Honda May sales success: హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI)కి 2026 మే విజయవంతమైన నెలగా గడిచింది. ఈ కంపెనీ ఈ నెలలో దేశీయంగా మొత్తం 5.18 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలను విక్రయించినట్లు తెలుస్తోంది. గత ఏడాది మే 2025లో నమోదైన 4.65 లక్షల యూనిట్లతో పోల్చితే గణనీయంగా పెరుగుదల అనుకోవచ్చు. వార్షిక ప్రాతిపదికన చూస్తే… 12 శాతం వృద్ధి రికార్డు అయింది.
అయితే ఈ వృద్ధికి అనేక కారణాలు ఉన్నాయి. హోండా స్థిరమైన బ్రాండ్ నమ్మకం, రీ సేల్స్ వినియోగదారులను బాగా ఆకర్షించింది. కంపెనీ రూపొందిస్తున్న విభిన్న మోడళ్ల ఉత్పత్తితో పాటు ఇంజిన్ పర్ఫార్మెన్స్ వినియోగదారుల డిమాండ్‌ను తీర్చడానికి సహాయపడినట్లు తెలుస్తోంది. అలాగే ప్రోత్సాహక ప్యాకేజీలు, ఫైనాన్సింగ్ ఆఫర్లు కూడా ఆకట్టుకున్నాయి.
ఎగుమతులలోనూ హోండా కంపెనీ 24 శాతం వృద్ధిని సాధించింది. 2026 మేలో కంపెనీ విదేశాలకు పంపిన ద్విచక్ర వాహనాల ఎగుమతులు సుమారు 59 వేల యూనిట్లకు చేరగా.. ఇది 2025 మేలోని సుమారు 47 వేల యూనిట్లుగా ఉంది. ఈ ఎగుమతి పెరుగుదల హోండా ఉత్పత్తుల విదేశీ ఆమోదం, అంతర్జాతీయ మార్కెట్లలో బ్రాండ్ గా ఉండడమే.
భవిష్యత్తును దృష్టిలోఉంచుకొని కంపెనీ ప్రత్యేకంగా రోడ్ మ్యాప్ వేసుకున్నట్లు సమాచారం. ఉత్పత్తుల నవీకరణలు, మార్కెట్,స్పెసిఫిక్ మోడళ్లను విడుదల చేయడం, అలాగే ఎగుమతులలో మరింత విస్తరణ ద్వారా గ్లోబల్ మార్కెట్లలో ఆధిపత్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తోంది.
2026 మేలో HMSI యొక్క 5.18 లక్షల దిగుబడి మరియు ఎగుమతుల్లో 24 శాతాల వృద్ధి కంపెనీకి స్థానికంగా , అంతర్జాతీయంగా బలమైన పోటీతత్వాన్ని ఇస్తోంది. వినియోగదారుల ఆధారిత డిమాండ్, సరఫరా సరళి నిర్వహణ సామర్థ్యం వంటివి ప్రణాళికంగాముందుకు వెళితే గమ్యాన్ని చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదని నిపుణులు అంటున్నారు.
