Home Blog Page 226

అమెరికా దెబ్బ.. పాకిస్తాన్ పాస్పోర్ట్ మార్చుకుంటుందా?

American policy impact on Pakistan passport
American policy impact on Pakistan passport

American policy impact on Pakistan passport: ఇరాన్ తో శాంతి చర్చల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అబ్రహం అకార్డ్స్‌ను మరింత విస్తరించాలని నిర్ణయించింది. ఈ మేరకు పలు దేశాలపై ఒత్తిడి తెస్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్ పై తీవ్ర ఒత్తిడి ఉంది. ఈ నేపథ్యంలో, పాకిస్థాన్ పాస్పోర్ట్‌పై ముద్రించిన “ఇజ్రాయెల్ మినహా” నిబంధన మళ్లీ వైరల్ అవుతోంది. ఇది ఒక దేశ దీర్ఘకాలిక విదేశాంగ నీతి, భావోద్వేగాలు, సూత్రాల స్పష్టమైన ప్రతిబింబం.

ట్రంప్ ఒత్తిడి…
అబ్రహం అకార్డ్స్ ద్వారా యుఏఈ, బహ్రెయిన్ వంటి అరబ్ దేశాలు ఇజ్రాయెల్‌తో సంబంధాలు సాధారణీకరించాయి. ఇప్పుడు ట్రంప్ ఇరాన్ సంబంధిత ఒప్పందాల్లో భాగంగా పాకిస్తాన్ సహా మరిన్ని ముస్లిం దేశాలు ఈ ఫ్రేమ్‌వర్క్‌లో కచ్చితంగా చేరాలని చెబుతున్నారు. ఇది డిప్లొమాటిక్ గుర్తింపు మాత్రమే కాకుండా, వాణిజ్యం, సాంకేతిక సహకారం, భద్రతా సహకారం వంటి అనేక అవకాశాలను తెరుస్తుంది. కానీ పాకిస్తాన్ దీనిని తిరస్కరించింది. రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ “మా మూల సిద్ధాంతాలకు వ్యతిరేకం” అని చెప్పారు. పాలస్తీనా స్వతంత్ర రాజ్యం ఏర్పడే వరకు ఇజ్రాయెల్‌ను గుర్తించేది లేదని పునరుద్ఘాటించారు. విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా ఇదే స్టాండ్‌ను ప్రకటించారు

పాస్పోర్ట్ నిబంధన ఇలా..
పాకిస్తాన్ పాస్పోర్ట్‌లో స్పష్టంగా “This passport is valid for all countries of the world except Israel” అని ముద్రించి ఉంటుంది. ఇది పాలస్తీనా విషయంలో పాక్ అచంచలమైన సమర్థనకు చిహ్నం. ఇజ్రాయెల్‌తో సంబంధాలు సాధారణీకరిస్తే ఈ నిబంధన చట్టపరంగా, ఆచరణాత్మకంగా అసాధ్యం అవుతుంది. మార్పు జరిగితే కొత్త పాస్పోర్ట్ డిజైన్, ముద్రణ
లక్షలాది పాత పాస్పోర్టుల మార్పు లేదా అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. ఇది జాతీయ గుర్తింపు విధానపరమైన మార్పు.

మారడం కష్టం?
పాకిస్తాన్ స్టాండ్ చాలా లోతైనది. 1947 నుంచి పాలస్తీనా సమస్యను తన స్వంత సమస్యగా చూస్తోంది. క్వైద్-ఎ-ఆజం దృక్పథం నుంచి మొదలైన ఈ సమర్థన, ఇస్లామిక్ సాలిడారిటీ, ప్రజా భావోద్వేగాలు, ఇస్లామిస్ట్ రాజకీయ శక్తుల ఒత్తిడి — ఇవన్నీ కలిసి మార్పును కష్టతరం చేస్తున్నాయి. పర్వేజ్ ముషర్రఫ్ కాలంలో కొంత డైలాగ్ జరిగినా, ప్రజా వ్యతిరేకత, గాజా సంక్షోభం వంటి కారణాలతో అది ముందుకు సాగలేదు. ప్రస్తుతం కూడా ఖ్వాజా ఆసిఫ్ వంటి నాయకులు ఇజ్రాయెల్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. అయినప్పటికీ, ఆర్థిక ఒత్తిడులు, అమెరికా సహాయం, భద్రతా అవసరాలు భవిష్యత్తులో ఒత్తిడి పెంచవచ్చు. సౌదీ అరేబియా వంటి దేశాలు కూడా పాలస్తీనా పురోగతిని షరతుగా చెబుతున్నాయి.

పాకిస్తాన్ స్టాండ్ సూత్రబద్ధమైనది. భావోద్వేగపరంగా బలమైనది. కానీ రాజకీయాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. భూ-రాజకీయాలు మారినప్పుడు, ఆర్థిక లాభాలు, భద్రతా అవసరాలు ఒక దేశాన్ని తన స్టాండ్‌ను పునరాలోచించేలా చేయవచ్చు. ప్రస్తుతం పాకిస్తాన్ “లేదు” అనే సందేశం ఇచ్చింది. పాస్పోర్ట్‌లోని ఆ నిబంధన ఇప్పటికీ బలంగా ఉంది. భవిష్యత్తులో మధ్యప్రాచ్యం ఎలా మారుతుందో, పాలస్తీనా సమస్య ఎలా పరిష్కారం అవుతుందో చూడాలి. కానీ ఈ క్షణం పాకిస్పాతాన్ తన సూత్రాలపైనే నిలబడుతోంది.

చిరంజీవి చేసిన ఆ ఒక్క పని వల్ల రామ్ చరణ్ స్టార్ అయ్యాడా..? నాగార్జున చేయలేకపోయాడా..?

Chiranjeevi
Chiranjeevi

Chiranjeevi: గత 50 సంవత్సరాలుగా మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందించాడు. డిఫరెంట్ సినిమాలతో గొప్ప విజయాలను సాధించాడు. 70 సంవత్సరాల పైబడిన వయసులో కూడా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…ఇక తన కొడుకు అయిన రామ్ చరణ్ ను ఇండస్ట్రీకి పరిచయం చేయడమే కాకుండా తనదైన రీతిలో సత్తా చాటుకునే విధంగా ప్రణాళికలు రూపొందించాడు. అందుకే రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియాలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా రాని గుర్తింపు ఆయన చేసిన సినిమాలతో తెచ్చుకున్నాడు. అది చిరంజీవి నట వారసుడిగా రామ్ చరణ్ ఇండస్ట్రీ కి వచ్చాడు. ఎలాగైనా సరే తను ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా మారాలనే ప్రయత్నంలో చిరంజీవి తన కొడుకుకి సలహాలు సూచనలను ఇస్తు స్టోరీస్ సెలక్షన్స్ లో కూడా హెల్ప్ చేస్తూ వచ్చాడు.

ఇక ఇలాంటి క్రమంలోనే చిరంజీవి మొత్తానికైతే ‘చిరుత’ సినిమా తర్వాత ‘మగధీర’ సినిమాతోనే రామ్ చరణ్ టాప్ హీరోగా వెలుగొందుతూ ముందుకు దూసుకెళ్లాడు. మొదటి రెండు సినిమాలతోనే హీరో ప్రేక్షకుల్లోకి వెళ్లిపోయివాలి. లేకపోతే మాత్రం ఆడియన్స్ హీరోలను యాక్సెప్ట్ చేయరనే ఒక నమ్మకంతోనే చిరంజీవి రామ్ చరణ్ ను చాలా ఎఫెక్టివ్ గా ప్రేక్షకుల్లో పంపించి హీరోగా తనని నిలబెట్టడం లో సక్సెస్ అయ్యాడు. కానీ ఈ విషయంలో నాగార్జున మాత్రం చాలా వరకు వెనకపోయాడనే చెప్పాలి. తన కొడుకుల విషయంలో ఆయన సరిగ్గా ఆలోచించలేదు.

ఎంత సేపు సక్సెస్ రావాలనే ప్రయత్నం చేశాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. చిరంజీవి మాత్రం రామ్ చరణ్ విషయంలో మార్కెట్ ను పెంచే ప్రయత్నం చేశాడు. దానివల్ల సక్సెస్ రాకపోయిన కూడా హీరోకి ఒక మార్కెట్ అనేది బిల్డ్ అవుతుంది. కానీ నాగచైతన్య అఖిల్ విషయంలో నాగార్జున అలా చేయలేకపోయాడు. అందువల్లే వాళ్ళు ఈరోజు స్టార్ హీరోలుగా మారలేకపోయారని ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…

రూ.10 వేలతో ఈ స్కూటర్ ను సులభంగా కొనొచ్చు..

Honda Activa Electric Scooter
Honda Activa Electric Scooter

Honda Activa Electric Scooter: Honda కంపెనీ ఇప్పటి వరకు అద్భుతమైన బైక్ లతో ఎంతో మంది వినియోగదారులను ఆకట్టుకుంది. ఆ తరువాత Activaతో స్కూటర్ విభాగంలో వినియోగదారుల మనసును దోచుకుంది. అయితే ఇప్పుడు యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ గా మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ ఆకట్టుకోనుంది. దీని డిజైన్ తో పాటు ఇందులో ఉండే బ్యాటరీ పవర్ ఎలా ఉందో చూద్దాం..

హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ 2025 మార్చి 29న భారతదేశంలో అధికారికంగా లాంచ్ అయ్యింది. ఇది హోండా యొక్క మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ కావడం విశేషం. ఈ స్కూటర్ Ola S1 ప్రో, TVS iQube, Bajaj Chetak, Ather Ritza వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లకు గట్టి పోటీ ఇస్తోంది.

ఈ స్కూటర్ లో రెండు స్వాపబుల్ బ్యాటరీలతో ఉంటూ.. మొత్తం బ్యాటరీ సామర్థ్యం 3 kWh తో పనిచేస్తుంది. ఈ బ్యాటరీని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 102 కి.మీ. రేంజ్ ఇస్తుంది. దీంతో నగరంలోని వారితో పాటు హైవేలపై ప్రయాణించే వారికి ఇది అనుగుణంగా ఉంటుంది.ఈ స్కూటర్ లో ఉండే బ్యాటరీ SWAP టెక్నాలజీ ద్వారా ఒక నిమిషంలో బ్యాటరీని మార్చుకోవచ్చు. అంతేకాకుండా ఇది చార్జింగ్ సమయాన్ని ఆదా చేస్తుంది.

Honda Activa స్కూటర్ లో 6 kW మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్‌తో వస్తుంది. గరిష్ట వేగం గంటకు 80 కి.మీ. గా ఉంది. ఇందులో కీలెస్ ఎంట్రీ, 5 అంగుళాల TFT స్క్రీన్ , CBS బ్రేకింగ్ సిస్టం, అడ్వాన్స్డ్ సస్పెన్షన్, స్మార్ట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉన్నాయి. బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీ ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ల నుండి దీనిని వేరు చేస్తుంది.
ధర మరియు కొనుగోలు విధానం కూడా వినియోగదారులకు అనుకూలంగా ఉన్నాయి.

ఈ హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్-షోరూమ్ ధర రూ. 1,19,000గా నిర్ణయించారు. సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించేలా, కేవలం రూ. 10,000 ప్రారంభ డౌన్ పేమెంట్‌తో ఈ స్కూటర్‌ను ఇంటికి తీసుకెళ్లవచ్చు. మిగిలిన మొత్తాన్ని సులభమైన వాయిదాల (EMI) రూపంలో చెల్లించే వెసులుబాటు కూడా అందుబాటులో ఉంటుంది.

40 ఏళ్ల తరువాత గర్భం వస్తే ఈ సమస్యలు.. ఏం చేయాలంటే..

Pregnancy After 40
Pregnancy After 40

Pregnancy After 40: ప్రస్తుతం మహిళలు చదువు, ఉద్యోగం, కెరీర్, ఆర్థిక స్థిరత్వం వంటి కారణాల వల్ల ఆలస్యంగా వివాహం చేసుకోవడం, ఆలస్యంగా గర్భధారణకు ప్లాన్ చేయడం పెరుగుతోంది. అయితే వైద్య నిపుణుల ప్రకారం 35 నుంచి 40 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడం కొన్ని ప్రత్యేక ఆరోగ్యపరమైన సవాళ్లను తీసుకువస్తుంది. ఈ వయసులో గర్భధారణ సాధ్యమే అయినప్పటికీ, తల్లి మరియు శిశువు ఆరోగ్యంపై ఎక్కువ జాగ్రత్త అవసరమని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అవేంటంటే?

మహిళల శరీరంలో వయసు పెరుగుతున్న కొద్దీ అండాల నాణ్యత తగ్గుతుంది. సాధారణంగా 30 ఏళ్ల తర్వాత ఫెర్టిలిటీ క్రమంగా తగ్గడం మొదలవుతుంది. 35 ఏళ్ల తర్వాత ఈ తగ్గుదల మరింత వేగంగా ఉంటుంది. దీనివల్ల గర్భం దాల్చడానికి ఎక్కువ సమయం పట్టడం, కొన్నిసార్లు సహజ గర్భధారణ కష్టమవడం జరుగుతుంది. అందుకే ఈ వయసులో చాలామంది ఐవీఎఫ్ వంటి ఫెర్టిలిటీ చికిత్సలను ఆశ్రయిస్తున్నారు.

ఈ వయసులో గర్భధారణలో అబార్షన్ ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అండాల నాణ్యత తగ్గడం వల్ల పిండంలో జన్యుపరమైన లోపాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. దాంతో గర్భస్రావం, పిండం ఎదుగుదల సరిగా లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా మొదటి మూడు నెలలు అత్యంత కీలక దశగా పరిగణిస్తారు. గర్భధారణ సమయంలో హైబీపీ, గర్భకాల మధుమేహం వంటి సమస్యలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి. వయసు పెరిగే కొద్దీ శరీరంలోని హార్మోన్ల సమతుల్యత మారిపోతుంది. దీనివల్ల రక్తపోటు నియంత్రణ కష్టమవుతుంది. హైబీపీ ఎక్కువైతే కిడ్నీలు, లివర్‌పై ఒత్తిడి పెరిగి తల్లి ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ‘ప్రీ ఎక్లాంప్సియా’ వంటి తీవ్రమైన పరిస్థితులు కూడా తలెత్తవచ్చు. ప్రీ-టర్మ్ డెలివరీ అంటే గడువు తేదీకి ముందే ప్రసవం జరిగే అవకాశాలు కూడా ఈ వయసులో ఎక్కువగా ఉంటాయి. ముందుగానే పుట్టిన శిశువులకు శ్వాస సమస్యలు, బరువు తక్కువగా ఉండటం, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. అందువల్ల గర్భిణి ఆరోగ్యాన్ని నిరంతరం పరిశీలిస్తూ ప్రత్యేక వైద్య పర్యవేక్షణ అవసరం అవుతుంది.

ఇలాంటి పరిస్థితుల్లో గర్భం కావాలని కోరుకునేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెగ్యులర్ చెకప్‌లు చేయించుకోవడం.. రక్తపరీక్షలు, స్కానింగ్‌లు, బీపీ మానిటరింగ్, షుగర్ టెస్టులు తరచుగా చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. గర్భంలోని శిశువు ఎదుగుదల సక్రమంగా ఉందో లేదో నిరంతరం పరిశీలించడం ద్వారా ప్రమాదాలను ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది.

ఆహారపు అలవాట్లు కూడా చాలా కీలకం అని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఒత్తిడి తగ్గించేలా తగినంత నిద్ర, తేలికపాటి వ్యాయామం, యోగా చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ధూమపానం, మద్యం వంటి అలవాట్లు పూర్తిగా దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు.

అయితే 35 లేదా 40 ఏళ్ల తర్వాత గర్భధారణ అంటే తప్పనిసరిగా ప్రమాదమనే కాదు. సరైన వైద్య పర్యవేక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలి, సమయానికి పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనివ్వడం సాధ్యమేనని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆధునిక వైద్య సాంకేతికత అభివృద్ధి చెందడంతో ఆలస్య గర్భధారణ కేసుల్లో కూడా మంచి ఫలితాలు వస్తున్నాయని పేర్కొంటున్నారు.

ఇంటికి ఈ పెయింట్ వేస్తే.. ఫ్యాన్, కూలర్ అవసరం లేదు..

Cooling Paint Technology
Cooling Paint Technology

Cooling Paint Technology: భూమిపై ఉష్ణోగ్రతలు ఏడాదికేడాది పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు కొత్త పరిష్కారాల కోసం ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా నగరాల్లో కాంక్రీట్ భవనాలు అధికంగా ఉండటం వల్ల ‘ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్’ పెరిగి ఇళ్లలో ఉక్కపోత ఎక్కువవుతోంది. ఈ పరిస్థితుల్లో ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన కొత్త తరహా కూలింగ్ పెయింట్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది కేవలం ఇంటిని చల్లగా ఉంచడమే కాకుండా గాలిలోని తేమ నుంచి నీటిని సేకరించే ప్రత్యేక సామర్థ్యాన్ని కలిగి ఉండటం విశేషం. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

ఆస్ట్రేలియాలోని University of Sydney పరిశోధక బృందం ఈ వినూత్న టెక్నాలజీని రూపొందించింది. చియారా నెటో, మింగ్ చియు నేతృత్వంలోని శాస్త్రవేత్తలు డ్యూపాయింట్ ఇన్నోవేషన్స్ కంపెనీతో కలిసి నానో ఇంజినీర్డ్ పాలిమర్ కోటింగ్‌ను అభివృద్ధి చేశారు. ఈ పెయింట్‌లో ఉపయోగించిన PVDF-HFP టెక్నాలజీ కారణంగా ఇది సాధారణ పెయింట్లతో పోలిస్తే చాలా భిన్నంగా పనిచేస్తుంది. పెయింట్ ఉపరితలంలో సూక్ష్మ రంధ్రాలు ఉండటంతో సూర్యకాంతిని లోపలికి తీసుకోకుండా తిరిగి వెలుపలికి పంపిస్తుంది.

ఈ పెయింట్ ప్రధాన ప్రత్యేకత ఏమిటంటే.. ఇది సూర్యకాంతిలోని వేడిని 97 శాతం వరకు పరావర్తనం చేస్తుంది. దాంతో పైకప్పులు, గోడలు సాధారణ ఉపరితలాల కంటే సుమారు 6 డిగ్రీల సెల్సియస్ వరకు చల్లగా ఉంటాయి. సాధారణంగా ఇళ్లపై పడే వేడి భవనం మొత్తం ఉష్ణోగ్రతను పెంచుతుంది. కానీ ఈ కోటింగ్ కారణంగా వేడి నిల్వ కాకుండా వెంటనే బయటకు వెళ్లిపోతుంది. అందువల్ల ఇంట్లో సహజంగానే చల్లదనం పెరుగుతుంది.

ఈ టెక్నాలజీలో మరో ఆసక్తికర అంశం నీటి ఉత్పత్తి. చల్లబడిన ఉపరితలాల దగ్గర గాలిలోని నీటి ఆవిరి ఘనీభవించి చిన్న చిన్న నీటి బిందువులుగా మారుతుంది. ఆ బిందువులను సేకరించడం ద్వారా నీటిని పొందవచ్చు. సిడ్నీ నానోసైన్స్ హబ్ నిర్వహించిన పరీక్షల్లో ఈ పెయింట్ సంవత్సరంలో 32 శాతం రోజులపాటు నీటిని సేకరించగలిగిందని తేలింది. ఒక్క చదరపు మీటర్ ఉపరితలం నుంచి రోజుకు సుమారు 390 మిల్లీలీటర్ల నీరు లభించినట్లు పరిశోధకులు వెల్లడించారు.

ఇది ముఖ్యంగా కరువు ప్రాంతాలకు ఎంతో ఉపయోగపడే అవకాశం ఉంది. ఎండ తీవ్రంగా ఉండే ప్రాంతాల్లో నీటి కొరత ఒక పెద్ద సమస్యగా మారుతోంది. అలాంటి చోట్ల ఇళ్ల పైకప్పుల నుంచే కొంతమేర తాగునీటిని సేకరించగలిగితే అది పెద్ద ఉపశమనం అవుతుంది. గ్రామీణ ప్రాంతాలు, వ్యవసాయ క్షేత్రాలు, రిమోట్ ఏరియాల్లో ఈ టెక్నాలజీ ఉపయోగకరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇంకో ముఖ్యమైన ప్రయోజనం విద్యుత్ ఆదా. ఇంట్లో ఉష్ణోగ్రత తగ్గడంతో ఎయిర్ కండిషనర్లు, కూలర్లు, ఫ్యాన్ల వినియోగం తగ్గుతుంది. దీంతో విద్యుత్ వినియోగం తగ్గి కరెంట్ బిల్లులు కూడా తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భవనాల్లో విద్యుత్ వినియోగంలో పెద్ద భాగం కూలింగ్‌కే ఖర్చవుతోంది. ఈ పెయింట్ ఆ సమస్యకు సహజ పరిష్కారంలా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.

జియో డేటా వాడకం మామూలుగా లేదు.. ఒక్కో యూజర్ 42.3 జీబీ!

Jio
Jio

Jio Data Usage: జియో.. భారత టెలికాం రంగంలో ఓ సంచలనం. తక్కువ ధరకు ఎక్కువ డాటా తో మొబైల్ యూజర్ లను తన వైపు తిప్పుకుంది. రికార్డు స్థాయిలో కస్టమర్లను సంపాదించింది. మరోసారి భారత టెలికామ్ రంగాన్ని తన సంఖ్యా బలంతో ముంచేసింది. 2026 ఆర్థిక సంవత్సరం క్యూ4 ఫలితాల్లో జియో సబ్‌స్క్రైబర్ బేస్ 524.4 మిలియన్లు (52.4 కోట్లు) దాటింది. ఇక సగటు డేటా వినియోగం 42.3 జీబీకి చేరింది. భారతదేశం డేటా-డ్రివెన్ డిజిటల్ ఎకానమీ వైపు ఎంత వేగంగా పయనిస్తోందో స్పష్టంగా చెప్పే సంకేతాలు.

భారీగా సబ్‌స్క్రైబర్లు..
జియో సబ్‌స్క్రైబర్లు 524.4 మిలియన్లు ఉండగా క్యూ4లో కొత్తగా 9.1 మిలియన్ల కస్టమర్లు చేరారు. ఇందులో 5జీ యూజర్లు: 268 మిలియన్లు. మొత్తం సబ్‌స్క్రైబర్లలో సగం కంటే ఎక్కువ 5జీ ట్రాఫిక్ మొత్తం వైర్‌లెస్ డేటా ట్రాఫిక్‌లో 55 శాతం వాటా ఉంది. నెలకు సగటున 42.3 జీబీ అని వెల్లడించారు. క్వార్టర్ మొత్తం డేటా ట్రాఫిక్ 66 ఎక్సాబైట్స్ తో 35 శాతంపెరిగిందని తెలిపారు.

ఒక్కో యూజర్ నుంచి రూ.214..
జియో కస్టమర్ నుంచి సంస్థకు భారీగా ఆదాయం వస్తుంది. ఒక్కో యూజర్ నుంచి సగటు రూ.214 పొందుతున్నట్లు వెల్లడించింది. నాలుగో త్రైమాసికంలో ఆదాయం 3.8 శాతం పెరిగిందని తెలిపింది. ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్ 27.1 మిలియన్ కనెక్షన్లు (2.71 కోట్లు), మార్కెట్ షేర్ సుమారు 43 శాతం అని నివేదిక పేర్కొంది. జియో ఫైబర్ యూజర్లు 13 మిలియన్లు ఉన్నట్లు తెలిసింది.
ఈ సంఖ్యలు భారతీయుల డిజిటల్ జీవనశైలిని ప్రతిబింబిస్తాయి.

హై క్వాలిటీకి ప్రాధాన్యం..
ఒక సాధారణ జియో యూజర్ కూడా హై-క్వాలిటీ వీడియోలు, రీల్స్, లైవ్ స్ట్రీమింగ్, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్, గేమింగ్‌లను సాఫీగా వాడుతున్నారని జియో నివేదిక ద్వారా తెలుస్తుంది.. 5జీ విస్తరణతో ఈ ట్రెండ్‌ను మరింత వేగవంతం చేసింది.

తక్కువ ధరల వ్యూహంతో మార్కెట్‌ను గెలిచి..
మొబైల్ రీఛార్జ్ ధరలు అధికంగా ఉన్న సమయంలో మార్కెట్లోకి వచ్చిన జియో తక్కువ ధరతో ఎక్కువమంది కస్టమర్లను తమ వైపు తిప్పుకుంది. ఇప్పుడు వాల్యూమ్ ద్వారా లాభాలను పెంచుకుంటోంది. సగటు ఆదాయం రూ.214 వద్ద ఉన్నప్పటికీ, భారీ స్కేల్ కారణంగా మార్జిన్స్ 52.4 శాతం వద్ద స్థిరంగా ఉండటం అద్భుతం. ఇది ప్రపంచంలోనే అత్యంత లాభదాయక టెలికామ్ బిజినెస్ మోడల్స్‌లో ఒకటి. అయితే, ఈ డేటా వినియోగం నిజంగా ఆర్థిక వృద్ధికి, నైపుణ్యాల అభివృద్ధికి, ఉపాధి అవకాశాలకు ఎంతగా ఉపయోగపడుతోంది? గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ వృద్ధి కనిపిస్తే, అది నిజమైన డిజిటల్ ఇండియా సాధన. కానీ నగరాలు, పట్టణాల్లో ఎక్కువగా వినియోగం జరుగుతున్నట్లు కనిపిస్తే, డిజిటల్ డివైడ్ ఇంకా కొనసాగుతోందని అర్థం.

ఫిక్స్డ్ బ్రాండ్ పై ఫోకస్..
ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్ వైపు జియో దృష్టి సారించడం స్మార్ట్ మూవ్. ఇది హోమ్ ఇంటర్నెట్ మార్కెట్‌లో ఆధిపత్యం సాధించడానికి మాత్రమే కాకుండా, భవిష్యత్ ఎంటర్‌ప్రైజ్ సర్వీసెస్, ఎల్ ఓ టీ , స్మార్ట్ సిటీలకు బలమైన ఫౌండేషన్ వేస్తుంది.

ప్రస్తుతం టెలికామ్ మార్కెట్‌లో జియో, ఎయిర్ టెల్ మధ్యనే పోటీ ఉంది. జియో 42.3 GB సగటు డేటా వినియోగంతో భారత్‌ను ప్రపంచంలోనే అత్యధిక డేటా వినియోగించే మార్కెట్లలో ఒకటిగా మార్చేసింది. ఇది ముకేష్ అంబానీ సంస్థలోని దీర్ఘకాలిక వ్యూహాత్మక దృష్టికి నిదర్శనం. డిజిటల్ ఇండియా కలను నిజం చేయడంలో జియో కీలక పాత్ర పోషిస్తోంది. కానీ ఈ వృద్ధి సమానంగా, అందరికీ అందుబాటులో ఉండాలి. అప్పుడే ఇది నిజమైన విజయం అవుతుంది. భారత్ డిజిటల్ యుగంలోకి అడుగులు వేస్తోంది, జియో ఆ మార్గాన్ని వేగవంతం చేస్తోంది.

షర్మిలపై కరుణ చూపిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం!

YS Sharmila
YS Sharmila

YS Sharmila: దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికల సందడి కనిపిస్తోంది. పది రాష్ట్రాల నుంచి 24 మంది ఎంపీలు పదవీ విరమణ చేస్తున్నారు. వారి స్థానంలో కొత్త వారి ఎంపికకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ నుంచి నలుగురు సభ్యులు పదవీ విరమణ చేయనుండగా.. ఆ పదవులన్నీ కూటమి ఖాతాలోనే పడనున్నాయి. మరోవైపు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలకు సైతం రాజ్యసభ పదవి ఖాయమని ప్రచారం నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని కాంగ్రెస్ వైపునకు తిప్పేందుకు షర్మిల కు ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. ప్రధానంగా ఆమెను కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎంపిక చేస్తారని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతానికి ఆమెకు సానుకూలమైన వాతావరణం ఉన్నట్లు తెలుస్తోంది.

* కర్ణాటక నుంచి ఛాన్స్..
కర్ణాటక నుంచి ముగ్గురు సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. ఆ మూడు పదవులు కాంగ్రెస్ పార్టీకి దక్కనున్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సైతం పదవీ విరమణ చేయనున్నారు. అయితే కర్ణాటకలో సీఎం మార్పు ఉంటుందన్న ప్రచారం నడుస్తోంది. అదే జరిగితే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవి కోసం ఆశిస్తున్నారు. అయితే సిద్ధరామయ్య వర్గం దానిని అడ్డుకుంటోంది. మద్యేమార్గంగా మల్లికార్జున్ ఖర్గేకు ముఖ్యమంత్రి పదవి అప్పగించి.. రాజ్యసభకు సిద్ధరామయ్యకు పంపిస్తారని తెలుస్తోంది. మరో రెండు రాజ్యసభ పదవుల్లో ఒకటి షర్మిల కు ఖాయం చేసినట్లు పొలిటికల్ వర్గాల్లో నడుస్తోంది. అటు డీకే శివకుమార్ వర్గం సైతం షర్మిలకు మద్దతు తెలుపుతున్నట్లు తెలుస్తోంది.

* అప్పట్లోనే హామీ..
తన తండ్రి పేరుతో తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేశారు షర్మిల. కానీ పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. విలీన సమయంలోనే షర్మిలకు గట్టి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తరుపున రాజ్యసభ పదవి ఇస్తామని హామీ ఇచ్చారని సమాచారం. ఇప్పుడు దాని ప్రకారం కర్ణాటక నుంచి షర్మిలను ప్రమోట్ చేస్తారని తెలుస్తోంది. ఈ విషయంలో రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. షర్మిలకు రాజ్యసభ పదవి ఇవ్వడం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులను మరింతగా ఆకర్షించవచ్చన్నది కాంగ్రెస్ ఆలోచన. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో సైతం ఓట్ల పరంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలంటే.. షర్మిల నాయకత్వాన్ని మరింత పెంచాలని ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

టిడిపి నాలుగు దశాబ్దాల చరిత్ర వెనుక 'మహానాడు'!

TDP Mahanadu
TDP Mahanadu

TDP Mahanadu: ప్రపంచవ్యాప్తంగా తెలుగుదేశం వార్షిక జాతర మహానాడు వేడుకగా కొనసాగుతోంది. గతంలో ఏదో ఒక జిల్లాకు, నగరానికి పరిమితమైన మహానాడు ఈసారి హైబ్రిడ్ విధానంలో కొనసాగుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతతో ముందుకెళ్తోంది టిడిపి. అయితే ప్రాంతీయ పార్టీలకు ఒక పెద్దన్న పాత్ర పోషిస్తోంది తెలుగుదేశం. దాదాపు నాలుగున్నర దశాబ్దాలు పాటు ఒక ప్రాంతీయ పార్టీ కొనసాగడం అంత సులువైన పని కాదు. కానీ ఆ పని చేసి చూపించింది తెలుగుదేశం పార్టీ. దేశంలో ఎన్నెన్నో పార్టీలకు మార్గదర్శిగా నిలిచింది. అయితే ఒక ప్రాంతీయ పార్టీ ఈ స్థాయిలో నిలబడడానికి ప్రధాన కారణం నాయకత్వం ఒకటైతే.. అంతకుమించి క్యాడర్ కూడా. తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణ కలిగిన కేడర్ తో పాటు సుశిక్షితులైన కార్యకర్తలు ఉన్నారు. వారే తెలుగుదేశం పార్టీని ఇన్ని రోజులపాటు కాపాడుకుంటూ వస్తున్నారు.

* పడి లేచిన కెరటం..
తెలుగుదేశం పార్టీ పడి లేచిన కెరటం. పడిపోయిన ప్రతిసారి ఉవ్వెత్తున ఎగసిపడుతూ ముందుకు సాగుతూ ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి విజయాలు కొత్త కాదు. అపజయాలు అంతకంటే కొత్త కాదు. కానీ ఎప్పటికప్పుడు నూతన పోకడలతో ముందుకు వెళుతూ ఉంటుంది తెలుగుదేశం. అయితే దానికి ఆక్సిజన్ నింపేది మాత్రం ముమ్మాటికీ మహానాడు. కేవలం తీర్మానాలు రూపొందించే కేంద్రం మాత్రమే కాదు. పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేసే ఒక బలమైన వేదిక కూడా. ఆ పార్టీ ఓడిపోయిన ఇప్పుడు నిర్వహించే మహానాడు గెలుపునకు బాటలు వేస్తుంది. గెలిచిన సమయంలో మాత్రం ఈ రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన కీలక సూచనలు చేస్తుంది. అధికారంలో ఉన్నా.. లేకపోయినా మహానాడు అనేది మాత్రం తెలుగుదేశం పార్టీకి గొప్ప పరిపూర్ణమైన వేదిక.

* అందరి మధ్య వారధి..
పార్టీ అధినేత నుంచి సామాన్య కార్యకర్త వరకు ఒక వారధిలా కలిపేది మహానాడు. అయితే కాలానుగుణంగా మహానాడు నిర్వహణ మారినా.. ఆ వేదిక ఆశయం మాత్రం ఒక్కటే. పార్టీ ఆశయాలతో పాటు ఆకాంక్షలు చివరి కార్యకర్త వరకు వెళ్లడం.. పార్టీ హై కమాండ్ అభిప్రాయం.. పార్టీకి దిశా నిర్దేశం.. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలా ముందుకు వెళ్లడం.. ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం.. అధికారంలో ఉంటే ప్రజలకు మంచి చేయడం అనే అంశాల చుట్టూ మహానాడు వేదిక ఉంటుంది. నాలుగున్నర దశాబ్దాల టిడిపి చరిత్రలో మహానాడు అనేది ఒక కీలక ఘట్టం. అయితే ఈసారి కొత్త పుంతలు తొక్కుకుంటూ హైబ్రిడ్ విధానంలో అందుబాటులోకి వచ్చింది.

నాదేండ్ల మనోహర్ వద్దని పవన్ పై అంత ఒత్తిడి చేశారా?!

Nadendla Manohar
Nadendla Manohar

Nadendla Manohar: జనసేనలో అధినేత పవన్ కళ్యాణ్ తర్వాత ప్రముఖంగా వినిపించే పేరు నాదేండ్ల మనోహర్. మెగా బ్రదర్ నాగబాబు ఉన్నా.. నాదేండ్ల మనోహర్ మాత్రం ఆ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. అయితే ఆయన జనసేనలో చేరిక నుంచి రకరకాలుగా ప్రచారం నడుస్తూ వచ్చింది ఆయనది కమ్మ సామాజిక వర్గం కావడంతో పక్కన పెట్టుకోవద్దని.. గత చరిత్ర చూసుకోవాలని.. చంద్రబాబుకు ఆయన కొవర్టు అని ఇలా ఏదేదో ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ కాపు నాయకుడి వెంట.. కమ్మ నాయకుడు అయిన నాదెండ్ల మనోహర్ కు ఎందుకంత ప్రాధాన్యత అని చాలామంది అప్పట్లో ప్రశ్నించారు. ఇదే విషయాన్ని తాజాగా చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. నాదెండ్ల మనోహర్ విషయంలో అనేక రకాల కామెంట్లు వచ్చాయని.. తనపై ఒత్తిడి పెరిగిందని.. కచ్చితంగా తాను నాదెండ్ల మనోహర్ ను పక్కన పెట్టుకొని పార్టీ నడుపుతానని తెల్చి చెప్పారు పవన్ కళ్యాణ్. అయితే అప్పట్లో పవన్ కళ్యాణ్ పై నాదేండ్ల మనోహర్ విషయంలో ఒత్తిడి తెచ్చింది ఎవరు అనేది మాత్రం బయట పెట్టలేదు. కానీ అప్పట్లో కాపు నాయకుల నుంచి నాదెండ్ల మనోహర్ విషయంలో ఒత్తిడి వచ్చిన విషయాన్ని మాత్రం ప్రస్తావించారు పవన్.

* సరిగ్గా ఎన్నికల ముంగిట..
2019 ఎన్నికల్లో జనసేన దారుణ పరాజయం చవిచూసింది. అయితే 2018 అక్టోబర్లో జనసేనలో చేరారు నాదెండ్ల మనోహర్. తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగారు మనోహర్. తండ్రి నాదెండ్ల భాస్కరరావు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన.. మనోహర్ 2004, 2009 ఎన్నికల్లో తెనాలి అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు. రాజశేఖర్ రెడ్డి మనోహర్ కు శాసనసభ స్పీకర్ గా అవకాశం ఇచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వచ్చారు మనోహర్. అయితే పవన్ కళ్యాణ్ తో కలిసి నడిచేందుకు నిర్ణయించి ఆయనకు సమాచారమిచ్చారు. అందుకు పవన్ అంగీకరించడంతో 2018 అక్టోబర్ 12న జనసేనలో చేరారు నాదెండ్ల మనోహర్.

* పొలిటికల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్గా..
అయితే జనసేనపై కాపు ముద్ర ఉంది. 2018లో నాదెండ్ల మనోహర్ చేరిన తర్వాత చాలామంది కాపు నేతలు విభేదించారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం నాదెండ్ల మనోహర్ విషయంలో వెనక్కి తగ్గలేదు. ఆయనకు కీలకమైన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ లో స్థానం కల్పించారు. ఆ కమిటీకి చైర్మన్ చేసి తన తరువాత పార్టీలో నెంబర్ 2 పాత్రను కట్టబెట్టారు. అయితే ఇది కాపు నేతలకు ఎంత మాత్రం సహించలేదు. నాదెండ్ల మనోహర్ సామాజిక వర్గం తో పాటు ఆయన తండ్రి నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్ ను గుర్తుచేస్తూ.. పవన్ కళ్యాణ్ నుంచి నాదెండ్ల మనోహర్ దూరం చేసే ప్రయత్నం చేశారు. కానీ వాటికి అవకాశం ఇవ్వలేదు పవన్. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి కూడా కట్టబెట్టారు. అయితే చాలావరకు పవన్ కళ్యాణ్ తో నాదేండ్ల మనోహర్ జర్నీ ఎక్కువ రోజులు ఉండదని ఎక్కువ మంది విశ్లేషించారు. కానీ పవన్ నాయకత్వంలో మనోహర్ పనిచేస్తూనే ఉన్నారు. పవన్ సైతం నాదెండ్ల మనోహర్ ను పక్కన పెట్టుకునే రాజకీయం చేస్తానని ప్రకటించడం విశేషం.

సీజ్‌ఫైర్‌.. డోన్ట్‌కేర్‌.. లెబనాన్‌పై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌!

Israel Lebanon Conflict
Israel Lebanon Conflict

Israel Lebanon Conflict: పశ్చిమాసియాలో నెల రోజులుగా శాంతి నెలకొంది. ఇరాన్‌–అమెరికా మధ్య కుదిరిన సీజ్‌ఫైర్‌తో ఇజ్రాయెల్‌ కూడా లెబనాన్‌పై దాడులు ఆపింది. శాంతి ఒప్పందం కుదురుతుందని ట్రంప్‌ ప్రకటించిన మరుసటి రోజే అమెరికా బలగాలు ఇరాన్‌పై దాడులు చేశాయి. ఇదే అదనుగా ఇజ్రాయెల్‌ కూడా సీజ్‌ఫైర్‌ను ఉల్లంఘించి లెబనాన్‌లోని హెజ్‌బొల్లా లక్ష్యంగా దాడులతో విరుచుకుపడుతోంది. దీంతో పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం మొదలైనట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఏప్రిల్‌ 17న∙అమలులోకి వచ్చిన సీజ్‌ఫైర్‌ ఒకవైపు ఉండగా, ఇజ్రాయెల్‌ మరోసారి లెబనాన్‌పై తీవ్ర వైమానిక దాడులు చేసింది. మే 27న దక్షిణ, తూర్పు లెబనాన్‌ ప్రాంతాల్లో జరిగిన ఈ దాడుల్లో 31 మంది (మహిళలు, పిల్లలు సహా) మృతి చెందగా, 40 మంది గాయపడ్డారు.

గ్రౌండ్‌ ఆపరేషన్‌ విస్తృతం..
ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు గ్రౌండ్‌ ఆపరేషన్స్‌ను మరింత విస్తృతం చేస్తామని ప్రకటించడం ఈ సంక్షోభాన్ని మరింత దిగజార్చే అవకాశం ఉంది. మార్చి 2, 2026 నుంచి ఇజ్రాయెల్‌–హెజ్బొల్లా మధ్య సంఘర్షణ తీవ్రరూపం దాల్చింది. ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు, గ్రౌండ్‌ ఆపరేషన్స్‌తో లెబనాన్‌లో వేలాది మంది ప్రభావితమయ్యారు. ఏప్రిల్‌లో అమెరికా మధ్యవర్తిత్వంతో సీజ్‌ఫైర్‌ అమలైనా, రెండు వైపులా ఉల్లంఘనలు కొనసాగాయి. లెబనాన్‌ హెల్త్‌ మినిస్ట్రీ ప్రకారం, మార్చి నుంచి ఇప్పటివరకు 3,200 మందికి పైగా మృతి చెందగా, సీజ్‌ఫైర్‌ కాలంలోనే 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు వివిధ నివేదికలు చెబుతున్నాయి.

ఇజ్రాయెల్‌ భీకర దాడులు..
ఇజ్రాయెల్‌వైపు నుంచి డ్రోన్‌లు, రాకెట్ల దాడులు కొనసాగుతున్నాయని, దానికి ప్రతిస్పందనగా ఈ దాడులు జరుగుతున్నాయని ఇజ్రాయెల్‌ వాదన. నెతన్యాహు ‘హెజ్బొల్లాను నిర్మూలించాలి‘ అని తీవ్ర స్థాయిలో ప్రకటించడం ఈ యుద్ధం దీర్ఘకాలికంగా కొనసాగే సంకేతాలను ఇస్తోంది.

మానవీయ సంక్షోభం..
వేలాది మరణాలు, లక్షలాది వ్యక్తులు వలసలెబనాన్‌లో ఒక్క మార్చి నుంచి ఇప్పటి వరకు 3 వేలకుపైగా మృతులు, వేలాది గాయపడ్డారు. ఇది లెబనాన్‌ జనాభాలో దాదాపు ఐదో వంతు. ఆసుపత్రులు, అంబులెన్స్‌లు, హెల్త్‌ వర్కర్లపై కూడా దాడులు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఇజ్రాయెల్‌ మాత్రం హెజ్బొల్లా లక్ష్యాలను మాత్రమే టార్గెట్‌ చేస్తున్నామని, సివిలియన్‌ మరణాలు హెజ్బొల్లా నివాసాలు, ఆయుధాలు ఉంచడం వల్ల జరుగుతున్నాయని చెబుతోంది. ఈ సంఘర్షణలో రెండు వైపులా సివిలియన్‌ మరణాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. యుద్ధ నియమాలు, అంతర్జాతీయ మానవ హక్కులు ఉల్లంఘనలు జరుగుతున్నాయని యునైటెడ్‌ నేషన్స్, ఇతర సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

సీజ్‌ఫైర్‌ ఎందుకు విఫలమవుతోంది?
సీజ్‌ఫైర్‌ అమలులో ఉన్నప్పటికీ దాడులు కొనసాగడం రెండు వైపులా నమ్మకం లోపించడాన్ని సూచిస్తోంది. ఇజ్రాయెల్‌ తన భద్రతను ప్రధానం చేసుకుని హెజ్బొల్లా బలాలను పూర్తిగా నిర్మూలించాలని చూస్తోంది. మరోవైపు హెజ్బొల్లా (ఇరాన్‌ మద్దతు) తన ప్రభావాన్ని కాపాడుకోవడానికి దాడులు చేస్తోంది. ఇరాన్‌–ఇజ్రాయెల్‌ ఉద్రిక్తతలు కూడా ఈ ప్రాంతీయ సంఘర్షణను మరింత ఇరికించాయి.

శాంతి కోసమే అంటున్న ఇజ్రాయెల్‌..
ఇజ్రాయెల్‌ తన సరిహద్దు భద్రత కోసం చర్యలు తీసుకోవడం అనివార్యమని వాదన. హెజ్బొల్లా ఆయుధాలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నాశనం చేయడం ద్వారా దీర్ఘకాలిక శాంతి సాధ్యమవుతుందని ఇజ్రాయెల్‌ నమ్మకం. అయితే సీజ్‌ఫైర్‌ ఉల్లంఘనలు, అధిక సివిలియన్‌ మరణాలు మానవతా విలువలకు విరుద్ధం. లెబనాన్‌ సార్వభౌమత్వం, ప్రజల జీవనం దెబ్బతినడం దురదృష్టకరం. ఈ చర్యలు ప్రాంతీయ యుద్ధాన్ని మరింత విస్తృతం చేసే ప్రమాదం ఉంది.

తాజా దాడులు సీజ్‌ఫైర్‌ను పూర్తిగా విఫలం చేసే అవకాశాలను పెంచాయి. అంతర్జాతీయ సమాజం, ముఖ్యంగా అమెరికా, యునైటెడ్‌ నేషన్స్‌ తక్షణం మధ్యవర్తిత్వం వహించి రెండు వైపులా ఉద్రిక్తతలను తగ్గించాలి. హెజ్బొల్లా ఆయుధాల నియంత్రణ, ఇజ్రాయెల్‌ సరిహద్దు భద్రత, లెబనాన్‌ సార్వభౌమత్వం – ఈ మూడింటినీ సమతుల్యం చేసే దీర్ఘకాలిక పరిష్కారం మాత్రమే ఈ ప్రాంతానికి శాంతిని తీసుకొస్తుంది.

డ్రాగన్ మూవీ లో ఆ ఎలివేషన్ కి విజిల్స్ పడతాయా..?

NTR Dragon Movie
NTR Dragon Movie

NTR Dragon Movie: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా భారీ ఎత్తున రూపొందించబడుతుంది. ఇక రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే ను పురస్కరించుకొని ఈ సినిమా నుంచి ఒక గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఆ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా అలరించడమే కాకుండా ఎన్టీఆర్ లుక్ ని సైతం చాలా గ్రాండ్ గా ఎస్టాబ్లిష్ చేశారు. మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో చాలా వైల్డ్ గా కనిపించబోతుండనే విషయం మనకు చాలా క్లారిటిగా తెలుస్తుంది. ఈ సినిమాలో ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ ఉందట. అది మొత్తం గూస్ బంప్స్ ఎపిసోడ్స్ తో ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది.

ఎలివేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయట. ఇంతకుముందు ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో చేసిన సినిమాలో కాటేరమ్మ ఎపిసోడ్ ఎంతటి పాపులారిటిని సంపాదించుకుందో డ్రాగన్ సినిమాలో ఒక సీక్వెన్స్ కి కూడా ఆ రేంజ్ లోనే పేరు ప్రఖ్యాతాలను పొందుతుందట. జూనియర్ ఎన్టీఆర్ కి ఆ రేంజ్ ఎలివేషన్స్ పడి చాలా రోజులు అవుతుంది. సింహాద్రి సినిమా తర్వాత ఆయనకు ఎలివేషన్స్ తో కూడిన సినిమాలైతే ఏవి పడలేదు. దాంతో జూనియర్ ఎన్టీఆర్ మాస్ లో కొంతవరకు పట్టు కోల్పోయాడనే చెప్పాలి.

మరొకసారి తన స్టామినాను చూపిస్తూ ఇండస్ట్రీని షేక్ చేసే విధంగా సినిమాలు చేయగలిగితేనే అతను టాప్ లెవల్లో ముందుకు దూసుకెళ్తాడు. ఇక ఆ ఉద్దేశ్యంతోనే దీనిని ఎలివేషన్స్ తో నింపేయమని ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కి చెప్పారట… ఇక ఇప్పుడు ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది.

తద్వారా ప్రేక్షకుడిని మెప్పిస్తుందా? లేదా ఎన్టీఆర్ కి ఒక సపరేటు ఫ్యాన్ బేస్ ను తెచ్చిపెడుతుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక ప్రశాంత్ నీల్ సినిమా అంటే ప్రతి ఒక్కరికి పండగనే చెప్పాలి. ఎందుకంటే అందులో గూస్ బంప్స్ ఎపిసోడ్ చాలానే ఉంటాయి. ఆయన ఒక్కో సీను ను చాలా అద్భుతంగా తెరకెక్కిస్తు ఎలివేషన్ కి మాత్రం పెద్ద పీట వేస్తుంటాడు…

వారణాసి సినిమా ఆ రెండు రికార్డులను బ్రేక్ చేస్తుందా..?

Varanasi Movie
Varanasi Movie

Varanasi Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి… బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన ఆయన ఆ తర్వాత చేసిన ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో డైరెక్టర్ గా మారిపోయాడు. ప్రస్తుతం పాన్ వరల్డ్ లో ఎంట్రీ ఇస్తుండటం విశేషం… ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న ‘వారణాసి’ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తుందనేది తెలియాల్సి ఉంది. ముఖ్యంగా ఇండియాలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ హాలీవుడ్ సినిమాను బ్రేక్ చేసే విధంగా ఈ సినిమా ముందుకు దూసుకెళ్తుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. దాదాపు ఈ సినిమా 3000 నుంచి 4000 కోట్ల మధ్యలో కలెక్షన్స్ రాబడుతుందనే అంచనాలో మేకర్స్ ఉన్నారు.

ఈ సినిమా ఆ రేంజ్ లో కలెక్షన్స్ ని రాబడుతుందా అంటే కొంతమంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ రాజమౌళి మాత్రం ఈ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా 1500 కోట్ల బడ్జెట్ తో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. కాబట్టి ఈ మూవీ పెట్టిన బడ్జెట్ కి డబుల్ కలెక్షన్స్ ను రాబట్టాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

ఇక ప్రపంచ స్థాయి ప్రేక్షకులను మెప్పించాలనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమాని చాలా హంగులు ఆర్భాటాలతో చిత్రీకరిస్తున్నారు… తెలుగులో దంగల్ సినిమా ఇప్పటివరకు 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టింది. కాబట్టి ఆ సినిమా రికార్డును బ్రేక్ చేస్తూనే హాలీవుడ్ లో ఉన్న మరికొన్ని చిన్న చిన్న సినిమాల రికార్డులను కూడా బ్రేక్ చేసే విధంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారట.

ఎట్టకేలకు రాజమౌళి ఈ సినిమా విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. తను అనుకున్న సక్సెస్ ని రాబడతాడా? లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది… ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సక్సెస్ లు సాధించిన కూడా రాజమౌళి చేసిన సినిమాల ముందు అన్ని దిగదుడుపనే చెప్పాలి. అలాంటి రాజమౌళి ఈ మధ్య కాలంలో చేస్తున్న సినిమాల విషయంలో ఇంకాస్త కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు…

బాలయ్య ఆ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నాడా..?

Balakrishna
Balakrishna

Balakrishna Strict On Budget: నందమూరి నటసింహం బాలయ్య బాబు నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు మాస్ కమర్షియల్ సినిమాలను ఆదరించే ప్రేక్షకులకు ఫుల్ పండుగనే చెప్పాలి. ఎందుకంటే ఆయన మాస్ విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకోవడమే కాకుండా బీ,సీ సెంటర్లో ఆయనకు భారీ క్రేజ్ అయితే ఉంది. మరి అలాంటి హీరో నుంచి సినిమా రావడం అనేది ప్రేక్షకులు కూడా ఆనందపడే విషయమనే చెప్పాలి. ఇక ఇలాంటి సందర్భంలోనే బాలయ్య బాబు ఇప్పుడు కొన్ని విషయాల్లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నాడట. ముఖ్యంగా ఒక విషయంలో మాత్రం ఆయన చాలా కఠినంగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది. అది ఏంటి అంటే సినిమా బడ్జెట్ అసలు పెరగకూడదనే ఉద్దేశ్యంతో ఆలోచిస్తున్నారట. దర్శకులు ముందుగానే సినిమా బడ్జెట్ విషయంలో ఒక క్లారిటిని మెయింటైన్ చేస్తూ బడ్జెట్ షీట్ ని కూడా రెడీ చేసిన తర్వాతే తను సినిమాను రంగంలోకి దింపుతున్నట్టుగా తెలుస్తుంది.

ఎందుకంటే తన వల్ల ఏ ప్రొడ్యూసర్ కూడా నష్టపోకూడదనే ఆలోచనలో బాలయ్య ఉన్నాడు. సినిమా యావరేజ్ అయిన లేదంటే ప్లాప్ అయిన కూడా ప్రొడ్యూసర్ కు మినిమం గ్యారంటి వసూళ్లు వచ్చే విధంగా సినిమాను తీర్చిదిద్దాలని దర్శకులకు ముందుగానే చెబుతున్నాడట.

ఇక బడ్జెట్ కూడా ఓవర్ గా ఉండకూడదని తన మార్కెట్ పరిధిలోనే బడ్జెట్ ఉండాలని అన్నారట. దీనివల్ల ప్రొడ్యూసర్లు కూడా బాలయ్య బాబుతో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. మొత్తానికైతే బాలయ్య సినిమా ఫ్లాప్ అయినా కూడా నష్టాలు పెద్దగా రాకుండా ఉండే విధంగానే ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

తను ఏది ఏమైనా కూడా బాలయ్య భారీ విజయాన్ని సాధించాల్సిన అవసరమైతే ఉంది. ఈ మధ్యకాలంలో ఆయన చేసిన ‘అఖండ 2’ సినిమాతో ఆయన ప్లాప్ ను మూటగట్టుకున్నాడు. ఇక ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తూ బడ్జెట్ ను తగ్గిస్తూ కంటెంట్ల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా బెస్ట్ కథలను రియలెక్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు…

అల్లు అర్జున్ చేసిన ఆ ఒక్క పని ఆయన్ని ఈ రోజు పాన్ ఇండియా స్టార్ ను చేసిందా..?

Allu Arjun
Allu Arjun

Pan India Star Allu Arjun: గంగోత్రి సినిమాతో హీరోగా తన కెరియర్ ను స్టార్ట్ చేసిన అల్లు అర్జున్ మొదటి సినిమా తోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా అతనికి ఏమాత్రం హెల్ప్ అవ్వలేదు. కానీ ఆ తర్వాత చేసిన ఆర్య సినిమాతో ప్రేక్షక లోకాన్ని విశేషంగా అలరించిన ఆయన యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత చేసిన వరుస సినిమాలు సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేశాడు… పుష్ప సినిమాని పాన్ ఇండియాలో రిలీజ్ చేయాలనే ఆలోచన వచ్చింది. దాని వల్లే ఆయన ఇప్పుడు పాన్ ఇండియాలో స్టార్ హీరోగా మారాడు. నిజానికి ఈ విషయంలో రామ్ చరణ్ చాలా వరకు వెనకబడిపోయాడనే చెప్పాలి. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేసిన ‘రంగస్థలం’ సినిమాను పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తే సినిమా సూపర్ సక్సెస్ సాధించేది.

దాన్ని రిలీజ్ చేయలేదు అలాగే ‘మగధీర’ సినిమాని కూడా పాన్ ఇండియా రిలీజ్ చేయలేదు. దాంతో రామ్ చరణ్ చాలావరకు వెనుకబడిపోయాడు. ఇక అల్లు అర్జున్ మాత్రం చాలా తెలివిగా ఈ సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేయించుకున్నాడు. తద్వారా ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది.

ఇక ఇప్పటివరకు అల్లు అర్జున్ చేసినవి రెండు పాన్ ఇండియా సినిమాలైనా కూడా అతని క్రేజ్ తారా స్థాయికి వెళ్ళిపోయింది. ఇక మిగతా హీరోలకంటే ఆయన చాలా చాకచక్యంగా వ్యవహరించి సక్సెస్ ని సాధించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి…

ఇది ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ అతనికి మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. అయితే ఇప్పుడు అట్లీ తో చేస్తున్న రాకా సినిమాను పాన్ వరల్డ్ లో రిలీజ్ చేయడానికి సన్నహాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది… ఇక ఈ మూవీ సూపర్ హిట్ అయితే ఆయన నెంబర్ వన్ హీరోగా మారే అవకాశం కూడా ఉంది…

పులివెందుల రాజకీయాలు ఇలా ఉంటాయా?!

Pulivendula Politics
Pulivendula Politics

Pulivendula Politics: రాష్ట్రస్థాయిలో కొన్ని నియోజకవర్గాలు ప్రత్యేకం. వైయస్ కుటుంబానికి పులివెందుల.. చంద్రబాబుకు కుప్పం.. ఇలా రాష్ట్రస్థాయిలో చాలా నియోజకవర్గాలు కొంతమంది నేతలకు ప్రత్యేకం. అయితే అవి కంచుకోటలుగా కార్యక్రమం లో తెరవెనుక చాలా రకాల కథనాలు ఉంటాయి. అటువంటి వాటిని రహస్యంగా ఉంచుకోవాల్సిన అవసరం నేతల పై ఉంది. అయితే పులివెందులలో వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ హవా వెనుక ఉన్న కథలు ఇప్పుడు బయటపడుతున్నాయి. వారి రాజకీయం కోసం వారి చేసే వికృత క్రీడలు అన్నీ ఇన్నీ కావని తెలుస్తోంది. పైకి మాత్రం పులులు, సింహాలు అంటూ ఎలివేషన్లు ఇచ్చుకుంటారు. కానీ తెర వెనుక చాలా రకాల రాజకీయ కథనాలు ఉంటాయి. తాజాగా పులివెందుల విషయంలో అవినాష్ రెడ్డి వర్సెస్ బీటెక్ రెడ్డి అన్నట్టు పరిస్థితి మారింది. మధ్యలో ఎమ్మెల్సీ భూమి రెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆసక్తికర విషయాలు బయట పెట్టేసరికి.. పులివెందుల కథలు ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి.

* జగన్ ప్రెస్ మీట్ తో కలకలం..
జగన్ తన ప్రెస్ మీట్ లో తన తాతను చంపిన వారిని కూడా విడిచిపెట్టిన గొప్ప మనసును బయటపెట్టారు. అప్పటి నుంచి రచ్చ రచ్చ జరుగుతూనే ఉంది. దీనిపై టిడిపి నేత బీటెక్ రవి ఘాటుగా స్పందించేసరికి ఎంపీ అవినాష్ రెడ్డి ఆయనను హెచ్చరించారు. వైయస్ కుటుంబం పై అవాకులు చవాకులు పేలితే సహించేది లేదని హెచ్చరించారు. ఇదే బిటెక్ రవి అమ్ముడు పోయే వ్యక్తిగా అభివర్ణించారు అవినాష్ రెడ్డి. ఢిల్లీలో విజయసాయిరెడ్డి ఇంటికి వచ్చి.. వైసీపీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపారని.. అందుకు గాను 12 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని.. జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలేదని.. అలాంటి నేత ఇప్పుడు కొనుగోలు చేసే శక్తికి చేరారు అంటూ బీటెక్ రవిపై నోరు పారేసుకున్నారు అవినాష్ రెడ్డి. అప్పటినుంచి రచ్చ రచ్చ అవుతోంది కడప జిల్లా రాజకీయాల్లో.

* బయట పెట్టేసిన బీటెక్ రవి..
అయితే వెంటనే స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు బీటెక్ రవి. తాను పార్టీ మారి డబ్బులు డిమాండ్ చేస్తే వైసిపి హయాంలో ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో కేసు వాపస్ చేసుకునేందుకు తనతో పాటు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి బ్లాంక్ చెక్కులు ఇచ్చేందుకు సిద్ధపడలేదా అంటూ అవినాష్ రెడ్డిని ప్రశ్నించారు బీటెక్ రవి. అదే వివేకానంద రెడ్డి పై తాను స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేయిస్తే.. ఎంపీటీసీలను తన శిబిరానికి పంపించలేదా అని గుర్తు చేశారు. అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడితే.. 15 కోట్ల రూపాయల నగదు తో పాటు పదవి ఇస్తామని ఆఫర్ చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. ఓ తోట సాక్షిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి ఏకగ్రీవాలకు సహకరిస్తామని అవినాష్ రెడ్డి చెప్పలేదా అంటూ నిలదీసినంత పని చేశారు. మరోవైపు భూమి రెడ్డి రాంగోపాల్ రెడ్డి అయితే ఏకంగా రాజశేఖర్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నారు. పులివెందుల నియోజకవర్గంలో ఓ జంట హత్యల కేసు అంశంతో ఒక సిట్టింగ్ జడ్జి తన ఉద్యోగాన్ని కోల్పోయిన విషయాన్ని ప్రస్తావించారు. పులివెందుల అంటే చరిత్ర కలిగిన నియోజకవర్గం. వైయస్ కుటుంబాన్ని పులులు, సింహాలతో పోలుస్తుంటారు. కానీ ఆ నియోజకవర్గంలో వైయస్ కుటుంబం నడిపిన కథలు ఇప్పుడు బయటకు వస్తుండడంతో.. ఇప్పటివరకు గౌరవభావంతో చూసినవారు సైతం నిజమా అని ఆశ్చర్యపోతున్నారు. జగన్మోహన్ రెడ్డికి తెలిసి కొన్ని.. తెలియనివి కొన్ని బయటపడుతుండడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. వైసీపీ అగ్రనాయకత్వంలో సైతం ఒక రకమైన సంచలనం అవుతోంది.

జగన్ ప్రెస్ మీట్.. హడలెత్తిపోతున్న వైసీపీ సోషల్ మీడియా!

Jagan Press Meet
Jagan Press Meet

Jagan Press Meet: జగన్ ప్రెస్ మీట్ అంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తెగ బెదిరిపోతోంది. ఆయన మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడుతారో.. దానిని ఎలా కవర్ చేయాలో తెలియడం లేదు. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి.. ప్రతివారం ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. గంటల తరబడి మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. గ్రాఫ్ లతోపాటు గణాంకాలు తెలియజెప్పే క్రమంలో ప్రజలకు అర్థం కావడం లేదు. పైగా ఆయన నోటి నుంచి వచ్చే మాటలు ప్రజల్లోకి వ్యతిరేకంగా దూసుకెళ్తున్నాయి. సోషల్ మీడియాకు వినోద వనరుగా మారిపోతున్నాయి.

* మావిగన్ తో ముప్పు తిప్పలు..
ఆయన ఆ మధ్యన మావిగన్ ప్రతిపాదన తీసుకొచ్చారు వారాంతపు ప్రెస్మీట్లో. మూడు నగరాలను కలిపి మావిగన్ అని పేరు పెడితే సరిపోతుంది కదా అంటూ సెలవిచ్చారు. దీంతో అందరూ తలలు పట్టుకున్నారు. ఎలా సమర్థించాలో తెలియక వైసీపీ నేతలు కిందా మీదా పడ్డారు. చివరకు ఎలాగోలా సర్దుబాటు చేసి దానిని మరిచిపోయేలా చేస్తే.. మాదిగని పేరు చెబితేనే చంద్రబాబు గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని.. ఆయనకు గుండె నొప్పి వచ్చినంత పని అవుతోందని సెలవిచ్చారు మరోసారి. అంతటితో ఆగకుండా తన ఫ్యాక్షన్ రాజకీయ కుటుంబ నేపథ్యాన్ని బయటపెట్టేశారు. ఇప్పటి తరానికి తెలియని కుటుంబ కథా చిత్రాన్ని విప్పి మరీ చూపించేశారు. కుటుంబం పై చర్చ జరిగేలా చేశారు జగన్మోహన్ రెడ్డి.

* కుటుంబ విషయాలు సైతం..
నిన్నటి వరకు వైయస్ రాజశేఖర్ రెడ్డి ఒక మహానేత. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు. అటువంటి వ్యక్తి వెనుక ఇప్పుడు అనేక వివాదాలు, యాక్షన్ రాజకీయాలు ఉన్నాయని బయట పెట్టుకునేలా చేశారు జగన్మోహన్ రెడ్డి. వైయస్ రాజారెడ్డి చేసిన మంచి పనుల కంటే చెడ్డ పనులు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. వైవాహిక జీవితాలు బయటపడుతున్నాయి. ఇది ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి వైఫల్యం అని ఆ పార్టీ సోషల్ మీడియా చెబుతోంది. కూటమి ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ఎత్తిచూపే క్రమంలో జగన్ ఉండాలి కానీ.. పార్టీని ఆత్మ రక్షణలో పడేసే విధంగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఏం మాట్లాడాలో తెలియక.. వివాదాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు అయితే ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చు కానీ.. ఈ వ్యాఖ్యలను ఎలా సరి చేసుకోవాలో తెలియక సతమతం అవుతోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా..

అస్సాం.. భాషా రక్తపాతం నుంచి బహుభాషా సామరస్యం వైపు అడుగులు

Assam Assembly 2026
Assam Assembly 2026

Assam Assembly 2026: ఈశాన్య రాష్ట్రం అస్సాం ఎప్పుడూ భాషా సమస్యలకు పర్యాయపదంగా నిలిచింది. బెంగాలీ–అస్సామియా ఘర్షణలు, జనాభా లెక్కల సమయంలో జరిగిన అల్లర్లు, బోడోలాండ్‌ ఉద్యమం – ఈ అన్నీ భాషా గుర్తింపు కోసం జరిగిన దీర్ఘకాలిక పోరాటాలు. ఒక్క భాషను ఆధిపత్యం వహింపజేయాలనే ప్రయత్నాలు రాష్ట్రాన్ని రక్తసిక్తం చేశాయి. కానీ 2026 మే 24న జరిగిన ఒక ఘటన ఆ చరిత్రను పూర్తిగా మార్చేసింది. అస్సాం అసెంబ్లీలో 9 భాషల్లో పదవీ ప్రమాణ స్వీకారం జరగడం దేశంలోనే అపూర్వమైన సంఘటన. ఇది కేవలం ఒక ఆడంబరం కాదు.. భాషా వైవిధ్యాన్ని సమస్యగా కాకుండా బలంగా మార్చే రాజకీయ పరిపక్వత.

తొమ్మిది భాషల్లో ప్రమాణం..
16వ అస్సాం అసెంబ్లీలోని 124 మంది ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. వారు తొమ్మిది భాషల్లో ప్రమాణం చేయడం అస్సాం అసెంబ్లీ చరిత్రలో మొదటిసారి 124 మందిలో 75 మంది అస్సామియా భాషలో ప్రమాణం చేశారు. ఇక 17 మంది సంస్కృతంలో ప్రమాణం చేసి చరిత్ర సృష్టించారు. బోడో, అహోం, టీ కమ్యూనిటీ, ప్లెయిన్స్‌ సముదాయాల నుంచి వచ్చిన నాయకులు ఈ ప్రాచీన భాషను ఎంచుకున్నారు. ఇక తొమ్మిది మంది బెంగాలీలో ఎనిమిది మంది బోడో భాషలో ప్రాణం చేశారు. రభా, కర్బి, రాజ్‌బంశీ, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో మిగతావారు ప్రమాణస్వీకారం చేశారు.

ప్రభుత్వ అనుమతితోనే..
ప్రో–టెం స్పీకర్‌ చంద్రమోహన్‌ పటోవరి ప్రమాణం చేయించగా, సీఎం హిమంత బిశ్వా సర్మా అస్సామియాలో ప్రమాణం చేశారు. రాజ్యాంగం 8వ షెడ్యూల్‌లో లేని భాషలైన రాభా, కర్బి, రాజ్‌బంశీలను కూడా అనుమతించడం ఈ ఘటనను మరింత ప్రత్యేకం చేసింది.

ఈ మార్పు ఎందుకు?
గతంలో భాషా ఉద్యమాలు విభజనను పెంపొందించాయి. బెంగాలీలపై అస్సామియా జాతీయవాదం, బోడోల గిరిజన హక్కుల పోరాటం – ఇవన్నీ రాష్ట్ర స్థిరత్వానికి భంగం కలిగించాయి. కానీ ఈసారి ప్రభుత్వం (ముఖ్యంగా హిమంత సర్మా నాయకత్వం) భిన్న భాషా సముదాయాలను గౌరవించడం ద్వారా సమావేశక రాజకీయాలకు ఉదాహరణ చూపించింది. సంస్కృతం వైపు మలుపు మరింత లోతైన సందేశం ఇస్తుంది. ఇది భారతీయ సాంస్కృతిక మూలాలను గౌరవించడమే కాకుండా, వివిధ తెగల మధ్య వంతెనగా మారింది. బోడో ఎమ్మెల్యే సంస్కృతంలో ప్రమాణం చేయడం భాషా గుర్తింపు యుద్ధం నుంచి సాంస్కృతిక ఐక్యత వైపు మారిన మనస్తత్వాన్ని చూపిస్తుంది.

అస్సాంలో 40కిపైగా భాషలు..
రాష్ట్రంలో 47 వరకు భాషలు మాట్లాడతారు. తెలుగు రాష్ట్రాల్లో ఏక భాషా ఆధిపత్యం ఉన్నప్పటికీ, అస్సాం వైవిధ్యాన్ని ఆలింగనం చేసుకోవడం ద్వారా బలాన్ని పొందుతోంది. ఇది ‘‘భిన్నత్వంలో ఏకత్వం’’ అనే భారతీయ తత్వానికి జీవంతో కూడిన ఉదాహరణ.సవాళ్లు మరియు ఆశలుఈ ఘటన సాంస్కృతిక సంరక్షణకు బలమైన సంకేతం. చిన్న భాషలు (రాభా, కర్బి వంటివి) గుర్తింపు పొందడం వల్ల గిరిజన సముదాయాల్లో విశ్వాసం పెరుగుతుంది. అయితే, ఇది కేవలం ప్రమాణ స్వీకారంతో ఆగకూడదు. విద్య, పరిపాలన, ఆర్థిక అభివృద్ధిలో కూడా ఈ వైవిధ్యాన్ని ప్రోత్సహించాలి. అస్సాం ఇకపై భాషా సంఘర్షణల రాష్ట్రంగా కాకుండా, భాషా సామరస్యంకు దేశానికి ఆదర్శంగా నిలవాలి. హిమంత బిశ్వా సర్మా ప్రభుత్వం ఈ దిశగా తీసుకున్న మొదటి అడుగు చాలా ముఖ్యమైనది.

భాషలు మనల్ని విభజించే ఆయుధాలు కాకుండా, ఐక్యం చేసే వంతెనలుగా మారాలి. అస్సాం అసెంబ్లీలో జరిగిన ఈ చారిత్రక ఘటన ఆ దిశలో ఒక మహత్తర మలుపు. ఇది రాష్ట్రానికి మాత్రమే కాదు, మొత్తం దేశానికి ఒక పెద్ద సందేశం – వైవిధ్యాన్ని గౌరవిస్తేనే నిజమైన ఐక్యత సాధ్యమవుతుంది. అస్సాం ఈ మార్గంలో ముందుకు సాగాలని ఆశిద్దాం.