Home Blog Page 246

'బాహుబలి' ని అంత బడ్జెట్ తో తీయడం ఒక ఫెయిల్యూర్ ప్లాన్ అంటూ తమన్నా హాట్ కామెంట్స్..

Tamannaah Bhatia
Tamannaah Bhatia

Tamannaah Bhatia: సౌత్ ఇండియా లో అగ్ర తారగా ఒక వెలుగు వెలిగిన తమన్నా, ఇప్పుడు మన సౌత్ లో కంటే ఎక్కువగా నార్త్ ఇండియా లోనే సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో వరుసగా ఆమె ప్రతిష్టాత్మక చిత్రాల్లో భాగం అవుతూ వచ్చింది. ముఖ్యంగా ఆమె ఐటెం సాంగ్స్ ఎక్కువగా చేస్తూ వస్తోంది. ఎన్నో పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో కనిపించాల్సిన ఆమె , ఇలా ఐటెం సాంగ్స్ కి మాత్రమే పరిమితం కావడం అభిమానులకు అసలు నచ్చడం లేదు. తమన్నా రేంజ్ కి తగ్గ సినిమాలు చేయడం లేదని ఆమె అభిమానులు బాధ పడుతున్నారు. అయితే రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో , తన కెరీర్ లో మైల్ స్టోన్ గా నిల్చిన ‘బాహుబలి’ గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

ఆమె మాట్లాడుతూ ‘నేటి పరిస్థితులను బట్టీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే బాహుబలి కోసం తీసుకున్న ప్రతీ నిర్ణయం అద్భుతమైనది గా అనిపిస్తోంది. కానీ ఆ సినిమా తీస్తున్న సమయంలో ట్రేడ్ లెక్కలు పూర్తిగా భిన్నంగా ఉండేవి. కేవలం ఒక ప్రాంతీయ భాషకు సంబంధించిన సినిమా కోసం ఆరోజుల్లోనే 200 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేయడం సాధారణమైన విషయం కాదు. వ్యాపార పరంగా చూస్తే , అప్పటి పరిస్థితులను బట్టీ , ఫ్లాప్ కి దారి తీసే అత్యంత ప్రమాదకరమైన మార్గం లాగా అనిపించింది’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. ఆరోజుల్లో రాజమౌళి తన విజన్ కి తగ్గట్టు , ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఆ చిత్రాన్ని తెరకెక్కించాడు కాబట్టే , అంతటి అద్భుతమైన విజయాన్ని సాధించింది , లేదంటే చాలా పెద్ద సమస్యలు ఎదురయ్యేవి అంటూ చెప్పుకొచ్చింది తమన్నా.

ప్రస్తుతం ఈమె ద్రుష్టి మొత్తం బాలీవుడ్ మీదనే ఉంది. గత ఏడాది ఈమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఓదెల 2’ విడుదలై పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. అదే తెలుగు లో ఈమె చివరిగా కనిపించిన చిత్రం. ఆ సినిమా తర్వాత తన ఫోకస్ మొత్తం బాలీవుడ్ పైనే పెట్టింది. అక్కడ అడల్ట్ కంటెంట్ సినిమాలు చేయడానికి కూడా సిద్ధమైంది. ఇక ఈఏడాది ఆమె చేతిలో ‘ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’, ‘పురుషన్ ‘, ‘వీ శాంతారాం’, ‘రాకేష్ మరియా బయోపిక్’ , ‘రాగిణి 3’, ‘భోలే చుడియన్ ‘ వంటి హిందీ చిత్రాలు చేస్తోంది. వీటిల్లో కొన్ని చిత్రీకరణ దశలో ఉండగా , మరికొన్ని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.

పాకిస్తాన్ నెత్తి మీద కూర్చున్న అమెరికా.. చచ్చినట్టు దాయాది ఆడాల్సిందే..

Pakistan America Relations
Pakistan America Relations

Pakistan America Relations: పాకిస్తాన్ నెత్తి మీద అమెరికా కూర్చుంది. అందువల్లే అమెరికా ఆడించినట్టు పాకిస్తాన్ ఆడుతోంది. చివరికి తమ పరిపాలన విషయంలో కూడా అమెరికాకు విపరీతమైన ప్రాధాన్యం ఇచ్చి పాకిస్తాన్ బికారి దేశంగా మారిపోతోంది. పాకిస్తాన్ దేశాన్ని ఒక గాడిలో పెట్టేందుకు ఇమ్రాన్ ఖాన్ ప్రయత్నించినప్పటికీ.. అమెరికా శకుని ప్రయత్నం చేసి అతడిని జైలుకు పంపించింది.

అమెరికా దుర్నీతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ప్రయోజనాల కోసం ప్రపంచాన్ని తాకట్టు పెట్టడానికి కూడా అమెరికా వెనకాడదు. చివరికి తన ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాడని ఇమ్రాన్ ఖాన్ ను జైలు పాలు చేసింది అమెరికా. ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చైనా దేశానికి అనుకూలంగా ఉన్నాడు. రష్యా కు దగ్గర అయ్యాడు. సిల్క్ రోడ్డుకు అంగీకారం తెలిపారు. ఇంకా అనేక రకాల మార్గాలలో పాకిస్తాన్ దేశానికి ఆదాయాన్ని అందించేందుకు ఇమ్రాన్ ఖాన్ కష్టపడ్డాడు.

పాకిస్తాన్ దేశం చైనాకు దగ్గర కావడం.. రష్యాతో స్నేహాన్ని కొనసాగించడం.. ఇరాన్ దేశంతో సఖ్యతను ప్రదర్శించడం అమెరికాకు ఏమాత్రం నచ్చలేదు. అమెరికా తన సైనిక అధికారులతో పాకిస్తాన్ ఆర్మీకి వర్తమానం పంపింది. చేయాల్సిన పని చేసేసింది. చివరికి పాకిస్తాన్ దేశంలో ప్రధానమంత్రిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ మీద లేనిపోని కేసులు పెట్టించి జైలు పాలు చేసింది. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి.. సైనిక అధ్యక్షుడి మీద అమెరికాకు అంత సానుకూలత లేదు. ఏదైనా జరిగితే వారిద్దరిని కూడా జైలుకు పంపించి.. ఇమ్రాన్ ఖాన్ తో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అమెరికా వెనకాడదు. ఎందుకంటే అమెరికాకు కావాల్సింది కేవలం ప్రయోజనాలు మాత్రమే. విలువైన వనరులు.. విలువైన సంపద ఆ దేశానికి కావాలి. ఒకవేళ అడ్డుపడితే జైలుకు పంపిస్తుంది. అవసరమైతే ఉగ్రవాది అనే ముద్ర వేసి చంపేస్తుంది. ఒకవేళ బలమైన నాయకుడు గనుక అయివుంటే అతడి మీద విష ప్రచారం చేస్తూ ఉంటుంది. అమెరికా అంటేనే సైతాన్ దేశం. దానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

ఇమ్రాన్ ఖాన్ జైలుకు వెళ్తున్నప్పుడు అమెరికా మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశాడు. కొన్ని పార్టీలు అమెరికాకు తలవంచి తనకు ద్రోహం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇప్పటికీ ఇమ్రాన్ ఖాన్ జైలులో మగ్గిపోతున్నాడు. ఆ మధ్య అతడు చనిపోయాడని వార్తలు కూడా వచ్చాయి. అతడి ఆరోగ్యం క్షీణించిందని ప్రచారం కూడా జరిగింది. కానీ అవేవి నిజాలు కావని తర్వాత తేలింది. జైల్లో ఉన్నప్పటికీ కూడా ఆమధ్య పాకిస్తానీ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ భారీగా సీట్లను గెలుచుకోవడం విశేషం.

కేసు నమోదయింది.. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఉదంతం ఏ మలుపు తీసుకుంటుంది

Professor Nageshwar
Professor Nageshwar

Professor Nageshwar Controversy: ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మరో మంత్రి నాదెండ్ల మనోహర్ కలిశారు. రాజకీయ పరమైన అంశాలు.. అభివృద్ధి పరమైన అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. సుమారు 25 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జరిగింది ఒకటైతే.. బయటికి వచ్చింది మరొకటి. ముఖ్యంగా ప్రముఖ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ వీరి భేటీ పై తనదైన వ్యాఖ్యానం చేశారు.

జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని పవన్ కళ్యాణ్ ప్రతిపాదించినట్టు.. దానికి అమిత్ షా ఒప్పుకోన్నట్టు.. పైగా జగన్మోహన్ రెడ్డిని లాంగ్ టర్మ్ పొలిటికల్ ఫ్రెండ్ అని అమిత్ షా వ్యాఖ్యానించినట్టు నాగేశ్వర్ చెప్పుకొచ్చారు.. నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలను వైసిపి విపరీతంగా ప్రచారం చేయడం మొదలుపెట్టింది. నిన్నటి నుంచి అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో దీని గురించి విపరీతమైన చర్చలు నడుపుతోంది.. జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో సింపతిని కలగజేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాదు నిన్న నాగేశ్వర్ వ్యాఖ్యలు చేయడం.. ఈరోజు జగన్ విలేకరుల సమావేశంలో మాట్లాడటం.. పైగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానికి మందు కొద్దిరోజుల క్రితం చంద్రబాబు ఆగ్రహంగా మాట్లాడారని.. ఆ తర్వాత వైఎస్ కన్నుమూశారని.. జగన్ మాట్లాడారు.. దీంతో ఏపీ రాజకీయాలలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి..

నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన నాయకులు సోషల్ మీడియాలో.. మీడియాలో తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు.. ప్రొఫెసర్ నాగేశ్వర్ అమ్ముడుపోయారని.. ఊహాజనితమైన విషయాలను చెబుతున్నారని.. తద్వారా ప్రజలలో అశాంతి కలిగించేందుకు కుట్ర పన్నుతున్నారని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే నాగేశ్వర్, ఆయన మాట్లాడిన మాటలను టెలికాస్ట్ చేసిన ఛానల్ మీద పోలీసులకు జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. కాకినాడ జిల్లాలోని ఇంద్ర పాలెం పోలీస్ స్టేషన్లో జనసేన కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ మీద చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని నాగేశ్వర్ కు సూచించారు. మరోవైపు నాగేశ్వర్ మీద ఫిర్యాదు దాఖలైన నేపథ్యంలో.. పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది..

నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యల పట్ల అన్ని వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే రాజకీయంగా జరిగిన భేటీలో చర్చకు రాని విషయాలను ప్రస్తావించడం నాగేశ్వర్ లాంటి వ్యక్తులకు సరికాదని జనసేన నాయకులు అంటున్నారు.. మరోవైపు కూటమి ప్రభుత్వం నాగేశ్వర్ పై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు టిడిపి సోషల్ మీడియా కూడా నాగేశ్వర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది.. నాగేశ్వర్ వైసీపీ కండువా కప్పుకున్న ఫోటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. దీంతో నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యల వివాదం మరో మలుపుతీసుకుంది. అయితే ఇది ఎక్కడదాకా వెళ్తుందో చూడాల్సి ఉంది.

కాక్రోచ్ జనతా పార్టీ వెనుక పాకిస్థాన్ హస్తం.. ఇదిగో రుజువు

Cockroach Janata Party
Cockroach Janata Party

Cockroach Janata Party: ఒక పార్టీ అధికారంలోకి రావాలంటే జనాలు ఓట్లు వేయాలి.. ప్రత్యర్థి పార్టీకి మించి ఓట్లు వస్తేనే అధికారాన్ని దక్కించుకోవడానికి సాధ్యమవుతుంది. అలాకాకుండా కేవలం సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను చూసి అధికారంలోకి వస్తామనుకుంటే అంతకు మించిన భ్రమ ఇంకొకటి ఉండదు. సోషల్ మీడియా ప్రామాణికమైతే ఇన్స్టాగ్రామ్ లో విరాట్ కోహ్లీకి 100 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అలాంటప్పుడు ఆయన మన దేశానికి ప్రధానమంత్రి కావాలి కదా..

కొంతమంది ఏదో ఆగ్రహంలో పెట్టిన కాక్రోచ్ జనతా పార్టీ.. ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఏకంగా బిజెపి పార్టీకి మించిన ఫాలోవర్స్ ను సంపాదించుకొని కలకలం రేపుతుంది. దీనిని చాలామంది జనరేషన్ జెడ్ తరంలో రగిలిన ఉద్యమం అని పిలుస్తున్నారు. ఇది సార్వత్రిక ఎన్నికల్లో పెను మార్పుకు నాంది పలుకుతుందని జోస్యం చెబుతున్నారు. సాధారణంగా ఇటువంటి సంచలన విషయాలు తెరపైకి వచ్చినప్పుడు.. కొంతమంది స్వయం ప్రకటిత మేధావులు రకరకాలు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఇలాంటివారు కొద్ది రోజులు మీడియాలో హల్చల్ చేస్తారు. ఆ తర్వాత జనం మర్చిపోతారు.

మనదేశంలో ప్రజాస్వామ్యానికి ఒక విలువ ఉంది. దానికంటూ బలమైన నిర్మాణం ఉంది. అధికారంలో ఉన్న పార్టీ తప్పు చేస్తే.. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి అధికారాన్ని కట్టబెడతారు. ఒకవేళ రెండు పార్టీలు ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకోకపోతే.. మూడో పార్టీకి అధికారాన్ని దక్కేలా చేస్తారు. అంతేతప్ప సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఆధారంగా అధికారాన్ని కట్టబెట్టరు.. తాత్కాలిక ఆవేశాలు వేరు.. దీర్ఘకాలిక ప్రణాళికలు వేరు. రెండు కూడా ఒకే విధంగా ఎప్పుడూ ఉండవు. ఇక కాక్రోచ్ జనతా పార్టీ విషయంలో పాకిస్తాన్ హస్తము ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.. ఎప్పుడైతే ఈ పార్టీకి ఇన్స్టాగ్రామ్ లో విపరీతమైన ఫాలోవర్స్ నమోదయ్యారో.. అప్పుడే కొంతమంది దీని వెనక ఏదో జరుగుతోందని అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే పరిశోధన మొదలుపెట్టారు. చివరికి అసలు నిజాన్ని బయటపెట్టారు.

కాక్రోచ్ జనతా పార్టీ ని అనుసరిస్తున్న ఫాలోవర్స్ లో పాకిస్తాన్ నుంచి 49 శాతం, అమెరికా నుంచి 14 శాతం, బంగ్లాదేశ్ నుంచి 14%, ఇండియా నుంచి తొమ్మిది శాతం, యూకే, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, ఇతరులు మూడు శాతం, యూఏఈ నుంచి రెండు శాతం అనుసరిస్తున్నారు. దీని వెనక కుట్ర కోణం ఉందని.. అందువల్లే ఓవర్ నైట్ లో కాక్రోచ్ జనతా పార్టీకి ఈ స్థాయిలో ఫాలోవర్స్ ఉన్నారని సోషల్ మీడియాలో బిజెపి అనుకూల వ్యక్తులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఎవరీ అవిజిత్ దీప్కే.. కాక్రోచ్ జనతా పార్టీతో ఏం సాధిద్దామనుకుంటున్నారు

Abhijit Deepke
Abhijit Deepke

Abhijit Deepke: యూరప్ ప్రాంతంలో పర్యటిస్తున్న నరేంద్ర మోడీ గురించి ఏ స్థాయిలో అయితే చర్చ జరుగుతోందో.. అభిజిత్ దీప్కే గురించి కూడా అదే స్థాయిలో చర్చి నడుస్తోంది. అలాగని ఇతడేమీ కాకలు తీరిన రాజకీయ నాయకుడు కాదు. వేల కోట్లు సంపాదించిన వ్యాపారవేత్త కాదు. మీడియాలో సెలబ్రిటీ కాదు. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ కాదు. ఒక సాధారణ వ్యక్తి.. అసాధారణమైన ఆలోచనతో ఇప్పుడు దేశ రాజకీయాలను తీవ్రంగా మార్చేసే పనిలోపడ్డాడు.

సాధారణంగా మన ఇంట్లో బొద్దింకలు కనిపిస్తే చిరాకు పడతాం. బొద్దింకలను చంపడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తాం. బొద్దింకలను ఏమాత్రం కూడా సహించం. కానీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నిరుద్యోగులను ఉద్దేశించి బొద్దింకలతో పోల్చిన తర్వాత అభిజిత్ కాక్రోచ్ జనతా పార్టీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీ ఏర్పాటు కేవలం ఆన్లైన్లోనే జరగడం విశేషం.. ఇప్పుడు ఈ పార్టీకి సోషల్ మీడియా ఖాతాలలో విపరీతమైన ఆదరణ ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిని మించి ఈ పార్టీకి ఫాలోవర్స్ ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అభిజిత్ కాక్రోచ్ జనతా పార్టీని ఏర్పాటు చేశారు. ఇతడు ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్. రాజకీయ అంశాల గురించి గతంలో ఇతడు విపరీతంగా పనిచేశాడు. పూణేలో జర్నలిజంలో అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఇతడు ఉన్నత చదువుల నిమిత్తం బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ లో మాస్టర్స్ డిగ్రీ విద్యను అభ్యసిస్తున్నాడు. 2020 నుంచి 2023 వరకు సోషల్ మీడియాలో వాలంటీర్ గా పనిచేశాడు. 2020లో అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలో ఆప్ ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. నాడు అభిజిత్ మీమ్స్ ఆధారిత డిజిటల్ క్యాంపెయిన్ లో పాల్గొన్నాడు. ఇది ఆన్లైన్లో యువత భాగస్వామ్యాన్ని విపరీతంగా ప్రభావితం చేసింది. 2026 లో ఇతడు కాక్రోచ్ జనతా పార్టీని ఏర్పాటు చేశాడు. ఈ పార్టీకి సంబంధించి అనేక విధానాలను రూపొందించాడు..

1.ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ అధికారంలోకి వస్తే పదవీ విరమణ తర్వాత ఏ చీఫ్ జస్టిస్ కూడా రాజ్యసభ సీటు పొందడానికి అర్హుడు కాడు.

2.కాక్రోచ్ జనతా పార్టీ అధికారంలో ఉన్న ప్రాంతంలో.. ప్రతిపక్షంలో ఉన్న ప్రాంతంలో ఒక వ్యక్తికి సంబంధించిన ఓటు హక్కును తొలగిస్తే ఉపా చట్టం కింద అరెస్టు చేస్తారు. పౌరుల ఓటు హక్కును తొలగించడానికి ఉగ్రవాదం కంటే దారుణమైన నేరంగా సిజెపి భావిస్తోంది.

సిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు చట్టసభలలో 50% రిజర్వేషన్లు కల్పిస్తారు.

వ్యాపారవేత్తల ఆధ్వర్యంలో కొనసాగే మీడియా సంస్థల లైసెన్సులు మొత్తం తొలగిస్తారు.

ఒక పార్టీలో గెలిచిన తర్వాత.. మరొక పార్టీలోకి వెళ్లే ఎమ్మెల్యే లేదా ఎంపీలపై 20 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా.. ఇతర పదవులు చేపట్టకుండా నిషేధం విధిస్తారు.

సిజెపిలో చేరాలంటే..

కాక్రోచ్ జనతా పార్టీలో చేరే నిరుద్యోగి సిద్ధాంత పరంగా ఉద్యోగం లేని వ్యక్తి అయి ఉండాలి.

శారీరకంగా బద్ధకంగా ఉన్నప్పటికీ.. మెదడు అత్యంత చైతన్యవంతంగా ఉన్న సోమరిపోతులు ఈ పార్టీలో చేరడానికి అర్హులు.

కనీసం రోజుల్లో 11 గంటల పాటు ఆన్లైన్లో ఉండే వ్యక్తులు ఈ పార్టీ లో చేరేందుకు అర్హత కలిగి ఉంటారు.

వృత్తి గతంగా విమర్శించగలగడం.. చేసే విమర్శలు అత్యంత పదునుగా ఉండడం.. నిజాయితీని ప్రదర్శించడం.. సమాజానికి పనికి వచ్చే ఆలోచనలు చేయడం వంటి వారు కూడా ఈ పార్టీలో చేరవచ్చు.

బీజేపీని మించిపోయిన కాక్రోచ్ జనత పార్టీ.. Gen z తరానికి కోపం వస్తే అంతే సంగతులు..

Cockroach Janata Party
Cockroach Janata Party

Cockroach Janata Party: ఒక వ్యక్తికి వచ్చే కోపం.. పదిమందికి వస్తే అది ఉద్యమంగా మారుతుంది. ఆ తర్వాత అనేక గళాలు దానికి తోడైతే అప్పుడు దాన్ని తీవ్రత మారిపోతూ ఉంటుంది. ఇటువంటి ఉద్యమాలు ఈ ప్రపంచంలో చాలా జరిగాయి. చాలా మార్పులకు కారణమయ్యాయి. వ్యక్తులను దించేశాయి. వ్యవస్థలను మార్చేశాయి. నిద్రాణమైన సమాజాన్ని చైతన్యవంతం చేశాయి. అందుకే ఆగ్రహం అనేది ఒక వ్యక్తిలో అర్థవంతంగా కలిగితే కచ్చితంగా అది వ్యవస్థను మారుస్తుందని నిపుణులు అంటుంటారు.

మనదేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నిరుద్యోగ యువతను బొద్దింకలుగా పోల్చారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో ప్రచారం వేరే విధంగా మొదలైంది. కాక్రోచ్ అని సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలు జనరేషన్ జెడ్ లో ఆగ్రహాన్ని కలిగించాయి. ఆ తర్వాత సామాజిక మాధ్యమాలలో క్యాంపెయిన్ మొదలైంది. ఆ ఉద్యమం ఇప్పుడు ప్రకంపనలకు దారితీస్తోంది.. ఏకంగా కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటయింది. కాకపోతే అది సోషల్ మీడియాలో మాత్రమే. ఈ పార్టీకి వ్యవస్థాపకుడిగా అభిజిత్ దీప్కే

కాక్రోచ్ జనతా పార్టీని ఏర్పాటుచేసిన కొద్ది రోజుల వ్యవధిలోనే ఏకంగా 40 వేలకు మందికి పైగా సభ్యులు ఇందులో చేరారు. చివరికి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ లు మహువ, కీర్తి ఆజాద్ ఇందులో చేరడం విశేషం.. ఈ పార్టీ గురించి సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా విపరీతమైన చర్చ నడుస్తోంది. ఏకంగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి మించిన స్థాయిలో ఈ పార్టీకి ఫాలోవర్స్ నమోదు కావడం విశేషం. పైగా ఈ పార్టీ గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ నడుస్తోంది. ఈ పార్టీ అధికారంలోకి వస్తే మన దేశాన్ని బొద్దింకలు పరిపాలిస్తాయని సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు.

సాధారణంగా మన సమాజంలో బొద్దింకలను హీనంగా చూస్తారు. సుప్రీం కోర్ట్ జడ్జి నిరుద్యోగ యువతను బొద్దింకలతో పోల్చి చెప్పడంతో జనరేషన్ జెడ్ లో ఆగ్రహం కలిగింది.. దీంతో సోషల్ మీడియాలో ఉద్యమం తారస్థాయిలో జరుగుతోంది. విపరీతమైన చర్చ నడుస్తోంది. అయితే ఈ చర్చ రాజకీయాల చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో.. 2029 లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో నవ యువకులు ఫలితాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మోడీ క్రేజ్ అట్లుంటది మరీ.. దెబ్బకు పార్లే మెలోడీ ఎక్కడికో వెళ్లిపోయింది..

Narendra Modi Melody Chocolates
Narendra Modi Melody Chocolates

Narendra Modi Melody Chocolates: అప్పట్లో నరేంద్ర మోడీ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కి వెళ్లారు. దేశ ప్రజలకు ఒక పిలుపునిచ్చారు.. విహారయాత్రలకు విదేశాలకు వెళ్లకూడదని.. మనదేశంలో ఉన్న ఇటువంటి ప్రాంతాలను సందర్శించాలని.. అప్పుడు పర్యాటకంగా దేశానికి ఆదాయం లభిస్తుందని.. స్థానికంగా ఉన్న వ్యక్తులకు ఉపాధి కలుగుతుందని పేర్కొన్నారు. నరేంద్ర మోడీ ఆ మాట చెప్పడమే ఆలస్యం.. ఒక్కసారిగా అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కు పర్యాటకులు పెరిగిపోయారు. ఇదే సమయంలో మాల్దీవులు ప్రాంతానికి వెళ్లే పర్యటకుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. చివరికి ఆ దేశంలో ఆర్థికంగా సమస్యలు, రాజకీయంగా ఇబ్బందులు ఏర్పడ్డాయి. చివరికి మాల్దీవులు ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితి ఏర్పడింది.

ఇప్పుడు నరేంద్ర మోడీ మరో సంచలనానికి నాంది పలికారు. ఇటలీలో ప్రకటించిన నరేంద్ర మోడీ.. ఆ దేశ ప్రధాని జార్జియా మెలోని కి అపురూపమైన కానుక ఇచ్చారు. ఆ కానుక పేరు మెలోడీ చాక్లెట్లు. దీంతో మెలోడీ చాక్లెట్లు మీడియాలో.. సోషల్ మీడియాలో విపరీతమైన సర్కులేషన్ లో ఉంది. మెలోని, మోడీ కలిసి మెలోడీ చాక్లెట్లను ఇచ్చుకుంటూ ఫోటోలకు ఫోజురించారు. దీంతో మెలోడీ బ్రాండ్ విలువ పెరిగిపోయింది.

సాధారణంగా మెలోడీ చాక్లెట్లను పార్లే కంపెనీ తయారుచేస్తోందని అందరూ అనుకుంటున్నారు. ఈ చాక్లెట్లకు పార్లే కంపెనీకి ఎటువంటి సంబంధం లేదు. పైగా ఈ కంపెనీ స్టాక్ మార్కెట్లో మెలోడీ చాక్లెట్లను తయారుచేసే పార్లే ప్రొడక్ట్స్ లిస్ట్ అవలేదు. మోడీ స్వయంగా మెలోనికి మెలోడీ చాక్లెట్లు ఇవ్వడంతో ఒక్కసారిగా ఆ బ్రాండ్ విలువ పెరిగిపోయింది. అయితే చాలామంది పార్లే ఇండస్ట్రీస్ మెలోడీ చాక్లెట్ తయారు చేస్తోందని అనుకున్నారు. కానీ ఆ సంస్థ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ విభాగంలో కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ కంపెనీ బిఎస్ఈ లో లిస్ట్ అయింది. ఇటీవల పునరుత్పాదక విభాగంలో కూడా ఈ కంపెనీ అడుగుపెట్టింది. వరుసగా రెండు రోజులపాటు పార్లే కంపెనీ షేర్లు అప్పర్ సర్క్యూట్ అందుకున్నాయి. అయితే ఈ కంపెనీ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే.. స్టాక్స్ కొంతకాలంగా ఒడిదుడుకులకు గురవుతున్నాయి.. అయితే ఈ సంస్థ షేర్ ముఖ విలువ గత మూడు నెలల్లో 35% తగ్గింది. ఇక ఏడాది ప్రారంభంలో అయితే 41% తగ్గిపోయింది.

నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన తర్వాత ఈ కంపెనీ షేర్ విలువ పెరిగిపోయింది. అయితే కొంతకాలంగా నష్టాలు కలవరపెడుతున్న నేపథ్యంలో ఈ కంపెనీ తేరుకుంది. అప్పర్ సర్క్యూట్ ఇంకా కొద్దిరోజులపాటు సాగితే కంపెనీ కష్టాలు మొత్తం తీరుతాయని.. అయితే ఇప్పటికే మీడియాలో అసలు విషయం తెలియడంతో మదుపరులు ఆ నిర్ణయం తీసుకోకపోవచ్చు అని తెలుస్తోంది.

'పెద్ది' క్లైమాక్స్ 'ఉప్పెన' ట్విస్ట్ కి 100 రెట్లు ఎక్కువ ఉంటుందా.. ఇదేమి ప్లానింగ్ బాబోయ్..

Ram Charan Peddi Collections
Ram Charan Peddi Collections

Ram Charan Peddi Climax Twist: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ‘పెద్ది’ చిత్రం వచ్చే నెల 4 న విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే డైరెక్టర్ బుచ్చి బాబు అనేక ఇంటర్వ్యూలు ఇచ్చాడు , సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఆయన ఇంటర్వ్యూ లో మాట్లాడిన మాటలే కనిపిస్తున్నాయి. సినిమా పై బజ్ పెంచడానికి ఈ ఇంటర్వ్యూలు చాలా బాగా కలిసొచ్చింది. నేడు రామ్ చరణ్, బుచ్చి బాబు ఒక డ్రైవ్ కి వెళ్తూ చేసిన ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ ఇంటర్వ్యూ అభిమానులను ప్రత్యేకంగా ఆకర్షించింది , సినిమాకు సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. ముఖ్యంగా క్లైమాక్స్ గురించి రామ్ చరణ్ చెప్పిన మాటలు వింటే అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అందరూ అప్పట్లో ‘ఉప్పెన’ మూవీ క్లైమాక్స్ ట్విస్ట్ ని చూసి షాక్ కి గురయ్యారు, కానీ ‘పెద్ది’ క్లైమాక్స్ ట్విస్ట్ ని చూసి ఏమైపోతారో , ఉప్పెన క్లైమాక్స్ ట్విస్ట్ కి వంద రెట్లు ఎక్కువ ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు రామ్ చరణ్. స్వయంగా హీరో నే క్లైమాక్స్ గురించి ఈ రేంజ్ లో చెప్పాడంటే , సినిమా ఎలా ఉండుంటుందో ఊహించుకోవచ్చు , రామ్ చరణ్ చెప్పినట్టుగా క్లైమాక్స్ ఆ రేంజ్ లో ఉంటే మాత్రం ‘రంగస్థలం’ ని మించిన బ్లాక్ బస్టర్ అవుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం , ఈ చిత్రం క్లైమాక్స్ లో రామ్ చరణ్ కి కాళ్ళు పోతాయని , అయినప్పటికీ కూడా ఆయన రన్నింగ్ రేస్ పోటీలలో పాల్గొంటాడని, ఆ సీక్వెన్స్ ప్రేక్షకుల రోమాలను నిక్కపొడిచేలా చేస్తుందని అంటున్నారు.

అంతే కాకుండా రామ్ చరణ్ కి ఈ చిత్రం లో బాగా నచ్చిన సన్నివేశాలేంటి అని బుచ్చి బాబు ఈ ఇంటర్వ్యూ లో అడగ్గా, నాకు ఢిల్లీ ఎపిసోడ్స్ చాలా బాగా కనెక్ట్ అయ్యింది అంటూ చెప్పుకొచ్చాడు రామ్ చరణ్. ఓవరాల్ గా వీళ్ళ మాటల్ని బట్టీ చూస్తుంటే ఈ సినిమా ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా ఉండబోతుందని, రామ్ చరణ్ నట విశ్వరూపాన్ని చూస్తారని అంటున్నారు విశ్లేషకులు. జూన్ 3 న ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శింపబడే ప్రీమియర్ షోస్ తోనే ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు , దీనికి ఆడియన్స్ నుండి కాస్త డివైడ్ రెస్పాన్స్ వచ్చింది. రేపు ఈ చిత్రానికి సంబంధించిన ఐటెం సాంగ్ ని విడుదల చేయబోతున్నారు, ఈ ఐటెం సాంగ్ లో శృతి హాసన్ రామ్ చరణ్ తో కలిసి చిందులేసింది.

సీన్ మొత్తం రివర్స్ అయ్యింది అంటూ పవన్ కళ్యాణ్ పై మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ పోస్ట్..

Chiranjeevi Tweet On Pawan Kalyan
Chiranjeevi Tweet On Pawan Kalyan

Chiranjeevi Tweet On Pawan Kalyan: ‘మన శంకర వరపరసాద్ గారు’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ బాబీ తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. కర్ణాటక లో టాప్ లీడింగ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ గా పేరు తెచ్చుకున్న KVN ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. గత నెలలోనే మొదలు అవ్వాల్సిన ఈ సినిమా, ఇదే సంస్థ లో తెరకెక్కిన ‘జన నాయగన్ ‘ చిత్రం విడుదలకు ముందే లీక్ అవ్వడం తో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే ఎట్టకేలకు నేడు ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి , ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టాడు. అందుకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

అయితే ఈ శుభ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కాసేపటి క్రితమే ఒక ట్వీట్ వేస్తూ ‘నేడు నాకు , కళ్యాణ్ బాబు కి మధ్యలో క్లాప్ కనిపిస్తుంటే , 30 సంవత్సరాల క్రితం ఇదే సీన్ రివర్స్ లో జరిగిన సందర్భం గుర్తుకు వస్తోంది’. అదే ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రం ప్రారంభోత్సవం. నేడు డిప్యూటీ సీఎం హోదాలో తనకు ఉన్నటువంటి విలువైన సమయాన్ని తీసుకొని వచ్చి , నా 158 వ సినిమా ముహూర్తం లో పాల్గొని , మా యూనిట్ మొత్తానికి క్లాప్ ఇచ్చి సభ్యులందరినీ ఆనందపరిచినందుకు ధన్యవాదాలు , లవ్ యూ కళ్యాణ్’ అంటూ చిరంజీవి వేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. చాలా కాలం తర్వాత ఈ మెగా లెజెండ్స్ ని ఒకే ఈవెంట్ లో చూడడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

వాస్తవానికి ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ముఖ్య అతిథిగా రావాల్సి ఉంది. మేకర్స్ రామ్ చరణ్ వస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు కూడా, కానీ ఆయన ‘పెద్ది’ మూవీ ప్రొమోషన్స్ లో ఉండడం వల్ల , రాలేకపోయాడని అంటున్నారు. ఒకవేళ రామ్ చరణ్ కూడా వచ్చునంటే మెగా హీరోలందరినీ ఒకే చోట చూసే అదృష్టం అభిమానులకు కలిగి ఉండేది, బ్యాడ్ లక్ , కనీసం ‘పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయినా ఈ మూమెంట్ ని ఎంజాయ్ చేసే అదృష్టం అభిమానులకు కలుగుతుందో లేదో చూడాలి. ఇకపోతే ఈ చిత్రం అనశ్వర రాజన్ మెగాస్టార్ చిరంజీవి కి కూతురిగా నటించబోతున్న సంగతి తెలిసిందే , ఆమె కూడా నేడు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైంది.

6 రోజుల్లో 178 కోట్లు కొల్లగొట్టిన 'కరుప్పు'.. తెలుగు వెర్షన్ నుండి వచ్చిన గ్రాస్ ఎంతంటే..

Karuppu Movie Collections
Karuppu Movie Collections

Karuppu Movie 6 Days Collections: తమిళ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘కరుప్పు’. ఎలాంటి అంచనాలు లేకుండా చాలా సాధారణంగా విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తున్న వసూళ్ల సునామీ ని చూసి ట్రేడ్ పండితులు సైతం విస్మయానికి గురయ్యారు. సూర్య కం బ్యాక్ ఇస్తే ఎలా ఉంటుందో మరోసారి అందరికీ అర్థం అయ్యేలా చేసింది ఈ చిత్రం. 14 ఏళ్ళ నుండి కెరీర్ లో సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతూ , ఇక సూర్య కెరీర్ ముగిసిపోయింది అని అందరూ అనుకుంటున్న సమయం లో ఈ చిత్రం ఇచ్చిన విజయం , ఆయన అభిమానుల్ని గర్వంగా కాలర్ ఎగరేసుకునేలా చేసింది. వీకెండ్స్ లో సూపర్ హిట్ సినిమాలకు రన్ రావడం సర్వసాధారణం. కానీ ఈ చిత్రం వర్కింగ్ డేస్ లో కూడా ఇరగకుమ్మేస్తుంది. నిన్న కూడా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 15 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే , ముందుగా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 6 రోజుల్లో 20 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అందులో నైజాం ప్రాంతం నుండి 9 కోట్ల రూపాయిల గ్రోస్ వసూళ్లు రాగా, ఆంధ్రా + సీడెడ్ ప్రాంతం నుండి 11 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. షేర్ వసూళ్లు దాదాపుగా 10 కోట్ల రూపాయిల వరకు వచ్చింది . అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఈ సినిమాకు సంబంధించిన తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని 7 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయగా, వాళ్లకు 3 కోట్ల రూపాయిల లాభాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే తమిళనాడు నుండి 80 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, కర్ణాటక రాష్ట్రం నుండి 14 కోట్ల రూపాయిలు వచ్చాయి.

అదే విధంగా కేరళ రాష్ట్రము నుండి 10 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 2 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా ఓవర్సీస్ నుండి ఈ చిత్రానికి 54 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా , ఓవరాల్ గా ఈ చిత్రానికి 178 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు , 86 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. 70 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరగ్గా, బయ్యర్స్ కి 16 కోట్ల రూపాయలకు పైగా లాభాలు వచ్చాయి. ఈ వీకెండ్ తో ఈ చిత్రం తమిళనాడు నుండి 100 కోట్ల గ్రాస్ వసూళ్లు మార్కుని అందుకోనుంది, అదే విధంగా ఓవర్సీస్ లో ప్రతిష్టాత్మక 60 కోట్ల గ్రాస్ మార్కుని కూడా ఈ వీకెండ్ తోనే అందుకోనుంది ఈ చిత్రం.

పహల్గాం ఉగ్రదాడి.. పాకిస్తాన్ పాత్ర పై NIA కీలక చార్జిషీట్.. అందులో ఏముందంటే..

Pahalgam terror attack NIA chargesheet
Pahalgam terror attack NIA chargesheet

Pahalgam terror attack NIA chargesheet: పహల్గాం ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని భారత్ పదేపదే ఆరోపించింది. ప్రపంచ వేదికల ముందు కూడా దీనిని ప్రకటించింది. అయితే దీనిపై కొన్ని దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.. అయితే ఇప్పుడు పహల్గాం ఉగ్రదాడి గురించి జాతీయ దర్యాప్తు సంస్థ కీలక విషయాలను బయటపెట్టింది. దీంతో పాకిస్తాన్ అసలు రూపం మరోసారి ప్రపంచ దేశాల ముందు బయటపడుతుంది.

పహల్గాం దాడి నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ కొంతకాలంగా విచారణ చేపడుతుంది.. ఈ సందర్భంగా తాజాగా కీలక నిజాలు వెలుగులోకి వచ్చాయి. “పర్యాటకులకు స్వర్గధామం లాగా ఉండే పహల్గాం లో భారత్ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ చేసిందని.. ఉగ్రవాదులు ఆరోపించారు. పాకిస్తాన్ మీద లేనిపోని ఆరోపణ చేసేందుకు భారత్ ప్రయత్నించిందని” ఉగ్రవాదులు తప్పుడు ప్రచారం చేశారని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రకటించింది. అయితే ఈ దారుణానికి సంబంధించిన వ్యవహారం మొత్తం పాకిస్థాన్ నుంచి జరిగిందని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తన దర్యాప్తులో తేలిన వివరాల ద్వారా ప్రకటించింది. అంతేకాదు వీటికి సంబంధించిన పక్కా ఆధారాలను కూడా బయట పెట్టింది.

లష్కరే తోయిబా అనే ఉగ్రవాద సంస్థకు అనుబంధం సంస్థగా ఉండే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ కు చెందిన హ్యాండ్లర్లు పాకిస్తాన్ నుంచి ఉగ్రదాడికి ప్రణాళిక రూపొందించారు. ఉగ్రదాడులు జరిగిన అనంతరం.. దీనికి అమ్మదే బాధ్యత అంటూ కాశ్మీర్ ఫైట్ అనే టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించడం విశేషం. ఆ తర్వాత దీనిపై అంతర్జాతీయంగా విమర్శలు వచ్చాయి. ఐక్యరాజ్యసమితిలో కూడా ఈ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించారు. దీంతో ది రెసిస్టెన్స్ ఫ్రంట్ కాస్త వెనకడుగు వేసింది. అంతేకాదు తాము ఉపయోగిస్తున్న టెలిగ్రామ్ ఛానల్ హ్యాక్ అయిందని ప్రకటించింది.

ఈ ఛానల్ పాకిస్తాన్ లోని కైబర్ ఫంక్తుక్వా నుంచి ఆపరేట్ అయిందని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేపట్టిన దర్యాప్తులో తేలింది. మరోవైపు ఇదే ఉగ్రవాద సంస్థకు సంబంధించిన మరో ఛానల్ రావల్పిండి ప్రాంతం నుంచి ఆపరేట్ అయినట్టు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రకటించింది.. అంతేకాదు ఈ ఉగ్రదాడికి పాల్పడిన వారిలో ఫైజల్, హబీబ్, అంజా అనే ఉగ్రవాదుల ఐపీ అడ్రస్.. ఫోన్ నెంబర్ల ఆధారంగా.. పాకిస్తాన్లో ఉన్న సూత్రధారులతో వీరికి బలమైన సంబంధాలు ఉన్నట్టు ఎన్ఐఏ తన ఇన్వెస్టిగేషన్లో ప్రకటించింది.. అయితే ఆపరేషన్ మహదేవ్ చేపట్టిన భారత దళాలు ఉగ్రవాదులలో ముగ్గురిని అంతం చేశాయి. వారి వద్ద ఫోన్లను స్వాధీనం చేసుకున్నాయి. ఆ ఫోన్లను పాకిస్తాన్లోనే వారు కొనుగోలు చేసినట్టు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విచారణలో బయటపడింది. ఇందులో ఒక ఫోన్ లాహోర్ ప్రాంతంలో ఉన్న చిరునామాకు ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేశారు. మరో ఫోన్ కరాచీ ప్రాంతంలో కొన్నారు.

'దృశ్యం 3' కి నెగెటివ్ టాక్.. కానీ ఓపెనింగ్స్ మాత్రం సెన్సేషనల్.. ఎంత గ్రాస్ వచ్చిందంటే..

Drishyam 3 Opening Day Collections
Drishyam 3 Opening Day Collections

Drishyam 3 Opening Day Collections: మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరో గా నటించిన ‘దృశ్యం 3’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళం , మలయాళం మరియు కన్నడ భాషల్లో గ్రాండ్ గా విడుదలైంది. విడుదలకు ముందు ఈ చిత్రం పై ఉన్నటువంటి అంచనాలు సాధారమైనవి కాదు. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అంతటి భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి మొదటి ఆట నుండే డివైడ్ టాక్ రావడం గమనార్హం. సినిమా చాలా సాదాసీదాగా ఉందని, క్లైమాక్స్ తప్ప పెద్దగా చెప్పుకోడానికి ఏమి లేదని , మొదటి రెండు భాగాలతో పోలిస్తే చాలా యావరేజ్ సినిమా అని , అసలు ‘దృశ్యం 2’ తో ముగించి ఉండుంటే బాగుండేదని , ‘దృశ్యం 3’ అవసరం లేదని అంటున్నారు.

టాక్ డివైడ్ గానే వచ్చినప్పటికీ , కలెక్షన్స్ మాత్రం దుమ్ము లేపేస్తోంది. బుక్ మై షో లో ఈ చిత్రానికి గంటకు 40 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. ఒక మలయాళం సినిమాకు ఈ రేంజ్ లో టికెట్స్ అమ్ముడుపోవడం వంటివి గతం లో ఎప్పుడూ జరగలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ 40 కోట్ల రూపాయలకు పైగా ఉండగా , ఈ కరెంటు బుకింగ్స్ ద్వారా మరో 30 నుండి 40 కోట్ల గ్రాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని , ఓవరాల్ గా మొదటి రోజు ఈ చిత్రానికి 80 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కచ్చితంగా వస్తుందని అంటున్నారు. తెలుగు వెర్షన్ లో కూడా ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ఓపెనింగ్స్ ఇక్కడ కూడా గట్టిగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా సెన్సేషనల్ ఓపెనింగ్ దక్కింది , మరి లాంగ్ రన్ ఎలా ఉంటుందో, డివైడ్ టాక్ ప్రభావం ఈ సినిమా పై ఎంత పడుతుందో చూడాలి.

'దృశ్యం 3' మూవీ ఫుల్ రివ్యూ.. సినిమా ఇలా ఉంటుందని అసలు ఊహించలేదు..

Drishyam 3 Movie Review
Drishyam 3 Movie Review

Drishyam 3 Movie Review: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిస్టరీ లో , థియేటర్స్ లో ఆడియన్స్ కి అబ్దుతమైన థ్రిల్లింగ్ అనుభూతి ని కలిగించిన చిత్రం ‘దృశ్యం’. ఈ చిత్రం మలయాళం లో ఇండస్ట్రీ హిట్ అవ్వడం తో కొన్నాళ్ళకు అన్ని భాషల్లోనూ రీమేక్ చేశారు. తెలుగు లో వెంకటేష్ , హిందీ లో అజయ్ దేవగన్, తమిళం లో కమల్ హాసన్ వంటి వారు చేశారు, రెస్పాన్స్ అదిరిపోయింది. సీక్వెల్ మలయాళం , తెలుగు వెర్షన్స్ ని వెంకటేష్ , మోహన్ లాల్ చేసి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్నారు కానీ , ఈ రెండు సినిమాలు ఓటీటీ లో నేరుగా విడుదలయ్యాయి, కానీ హిందీ లో మాత్రం థియేటర్స్ లో విడుదలై పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. ఇప్పుడు ఈ సిరీస్ లో భాగంగా తెరకెక్కిన ‘దృశ్యం 3’ నేడు ప్రపంచవ్యాప్తంగా హిందీ మినహియించి అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి ఈ రివ్యూ లో చూసి తెలుసుకుందాం.

కథ :

‘దృశ్యం 2’ లో కథ ఎక్కడైతే ముగిసింది , ‘దృశ్యం 3’ ని అక్కడి నుండే మొదలు పెట్టారు. వరుణ్ హత్య సుసులో జార్జ్ కి ఎలాంటి సంబంధం లేదని తేల్చిన హై కోర్టు , అతనిపై నమోదు చేయబడిన కేసు ని కొట్టిపారేస్తుంది. ఇక అప్పటి నుండి జార్జ్ తన కుటుంబం తో కలిసి కొత్త జీవితాన్ని మొదలు పెడుతాడు. కొన్నాళ్ళకు ఆయన సినీ నిర్మాతగా మారి , తన జీవితం లో జరిగిన సంఘటనలను ఆధారంగా తీసుకొని ‘దృశ్యం’ అనే సినిమా తీసి భారీ హిట్ ని అందుకుంటాడు. మరో వైపు తన పెద్ద కూతురు కి పెళ్లి చెయ్యాలని సంబంధాలను చూస్తూ ఉంటాడు జార్జ్. కానీ ఒక్క సంబంధం కూడా కుదరదు, చివరి నిమిషం వరకు వచ్చి ఆగిపోతుంటాయి. అప్పుడు జార్జ్ కి అనుమానం వచ్చి ఆరా తీయగా, కొందరు శత్రువులు తన కూతురు పెళ్లి జరగనివ్వకుండా అడ్డు పడుతున్నారని తెలుస్తుంది.

అంతే కాదు , వరుణ్ హత్య కేసులో తన కుమార్తెను జైలు పాలు చెయ్యాలని కూడా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇంతకీ జార్జ్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నది ఎవరు? , జార్జ్ ని ఎలా అయినా దెబ్బ కొట్టి అరెస్ట్ చెయ్యాలని చూస్తున్న పోలీసులు ఈ కుట్రని ఎలా వాడుకున్నారు?, ఈసారి తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం జార్జ్ ఏమి చేశాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:

మన తెలుగు దృశ్యం , దృశ్యం 2 చిత్రాల్లో నటించిన నటీనటులు వేరు, మలయాళం లో నటించిన నటీనటులు వేరు, మీనా మినహా, మిగిలిన వాళ్లంతా మనకు కొత్త ముఖాలు, ఈ కారణం చేత , మొదటి రెండు భాగాలకు సంబంధించిన నటీనటుల కొనసాగింపు ని గుర్తు పట్టడం ఆడియన్స్ కి చాలా కష్టం అవుతుంది. ఈ కారణం చేత పాత్ర తీరు తెన్నెలు అర్థం చేసుకోవడం, దాని అనుసంధానంగా వచ్చే ట్విస్టులు అర్థం చేసుకోవడం చాలా కష్టమైన పని. టైటిల్ పడే ముందే డైరెక్టర్ మొదటి రెండు భాగాలకు సంబంధించిన స్టోరీ ని ఒక గ్లింప్స్ లాగా చూపించి , మూడవ భాగం లోకి తీసుకొస్తాడు. అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం స్క్రీన్ ప్లే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా అనిపిస్తుంది , కథ ముందుకు సాగుతుంది అనే ఫీలింగ్ ఎవరికీ కలగదు. తన కూతురు పెళ్లి సంబంధాలను చెడగొట్టే సన్నివేశాలు రిపీట్ లో చూసాం అనే ఫీలింగ్ కలుగుతుంది ఆడియన్స్ కి. ఎప్పుడైతే మోహన్ లాల్ శత్రువులను గురిస్తాడో , అప్పటి నుండి సినిమా వేగం అందుకుంటుంది. అయితే మొదటి రెండు భాగాల్లో వచ్చే ట్విస్టులు ఇందులో పెద్దగా లేవు , కేవలం క్లైమాక్స్ ఒక్కటే థ్రిల్లింగ్ కి గురి చేస్తుంది.

చివరిమాట : భారీ అంచనాలు పెట్టుకొని థియేటర్స్ కి వెళ్తే మాత్రం నిరాశ చెందక తప్పదు.

అట్లాంటాలో ఆసక్తికరంగా సాగిన తానా వాలీబాల్ టోర్నమెంట్

TANA Volleyball Tournament

– 20 జట్లు.. ఉత్సాహభరిత పోటీలు.. క్రీడాస్ఫూర్తికి వేదికైన తానా ఈవెంట్

TANA Volleyball Tournament : అమెరికాలోని తెలుగు సమాజాన్ని ఒక్కతాటిపైకి తీసుకువచ్చే కార్యక్రమాల్లో ముందుండే TANA (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) మరోసారి క్రీడా వేదికగా సందడి చేసింది. తానా అట్లాంటా విభాగం ఆధ్వర్యంలో మే 16, 2026న జార్జియాలోని డోన్ వైట్ మెమోరియల్ పార్క్ లో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ ఘన విజయాన్ని సాధించింది. కమ్యూనిటీ నుంచి విశేష స్పందన లభించగా, మొత్తం 20 జట్లు పాల్గొని పోటీలను ఉత్కంఠభరితంగా మార్చాయి.

ఈ టోర్నమెంట్‌లో ఆటగాళ్లు క్రీడాస్ఫూర్తిని చాటుతూ ఉత్సాహంగా ఆడటం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా 10 ఏళ్ల పిల్లలు తమ తల్లిదండ్రులతో కలిసి ఒక టీమ్‌గా బరిలోకి దిగడం ఈ ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనుభవజ్ఞులైన జట్లతో ధైర్యంగా పోటీ పడిన చిన్నారుల ఆత్మవిశ్వాసం, జట్టు సమన్వయం అందరినీ ఆశ్చర్యపరిచింది. వారి ఆటను ప్రేక్షకులు ఆసక్తిగా వీక్షించారు.

టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులు, వాలంటీర్లు, ఆటగాళ్లు, స్పాన్సర్లు మరియు ప్రేక్షకులకు తానా నాయకత్వం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. కార్యక్రమానికి తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీనిలావు అందించిన ప్రోత్సాహం, మద్దతుకు నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ టోర్నమెంట్‌ను నరేన్ నల్లూరి సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. తానా రీజినల్ రిప్రజెంటేటివ్ శేఖర్ బి కొల్లు, ఫౌండేషన్ ట్రస్టీ మధుకర్ యార్లగడ్డ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ భరత్ మద్దినేని, సోషల్ వెల్ఫేర్ కోఆర్డినేటర్ సునీల్ దేవరపల్లి తదితరులు టోర్నమెంట్ విజయానికి సహకరించారు.

అలాగే స్థానిక తానా నాయకులు శ్రీనివాస్ ఉప్పు, వినయ్ మద్దినేని, అనిల్ యలమంచిలి, మురళి బొడ్డు, కోటి కందిమల్ల, చైతన్య కొర్రపాటి, బాబీ, కార్తీక్ గుమ్మడి, శ్రీహర్ష యెర్నేని, శివ నాగ తదితరులు కూడా కార్యక్రమం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు.

విజేతలు – రన్నరప్ జట్లు

ఛాంపియన్స్ లీగ్ డివిజన్

విజేత: అట్లాంటా స్పైకర్స్ (కెప్టెన్ జాకబ్)
రన్నరప్: ఫీల్డ్‌స్టోన్ (కెప్టెన్ అరవింద్)
మూడో స్థానం: హిట్‌మెన్ (కెప్టెన్ కార్తీక్ గుమ్మడి)
ప్రీమియర్ లీగ్ డివిజన్
విజేత: టీఎన్‌టీ (కెప్టెన్ రామ్‌జీ)
రన్నరప్: ఈజీపాస్ 2 (కెప్టెన్ బాల్కి)
మూడో స్థానం: గద్దె క్యాపిటల్స్ (కెప్టెన్ మథన్)

టోర్నమెంట్‌కు సంబంధించిన లైవ్ ఆన్‌లైన్ కవరేజ్, రియల్‌టైమ్ అప్‌డేట్లను బాబీ ముఖర్జీ వేములపల్లి సమర్థవంతంగా నిర్వహించారు.

ఈ కమ్యూనిటీ స్పోర్ట్స్ ఈవెంట్‌కు అండగా నిలిచిన స్పాన్సర్లకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మురళి సుంకర (విపిఆర్ రియల్టర్), సంకీర్త్ పడాల (గూస్‌హెడ్ ఇన్సూరెన్స్), బాబీ (జీపీఎస్ కిడ్స్), సాయిబాబు మద్దినేని (ఫైనాన్షియల్ & మార్ట్గేజ్ ఎక్స్‌పర్ట్), అలాగే దేశీ డిస్ట్రిక్ట్ వంటి సంస్థలు ఈ కార్యక్రమానికి మద్దతుగా నిలిచాయి.

తెలుగు కమ్యూనిటీని క్రీడల ద్వారా మరింత దగ్గర చేయడమే లక్ష్యంగా తానా చేపడుతున్న ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరింత విస్తృత స్థాయిలో కొనసాగాలని పాల్గొన్న వారు ఆకాంక్షించారు.

'పెద్ది' ట్రైలర్ పై హీరోయిన్ ప్రియాంక చోప్రా హాట్ కామెంట్స్.. ట్వీట్ వైరల్..

Priyanka Chopra comments on Peddi Trailer
Priyanka Chopra comments on Peddi Trailer

Priyanka Chopra comments on Peddi Trailer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం ఇటు అభిమానులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో, అటు మూవీ లవర్స్ కూడా అంతే ఆతృతగా ఎదురు చూస్తున్నారు. గత కొంతకాలం నుండి సరైన సూపర్ హిట్ లేకుండా ఇబ్బంది పడుతున్న రామ్ చరణ్, ఈ సినిమాతో కచ్చితంగా కుంభస్థలం బద్దలు కొట్టే రేంజ్ లో హిట్ ని అందుకోబోతున్నాడని, గ్లింప్స్ వీడియో విడుదలైనప్పుడే అందరూ అంచనా వేశారు. ఆ తర్వాత ‘చికిరి చికిరి’ పాట గ్లోబల్ వైడ్ గా హిస్టరీ క్రియేట్ చేసే రేంజ్ లో సూపర్ హిట్ అవ్వడం , ఆ తర్వాత విడుదలైన ‘రయ్ రయ్ రారా’ పాట కూడా సూపర్ హిట్ అవ్వడం తో ఈ సినిమా కచ్చితంగా రామ్ చరణ్ కెరీర్ లో ‘రంగస్థలం’ రేంజ్ హిట్ అవుతుందని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్.

ప్రొమోషన్స్ విషయం లో అభిమానులు కాస్త మొదట్లో బాధపడ్డారు కానీ , రీసెంట్ గా వరుసపెట్టి ఇంటర్వ్యూస్ తో , నాన్ స్టాప్ స్పెషల్ ఈవెంట్స్ తో కావాల్సినంత ప్రొమోషన్స్ చేశారు. అయితే కాసేపటి క్రితమే గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ సృష్టించి , హాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ స్థిరపడిన ప్రియాంక చోప్రా కూడా ఈ సినిమా ట్రైలర్ గురించి ఆసక్తికరమైన ట్వీట్ వేసింది. ఆమె మాట్లాడుతూ ‘ఫైర్.. రామ్ చరణ్ , జాన్వీ కపూర్, దివ్యేన్డు శర్మ, బుచ్చి బాబు సనా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మీలాగే నేను కూడా ఈ చిత్రం ఆతృతగా ఎదురు చూస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ గా మారింది. గతం లో వీళ్లిద్దరు కలిసి ‘జంజీర్’ అనే చిత్రంలో నటించారు. ఆరోజుల్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది.

కానీ అప్పటి నుండే రామ్ చరణ్ తో ప్రియాంక చోప్రా కి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ ట్రైలర్ విడుదలైనప్పుడే ప్రియాంక చోప్రా శుభాకాంక్షలు తెలిపి ఉండేది కానీ, ఆమెకు ఈ సినిమా విడుదల అవుతున్న విషయం నేడే తెలిసింది. రామ్ చరణ్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నేడే తన స్టోరీ లో అప్లోడ్ చేసాడు. దీనిని చూసిన ప్రియాంక చోప్రా వెంటనే ఆ చిత్రం గురించి ట్వీట్ వేసింది. ఇకపోతే నేడు ఈ చిత్రానికి సంబంధించిన స్పెషల్ సాంగ్ ని భోపాల్ లో ఒక మ్యూజికల్ నైట్ ని నిర్వహించి గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.

'డ్రాగన్' తర్వాత అలాంటి సినిమాలకు శాశ్వతంగా గుడ్ బై అంటున్న ప్రశాంత్ నీల్..

Prashanth Neel
Prashanth Neel

Prashanth Neel after Dragon movie: జెన్ జీ యూత్ మరియు మాస్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న డైరెక్టర్స్ లో ఒకరు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ చిత్రానికి ఆయన టేకింగ్ చూసి ఒక్కసారిగా అందరూ షాక్ కి గురయ్యారు . ఎందుకంటే అప్పటి వరకు అలాంటి టేకింగ్ తో వచ్చిన సినిమా ఒక్కటి కూడా లేదు కాబట్టి. మాస్ ని ఇలా కూడా చూపించొచ్చా అని అందరూ ఆశ్చర్యపోయిన రోజులవి. ఈ సినిమా తర్వాత ఆయన రెబల్ స్టార్ ప్రభాస్ తో చేసిన ‘సలార్’ కూడా యూత్ ఆడియన్స్ కి ఎంతో ఇష్టం. ఈ రెండు సినిమాలతో ఆయన బలమైన స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రశాంత్ నీల్ సినిమా అంటే చాలు , హీరో ఎవరు అనేది కూడా పట్టించుకోరు , రికార్డు స్థాయిలో టికెట్స్ ని తెంచుతారు ఆడియన్స్.

ఇకపోతే ఆయన లేటెస్ట్ చిత్రం ‘డ్రాగన్’. ఎన్టీఆర్ హీరో గా నటించిన ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియో ని రీసెంట్ గానే విడుదల చేయగా, దానికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రశాంత్ నీల్ మార్క్ అడుగడుగునా కనిపించింది. అదే రోజున ఆయన ఇచ్చిన ఒక స్పెషల్ ఇంటర్వ్యూ కూడా బాగా వైరల్ అయ్యింది. ఈ ఇంటర్వ్యూ లో ఆయన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఆయన మాట్లాడుతూ ఇకపై కేజీఎఫ్ , సలార్ తరహా యాక్షన్ జానర్ చిత్రాలకు చేయనని, ‘డ్రాగన్’ తో ఆపేస్తానని చెప్పుకొచ్చాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఎందుకంటే అభిమానులు ‘సలార్ 2’ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. జెన్ జీ ఆడియన్స్ లో ఈ చిత్రం పై ఎన్నో ఆశలు ఉన్నాయి. అసలు ‘సలార్ 2’ ఉందా లేదా అని అందరూ అనుమానిస్తున్న సమయంలో , మూవీ టీం అనేక సార్లు కచ్చితంగా ఉంటుందని క్లారిటీ ఇచ్చింది.

రెండేళ్ల క్రితం కొంత భాగం షూటింగ్ ని కూడా జరుపుకున్నారు. కాబట్టి ‘సలార్ 2’, ‘కేజీఎఫ్ 3’ తర్వాతే ఆయన ఈ జానర్ సినిమాలకు గుడ్ బై చెప్తారని అంటున్నారు విశ్లేషకులు. డ్రాగన్ కూడా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు , మొదటి భాగం జూన్ 11, 2027 వ సంవత్సరం లో విడుదల కాబోతుండగా, రెండవ భాగం డిసెంబర్ నెలలో విడుదల కాబోతుంది. జనాలు కూడా ప్రశాంత్ నీల్ ఒకే జానర్ సినిమాలు చేస్తూ పోతే , ఎదో ఒకసమయం లో చిరాకు పడే అవకాశం ఉంది. అందుకే ముందస్తుగా ఆయన ఈ జాగ్రత్తలను తీసుకున్నాడని అంటున్నారు.

ఇమ్రాన్ ఖాన్ తొలగింపు వెనుక అమెరికా.. వెలుగులోకి కుట్రకోణం

Imran Khan removal conspiracy
Imran Khan removal conspiracy

Imran Khan removal conspiracy: దేశాల మీద యుద్దాలు చేస్తుంది. అధ్యక్షులను అపహరిస్తుంది. చివరికి వారి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడదు. తన ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తుంది. ఎంతకైనా తెగిస్తుంది. సుంకాల విధింపు నుంచి మొదలు పెడితే ఎన్నో దారుణాల దాకా అమెరికా చేసే పనులు ఉపోద్ఘాతాలకు అందవు. అందుకే అమెరికాను అత్యంత సామ్రాజ్యవాద దేశమని అంటుంటారు. గిట్టని వాళ్లను కొట్టి.. దండుకోవడంలో అమెరికా తర్వాతే ఎవరైనా. తనకు నచ్చని పాలకుడు అధికారంలో ఉంటే..అతడిని గద్దె నుంచి దించే దాకా అమెరికా నిద్రపోదు.

మన పొరుగున ఉన్న పాకిస్థాన్ కు గతంతో క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా పని చేశాడు. కొన్ని సందర్భాల్లో భారత్ అంటే కొంతలో కొంత అభిమానం చూపించే వాడు. పాకిస్థాన్ సైన్యాధిపతి పెత్తనాన్ని, సైనికుల దుర్మార్గాలను అతడు ప్రశ్నించేవాడు. పరిపాలనలో సంస్కరణలు చేపట్టేవాడు. అతడి పాలనలో దుర్మార్గాలు అంతగా సాగకపోవడంతో కొందరు అతడిని పదవి నుంచి తొలగించేందుకు పావులు కదపడం మొదలు పెట్టారు. దీనికి అమెరికా కూడా సహకరించిందనే ఆరోపణలున్నాయి.

ఇమ్రాన్ ఖాన్ నుంచి పదవి నుంచి తొలగించేందుకు అమెరికా కుట్ర పన్నిందని ఆరోపణలు వినిపించాయి. ముఖ్యంగా దౌత్య పత్రాలలీక్(సైఫర్ వివాదం) ఇటీవల వెలుగులోకి వచ్చింది. అమెరికా దౌత్యవేత్తగా పని చేసిన డొనాల్డ్ లూ, పాకిస్థాన్ రాయబారి మధ్య చర్చలు జరిగాయి. ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మానం ఓడిపోవాలని, అతడు దిగిపోతేనే అమెరికా, పాకిస్థాన్ సంబంధాలు మెరుగుపడతాయని చర్చలు జరిగాయని విమర్శలు వినిపించాయి.

ఈ విమర్శలను అమెరికా తోసిపుచ్చింది. నాయకత్వ మార్పు విషయంలో తమకు సంబంధం లేదని అమెరికా స్పష్టం చేసింది. ఇదంతా కూడా పాకిస్థాన్ అంతర్గత వ్యవహారమని పేర్కొంది. అయితే ఇమ్రాన్ ఖాన్ పదవి కోల్పోవడానికి అమెరికానే కారణమని డ్రాస్ సైట్ అనే ఇన్వెస్టిగేటింగ్ న్యూస్ ఏజెన్సీ సైఫర్ అనే దౌత్య పత్రాన్ని వెలుగులోకి తెచ్చింది. దీనిని ‘కేబుల్ ఐ 0678’ గా గుర్తించింది. ఆరేళ్ల క్రితం అవిశ్వాసతీర్మానంలో ఓడిపోవడానికి కంటే ముందు వాషింగ్టన్ లో నాటి పాకిస్థాన్ రాయబారి అసద్ ముజీద్, అమెరికా విదేశాంగ శాఖ సీనియర్ అధికారి డొనాల్డ్ లూ కీలక చర్చలు జరిగినట్టు సమాచారం.

అప్పట్లో ఇమ్రాన్ ఖాన్ తన పదవి పోవడానికి అమెరికానే కారణమని ఆరోపించారు. దీని వెనుక పాకిస్థాన్ ముస్లిం లీగ్ ఎన్, పాకిస్థాన్ పీపుల్స్ వంటిపార్టీలు ఉన్నాయని విమర్శించారు. చివరికి డ్రాప్ సైట్ ఈ విషయాన్ని బయటపెట్టడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది.