Today 31 May 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో ఈరోజు కొన్ని రాశుల వారికి అన్నీ శుభయోగాలే ఉండరున్నాయి. మరికొన్ని రాశుల వ్యాపారులు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): మేష రాశి వారికి ఈ రోజు గొప్ప ఘనంగా మారనుంది. వ్యాపారులు కొత్తగా ప్రాజెక్టులు చేపడితే అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో పదోన్నతులు వచ్చే అవకాశాలు ఉంటాయి. స్నేహితుల సహాయంతో కోల్పోయిన డబ్బు తిరిగి పొందుతారు. ఆరోగ్య విషయంలో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆదాయం పెరుగుతుంది.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు గతంలో మొదలు పెట్టిన పనులన్నీ పూర్తి చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే రాణిస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. వ్యాపారులు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులకు తోటి వారి సహాయం ఉంటుంది.
మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా గడుస్తుంది. అనుకోకుండా ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. మానసికంగా ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. అయితే ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి తోటి ఉద్యోగుల సహకారం ఉంటుంది. కుటుంబ సభ్యుల అండదండలతో వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. గతంలో ఆగిపోయిన పనులను ఈరోజు పూర్తి చేస్తారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక ప్రణాళికలతో ముందుకు వెళ్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. పూర్వికులు ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి కావడంతో ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులు శుభవార్తలు విని అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. మానసికంగా సంతోషంగా గడుపుతారు. గతంలో కంటే ఇప్పుడు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు మెరుగైన లాభాలు ఉంటాయి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : తులా రాశి వారికి ఈ రోజు అధిక ధన లాభం ఉండే అవకాశం ఉంది. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. గతంలో కంటే ఇప్పుడు మెరుగైన లాభాలు ఉంటాయి. కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. ఆకస్మికంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గౌరవం లభిస్తుంది. అనుకోకుండా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశం తక్కువగా ఉంటాయి. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వీరితో ఆర్థిక ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు మెరుగైన లాభాలు ఉండే అవకాశం ఉంది. ఉద్యోగులకు తోటి వారి సహకారం ఉండడంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. కొన్ని పనులు పూర్తి కావడంతో అలసట నుంచి బయటపడతారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు ఉండకూడదు. తోబుట్టువుల సహకారంతో ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు ఆహ్లాదకరమైనగా వాతావరణం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామి కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల అండదండలు ఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయంలో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే ఇదే మంచి సమయం.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు కొత్త ఆదాయం లభిస్తుంది. ఉద్యోగులకు కార్యాలయాలు అనుకూలమైన వాతావరణము ఉంటుంది. వ్యాపారులకు కుటుంబ సభ్యుల అండదండలు ఉండడంతో కొత్తగా పెట్టుబడులు పెడతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. విదేశాల్లో ఉండే బంధువుల నుంచి శుభవార్తలు వింటారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి నిరుద్యోగులకు ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ప్రముఖ కంపెనీ నుంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు కొత్తగా లాభాలు ఉంటాయి. వీరికి కుటుంబ సభ్యుల అండదండలు ఉండడంతో అధిక లాభాలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
జెన్ జడ్ చూస్తోంది కరెక్టే.. కానీ ఎంత మేరకు నిలబడుతుంది ఆర్కే సార్..
Gen Z Politics RK Editorial: సమకాలీన రాజకీయాల మీద.. వర్తమాన అంశాల మీద ఆర్కే సార్ అలియాస్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ చేసే విశ్లేషణ ఒక యాంగిల్ లో బాగుంటుంది. మరొక యాంగిల్ లో విమర్శలకు కారణమవుతూ ఉంటుంది. ఆయన కూడా విమర్శిస్తుంటారు కాబట్టి.. ఆయన చేసే పనిని మనం కూడా విమర్శించవచ్చు. నిలదీసే స్వభావం లేకపోతే మనిషి చచ్చిపోయినట్టే రాధాకృష్ణ అంటారు. ఆయన అంటునట్టుగానే మనం కూడా ప్రశ్నిద్దాం.
జెన్ జెడ్ చూస్తోందని.. దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు మారాలని.. కచ్చితంగా విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని సూచించారు. రాధాకృష్ణ యాంగిల్ లో ఇది కరెక్ట్. బంగ్లాదేశ్లో.. నేపాల్ ప్రాంతంలో ఉద్యమాలు వచ్చిన విషయం కూడా కరెక్టే. కానీ బంగ్లాదేశ్లో ప్రభుత్వం ఏ స్థాయిలో ప్రజల కోసం పనిచేస్తుంది.. నేపాల్ లో అక్కడి ప్రధాని ఏ స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు.. పార్లమెంట్ సమావేశం జరుగుతుంటే మధ్యలో నుంచి వెళ్లిపోయారు.. ఇటువంటి జన్ జెడ్ నాయకత్వం ఏ మేరకు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుతోంది..
యువతలో ఆవేశం ఉంటుంది కరెక్టే.. కానీ ఆవేశం ఆలోచనను తొక్కిపడేస్తుంది కదా.. తాత్కాలిక ఆగ్రహాలు వేరు.. శాశ్వత ఆలోచనలు వేరు. నరేంద్ర మోడీ యువతతో కనెక్ట్ అవుతున్నారు. అలాగని యువత మాత్రమే నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకోవడం లేదు. ఈ దేశ భవిష్యత్తు యువత మీద ఆధారపడి ఉంది కాబట్టి.. యువత ఆకాంక్షలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం యువతరం ఆవేశంలోనే రాజకీయ పార్టీలు పాలిటిక్స్ చేస్తే.. మిగతా వర్గాల ప్రజలు ఏమైపోవాలి.. వారు ఎక్కడికి వెళ్లాలి..
ఏ ప్రభుత్వానికి అయినా సరే ప్రజలను పూర్తిగా సంతృప్తి పరిచే అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రజల్లో భిన్న వర్గాలు ఉంటారు . వారి ఆకాంక్షలు వేరే విధంగా ఉంది. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు మాత్రమే చేస్తాయి. ఎందుకంటే అధికారంలో ఉన్న నాయకుల దగ్గర మంత్రదండాలు ఉండవు. ఇక ఈ తరం యువత విషయానికి వస్తే.. వారు సోషల్ మీడియా ద్వారా తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. ప్రతిదీ కూడా క్షణాల్లోనే జరిగిపోవాలని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ రాధాకృష్ణ లాంటి సీనియర్ జర్నలిస్టులు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది.
ఆ యువత కూడా ఒక్క రోజులోనే యుక్త వయసుకు రాలేదు. అనేక పరిణామాలు.. అనేక దశలను దాటుకుని ఇక్కడ దాకా వచ్చారు. ప్రభుత్వంలో కావచ్చు.. పరిపాలన విధానంలో కావచ్చు లోపాలు ఉంటే ఉండవచ్చు. లోపాలు లేవని చెప్తే అది బూతు అవుతుంది. రాజకీయాలు కూడా పూర్తి వ్యాపారమయం గా మారిపోయాయి.. అందువల్లే ఎవరూ ప్రజలకు సేవ చేయాలని అనుకోవడం లేదు. ప్రజలు మాత్రం డబ్బులు స్వీకరించకుండానే ఓట్లు వేస్తున్నారా.. తమిళనాడు ఎన్నికల్లో కూడా డబ్బులు తీసుకొని ఓట్లు వేశారు. విజయ్ పార్టీ ఎన్నికల్లో డబ్బులు పంచక పోయి ఉండవచ్చు. కానీ అధికారాన్ని దక్కించుకునే క్రమంలో పుష్ప స్టైల్ లో సోఫాలు పంపిణీ చేసిన విషయాన్ని రాధాకృష్ణ మర్చిపోవద్దు.
కాక్రోచ్ పార్టీలు మఘ లో పుడతాయి.. పుబలో ముగిసిపోతాయి. ఈ దేశంలో అన్న హజారే కాంగ్రెస్ గవర్నమెంటు అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. నాడు యువత కూడా ఆయనకు అండగా నిలిచింది. ఆ తర్వాత ఆ ఉద్యమం ఏమైపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముందుగానే చెప్పినట్టు ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు.. ఆలోచనతో తీసుకునే విధానాలు వేరుగా ఉంటాయి. కేవలం యువత ఆవేశాన్ని పరిగణనలోకి తీసుకొని రాజకీయాలు చేయడం అంటే.. కుక్కతోక పట్టుకొని గోదావరిని ఈదినట్టే ఉంటుంది. కాకపోతే రాధాకృష్ణ రాజకీయ పార్టీలకు తన తాజా సంపాదకీయం ద్వారా చురకలు అంటించారు. మొత్తంగా ఈ సంపాదకీయంలో జగన్ ప్రస్తావన రాలేదు. అదే ఆశ్చర్యకరం..