Home Blog Page 245

'దృశ్యం 3' ప్రేక్షకులకు నచ్చకపోవడానికి కారణం ఇదే...

Drishyam 3 Audience Response
Drishyam 3 Audience Response

Drishyam 3 Audience Response: సినిమా ఇండస్ట్రీలో ఎన్ని మూవీస్ వచ్చిన కూడా కొన్ని సినిమాలకి ఉండే గుర్తింపు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఇక మలయాళం సినిమా ఇండస్ట్రీలో జీతూ జోసఫ్ దర్శకత్వంలో వచ్చిన ‘దృశ్యం ‘ సినిమా గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది… దాదాపు ఈ సినిమాను ఆరు భాషల్లో రీమేక్ చేశారు. ప్రతి చోటా సూపర్ సక్సెస్ అవ్వడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఈ సినిమాకి సీక్వెల్ గా ‘దృశ్యం 2’ కూడా వచ్చింది. ఆ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. దానికి కొనసాగింపుగా ఇప్పుడు ‘దృశ్యం 3’ మూవీ వచ్చింది. నిజానికి ఈ ఫ్రాంచైజీ ల వల్ల సినిమాల మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే తారా స్థాయికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక సినిమాను మించి మరొక సినిమా ఉండాలని ఆడియన్స్ కూడా ఆలోచిస్తూ ఉంటారు. మొదట వచ్చే ఒరిజినల్ కథ కంటే సీక్వెల్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి…

దృశ్యం 3 సినిమా రిలీజ్ అవ్వడంతో మొదటి రెండు పార్ట్స్ తో పోల్చి చూడటం వల్ల దానికి ఈ మూవీకి బాగా మైనస్ అయింది. దాని వల్లే ఈ మూవీ మాకు నచ్చలేదంటూ ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. నిజానికి దృశ్యం, దృశ్యం 2 సినిమాలు ఎంగేజింగా తీసుకెళ్లాయి. ఎప్పుడు ఒక ఉత్కంఠను కలిగిస్తూ ప్రేక్షకులను మెప్పించాయి… ఈ మూవీ విషయానికి వచ్చేసరికి హీరో ఎలాగైనా సరే సేవ్ అవుతాడు అనే విషయం మనకు ముందుగానే తెలిసిపోతుంది.

కాబట్టి ఆయన ఎన్ని స్కెచ్ లు వేసి తప్పించుకోవాలనే ప్రయత్నం చేసిన కూడా అవన్నీ మనకు చాలా సింపుల్ గానే అనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మొదటి రెండు పార్ట్ లలో చూసిన దానికి మించి ఇంకేదైనా ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటారు. దానివల్ల సినిమా మీద భారీ హైప్ వస్తుంది. కానీ సినిమాలను చూసిన ప్రేక్షకులు సాటిస్ఫై అవ్వలేదు.

ఈ సినిమాలను చేయడం చాలా పెద్ద టాస్క్ అని చాలా మంది చెబుతూ ఉంటారు. ఇక దృశ్యం 3 విషయంలో కూడా అదే జరిగింది. నిజానికి అది సీక్వెల్ గా కాకుండా ఏదైనా వేరే సెపరేట్ స్టోరీ గా వచ్చుంటే సినిమా సక్సెస్ అయ్యేది. కానీ సీక్వెల్ కావడం వల్ల మిగిలిన సినిమాలతో పోల్చుకుంటూ చూస్తారు. కాబట్టి దాని మీద ఈ సినిమా కొంచెం డల్ అయిన కూడా సినిమా బాలేదు అనే ఒక టాక్ వస్తుంది…

త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' కథను బాలయ్య బాబు సూపర్ హిట్ మూవీ నుంచి లేపేశాడా..?'

Adarsha Kutumbam
Adarsha Kutumbam

Adarsha Kutumbam: ‘విక్టరీ వెంకటేష్’ హీరోగా చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైతే ఉంటుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసి సినిమాలను చేసిన ఆయన ప్రతిసారి సూపర్ సక్సెస్ ని సాధిస్తూనే వచ్చాడు. ఇక ప్రస్తుతం మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసుకొని చేస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాతో కూడా భారీ విజయాన్ని సాధిస్తాడనే కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నాడు. గత సంవత్సరం ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేసిన ఆయన ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా విషయంలో కూడా చాలా స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. ఇక ఆదర్శ కుటుంబం సినిమాలో యాక్షన్ ఎపిసోడ్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కి కూడా పెద్ద పీట వేస్తున్నారట. అయితే ఈ సినిమాని త్రివిక్రమ్ ఆ కథ నుంచి కాపీ చేశాడు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి…

ఎస్ వి కృష్ణారెడ్డి డైరెక్షన్లో బాలయ్య బాబు హీరోగా వచ్చిన ‘టాప్ హీరో’ సినిమా నుంచి ఈ కథని లేపేసినట్టుగా తెలుస్తుంది. అప్పట్లో టాప్ హీరో సినిమా ఆశించిన మేరకు సక్సెస్ ను సాధించలేదు. కానీ అందులోని ఎమోషన్స్ గాని బాలయ్య బాబు యాక్టింగ్ అన్ని బాగుంటాయి…

ఇక అందులోని కీ పాయింట్ తీసుకొని ఈ జనరేషన్ కి తగ్గట్టుగా కథను మార్పులు చేర్పులు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక త్రివిక్రమ్ అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. త్రివిక్రమ్ చాలాసార్లు చాలా స్టోరీలు కాపీ చేశారు అంటూ కామెంట్స్ వ్యక్తమైనప్పటికి ఎప్పటికప్పుడు తన పంథాను మార్చుకుంటూ వస్తున్నాడు తప్ప కాపీ చేయడం మాత్రం ఆపడం లేదంటూ మరి కొంతమంది అతని మీద ఫైర్ అవుతున్నారు…

ఇక ఏది ఏమైనా మాటలు మాంత్రికుడిగా గుర్తింపును సంపాదించుకున్న ఆయన కథలో బలం లేకపోయిన కూడా తన మాటలతో సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలపగలుగుతాడు. అందుకే అతనికి సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువనే చెప్పాలి… ఇంతకుముందు మహేష్ బాబుతో చేసిన ‘గుంటూరు కారం’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. కాబట్టి ఇప్పుడు వెంకటేష్ తో చేస్తున్న ఆదర్శ కుటుంబం సినిమా తప్పకుండా సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది…

ఏపీలో సినిమా పదవులు!

AP Film Development Corporation
AP Film Development Corporation

AP Film Development Corporation: ఏపీ ప్రభుత్వం సినిమా పదవులను ప్రకటించింది. ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రముఖ నిర్మాత భరత్ భూషణ్, వైస్ చైర్మన్ గా దర్శకుడు మెహర్ రమేష్ పేరును ప్రకటించింది. మరో 15 మంది డైరెక్టర్లను సినీ రంగం నుంచి ఎంపిక చేసింది. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. కానీ ఏపీఎఫ్డిసి పాలకవర్గం ఎంపికలో జాప్యం జరిగింది. మధ్యలో రకరకాల పేర్లు కూడా వినిపించాయి. ఎట్టకేలకు ప్రభుత్వం నియామకాలు చేసింది . అయితే గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్మాత ఏఎం రత్నం పేరును సూచించారు. అలా సూచించిన సమయంలోనే అది తన అభిప్రాయమని.. ప్రభుత్వానికి కొన్ని రకాల ఆబ్లిగేషన్స్ ఉంటాయని గుర్తు చేశారు. ఇప్పుడు అలానే జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ నిర్మాత దిల్ రాజును ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించింది. ప్రభుత్వం కొలువు దీరిన వెంటనే ఈ నియామకం జరిగింది. ఏపీలో మాత్రం జాప్యం జరిగింది.

* ప్రముఖ నిర్మాత..
ఏపీ ఎఫ్డిసి చైర్మన్ గా నియమితులైన భరత్ భూషణ్ ప్రముఖ నిర్మాత. గాయత్రీ దేవి ఫిలిమ్స్ పేరిట సినిమా పంపిణీ రంగంలో కూడా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రచార కర్తగా తెరవెనుక సేవలు అందించారు. వైస్ చైర్మన్ గా మెహర్ రమేష్ నియమితులు కాగా ఆయన సైతం నందమూరి, మెగా కుటుంబ దర్శకుడు. వీరిద్దరి కాంబోతో ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అభివృద్ధి చెందుతుందని అంతా భావిస్తున్నారు. భరత్ భూషణ్ కు చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యలు తెలుసు. పైగా చిత్ర పరిశ్రమ తెలంగాణ నుంచి ఏపీకి కూడా విస్తరించాలని ఆయన భావిస్తున్నారు. మెహర్ రమేష్ కు సైతం పరిశ్రమలు 24 ఫ్రేమ్స్ పై పూర్తిస్థాయి అవగాహన ఉంది. అందరికీ న్యాయం చేస్తారని చెప్పి ఈ ఇద్దరి నియామకం జరిగింది.

* ఏపీలో సైతం విస్తరించాలి..
ప్రస్తుతం చిత్ర పరిశ్రమ తెలంగాణలో మాత్రమే ఉంది. కేవలం అవుట్ డోర్ షూటింగ్లకు మాత్రమే ఏపీ పరిమితం అవుతోంది. చిత్ర పరిశ్రమకు అవసరమైన వనరులన్నీ ఏపీలో ఉన్నాయి. షూటింగ్లకు అనువైన ప్రాంతాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం పర్యాటక ప్రాంతమే కాకుండా చూడదగ్గ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. విశాఖకు చిత్ర పరిశ్రమ విస్తరించాలన్న ప్రతిపాదన గత టిడిపి ప్రభుత్వం నుంచి అలానే ఉండిపోయింది. కనీసం ఈ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అయిన ఆ ప్రయత్నాలు కార్యరూపం దాల్చాల్సిన అవసరం ఉంది. ఏపీ కేవలం సినిమాను పెంచే రాష్ట్రంగా కాకుండా.. ఉద్యోగ ఉపాధి పెంచే పరిశ్రమ విశాఖలో విస్తరించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉంది.

పెద్ది మూవీ మీద హైప్ పెంచుతున్నారు. తేడా కొడితే ఏంటి పరిస్థితి...

Ram Charan Peddi Movie Analysis
Ram Charan Peddi Movie Analysis

Ram Charan Peddi Movie: జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘పెద్ది’ సినిమా మీద ఇప్పటినుంచి భారీ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ కి పాజిటివ్ టాక్ వచ్చింది. నిజానికి ఈ ట్రైలర్ ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంది. ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. ఇక ఇదిలా ఉంటే సినిమా మీద భారీ హైప్ ని క్రియేట్ చేస్తున్నారు. ఒకవేళ సినిమా తేడా కొడితే పరిస్థితి ఏంటి? రామ్ చరణ్ కి పాన్ ఇండియాలో భారీ గుర్తింపు ఉన్నప్పటికి 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ని సాధించిన సినిమా ఏదీ లేదు.

‘త్రిబుల్ ఆర్’ సినిమా 1300 కోట్ల కలెక్షన్స్ రాబట్టినప్పటికి అందులో ఎన్టీఆర్ కూడా బాగమయ్యాడు. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా కాబట్టి దాన్ని మనం కేవలం రామ్ చరణ్ సక్సెస్ గా పరిగణించలేము. గత సంవత్సరం వచ్చిన ‘గేమ్ చేంజర్’ సినిమా భారీ డిజాస్టర్ అయింది. కాబట్టి పెద్ది సినిమా విషయంలో రామ్ చరణ్ చాలా స్పెషల్ కేర్ తీసుకున్నాడనే వార్తలు వస్తున్నాయి.

అయినప్పటికి ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ సక్సెస్ ని సాధిస్తే బాగుంటుంది. అలాగే రామ్ చరణ్ మార్కెట్ కూడా విపరీతంగా పెరుగుతుంది. అది కాదని నార్మల్ సక్సెస్ సాధిస్తే మాత్రం ఈ సినిమా భారీ నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి రావచ్చు. అందుకే ప్రతి విషయంలో బుచ్చిబాబు కూడా స్పెషల్ కేర్ తీసుకున్నాడు.

ఇక తన గురువు అయిన సుకుమార్ సైతం ఈ సినిమాని ఎప్పటికప్పుడు రసెస్ చూస్తూ ఏమైనా చేంజెస్ చేయాల్సిన పరిస్థితి వస్తే చేంజ్ చేయించాడట. దీనివల్ల సినిమా గ్రిప్పింగ్ గా రావడమే కాకుండా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కూడా ఉంటుందని అతను భావించాడు… చూడాలి మరి రామ్ చరణ్ ఈ సినిమాతో పాన్ ఇండియా రికార్డులను తిరగరాస్తాడా లేదా అనేది…

చిరంజీవి - బాబీ కాంబోలో వచ్చే సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా కనిపిస్తాడా...

Chiranjeevi Bobby Movie Item Song Removed
Chiranjeevi Bobby Movie Item Song Removed

Chiranjeevi Bobby Movie: మెగాస్టార్ చిరంజీవి గత 50 సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్నాడు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ శోభన్ బాబుల తర్వాత ఇండస్ట్రీలో అంతటి గొప్ప క్రేజ్ ను సంపాదించుకోవడమే కాకుండా కొత్త తరానికి నాంది పలుకుతూ సినిమా ఖ్యాతిని సైతం పెంచిన హీరో మెగాస్టార్ చిరంజీవి అనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన 70 సంవత్సరాల పైబడిన వయసులో కూడా సినిమాలు చేస్తున్నాడు అంటే అతనికి సినిమా అంటే ఎంత పిచ్చో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి చిరంజీవి ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ‘మెగా 158’ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా నిన్న ఓపెనింగ్ జరుపుకుంది. ఇక ఈ ఓపెనింగ్ కి పవన్ కళ్యాణ్ రావడం ప్రతి ఒక్కరిని ఆకర్షించింది.

నిజానికి పవన్ కళ్యాణ్ ని ఎందుకు ఈ ఓపెనింగ్ పిలిచారు అంటే ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే ఉందట. అది స్క్రీన్ మీద ఒక 5 నిమిషాల పాటు ఉంటుంది. దాని కోసం పవన్ కళ్యాణ్ ని ఈ సినిమాలో భాగం చేయాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

బాబీ ఇంతకుముందు చిరంజీవితో చేసిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో రవితేజ తో ఒక స్పెషల్ క్యారెక్టర్ చేయించి సినిమా మొత్తానికి హైపైతే తీసుకొచ్చాడు. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో కూడా ఒక క్యారెక్టర్ చేయిస్తున్నాడట. అందువల్లే అతన్ని ఈవెంట్ కి పిలిచినట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడం అంటే అంత ఆశా మాశీ వ్యవహారమైతే కాదు.

కానీ బాబీ మాత్రం ఇంతకు ముందు వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు. కాబట్టి చిరంజీవి మరోసారి అతనికి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు బాబీ చిరంజీవిని ఏ రేంజ్ లో చూపిస్తాడు. చిరంజీవి స్థాయిని పెంచే సినిమా అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

ప్రభాస్ ఆ దర్శకుడితో సినిమా చేయలేకపోయినందుకు ఫీల్ అయ్యాడా ...

Prabhas
Prabhas

Prabhas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఎనలేని గుర్తింపైతే ఉంది. బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలోకి అడుగుపెట్టిన ఆయన ఆ తర్వాత చేసిన ప్రతి పాన్ ఇండియా సినిమాతో భారీ కలెక్షన్స్ కొల్లగొడుతున్నాడు. అందులో కొన్ని సినిమాలు ఫ్లాప్ అయిన కూడా కలెక్షన్స్ విషయంలో మాత్రం ఎక్కడ డల్ అవ్వడం లేదు. ఇక ఇదిలా ఉంటే కెరియర్ మొదట్లో ప్రభాస్ ఒక దర్శకుడితో సినిమా చేయడానికి విపరీతంగా ప్రయత్నం చేశారట. కానీ అది వర్కౌట్ కాలేదు ఇంతకీ ఆదర్శకుడు ఎవరు అంటే ఆర్జీవి గా తెలుస్తుంది. శివ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమా తీసే విధానాన్ని మార్చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ…ఆయన లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు ఉండరు అనేంతలా పేరు ప్రఖ్యాతాలను సంపాదించుకున్నాడు.

అప్పట్లో హీరోలుగా ఉన్న ప్రతి ఒక్కరు అతనితో సినిమాలను చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు. కానీ అది కొందరికి మాత్రమే దక్కింది. ఇక ఆ క్రమంలోనే ప్రభాస్ కూడా అతనితో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్నారట. కానీ అది కార్యరూపం అయితే దాల్చలేదు.

ఇక ఎప్పుడు ఎవరితో ఎలాంటి సినిమాలు చేస్తాడో తెలియని ఆర్జీవి స్టార్ హీరోలను హ్యాండిల్ చేయడంలో తను తడబడతానని అందువల్లే వాళ్లతో సినిమాలు చేయడం నాకు నచ్చదని చెబుతూ ఉంటాడు. అయితే ప్రభాస్ స్టార్ హీరో అవ్వకముందే తనతో సినిమా చేయడానికి సన్నాహాలు చేశారట. కానీ చివరి నిమిషంలో ఆ సినిమా క్యాన్సల్ అవ్వడంతో ప్రభాస్ కి మరోసారి ఆర్జీవీ తో సినిమా చేసే అవకాశం రాలేదు…

ఇక ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ, స్పిరిట్ లాంటి సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు అయిపోయిన తర్వాత ఆయన ‘సలార్ 2’ సినిమాలో భాగం కావడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు… ఇక ఈ సినిమాలతో పాటుగా మరికొన్ని సినిమాలకు కూడా ప్రభాస్ కమిట్ అయ్యాడనే వార్తలు వస్తున్నాయి. ఇక ఆ సినిమాలు ఏంటి అనేది తొందర్లోనే అఫిషియల్ అనౌన్స్ మెంట్ రాబోతుందట…

డ్రాగన్ మూవీ విషయంలో ఎన్టీఆర్ రిస్క్ చేస్తున్నాడా...

NTR Dragon Movie
NTR Dragon Movie

NTR Dragon Movie: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న ‘డ్రాగన్’ సినిమా మాత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ ని రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే రోజున రిలీజ్ చేశారు. ఈ సినిమా మీద హైప్ అయితే విపరీతంగా పెరిగిపోయింది. ఇక దానికి తగ్గట్టుగానే ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో ఎన్టీఆర్ ని చాలా వైల్డ్ గా చూపించబోతున్నాడు. కాబట్టి ఆ పాత్ర ఎన్టీఆర్ కి ఏ మేరకు సెట్ అవుతుంది. మాస్ క్యారెక్టర్ లో మెప్పించిన ఎన్టీఆర్ తన పరిధిని దాటి చేస్తున్న ఒక వైల్డ్ క్యారెక్టర్ లో ప్రభావాన్ని చూపిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. డ్రాగన్ సినిమా విషయంలో ఎన్టీఆర్ రిస్క్ చేస్తున్నారు అని కొంతమంది అంటున్నారు. కారణం ఏంటి అంటే ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నింటిలో ‘దేవర’ సినిమా 500 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టింది.

తన కెరియర్ లోనే ఈ మూవీ అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా తన కెరియర్ లో నిలిచిపోయింది. ఇక ఇలాంటి ఎన్టీఆర్ తో 600 కోట్ల బడ్జెట్ తో డ్రాగన్ సినిమా చేస్తున్నారు. దీనివల్ల ఎన్టీఆర్ కు వచ్చే రిస్క్ ఏంటి అంటే ఆయన పెట్టిన బడ్జెట్ ను ఓవర్కం చేస్తూ భారీ వసూళ్లను రాబట్ట లేకపోతే మాత్రం అతని సినిమా బడ్జెట్ ఫెయిల్యూర్ గా మిగులుతుంది.

తద్వారా ఎన్టీఆర్ తో భారీ సినిమాలను చేయలేమనే ఒక నిర్ణయానికి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సినిమా విజయం ఎంత ముఖ్యమో కలెక్షన్లు రావడం కూడా అంతే ముఖ్యం… కొన్ని సక్సెస్ ఫుల్ సినిమాలకు కలెక్షన్స్ చాలా వరకు డల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు అదే జరుగుతుంది.

ఇప్పటివరకు తను చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధించాయి. అందులో కొన్ని బ్లాక్ బస్టర్స్ గా నిలిచినప్పటికి ఒక్క ఇండస్ట్రీ హిట్టు కూడా లేకపోవడం ఎన్టీఆర్ కి చాలా వరకు మైనస్ అయింది. ఇప్పుడు కూడా తన మార్కెట్ పెంచుకోవాల్సిన అవసరమైతే ఉంది. లేకపోతే మాత్రం మిగతా హీరోలు అతన్ని బీట్ చేస్తూ ముందుకు సాగే అవకాశాలు కూడా ఉన్నాయి…

జగన్ కు 'మంచితనం' సర్టిఫికెట్!

YS Jaganmohan Reddy
YS Jaganmohan Reddy

YS Jagan Mohan Reddy: నేను మంచోడిని.. నేను మంచోడిని.. నాకంటే మంచోడు ఎవడుంటాడు? ఇలా చెబుతున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తాను మంచి వాడిని కాబట్టే మీరంతా హాయిగా ఉన్నారు అంటూ చెబుతున్నారు. ఆయన మంచితనం గురించి ఆయనే సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నారు. ఆయన మంచితనాన్ని ఆ పార్టీ శ్రేణులు ఎలాను జీవితాంతం గుర్తుంచుకుంటాయి కానీ.. ఆయన మంచితనం రాజశేఖర్ రెడ్డి కి తెలుసు.. అందుకే ఆయనను పులివెందుల కాకుండా బెంగళూరు ప్యాలెస్ కు పరిమితం చేశారు. ఆయన మంచితనం తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిలకు తెలుసు కాబట్టి వారు దూరంగా ఉన్నారు. ఆయన మంచితనం ఒకప్పటి రాజశేఖర్ రెడ్డి తెలుసు కాబట్టి వారంతా దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి మంచితనం గురించి చెప్పనవసరం లేదు.

* చంద్రబాబుకు గుండెపోటు రావాలని మంచితనంగా..
నిన్ననే వారాంతపు మీడియా సమావేశానికి గాను జగన్ హాజరయ్యారు. తన మంచితనం గురించి చెప్పుకోవడమే కాదు చంద్రబాబుకు గుండెపోటు రావాలని కోరుకున్నారు. అందులో కూడా ఆయన మంచితనం కనిపిస్తోంది. అప్పుడెప్పుడో రాజశేఖర్ రెడ్డి రాజకీయ ప్రారంభ సమయంలో.. ముఖ్యమంత్రి రేసులో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డిని బెంగళూరుకి వెళ్లిపోమన్నారట ఆయన మంచితనాన్ని చూసి. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మంచితనంతోనే అంతా సంపాదించేశారు. అందుకే ఆ మంచితనాన్ని గౌరవించి అక్రమ ఆస్తులు కేసులు పెట్టారు. 16 నెలల పాటు ఆయన మంచితనాన్ని గౌరవించి జైల్లో పెట్టారు. ఆయన మంచితనం ఎంతలా అంటే తన బాబాయిని హత్య చేసిన నిందితులను కాపాడుకునేటంత. తన గెలుపు కోసం శక్తియుక్తులను ఉపయోగించిన షర్మిలను పార్టీ నుంచి బయటకు పంపించేదాకా ఆయన మంచితనం పనిచేసింది. తనకోసం పరితపించిన తల్లిని తప్పు పట్టడమే ఆయన మంచితనం. సొంత బాబాయిని హత్య చేసిన వారిని కాపాడుతున్న గొప్ప మంచితనం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే ఆయన మంచితనం గురించి అయిన వారే ఎక్కువగా చెబుతుంటారు.

* వారంతా మంచితనం గుర్తించలే..
రాజశేఖర్ రెడ్డి కి సన్నిహితులు ఎంతోమంది ఉన్నారు. వారందరినీ వదిలి వైయస్సార్ అనే పేరును తీసుకుని పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారు. ఆయన మంచితనం చూసి దూరంగా ఉండిపోయారు రాజశేఖర్ రెడ్డి సన్నిహితులు. మంచితనం అంటే మనం గురించి మనం చెప్పుకోవడం కాదు. మన గురించి చుట్టూ ఉన్నవారు చెబితేనే మనం మంచి వారు అవుతాం. చెడ్డ పనులు చేసేవారు తాము మంచి వారం మంచి వారం అంటే… తమపై అభిమానం ఉన్నవారు నమ్ముతారే కానీ.. వాస్తవాలు తెలిసినవారు నమ్మరు గాక నమ్మరు. పైగా జగన్మోహన్ రెడ్డి లాంటి మంచితనం ఉన్న వ్యక్తి మాటలు మరి నమ్మరు. మంచితనం అనేది చెప్పుకుంటే రాదు. చెప్పకపోతే పోదు. ఎందుకంటే అది మంచితనం కాబట్టి..

ఆ నలుగురే బలం.. గుజరాత్..ఐపీఎల్ గెలిచేలా ఉందే..

Gujarat Titans
Gujarat Titans

Gujarat Titans: హార్దిక్ పాండ్యా నాయకత్వంలో గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంవత్సరంలోనే ట్రోఫీ గెలిచింది. ఆ తర్వాత సంవత్సరంలో రన్నరప్ గా నిలిచింది. మళ్లీ ఆ స్థాయిలో ప్రదర్శన ఆ జట్టు నుంచి లభించలేదు. ఇప్పుడు గుజరాత్ అదరగొడుతోంది. ఈ సీజన్ లో వరుసగా ఓటములు ఎదుర్కొన్న ఆ జట్టు తన రాతను పూర్తిగా మార్చేసుకుంది.

అండర్ డాగ్స్ గా..

అండర్ డాగ్స్ గా అడుగుపెట్టిన గుజరాత్.. ఇప్పుడు పాయింట్ల పట్టికలో నెంబర్ 2 స్థానంలో ఉంది. చివరి మ్యాచ్ లో చైన్నై పై 89 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా +0.695 నెట్ రన్ రేట్ కొనసాగిస్తోంది. తొలిమ్యాచ్ పంజాబ్ చేతిలో ఓడిపోయింది.రాజస్థాన్ రాయల్స్ చేతిలో కూడా ఓటమిపాలైంది. ఈ దశలో ఢిల్లీ క్యాపిటల్స్ మీద ఒక్క పరుగు తేడాతో మ్యాచ్ గెలిచిన తర్వాత గుజరాత్ ఆటతీరు మారిపోయింది. వరుసగా మూడు విజయాలు సాధించింది. ముంబై, బెంగళూరు చేతిలో వరుసగా ఓడిపోయిన తర్వాత గుజరాత్ మళ్లీ విజయయాత్రను మొదలు పెట్టింది. వరుసగా ఐదు విజయాలు సాధించింది. ఇందులో హైదరాబాద్ జట్టు పై కూడా గుజరాత్ విజయం సాధించింది.

ఆ నలుగురు

గుజరాత్ విజయంలో కెప్టెన్ శుభ్ మన్ గిల్, సాయి సుదర్శన్, ప్రసిద్ధ్ క్రిష్ణ, రషీద్ ఖాన్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. సాయి సుదర్శన్ 638 పరుగులు చేసి, ఆరేంజ్ క్యాప్ హోల్డర్ గా కొనసాగుతున్నాడు. గిల్ 616 పరుగులతో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. రషీద్ ఖాన్ 19, ప్రసిద్ధ్ క్రిష్ణ 14 వికెట్లతో పర్పుల్ క్యాప్ విభాగంలో తమసత్తా చాటుతున్నారు. ఇద్దరు బౌలింగ్ లో.. మరో ఇద్దరు బ్యాటింగ్ లో అదరగొడుతున్న నేపథ్యంలో గుజరాత్ జట్టుకు తిరుగులేకుండా పోతోంది. ఇప్పటికైతే రెండోస్థానంలో ఉంది గుజరాత్. శుక్రవారం నాటి మ్యాచ్ లో బెంగళూరుపై హైదరాబాద్ గెలిస్తే GT స్థానం ఏమైనా మారొచ్చు.

గుజరాత్ భీకరమైన ఫామ్ లో ఉన్న నేపథ్యంలో ఈసారి ట్రోఫీసాధించే అవకాశాలున్నాయని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. గిల్ నాయకత్వంలో గుజరాత్ జట్టు వరుస విజయాలు సాధిస్తోందని, ఫినిక్స్ పక్షి లాగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. గుజరాత్ బౌలింగ్, బ్యాటింగ్ లో ఆకట్టుకుంటున్న నేపథ్యంలో ఈసారి ట్రోఫీ సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది.

బీజేపీ 20 ఏళ్లు.. దేశరాజకీయాల్లో యాక్సిస్ మై ఇండియా ప్రకంపనలు

BJP 20 Years
BJP 20 Years

BJP 20 Years: ఇటీవల తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. అన్ని సంస్థలు డీఎంకే గెలుస్తుందని ముందస్తు ఫలితాలలో చెప్పేశాయి. కానీ ఒక్క యాక్సిస్ మై ఇండియా మాత్రం టీవీకే గెలుస్తుందని చెప్పింది. అంతే కాదు, తమిళనాడు ఓటర్లు విజయ్ ని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారని ఆ సంస్థ వ్యాఖ్యానించింది. పైగా డీఎంకే అధినేత స్టాలిన్ ఓడిపోతారని చెప్పారు. దీంతో యావత్ దేశం మొత్తం సంచలనంగా చూసింది. అంతకు మించి ఆశ్చర్యపోయింది.

అంతకుమించిన సంచలనం

యాక్సిస్ మై ఇండియా సీఈవో ప్రదీప్ గుప్తా ఈసారి అంతకుమించిన సంచలన విషయాన్ని బయటపెట్టారు. ‘పరిపాలన బాగున్నంత కాలం ప్రజలు పార్టీకి ఓటేస్తారు. అధికారాన్ని కట్టబెడతారు. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. కాంగ్రెస్ దేశరాజకీయాలను చాలా సంవత్సరాల పాటు ఏలింది. 1977 వరకు కాంగ్రెస్ ప్రస్థానం అద్భుతంగా సాగింది. ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నాం కదా’ అంటూ ప్రదీప్ వ్యాఖ్యానించారు.

20 ఏళ్ల వరకు

‘ ఒక రాజకీయ తరం 20 ఏళ్ల వరకు ఉంటుంది. ఆ చక్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. 2014లో భారతీయ జనతా పార్టీ 1.0 మొదలైంది. 2.0 పూర్తయింది. ఇప్పుడు 3.0 నడుస్తోంది. గవర్నెన్స్ బాగున్నంత వరకు ఏమీ కాదు. ఒకవేళ తేడా కొడితే ఇబ్బంది ఎదురవుతుంది. బీజేపీకి ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందో లేదో చెప్పలేం. కానీ బీజేపీ రాజకీయ పరాక్రమం ఇంకా 20 ఏళ్లు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికైతే ప్రజల్లో ఎన్డీఏ మీద భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చేరోజుల్లో ఎన్డీఏ గొప్పగా పరిపాలించాలని’ ప్రదీప్ అభిప్రాయపడ్డారు.

విమర్శలు

ప్రదీప్ మాట్లాడిన మాటలను బీజేపీ స్వాగతిస్తోంది. ఆయన దేశవ్యాప్తంగా ఉన్నవాస్తవ పరిస్థితిని బయటపెట్టారని బీజేపీ నాయకులు అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ నాయకులు ప్రదీప్ మీద తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. దేశం ఇప్పటికే ఎమర్జెన్సీలో ఉందని, మరో 20 ఏళ్లు అంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ప్రదీప్ బీజేపీకి అనుకూలంగా మాట్లాడి ఏం చెప్పదలుచుకున్నారో తెలుస్తోందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.

చైన్నై సూపర్ కింగ్స్.. ఇంత చెత్తగానా..ధోని జట్టేనా ఇది

CSK Poor Performance
CSK Poor Performance

CSK Poor Performance: దారుణం.. అత్యంత నాసిరకం.. దరిద్రం.. ఇలా ఎన్ని ఉపమానాలు ఉంటే.. అన్ని ఉపమానాలు వాడొచ్చు. ఎందుకుంటే చెన్నై జట్టు ఆటతీరు అంతదారుణంగా ఉంది మరి.. బౌలింగ్లో దారుణం.. బ్యాటింగ్లో అత్యంత చెండాలం.. ఏదీ బాగోలేదు. ఎటు చూసినా బాగోలేదు. ఇలా ఆడతారని.. ఇంతలా ఓడిపోతారని సగటుఎల్లో అభిమాని ఊహించి ఉండరు. అందువల్లే మ్యాచ్ జరుగుతుండగానే ఓటమిని అంచనా వేసి ఫోన్లు చూడటం మొదలు పెట్టారు. ఎందుకంటే ఆ సమయంలో వారిబాధను దూరం చేసింది ఆ ఫోన్ మాత్రమే.

చైన్నై జట్టు ఐపీఎల్ లో ఐదుసార్లు విజేత. అన్ని సార్లూ ధోని నాయకత్వంలోనే చెన్నై జట్టు విజేతగా నిలిచింది. కానీ, గడిచిన మూడు సీజన్లుగా చైన్నై జట్టు దారుణంగా ఆడుతోంది. అభేద్యమైన రికార్డులు కలిగి ఉన్నఎల్లో ఆర్మీ ప్రత్యర్థి జట్లకు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోతోంది. పరుగులుతీయలేకపోతోంది. పరుగులను అడ్డుకోలేకపోతోంది. ఇలా ఆడుతున్న జట్టును చూసి అభిమానులు నిర్వేదం వ్యక్తంచేస్తున్నారు. ఇలా ఆడితే ఎలా భాసూ అంటూ సోషల్ మీడియాలో తమ బాధను వ్యక్తంచేస్తున్నారు.

ప్రస్తుత సీజన్ లో ప్లే ఆఫ్ వెళ్లాలంటే గెలవాల్సిన మ్యాచ్ లలో చైన్నై వరుసగా ఓడిపోయింది. అసలు ఆ జట్టు అలా ఎందుకు ఆడిందో ఇప్పటికీ అర్థం కావడం లేదు. నాయకత్వ లేమి, ఆటగాళ్లలో ఐకమత్యం లోపించడం వల్ల చైన్నై జట్టు వరుస ఓటములు ఎదుర్కొని టోర్నీ నిష్క్రమించింది.దీంతో సగటు చెన్నై అభిమాని గుండి పగిలింది. చైన్నైజ ట్టు వరుసగా ప్లే ఆఫ్ ముందు గ్రూప్ దశ నుంచి ఎగ్జిట్ అవడం ఇది మూడో సారి. అదికూడా వరుసగా..

2023లో విజేతగా నిలిచింది చైన్నై. ఆ తర్వాత సీజన్ 2024లో ట్రోఫీ అందుకోలేకపోయింది. గ్రూప్ దశ నుుంచే బయటకు వెళ్లిపోయింది. 2025లో ఇదే సీన్ రిపీట్అయింది. ప్రస్తుత సీజన్ లో కూడా గ్రూప్ దశ నుంచి ఇంటికి వెళ్లింది. చైన్నై జట్టు వరుసగా ప్లే ఆఫ్ వెళ్లకుండా ఇంటికి వెళ్లడం ఇది వరుసగా మూడో సారి. మరి వచ్చే సీజన్ లోఅయినా చైన్నై మెరుగ్గా ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

SRH ఆటగాడి వార్నింగ్.. గుర్తుపెట్టుకోండి.. విరాట్ మీకు భయాన్ని పరిచయం చేస్తాడు...

Virat Kohli Playoff Century
Virat Kohli Playoff Century

Virat Kohli Playoff Century: ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో విరాట్ భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటికే అతడు 13 మ్యాచ్ లు ఆడాడు. 13 ఇన్నింగ్స్ లలో 542 పరుగులు చేశాడు. అతడి యావరేజ్54.20. స్ట్రైక్ రేట్ 164.74. ఇందులో ఫోర్లు 57, సిక్సర్లు 21.. పైగా తన సమకాలిన రోహిత్ శర్మ గాయాలపాలై సరిగ్గా ఆడలేకపోతుంటే.. విరాట్ మాత్రం పాదరసం లాగా కదులుతున్నాడు. వీరోచితమైన బ్యాటింగ్ ఆకట్టుకుంటున్నాడు. విరాట్ కోహ్లీ ఖాతాలో ప్రస్తుత సీజన్ లో నాలుగు హాఫ్ సెంచరీలున్నాయి.

బెంగళూరు జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్ కు వెళ్లిపోయింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇప్పటికే టేబుల్ టాపర్ గా కొనసాగుతోంది.13 మ్యాచ్ లు ఆడిన బెంగళూరు 9 విజయాలు సాధించింది. 18 పాయింట్లతో తిరుగులేని స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ ఏకంగా +1.065 గా ఉంది. ప్రస్తుత ఐపీఎల్ లో బెంగళూరు తన చివరి లీగ్ మ్యాచ్ హైదరాబాద్ తో ఆడుతుంది. శుక్రవారం ఈ మ్యాచ్ జరగుతుంది. ఇప్పటికే హైదరాబాద్ పై ఈ సీజన్ లో తొలి మ్యాచ్ లో బెంగళూరు గెలిచింది. మార్చి 28న జరిగిన ఆ మ్యాచ్ లోబెంగళూరు ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. సన్ రైజర్స్ విధించిన 202 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలోనే ఫినిష్ చేసింది బెంగళూరు.

బెంగళూరు ప్లే ఆఫ్ వెళ్లిపోయిన నేపథ్యంలో సన్ రైజర్స్ మాజీ ఆటగాడు డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ ఆట తీరు గురించి ప్రస్తావించిన అతడు.. ప్లే ఆఫ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తాడని పేర్కొన్నాడు. అంతేకాదు ప్రత్యర్థి జట్లు విరాట్ కోహ్లీతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. అతడు మీకు భయాన్ని పరిచయం చేస్తాడని పేర్కొన్నాడు. అంతేకాదు, ప్లే ఆఫ్ లో సెంచరీ చేస్తాడని డేవిడ్ వార్నర్ స్పష్టం చేశాడు. ఓపినియన్ పోల్ కూడా నిర్వహించాడు. ఇందులో మెజార్టీ నెటిజన్లు విరాట్ సెంచరీ చేస్తాడని పేర్కొన్నారు.

విరాట్ అంటే డేవిడ్ వార్నర్ విపరీతమైన ఇష్టం. దానిని అనేక సందర్బాల్లో అతడు బయట పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏకంగా ప్లే ఆఫ్ లో సెంచరీ చేస్తాడని స్పష్టం చేశాడు. వార్నర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ జట్టు ఐపీఎల్ విజేతగా నిలిచింది. హైదరాబాద్ మాజీ ఆటగాడు అయినప్పటికీ విరాట్ నామస్మరణ చేస్తున్నాడంటే అతడు అంటే వార్నర్ కు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.

యాంకర్ శ్యామల కొంపముంచిన 'హోం మంత్రి' ఆశ!

Anchor Shyamala YSRCP Controversy
Anchor Shyamala YSRCP Controversy

Anchor Shyamala YSRCP Controversy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ నేతకు ఎప్పుడు ప్రాధాన్యం లభిస్తుందో.. ఎప్పుడు లభించదో తెలియని పరిస్థితి. అధినేతకు తగ్గట్టు వ్యవహరించకపోతే ఆ పార్టీలో చాన్స్ ఉండదు. స్వయంగా నిర్ణయాలు తీసుకుని మాట్లాడుతామంటే కుదరదు. కచ్చితంగా స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడాలి. లేకుంటే మాత్రం సైడ్ చేయడం ఖాయం. ఇప్పుడు యాంకర్ శ్యామల పరిస్థితి కూడా అదే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ వినిపించి అనవసరంగా తన కెరీర్ ను ఇబ్బందుల్లో పెట్టుకున్నారు. దీంతో ఆమె పూర్తిస్థాయిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతగా మారిపోయారు. హై కమాండ్ సైతం ఆమెను అధికార ప్రతినిధిగా నియమించి గౌరవించింది. ఇక శ్యామలకు తిరుగు ఉండదు అని అంతా భావించారు. కానీ ఇప్పుడు 10 నెలలు అవుతున్నా పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం లేకుండా పోతోంది. దీంతో ఆమెను పార్టీ దాదాపు సైడ్ చేసినట్టే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

* తెగ హడావిడి..
మొన్నటి ఎన్నికల ప్రచారంలో తెగ హడావిడి చేశారు శ్యామల. నియోజకవర్గాలను చుట్టేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. సెలబ్రిటీ హోదాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆమెను గౌరవించారు. వివిధ జిల్లాల్లో శ్యామల పర్యటనలు కూడా చేశారు. అయితే ఇదంతా తన సొంత ఇమేజ్ అని ఆమె భావించారట. అందుకే వచ్చే ఎన్నికల్లో పోటీ.. తప్పకుండా గెలుపు.. హోం మంత్రి అవుతానంటూ ప్రకటనలు వంటివి ఆమె నుండి వచ్చాయట. ఈ విషయం హై కమాండ్ కు చేరడంతో ఆమెను పక్కన పెట్టినట్లు ప్రచారం నడుస్తోంది. గత పది నెలలుగా ఆమె కార్యాలయంలో అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు లేవు. అయితే ఆమెను సైడ్ చేశారన్న కామెంట్స్ తో శ్యామల స్పందించారు. అటువంటిదేమీ లేదని తేల్చి చెప్పారు. ఇంత జరిగాక కూడా ఆమె పార్టీ కార్యాలయానికి వచ్చి మాట్లాడడం లేదు. ఇంకా డిజిటల్ ప్లాట్ ఫామ్ నుంచి మాట్లాడుతున్నారు.

* బుల్లితెరపై మెరుస్తూ..
బుల్లితెరపై మెరుస్తూ వచ్చారు శ్యామల. యాంకర్ గానే కాకుండా తనకంటూ ఒక మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా కనిపిస్తూ వచ్చారు. అయితే ఉన్నట్టుండి వైసిపి కార్యక్రమాల్లో పాల్గొనేవారు. వైసిపి అధికారంలో ఉండడంతో అటువైపు మొగ్గు చూపారు. ఒకవైపు టిడిపి తో పాటు జనసేనకు సినీ పరిశ్రమతో మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో శ్యామలకు అవకాశాలు సన్నగిల్లాయి. అయినా ఆమె వైసీపీ అధికారంలో ఉండడంతో.. మరోసారి ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని భావించి చాలా దూకుడుగా వ్యవహరించారు. కానీ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. శ్యామలపై రాజకీయ ముద్ర పడడంతో కెరీర్ పరంగా ఇబ్బందులు వచ్చాయి. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆమెను అధికార ప్రతినిధిగా నియమించింది. కానీ ఆమె వ్యవహార శైలి జగన్మోహన్ రెడ్డికి నచ్చడం లేదని తెలుస్తోంది. అందుకే దూరం పెట్టినట్లు సమాచారం. మరి లోలోపల ఏం జరిగిందో వారికే తెలియాలి.

దెబ్బకు దిగివచ్చిన ప్రొఫెసర్ నాగేశ్వర్!

Professor Nageshwar YCP Paytm Comments
Professor Nageshwar YCP Paytm Comments

Professor Nageshwar Controversy: ఏపీలో గత కొద్ది రోజులుగా రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణలు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ భేటీ వివరాలను లీక్ చేశారు ప్రొఫెసర్ నాగేశ్వర్. ఇది పెద్ద ఎత్తున దుమారానికి దారితీసింది. కూటమి పార్టీల మధ్య వైరుధ్యం ఉందన్న కోణంలో ప్రచారం నడిచింది. దీనిపై జనసేన సీరియస్ అయింది. ఏకంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు కూడా నమోదయింది. మరోవైపు టిడిపి కూటమిపై జరుగుతున్న కుట్రగా భావించి కఠిన నిర్ణయాలు తీసుకు అడుగులు వేయాలని నిర్ణయించింది. మరోవైపు సోషల్ మీడియాలో ప్రొఫెసర్ నాగేశ్వర్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. దీంతో ప్రొఫెసర్ నాగేశ్వర్ బహిరంగంగానే స్పందించారు. ఈ మొత్తం ఎపిసోడ్ ను వెనక్కి తీసుకున్నట్లు ప్రకటన చేశారు.

* అమిత్ షా తో భేటీ లీక్
కొద్ది రోజుల కిందట కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి నాదెండ్ల మనోహర్ కలిశారు. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టాలని కోరారని.. అందుకు అమిత్ షా నిరాకరించారని.. చంద్రబాబు ఇనిస్టాంట్ ఫ్రెండ్.. జగన్మోహన్ రెడ్డి లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అంటూ చెప్పుకొచ్చారని.. అనవసరంగా జగన్మోహన్ రెడ్డి జోలికి వెళ్ళొద్దని సూచించారని.. అమిత్ షా పవన్ కళ్యాణ్ కు క్లాస్ పీకినట్లు చెప్పుకొచ్చారు ప్రొఫెసర్ నాగేశ్వర్. జనసేన కోర్ కమిటీలో ఇదే విషయాన్ని నాదెండ్ల మనోహర్ తో పవన్ కళ్యాణ్ చెప్పించారని.. జనసేన వర్గాల నుంచి తనకు సమాచారం అందినట్లు ప్రొఫెసర్ నాగేశ్వర్ బయటపెట్టారు టీవీ డిబేట్లో. అప్పటినుంచి రచ్చ రచ్చ నడుస్తోంది. ఇదిగో మాకు కేంద్రం మద్దతు ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెగ హడావిడి చేసింది.

* ఆ భయంతోనే వెనక్కి..
అయితే ఈ ఎపిసోడ్ పై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటే తనకు ఎంతో గౌరవం అని.. అటువంటి వ్యక్తి ఇలాంటి ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. అంతటితో ఆగకుండా జనసేన తరఫున ప్రొఫెసర్ నాగేశ్వర్ పై ఫిర్యాదు అందింది పోలీసులకు. ఇంకోవైపు కూటమి విచ్ఛిన్నం చేసేందుకు జరుగుతున్న కుట్రగా టిడిపి పొలిట్ బ్యూరోలో నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇటువంటి ఆధారాలు లేని ఆరోపణలపై కఠిన చర్యలు తీసుకోవాలని భావించారు. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గతంలోనే అడ్డగోలుగా మద్దతు తెలిపారు ప్రొఫెసర్ నాగేశ్వర్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను అన్ని వర్గాలు వ్యతిరేకించగా ప్రొఫెసర్ నాగేశ్వర్ మాత్రం జగన్మోహన్ రెడ్డిని సమర్థించారు. వాటికి సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడిన ప్రొఫెసర్ నాగేశ్వర్ తో పాటు సంబంధిత ఛానల్ పై కూడా పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మొత్తం పరిణామంతో కేసులు నమోదు తో పాటు అరెస్టులు ఉంటాయని భావించారు ప్రొఫెసర్ నాగేశ్వర్. అన్నింటికీ మించి తన క్రెడిబిలిటీ దెబ్బతింటుందని భావించి ఎటువంటి ఆధారాలు లేవని.. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు ప్రొఫెసర్ నాగేశ్వర్..

ఈ ఐదు రాశుల వారికి ఈరోజు లక్ష్మీ కటాక్షం.. వద్దన్నా డబ్బు..

Today 22 May 2026 Horoscope
Today 22 May 2026 Horoscope

Today 22 May 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం పాఠశాలపై ఆశ్లేష నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అనుకోకుండా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. మరి కొన్ని రాశుల వారు కొన్ని సమస్యల పట్ల సంయమనం పాటించాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు తమ పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో అనుకున్న పనులను ఈరోజు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈరోజు రోజంతా ఉత్సాహంగా ఉంటారు. గతంలో చేపట్టిన ముఖ్యమైన పనులను ఈరోజు పూర్తి చేస్తారు. ఓ కొత్త వ్యక్తి పరిచయం అవుతారు. ఈ వ్యక్తితో జీవితం మారిపోయే అవకాశం ఉంటుంది. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు పొందుతారు. అనుకోకుండా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈ రోజు కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది. నిరుద్యోగులకు అనుగుణమైన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదంగా మారుతుంది. విభేదాలు తొలగిపోయి సంతోషంగా గడుపుతారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు కొన్ని విషయాల్లో నిర్లక్ష్యం చేస్తారు. దీంతో కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతుతో వ్యాపారులు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. ప్రియమైన వారికోసం కొత్తగా వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేస్తారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు ఖర్చులను ఎక్కువగా భరించే అవకాశం ఉంటుంది. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఉన్నతాధికారుల అండదండలతో ఉద్యోగులు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే ప్రజలను సంప్రదించడం మంచిది

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు సంతోషంగా గడుపుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధించే అవకాశం ఉంది. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం ఎరుగుపడే అవకాశం ఉంది. ప్రియమైన వారికోసం ప్రత్యేకంగా వస్తువులు కొనుగోలు చేస్తారు. పెద్దల అండదండలతో కొత్తగా పెట్టుబడులు పెడతారు ప్రత్యర్థుల విషయంలో వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. పూర్వికులు ఆర్థిక సంబంధించి శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. కత్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు ఏ పని మొదలుపెట్టిన దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. బంధువుల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి శుభవార్తలు అందుతాయి. స్నేహితుల సహకారంతో అప్పులను తీరుస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. పూర్వీకుల ఆర్థిక సంబంధించి శుభవార్తలు వింటారు. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈరోజు మానసికంగా ఒత్తిడికి లోన అయ్యే అవకాశం ఉంది. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉండే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో మౌనంగా ఉండటమే మంచిది. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : కుంభ రాశి వారు ఈ రోజు ఏ పట్టుబడులు పెట్టినా అధిక లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా గడుపుతారు. కష్ట సమయంలో సంయమనం కోల్పోకుండా ఉండాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు ప్రత్యర్థుల బెడద ఎక్కువగా ఉంటుంది.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వ్యాపారులో ఈరోజు మెరుగైన లాభాలు సాధిస్తారు. పిల్లలతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. స్నేహితుల సహకారంతో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

ఒకప్పుడు వాహనాల లైట్లపై బ్లాక్ స్టిక్కర్ ఉండేది.. ఎందుకో తెలుసా..

Vehicle Headlight Black Sticker
Vehicle Headlight Black Sticker

Vehicle Headlight Black Sticker: రాత్రి సమయంలో వాహనాలు నడపడం ఇప్పుడు చాలామందికి భయంగా మారుతోంది. ముఖ్యంగా ఎదురుగా వచ్చే వాహనాల హై పవర్ LED హెడ్‌లైట్ల కాంతి కళ్లపై నేరుగా పడడంతో కొన్ని క్షణాల పాటు రోడ్డు కనిపించకుండా పోతోంది. దీంతో రాత్రి ప్రయాణం చాలా ప్రమాదకరంగా మారిందని డ్రైవర్లు చెబుతున్నారు. గతంలో ఈ సమస్యను కొంతవరకు తగ్గించేందుకు వాహనాల హెడ్‌లైట్లపై బ్లాక్ స్టిక్కర్లు లేదా బ్లాక్ టేప్‌లను ఉపయోగించేవారు. ఇప్పుడు అవి కనిపించకపోవడంతో ప్రమాదాలు పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు బ్లాక్ స్టిక్కర్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? అవి లేకపోతే ఏమవుతుంది?

గతంలో వాహనాల హెడ్‌లైట్లపై చిన్న బ్లాక్ స్టిక్కర్ లేదా నల్ల టేప్ ప్రధాన ఉద్దేశం ఎదురుగా వచ్చే వాహన డ్రైవర్ కళ్లపై కాంతి నేరుగా పడకుండా నియంత్రించడం. హెడ్‌లైట్ మధ్య భాగంలో లేదా పై భాగంలో ఈ స్టిక్కర్ ఉండటం వల్ల కాంతి కొంతవరకు విరిగి కిందికి పడేది. దీంతో ఎదురు డ్రైవర్‌కు తక్కువ గ్లేర్ కనిపించి రోడ్డు స్పష్టంగా కనిపించేది. ఈ బ్లాక్ స్టిక్కర్ల వల్ల రాత్రి సమయంలో కళ్లకు ఒత్తిడి తగ్గేది. ఎక్కువ కాంతి కళ్లపై పడితే కంటి మణి ఒక్కసారిగా కుదించుకొని కొన్ని క్షణాల పాటు చూపు మందగిస్తుంది. దీనిని ‘టెంపరరీ బ్లైండ్నెస్’ అని కూడా అంటారు. బ్లాక్ స్టిక్కర్ వల్ల కాంతి తీవ్రత కొంత తగ్గి ఈ సమస్య తగ్గేది.

అయితే ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువగా LED, వైట్ లైట్ హెడ్‌లైట్లు వాడుతున్నారు. ఇవి సాధారణ హాలోజన్ లైట్ల కంటే చాలా ఎక్కువ ప్రకాశం ఇస్తాయి. కొందరు నియమాలకు విరుద్ధంగా అధిక పవర్ లైట్లు అమర్చుకోవడం, హై బీమ్‌ను నిరంతరం ఉపయోగించడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతోంది. ముఖ్యంగా హైవేలపై ఎదురుగా వచ్చే భారీ వాహనాల LED ఫోకస్ కారణంగా చిన్న వాహన డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇప్పట్లో బ్లాక్ స్టిక్కర్లు కనిపించకపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఆధునిక కార్లలో ప్రొజెక్టర్ ల్యాంపులు, ఆటో ఫోకస్ సిస్టమ్లు రావడంతో కంపెనీలు ప్రత్యేకంగా స్టిక్కర్లు వాడటం తగ్గించాయి. మరోవైపు చాలామంది వాహన యజమానులు ‘ఎక్కువ కాంతి అంటే ఎక్కువ భద్రత’ అనే భావనతో అత్యధిక ప్రకాశం ఉన్న లైట్లను వాడుతున్నారు. దీంతో ఇతరులకు కలిగే ప్రమాదాన్ని పట్టించుకోవడం తగ్గిపోయింది.

నిపుణుల సూచనల ప్రకారం రాత్రి డ్రైవింగ్ సమయంలో అవసరం లేకపోతే హై బీమ్ వాడకూడదు. ఎదురుగా వాహనం వస్తే వెంటనే లో బీమ్‌కు మార్చాలి. వాహనాల్లో కంపెనీ నిర్దేశించిన లైట్లనే ఉపయోగించాలి. అలాగే ప్రభుత్వం కూడా అధిక పవర్ LED లైట్లపై కఠిన నియంత్రణలు తీసుకురావాలని, ట్రాఫిక్ పోలీసులు తరచూ తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.

గేమర్స్ కోసం iQOO నుంచి పవర్ ఫుల్ ప్యాడ్..

iQOO Pad 6 Pro Gaming Tablet
iQOO Pad 6 Pro Gaming Tablet

iQOO Pad 6 Pro Gaming Tablet: ప్రమఖ మొబైల్ సంస్థ iQOO తాజాగా సరికొత్త ఫ్లాగ్‌షిప్ టాబ్లెట్ iQOO Pad 6 Proను చైనాలో విడుదల చేసింది. నేటి యువత ఎక్కువగా గేమింగ్ కోరుకుంటున్నారు. ఇలాంటి వారికి మొబైల్ కంటే టాబ్లెట్ ఎంతో ఉపయోగపడే అవకాశం ఉందని గ్రహించిన ఈ సంస్థ శక్తివంతమైన ఫీచర్లతో దీనిని మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ టాబ్లెట్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

iQOO Pad 6 Pro టాబ్లెట్ 13.2 అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్ తో 4K రిజల్యూషన్ తో పనిచేస్తుంది. 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, డాల్బీ విజన్ సపోర్ట్‌తో వస్తుంది. భారీ స్క్రీన్ అయినప్పటికీ ఇది కేవలం 6.1 మి.మీ. మందంతో చాలా సన్నగా , స్టైలిష్‌గా ఉంటుంది. దీని బరువు సుమారు 663 గ్రాములు మాత్రంమే.

ఈ టాబ్లెట్ లో అత్యంత శక్తివంతమైన Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇది 3nm ప్రాసెస్‌పై ఆధారపడి పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్ మల్టీ టాస్కింగ్ తో పాటు గేమింగ్ కోసం ఇందులో 16GB వరకు RAM సపోర్టు చేస్తుంది. అలాగే 512GB వరకు UFS 4.1 స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. ఇది వేడెక్కకుండా ఉండేందుకు ఇందులో భారీ ‘VC వేపర్ ఛాంబర్’ కూలింగ్ సిస్టమ్‌ను అమర్చారు.

ఇందులో 13,000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీ ఉండనుంది. దీంతో ఇది సుదీర్ఘ బ్యాకప్‌ను అందిస్తుంది. దీనిని ఛార్జ్ చేయడానికి 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. సాఫ్ట్‌వేర్ పరంగా ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఇది టాబ్లెట్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన పిసి-లెవల్ మల్టీ టాస్కింగ్ ఫీచర్లను అందిస్తుంది.

కెమెరా ఫీచర్స్ లో భాగంగా ఇందులో ఫోటోగ్రఫీ కోసం 13MP బ్యాక్ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఆడియో కోసం ఇందులో 8-స్పీకర్ పనోరమిక్ ఆడియో సిస్టమ్‌ను అందించారు. గేమింగ్ కోసం ప్రత్యేకంగా ‘Monster Over-core Engine’ ను ఇందులో చేర్చారు, ఇది గేమ్‌లలో స్థిరమైన ఫ్రేమ్ రేట్‌ను ఉంచడానికి సహాయపడుతుంది.

ప్రస్తుతానికి ఈ టాబ్లెట్ చైనాలో అందుబాటులోకి వచ్చింది. దీని బేస్ వేరియంట్ (8GB+256GB) ధర సుమారు 4,499 యువాన్లు (సుమారు ₹64,000) నుండి ప్రారంభమవుతుంది. ఈ టాబ్లెట్ గేమర్స్, క్రియేటర్లకు ఒక పవర్‌ఫుల్ ఆప్షన్‌గా నిలుస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు.