Homeఎంటర్టైన్మెంట్Akkineni Venkat and Teja relationship: అక్కినేని వెంకట్ కి డైరెక్టర్ తేజ ఏమవుతాడు..తేజ పెళ్లి...

Akkineni Venkat and Teja relationship: అక్కినేని వెంకట్ కి డైరెక్టర్ తేజ ఏమవుతాడు..తేజ పెళ్లి వెంకట్ చేయడానికి కారణమేంటంటే..?

Akkineni Venkat and Teja relationship: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ లను సాధించిన దర్శకులకు మాత్రమే గొప్ప గుర్తింపు ఉంటుంది. ఎవరైనా ఒక సక్సెస్ ని సాధిస్తే చాలు ఇండస్ట్రీ వాళ్లను నెత్తినెక్కించుకుంటుంది. వాళ్ళతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు సైతం పోటీ పడుతుంటారు. ఇక అదే దర్శకుడు ఒక ఫ్లాప్ సినిమా తీస్తే మాత్రం ఇచ్చిన అడ్వాన్స్ లను సైతం ప్రొడ్యూసర్లు వెనక్కి తీసుకుంటారు. అలాంటి ఒక డేంజర్ జోన్ లో ఉన్న దర్శకులు, నటులు […]

Akkineni Venkat and Teja relationship: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ లను సాధించిన దర్శకులకు మాత్రమే గొప్ప గుర్తింపు ఉంటుంది. ఎవరైనా ఒక సక్సెస్ ని సాధిస్తే చాలు ఇండస్ట్రీ వాళ్లను నెత్తినెక్కించుకుంటుంది. వాళ్ళతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు సైతం పోటీ పడుతుంటారు. ఇక అదే దర్శకుడు ఒక ఫ్లాప్ సినిమా తీస్తే మాత్రం ఇచ్చిన అడ్వాన్స్ లను సైతం ప్రొడ్యూసర్లు వెనక్కి తీసుకుంటారు. అలాంటి ఒక డేంజర్ జోన్ లో ఉన్న దర్శకులు, నటులు ఎప్పటికప్పుడు వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. లేకపోతే మాత్రం వాళ్ళు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు అంటూ చాలామంది హెచ్చరిస్తున్నారు. ఇక ఇప్పటివరకు జరిగింది ఒకెత్తయితే ఇప్పటినుంచి సినిమా ఇండస్ట్రీ మొత్తం మారిపోతుంది. పాన్ ఇండియాలో సక్సెస్ లను సాధించే వారికి మాత్రమే ఇక్కడ క్రేజ్ దక్కుతుంది. చిత్రం, నువ్వు నేను, జయం లాంటి వరుసగా మూడు సక్సెస్ లతో ఇండస్ట్రీలో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన దర్శకుడు తేజ… ఆయన నుంచి వచ్చిన సినిమాలు అప్పట్లో భారీ విజయాలను దక్కించుకున్నాయి. కానీ ఈ మధ్యకాలంలో ఆయన అనుకున్న సక్సెస్ ని అందుకోలేకపోతున్నాడు. ఆయన చేసిన సినిమాలు చేసినట్టుగా ఫ్లాప్ అవుతున్నాయి. దీనికి కారణం ఏంటి అంటూ కొంతమంది ప్రేక్షకులు కూడా వాళ్ల అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి తేజ ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ కూడా చిన్న హీరోలతో చేసినవే కావడం విశేషం…తను స్టార్ హీరోలతో సినిమా చేయనని గతంలో చాలా సందర్భాల్లో తెలియజేశారు… కారణం ఏంటంటే ఆయనకు స్టార్ హీరోలను హ్యాండిల్ చేయడం రాదని చెబుతూ ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే నాగార్జునాతో రాంగోపాల్ వర్మ చేసిన శివ సినిమాకి తేజ అసిస్టెంట్ కెమెరామెన్ గా పనిచేస్తూనే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో కూడా హెల్ప్ చేశాడు. అక్కినేని వెంకట్, నాగార్జున లకు చాలా బాగా క్లోజ్ అయిపోయాడు.

దాంతో తేజ పెళ్లి చేసుకునే సమయంలో అతని దగ్గర డబ్బులు లేకపోయిన కూడా అక్కినేని వెంకట్ అతని భార్య జ్యోత్స్న ఇద్దరు కలిసి అతనికి పెళ్లి చేశారట. అప్పుడు తను ఉండడానికి ఒక ఇల్లు కూడా లేదట. పెళ్లికి ముందు ఆయన అన్నపూర్ణ స్టూడియోలోని ఒక కాటేజ్ లో ఉండేవాడినని చెప్పాడు.

అయితే అక్కినేని జ్యోత్స్న మాత్రం పెళ్లికి ముందు ఒక ఇల్లు తీసుకోమని చెప్పింది. దాంతో పెళ్లికి 15 రోజులు ముందే ఒక అద్దె ఇల్లు తీసుకున్నాడు. పెళ్లికి ఒక వారం ముందు ఒక కారు కొనుక్కున్నాడు. మొత్తానికైతే పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలు చేసి దర్శకుడిగా స్టార్ స్టేటస్ ని అందుకున్నాడు…

అక్కినేని వెంకట్ జ్యోత్స్న అతనికి ఎందుకు పెళ్లి చేశారు అంటు మీడియాలో చాలా సంవత్సరాల పాటు అక్కినేని వాళ్లతోనే అతను కలిసిపోయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండిపోయాడు. అందువల్లే వాళ్లే పెండ్లి పెద్దలుగా వ్యవహరించి పెళ్లి చేశారంటూ అతను పలు సందర్భాల్లో తెలియజేశాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper