Desk Journalists Accreditation : డెస్క్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల జారీ విషయంలో ప్రభుత్వం సవరణ జీవో జారీ చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో పలు జిల్లాల సమాచార, పౌర సంబంధాల అధికారుల (డీపీఆర్వోలు) నిర్లక్ష్య ధోరణి కారణంగా ప్రక్రియ ముందుకు సాగడం లేదని డెస్క్ జర్నలిస్టుల సంఘం (డీజేఎస్) తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిని కలిసి సంఘం ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా డీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉపేందర్ మాట్లాడుతూ ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ కొన్ని జిల్లాల్లో డీపీఆర్వోలు వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఫలితంగా పలు జిల్లాల్లో డెస్క్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఇప్పటికీ ప్రారంభం కాలేదని తెలిపారు. దీంతో అర్హులైన జర్నలిస్టులు తీవ్ర అయోమయం, ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు.
మీడియా అకాడమీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లిన ప్రధాన డిమాండ్లలో దివ్యాంగ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ల జారీలో ప్రత్యేక కోటా కల్పించడం, సెంట్రల్ డెస్క్‌లలో పనిచేస్తున్న జర్నలిస్టులకు కేటాయించే కార్డుల సంఖ్యను పెంచడం వంటి అంశాలు ఉన్నాయి.
డీజేఎస్ ప్రతినిధుల విజ్ఞప్తులపై స్పందించిన మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, అన్ని అంశాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా దివ్యాంగ జర్నలిస్టుల ప్రత్యేక కోటా అంశాన్ని సానుకూలంగా పరిశీలిస్తామని తెలిపారు. అలాగే జీవో అమలులో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న జిల్లాల డీపీఆర్వోల వ్యవహారంపై సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్‌తో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు.
ఈ సమావేశంలో డీజేఎస్ రాష్ట్ర ప్రతినిధులు రాజారాం, రమేశ్, సత్యప్రసాద్, వెంకట్ రమణ, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా మంగళవారం ఐఅండ్‌పీఆర్ కమిషనరేట్‌లో రాష్ట్ర అక్రెడిటేషన్ కమిటీ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఇంకా అక్రెడిటేషన్ కార్డులు పొందని డెస్క్ జర్నలిస్టులందరూ హాజరై కమిటీ సభ్యులకు తమ వినతిపత్రాలు అందజేయాలని డీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉపేందర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో కమిషనరేట్‌కు తరలిరావాలని ఆయన కోరారు.
















ట్రంప్ కు కోపం వస్తే ఇలా ఉంటుందా.. వామ్మో అమెరికా వణికిపోయిందిగా..
Donald Trump Angry Reaction: ఎప్పుడు నవ్వుతాడో తెలియదు.. ఎప్పుడు కోపంగా ఉంటాడో తెలియదు.. అసలు ఏం చేస్తాడో తెలియదు.. ట్రంప్ గురించి వైట్ హౌస్ వర్గాలలో నిత్యం జరిగే చర్చ ఇది. ఆ మధ్య అమెరికన్ మీడియాలో ట్రంప్ వ్యవహార శైలి మీద కథనాల మీద కథనాలు వచ్చాయి అంటే.. అతడు ఎలా ఉంటున్నాడో అర్థం చేసుకోవచ్చు. ట్రంప్ అప్పటికప్పుడు నవ్వుతుంటాడు. అంతలోనే కోపాన్ని తెచ్చుకుంటాడు. ఆ తర్వాత ఏదైనా చేస్తుంటాడు. మొత్తానికి అపరిచితుడు పాత్రను కళ్ళ ముందు ఉంచుతాడు.
ట్రంప్ కోపం తెచ్చుకోవడం కొత్తకాదు. నవ్వడం కూడా కొత్త కాదు. కానీ ఈసారి ట్రంప్ లో కోపం తారస్థాయికి చేరింది. అతని ఆగ్రహానికి అమెరికా మొత్తం కంపించిపోయింది. అమెరికాలో ఎన్బిసి యాంకర్ క్రిస్టెన్ వెల్కర్ అనే జర్నలిస్ట్ ట్రంప్ తో ఇంటర్వ్యూ నిర్వహించాడు. ఈ సందర్భంగా రకరకాల ప్రశ్నలను వెల్కర్ అడిగారు. దానికి ట్రంప్ అసహనం వ్యక్తం చేశాడు. దీంతో ఈ ఇంటర్వ్యూ కాస్త మధ్యలోనే ముగిసిపోయింది.
ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు కాలిఫోర్నియా ఎన్నికల గురించి చర్చ వచ్చింది. ఆ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ట్రంప్ ఆరోపించాడు. దానికి వెల్కర్ ఆధారాలు ఉన్నాయా అని పదేపదే ప్రశ్నించారు. దీంతో ట్రంప్ లో ఆగ్రహం పెరిగిపోయింది. మరో మాటకు తావు లేకుండా మైక్ ను నేలకు విసిరి కొట్టాడు..”నువ్వు ఒక పనికిమాలిన వ్యక్తివి.. మీ పత్రిక రంగం మొత్తం అవినీతి మయంగా మారిపోయింది. మీట్ ది ప్రెస్ అనేది అత్యంత మోసపూరితం. ఇక ఇక్కడితోనే ఆపేద్దాం.. థాంక్యూ డార్లింగ్” అంటూ ట్రంప్ వెళ్ళిపోయాడు.
మీట్ ది ప్రెస్ లో గతంలో ట్రంప్ బాగానే మాట్లాడేవాడు. ముఖ్యంగా ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ట్రంప్ చాలా సమయమనంతో ఉండేవాడు. ఎప్పుడైతే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడో.. అమెరికా మీడియా మొత్తం ఇటీవల జరుగుతున్న పరిణామాల మీద ప్రశ్నించడం మొదలుపెట్టిందో ట్రంప్ అసహనం వ్యక్తం చేయడం మొదలుపెట్టాడు. దీంతో మీడియా కనిపించగానే ఇలా రుస రుసలాడుతున్నాడు. అంతేకాదు తన ఆగ్రహాన్ని ఈసారి ఏకంగా మైక్ విసిరి కొట్టి ప్రదర్శించాడు. దీంతో ట్రంప్ కు కోపం వస్తే ఇలా ఉంటుందా ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. మరోవైపు తన మైకు విసిరి కొట్టడాన్ని ట్రంప్ సమర్ధించుకోవడం విశేషం.