Home Blog Page 250

మోటోరోలా నుంచి సరికొత్త ఫోన్ మార్కెట్లోకి.. ఇది ఎవరికీ ఉపయోగమంటే..

Motorola Razr Fold new smartphone
Motorola Razr Fold new smartphone

Motorola Razr Fold new smartphone: Motorola తన సరికొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ Motorola Razr Foldను మే 20, 2026 భారత మార్కెట్లోకి అధికారికంగా విడుదల చేసింది. అత్యంత శక్తివంతమైన Snapdragon 8 Gen 5ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ఫోన్, ఫోల్డబుల్ ఫోన్ల విభాగంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. 3nm ఆర్కిటెక్చర్‌తో రూపొందిన ఈ చిప్‌సెట్ Android 16 ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా వినియోగదారులకు మునుపెన్నడూ లేని విధంగా వేగవంతమైన, స్మార్ట్ AI అనుభూతిని అందిస్తోంది. ఈ ఫోన్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

Motorola Razr Fold ఫోన్ రెండు అద్భుతమైన డిస్‌ప్లేలతో వస్తోంది. బయట వైపు 6.6 అంగుళాల ఎక్స్‌ట్రీమ్ AMOLED స్క్రీన్ ఉండగా.., లోపల 8.1అంగుళాల 2K భారీ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 6200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉండి, ఎండలో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. విమాన తయారీలో వాడే గ్రేడ్ స్టీల్ హింజ్ మరియు టైటానియం రీఇన్‌ఫోర్స్‌మెంట్ వల్ల ఈ ఫోన్ చాలా దృఢంగా ఉంటుంది.

ఈ మొబైల్ లో అత్యుత్తమ ఫోల్డబుల్ కెమెరా సిస్టమ్ ను చూడొచ్చు.50MP సోనీ LYTIA 828 సెన్సార్ కలిగిన ప్రైమరీ కెమెరా, 50MP టెలిఫోటో పెరిస్కోప్ లెన్స్ తో పనిచేస్తుంది. 8K వీడియో రికార్డింగ్‌ సపోర్ట్ కూడా ఉండడంతో ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వారితోపాటు సోషల్ మీడియా కంటెంట్ సృష్టించే వారికి ఈ ఫోన్ బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో బలమైన బ్యాటరీ వ్యవస్థను కూడా చూడొచ్చు. ఇప్పటివరకు మార్కెట్లోకి వచ్చిన ఫోల్డబుల్ ఫోన్లలో లేని అతిపెద్దదైన 6000mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీని ఇచ్చారు. దీనికి 80W టర్బో ఛార్జింగ్ , 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం ఉంది.

భారత్‌లో ఈ ఫోన్ ధరలు కింది విధంగా ఉన్నాయి: 12GB + 256GB వేరియంట్ కలిగిన మొబైల్ ధర రూ. 1,49,999 గా ఉంది.16GB + 512GB మోడల్ ను రూ.1,59,999 తో విక్రయిస్తున్నారు.ఈ మొబైల్ కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లు కూడా ప్రకటించారు. బ్యాంక్ డిస్కౌంట్లతో ప్రారంభ ధర రూ.1,39,999 కే లభిస్తుంది. అంతేకాకుండా, జూన్ 20 లోపు కొనుగోలు చేసే వారికి ఒకసారి ఉచితంగా స్క్రీన్ రీప్లేస్‌మెంట్(విలువ ₹57,000) చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో అందుబాటులో ఉంది. గేమింగ్ కోసం లేదా మంచి కెమెరా కోసం ఫోన్ కొనాలని అనుకునే వారికి ఇది బెస్ట్ ఎంపిక అని అంటున్నారు.

'గ్రామ కంఠం' భూములు అంటే ఏమిటి.. వీటిని అమ్ముకోవచ్చా..

What are Gramakantam lands
What are Gramakantam lands

What are Gramakantam lands: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామకంఠం భూముల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు గ్రామాల్లో ప్రజలు నివాసం కోసం ఉపయోగిస్తున్న గ్రామకంఠం స్థలాలను కేవలం వారసత్వ హక్కులతో మాత్రమే అనుభవించేవారు. కానీ తాజాగా ప్రభుత్వం ఈ భూములకు రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పించే దిశగా ముందడుగు వేస్తోంది. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో లక్షలాది కుటుంబాలకు ఆస్తిపై చట్టబద్ధ హక్కులు లభించే అవకాశం కనిపిస్తోంది.

‘గ్రామకంఠం’ అనేది గ్రామాల్లో నివాస అవసరాల కోసం కేటాయించిన ప్రభుత్వ భూమి. బ్రిటిష్ పాలన కాలంలో వ్యవసాయ భూములు, నివాస స్థలాలను వేరు చేయడానికి ఈ విధానం అమల్లోకి వచ్చింది. గ్రామ ప్రజలు ఇళ్ల నిర్మాణం కోసం ఉపయోగించే భూములను గ్రామకంఠం పరిధిలో చేర్చేవారు. ఇవి ప్రభుత్వ రికార్డుల్లో ప్రత్యేకంగా నమోదు చేయబడి ఉండేవి.

ఇప్పటి వరకు గ్రామకంఠం భూములపై నివసించే వారికి పూర్తి యాజమాన్య హక్కులు ఉండేవి కావు. కుటుంబ వారసత్వంగా ఆ భూమిని ఉపయోగించుకోవచ్చు. కానీ అమ్మడం, బదిలీ చేయడం, బ్యాంకుల్లో తనఖా పెట్టడం వంటి హక్కులు ఉండేవి కాదు. దీంతో చాలా మంది తమ ఇళ్ల స్థలాలకు చట్టబద్ధమైన పత్రాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రభుత్వం తీసుకొచ్చిన తాజా నిర్ణయంతో గ్రామకంఠం స్థలాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. రిజిస్ట్రేషన్ పూర్తయితే ఆ స్థలంపై పూర్తి హక్కులు లభిస్తాయి. భూమిని అమ్ముకోవడం, కుటుంబ సభ్యులకు బదిలీ చేయడం, బ్యాంకు రుణాల కోసం ఉపయోగించడం వంటి అవకాశాలు తెరుచుకోనున్నాయి. గ్రామీణ ఆస్తులకు మార్కెట్ విలువ కూడా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఈ నిర్ణయం వల్ల గ్రామాల్లో చాలా కాలంగా కొనసాగుతున్న భూ వివాదాలకు కూడా కొంతవరకు పరిష్కారం దొరికే అవకాశం ఉంది. పాతకాలం నుంచి నివసిస్తున్నా సరైన డాక్యుమెంట్లు లేక ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు ఇది ఊరటనివ్వనుంది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు తమ ఇల్లు, స్థలం పై భద్రతాభావం పెరుగుతుంది.

అయితే ఈ ప్రక్రియలో కొన్ని నిబంధనలు ఉండే అవకాశం ఉంది. భూమిపై నివాసం నిజంగా కొనసాగుతుందా? ఎన్ని సంవత్సరాలుగా ఆక్రమణలో ఉంది? ప్రభుత్వ రికార్డుల్లో ఎలా నమోదైంది? వంటి అంశాలను అధికారులు పరిశీలించే అవకాశం ఉంది. అర్హులైన వారికే రిజిస్ట్రేషన్ హక్కులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ నిర్ణయం గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపవచ్చు. గ్రామాల్లో స్థిరాస్తుల కొనుగోలు, అమ్మకాలు పెరగడంతో పాటు బ్యాంకు రుణాల ప్రవాహం కూడా పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో భూముల ధరలు పెరిగే అవకాశముండటంతో భవిష్యత్తులో గ్రామీణ రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మోడీ, షా కు చికెన్ నెక్ మీద ఎందుకంత ఆసక్తి.. ఇప్పుడేం జరుగుతోంది

Chicken neck corridor strategic
Chicken neck corridor strategic

Chicken neck corridor strategic: బెంగాల్ రాష్ట్రంలో మమతా బెనర్జీ అధికారంలోకి రాలేదు. 15 సంవత్సరాల పరిపాలించిన ఆమెను బెంగాల్ ప్రజలు తరిమి తరిమి కొట్టారు. చివరికి ఆమె పోటీ చేసిన భవానిపూర్లో ఓడించారు. బిజెపికి పట్టం కట్టారు. దీంతో బెంగాల్ రాష్ట్రంలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.

దేశ భద్రతకు సంబంధించి కీలక నిర్ణయాలు వెంట వెంటనే అమలవుతున్నాయి. బెంగాల్ రాష్ట్రంలో అత్యంత కీలకమైన చికెన్ నెక్ రహదారి మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రధానంగా దృష్టి సారించారు. దృష్టి సారించడం మాత్రమే కాదు.. ఆ రోడ్డులో కనివిని ఎరుగని స్థాయిలో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ప్రభుత్వం 120 ఎకరాల భూమిని అప్పగించడమే ఆలస్యం.. పనులు మొదలైపోయాయి. దీంతో నాలుగు దేశాల్లో గుబులు మొదలైంది. చైనా ఇప్పటికే అక్కడ ఏం జరుగుతుందో చూస్తోంది. భూటాన్ జాగ్రత్తగా ఉంటోంది. బంగ్లాదేశ్ ఎప్పటికప్పుడు సమాజాన్ని సేకరిస్తుంది. నేపాల్ తన జాగ్రత్తలో తను ఉంటోంది. నిజానికి 22 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ రోడ్డు ఎందుకు అంత ప్రత్యేకం.. ఏకంగా నాలుగు దేశాలు ఎందుకు అలా అప్రమత్తమయ్యాయి.. ఈ ప్రశ్నల వెనక పెద్ద స్టోరీ ఉంది..

మనదేశంలో ఏడు ఈశాన్య రాష్ట్రాలను కలపడానికి అత్యంత ప్రధానమైన మార్గం చికెన్ నెక్ రహదారి. ఇది కేవలం ఒక రోడ్డు మాత్రమే కాదు.. మన దేశ అంతర్గత భద్రతకు సంబంధించింది.. ఈ రోడ్డు కనక అభివృద్ధి చెందకపోతే.. దీని మీద కేంద్ర బలగాల పెత్తనం లేకపోతే.. దేశం మొత్తం నాశనం అవుతుంది. యుద్ధం లాంటి పరిణామాలు చోటు చేసుకుంటే.. ఈశాన్య రాష్ట్రాలు మన దేశంతో కనెక్టివిటీని కోల్పోతాయి. అందువల్లే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ రోడ్డును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.. చైనా ఇప్పటికే టిబెట్ ప్రాంతంలోని చుంబి వ్యాలీ వద్ద సైనికులను మోహరించింది. నేపాల్ కూడా చైనా గుప్పెట్లో చిక్కుకుంది. బంగ్లాదేశ్ చుట్టు అమెరికా, చైనా, పాకిస్తాన్ మోహరించి ఉన్నాయి. ఇవి భౌగోళికంగా మన మీద ఒత్తిడి పెంచుతున్నాయి. రంగ్ పూర్ ప్రాంతం చుట్టూ కొత్త సైనిక ఒప్పందం జరుగుతున్నాయి. విదేశీ ప్రభావాలు ఉండనే ఉన్నాయి. తీవ్రవాద నెట్వర్క్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వీటిపై భారత భద్రతా దళాలు గట్టిగా నిఘా పెట్టాయి. ఇదేమి సాధారణంగా ఉండే సరిహద్దు ఉద్రిక్తత కాదు.

బెంగాల్ ప్రభుత్వం 120 ఎకరాల వ్యూహాత్మకమైన భూమిని అప్పగించడమే ఆలస్యం.. ఏడు జాతీయ రహదారుల నియంత్రణ మొదలైంది. భూగర్భ రైల్వే మార్గాల పని ప్రారంభమైంది. అంతేకాదు డ్రోన్లు.. థర్మల్ కెమెరాలు.. భూగర్భ కదలికలను గుర్తించే సెన్సార్లు.. లేజర్ గోడలు.. ఇవన్నీ కూడా ఇప్పుడు భారత రక్షణ వ్యవస్థలో కీలకమవుతున్నాయి. కేవలం 120 ఎకరాలు మాత్రమే కాదు.. బంగ్లాదేశ్ సరిహద్దు దగ్గర మరో 600 ఎకరాల భూమి కూడా మనదేశ సెక్యూరిటీ జోన్ పరిధిలోకి వస్తోంది. ఈ ప్రకారం అక్కడ సరిహద్దు నిర్మాణం పూర్తిగా మారుతుంది. అంతేకాదు 40 కిలోమీటర్ల మేర భూగర్భ రైల్వే సొరంగ మార్గాన్ని కూడా నిర్మిస్తున్నారు. దానిని 20 మీటర్లకు పైగా లోతులో నిర్మిస్తున్నారు. యుద్ధం వంటి విపత్కర పరిస్థితులు మొదలైతే.. ఏం జరుగుతుందో తెలుసు.. అందువల్లే ఈ స్థాయిలో నిర్మాణాలు మొదలవుతున్నాయి. ఇన్ని సంవత్సరాలు చికెన్ నెక్ కారిడార్ మీద కేంద్రానికి ఎటువంటి నియంత్రణ లేదు.

మమతాబెనర్జీ ప్రభుత్వం నిర్వాకం వల్ల ఒక్క చిన్న రోడ్డు పని చేయాలన్నా సరే అనుమతులు వచ్చేవి కాదు. దీంతో జాతీయ భద్రత కూడా స్థానిక రాజకీయ అహంకారంలో ఇరుక్కుపోయింది. ఇప్పుడు బిజెపి ప్రభుత్వం రావడంతో సైన్యం నేరుగా నియంత్రణ తీసుకుంది. హైవే వెడల్పు అవుతుంది. పెద్ద పెద్ద మిస్సైల్స్ వ్యవస్థలు వెళ్లగలిగే విధంగా రోడ్లను సిద్ధం చేస్తున్నారు. రఫెల్ యుద్ధ విమానాలను మోహరించిన బాగ్డోగ్రా వైమానిక స్థావరం వద్ద అత్యంత భారీ సైనిక నిల్వ కేంద్రాలు సిద్ధం చేస్తున్నారు.. అందువల్లే చికెన్ నెక్ కారిడార్ ను కేవలం ఒక దారిగానే భారత్ చూడడం లేదు. భవిష్యత్తులో జరిగే ఏ పెద్ద యుద్ధానికి అయినా సరే ఇదే కేంద్ర నాడీ బిందువు అవుతుందని భావిస్తున్నారు.

ఓలా, రాపిడోలకు గట్టి షాక్..45 వేల జీతంతో నియామకాలు చేస్తున్న vinfast..

VinFast jobs with 45000 salary
VinFast jobs with 45000 salary

VinFast jobs with 45000 salary: పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతుంది. టాక్సీ సేవలో కూడా ఎలక్ట్రిక్ కార్లు పెరిగిపోయాయి. ఈ క్రమంలో ఓలా, ఉబర్, రాపిడో వంటి కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లతో టాక్సీ సేవలు అందిస్తున్నాయి. అయితే వీటికి గట్టి పోటీ ఇచ్చేందుకు వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ VinFast భారత మార్కెట్‌పై భారీ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా దాదాపు 1000 గ్రీన్ ఎలక్ట్రిక్ ట్యాక్సీలను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ ట్యాక్సీలను ప్రధాన నగరాల్లో దశలవారీగా ప్రవేశపెట్టే ప్రణాళికను కంపెనీ రూపొందిస్తోంది. Vin fast ప్రవేశపెట్టే కార్లు ఓలా, ఉబర్ వంటి వాటికంటే తక్కువ ధరతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. దీంతో వినియోగదారులకు కూడా ఆదాయం సేఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.. ఈ కార్ల గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం రాపిడో, ఓలా వంటి సంస్థలు టాక్సీ సేవలో భాగంగా కిలోమీటర్ కు రూ.12 నుంచి వసూలు చేస్తున్నారు. అయితే కొత్తగా వచ్చే విన్ ఫాస్ట్ కార్లు సుమారు రూ.8 ఖర్చుతో కిలోమీటర్‌కు మైలేజ్ అందించేలా రూపొందించినట్లు కంపెనీ వర్గాలు తెలుపుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న పరిస్థితుల్లో ఈ ఎలక్ట్రిక్ ట్యాక్సీలు ప్రయాణికులకు తక్కువ ఛార్జీలతో సేవలు అందించే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో క్యాబ్ సేవల రంగంలో కొత్త పోటీ వాతావరణం ఏర్పడే అవకాశముంది.

ట్యాక్సీల సేవల ప్రారంభంతో పాటు వీటిని నడిపే డ్రైవర్ల నియామక ప్రక్రియను కూడా vinfast కంపెనీ వేగవంతం చేసింది. డ్రైవర్లకు నెలకు రూ.35,000 నుంచి రూ.40,000 వరకు జీతం ఇవ్వడానికి సిద్ధమైందని సమాచారం. అదనంగా పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలు, బోనస్‌లు కూడా ఉండే అవకాశముందని చెబుతున్నారు. ప్రస్తుతం నిరుద్యోగ యువతకు ఇది మంచి ఉపాధి అవకాశంగా మారుతోంది.డ్రైవింగ్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై ప్రత్యేక శిక్షణ కూడా అందించే అవకాశం ఉంది. భద్రతా ప్రమాణాలు, కస్టమర్ సర్వీస్, బ్యాటరీ నిర్వహణ వంటి అంశాల్లో డ్రైవర్లకు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా సంస్థ పనిచేస్తోంది.

భారతదేశంలో ఇప్పటికే పలు కంపెనీలు ఎలక్ట్రిక్ క్యాబ్ సేవల రంగంలోకి అడుగుపెడుతున్నప్పటికీ VinFast భారీ స్థాయిలో ప్రారంభించేందుకు సిద్ధమవడం ఆసక్తికరంగా మారింది. తక్కువ నిర్వహణ ఖర్చులు, అధిక మైలేజ్, ప్రభుత్వ ప్రోత్సాహకాలు కలిసి ఈ రంగాన్ని వేగంగా అభివృద్ధి చెందేలా చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ ట్యాక్సీల వినియోగం మరింత పెరిగే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. ఇదే సమయంలో ఓలా, ఉబర్, రాపిడో సంస్థలకు గట్టి షాక్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

ఎలక్ట్రిక్ మొబిలిటీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కూడా పలు రకాల ప్రోత్సాహకాలు అందిస్తున్న నేపథ్యంలో VinFast ప్రణాళికలకు మరింత ఊతం లభిస్తోంది. కాలుష్య నియంత్రణ, ఇంధన వ్యయం తగ్గింపు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని సంస్థ గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్‌పై దృష్టి సారించింది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఈ ట్యాక్సీలకు మంచి ఆదరణ లభించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఒకవేళ 'డ్రాగన్' ప్రభాస్ చేసుంటే ఎలా ఉండేది..? సోషల్ మీడియా విస్తృతంగా సాగుతున్న చర్చ..

Prabhas fans reaction to Dragon movie
Prabhas fans reaction to Dragon movie

Prabhas fans reaction to Dragon movie: ఒక స్టార్ హీరో కి సంబంధించిన టీజర్ , ఫస్ట్ లుక్ , ట్రైలర్, గ్లింప్స్ వీడియో వచ్చిందంటే , సోషల్ మీడియా లో హంగామా మామూలు రేంజ్ లో ఉండదు. ఎక్కడ చూసినా దాని గురించే మాట్లాడుకుంటారు. పొగిడేవాళ్లు పొగుడుతారు , తిట్టేవాళ్ళు తిడుతారు , ఇవన్నీ చాలా సర్వ సాధారణం. మొన్న రామ్ చరణ్ ‘పెద్ది’ ట్రైలర్ విడుదలైనప్పుడు ఇదే జరిగింది, నిన్న రాత్రి ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీ గ్లింప్స్ విడుదలైనప్పుడు కూడా అదే జరిగింది. ముఖ్యంగా ‘డ్రాగన్’ గ్లింప్స్ ని చూసి ఆశ్చర్యపోతూ , ఇదేమి టేకింగ్ రా బాబోయ్ , ప్రశాంత్ నీల్ ని మించిన యాక్షన్ డైరెక్టర్ ఇండియా లోనే లేదంటూ సోషల్ మీడియా లో ఆశ్చర్యపోతున్నారు. మరోపక్క ఎన్టీఆర్ ఈ సినిమాకు అసలు సూట్ అవ్వలేదని, ప్రభాస్ ‘సలార్’ లుక్ ని కాపీ కొట్టినట్టుగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

ప్రభాస్ కి తిరుగులేని స్క్రీన్ ప్రెజెన్స్ ఉండడం వల్ల, ‘సలార్’ గ్లింప్స్ సంచలనం సృష్టించిందని , ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ అసలు బాగాలేదని , బంగారం లాంటి గ్లింప్స్ కి ఎన్టీఆర్ చాలా పెద్ద మైనస్ అయ్యాడని సోషల్ మీడియా లో అత్యధిక శాతం మంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీ లో ఉన్నారు. తమ అభిమాన హీరో ని ఎలా అయితే చూడాలని అనుకున్నారో , అలా ప్రశాంత్ నీల్ చూపించాడని , ఎన్టీఆర్ లుక్స్ వేరే లెవెల్ లో ఉన్నాయని , ఎన్టీఆర్ ఏది చేసిన ట్రోల్ చేయడానికి ఒక బ్యాచ్ సిద్ధంగా ఉంటుందని , వాళ్లకు గ్లింప్స్ ఎంత బాగున్నా నచ్చదని విశ్లేషకులు చెప్పే మాట. అయితే ఇదే సినిమాలో ప్రభాస్ నటించి ఉండుంటే ఎలా ఉండేది?.

ఒకసారి ఊహించుకోండి , ప్రభాస్ లాంటి డైనోసార్ కటౌట్ లూగర్ , డ్రాగన్ పాత్రలు పోషించడం, ఇద్దరి ప్రభాస్ లు వెండితెర మీద నువ్వా , నేనా అనే రేంజ్ లో కొట్లాడుకుంటే చూసే ఆడియన్స్ కి ఎలాంటి థియేట్రికల్ అనుభూతి వస్తుంది అనేది? అని అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పైగా ప్రభాస్ మార్కెట్ వేరే లెవెల్ లో ఉంటుంది కాబట్టి , ఇలాంటి కాన్సెప్ట్ తో ఆయన సినిమా చేస్తే వెయ్యి కోట్ల గ్రాస్ ని మొదటి వారం లోనే కొడుతాను , ఎన్టీఆర్ కి 500 నుండి 600 కోట్లకు మించి రావని , ఇలా ఎన్నో రకాల పోస్టులు వేస్తున్నారు. అయితే అందరి అంచనాలను తారుమారు చేయడం ఎన్టీఆర్ కి కొత్తేమి కాదు , ముఖ్యంగా తనని తక్కువ అంచనా వేసిన వారికి చుక్కలు చూపియ్యడం లో ముందు ఉంటాడు, కాబట్టి జూన్ 11 , 2027 లో ప్రపంచం మొత్తం ఎన్టీఆర్ సృష్టించే విద్వంసం గురించి మాట్లాడుకుంటుంది అంటూ ఆయన అభిమానులు కామెంట్స్ చేస్టున్నారు.

ఇంట్లో కరెంటు పోయిందా.. ఈ కారు బ్యాటరీ వాడుకోండి..

Skoda Epiq battery backup feature
Skoda Epiq battery backup feature

Skoda Epiq battery backup feature: ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా (Skoda)ఇప్పటికే వినియోగదారులను ఆకర్షించేవిధంగా ఎన్నో మోడల్స్ ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇప్పుడ తన సరికొత్త కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ‘ఎపిక్’ (Epiq)అనే మోడల్‌ను తాజాగా (మే 19, 2026) ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. ఇది కంపెనీ నుంచి రాబోతున్న అత్యంత చిన్న, సరసమైన ధరతో కూడిన ఎలక్ట్రిక్ కారు. సుమారు 4.17 మీటర్ల పొడవుతో ఉండే ఈ కారు, ఆధునిక డిజైన్, లేటెస్ట్ టెక్నాలజీతో రూపొందించబడింది. అంతేకాకుండా ఇంట్లో కరెంట్ లేనప్పుడు లేదా క్యాంపింగ్‌కు వెళ్ళినప్పుడు కారు నుండే పవర్ తీసుకోవచ్చు. ఈ కారు గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

Skoda Epiq కారును సరికొత్త ‘మోడరన్ సాలిడ్’ డిజైన్ ఫిలాసఫీతో రూపొందించబడింది. దీని ముందు భాగంలో ‘టెక్ డెక్ ఫేస్’ (Tech-Deck Face) ఉంటుంది. ఇందులో స్లిమ్ ‘T’ ఆకారపు ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కారు చిన్నదైనప్పటికీ స్పేస్ మేనేజ్‌మెంట్ అద్భుతంగా ఉంటుంది. దీనిలో 475 లీటర్ల బూట్ స్పేస్ ఉండడంతో పాటు ముందు భాగంలో ఛార్జింగ్ కేబుల్స్ కోసం 25 లీటర్ల ఫ్రంక్ (Frunk) కూడా ఇచ్చారు.

ఈ ఎలక్ట్రిక్ SUVలో వేర్వేరు పవర్ వేరియంట్లు ఉంటాయి. ఇందులో 38.5 kWh, 55 kWh (NMC) అనే రెండు బ్యాటరీ ప్యాక్లు ఉన్నాయి. టాప్ ఎండ్ మోడల్ (Epiq 55) ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 440 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. బేస్ మోడల్ సుమారు 310 కి.మీ రేంజ్‌ను ఇస్తుంది.ఈ బ్యాటరీలకు 133 kW వరకు ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల కేవలం 24 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ (FWD) వ్యవస్థను కలిగి ఉంటుంది.

ఈ మోడల్ ఇంటరియర్ లో చాలా మినిమలిస్టిక్‌గా మరియు సుస్థిరమైన (Sustainable) మెటీరియల్స్‌తో ఉంటుంది. 13-అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.24-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఉన్నాయి. అలాగే బిడైరెక్షనల్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. అంటే కారు బ్యాటరీతో మీ ఇంటి వస్తువులను కూడా నడపవచ్చు. వన్-పెడల్ డ్రైవింగ్ మోడ్ కూడా అందుబాటులో ఉంది.అలాగే ఇందులో సేఫ్టీ కోసం 7 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవల్ 2 ADAS (లేన్ అసిస్ట్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్) వంటి భద్రతా ఫీచర్లు ప్రామాణికంగా లభిస్తాయి.

అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర సుమారు 25,000 యూరోల నుండి ప్రారంభం కావచ్చు. భారత మార్కెట్లోకి ఈ కారు నవంబర్ 2026 నాటికి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 21 లక్షల నుంచి రూ. 26 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా. ఇది టాటా నెక్సాన్ EV, మహీంద్రా XUV400 రాబోయే హ్యుందాయ్ క్రెటా ఈవీలకు గట్టి పోటీ ఇవ్వనుంది.

కొత్తగా ఎలక్ట్రిక్ కారు కొనే ఆలోచన ఉన్నవారికి ఇందులోని V2L (Vehicle-to-Load) ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉండనుంది. అంటే కరెంట్ లేనప్పుడు లేదా క్యాంపింగ్‌కు వెళ్ళినప్పుడు కారు నుండే పవర్ తీసుకోవచ్చు.

సునామీ ని తలపిస్తున్న 'కరుప్పు' బాక్స్ ఆఫీస్ విద్వంసం.. 5 రోజుల్లో వచ్చిన గ్రాస్ ఎంతంటే..

Karuppu 5 days box office collections
Karuppu 5 days box office collections

Karuppu 5 days box office collections: ఎలాంటి అంచనాలు లేకుండా చాలా సాధారణంగా విడుదలైన తమిళ హీరో ‘సూర్య’ నటించిన ‘కరుప్పు’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన వసూళ్ల సునామీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సినిమాకు ముఖ్యంగా వర్కింగ్ డేస్ లో నమోదు అవుతున్న వసూళ్లను చూసి ట్రేడ్ విశ్లేషకులు నివ్వెరపోయారు. సూర్య స్టార్ స్టేటస్ పై అనుమానాలు పెట్టుకున్న ప్రతీ ఒక్కరిని ఈ సినిమా ఫూల్ చేసింది. తెలుగు లో ఈ చిత్రం ‘వీరభద్రుడు’ అనే పేరు తో విడుదలైంది. ఇక్కడ ఈ చిత్రానికి మొదటి రోజున 3 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు అయితే , 5 వ రోజున 2 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఎంత స్ట్రాంగ్ హోల్డ్ ఉందో మీరే చూడండి. తమిళనాడు లో కూడా ఇదే పరిస్థితి.

మొదటి రోజు ఈ చిత్రానికి తమిళనాడు లో 11 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు అవ్వగా, 5 వ రోజున 10 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు రజినీకాంత్ కి తప్ప, ఏ హీరో కి కూడా తమిళనాడు లో వరుసగా 5 రోజులు 10 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చిన దాఖలాలు లేవు, అలాంటిది ఇప్పుడు రజినీకాంత్ జాబితాలోకి సూర్య కూడా చేరిపోయాడు. 5 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా ఎంత గ్రాస్ వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ ని అన్నపూర్ణ స్టూడియోస్ కేవలం 7 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 17 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు 8 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

అంటే వారం కూడా పూర్తి అవ్వకముందే ఈ చిత్రానికి 1 కోటి 80 లక్షల రూపాయిల లాభం వచ్చింది అన్నమాట. అదే విధంగా తమిళనాడు లో ఈ చిత్రానికి 72 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అవ్వగా, కర్ణాటక నుండి 12 కోట్ల 50 లక్షలు, కేరళ నుండి 8 కోట్ల 80 లక్షలు, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 2 కోట్లు, ఓవర్సీస్ నుండి 51 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 163 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు , 79 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. అన్ని భాషలకు కలిపి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఈ చిత్రానికి 70 కోట్లకు జరిగింది , ఇప్పటికే 9 కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయి, రాబోయే రోజుల్లో ఎంత లాభాలు వస్తుందో చూడాలి.

'డ్రాగన్ ' గ్లింప్స్ లో 'ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ' కింగ్ ఎన్టీఆర్.. మరి 'గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ' కింగ్ ఎవరో తెలుసా..?

Dragon movie glimpse analysis
Dragon movie glimpse analysis

Dragon movie glimpse analysis: నేడు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా , నిన్న రాత్రి మేకర్స్ ‘డ్రాగన్’ మూవీ గ్లింప్స్ వీడియో ని విడుదల చేయగా, దానికి సోషల్ మీడియా అంతటా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్ పై ట్రోల్స్ అయితే గట్టిగానే పడ్డాయి కానీ , ప్రశాంత్ నీల్ టేకింగ్, స్టోరీ బిల్డింగ్ కి మాత్రం సెల్యూట్ చేశారు నెటిజెన్స్. ఒక కమర్షియల్ సినిమాని హాలీవుడ్ స్టాండర్డ్స్ తో, ఎవ్వరూ ఆలోచన చెయ్యని విధంగా , ఇలా కూడా చెప్పొచ్చా అని తన ప్రతీ సినిమాతో ఆడియన్స్ ని సర్ప్రైజ్ కి గురి చేస్తుంటాడు ప్రశాంత్ నీల్. ‘డ్రాగన్’ తో కూడా ఆయన అదే చేశాడు. బ్రిటీషర్స్ మన వద్ద సంపద దోచుకోవడానికి వచ్చారని, దోచుకున్న తర్వాత వాళ్ళు 250 ఏళ్ళు మన దేశాన్ని వదిలి వెళ్లకపోవడానికి కారణం ఓపియం అనే మొక్క అని, అది ఆఫ్గనిస్తాన్ మరియు గోల్డెన్ ట్రైయాంగిల్ లో ఎక్కువగా పెరుగుతుంది.

ఈ ఓపియం మొక్క ద్వారానే మాదకద్రవ్యాలను తయారు చేస్తారని, బ్రిటిషర్లు మన దేశాన్ని వదిలి వెళ్లిపోయిన తర్వాత ఈ మొక్క కోసం రెండు కంపెనీలు యుద్ధం చేసుకున్నాయని , ఒక కంపెనీ పేరు ‘ఆఫ్గనిస్తాన్ ట్రేడింగ్ కంపెనీ’ కాగా , మరో కంపెనీ పేరు ‘గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ’ అని ప్రశాంత్ నీల్ ఈ గ్లింప్స్ లో న్యారేట్ చేశాడు. ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ కి కింగ్ గా ‘లూగర్’ కొనసాగుతుండగా, ‘గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ’ కి కింగ్ గా డ్రాగన్ కొనసాగుతాడని అంటున్నారు. లూగర్ విలన్ , డ్రాగన్ హీరో , వీళ్లిద్దరి మధ్య జరిగే సంగ్రామమే ఈ సినిమా. నిన్న విడుదల చేసింది విలన్ కి సంబంధించిన గ్లింప్స్ , త్వరలోనే హీరో కి సంబంధించిన గ్లింప్స్ ని కూడా విడుదల చేస్తారట.

ఈ రెండు క్యారెక్టర్స్ లో ఎన్టీఆర్ తన నట విశ్వరూపం చూపిస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. గ్లింప్స్ ని చూసి సినిమా ని అంచనా వేయడం ఎంత తప్పో, గ్లింప్స్ లో ఎన్టీఆర్ లుక్స్ ని చూసి ఆయన్ని తక్కువ చేసి చూడడం కూడా అంతే తప్పు , ఎన్టీఆర్ యాక్టింగ్ టాలెంట్ ఏంటో , ఆయన డైలాగ్ డెలివరీ ఏంటో దేశం మొత్తం ఇప్పటికే చూసింది. నటన కి , టాలెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఎన్టీఆర్. కాబట్టి తన కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో , ఎన్టీఆర్ రెండు పాత్రల్లోనూ అద్భుతంగా నటించి, బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తాడని అంటున్నారు విశ్లేషకులు.

Redmi నుంచి కొత్త ఫోన్.. వీరికి చాలా యూజ్ ఫుల్..

Redmi Turbo 5 new smartphone launch
Redmi Turbo 5 new smartphone launch

Redmi Turbo 5 new smartphone launch: మిడిల్ క్లాస్ పీపుల్స్ మొబైల్ కొనాలని అనుకుంటే Redmi కంపెనీ వైపు ఎక్కువగా చూస్తారు. కస్టమర్స్ కు అనుగుణంగా ఈ కంపెనీ లేటెస్ట్ గా Turbo 5 అనే మొబైల్ ను తీసుకురాబోతుంది. ఈ ఫోన్ గురించి ఇప్పటివరకు కొన్ని లీకులు బయటకు వచ్చాయి. ఇది జూన్ 2026 తొలి వారంలో లేదా జూన్ 10, 2026 నాటికి భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ ఎలా ఉండబోతుందంటే?

రెడ్ మీ టర్బో 5లో 6.59 అంగుళాల 1.5K AMOLED డిస్ ప్లే ఉండనుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. ఇందులో మీడియా టెక్ డైమెన్సిటీ 8500 Ultra chip ఉండవచ్చని అంచనా. అలాగే ఈ మొబైల్ కు 12 జీబీ నుంచి 16 జీబీ వరకు RAM ఉండే అవకాశం ఉంది. అలాగే 256GB లేదా 512GB స్టోరేజ్ ఉండనుంది. ఇందులో HyperOS 3 ఆధారిత Android 16 మీద పనిచేయొచ్చని తెలుస్తోంది.

ఈ ఫోన్‌లో 7,560mAh బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. రెడ్ మీ సెగ్మెంట్‌లో ఇది చాలా పెద్దది. ఈ బ్యాటరీకి 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 27W వైర్ లెస్ ఛార్జింగ్ పోర్ట్ కూడా రావచ్చని లీక్‌లు చెబుతున్నాయి. ఈ కొత్త మొబైల్ లో కెమెరా సెటప్‌లో భాగంగా 50MP Sony IMX 882 ప్రైమరీ సెన్సార్ కెమెరా ఉండనుంది. 20MP సెల్ఫీ కెమెరా ఉండొచ్చని రిపోర్టులు ఉన్నాయి. చైనా వెర్షన్‌లో 50MP + 8MP రియర్ కెమెరా సెటప్ ఉన్నట్లు తెలుస్తోంది. డిజైన్ పరంగా flat back, separate dual camera rings, metal frame, glass back, and Redmi branding ఉండే అవకాశం ఉంది.లీక్‌ల ప్రకారం.. 12GB + 256GB వేరియంట్ ధర సుమారు రూ.27,999, 16GB + 512GB variant ధర సుమారు రూ . 36,999గా ఉండొచ్చు.

బడ్జెట్ లో మొబైల్ కొనాలని అనుకునేవారికి ఈ ఫోన్ బాగా యూజ్ ఫుల్ అయ్యే అవకాశం ఉంది. రోజూ వారీ వినియోగదారులు ఇప్పుడు ఈ రేంజ్ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో రెడ్ మీ తీసుకొచ్చే ఈ మొబైల్ ఎలాంటి అంచనాలు అందుకుంటుందో చూడాలి.

సరస్వతి అంత్య పుష్కరాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు..

Saraswathi Antya Pushkaralu
Saraswathi Antya Pushkaralu

Saraswathi Antya Pushkaralu: సరస్వతీ నది అంత్య పుష్కరాలకు భారీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. మే 20 అర్ధరాత్రి నుంచి పుష్కర ఘట్టం ప్రారంభం కానుండగా.. మే 21 తెల్లవారుజామున 5.30 గంటలకు తొలి పుష్కర స్నానాలు నిర్వహించనున్నారు. తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని గోదావరి నది సంగమం వద్ద పుష్కర స్నానం సరస్వతి అంత్య పష్కరాలు సాగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.30 కోట్లతో ఘాట్లు, రహదారులు, తాగునీరు, విద్యుత్, పారిశుధ్య సదుపాయాలను అభివృద్ధి చేసింది. సుమారు 40 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రాకపోకల కోసం RTC 3,360 ప్రత్యేక బస్సులను నడపనుంది. గవర్నర్, సీఎం, మంత్రులకు కూడా ప్రత్యేక ఆహ్వానాలు పంపించారు.

హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి నదికి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. గురుగ్రహం ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రవేశించినప్పుడు ఆయా నదులకు పుష్కర మహోత్సవాలు ప్రారంభమవుతాయి. గురుడు మిథున రాశిలో ప్రవేశించడంతో సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. పుష్కరాల మొదటి 12 రోజులను “ఆది పుష్కరాలు”, చివరి 12 రోజులను “అంత్య పుష్కరాలు”గా పరిగణిస్తారు.

ఈసారి సరస్వతీ ఆది పుష్కరాలు 2025 మే 15 నుంచి 2025 మే 26 వరకు ఘనంగా జరిగాయి. ఇప్పుడు అంత్య పుష్కరాలు 2026 మే 20 నుంచి 2026 మే 31 వరకు నిర్వహించనున్నారు. ఆది పుష్కరాల సమయంలో లక్షలాది మంది భక్తులు కాళేశ్వరంతో పాటు ఇతర పుణ్యక్షేత్రాల్లో పవిత్ర స్నానాలు ఆచరించారు. ఇప్పుడు అంత్య పుష్కరాలకు కూడా అదే స్థాయిలో భక్తుల రద్దీ ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

సరస్వతీ నది హిందూ ధర్మంలో జ్ఞానం, విద్య, వాక్పటిమకు ప్రతీకగా భావించబడుతుంది. పురాణాల ప్రకారం సరస్వతీ నది దివ్య నదిగా, అదృశ్యంగా ప్రవహించే పవిత్ర తీర్థంగా చెప్పబడింది. కాళేశ్వరంలో గోదావరి, ప్రాణహిత, అంతర్వాహినిగా సరస్వతీ సంగమమవుతుందని భక్తుల విశ్వాసం. అందుకే అక్కడ స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదమని భావిస్తారు.

సరస్వతీ పుష్కర స్నానం చేయడం వల్ల పాపక్షయము కలుగుతుందని, పితృదోషాలు తొలగుతాయని నమ్మకం. విద్యాభివృద్ధి, జ్ఞానప్రాప్తి, వాక్చాతుర్యం కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ముఖ్యంగా విద్యార్థులు, గురువులు, కళాకారులు సరస్వతీ పుష్కర స్నానానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. పుష్కర కాలంలో దానం, జపం, తర్పణం, గోపూజ, అన్నదానం చేస్తే అనేక రెట్లు పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

పుష్కరాల్లో ముఖ్యంగా పితృతర్పణాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ కాలంలో నదిలో స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు ఇస్తే వారి ఆశీస్సులు లభిస్తాయని పురోహితులు వివరిస్తున్నారు. అలాగే బ్రాహ్మణ భోజనాలు, దానధర్మాలు చేస్తే కుటుంబానికి శుభఫలితాలు కలుగుతాయని విశ్వాసం.

సీఎం విజయ్ తో రిలేషన్ పై సంచలనం రేపుతున్న త్రిష లేటెస్ట్ పోస్ట్.. కుండబద్దలు కొట్టేసిందిగా..

Trisha latest viral post
Trisha latest viral post

Trisha latest viral post: తమిళ హీరోయిన్ త్రిష సీఎం విజయ్ తో రిలేషన్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే , జనాలకు మేము కలిసే ఉంటున్నాము అనే హింట్స్ వీళ్లిద్దరు కలిసి ఈమధ్యకాలం లో చాలానే ఇచ్చారు. కానీ అధికారికంగా మాత్రం ఎక్కడా ప్రకటించలేదు. ఇద్దరు కలిసి ఉన్నాం అని చెప్పడానికి ఈ మాత్రం హింట్స్ చాలదా?, అధికారికంగా చెప్పాల్సిన అవసరం ఏముంది?, సమయం వచ్చినప్పుడు చెప్పొచ్చు అనే ఉద్దేశ్యం లో ఉన్నారు ఈ జంట. అయితే నేడు కాసేపటి క్రితమే హీరోయిన్ త్రిష ఒక పోస్ట్ వేసింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది. విజయ్ తో రిలేషన్ గురించి త్రిష మరోసారి కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇంతకీ ఆమె ఏమి అనిందంటే ‘ఈ ఏడాది మే నెల నా జీవితంలో ఇప్పటికే ఒక మ్యాజికల్ మూమెంట్ ని ఆరంభం లోనే ఇచ్చేసింది, ఇప్పుడు మరో విజయాన్ని అందించింది’ అంటూ చెప్పుకొచ్చింది. మే ఆరంభంలో సరిగ్గా ఆమె పుట్టిన రోజు అయినటువంటి మే 4 న తమిళనాడు లో ఎన్నికల ఫలితాలు వచ్చాయి, విజయ్ టీవీకే పార్టీ ఈ ఎన్నికల్లో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇది ఈ నెలలో త్రిష కి దక్కిన మొట్టమొదటి విజయం, అదే విధంగా కొద్దిరోజుల క్రితమే ఆమె హీరోయిన్ గా నటించిన ‘కరుప్పు’ చిత్రం విడుదలైంది. సూర్య హీరో గా తెరకెక్కిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది . బాక్స్ ఆఫీస్ వద్ద వర్కింగ్ డేస్ , వీకెండ్ డేస్ అని తేడా లేకుండా ఇరగకుమ్మేస్తోంది. లాంగ్ రన్ లో ఇంకా ఎంత వసూళ్లను రాబడుతుందో చూడాలి. ఇలా ఈ రెండు విజయాలను ఉద్దేశించే ఆమె ఈ పోస్ట్ వేసింది.

దీంతో మరోసారి ఆమె విజయ్ నావాడే అని కుండబద్దలు కొట్టినట్టు ఈ పోస్ట్ తో చెప్పకనే చెప్పింది. ఇక ‘కరుప్పు’ విషయానికి వస్తే , ఇప్పటికే ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ వీకెండ్ తో కచ్చితంగా ఈ చిత్రం 200 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి చేరబోతోంది. రాబోయే రోజుల్లో 300 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి చేరుతుందో లేదో చూడాలి. 14 ఏళ్ళ నుండి సరైన బ్లాక్ బస్టర్ లేక ఇబ్బంది పడుతున్న సూర్య , ఈ రేంజ్ కం బ్యాక్ ఇచ్చాడంటే అందుకు కచ్చితంగా త్రిష గోల్డెన్ లెగ్ కలిసి వచ్చి ఉండొచ్చని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

 

View this post on Instagram

 

A post shared by Trish (@trishakrishnan)

బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్ కు మిగిలింది గాడిద గుడ్డు

Bangladesh vs Pakistan
Bangladesh vs Pakistan

Bangladesh vs Pakistan: ఈ శీర్షిక చదివిన తర్వాత మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. ఇదేంటి ఇలా పెట్టారు అని అనుకోవచ్చు.. మీకు అలా అనిపించడంలో తప్పులేదు. కానీ ఈ హెడ్లైన్ పెట్టడం వెనక స్టోరీ మొత్తం మాకు తెలుసు కాబట్టి.. అలా పెట్టడంలో ఏమాత్రం తప్పులేదు.

టెస్ట్ క్రికెట్ చరిత్రలో బంగ్లాదేశ్ కంటే పాకిస్తాన్ చాలా మెరుగు. పైగా అనేక సిరీస్ లు సొంతం చేసుకున్న చరిత్ర పాకిస్తాన్ కు ఉంది. అయితే ఆ స్థాయిలో ఆడిన పాకిస్తాన్ జట్టు ఇప్పుడు దారుణంగా ఆడుతోంది. బంగ్లాదేశ్ చేతిలో గతంలోనే వైట్ వాష్ కు గురైన పాకిస్తాన్.. ఇప్పుడు బంగ్లాదేశ్ చేతిలో మరోసారి ఆ పరాభవాన్ని మూటగట్టుకుంది. గతంలో సొంత దేశంలో వైట్ వాష్ కు గురైతే.. ఇప్పుడు ఆతిథ్య జట్టు దేశంలో మరోసారి గుండు సున్నా చుట్టేసుకుంది.

రెండో టెస్టులో బంగ్లాదేశ్ పాకిస్తాన్ పై 78 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. రెండో టెస్ట్ చివరి రోజున పాకిస్తాన్ చేజింగ్ మొదలుపెట్టింది. ఆ సమయంలో పాకిస్తాన్ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.. అప్పటికే 7 వికెట్లు కోల్పోయింది..క్రీజులో ఉన్న మహమ్మద్ రిజ్వాన్.. వరుసగా రెండు ఫోర్లు కొట్టి ఊపు మీద కనిపించాడు. అప్పటికే పాకిస్తాన్ విజయానికి ఇంకా 121 పరుగులు కావాలి. ఈసారి టస్కిన్ అహ్మద్ బౌలింగ్లో సాజిద్ ఖాన్ వరుస బంతులలో బౌండరీలు కొట్టాడు. రిజ్వాన్, సాజిద్ ఖాన్ కీలకమైన భాగస్వామ్యాన్ని నిర్మించారు. సాజిద్ ఖాన్ టైజు ల్ ఇస్లాం బౌలింగ్లో ఔట్ అయ్యాడు.. మరోవైపు రిజ్వాన్ 94 పరుగులు చేసి.. టైజుల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. తైజుల్ ఏకంగా ఆరు వికెట్లు సాధించి పాకిస్తాన్ పతనాన్ని శాసించాడు.

టెస్ట్ ఫార్మాట్లో పాకిస్తాన్ జట్టుపై బంగ్లాదేశ్ కు ఇది వరుసగా నాలుగో విషయం. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేశాడు లిటన్ దాస్. ఫలితం బంగ్లాదేశ్ వైపు ఉండేలా చేశాడు. అతడికి మెన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది. ముష్ఫికర్ రహీం కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ పురస్కారం లభించింది. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 278 పరుగులు చేసింది. రెండవ ఇన్నింగ్స్ లో 390 పరుగులు చేసింది. పాకిస్తాన్ ఇన్నింగ్స్ లో 232 పరుగులు చేసింది. రెండవ ఇన్నింగ్స్ లో 358 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ 78 పరుగుల తేడాతో విజయం సాధించింది.

అలా చేస్తే 1 లక్ష రూపాయిలు బహుమానం.. సీఎం విజయ్ మరో బంపర్ ఆఫర్..

CM Vijay
CM Vijay

CM Vijay bumper offer: తమిళనాడు సీఎం విజయ్ తన పాలనలో విభిన్నమైన మార్కుని చూపిస్తూ సంచలనాలు సృష్టిస్తున్నాడు. ఆయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఇప్పటూ వరకు దేశం లో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకోనివి , ట్రెండ్ సెట్ చేసేవి. సరిగ్గా వాటిని అమలు చేస్తే , హిస్టరీ క్రియేట్ చేసిన వాడు అవుతాడు విజయ్. దేవాలయాలు , స్కూల్స్ , బస్సు స్టాప్స్ పరిసరాల్లో మద్యం దుకాణాలను తీసివేయాలని ఆర్దర్లు జారీ చేయడం, అమ్మా క్యాంటీన్స్ ని ఆధునీకరణ చేయమని ఆదేశించడం వంటివి జనాలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక నేడు ఆయన తీసుకున్న మరో సంచలన నిర్ణయం తమిళనాడు లో పెను మార్పులకు దారి తీయొచ్చని అంటున్నారు విశ్లేషకులు. అవినీతి నిర్మూలన కోసం ఆయన తీసుకున్న సంచలన నిర్ణయం, దేశం లో అన్ని రాష్ట్రాలు పాటిస్తే , సాధ్యమైనంత వరకు అవినీతి నిర్మూలన చేయొచ్చు.

లంచం తీసుకుంటే కానీ పని చెయ్యని ప్రభుత్వ అధికారులు ప్రతీ రాష్ట్రం లోనూ ఉంటారు. తన రాష్ట్రంలో అలాంటి అవినీతిపరుల ఆటలను అరికట్టించేందుకు విజయ్ ఒక కోట్ల ప్లాన్ వేశాడు. ఎవరైనా ప్రభుత్వ అధికారి అవినీతి చేసినట్టు ఆధారాలతో సహా నాకు ఫిర్యాదు చేస్తే, వాళ్లకు లక్ష రూపాయిల బహుమానాన్ని ఆయన ప్రకటించాడు. ఈ ఫిర్యాదుల కోసం ఆయన ప్రత్యేకంగా ఒక హెల్ప్ లైన్ నెంబర్ , వెబ్ సైట్ పోర్టల్ ని కూడా లాంచ్ చేశాడు. దేశం లో ఎక్కడా కూడా గతం లో ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి ని చూడలేదు, ఒకవేళ చూసుంటే కామెంట్ చేయండి. ఇదంతా పక్కన పెడితే విజయ్ ఆలోచన అద్భుతం గానే ఉంది , కానీ ఎంత వరకు ఆచరణలో పెడుతాడో చూద్దాం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన అమలు చేస్తున్న స్కీమ్స్ ని గ్రౌండ్ లెవెల్ లో జనాలకు అధికారులు తీసుకెళ్లలేక పోతున్నారని సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

వైభవ్ సూర్య వంశీ ఇలాంటి వాడా.. కీలక వీడియోలతో వెలుగులోకి..

Vaibhav Suryavanshi controversial videos
Vaibhav Suryavanshi controversial videos

Vaibhav Suryavanshi controversial videos: ఈ ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనేక రికార్డులను బద్దలు కొట్టాడు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కొనసాగుతున్నాడు. రాజస్థాన్ జట్టు కు కీలక ఆటగాడిగా రూపాంతరం చెందాడు. ఇప్పటికే అతని ఖాతాలో సెంచరీ.. హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మహా మహా ప్లేయర్లను పక్కనపెట్టి.. దూకుడైన ప్లేయర్లను అధిగమించి ఆరెంజ్ క్యాప్ విభాగంలో అతడు నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు.

వైభవ్ సూర్యవంశీ కాస్త లావుగా ఉంటాడు. గతంలో మాంసాహారాన్ని అధికంగా తినేవాడు. ఇప్పుడు డైటీషియన్ చెప్పడం వల్ల పూర్తిగా తగ్గించాడు. దీంతో దృఢంగా మారిపోయాడు. బాల భీముడి లాగా కనిపిస్తున్నప్పటికీ వికెట్ల మధ్య వేగంగా పరుగులు పెడుతూ ఉంటాడు. బంతిని బలంగా కొట్టడంలో నేర్పరితనాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. అందువల్లే ఐపీఎల్లో అతడు పరుగుల ప్రవాహాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నాడు. బౌలర్ ఎవరనేది.. జట్టు ఏంటనేది ఏ మాత్రం అతడు చూడటం లేదు. పైగా వీరోచితమైన ఇన్నింగ్స్ నిర్మించడంలో తనదైన స్టైల్ కొనసాగిస్తున్నాడు.

వైభవ్ సూర్యవంశీ ఆ మధ్య కాళ్లకు క్రాంప్స్ రావడంతో.. సరిగ్గా ఫీల్డింగ్ చేయలేదు. ఇప్పుడు ఆ ఇబ్బంది నుంచి బయటపడ్డాడు. చికిత్స తీసుకొని సులభంగా ఫీల్డింగ్ చేయగలుగుతున్నాడు. అందువల్ల మైదానంలో అతడు ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. అతని వయసు 15 సంవత్సరాలు కావడంతో.. ఆ తరహా మెంటాలిటీ అతనిలో కనిపిస్తోంది. తల మీద నుంచి క్యాప్ తీసి దాంతో ఆడుకుంటున్నాడు. మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు డ్యాన్సులు వేస్తున్నాడు. ప్రేక్షకులను ఉత్సాహపరచడానికి రకరకాల వ్యవహారాలకు పాల్పడుతున్నాడు.

సూర్య వంశీ ఈ సీజన్లో ఇప్పటివరకు 13 మ్యాచ్లలో.. 13 ఇన్నింగ్స్ లు ఆడాడు. ఏకంగా 579 పరుగులు చేశాడు. ఇతడి యావరేజ్ 54.54. స్ట్రైక్ రేట్ 236.33. ఇందులో 50 ఫోర్లు, 53 సిక్సర్లు ఉన్నాయి. ఐపీఎల్ లో సూర్య వంశీ బీకరమైన ఫామ్ లో ఉన్నాడు. పెద్ద పెద్ద బ్యాటర్ల వల్ల కానిది కూడా అతడు చేసేస్తున్నాడు. బీభత్సంగా బ్యాటింగ్ చేస్తూ.. పరుగుల సునామీ సృష్టిస్తూ.. అత్యంత ప్రమాదకరమైన ఆటగాడిగా రూపాంతరం చెందాడు సూర్య వంశీ. అతడు ఇదే స్థాయిలో గనుక ఆడితే భవిష్యత్తు కాలంలో ప్రపంచ క్రికెట్ మొత్తాన్ని శాసిస్తాడని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

వైభవ్ సూర్యవంశీ 'A' సెలబ్రేషన్.. దాని వెనక ఇంత అర్థం ఉందా..

Vaibhav Suryavanshi A celebration
Vaibhav Suryavanshi A celebration

Vaibhav Suryavanshi A celebration: ఐపీఎల్ లో భాగంగా లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో 38 బంతుల్లో 93 పరుగులు చేశాడు రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ. ఇతడు 38 బంతులలో 7ఫోర్లు, 10 సిక్సర్ల సహాయంతో విధ్వంసం సృష్టించాడు. ముఖ్యంగా హాఫ్ సెంచరీ అనంతరం ఈ బాల భీముడు సరికొత్త తీరుగా తన హాఫ్ సెంచరీని సెలబ్రేట్ చేసుకున్నాడు.

హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత తన చేతి వేళ్ళతో A సింబల్ చూపించాడు. అంతేకాదు సంబరాలు కూడా గట్టిగా చేసుకున్నాడు. దీంతో సోషల్ మీడియాలో చాలామంది సూర్య వంశీ A సెలబ్రేషన్ వెనుక ఉన్న అర్థమేంటో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. అయితే చాలామందికి దాని వెనుక ఉన్నది ఏమిటో అర్థం కాలేదు. పైగా సూర్య వంశీ కూడా ఎటువంటి క్లూ ఇవ్వలేదు.

మ్యాచ్ ముగిసిన తర్వాత.. మెన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం అందుకున్న సూర్య వంశీ.. దాని వెనుక ఉన్న అసలు నిజాన్ని చెప్పేశాడు.. మొదట్లో వ్యాఖ్యాత మురళి కార్తీక్ అడిగిన ప్రశ్నకు సమాధానం దాటవేశాడు. తను ఏం చేశానో గుర్తుకు లేదని ఆట పట్టించాడు. ఆ తర్వాత ప్రతి మ్యాచ్లో కొత్త విధానాన్ని చూపించడానికి తాను ప్రయత్నిస్తానని సూర్య వంశీ వెల్లడించాడు. అయితే ఈసారి ఏ సింబల్ వెనుక ఉన్న అసలు విషయాన్నీ బయట పెట్టాడు. ఈ ఇన్నింగ్స్ తన మాతృమూర్తికి అంకితం ఇస్తున్నట్టు ప్రకటించాడు. తన పేరులో తొలి అక్షరం ఏ తో మొదలవుతుందని సూర్య వంశీ పేర్కొన్నాడు. సూర్య వంశీ వీరోచితమైన 93 పరుగుల ద్వారా రాజస్థాన్ జట్టు అద్భుతమైన విజయం సాధించింది. ప్లే ఆఫ్ ముందు సూపర్ విక్టరీ అందుకొని.. ఆశలను సజీవంగా ఉంచుకుంది. తదుపరి మ్యాచ్ ముంబై తో రాజస్థాన్ ఆడుతుంది. ఇందులో గెలిస్తే ప్లే ఆఫ్ వెళ్తుంది. ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు, గుజరాత్ ప్లే ఆఫ్ వెళ్లిపోయాయి.

కెసిఆర్ సైలెంట్.. రేవంత్ రెడ్డి వైలెంట్

Revanth Reddy Vs KCR
Revanth Reddy Vs KCR

KCR Vs Revanth Reddy: రేవంత్ రెడ్డి దూకుడు మీద ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో వరుస విజయాలు.. అధిష్టానం వద్ద పెరిగిన పలుకుబడి.. కేరళ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో తాను చేసిన ప్రచారానికి లభించిన గౌరవం.. చెప్పుకుంటూ పోతే రేవంత్ రెడ్డి ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నారు. అందువల్లే ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నారు.

2034 వరకు తానే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటానని.. ఇందులో ఏమాత్రం అనుమానం లేదని ఆయన స్పష్టం చేశారు. 2034 తర్వాత తాను దేశ రాజకీయాల్లోకి వెళ్ళిపోతానని పేర్కొన్నారు. దీంతో రేవంత్ గురించి కొద్ది రోజులుగా చర్చ నడుస్తోంది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో అంతగా వ్యతిరేకతలేదు. అలాగని గుడ్డి సానుకూలత కూడా లేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సన్న ధాన్యానికి బోనస్, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలు అడ్వాంటేజ్ గా మారిపోయాయి. ఇది రేవంత్ రెడ్డిని గ్రామీణ స్థాయిలో తిరుగులేని హీరోగా నిలబెడుతోంది.

కట్టు తప్పిన ఆర్థిక పరిస్థితి.. అప్పుల భారం పెరిగిపోవడం.. చెల్లింపుల ఒత్తిడి ఎక్కువ కావడం.. కొంతమంది మంత్రులు ఇష్టారాజ్యం.. భూములు.. ఇతర వ్యవహారాలలో కలగజేసుకోవడంతో సహజంగానే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడుతోంది. దీనికి తోడు ముఖ్యమంత్రి మీద ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తే.. ఏ మంత్రి కూడా కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. చివరికి ముఖ్యమంత్రి రంగంలోకి దిగి తనను తాను సెల్ఫ్ డిపెండ్ చేసుకుంటున్నారు.. ఇంతేగాక.. కొంతమంది నాయకుల నోటి దురుసు.. ప్రభుత్వాన్ని ప్రజల ముందు పలుచన చేస్తోంది.

జగిత్యాల నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి భారత రాష్ట్ర సమితిలో చేరారు. ఆయన చేరిక సందర్భంగా జగిత్యాల ప్రాంతంలో కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభలో కెసిఆర్ రేవంత్ రెడ్డి మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకుండానే కేసీఆర్ తనదైన శైలిలో ఆరోపణలు చేయడం విశేషం. సహజంగానే గులాబీ పార్టీకి సోషల్ మీడియాలో బలం ఉంది. ఒక వర్గం మీడియా కూడా ఆ పార్టీకి భజన చేస్తోంది.

కెసిఆర్ జగిత్యాల సభ తర్వాత.. తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారిపోతాయని అందరూ అనుకున్నారు. కాకపోతే ఊహించినట్టుగా అలా జరగడం లేదు. అలాగని కాంగ్రెస్ పార్టీకి విపరీతమైన సపోర్ట్ లభించడం లేదు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కీలక విషయాలను వెల్లడించారు. తాను 2034 వరకు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటానని స్పష్టం చేశారు. అంతేకాదు భారత రాష్ట్ర సమితికి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేస్తానని శపధం చేశారు. ఒక ముఖ్యమంత్రిగా ఆత్మ విశ్వాసం ఉండాలి.. కానీ అతి విశ్వాసం ఉండకూడదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జగిత్యాల సభ తర్వాత కెసిఆర్ సైలెంట్ అయిపోయారని.. ఇదే అదునుగా రేవంత్ రెడ్డి వైలెంట్ గా ప్రవర్తిస్తున్నారని పొలిటికల్ విశ్లేషకులు అంటున్నారు.. అయితే కెసిఆర్ వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారా.. ఇంకా ఏమైనా ప్రణాళికలు రూపొందిస్తున్నారా.. అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం కొనసాగే అవకాశం అధిష్టానం ఇవ్వదు. ఎందుకంటే పార్టీని మించి వ్యక్తులు ఎదిగిపోతే కాంగ్రెస్ అధిష్టానం తట్టుకోదు. పీవీ నరసింహారావు ఉదంతమే ఇందుకు బలమైన నిదర్శనం. పైగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో వలస బ్యాచ్ నిండిపోయిందని ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. పైగా ముఖ్యమంత్రి తీరుపై కొంతమంది మంత్రులు ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. అప్పట్లో అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేసినట్టు సమాచారం. అయితే రేవంత్ రెడ్డి తన పలుకుబడి పెంచుకోవడంతో.. అధిష్టానం కూడా సైలెంట్ అయిపోయినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా 2034లో ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉందా.. అది సాధ్యమవుతుందా.. పైగా కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు అధికంగా ఉంటాయి.

2023లో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనేక రకాలుగా మల్లగుల్లాలు పడింది. చివరికి ఓ నాయకుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. అలాంటప్పుడు 2034 వరకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారా.. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే మిగతా నాయకులు అలానే ఉండిపోతారా.. అసలే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అధికంగా ఉంటుంది. అలాంటప్పుడు వారు గనుక కెసిఆర్ కు టచ్ లోకి వెళ్తే.. పరిస్థితి ఏంటి.. అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి అనుకున్నంత ఈజీగా ఉండదని.. ఆయన ఏ విశ్వాసంతో అయితే చెప్పారో.. దానిని చివరి వరకు కొనసాగించాలని.. లేనిపక్షంలో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని కేసీఆర్ అన్నట్టుగానే.. రేవంత్ రెడ్డి “2034” టార్గెట్ ఉంటుందని.. రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ మూడు అలవాట్లు మీకుంటే.. వందేళ్లు జీవిస్తారు!

Healthy Lifestyle Habits
Healthy Lifestyle Habits

Healthy Lifestyle Habits: ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడైన ప్రాక్టీసింగ్ డాక్టర్‌గా గిన్నిస్ రికార్డ్ సృష్టించిన 103 ఏళ్ల డాక్టర్ హోవార్డ్ టక్కర్ జీవితం మనందరికీ ఒక రోల్ మోడల్. వందేళ్లు దాటినా కూడా ఆయన ఎంతో ఉత్సాహంగా, ఆరోగ్యంగా జీవిస్తూ తన వృత్తిని కొనసాగిస్తున్నారు. సుదీర్ఘమైన, సంతోషకరమైన జీవితం కోసం ఆయన ముఖ్యంగా మూడు అద్భుతమైన అలవాట్లను పాటించాలని సూచిస్తున్నారు. ఈ అలవాట్లు పాటిస్తే దీర్ఘాయిస్సు కూడా ఉంటుందని చెబుతున్నాడు. ఇంతకీ ఆ మూడు అలవాట్లు ఏంటంటే?

1. మెదడుకు పదును – నిరంతర అభ్యాసం:
మనం శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎప్పుడూ చురుగ్గా ఉండాలని డాక్టర్ టక్కర్ బలంగా నమ్ముతారు. వయసు పెరిగేకొద్దీ చాలామంది ఆలోచించడం, కొత్త విషయాలు నేర్చుకోవడం తగ్గించేస్తుంటారు. కానీ, మైండ్‌ను ఎప్పుడూ బిజీగా ఉంచడం వల్ల మెదడు కణాలు చురుగ్గా పనిచేస్తాయి. దీనికోసం ప్రతిరోజూ పుస్తకాలు చదవడం, కొత్త నైపుణ్యాలు (స్కిల్స్) నేర్చుకోవడం, విభిన్నమైన యాక్టివిటీస్‌లో పాల్గొనడం వంటివి చేయాలి. రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కూడా ఏదో ఒక పనిలో నిమగ్నమవ్వడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గకుండా ఉంటుందని, మెదడుకు ఎప్పుడూ పని పెట్టడమే దీర్ఘాయుష్షుకు మొదటి రహస్యమని ఆయన చెబుతారు.

2. నెగెటివిటీకి దూరం – ఒత్తిడి లేని మనసు
మానసిక ప్రశాంతత శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కోపం, ద్వేషం, అసూయ, అసంతృప్తి వంటి ప్రతికూల భావాలు మనిషిని లోలోపల కుంగదీస్తాయి. ఈ నెగెటివిటీ వల్ల శరీరంలో హానికరమైన హార్మోన్లు విడుదలై తీవ్రమైన మానసిక ఒత్తిడి (స్ట్రెస్) పెరుగుతుంది. ఈ ఒత్తిడే అనేక జబ్బులకు మూలకారణం అవుతుంది. అందుకే ఎవరిపైనా పగ, ద్వేషాలను మనసులో మోయకూడదని డాక్టర్ టక్కర్ సూచిస్తున్నారు. గతాన్ని వదిలేసి, క్షమించే గుణాన్ని అలవర్చుకుని ప్రశాంతంగా ఉండటం వల్ల గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది, జీవితం సంతోషంగా సాగుతుంది.

3. మితమే హితం – నియంత్రణతో కూడిన జీవనం
జీవితాన్ని ఆస్వాదించడం అంటే హద్దులు మీరడం కాదు. ప్రతి విషయంలోనూ ఒక పరిమితిని పాటించడం. తినే ఆహారం, పాటించే లైఫ్ స్టైల్, మన కోరికలు.. ఇలా ఏవైనా సరే ‘అతి’ కాకుండా చూసుకోవాలి. నచ్చిన ఆహారాన్ని తినవచ్చు, కానీ అది అమితంగా ఉండకూడదు. అదేవిధంగా భౌతిక సుఖాల కోసమో, మితిమీరిన కోరికల కోసమో పరుగులు పెట్టకుండా, ఉన్నదానితో తృప్తి చెందుతూ లిమిట్స్ పాటించాలి. నియంత్రణతో కూడిన ఈ జీవన శైలి శరీరాన్ని ఫిట్‌గా ఉంచడమే కాకుండా, జీవితంలోని ప్రతి క్షణాన్ని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేసేలా చేస్తుందని ఈ శతాధిక వృద్ధ డాక్టర్ అనుభవపూర్వకంగా సలహా ఇస్తున్నారు.