Oppo Find X9 Price And Features: ప్రీమియం ఫోన్లను ఇష్టపడే వారిలో ఎక్కువగా ఆపిల్ కంపెనీ తయారు చేసే ఐఫోన్లను కొనుగోలు చేస్తారు. ధర ఎంతైనా సరే పెట్టి కొనేస్తుంటారు. పైగా ఐఫోన్ వాడటాన్ని సామాజిక హోదాగా భావిస్తూ ఉంటారు. అయితే ఐఫోన్ స్థాయిలో ఫీచర్లు ఉండి.. అంతకంటే తక్కువ ధర ఉండే ఫోన్లు మార్కెట్లో చాలానే ఉన్నాయి. అయితే అవి ఇవి కూడా ఐఫోన్ స్థాయిలో అమ్మకాలను సాగించలేదు. అయితే తొలిసారి ఒప్పో కంపెనీ ఆపిల్ కంపెనీ మార్కెట్ మీద దృష్టి పెట్టింది. ఏకంగా ఐఫోన్ స్థాయిలో సౌకర్యాలు కల్పించి.. సరికొత్త మోడల్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
Oppo find x9 సిరీస్లో రెండు ఫోన్లు మన మార్కెట్లోకి విడుదలయ్యాయి.. oppo find x9, oppo find x9 ultra మోడల్ ఫోన్లను మనదేశంలో విడుదల చేశారు. ప్రీమియం సెగ్మెంట్ లో ఈ ఫోన్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు ఒప్పో కంపెనీ ప్రకటించింది. ధరలు కూడా ప్రీమియం స్థాయిలో ఉన్నట్టు వెల్లడించింది.. దీంతో ఒక వర్గం వారిని లక్ష్యంగా చేసుకొని ఈ ఫోన్లను రూపొందించినట్టు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఫీచర్లు ఎలా ఉన్నాయంటే
ఈ మోడల్ ఫోన్లలో 6.82 అంగుళాల క్యూహెచ్డీ, ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్ప్లే వచ్చింది. 120 హెచ్ జెడ్ రిప్రెష్ రేట్, 1800 నెట్స్ పిక్ బ్రైట్నెస్ ఈ మోడల్ లో ఉన్న ప్రత్యేకత. ఆండ్రాయిడ్ 16 కలిగిన కలర్ ఓఎస్ 16 ఆధారంగా ఇది పనిచేస్తూ ఉంటుంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 8 ప్రాసెసర్ ఉంది. 200 మెగాపిక్సల్ ఓఐఎస్ మెయిన్ కెమెరా.. 50 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా.. 200 మెగాపిక్సల్ టెలిఫోటో కెమెరా.. 50 మెగాపిక్సల్ టెలిఫోటో కెమెరా ఇందులో ఉంది. ముందువైపు 50 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంది. 7050 ఎంఏహెచ్ బ్యాటరీ.. 100 వైర్ పాస్ట్ చార్జింగ్.. 50 వైర్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఇది చేస్తుంది. కార్నింగ్ గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఇందులో ఉంది. ఫోన్ దాదాపు 235 గ్రాముల బరువు ఉంటుంది.
ఒప్పో ఫైండ్ ఎక్స్ 9
ఇందులో 6.59 అంగుళాల ఫుల్ హెచ్డి, అమ్మో లెడ్ డిస్ప్లే ఇచ్చారు. 120 హెచ్ జెడ్ రి ఫ్రెష్ రేట్ ఇందులో ఉంది. 1800 nits పిక్ బ్రైట్నెస్ ఇందులో ఉంది. ఆండ్రాయిడ్ 16 సపోర్ట్ చేస్తే కాలర్ ఓఎస్ 16 ద్వారా ఇది పనిచేస్తూ ఉంటుంది. ఇందులో అక్టాకోర్ మీడియా టెక్ డైమెన్ సిటీ 9500 ఎస్ ప్రాసెసర్ ఇందులో ఉంది. 50 మెగా పిక్సెల్ ఓ ఐ ఎస్ మెయిన్ కెమెరా, 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 50 మెగాపిక్సల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఇందులో ఉంది.. 7025 ఎంఎహెచ్ బ్యాటరీ, 30 వైర్ పాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో ఇది పని చేస్తూ ఉంటుంది. ఐపీ 66, ఐపి 68, ఐపీ సిక్స్టీ నైన్ రేటింగ్ దీనికి ఉంది.. ఇది లావెండర్ స్కై, మిడ్ నైట్ గ్రే, సన్ సెట్ ఆరెంజ్ కలర్స్ లో లభిస్తూ ఉంటుంది.
Oppo find x9 ultra ఫోన్ ను సింగిల్ వేరియంట్ లో మార్కెట్లోకి తీసుకొచ్చారు. 12gb, 512gb వేరియంట్ ధరను 1,69,999 గా నిర్ణయించారు. ఇప్పటికే అన్ని ఈ కామర్స్ సైట్లలో ప్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ప్రీ బుకింగ్ చేసుకున్న వారికి 11 వేల విలువైన ఒప్పో ఇంకో ఎయిర్ ఫైవ్ ప్రో టి డబ్ల్యూ ఎస్ ఇయర్ బర్డ్స్, ఒప్పో ఫైండ్ ఎక్స్లెంట్ అల్ట్రా కవర్ కేస్ ఉచితంగా లభిస్తుంది. అంతేకాదు 22 వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్ కూడా కంపెనీ ఇస్తోంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డు హోల్డర్లకు ఒప్పో కంపెనీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. 24 నెలల పాటు ఉచితంగా డౌన్ పేమెంట్.. దీంతోపాటు 10% వరకు ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ అందిస్తోంది.
















వెంకటేష్ తో ఆ సినిమా చేస్తే ఆడదని చెప్పిన స్టార్ డైరెక్టర్...ఫైనల్ గా ఏం జరిగిందంటే..?
Venkatesh Movie Controversy: వెంకటేష్ హీరో గా తెరకెక్కిన చాలా సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. కెరియర్ మొదట్లో ఆయన మాస్ సినిమాలు చేసినప్పటికి ఒకానొక టైమ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పిస్తూ ప్రేక్షకులందరిని అలరించాడు. ముఖ్యంగా శోభన్ బాబు తర్వాత అంతటి ఇమేజ్ ను సంపాదించుకున్న తెలుగు హీరో కూడా తనే కావడం విశేషం…వెంకటేష్ వైవిధ్య భరితమైన పాత్రలను పోషించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. అయితే ఆయన చేసిన చంటి సినిమా విషయంలో అప్పట్లో చాలా వరకు నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి…ఇక సినిమా స్టార్ట్ చేసే సమయంలో ఈ మూవీ ని వెంకటేష్ తో చేస్తున్నాము అని అనౌన్స్ చేసినప్పుడు చాలా మంది చాలా రకాలుగా విమర్శించారు. తమిళంలో ‘చిన్న తంబి’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేశారు. అయితే ఒరిజినల్ వెర్షన్ ను పి వాసు డైరెక్షన్ చేశాడు.
తెలుగులో కూడా అతనితోనే డైరెక్షన్ చేయిద్దామని రామానాయుడు అడిగితే వెంకటేష్ హీరోగా చేస్తే ఈ సినిమా అనుకున్న రేంజ్ లో ఆడదని చెప్పారట. కారణం ఏంటంటే అప్పటికే వెంకటేష్ మాస్ హీరోగా అవతరించాడు. ఈ సినిమాలో హీరో పెద్దగా మైండ్ మెచ్యూరిటి లేని క్యారెక్టర్ లో నటించాల్సి ఉంటుంది.
అది వెంకటేష్ చేస్తే అంత పెద్దగా ఎఫెక్టివ్ గా ఉండదని దానికంటే ఇమేజ్ లేని హీరోతో చేస్తే బాగుంటుందని చెప్పారట. ఆ విషయానికి కన్విన్స్ కానీ రామానాయుడు రవిరాజా పినిశెట్టిని తీసుకొచ్చి చంటి పేరుతో ఆ సినిమాను రీమేక్ చేయించాడు. మొత్తానికైతే ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది. ఇక వెంకటేష్ కెరీర్లో ఉన్న బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ లలో చంటి సినిమా కూడా ఒకటిగా నిలవడం విశేషం…
ఇక ఏది ఏమైనా కూడా ఏ సినిమా ఎవరికి బాగుంటుంది. ఎవరు ఆ క్యారెక్టర్ లో ఒదిగిపోతారనేది చెప్పడం చాలా కష్టం…స్క్రీన్ మీద ఒకసారి కనిపిస్తే ప్రేక్షకులు ఆటోమేటిగ్గా వాళ్ళని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఏ క్యారెక్టర్ ని ఎవరు చేసిన కూడా దాన్ని సక్సెస్ ఫుల్ గా నిలుపవచ్చనే ఉద్దేశ్యంతోనే వెంకటేష్ ‘చంటి’ సినిమాతో ప్రూవ్ చేశాడు…