో కుస్తీ ఫైట్ ఉంటుంది.

రామ్ చరణ్ కుస్తీ ఫైట్ చేసి పెద్ద పెద్ద పహిల్వాలను సైతం పడగొట్టే పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ఇందులో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నారు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా అటు కుస్తీ ఫైటర్ గా ఇటు క్రికెట్ ప్లేయర్ గా ఈ సినిమాతో తన సత్తా చాటడానికి సిద్ధమయ్యాడు. మొత్తానికైతే ఈ సినిమా అతనికి ది బెస్ట్ సినిమా గా నిలిచిపోతుందంటూ సినిమా యూనిట్ సైతం వాళ్ల ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇక శివ రాజ్ కుమార్ క్యారెక్టర్ ఈ సినిమాలో 15 నిమిషాల పాటు ఉంటుందట. ఆయన కనిపించినంత సేపు థియేటర్లో పూనకాలు వస్తాయంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా శివరాజ్ కుమార్ ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ అయితే సాధించడం లేదు.

కాబట్టి ఆయన ఇందులో కీలకపాత్రలో నటించాడు. కాబట్టి ఈ సినిమా సక్సెస్ ని సాధిస్తే ఆయనకు కూడా బుస్టాప్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి… మొత్తానికైతే పెద్ది సినిమాతో రామ్ చరణ్ ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తాడు తద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవుతుందా? లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…

పక్క రాష్ట్రంలో జగన్.. ఇట్టే చూపిస్తున్న సాక్షి!

YS Jagan Sakshi
YS Jagan Sakshi

YS Jagan Sakshi Media: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సాక్షి మీడియా లాభం కంటే నష్టం అధికమని ఎక్కువమంది వాదిస్తున్నారు. చివరకు ఆ మీడియాలో కనిపించే విశ్లేషకులు, జర్నలిస్టులు సైతం అదే మాట చెబుతున్నారు. సాక్షి మీడియాలో డిబేట్ అంటేనే ముందుగా గుర్తొచ్చేది కేఎస్ ప్రసాద్, పాషా అనే జర్నలిస్టులు. అయితే గత కొద్ది రోజులుగా ఆ ఇద్దరూ సాక్షి మీడియాలో కనిపించడం లేదు. పైగా సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ ఏర్పాటు చేసి పరస్పరం ఇంటర్వ్యూలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సాక్షి పైనే వారు సెటైర్లు వేస్తున్నారు.. కె ఎస్ ప్రసాద్ ఒక అడుగు ముందుకు వేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సాక్షి మీడియా మైనస్ అంటూ తేల్చేశారు. సాక్షి ఛానల్ ను తపాలా ఛానల్ తో పోల్చారు.

* నిత్యం ఆ వార్తల కవరేజ్..
అయితే విమర్శలను పక్కన పెడితే సాక్షి మీడియా వ్యవహార శైలి కూడా అలానే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి తాడేపల్లి కి వచ్చే క్రమంలో… గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగిన వెంటనే భారీ జన సమీకరణ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ మంది స్వాగతం పలుకుతారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. దానిని విస్తృతంగా కవర్ చేస్తూ ఉంటుంది సాక్షి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకు వెళ్లే క్రమంలో కూడా ఎయిర్పోర్టులో జనరద్దిని చూపిస్తూ ఉంటుంది సాక్షి. తద్వారా జగన్మోహన్ రెడ్డి ఏపీలో ఎక్కువగా ఉండడం లేదని.. పక్క రాష్ట్రంలో ఉంటున్నారని ప్రజలకు తెలియజేస్తోంది సాక్షి. ఒక్క జగన్మోహన్ రెడ్డి పర్యటనలే కాదు. చాలా విషయాల్లో సాక్షి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మైనస్. మొన్న మధ్యన ఉద్యోగ సంఘాల ఆందోళన క్రమంలో.. కేవలం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగ సంఘాల నేతల ఫోటోలతో అభిప్రాయాలను ప్రచురించారు సాక్షిలో. దీంతో మిగతా సామాజిక వర్గాలకు చెందిన ఉద్యోగ సంఘాల నేతలు చిన్న బుచ్చుకున్నారు.

* వారు హైదరాబాద్ వెళుతున్నా..
ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాదులో తమ నివాసాలకు వెళ్తుంటారు. కనీసం వారు ఎప్పుడు వెళ్తుంటారో తెలియదు. ఎప్పుడు వస్తుంటారో తెలియదు. వారి విషయంలో ఎటువంటి హైలెట్స్ ఉండవు. వచ్చి వెళ్లే క్రమంలో జన సమీకరణలు, ఆత్మీయ స్వాగత కార్యక్రమాలు ఏమీ ఉండవు. వారు హైదరాబాదులో ఉన్న అమరావతి పేరుతోనే మీడియాలో వార్తలు వస్తుంటాయి. అయితే దీని నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. నిత్యం జగన్మోహన్ రెడ్డిని చూపించే క్రమంలో అడ్డగోలుగా వ్యవహరించి అడ్డంగా బుక్ అవుతుంటోంది సాక్షి మీడియా.

యంగ్ హీరోయిన్ తో మౌని రాయ్ ప్రేమాయణం.. భర్తకు విడాకులు ఇవ్వడానికి కారణం అదేనా..

Mouni Roy Divorce
Mouni Roy Divorce

Mouni Roy Divorce: ప్రముఖ యంగ్ హీరోయిన్ మౌని రాయ్ తన భర్త సూరజ్ నంబియార్ తో విడాకులు తీసుకుందని గత కొద్దిరోజుల నుండి సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం పై మౌని రాయ్ స్పందిస్తూ ఇన్ స్టాగ్రామ్ లో కాసేపటి క్రితమే ఒక పోస్ట్ పెట్టింది. ఆమె మాట్లాడుతూ ‘గత కొద్దిరోజుల నుండి మీడియా మా వైవాహిక జీవితం పై చేస్తున్న వ్యాఖ్యలను గమనిస్తూనే ఉన్నాం. ఈ సందర్భంగా మేము మీకు ఒక ప్రకటన చెయ్యాలి అనుకుంటున్నాము. కొన్ని వ్యక్తి గత కారణాల వల్ల మేము విడిపోయిన విషయం వాస్తవమే. కానీ మా విడాకుల వ్యవహారం మా వ్యక్తిగతం , దీనిపై మీ పిచ్చి పిచ్చి అపోహలు , కథనాల అల్లికలు ఇక ఆపండి. మేమిద్దరం పరస్పర అంగీకారం తోనే విడాకులు తీసుకున్నాము మా దారులు వేరు, దయచేసి దీనిని మా ప్రైవసీ కి వదిలేయండి , దీనిపై చర్చలు ఇకనైనా ఆపండి’ అంటూ ఆమె రిక్వెస్ట్ చేసింది.

అయితే సోషల్ మీడియా లో రూమర్స్ ని వ్యాప్తి చేయడం ఆపండి అంటే ఆగుతారా?, లేదు కదా?, మౌని రాయ్ విషయం లో కూడా అదే జరిగింది. ఈమె చాలా కాలం నుండి ప్రముఖ యంగ్ హీరోయిన్ దిశా పటానీ తో లెస్బియన్ రిలేషన్ షిప్ లో ఉందని , ప్రస్తుతం వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్నారని , త్వరలోనే పెళ్లి చేసుకుంటారని అంటున్నారు నెటిజెన్స్. వాళ్లకు సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియా లో షేర్ చేశారు. అందులో వీళ్లిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం చూస్తుంటే నిజంగా వీళ్లిద్దరు లవ్ రిలేషన్ లో ఉన్నారేమో అని అనిపించక తప్పదు. ఎందుకంటే మౌని రాయ్ కొన్ని ఫోటోలలో దిశా పై ముద్దల వర్షం కురిపించింది.

వీటిని చూసి అందరూ వీళ్లిద్దరు లెస్బియన్ రిలేషన్ లో ఉందని అంటున్నారు. ఇందులో ఎంత మాత్రం నిజముందో తెలియదు కానీ , ఒకవేళ నిజమైన కూడా దాన్ని తప్పు పెట్టాల్సిన అవసరం లేదు. ఒకే లింగానికి చెందిన వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు అని చట్టాలు కూడా చెప్తున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది అనేది గుర్తించాలి. ఇక కెరీర్ పరంగా చూస్తే వీళ్లిద్దరు ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ రేంజ్ లోనే కొనసాగుతున్నారు. మౌని రాయ్ హీరోయిన్ రోల్స్ కంటే ఎక్కువగా విలన్ రోల్స్, క్యారెక్టర్ రోల్స్ మీదనే ద్రుష్టి చూపిస్తుంది. దిశా పటాని భారీ పాన్ ఇండియన్ మూవీస్ లో హీరోయిన్ గా నటిస్తూ యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.

టిడిపి క్యాడర్ కు అర్థమైంది..!

TDP Cadre Clarity
TDP Cadre Clarity

TDP Cadre Clarity: మొన్నటి ఎన్నికల్లో కూటమి కట్టి అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ. ఒకవైపు జనసేనతో.. మరోవైపు బిజెపితో కలిసి ప్రయాణం చేసింది. అధికారంలోకి రాగలిగింది. కానీ గౌరవం ఇచ్చిపుచ్చుకున్న క్రమంలో.. టిడిపి నుంచి ఆ రెండు పార్టీలకు తగినంతగా లభించడం లేదన్న విమర్శలు వచ్చాయి. గత రెండేళ్లుగా చాలా నియోజకవర్గాల్లో పరిస్థితి దారుణంగా ఉండేది. నాయకుల నుంచి క్యాడర్ వరకు అదే పరిస్థితి. అయితే దానిని తప్పు పట్టేవారు సీఎం చంద్రబాబు. కూటమిలోని మూడు పార్టీలు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించేవారు. జనసేనతో పాటు బిజెపిని గౌరవించాల్సిందేనని పార్టీ క్యాడర్కు తేల్చి చెప్పేవారు. మొన్ననే తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గాల ప్రమాణస్వీకారంలో సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. ఎవరికి ఇష్టం లేకున్నా జనసేనతో వెళ్లాల్సిందేనని తేల్చి చెప్పారు. కొందరు సీనియర్లకు వ్యక్తిగత అభిప్రాయం ఉండవచ్చు కానీ.. కూటమి విషయంలో మాత్రం ఆలోచన ఒకే మాదిరిగా ఉండాలంటూ కుండబద్దలు కొట్టారు. దీంతో టీడీపీ క్యాడర్ కు స్పష్టమైన అవగాహన వచ్చింది.

* చంద్రబాబు సీరియస్ యాక్షన్..
కూటమి క్రమశిక్షణ విషయంలో సైతం చంద్రబాబు సీరియస్ యాక్షన్ లోకి దిగారు. కూటమిలో విభేదాలకు కారణమవుతున్న పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ వర్మ పై వేటు వేశారు. పిఠాపురం వర్మ క్యాడర్ తో మమేకమై పనిచేసే నేత. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ గెలుపు కోసం కృషి చేశారు. కానీ ఫలితాలు వచ్చిన తర్వాత పదేపదే జనసేనతో గొడవలు పెట్టుకుంటున్నారు. ప్రోటోకాల్ అంటూ.. ఫోటోలు పెట్టడం లేదంటూ ఏవేవో సాకులు చూపుతున్నారు. ఆయన వైఖరిలో తేడా కనిపిస్తోంది. అలాగని బలమైన నాయకుడు. అలా రెండు సంవత్సరాల పాటు ఆయన చర్యలను గమనించారు చంద్రబాబు. రోజురోజుకు శృతిమిస్తుండడంతో ఆయనను ఇన్చార్జి పదవి నుంచి తొలగించారు. ఇది ఒక రకంగా షాకింగ్ పరిణామమే. కానీ ఈ ఒక్క ఘటనతో వర్మలా కూటమిలో విభేదించే నాయకులు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు.

* అతిపెద్ద పార్టీగా..
తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అతిపెద్ద ప్రాంతీయ పార్టీ. 30 నుంచి 40 శాతం ఓటు బ్యాంకు కలిగిన పార్టీ. సహజంగానే క్షేత్రస్థాయిలో అంత బలం లేకపోయే బిజెపి, జనసేన విషయంలో టిడిపికి భిన్న వైఖరి ఉంటుంది. అయితే కూటమి ద్వారా ముందుకు వెళితేనే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రారు. కేంద్రంలో బిజెపి సహకారం ఉంటేనే ఏపీలో కూటమి సవ్యంగా ముందుకు సాగుతుంది. అందుకే చంద్రబాబు సైతం బిజెపి కోసం తెలంగాణలోనే పార్టీని అలానే విడిచిపెట్టారు. కేవలం జగన్మోహన్ రెడ్డిని మరోసారి అధికారంలోకి రాకుండా చూసేందుకే టిడిపి నాయకత్వం ఆ ప్రయత్నాల్లో ఉంది. అయితే వరుసగా జరుగుతున్న పరిణామాలతో తెలుగుదేశం పార్టీ క్యాడర్ కు స్పష్టత వచ్చింది. ఈ విషయంలో పూర్తి అవగాహన రావడంతో ఇకనుంచి అసంతృప్త స్వరాలు పెద్దగా వినిపించవు.

ట్రంప్ సీటుకు ఎసరు పెట్టిన వైస్ ప్రెసిడెంట్ వాన్స్.. సీక్రెట్ లెటర్ లో ఏముందంటే..

US Vice President Vance
US Vice President Vance

US Vice President Vance: రెండోసారి అమెరికా అధ్యక్షుడు కావడానికి ట్రంప్ చాలా కష్టపడ్డారు. తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఒక దశలో అనేక రకాల కేసులు ఎదుర్కొన్నారు. జైలు శిక్ష (కొద్ది గంటలు మాత్రమే) కూడా అనుభవించాల్సి వచ్చింది. చివరికి ట్రంప్ అమెరికా ప్రజల మనసు లో చోటు సంపాదించగలిగాడు. రెండోసారి అధ్యక్షుడు కాగలిగాడు.

ట్రంప్ అమెరికాను గొప్పగా చేస్తానని ఎన్నికల ముందు ప్రజలకు మాట ఇచ్చాడు. ఆ మాటను నిలుపుపోవడంలో ట్రంప్ విఫలమవుతూనే ఉన్నాడు. అమెరికాకు అవసరం లేని యుద్ధంలో వేలు పెడుతున్నాడు. వైట్ హౌస్ కోటరీ ముందు తలవంచుతున్నాడు. దీంతో అమెరికా ఆర్థికంగా తీవ్రమైన వత్తిడి ఎదుర్కొంటున్నది. ట్రంప్ వ్యవహార శైలి వల్ల అమెరికా మీద ప్రపంచ దేశాలకు ఆగ్రహం పెరిగిపోతున్నది.

ట్రంప్ ఎన్ని రకాల నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికీ.. స్వదేశంలో ఆయన పరిపాలన పట్ల ప్రజలు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఆయన మారడం లేదు. అందువల్ల ఇటీవల ఆయన మీద హత్యాయత్నం జరిగింది. అంతకుముందు ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు ప్రచారం సమయంలో కూడా ట్రంప్ మీద గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఇలా వరుసగా హత్యాయత్నాలు ఎదుర్కోవడంతో ట్రంప్ కు సెక్యూరిటీ మరింత పెంచారు.

అమెరికా అధ్యక్షుడు కాబట్టి ట్రంప్ విదేశీ పర్యటనలకు వెళ్తూనే ఉంటారు. ట్రంప్ మీద హత్యాయత్నాలు జరిగిన నేపథ్యంలో వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ కు అమెరికా అధ్యక్షుడు రాసిన లెటర్ ఇప్పుడు సంచలనంగా మారింది. విదేశీ పర్యటనలకు వెళ్లిన ప్రతిసారి ట్రంప్ ఒక సీక్రెట్ లెటర్ రాస్తాడు. అందులో ఉన్న అంశాలను అమలులో పెట్టాలని వాన్స్ కు సూచిస్తాడు.. విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు తనకు ఏమైనా జరిగితే.. దేశాన్ని పరిపాలించడానికి అవసరమైన సూచనలు ఆ సీక్రెట్ లెటర్లో ఉంటాయి. అంతేకాదు ఎమర్జెన్సీ టైంలో ఎల్లప్పుడూ ప్రోటోకాల్స్ అమల్లో ఉంటాయి. ఈ విషయాన్ని వైట్ హౌస్ అధికారి సెబాస్టియన్ బయటపెట్టారు..

టెన్త్ లో బిడ్డకు 55 శాతం మార్కులు.. ఈ తల్లిదండ్రులు ఏం చేశారంటే..

Passing Celebration
Passing Celebration

Passing Celebration: ఏం చేస్తావో తెలియదు. ఎలా చదువుతావో తెలియదు. పదిమంది మన పరువు పోకూడదు. ఎదురింటి వెంకటలక్ష్మి కొడుకు కంటే.. పక్కింటి సుబ్బారావు అబ్బాయి కంటే.. వెనకాల ఉన్న అబ్బాయి కంటే.. మార్కులు ఎక్కువ రావాలి. ఫస్ట్ ర్యాంక్ రావాలి. అవసరమైతే రాత్రిపూట ఎక్కువసేపు చదువు. ఉదయం కూడా వెంటనే లేచి చదువు. ఇదిగో ఇలా ఉంటాయి సగటు తల్లిదండ్రుల ఆలోచనలు.. పిల్లల మీద తమ ఆకాంక్షలు.

పిల్లల మీద ఈ స్థాయిలో ఒత్తిడి పెట్టడంతో వారు తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు. కేవలం మార్కులు సాధించే యంత్రాలుగానే తమను చూస్తుంటారని బాధ పడిపోతుంటారు. కొన్ని సందర్భాలలో ఒత్తిడి తట్టుకోలేక కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఆ సమయంలో పిల్లలు తీసుకున్న ఆ నిర్ణయాలు తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగులుచుతూ ఉంటాయి. ఫలితాల సమయంలో అనుకున్న మార్కులు రాకపోతే విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడతారు. తమలోపామే కుమిలిపోతారు. దీనికి తల్లిదండ్రుల ఒత్తిడి తోడు కావడంతో విద్యార్థులు మరింత ఇబ్బంది పడతారు.

సమాజం మార్కుల చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో.. ఈ తల్లిదండ్రులు మాత్రం భిన్నంగా కనిపిస్తున్నారు. మహారాష్ట్ర చెందిన వీరు.. తమ పిల్లల విషయంలో కొత్త వొరవడి సృష్టించారు. 10 ఫలితాలలో తమ కొడుకుకు 55% మార్కులు రావడంతో కేక్ కట్ చేశారు. బంధువులను పిలిచి వేడుకలు జరిపారు. తమ కొడుకు సాధించిన మార్కులు గర్వకారణమని తల్లిదండ్రులు చెబుతున్నారు. తమ కొడుకులో పట్టుదల చూశామని.. పాస్ కావాలి అని అతడి తపన తమను కదిలించిందని.. అందువల్లే అతడు ఉత్తీర్ణత సాధించిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ స్థాయిలో వేడుకలు జరుగుతున్నట్టు ఆ తల్లిదండ్రులు చెప్పారు.

విద్యార్థిచేత కేక్ కట్ చేసి.. బంధువులను పిలిచి ఆ కుటుంబం వేడుక జరిపింది. ఇది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా తిరుగుతోంది. ఇప్పటికే 16 మిలియన్ల మంది ఈ వీడియోని వీక్షించారు. ఇంకా వీక్షించేవారు పెరిగిపోతున్నారు. పిల్లల మీద ఒత్తిడి పెంచకూడదు. వారిని ఇబ్బంది పెట్టకూడదు. మార్కులు సాధించే యంత్రాలుగా చూడకూడదు. ఈ విధానాలను ఆ తల్లిదండ్రులు పాటించారు కాబట్టే.. వారి కుమారుడు పాస్ అయ్యాడు. అదే కాదు ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. దీనంతటికీ కారణం ఆ తల్లిదండ్రులే.

పెళ్లిళ్లలో చీరలు మాయం.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. తెలిసింది ఇదీ

Wedding Saree Theft
Wedding Saree Theft

Wedding Saree Theft:  ఒక్కో చీర ఖరీదు వేలల్లో ఉంటుంది. ఆ చీరలు మొత్తం పట్టువే. పైగా వేరే వేరే ప్రాంతాల నుంచి అత్యంత ప్రయాసపడి ఆ చీరలను ఆ మహిళలు కొనుగోలు చేశారు. బంధువుల ఇంట్లో పెళ్లి ఉండడంతో ఆ చీరలను కట్టుకుందామని పట్టుకొచ్చారు. కానీ వారి ఆనందం అనతి కాలంలోనే ఆవిరి అయిపోయింది. ఎంతో ముచ్చటపడి తెచ్చుకున్న పట్టుచీరలు కనిపించకుండా పోయాయి. దీంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫలితంగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని దుగ్గొండి మండలం గిర్నిబావి ప్రాంతంలో ఒక ఫంక్షన్ హాల్ ఉంది. ఇటీవల ఏడు, 9 తేదీలలో ఈ ఫంక్షన్ హాల్ లో పెళ్లిళ్లు జరిగాయి. వాటికి హాజరుకావడానికి చాలామంది వచ్చారు. అందులో కొంతమంది మహిళలు ఇంటి దగ్గర నుంచి అత్యంత ఖరీదైన పట్టు చీరలు తీసుకొచ్చారు. ఫంక్షన్ హాల్ లో డ్రెస్సింగ్ రూమ్ లో మార్చుకుందామని అనుకున్నారు. ఈ క్రమం లోనే డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిన ఆడవాళ్లకు వింత అనుభవం ఎదురయింది. వారు తెచ్చుకున్న పట్టు చీరలు మాయం కావడంతో వారిలో ఆందోళన మొదలైంది. ఈ విషయాన్ని తమ భర్తలకు చెప్పారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వారు చెప్పిన వివరాలను నమోదు చేసుకున్న పోలీసులు ఆ ఫంక్షన్ హాల్ మీద దృష్టి పెట్టారు. ఈనెల 12న ఒక వివాహ వేడుకకు కొంతమంది వచ్చారు. వారి ప్రవర్తన ఏమాత్రం బాగోలేదు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ మొదలుపెడితే అసలు విషయం వెలుగులోకి వచ్చింది.. ఆ చీరలను మాయం చేసింది వీరేనట. పైగా వాటిని వేరే ప్రాంతాలలో విక్రయించేందుకు సిద్ధమయ్యారట. ఈలోగా పోలీసులు అకస్మాత్తుగా ఎంట్రీ ఇవ్వడంతో ఆ దొంగల ఆగడాలు చెల్లుబాటు కాలేదు. పోలీసులు ఆ దొంగల ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు. వారి వద్ద నుంచి కొన్ని రకాల చీరలు.. ఇంకా ఒక సంచిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ తరహాలో చీరల దొంగతనం జరగడం ఇదే తొలిసారి అని ఇక్కడ ప్రజలు చెబుతున్నారు. మహిళలు చీరలను సెంటిమెంట్ గా భావిస్తారు. పైగా వాటికోసం భారీగా డబ్బు ఖర్చు పెడతారు. వివాహ వేడుకల సమయంలో ఖరీదైన చీరలు ధరించి ప్రత్యేకంగా కనిపించాలని ఆడవాళ్లు అనుకుంటారు. కానీ వారి ఆశల మీద ఈ దొంగలు నీళ్లు చల్లారు.

మోదీ పొదుపు మంత్రం.. దేశంలో పెట్రోల్‌ వినియోగంలో గోవా టాప్‌.. బిహార్‌ లాస్ట్‌!

Petrol Price Hike In India
Petrol Price Hike In India

Goa Highest Petrol Usage: అంతర్జాతీయి చమురు సంక్షోభం నేపథ్యంలో ఇంధన ధరల పెరుగుతున్నాయి. పీపీఏసీ 2024–25 డేటాను పరిశీలిస్తే మన దేశంలో ప్రతి 100 మందికి రోజుకు సగటున 10.4 లీటర్ల పెట్రోల్‌ వినియోగం జరుగుతోంది. గతేడాది లీటర్లుగా ఉండేది. కార్ల సంఖ్య పెరగడంతో వినయోగం పెరిగింది. అయితే రాష్ట్రాల మధ్య భారీ వ్యత్యాసం ఆర్థిక అసమానతలు ఉన్నాయి.

రాష్ట్రాల ర్యాంకింగ్‌…
పెట్రోల్‌ వినియోగంలో గోవా మొదటి స్థనంలో ఉంది. ఇక్కడ సగటున వారానికి ఒకరు 52 లీటర్ల పెట్రోల్‌ వినియోగిస్తాడు. ఇక్కడ 70 శాతం ఇంధన డిమాండ్‌ ఉంది.
æ.తర్వాత మరో మూడు రాష్ట్రాలు వరుసగా పుదుచ్చేరి, చండీగఢ్‌ 41 లీటర్లు, లద్దాక్‌ 37 లీటర్లు, అరుణాచల్‌ ప్రదేశ్‌ 27 లీటర్లు ఉన్నాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌ (21 లీటర్లు వినియోగిస్తుంది. తెలంగాణ 17 లీటర్లతక్ష 10వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌ 11లీటర్ల వినియోగంతో 22వ రాష్ట్రంగా నిలిచింది.

ఆర్థిక,సామాజిక ప్రభావం..
చిన్న రాష్ట్రాల్లో టూరిజం, ప్రైవేట్‌ వెహికల్స్‌ (పెట్రోల్‌ కార్లు 80 శాతం) వల్ల వినియోగం ఎక్కువ. తెలంగాణ–ఆంధ్రల్లో మిక్స్‌డ్‌ ఎకానమీ (2–వీలర్లు 70 శాత, పబ్లిక్‌ ట్రాన్స్‌ 20 శాతం) మధ్యస్థ స్థాయి. బిహార్‌ వంటివి గ్రామీణ ప్రాంతాలు, సైకిల్‌/బైక్‌ ఆధారిత రవాణా (పెట్రోల్‌ కార్లు 5 శాతం)తో తక్కువ. మొత్తం దేశ వినియోగం 3.5 కోట్ల లీటర్లు. ఆర్థిక, పర్యావరణ, పాలసీ ఒత్తిడి.. భారీగా పెట్రోలియం వినియోగంతో రూ.1.5 లక్షల కోట్ల చెల్లించాల్సి వస్తోంది.

కాలుష్య రహితంగా..
కాలుష్యం తగ్గించేందుకు పెట్రోల్‌లో 25 శాతం ఇథనాల్‌ కలపాలని కేంద్రం నిర్ణయించింది. హై–కన్సూ్యమ్‌ రాష్ట్రాల్లో ఎయిర్‌ పొల్యూషన్‌ 30 శాతం ఎక్కువ. ధనిక రాష్ట్రాల్లో కార్‌ కల్చర్, పబ్లిక్‌ ట్రాన్స్‌ ఆధారం ఇది రీజనల్‌ డివైడ్‌ను పెంచుతోంది.

ఒక వ్యక్తి సగటున వారానికి 10.4 లీటర్లు ఒక హెచ్చరికే. ఇంధన భద్రత, పర్యావరణ లక్ష్యాల దృష్ట్యా వినియోగం తగ్గించాలి. ప్రాంతీయ సమతుల్యతకు డ్రైవర్‌. ప్రభుత్వాలు రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని సాగితే మనదేశం ఎనర్జీ–స్మార్ట్‌ నేషన్‌గా మారుతుంది.

అన్నట్టే మోడీ సర్ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేశారు.. ఇక వాతలు షురూ

Petrol Price Hike
Petrol Price Hike

Petrol Price Hike: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలు పూర్తి అయిన తర్వాత.. తమిళనాడు మినహా మిగతా ప్రాంతాలలో ఫలితాలు అనుకూలంగా వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ ఆరోపించినట్టుగానే చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. తీసుకున్న నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని ప్రకటించారు.

కొద్ది రోజులుగా దేశంలో డీజిల్, పెట్రోల్ ధరల పెంపు కు సంబంధించి కేంద్రం ప్రజలకు పరోక్షంగా సంకేతాలు ఇస్తోంది. వాటిని శుక్రవారం అమలులో పెట్టి చూపించింది. పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం పెంచేసింది. లీటర్ కు మూడు రూపాయలు చొప్పున ఆయిల్ కంపెనీలు ధరలు పెంచేశాయి. శుక్రవారం ఉదయం నుంచి ఈ ధరలు అమలులోకి వస్తాయని ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. తాజా పెరుగుదల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో డీజిల్ లీటర్ ధర 98.96 రూపాయలకు చేరుకుంది. పెట్రోల్ ధర 110.89 రూపాయలకు చేరుకొంది. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో వాతావరణం సద్దుమణగకపోవడం.. అమెరికా హెచ్చరికలు.. ఇరాన్ ప్రతి హెచ్చరికలతో అక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా పోతుంది. దీంతో ప్రపంచ దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. డీజిల్, పెట్రోల్ ధరలను పెంచేశాయి. ఇప్పటివరకు భారత్ ధరలు పెంచలేదు.. ఇప్పటికి పెంచక తప్పలేదు. ఎందుకంటే ఆయిల్ కంపెనీలకు భారీగా నష్టం వస్తున్న నేపథ్యంలో.. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చాయి. దీంతో ప్రభుత్వం ధరలు పెంచేసేది.

ధరల పెంపు కంటే ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పొదుపు మంత్రాలు పాటించాలని సూచించారు. ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయొద్దని సూచించారు. ఎరువుల వాడకం తగ్గించాలని రైతులకు హితవు పలికారు. విదేశీ ప్రయాణాలు మానుకోవాలని.. డెస్టినేషన్ వెడ్డింగ్ లు సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలని సూచించారు. ఆ తర్వాత నరేంద్ర మోడీ తన కాన్వాయ్ లో వాహనాల సంఖ్యను తగ్గించుకున్నారు. దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులు, మంత్రులు కాన్వాయ్ లో వాహనాల సంఖ్యను తగ్గించుకున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను పెంచాలని సూచించారు.

డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిత్యవసరల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ధరల స్థాయి పెరుగుతున్న నేపథ్యంలో.. మార్కెట్లో సామాన్యుడి బడ్జెట్ లెక్కలు తారు మారవుతున్నాయి. ఇప్పుడు ఇంధనం ధరలు పెరిగిన నేపథ్యంలో ఇంకా పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. యుద్ధం తగ్గితే తప్ప దేశంలో మునుపటి పరిస్థితి రాదని విశ్లేషకులు అంటున్నారు.

ఒకరికి ఎమ్మెల్యే.. మరొకరికి ఎమ్మెల్సీ.. జగన్ ఆలోచన అదే

YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: వచ్చే ఎన్నికలను జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆ ఎన్నికలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చావో రేవో లాంటివి. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఎన్నికల్లో గెలవాల్సిందే. లేకుంటే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. అందుకే ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలని చూస్తున్నారు. పైగా ఒకరు అభ్యర్థి అయితే మరో బలమైన నేతను ఆ నియోజకవర్గంలో రెడీ చేస్తున్నారు. ఒకరు ఎమ్మెల్యేగా గెలిస్తే మరొకరికి ఎమ్మెల్సీ వంటి నామినేటెడ్ పదవి ఇస్తామని చెబుతున్నారు. తాజాగా రేపల్లె నియోజకవర్గం లో అదే జరిగింది. నియోజకవర్గ ఇన్చార్జిగా మోహన్ అనే నేత ఉన్నారు. ఆయనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. మోపిదేవి శ్రీనివాసరావుకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఆఫర్ చేశారు. మోహన్ ను గెలిపించే బాధ్యత శ్రీనివాసరావుకు అప్పగించారు. రేపల్లెలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది లేదు. అందుకే అక్కడ ఒకరిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి.. మరొకరికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి.

* ప్రయోగాలన్నీ విఫలం..
మొన్నటి ఎన్నికల్లో చాలా రకాల ప్రయోగాలు చేశారు జగన్మోహన్ రెడ్డి. దాదాపు 80 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చారు. ప్రభుత్వం కంటే ఎమ్మెల్యేలపై వ్యతిరేకత అధికంగా ఉందని భావించి ఈ ప్రయోగం చేశారు. అయితే ప్రజా వ్యతిరేకత ఎమ్మెల్యే అభ్యర్థులపై కాదు అని.. అదంతా ప్రభుత్వం పైనేనని ఆ ఫలితాల్లో తేలింది. మరోవైపు చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్యం ఉండేది. ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఒకరు ఆశిస్తే జగన్మోహన్ రెడ్డి ఇంకొకరికి అప్పగించారు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే టికెట్ను ఇద్దరు ముగ్గురు ఆశించేవారు. అందులో ఒకరికి దక్కితే మిగతా ఇద్దరూ వ్యతిరేకించారు. అలా చాలా జిల్లాల్లో…చాలా నియోజకవర్గాల్లో టికెట్ల కోసం పోటీపడే క్రమంలో ఓటమి చవిచూసిన వారు ఉన్నారు.

* పక్కనే మరో నేత రెడీ
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో ఒకే ఫార్ములాతో ముందుకు వెళ్లాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడున్న నేతల్లో బలమైన వారికి అక్కడ సీటు కేటాయిస్తారు. ఒకవేళ ఇతర పార్టీల్లో చేరిన వారు బలమైన నేతలు అయితే వారికి ఛాన్స్ ఇస్తారు. అయితే మరో నేతను అక్కడ సిద్ధం చేస్తున్నారు. ఒకరు ఎమ్మెల్యే అభ్యర్థిగా.. మరొకరు అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ తో పాటు నామినేటెడ్ పదవి హామీ ఇస్తున్నారు. కనీసం ఎమ్మెల్సీ పదవి కోసమైనా ఆయన కష్టపడి పనిచేసే ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపిస్తారు అనేది జగన్మోహన్ రెడ్డి అంచనా. అయితే గతంలో ఎమ్మెల్యే అభ్యర్థులను అప్పటికే వైసీపీ ఎమ్మెల్సీలుగా ఉన్నవారే ఓడించారు. వారు తాము ఎమ్మెల్సీలు గా ఉండడం కంటే.. అన్ని రకాల అధికారాలు ఉండే ఎమ్మెల్యే పదవిని ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే తీవ్రస్థాయిలో విభేదించి ఓడించుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపిస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని జగన్మోహన్ రెడ్డి ఓపెన్ గానే చెబుతుండడం గమనార్హం. అయితే ఈ ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.