Home Blog Page 208

వైయస్సార్ విగ్రహాల ధ్వంసం వెనుక వైసిపి.. వెలుగులోకి సంచలన నిజాలు..

ysr statue vandalism

ysr statue vandalism : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏ చిన్న అవకాశాన్ని కూడా జారవిడుచుకోవడం లేదు. ఏడాది కిందట జరిగిన డీఎస్సీలో అక్రమాలు జరిగాయి అంటూ ఇప్పుడు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలుపుతోంది. మరోవైపు రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి అంటూ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో నంద్యాలలో వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహ ధ్వంసం ఘటనకు సంబంధించి కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం ప్రారంభించింది. అయితే ఈ విషయంలో అడ్డంగా బుక్కయింది. ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసింది సొంత పార్టీ కార్యకర్త అని తేలడంతో డిఫెన్స్ లో పడిపోయింది. కూటమి మీద దూకుడు రాజకీయాలు చేస్తున్న క్రమంలో… ఆ పార్టీ వెనుక ముందు చూసుకోవడం లేదు. నంద్యాలలో ఇదే పరిస్థితి ఎదురు కావడంతో నాలుక కరుచుకుంది.

* రెండు రోజుల కిందట ధ్వంసం..
నంద్యాల నడిబొడ్డున ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని శనివారం ఓ వ్యక్తి ధ్వంసం చేశారు. తలభాగాన్ని వేరుచేసి తనతో తీసుకెళ్లిపోయారు. అయితే ఈ వార్త వ్యాపించడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలు స్పందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అంతటితో ఆగకుండా విగ్రహ ధ్వంసం వెనుక కూటమి హస్తం ఉందని ఆరోపించడం ప్రారంభించారు. అయితే పోలీసులు రంగంలోకి దిగి.. నిందితుడిని పట్టుకున్నారు. వైసీపీలో విభేదాలతో జంబులయ్య అనే కార్యకర్త ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీస్ విచారణలో తేలింది. దీంతో ఎలా స్పందించాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెలియడం లేదు.

* డీఎస్సీ పై అలానే..
గత ఏడాది డీఎస్సీ నిర్వహించిన సంగతి తెలిసిందే. 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారు. అయితే ఇప్పుడు డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయి అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు, ఇతరత్రా అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ ఉపాధ్యాయ నియామక ప్రక్రియ జరిగింది. పూర్తి పారదర్శకంగా జరిపినట్లు ప్రభుత్వం స్పష్టం చేస్తూ వాటి వివరాలు కూడా సమర్పించింది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఇలా విగ్రహం ధ్వంసం అయిందో లేదో.. కనీసం విచారించకుండా కూటమి పనే అంటూ అనుమానించడం ప్రారంభించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సొంత పార్టీ కార్యకర్త ఇలా చేశారని తెలియడంతో ఆ పార్టీ నేతలు షాక్ అవుతున్నారు. నంద్యాలలో పార్టీలో అంతర్గత విభేదాలతోనే ఈ పరిణామం జరిగిందని తెలియడంతో పార్టీ అధినాయకత్వం సీరియస్ గా తీసుకుంది. మరి ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తుందో చూడాలి.

రాజ్యసభకు లోకేష్ టీం!

Nara Lokesh
Nara Lokesh

Nara Lokesh: ఏపీలో రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. నలుగురు సభ్యులు పదవీ విరమణ చేయడంతో ఈ నెలలోనే కొత్త వారి ఎన్నిక జరగనుంది. ఇప్పటికే ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో అభ్యర్థులను రంగంలోకి దిల్చేందుకు రాజకీయ పార్టీలు సన్నాహాలు ప్రారంభించాయి. కూటమికి ఏకపక్ష బలం ఉండడంతో నాలుగు పదవులను దక్కించుకోనుంది. అయితే టిడిపికి రెండు, బిజెపికి ఒకటి, జనసేనకు ఒకటి కేటాయిస్తారని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం ఉంది. అయితే ఈసారి టిడిపిలో పోటీ ఉండడంతో మూడు రాజ్యసభ పదవులు ఆ పార్టీ తీసుకుంటుందని.. జనసేనకు ఒకటి కేటాయిస్తుందని.. బిజెపికి ఈసారి ఇచ్చే ఛాన్స్ లేదని ఒక టాక్ ఉంది. అయితే ఈ లెక్కన టిడిపికి రెండు పదవులు దక్కడం ఖాయం. కానీ ఆశావహులు చూస్తే పదుల సంఖ్యలో ఉన్నారు. రాజ్యసభ పదవుల ఎంపిక చంద్రబాబుకు ఇబ్బందికరమే. అయితే ఈసారి సీనియర్లను తప్పించి జూనియర్లకు అవకాశం కల్పిస్తారని పొలిటికల్ వర్గాల్లో ఒక టాక్ నడుస్తోంది.

* యువతరానికి అవకాశాలు..
ఇటీవల తెలుగుదేశం పార్టీలో యువతరానికి ఎక్కువగా అవకాశాలు దక్కుతున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ నియమితులయ్యారు. ఆయన టీమ్ లోకి పలువురు యువ నేతలు వచ్చారు. కిలారు రాజేష్ లాంటి వారికి జాతీయ కార్యవర్గంలో చోటు దక్కింది. రాష్ట్ర కార్యవర్గంలో సైతం యువనేతలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పటికే మొన్నటి ఎన్నికల్లో యువతకు ఎక్కువగా అవకాశాలు కల్పించారు. ఇదంతా పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తీసుకున్న నిర్ణయాలు. ముఖ్యంగా లోకేష్ టీమ్ లో చేరేందుకు యువ నేతలు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే నేతల వారసులు లోకేష్ తో పనిచేస్తున్నారు. దీంతో రాష్ట్ర కార్యవర్గం తో పాటు అన్ని రకాల నియామకాల్లో ఇకనుంచి యువతకే ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

* సానా సతీష్ కు మరోసారి
తాజాగా రాజ్యసభ పదవులకు సంబంధించి ఇద్దరు యువ నేతలకు అవకాశం ఇస్తారని తెలుస్తోంది. పదవీ విరమణ చేస్తున్న నలుగురిలో టిడిపికి చెందిన యువ నేత సానా సతీష్ ఉన్నారు. ఏడాదిన్నర కిందట ఆయన రాజ్యసభకు ప్రమోట్ అయ్యారు. తక్కువ కాలం కావడంతో ఆయనకు మరోసారి ఛాన్స్ ఇవ్వనున్నారు. సానా సతీష్ లోకేష్ కు అత్యంత దగ్గరైన వ్యక్తి. 2019 నుంచి 2024 మధ్య తెర వెనుక ఉండి పార్టీకి విశేష సేవలు అందించారు. అందుకే ఆయనకు మరోసారి ఛాన్స్ ఇవ్వనున్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో నడిచింది కిలారు రాజేష్, సానా సతీష్. అందుకే కిలారు రాజేష్ కు జాతీయ కార్యవర్గంలో చోటిచ్చారు. ఇప్పుడు సతీష్ కు మరోసారి రాజ్యసభకు అవకాశం కల్పించనున్నారు.

* చింతకాయల విజయ్ కు..
మరోవైపు యువనేత చింతకాయల విజయ్ కు రాజ్యసభ పదవీ ఖరారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన స్పీకర్ అయ్యన్నపాత్రుడు కుమారుడు. గత దశాబ్ద కాలంగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. తండ్రి మాదిరిగా దూకుడు కలిగిన నేత. టిడిపి సోషల్ మీడియాకు విశేష సేవలు అందించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అరెస్టులకు కూడా భయపడలేదు. బీసీ సామాజిక వర్గం నేత కావడంతో కలిసి వచ్చే అంశం. భవిష్యత్తులో లోకేష్ తో కలిసి నడవాల్సిన నేత కావడంతో ఆయనకు రాజ్యసభ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే లోకేష్ టీం ఇప్పుడు రాజ్యసభ పదవులు దక్కించుకోనుదన్నమాట.

ఈ రాశుల వారికి ఈరోజు ఆదాయం ఫుల్..

Today 26th January 2026 Horoscope
Today 26th January 2026 Horoscope

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై మూలా నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. మరి కొన్ని రాశుల వారు వస్తువులు కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఉద్యోగులు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు చేసే ప్రతి పనిలో విజయం ఉంటుంది. కుటుంబ సభ్యుల అండదండలతో వ్యాపారాలు కొత్తగా పెట్టుబడులు పెడతారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరుగుతాయి.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వ్యాపారులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యర్థుల బెడద ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పెట్టుబడులు పెడితే పెద్దలను సంప్రదించడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని విజయాలే ఉంటాయి. గతంలో మొదలు పెట్టిన పనులను ఈరోజు పూర్తి చేస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దలను సంప్రదించడం మంచిది. విద్యార్థులకు గురువుల అండదండలు ఉంటాయి దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈరోజు అనుకోకుండా శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులు శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు అవసరమైన సమాచారం అందుతుంది. విదేశాల్లో ఉండేవారి నుంచి కీలకమైన సమాచారం అందుకుంటారు. విద్యార్థుల భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకుంటారు. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. దూర ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారి వైవాహిక జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. పిల్లలతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. స్నేహితుల సహకారంతో అప్పులను తీరుస్తారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండడమే మంచిది. ఆర్థిక వ్యవహారాలు జాగ్రత్తగా ఉండాలి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గౌరవం లభిస్తుంది. అనుకోకుండా ఉద్యోగులకు ఆదాయం జరుగుతుంది. వ్యాపారులకు అవసరమైన వనరులు అందడంతో ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనూ అనవసరపు వాదనలకు దిగకుండా ఉండాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పెట్టుబడులు పెడితే పెద్దలను సంప్రదించడం మంచిది. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరపు వస్తువుల జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యాపారులకు అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను చేపడతారు. సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వచ్చే అవకాశాలున్నాయి. స్నేహితుల సహకారంతో ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వ్యాపారులు ఈరోజు ఊహించని లాభాలు పొందుతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు వస్తాయి. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను చేపడితే వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల అండదండలు ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. విద్యార్థులకు గురువుల మద్దతు ఉండడంతో పోటీ పరీక్షల్లో రాణిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. విదేశాలకు వెళ్లాలని అనుకునే వారికి శుభవార్తలు అందుతాయి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు ఆదాయం పెరుగుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవసరం ఉన్న వరకే ఖర్చులు చేయాలి. దూర ప్రయాణాలు కలిసి రాకుండా ఉంటాయి.

ప్రపంచంలోనే అత్యంత కఠినమైన 'ఎవరెస్ట్ మారథాన్' పూర్తి చేసిన తానా బోర్డ్ చైర్మన్ డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి!

TANA NRI

Dr Nagendra Srinivas Kodali : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) బోర్డ్ చైర్మన్, ప్రముఖ వైద్య నిపుణులు డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి మరో అరుదైన అంతర్జాతీయ ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన, సాహసోపేతమైన రన్నింగ్ ఈవెంట్‌గా పేరొందిన ‘టెన్జింగ్-హిల్లరీ ఎవరెస్ట్ మారథాన్’ను ఆయన విజయవంతంగా పూర్తి చేశారు. తెలుగు వారి సత్తాను, సాహస పటిమను ప్రపంచ వేదికపై చాటిచెప్పిన ఆయనపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సమాజం ప్రశంసల జల్లు కురిపిస్తోంది.

సముద్ర మట్టానికి 5,364 మీటర్ల ఎత్తులో సాహసం

ప్రతి సంవత్సరం ఎవరెస్ట్ బేస్ క్యాంప్ పరిసర ప్రాంతాల్లో ఈ మారథాన్‌ను నిర్వహిస్తారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో జరిగే మారథాన్‌గా దీనికి గుర్తింపు ఉంది. సముద్ర మట్టానికి సుమారు 5,364 మీటర్ల ఎత్తులో అత్యంత తక్కువ ఆక్సిజన్, మైనస్ డిగ్రీల చలి, కఠినమైన వాతావరణం, మంచుతో కూడిన ప్రమాదకరమైన కొండ మార్గాలు ఉన్న ప్రాణాంతక పరిస్థితులను అధిగమించి ఈ రేసును పూర్తి చేయడం డా. నాగేంద్ర శ్రీనివాస్ అసాధారణ శారీరక, మానసిక దృఢత్వానికి నిదర్శనంగా నిలిచింది.

‘తానా విశ్వ గురుకులం’ ప్రచారం కోసమే ఈ యాత్ర!

పురాణ ఇతిహాసాల ఆధారంగా రూపొందించిన ‘తానా విశ్వ గురుకులం’ అనే ప్రత్యేక బోధనా పద్ధతిని ప్రపంచానికి, మరీ ముఖ్యంగా ఉత్తర అమెరికాలోని తెలుగు వారికీ పరిచయం చేయడమే లక్ష్యంగా ఆయన ఈ సాహస యాత్రను చేపట్టారు. తానా ఆశయాలు, సిద్ధాంతాలు, వ్యవస్థాపక లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ఇటువంటి క్లిష్టమైన మార్గాలను ఆయన ఎంచుకున్నారు.

ఇప్పటికే మూడు అత్యున్నత శిఖరాల అధిరోహణ

డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి కేవలం రన్నర్ మాత్రమే కాదు, గొప్ప పర్వతారోహకులు కూడా. ప్రపంచంలోని ఏడు అత్యున్నత శిఖరాలలో (Seven Summits) ఇప్పటికే మూడింటిని ఆయన విజయవంతంగా అధిరోహించారు. కార్స్టెన్స్ పిరమిడ్ (ఇండోనేషియా), మౌంట్ ఎల్బ్రస్ (రష్యా), మౌంట్ కిలిమంజారో (టాంజానియా) అధిరోహించారు.

యువతకు స్ఫూర్తిదాయకం: తెలుగు ప్రముఖుల హర్షం

సాహసం, సేవాభావం, అద్భుత నాయకత్వ లక్షణాలు కలగలిసిన డా. నాగేంద్ర శ్రీనివాస్ సాధించిన ఈ విజయం పట్ల తానా సభ్యులు, తెలుగు రాష్ట్రాల ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. తెలుగు సంస్కృతి, వారసత్వాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు ఆయన చేస్తున్న కృషి నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

2027 తానా స్వర్ణోత్సవాలకు పిలుపు

ఈ సందర్భంగా డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి మాట్లాడుతూ… తానా ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కోరారు. అలాగే, 2027లో డా. నరేన్ కొడాలి అధ్యక్షతన జరగబోయే ‘తానా స్వర్ణోత్సవాలను’ (TANA Golden Jubilee) ఘనంగా నిర్వహించేందుకు, విజయవంతం చేసేందుకు తెలుగు వారందరూ తమ సహాయ సహకారాలు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Motorola నుంచి అద్భుతమైన బ్యాటరీతో కొత్త ఫోన్..

Motorola Edge 70 Pro Plus
Motorola Edge 70 Pro Plus

Motorola Edge 70 Pro Plus: Motorola సంస్థ తన ‘ఎడ్జ్’ సిరీస్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన Motorola Edge 70 Pro Plus స్మార్ట్‌ఫోన్‌ను 4 జూన్ 2026న భారతీయ మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధమైంది. ఆకర్షణీయమైన డిజైన్ మరియు అద్భుతమైన కెమెరా ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్, మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో కొత్త ప్రమాణాలను నెలకొల్పనుంది. ఈ మొబైల్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

Motorola Edge 70 Pro+ డిజైన్ పరంగా చాలా విభిన్నంగా ఉంటుంది. ఇందులో 6.8-అంగుళాల ‘ఎక్స్‌ట్రీమ్’ AMOLED డిస్‌ప్లేను అమర్చారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. ఇందులో 5,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ఉండనుంది. దీనివల్ల ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే, ఇది IP68 మరియు IP69 రేటింగ్‌లతో రావడం వల్ల నీటిలో మరియు దుమ్ము, ధూళిలో కూడా ఫోన్ సురక్షితంగా ఉంటుంది.ఇది మూడు ప్రత్యేకమైన రంగుల్లో PANTONE Stormy Sea, Zinfandel, Chicory Coffee అందుబాటులోకి రానుంది.

ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎక్స్‌ట్రీమ్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. వేగవంతమైన మల్టీ టాస్కింగ్ కోసం 12GB RAM, 256GB UFS 4.1 స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే. ఇది ఆండ్రాయిడ్ 16 వెర్షన్‌తో వస్తుంది. మోటరోలా ఇందులో ఏకంగా 6,500mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉండనుంది. ఈ బ్యాటరీకి 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. కేవలం 9 నిమిషాల ఛార్జింగ్‌తో రోజంతా ఫోన్ వాడేంత పవర్ వస్తుందని సంస్థ పేర్కొంది.

ఈ ఫోన్‌కు ప్రధాన బలం దీని కెమెరా సెటప్. ఇందులో 50MP మెయిన్ సెన్సార్ కెమెరా ఉండనుంది. 50MP అల్ట్రా-వైడ్ లెన్స్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఇది 50x వరకు AI సూపర్ జూమ్ సదుపాయాన్ని అందిస్తుంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 50MP కెమెరా ఉంది. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీని ఇష్టపడే వారికి ఈ కెమెరా సెటప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ జెమిని Google Gemini AI వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. దీంతో వినియోగదారులకు పనులు సులభతరం చేయడంలో సహాయపడతాయి. ఫోన్‌కు భద్రత కోసం ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉన్న డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. ఈ ఫోన్ జూన్ 4, 2026 నుండి మోటరోలా ఇండియా అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, ప్రముఖ రిటైల్ స్టోర్లలో విక్రయానికి అందుబాటులో ఉంటుంది. దీని ధర సుమారు రూ.47,999 నుంచి రూ.56,999 మధ్య ఉండవచ్చని తెలుస్తోంది.

నారా లోకేష్ చొరవ.. ప్రభుత్వ బడి.. ఇంటర్నేషనల్ స్కూల్ అయింది..ఇది కదా మార్పు అంటే..

Andhra Pradesh Education Reforms
Andhra Pradesh Education Reforms

Andhra Pradesh Education Reforms: ఇటీవల ఏపీలో 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఎప్పుడైనా సరే 10వ తరగతి ఫలితాలు విడుదలైనప్పుడు కార్పొరేట్ స్కూల్లో చదివే విద్యార్థులకు ఎక్కువగా మార్కులు వస్తూ ఉంటాయి. వారి గురించి వార్తాపత్రికలలో ప్రకటనలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈసారి ఏపీలో విచిత్రం. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఎక్కువ మార్కులు సాధించారు. అంతేకాదు వారి గురించి ఏపీ ప్రభుత్వం పత్రికలలో ప్రకటనలు కూడా ఇచ్చింది. ఆ ప్రకటనలో ఎక్కడ కూడా చంద్రబాబు.. నారా లోకేష్ ఫోటోలు లేకుండా చూసుకుంది. కేవలం విద్యార్థుల ఫోటోలు మాత్రమే అందులో ప్రముఖంగా ప్రచురించింది. ఇది కేవలం ఉదాహరణ మాత్రమే.. ఏపీలో విద్యా విధానం మారింది అని చెప్పడానికి.. ప్రభుత్వం విద్యార్థుల విషయంలో దృఢ సంకల్పంతో ఉంది అని చెప్పడానికి ఇంతకంటే గొప్ప దృష్ట్యాంతాలు ఉండకపోవచ్చు.

ఏపీలో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నారా లోకేష్ యుద్ధ ప్రాతిపదికన పాఠశాలలను బాగు చేయడం మొదలుపెట్టారు. విద్యార్థులకు అద్భుతమైన విద్యా బోధనతో పాటు.. యూనిఫామ్.. పుస్తకాలు.. మధ్యాహ్న భోజనం.. క్రీడా సదుపాయాలు.. అన్ని కల్పించారు. తాను ప్రాతినిధ్యమైస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు పూర్తిగా మార్చేశారు.. ముఖ్యంగా గుంటూరు జిల్లా మంగళగిరి మండలం లో ఉన్న నిడమర్రు జడ్పీ హైస్కూల్ అయితే ఏకంగా ఇంటర్నేషనల్ స్కూల్ లెవెల్ లో కనిపిస్తోంది. నిడమర్రు ప్రభుత్వ పాఠశాలలో నీరుకొండ, నీరుకొండ శిబిరం, కూరగల్లు, బేతపూడి, బాపూజీ నగర్ వంటి గ్రామాల విద్యార్థులు చదువుకుంటారు.. లెర్న్ ఎక్స్ లెన్స్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ 11 భాగంగా దాదాపు 16 కోట్లతో ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ బడిని అత్యాధునిక విద్యాలయంగా మార్చారు.. అంతేకాదు ప్రతి గదిని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దారు. స్మార్ట్ క్లాస్ రూమ్ లోనే ఏర్పాటు చేసి విద్యార్థులకు సరికొత్త విధానంలో బోధన చేస్తున్నారు.

సైన్స్ ల్యాబ్ ను ఏకంగా సైన్స్ మ్యూజియంగా మార్చేశారు. అత్యాధునిక స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ఏర్పాటు చేశారు. కార్పొరేట్ పాఠశాలలను మించే విధంగా ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేశారు. అతి పెద్దదైన హంపి థియేటర్ నిర్మించారు. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ గా గుర్తింపు సాధించింది. గతంలో ఈ పాఠశాలలో 500 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఆ సంఖ్య 1100 చేరుకుంది. కొత్తగా అడ్మిషన్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. చివరికి నారా లోకేష్ సిఫారసు చేసిన సరే అక్కడ అడ్మిషన్ దొరకని పరిస్థితి ఏర్పడింది.

సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో అంతగా సౌకర్యాలు ఉండవు.. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రైవేటు స్కూళ్లకు పంపిస్తారు. రెక్కలు ముక్కలు చేసుకుని ఫీజులు కడతారు. పిల్లలు బాగా చదువుకోవాలని తపిస్తారు. అటువంటి పేద తల్లిదండ్రుల కోసం నారా లోకేష్ ఆలోచించి.. ఈ స్థాయిలో స్కూల్ ను అభివృద్ధి చేశారు. నిడమర్రు పాఠశాల నిజంగా పేద విద్యార్థులకు సరస్వతి దేవాలయం. దీనిని సార్ధకం చేసిన నారా లోకేష్ ఎప్పటికీ ఈ పాఠశాల విద్యార్థుల మదిలో నిలిచిపోతారు. అందులో ఏమాత్రం అనుమానం లేదు.

చైనా నుంచి వచ్చిన తర్వాత.. ట్రంప్ చర్మం మీద మచ్చలు.. కాళ్లలో వాపు.. ఏం జరిగి ఉంటుంది..

Donald Trump Health Update
Donald Trump Health Update

Donald Trump Health Update: కొంతకాలంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి మీడియాలో రాని వార్త అంటూ లేదు. అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి ఇప్పటివరకు ట్రంప్ మాట్లాడుతున్న మాటలు.. తీసుకుంటున్న నిర్ణయాలు.. ప్రతిది కూడా సంచలనమే. ఆయన వేసే అడుగు.. మాట్లాడే మాట.. తీసుకునే నిర్ణయం ఇలా ప్రతిదీ ప్రపంచం మీద తీవ్రస్థాయిలో ప్రభావం చూపిస్తోంది.

ఇరాన్ యుద్ధం.. వెనిజులా అధ్యక్షుడు అపహరణ.. ప్రపంచం మీద వేసిన సుంకాలు.. అమెరికా నుంచి ఇతర దేశస్తులను బయటికి పంపించిన తీరు.. క్రూడ్ ఆయిల్ బిజినెస్ లో సాగిస్తున్న పెత్తనం ఇలా ప్రతిదీ కూడా ట్రంప్ వ్యవహార శైలిని ప్రపంచం ముందు కొత్తగా చూపిస్తోంది. ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో హత్యాయత్నాన్ని ఎదుర్కొన్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కూడా ఇటీవల హత్యాయత్నాన్ని చవిచూశారు. మొత్తంగా ట్రంప్ వల్ల అమెరికాలోనే కాదు అంతర్జాతీయంగా కూడా నిత్యం వివాదాలే.

ట్రంప్ నివాసం ఉండే వైట్ హౌస్ సమీపంలో ఆ మధ్య ఒక వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. సెక్యూరిటీ సిబ్బంది అతడిని అరెస్ట్ చేశారు. ఇక అప్పటినుంచి వైట్ హౌస్ గురించి అంతగా వార్తలు బయటకు రావడం లేదు. అయితే తాజాగా ట్రంప్ కు సంబంధించి ఒక విషయం వెలుగులోకి వచ్చింది. అది కాస్త ఆయన ఆరోగ్య మీద సరికొత్త చర్చకు దారి తీయడం మొదలుపెట్టింది. ట్రంప్ వయసు ప్రస్తుతం 80 సంవత్సరాలు. ఆయన దాదాపు 108 కిలోల బరువు ఉంటారు.

80 ఏళ్ల వయసులో కూడా ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. దేశానికి సేవలందిస్తున్నారు. ఆయనకు వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్లో వైద్య పరీక్షలు చేశారు. దాదాపు 22 మంది వైద్య నిపుణులు ఆయనకు పరీక్షలు చేశారు. ఈ వైద్య బృందానికి షాన్ బార్సెల్ నాయకత్వం వహించారు. ట్రంప్ చర్మం మీద చిన్న చిన్న మచ్చలు ఇటీవల కనిపించాయి. చైనా నుంచి ఆయన వచ్చిన తర్వాత ఈ పరీక్షలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన వీనస్ ఇన్ సఫిషియన్సీ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కాళ్ళ కింది భాగంలో స్వల్పంగా వాపు కూడా ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. అయితే ఇవేవీ కూడా ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీయ లేవని వైద్యులు అంటున్నారు.

విపరీతమైన విదేశీ పర్యటనలు.. తరుచుగా కరచాలనం చేయడం వల్ల ట్రంప్ చర్మం మీద మచ్చలు ఏర్పడి ఉంటాయని వైద్యలు చెబుతున్నారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, కంగారు పడాల్సిన అవసరం లేదని వెల్లడిస్తున్నారు.

RCB గెలవాలని మంత్రాలు, తంత్రాలు, హోమాలు.. ఇదెక్కడి మాస్ రా మావా

RCB IPL Final
RCB IPL Final

RCB IPL Final: క్రికెట్లో గెలవాలంటే ఆటగాళ్లు గొప్ప ప్రదర్శన చేయాలి. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు మించి ఆడాలి. కానీ ఐపీఎల్లో బెంగళూరు అభిమానులు అందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. తమజట్టు ఎలాగైనా గెలవాలని.. రెండవసారి కూడా ట్రోఫీ సొంతం చేసుకోవాలని ఈసారి గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఫైనల్ వెళ్లడమే ఆలస్యం జట్టు మీద భారీగా అంచనాలు పెట్టుకున్నారు.

ఫైనల్ మ్యాచ్ జరిగే అహ్మదాబాద్ నగరాన్ని మొత్తం ఎరుపు మయం చేశారు. ఆర్ సి బి జెర్సీలు వేసుకొని అక్కడ సందడి చేస్తున్నారు. అంతేకాదు ఈసారి కూడా కప్ మాదే అంటూ నినాదాలు చేస్తున్నారు. అంతటితోనే ఆర్సిబి అభిమానులు ఆగిపోవడం లేదు. వారు మరింత జోరు చూపిస్తున్నారు. అహ్మదాబాద్ నగరంలో మ్యాచ్ జరిగే స్టేడియం పరిసర ప్రాంతాలలో ఆర్ సి బి ఆర్ సి బి అంటూ నినాదాలు చేస్తున్నారు. అంతేకాదు సమీపంలో ఉన్న ఆలయాలలో పూజలు కూడా చేస్తున్నారు.

బెంగళూరులో ఉన్న ఆర్సిబి అభిమానులు అన్ని ఆలయాలలో పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. అదే కాదు హోమాలు జరుపుతున్నారు. పూజారులతో మంత్రాలు, తంత్రాలు నిర్వహిస్తూ.. తమ జట్టు మీద ఉన్న ప్రేమను నిరూపించుకుంటున్నారు. ఐపీఎల్ లో బలమైన అభిమానుల నేపథ్యమున్న జట్లలో బెంగళూరు ముందు వరుసలో ఉంటుంది. ఈ జట్టుకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోవర్స్ ఉన్నారు. గత సీజన్లో ట్రోఫీ గెలిచిన తర్వాత బెంగళూరు జట్టు విలువ భారీగా పెరిగిపోయింది. ఆ జట్టు అభిమానుల ఆనందానికి అవధి లేకుండా పోయింది.

చిన్నస్వామి స్టేడియంలో జరిగిన దుర్ఘటన మినహాయిస్తే.. మిగతా అన్ని సందర్భాలలో జట్టుకు బెంగళూరు అభిమానులు అండగా ఉన్నారు. సోషల్ మీడియాలో లక్షలలో గ్రూపులు నిర్వహిస్తున్నారు. అదే కాదు చెన్నై, హైదరాబాద్, ముంబై జట్లను మించిపోయే విధంగా తమ సత్తా ఏమిటో బెంగళూరు అభిమానులు చూపిస్తున్నారు. అందువల్లే ఐపిఎల్ లో బెంగళూరు అత్యంత విలువైన జట్టుగా కొనసాగుతోంది. ఇక యువతులయితే సోషల్ మీడియాలో విపరీతంగా సందర్శిస్తున్నారు. ఈసారి కప్ మాదే అంటూ నినాదాలు చేస్తున్నారు. మైదానంలోకి మగవాళ్ళ కంటే ఎక్కువగా ఆడవాళ్లే వస్తున్నారు. మ్యాచ్ జరిగే అహ్మదాబాద్ లో గుజరాత్ అభిమానుల కంటే బెంగళూరు అభిమానులే ఎక్కువగా కనిపిస్తూ ఉండడం విశేషం.

హార్దిక్ పాండ్యా వెళ్లిపోవడం ఖాయం.. ముంబై ఇండియన్స్ కెప్టెన్ అతడే

Hardik Pandya
Hardik Pandya

Mumbai Indians Captain: 2024 ఐపిఎల్ సీజన్ లో ముంబై జట్టుకు సారధిగా వచ్చాడు హార్దిక్ పాండ్యా. ట్రేడింగ్ విధానంలో ఏ ముహూర్తం లో అయితే అతడు ముంబై జట్టుకు వచ్చాడో .. అప్పటినుంచి అతడి గ్రహచారం ఏమాత్రం బాగోలేదు.. ముఖ్యంగా వ్యక్తిగత జీవితంలో తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. భార్య నటాషా తో విడిపోయాడు.. ఆ సీజన్ లో ముంబై జట్టు సారధిగా ఆకట్టుకోలేకపోయాడు. ముంబై జట్టు 2024 ఐపిఎల్ లో పాయింట్ల పట్టికలో దిగువ స్థానంలో నిలిచింది.

2025 సీజన్ లో నాలుగో స్థానాన్ని ఆక్రమించింది. ఈ సీజన్లో మాత్రం దారుణంగా ఆడింది. జట్టులో గొప్ప గొప్ప ప్లేయర్లు ఉన్నప్పటికీ ముంబై కి చెప్పుకునే స్థాయిలో విజయాలు రాలేదు. కనీసం ప్లే ఆఫ్ దాకా వెళ్తుందనుకుంటే.. అక్కడిదాకా కూడా వెళ్లలేకపోయింది. ముంబై జట్టు సారధిగా హార్దిక్ పాండ్యా తనదైన మార్క్ చూపించలేదు. కొన్ని సందర్భాలలో అతడిని జట్టుకు దూరంగా ఉంచారు. సూర్య కుమార్ యాదవ్, బుమ్రా జట్టుకు తాత్కాలిక నాయకత్వం వహించారు. వారిద్దరూ పగ్గాలు అందుకున్నప్పటికీ ముంబై జట్టు రాత ఏమాత్రం మారలేదు.

ఇటీవల ముంబై జట్టు ఆడిన ఒక మ్యాచ్లో హార్దిక్ పాండ్యా తన ఒంటి మీద ఉన్న జెర్సీని తొలగించి అభిమానుల సందోహంలో వేశాడు. దానికంటే ముందు ముంబై జట్టును సోషల్ మీడియాలో అన్ ఫాలో చేశాడు. దీంతో హార్దిక్ పాండ్యా పరోక్షంగా తాను ముంబై జట్టును వీడి వెళ్లిపోతున్నట్టు సంకేతాలిచ్చాడు. ముంబై యాజమాన్యం కూడా అతడిని పక్కన పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. ఇంతవరకు అధికారికంగా క్లారిటీ రాకపోయినప్పటికీ అతడు వెళ్లిపోవడం ఖాయమని తెలుస్తోంది. అతడి స్థానంలో ముంబై పగ్గాలు అందుకునేందుకు తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

తిలక్ వర్మకు రోహిత్ శర్మ సపోర్ట్ ఎక్కువగా ఉంది. సూర్య కుమార్ యాదవ్ తో కూడా అతడికి మెరుగైన సంబంధాలు ఉన్నాయి. మేనేజ్మెంట్ తో కూడా తిలక్ వర్మకు మెరుగైన సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతడిని జట్టుకు నాయకుడిగా ఎంపిక చేస్తారని తెలుస్తోంది. తిలక్ వర్మ ఒత్తిడిలో కీలకమైన ఇన్నింగ్స్ ఆడతాడు. పైగా అతడికి హిట్టర్ అనే పేరు ఉంది. కాబట్టి ముంబై మేనేజ్మెంట్ వచ్చే సీజన్లో తిలక్ వర్మకు పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు ఎదురు చూడక తప్పదు.

పాక్ ఐఎస్ఐ పన్నాగం.. మన భద్రత సంస్థలు ఇలా తిప్పి కొట్టాయి..

Pakistan ISI Conspiracy
Pakistan ISI Conspiracy

Pakistan ISI Conspiracy: పాకిస్తాన్ దేశంలో తినడానికి తిండి ఉండదు. తాగడానికి నీళ్లు ఉండవు. నడవడానికి రోడ్డు కూడా ఉండదు. అసలు అక్కడ బతకడానికి అవకాశం కూడా ఉండదు. ప్రజలు దుర్భరమైన దారిద్రంలో జీవిస్తుంటారు. పేదరికంలో బతికీడుస్తూ ఉంటారు. కానీ పాలకులు మాత్రం భారతదేశం మీద విషం చిమ్ముతూ ఉంటారు. ప్రపంచ దేశాల వద్ద అప్పులు తెచ్చి.. భారత వ్యతిరేక కార్యకాల పాలకు పాల్పడుతుంటారు. ఉగ్రవాదులతో అంట కాగి.. భారత దేశంలో దారుణాలు చేసేందుకు రూపకల్పన చేస్తుంటారు.

పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ మన దేశంలో అనేక ప్రాంతాలలో దాడులు చేసేందుకు రూపకల్పన చేసింది.. దీనికోసం ఒక ముఠాను ఏర్పాటు చేసుకుంది..ఈ ముఠాలో మొత్తం ఎనిమిది మంది ఉగ్ర సభ్యులు ఉన్నారు. వీరందరిని మన దేశ ఇంటలిజెన్స్ వర్గాలు పట్టుకున్నాయి. మహారాష్ట్ర, పంజాబ్, ఢిల్లీ, చంటిగాడు ప్రాంతాలలో నిర్వహించిన తనిఖీలలో ఈ ముఠా సభ్యులు పట్టుపడ్డారు. కీలకమైన వంతెనలు.. రైల్వే స్టేషన్లు.. పార్కులు.. వంతెనలు.. ఢిల్లీలో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కార్యాలయాలను వీరు లక్ష్యంగా చేసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో విజయ్ అలియాస్ షూటర్.. నితీష్ పాశ్వాన్.. రిజ్వాన్ అహ్మద్.. షేక్ అహ్మద్.. సాజిద్ మహబూబ్.. షేక్ అలియాస్ అర్బాజ్ ఖాన్.. హర్విందర్ సింగ్.. గగన్ దీప్ సింగ్.. మన్ జీత్ సింగ్.. కామీలామ ఉన్నారు. వీరంతా కూడా ఐఎస్ఐ తో కుమ్మక్కయ్యారు.

ఇటీవల కాలంలో మన దేశ భద్రత సంస్థలు అత్యంత గోప్యంగా తనిఖీలు చేపడుతున్నాయి. ముఖ్యంగా ఉగ్రవాదుల కదలికల మీద ఆరా తీస్తున్నాయి. పాకిస్తాన్ దేశానికి సరిహద్దుల్లో ఉన్న ఉత్తర ప్రదేశ్.. రాజస్థాన్.. ఢిల్లీ.. గుజరాత్ వంటి రాష్ట్రాలలో పటిష్టంగా తనిఖీలు చేపడుతున్నాయి. ఈ తనిఖీలలో ఉగ్రవాదుల డొంకలు కదులుతున్నాయి. అయితే వీరందరికీ కూడా ఐఎస్ఐ తో సంబంధం ఉండడం ఆందోళన కలిగిస్తోంది. సరిహద్దుల్లో పటిష్టమైన భద్రత నిర్వహిస్తున్నప్పటికీ.. స్లీపర్ సెల్స్ మాదిరిగా వీరు పని చేయడం.. దేశంలో విధ్వంసానికి కుట్ర చేయడం ఆందోళన కలిగిస్తోంది.

వీరి వెనుక కేవలం పాకిస్తాన్ ఐఎస్ఐ మాత్రమే కాకుండా.. ఇంకా అనేక రకాల ఉగ్రవాద సంస్థలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సంస్థలకు గల్ఫ్ దేశాల నుంచి భారీగా డబ్బులు వస్తున్నట్లు సమాచారం. ఆ డబ్బులను ఉగ్రవాద కార్యకలాపాల కోసం వాడుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా అరెస్టయిన ఈ 8 మంది ముఠా సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు. వారు చెప్పిన వివరాల ఆధారంగా దేశవ్యాప్తంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ లెక్కన పాకిస్తాన్ ఐఎస్ఐ మనదేశంలో భీకరమైన ఉగ్రదాడులకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

మరి కాసేపట్లో ఐపీఎల్ ఫైనల్.. అహ్మదాబాద్ పిచ్ ఎలా ఉంది.. ఎవరికి అనుకూలం

IPL Final 2026
IPL Final 2026

IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ ఫైట్ జరగుతుంది. ఐపీఎల్ 2025, 2026 t20 వరల్డ్ కప్ ఫైనల్స్ ఇక్కడ జరిగాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లు ఇక్కడ విజయం సాధించాయి. బ్యాటర్లకు ఈ మైదానం స్వర్గధామంగా ఉంటుంది. అదే సమయంలో ఫాస్ట్ బౌలర్లకు అనువుగా ఉంటుంది. ఈ మైదానంలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్లు 16 సార్లు.. సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు 8 సార్లు విక్టరీలు అందుకున్నాయి. ఈ మైదానం మీద హైయెస్ట్ స్కోర్ 255.. లోయస్ట్ స్కోర్ 66..

మిగతా జట్లతో పోల్చి గనుక చూస్తే గుజరాత్ జట్టుకు చెప్పుకునే స్థాయిలో బ్యాటింగ్ బలం లేదు.. మిడిల్ ఆర్డర్ అత్యంత వీక్. ఈ జట్టుకు ప్రధాన బలం గిల్, సాయి సుదర్శన్.. వీరిద్దరూ ఇప్పటివరకు తిరుగులేని స్థాయిలో ఓపెనింగ్ భాగస్వామ్యాలను నమోదు చేశారు. క్వాలిఫైయర్ 2 మ్యాచ్ లో రాజస్థాన్ జట్టు మీద గిల్, సాయి సుదర్శన్ 167 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదు చేశారంటే.. వారిద్దరు ఏ స్థాయిలో బ్యాటింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఈ టోర్నీలో ఆరెంజ్ క్యాప్ విభాగంలో సాయి సుదర్శన్ రెండవ స్థానం, గిల్ మూడో స్థానంలో ఉన్నారు.

బట్లర్ కూడా దూకుడు మీద ఉన్నాడు. ఒకవేళ ఈ ముగ్గురు గనుక విఫలమైతే గుజరాత్ జట్టుకు ఇబ్బంది తప్పదు. క్వాలిఫైయర్ -1 లో బెంగళూరు గిల్, సాయి సుదర్శన్ ను ఔట్ చేసి విజయాన్ని అందుకుంది. ఫైనల్ కూడా ఇదే స్థాయిలో ప్రదర్శన చేయాలని బెంగళూరు జట్టు బలంగా భావిస్తుంది. మిడిల్ ఆర్డర్లో వాషింగ్టన్ సుందర్.. నిశాంత్ సింధు.. తేవాటియ.. హోల్డర్ వంటి ప్లేయర్లు ఉన్నప్పటికీ.. వారి మీద గుజరాత్ జట్టు పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు.

ఇక బెంగళూరు లో భీకరమైన బ్యాటర్లు ఉన్నారు. వెంకటేష్ అయ్యర్.. విరాట్ కోహ్లీ.. సాల్ట్.. కృనాల్ పాండ్యా.. దేవదత్.. రజత్ పాటిదర్ వంటి ప్లేయర్లతో బెంగళూరు బ్యాటింగ్ బీభత్సంగా ఉంది. వీరే కాకుండా డేవిడ్.. షెఫర్డ్.. జితేష్ శర్మ అద్భుతాలు చేయగలరు. బెంగళూరు ప్రారంభంలో వికెట్లు కోల్పోయినప్పటికీ.. వెనకడుగు వేసే సవాల్ లేదు. అంతేకాదు పరుగుల వేగం ఏమాత్రం తగ్గదు. 200 కి మించి పరుగులు చేయడం.. 200 కు మించి లక్ష్యాలను ఫినిష్ చేయడం బెంగళూరు జట్టుకు పెద్ద కష్టం కాదు.

ఫైనల్ ప్రత్యర్థి గుజరాత్ జట్టు కావడంతో బెంగళూరు ఉత్సాహంతో కనిపిస్తోంది. ఇటీవల జరిగిన మ్యాచ్లో గుజరాత్ మీద బెంగళూరు గెలిచింది. అంతకు ముందు జరిగిన లీగ్ మ్యాచ్లో బెంగళూరును 155 పరుగులకే కుప్పకూల్చింది గుజరాత్. అటువంటి మ్యాజిక్ మరోసారి జరిగితే తప్ప బెంగళూరు వెనకడుగు వేసే అవకాశం లేదు.. బెంగళూరు జట్టులోకి సాల్ట్ రంగ ప్రవేశం చేయడం ఖాయం అయిపోయింది.

బౌలింగ్లో గుజరాత్ జట్టు వైవిద్యంగా ఉంది. రబాడ, సిరాజ్, రషీద్ ఖాన్ వంటి వారు ఈ సీజన్లో మెరుగ్గా వికెట్లు తీశారు. బెంగళూరు జట్టులో హేజల్ వుడ్, రసిక్ థార్, భువనేశ్వర్ కుమార్ సుయాస్ మెరుగ్గా కనిపిస్తున్నారు. దీంతో బ్యాటర్ల మధ్య మాత్రమే కాకుండా.. బౌలర్ల మధ్య పోరాటం కూడా జోరుగా సాగే అవకాశం కనిపిస్తోంది. ఈ మ్యాచ్లో విజయం సాధించే అవకాశం బెంగళూరుకు ఎక్కువగా ఉన్నప్పటికీ.. గుజరాత్ జట్టును ఏమాత్రం తీసి పడేయడానికి అవకాశం లేదు.

పెళ్లాం టార్చర్ భరించలేకపోతున్నా.. సచ్చిపోతా.. అనుమతించండి ప్లీజ్.. ఓ భర్త లేఖ వైరల్

Surat Husband Letter
Surat Husband Letter

Surat Husband Letter: ఆమధ్య బెంగళూరులో ఒక ఐటీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య పెట్టే వేధింపులు తట్టుకోలేక.. కోర్టు కేసులు ఎదుర్కోలేక.. బలవన్మరణానికి పాల్పడ్డాడు.. అతని ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ఘటన తర్వాత గృహహింస అనేది కేవలం ఆడవాళ్లకు మాత్రమే కాదని.. మగవాళ్ళ మీద అధికంగా ఉంటుందని తేలింది. ఇక అప్పటి నుంచి ఈ తరహా కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. అది కాస్త దేశ వ్యాప్తంగా కలకలం రేపింది.

తన భార్య వేధింపులు భరించలేకపోతున్నానని.. అందువల్లే తనకు కారుణ్య మరణాన్ని పొందే అవకాశం ఇవ్వాలని అతడు లేఖ రాశాడు. సూరత్ నగరానికి చెందిన కిరీట్ పటేల్ కు గతంలో రెండుసార్లు వివాహాలు జరిగాయి. 2024లో మూడవసారి అతడు వివాహం చేసుకున్నాడు. మొదట్లో వారిద్దరు బాగానే ఉండేవారు. ఆ తర్వాత దంపతుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. మూడో భార్య అతడి మీద తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం మొదలుపెట్టేది. ఆమెకు అత్తగారు తోడయ్యారు. నిరంతరం డబ్బు కోసం అతడిని వేధించడం మొదలు పెట్టేవారు. అతడి జీవితాన్ని సంక్షోభంలోకి నెట్టేశారు. మొదటి రెండు పెళ్లిళ్లు పెడాకులు కావడం.. మూడవ వివాహం కూడా ఇలా మారిపోవడంతో అతడు తీవ్రమైన ఆవేదనలో కూరుకుపోయాడు.

కిరీట్ పటేల్ మీద అతడి భార్య రకరకాల కేసులు పెట్టింది. ఆమెకు గతంలోనే వివాహం జరిగింది. తన మాజీ భర్తల మీద కూడా ఆమె ఇదేవిధంగా కేసులు పెట్టి డబ్బులు వసూలు చేసింది. కిరీట్ పటేల్ తాను ఎటువంటి తప్పు చేయలేదని పోలీసులకు చెబుతున్నప్పటికీ వారు ఒప్పుకోవడం లేదు. ఇదే విషయంపై అనేక పర్యాయాలు పోలీసులను కలిసినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో.. అతడిలో ఆవేదన మరింత పెరిగిపోయింది. ఒత్తిడి ఎక్కువ కావడంతో.. తనకు కారుణ్య మరణాన్ని ప్రసాదించాలని అతడు లేఖలో కోరాడు. “నాకు జీవితమేద పూర్తిస్థాయిలో విరక్తి వచ్చేసింది.. వేధింపులు తట్టుకోలేకపోతున్నాను. వీటినుంచి బయటపడే మార్గం నాకు కనిపించడం లేదు. దయచేసి నాకు కారుణ్య మరణాన్ని ప్రసాదించండి అంటూ”కిరీట్ పటేల్ కలెక్టర్ కు రాసిన లేఖలో పేర్కొన్నాడు. గృహహింసకు మగవాళ్ళు బలైపోతున్నారని.. వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని అతడు ఆ లేఖలో పేర్కొన్నాడు.

కిరిట్ రాసిన లేఖ పట్ల చాలామంది మగవాళ్ళు స్పందిస్తున్నారు. మగవాళ్ళు ఎదుర్కొనే మానసిక వేధింపుల నుంచి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక మనదేశంలో కారుణ్య మరణానికి సంబంధించి చట్టాలు అత్యంత కఠినంగా ఉన్నాయి. సీరియస్ మెడికల్ కేసులలోనే కారుణ్య మరణాన్ని ప్రసాదిస్తారు. ఇటువంటి వ్యక్తిగత కలహాలు.. కుటుంబ సమస్యలకు కారుణ్య మరణాన్ని ప్రసాదించే అవకాశం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయితే కిరీటి పటేల్ లేక రాసినప్పటికీ అధికార యంత్రం గురించి ఇటువంటి స్పందన రాలేదని తెలుస్తోంది.

ఐపీఎల్ విన్నర్ కు దక్కే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..

IPL 2026 Final Prize Money
IPL 2026 Final Prize Money

IPL 2026 Final Prize Money: ఐపీఎల్ చివరి దశకు చేరింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్, బెంగళూరు జట్లు పోటీ పడబోతున్నాయి. ఇప్పటికే క్వాలిఫైయర్ దశలో బెంగళూరు గుజరాత్ జట్టును ఓడించింది. ఇటీవల రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో గుజరాత్ విజయం సాధించి ఫైనల్ లాగా వచ్చేసింది.. రెండు జట్లలో హేమాహేమీలైన ప్లేయర్లు ఉండడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం కనిపిస్తోంది.

ఐపీఎల్ లో సాధారణంగా కాసుల ప్రవాహం కొనసాగుతూ ఉంటుంది. ప్రతి మ్యాచ్ కూడా డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అయితే ఫైనల్ పోరులో విజయం సాధించిన జట్టుకు ఏ స్థాయిలో ప్రైజ్ మనీ ఇస్తారనే విషయం అభిమానుల్లో చర్చకు దారితీస్తూ ఉంటుంది. ఐపీఎల్ లో ఛాంపియన్ గా ఆవిర్భవించిన జట్టుకు 20 కోట్లు లభిస్తాయి. రెండవ స్థానంలో మించిన జట్టుకు 13 కోట్లు లభిస్తాయి. మూడో స్థానంలో రాజస్థాన్ జట్టు నిలిచింది కాబట్టి.. ఏడు కోట్లు వస్తాయి.. నాలుగు స్థానంలో ఉన్న హైదరాబాద్ జట్టుకు 6.5 కోట్ల లభిస్తాయి. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ విన్నర్లకు 10 లక్షల చొప్పున లభిస్తాయి. అత్యంత విలువైన ఆటగాడికి 10 నుంచి 15 లక్షల వరకు లభిస్తాయి. ఎమర్జింగ్ ప్లేయర్ కు 20 లక్షల వరకు దక్కుతాయి. సూపర్ స్ట్రైకర్, అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లకు చెరి 10 లక్షల చొప్పున ప్రైజ్ మనీ లభిస్తుంది.

ఐపీఎల్ లో ఈ స్థాయిలో ప్రైజ్ మనీ చెల్లించడం వెనుక ప్రధాన కారణం.. ఆటగాళ్లలో క్రీడా స్ఫూర్తిని పెంచడమే. ఐపీఎల్ బ్రాండ్ వేల్యూ పెరగడం వల్ల బిసిసిఐ ప్రైజ్ మనీ భారీగా పెంచేసింది. టి20 లీగ్ లలో ఏ యాజమాన్యం కూడా ఈ స్థాయిలో ప్రైజ్ మనీ ఇవ్వడం లేదు. కాకపోతే ఐపిఎల్ మార్కెట్ విలువ వేరే విధంగా ఉంటుంది. కార్పొరేట్ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టడం.. ప్రకటన రూపం.. ప్రసార హక్కుల రూపంలో భారీగా సొమ్ము వస్తున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ స్థాయిలో ప్రైజ్ మనీ.. ఆటగాళ్లకు సొమ్ములు చెల్లిస్తోంది.

ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన జట్టు విలువ కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. 2008లో రాజస్థాన్ ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది. అప్పటినుంచి మరోసారి ఆ జట్టు ట్రోఫీ అందుకోలేకపోయింది. ఆయనప్పటికీ ఇటీవల ఆ జట్టు చేతులు మారింది. ప్రారంభంలో కొనుగోలు చేసిన యాజమాన్యానికి భారీగా డబ్బులు వచ్చాయి. బెంగళూరు గత ఏడాది ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది. దీంతో ఆ జట్టు విలువ పెరిగింది. పాత యాజమాన్యం జట్టును అమ్మింది. భారీగా డబ్బులు రావడంతో పండగ చేసుకుంది. ఐపీఎల్ ప్రారంభంలో జట్లను కొనుగోలు చేసిన యాజమాన్యాలు ఇప్పటికే భారీగా లాభాలు సంపాదించాయి. ఒకవేళ ఆ జట్లను కనుక అమ్ముకుంటే వాటికి భారీగా డబ్బులు వచ్చే అవకాశం ఉంది. అందువల్లే కార్పొరేట్ కంపెనీలు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పెట్టుబడులు పెడుతున్నాయి.

వారణాసి లో శివుడిగా రాజమౌళి... పార్వతి గా స్టార్ హీరోయిన్...ఇదేం ట్విస్ట్ రా మావా...

Varanasi
Varanasi

Rajamouli As Shiva: ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న రాజమౌళి అప్పటినుంచి వెనుతిరిగి చూడకుండా వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు. 100% సక్సెస్ రేట్ ని కలిగి ఉన్న ఏకైక ఇండియన్ డైరెక్టర్ గా కూడా రాజమౌళి చరిత్ర రికార్డుల్లో నిలిచిపోయాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇప్పటివరకు ఆయన చేసిన 12 సినిమాలు సూపర్ సక్సెస్ గా మిగలడంతో ఇప్పుడు చేస్తున్న వారణాసి సినిమాతో మరోసారి పెను సంచలనాన్ని క్రియేట్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటుంది. ఇక వారణాసి సినిమాలో మహేష్ బాబు ఐదు క్యారెక్టర్లలో కనిపిస్తున్నాడు. అయితే ఒక్కో గెటప్ కి ఒక సపరేట్ క్యారెక్టరైజేషన్ ఉండడమే కాకుండా ఆయన ప్రతిపాత్రలో ఒదిగిపోయి నటిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక రాజమౌళి సైతం ఈ సినిమాలో శివుడి పాత్రలో కనిపించబోతున్నాడట. ఇక రాజమౌళి ఇప్పటివరకు చిన్న చిన్న పాత్రలు చేశాడు కానీ వారణాసి సినిమాలో ఏకంగా శివుడి పాత్ర చేస్తున్నాడు అంటే ఆ పాత్రకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు…

ఆయన పక్కన పార్వతి దేవిగా కాజల్ నటిస్తుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి… మొత్తానికైతే శివుడి పాత్ర కోసం మొదట వేరే నటుడిని తీసుకోవాలని అనుకున్నప్పటికి ఆయన ఆ పాత్ర చేయడానికి పెద్దగా ఇష్టపడలేదట. దాంతో రాజమౌళినే ఆ పాత్రను చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ సినిమాలో ఈ పాత్ర కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందట.

రాజమౌళి ఆ పాత్ర ను ఎలా చేస్తాడనేది ప్రతి ఒక్కరిలో క్యూరియాసిటి ని రేకెత్తిస్తుంది. ఒక పాత్ర ను జక్కన్న చేస్తున్నాడు అంటే ఆ పాత్రని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్తాడు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి రాజమౌళి ఇప్పటివరకు యాక్టింగ్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే ఆయన ప్రతిసారి సినిమా బాగా రావాలి దర్శకుడిగా తనను తాను ఎలివేట్ చేసుకోవాలని చూశాడు. అంతే తప్ప ఆయన నటుడిగా రాణించాలనే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు.

ఇక అడపదడప సినిమాలో క్యామియో రోల్స్ పోషించినప్పటికి అవి పెద్దగా చెప్పుకోవాల్సిన క్యారెక్టర్స్ అయితే కాదు. కానీ ఫస్ట్ టైమ్ ఈ సినిమాలో శివుడి పాత్రను పోషిస్తున్నాడు. దానికోసం ఆయన నటుడిగా కూడా భారీ కసరత్తులు చేసినట్టుగా తెలుస్తుంది…

GT .. RCB ఏది గెలిచినా ఈమెకు కోట్లే కోట్లు..

GT Vs RCB
GT Vs RCB

GT Vs RCB: ఐపీఎల్ లో యాజమాన్యాలు ఒకే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుంటాయి. ట్రోఫీ గెలిస్తే యాజమాన్యాలకు పంట పండుతుంది. జట్టు విలువ పెరుగుతుంది. మార్కెట్ విలువ పెరగడం వల్ల డబ్బులు బాగా వస్తాయి. బీసీసీఐ నుంచి కూడా భారీగానే నగదు వస్తుంది కాబట్టి యాజమాన్యాలు పండగ చేసుకుంటాయి. 2008 నుంచి ఇప్పటివరకు ఐపీఎల్లో ఈ తంతు దర్జాగా కొనసాగుతోంది.

దండిగా ఆదాయం వస్తున్న నేపథ్యంలో చాలావరకు కార్పొరేట్ కంపెనీలు క్రికెట్లోకి ప్రవేశిస్తున్నాయి. ప్రవేశించడం మాత్రమే కాదు.. ఆటగాళ్ల కొనుగోలు నుంచి మొదలు పెడితే మార్కెటింగ్ వరకు ప్రతి విషయంలోనూ లెక్కలు వేసుకుంటున్నాయి. పెట్టిన పెట్టుబడికి అంతకుమించి అనే స్థాయిలో లాభాలను సొంతం చేసుకుంటున్నాయి. ఐపీఎల్లో ప్రతి జట్టు యాజమాన్యానికి డబ్బులు వస్తాయి. ప్రొఫెషన్ జట్టుకు మరింత ఎక్కువగా వస్తాయి. అందువల్లే ప్రతి యాజమాన్యం కూడా తమ జట్టు గెలుపొందాలని.. ట్రోఫీ ని సొంతం చేసుకోవాలని భావిస్తూ ఉంటుంది.

ఐపీఎల్ చరిత్రలో ఒకే యాజమాన్యం రెండు జట్లకు ప్రాతినిధ్యం వహించినట్టు ఇంతవరకు లేదు. అయితే ఒక యువ వ్యాపారవేత్త అత్యంత తెలిపిగా ఐపీఎల్లో రెండు జట్లకు యజమానిగా వ్యవహరిస్తున్నారు. అదే కాదు సోషల్ మీడియాలో ఆమె విపరీతంగా ట్రెండ్ అవుతున్నారు. మరి కొద్ది సేపట్లో గుజరాత్, బెంగళూరు జట్ల మధ్య జరిగే పోరులో ఎవరు గెలిచినా సరే ఆమెకు డబ్బులే డబ్బులు. దీని అంతటికి కారణం ఆమె రెండు జట్లలో పెట్టుబడులు పెట్టారు. ఆ పెట్టుబడులు పెట్టిన ఆ యువ వ్యాపారవేత్త పేరు అనన్య బిర్లా.

అనన్య బిర్లా వ్యాపారవేత్త మాత్రమే కాదు.. మోడల్ కూడా. ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును ఆదిత్య బిర్లా గ్రూప్ కన్సర్షియం కొనుగోలు చేసింది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ జట్టుతో బిర్లా ఎస్టేట్స్ కు భాగస్వామ్యం ఉంది. ఈ రెండిట్లో కూడా అనన్య భాగస్వామిగా ఉన్నారు. ఈమె ఏ జట్టుకు సపోర్ట్ చేస్తారో తెలియదు గాని.. ఏ జట్టు గెలిచినా సరే ఈమెకు డబ్బులే డబ్బులు. కాకపోతే గుజరాత్ జట్టు కెప్టెన్.. బెంగళూరు జట్టు ఆటగాడు విరాట్ కోహ్లీతో ఆమె దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తున్నాయి.

చిరంజీవి చేయాల్సిన ఆ రెండు సినిమాలను చేసి డిజాస్టర్లను అందుకున్న వెంకటేష్, బాలయ్య...

Chiranjeevi
Chiranjeevi

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యం ఉంటుంది. అందుకే ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వస్తుంటుంది. అలాంటి చిరంజీవి ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. తన నుంచి వచ్చే సినిమాలు యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా ఈ ఏజ్ లో కూడా అంత మంచిన్మోవీస్ చేస్తున్నాడు అంటే సినిమాలంటే అతనికి ఎంత ఇష్టమో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పటికి ఆయన చాలా రిస్కీ షాట్స్ డూప్ లేకుండానే చేస్తుంటాడు. అంటే ఆయన సినిమా మీద ఎంత ఎఫర్ట్ పెడతాడో మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తానికైతే చిరంజీవి లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం అనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సక్సెస్ లను సాధించినా కూడా చిరంజీవి రేంజ్ సక్సెసు లైతే పొందలేకపోయారు. బ్యాక్ టు బ్యాక్ ఆరు సంవత్సరాల్లో 6 ఇండస్ట్రీ హిట్లు కొట్టిన ఘనత కూడా తనకే దక్కుతుంది.

మరి అలాంటి చిరంజీవి చేయాల్సిన రెండు సినిమాలను బాలయ్య బాబు, వెంకటేష్ చేసి భారీ డిజాస్టర్ ను మూట గట్టుకున్నారనే విషయం మనలో చాలామందికి తెలియదు… కొదండ రామిరెడ్డి దర్శకత్వంలో బాలయ్య బాబు చేసిన ‘నిప్పురవ్వ’ సినిమా కథని మొదట చిరంజీవికి వినిపించారట.

అయితే చిరంజీవి అందులో కొన్ని మార్పులు చేర్పులు చేయమని అడగడంతో దర్శకుడు కోదండరామిరెడ్డి ఆ కథని బాలయ్య బాబు దగ్గరికి తీసుకెళ్లి సినిమా చేశారు. సినిమా ఓకే అనిపించుకున్నప్పటికి కలెక్షన్స్ మాత్రం ఏమీ రాలేదు. దాంతో సినిమా ప్లాప్ అయినట్టుగా తేల్చేశారు. ఇక వెంకటేష్ చేసిన సుభాష్ చంద్రబోస్ సినిమాని సైతం రాఘవేంద్రరావు మొదట చిరంజీవితోనే చేయాలనుకున్నారట.

చిరంజీవి ఆ కథను విని ఇది అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదని రాఘవేంద్రరావుకు చెప్పాడు. దాంతో హర్ట్ అయిన రాఘవేంద్రరావు వెంటనే ఆ కథని వెంకటేష్ దగ్గరికి తీసుకెళ్లి ఈ సినిమాను పట్టాలెక్కించాడు. మొత్తానికి ఈ సినిమాకి కూడా అల్ట్రా డిజాస్టర్ గా మిగలడంతో చిరంజీవి ఆ రెండు సినిమాలను వదిలేసి రెండు ఫ్లాప్ ల నుంచి తప్పించుకున్నాడు అంటూ అతని అభిమానులైతే ఆనందపడుతున్నారు…

డ్రాగన్ విషయంలో ప్రశాంత్ నీల్ లెక్క తప్పుతున్నాడా..?

Prashanth Neel
Prashanth Neel

Prashanth Neel: ఒక సినిమా కోసం ఎంత బడ్జెట్ కేటాయించాలి. ఆ సినిమా ఎంతవరకు కలెక్షన్స్ ని రాబడుతుందనే విషయంలో దర్శక నిర్మాతలు చాలా క్లారిటిగా ఉండాలి. అందులో ఏమాత్రం క్లారిటి మిస్ అయినా కూడా సినిమాకే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒక హీరో మార్కెట్ ఎంత దానిమీద మనం ఎంతవరకు బడ్జెట్ ని పెట్టొచ్చు సినిమా సక్సెస్ అయితే ఎంత రిటర్న్స్ వస్తాయి అనే అంచనా వేసుకున్న ప్రతి ప్రొడ్యూసర్ సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ని సాధిస్తూనే ఉన్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా బడ్జెట్ రోజుకి విపరీతంగా పెరిగిపోతుంది. మొదట 500 కోట్లతో స్టార్ట్ చేసిన ఈ సినిమాని ఇప్పుడు దాదాపు 700 కోట్ల వరకు బడ్జెట్ అయితే అవుతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమా మీద అలాగే జూనియర్ ఎన్టీఆర్ మీద అంత పెద్ద మొత్తంలో బడ్జెట్ పెట్టడం అనేది ఒక వంతుకు రిస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే దేవర సినిమాతో కేవలం 600 కోట్ల కలెక్షన్స్ ను మాత్రమే రాబట్టిన జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా విషయంలో అంతకంటే గొప్ప కలెక్షన్స్ ని రాబడతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక ఇంతకుముందు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేసిన ‘సలార్’ సినిమాకి 750 కోట్లపైగా కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఆ సినిమా సక్సెస్ టాక్ ను సంపాదించుకుంది కాబట్టి ఆ మొత్తంలో వసూలు చేసింది.

ఇక జూనియర్ ఎన్టీఆర్ సినిమా సక్సెస్ ఫుల్ టాక్ ను తెచ్చుకున్న కూడా ఇంత మొత్తంలో వసూళ్లను రాబడుతుందా 1000 కోట్లకు పైన కలెక్షన్స్ చేయగలిగితే మాత్రమే ఈ సినిమా భారీ విజయాన్ని సాధించినట్టు అలాగే ప్రొడ్యూసర్లు కూడా సేఫ్ జోన్ లో ఉంటారు.

అలా కాదని ఇష్టం వచ్చినట్టుగా బడ్జెట్ ను పెంచుకుంటూ పోతే మాత్రం సినిమా తేడా కొడితే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది… ఇక ఈ విషయంలోనే ప్రశాంత్ నీల్ లెక్క తప్పుతున్నాడా బడ్జెట్ ను సక్రమంగానే వినియోగిస్తున్నాడా? లేదంటే ఓవర్ బడ్జెట్ చేస్తున్నాడా అంటూ కొంతమంది సినిమా విమర్శకులు సైతం ప్రశాంత్ నీల్ ను విమర్శిస్తున్నారు…