Home Blog Page 170

ఉందని మొత్తం విప్పి చూపించింది.. దొంగలు ఊరుకుంటారా.. ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం..

YouTuber Rachna Gurjar
YouTuber Rachna Gurjar

YouTuber Rachna Gurjar: జేబుకు లేకుండా పర్స్ కొట్టేస్తున్న రోజులు ఇవి. ఒంటికి చెమట చుక్క పట్టకుండా సులువుగా డబ్బులు సంపాదించాలని భావిస్తున్న రోజులు కూడా ఇవే. స్థూలంగా చెప్పాలంటే సాటి మనిషిని మోసం చేయడానికి.. అడ్డగోలుగా దోచుకోవడానికి.. నిలువు దోపిడీ చేయడానికి ఏమాత్రం వెనకాడని రోజులు కూడా ఇవే. అందువల్లే జాగ్రత్తలే తీసుకోవడం మాత్రమే కాదు.. కొన్ని సందర్భాలలో మనల్ని మనం కూడా నమ్మకూడని పరిస్థితులు వచ్చాయి.

ఆ మధ్య హైదరాబాదులో నేపాలి గ్యాంగ్ వరుస చోరీలకు పాల్పడింది. భారీ ఎత్తున బంగారాన్ని.. నగదును దోచుకెళ్ళింది. విశ్రాంత ఉద్యోగుల గృహాలను టార్గెట్ చేసి ఈ దారుణాలకు పాల్పడింది. ఆ తర్వాత పోలీసుల రంగంలోకి దిగి వారందరినీ అరెస్ట్ చేశారు. బంగారాన్ని.. నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇక ఆ తర్వాత నేపాల్ గ్యాంగ్లను ఎవరు కూడా పనిలో పెట్టుకోవడం లేదు. పోలీసులు కూడా నేపాలి దేశాన్ని చెందిన వారి మీద తీవ్రంగా దృష్టి సారించారు.. అయితే ఆ విశ్రాంతి ఉద్యోగులు నేపాలి పని మనుషులకు తమ ఇంట్లో ఉన్న బంగారాన్ని చూపించడం వల్లే ఈ దారుణాలు జరిగాయని పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఇప్పుడు ఇటువంటి పరిస్థితే యూట్యూబ్ రచన గుర్జర్ కు ఎదురైంది. ఈమెకు సోషల్ మీడియాలో పాపులారిటీ ఎక్కువ. పైగా ప్రచారాన్ని ఎక్కువగా కోరుకుంటూ ఉంటుంది. సోషల్ మీడియాలో తన ఇంట్లో ఉన్న నగలను మొత్తం చూపించింది. అది కాస్త ఆమెను చిక్కుల్లో పడేలా చేసింది. తన దగ్గర ఉన్న బంగారు ఆభరణాలను మొత్తం వీడియో తీసి ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీంతో దొంగలు ఆమె బంగారం చూసి ఆశ్చర్యపోయారు. ఎలాగైనా సరే దొంగిలించాలని భావించారు. తన ఇంట్లోకి వెళ్లి.. దర్జాగా బంగారాన్ని తస్కరించారు. దొంగలు తిరస్కరించిన బంగారం విలువ దాదాపు 6 లక్షల వరకు ఉంటుంది. అంతేకాదు, 1.91 లక్షల నగదు కూడా దొంగలు దోచుకెళ్ళారు. వాళ్ళ ఇంట్లో ఉన్న కూల్ డ్రింక్ కూడా తాగేసి పారిపోయారు.

ఇంట్లో ఉన్న బంగారు కనిపించకపోవడం.. నగదు లేకపోవడంతో రచన కన్నీరు మున్నీరు అయింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు ఆమె ఇంట్లోకి వచ్చారు. ఆధారాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజ్ లను చూశారు. అందులో దొంగలు కూల్ డ్రింక్ తాగిన దృశ్యాలు.. బంగారాన్ని దోచుకుని పోతున్న దృశ్యాలు కనిపించాయి. పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. దర్యాప్తు మొదలుపెట్టారు. సెలబ్రిటీలు అయినంతమాత్రాన సోషల్ మీడియాలో ఏది పడితే అది పోస్ట్ చేయకూడదని.. అలా చేస్తే దొంగలు ఇలా దోచుకుపోతారని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

టీమిండియా మ్యాచ్ ఆడుతుంటే ఇంతటి దారుణ పరిస్థితి ఎప్పుడూ చూడలేదు

Team India Match Shocking Situation
Team India Match Shocking Situation

Team India Match Shocking Situation: టీమిండియా క్రికెట్ మ్యాచ్ లు ఆడుతుంటే మైదానాలు అభిమానులతో సందడిగా మారుతుంటాయి. కొన్ని సందర్భాలలో మైదానంలో టికెట్లు సంపాదించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి టికెట్లు దొరకవు కూడా. సామాన్యులకే కాదు.. సెలబ్రిటీలకు కూడా ఇటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది.

మనదేశంలో క్రికెట్ అనేది ఒక మతం అయితే.. ప్రపంచంలోనే అత్యధికమంది ఆచరించే మతంగా కొనసాగుతుంది. దీన్నిబట్టి మనదేశంలో క్రికెట్ చూసే వాళ్ళ సంఖ్య ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పైగా మన దేశంలో క్రికెట్ మ్యాచ్ లకు విపరీతమైన ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. ఐపీఎల్ లాంటి ఫార్మాట్ ప్రపంచ స్థాయి ప్రఖ్యాతి సాధించడం.. లక్షల కోట్ల మార్కెట్ సొంతం చేసుకోవడం మామూలు విషయాలు కావు. ఇవన్నీ కూడా అభిమానులు ఆటకు విపరీతమైన ఆదరణ అందించడం వల్లే సాధ్యమయ్యాయి. అయితే మన దేశంలో క్రికెట్ కు గడ్డు రోజులు వచ్చాయేమో అనిపిస్తోంది.

ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో భారత్ ఏకైక టెస్ట్ ఆడుతోంది. చండీగఢ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో భారత్ దాదాపుగా విక్టరీ సాధించినట్టే. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఈ మ్యాచ్ చూసేందుకు అభిమానులు భారీగా తరలి రాలేదు. మొత్తంగా చూస్తే వెయ్యి మంది కూడా మైదానంలో లేరంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జనాలు లేకపోవడంతో స్టేడియాన్ని చూసి వ్యాఖ్యాతలు కూడా ఆశ్చర్యపోయారు.

“ఐపీఎల్ లో అభిమానులు భారీగా మైదానాలకు తరలివచ్చారు. ప్రతి మైదానం కూడా అభిమానుల రాకతో సందడిగా మారిపోయింది. కొన్ని సందర్భాలలో ఇసుకవేస్తే రాలనంతగా ఫ్యాన్స్ రావడంతో.. ఐపీఎల్ నిర్వాహకులు పండగ చేసుకున్నారు. అయితే ఐపీఎల్ ముగిసిపోయింది. ఇప్పుడు భారత్ ఆఫ్ఘనిస్తాన్ తో ఏకైక టెస్ట్ ఆడుతోంది. ఈ మ్యాచ్లో గిల్ సేన విక్టరీ దిశగా సాగుతున్నప్పటికీ.. ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో మ్యాచ్ అనగానే చాలామంది ఫ్యాన్స్ లో అంతగా ఆసక్తి అనిపించలేదు. అందువల్లే మ్యాచ్ చూసేందుకు పెద్దగా మైదానం లోకి రాలేదు. ఆఫ్గనిస్తాన్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ డొమెస్టిక్ మ్యాచ్ మాదిరిగా అనిపిస్తోంది అంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మా తల్లే ప్రియుడి కోసం అంత దారుణం చేశావా

Woman Accused Of Killing 5 Year Old
Woman Accused Of Killing 5 Year Old

Woman Accused Of Killing 5 Year Old: నేటి కాలంలో మనుషుల మధ్య కట్టుబాట్లు అనేవి ఉండడం లేదు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. చాటుమాటు సంబంధాల కోసం పరితపిస్తున్నారు. వివాహేతర వ్యవహారాలలో పీకల లోతు మునిగిపోయి.. కట్టుకున్న వాళ్లను.. కన్నవాళ్ళను దూరం చేసుకుంటున్నారు. కడుపున పుట్టిన వాళ్ళని కూడా కాదనుకుంటున్నారు. చివరికి వారిని అంతం చేసేందుకు కూడా వెనుకాడటం లేదు.

గతంలో ఇటువంటి దారుణాలకు మగవాళ్ళు మాత్రమే పాల్పడేవారు. కానీ ఇప్పుడు మగవాళ్ళని మించి ఆడవాళ్లు చేస్తున్నారు. ఇటీవల కేరళ రాష్ట్రంలో తన ప్రియుడితో ఉంటున్న ఓ వివాహిత.. కుమారుడిని అత్యంత దారుణంగా చంపేసింది. అతడి చేతిలోను విరిచేసింది. దాదాపు 150 కి పైగా గాయాలు చేసింది. ఈ ఘటనను మర్చిపోకముందే బెంగళూరులో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రియుడి కోసం తాను జన్మనిచ్చిన ఆరు సంవత్సరాల కుమార్తెను అత్యంత దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన 3 నెలల క్రితం జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కర్ణాటక రాష్ట్రంలోని దావా నగరే ప్రాంతానికి చెందిన ప్రవీణ్, ప్రియాంకకు 17 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.. వీరికి ఒక బాబు, ఒక పాప సంతానం. ఇటీవల ప్రియాంక దారితప్పింది. తన భార్య స్నేహితుడు మోహన్ తో వివాహేత్ర సంబంధం పెట్టుకుంది. ప్రియాంక వివాహం భర్త ప్రవీణ్ కు తెలిసింది. దీంతో అతడు ఆమెను మందలించాడు.

కుమారుడిని భర్త వద్ద వదిలిపెట్టి.. మోహన్ తో కలిసి ఉండడం ప్రారంభించింది. సరిగా మూడు నెలల క్రితం కుమార్తె మరణించింది అని ప్రవీణ్ కు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. అతడికి అనుమానం రావడంతో.. పోస్టుమార్టం నివేదికను పంపించింది. అయితే ఆ రిపోర్టును ప్రవీణ్ తన స్నేహితులకు పంపించాడు. అతడు ఒక వైద్యుడు. ఆ రిపోర్టు మొత్తం చదివి అందులో లోపల ఉన్నయని చెప్పాడు.. ఆహారం వికటించి పాప చనిపోయినట్టు రిపోర్టు రూపొందించాలని అతడు గుర్తించాడు.

ప్రవీణ్ ఈ విషయాన్ని పోలీసులు దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు పోస్టుమార్టం రిపోర్ట్ ఇచ్చిన ఆస్పత్రి మీద కేసు నమోదు చేశారు. మరొక ప్రియాంక ప్రియుడితో కలిసి మూడు నెలల క్రితమే ఆరు సంవత్సరాల కుమార్తెను చంపినట్టు తెలుస్తోంది. ప్రియాంక ప్రస్తుతం పరారీలో ఉంది. మోహన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కన్నతల్లి ప్రేమకే కళంకం తెచ్చిన ఈ దారుణం కర్ణాటక రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. కాగా, కుమార్తె తమ బంధానికి అడ్డుగా ఉందనే ప్రియాంక ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది.

విమానం కుప్పకూలిపోతుంటే ఎట్లా ఉంటుందో తెలుసా? వైరల్‌ వీడియో

Private Jet Crash Viral Video
Private Jet Crash Viral Video

Private Jet Crash Viral Video: విమానాలు కూలిపోవడం, హెలిక్యాప్టర్లు క్రాష్‌ అవడం ఇటీవల ఎక్కువగా జరుగుతున్నాయి. గతేడాది గుజరాత్‌లో విమానం టేకాఫ్‌ అయిన కొద్ది నిమిషాలకే మెడికల్‌ కాలేజీని ఢీకొని కూలిపోయింది. ఈ దృశ్యాలను అక్కడి వారు చిత్రీకరించారు. తాజాగా మరో విమానం ల్యాండింగ్‌ అవుతూ క్రాష్‌ అయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఏం జరిగిందంటే..?
డొమినికన్‌ రిపబ్లిక్‌లోని లా రొమానా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం జరిగిన భయానక ప్రమాదం భయాందోళనలు కలిగిస్తోంది. అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న ఒక ప్రైవేట్‌ జెట్‌ కూలిపోయి పైలట్, కోపైలట్‌ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. విమానం క్షణాల్లో భూమిని ఢీకొని మంటల్లో కాలిపోయిన దృశ్యం చూసేవారి ఒళ్లు గగ్గుర్లు పొడుస్తుంది.

ప్రమాదం ఎలా జరిగింది?
ప్రైవేట్‌ జెట్‌ అత్యవసరంగా ల్యాండ్‌ చేయడానికి ప్రయత్నం చేస్తుండగా లా రొమానా విమానాశ్రయంలోనే కూలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర సేవలు, అగ్నిమాపక బృందాలు స్థలానికి చేరుకొని కార్యకలాపాలు చేపట్టాయి. అయితే విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లను కాపాడక మరణించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. విమానం ఎందుకు అత్యవసర ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చింది, ఏయే సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి అనే విషయాలు ఇంకా దర్యాప్తు దశలో ఉన్నాయి.

ప్రమాదంపై దర్యాప్తు..
అధికారులు ప్రకారం, ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్, నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సేఫ్టీ బోర్డు ఈ ఘటనపై విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నాయి. విమానం ఫ్లైట్‌ డేటా రికార్డర్‌ను విశ్లేషించి, ప్రమాదానికి ముందు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. విమానం యజమాని, గమ్యస్థానం, ప్రయాణ ఉద్దేశం వంటి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు.

విమానం కూలిపోతుంటే ఎట్లా ఉంటుంది?
ఈ ప్రమాదం మనల్ని ఒక కఠినమైన ప్రశ్న వైపు నడిపిస్తుంది. విమానం కుప్పకూలిపోతుంటే ఎట్లా ఉంటుంది? ఆ క్షణాల్లో పైలట్లు ఏమనుకుంటారు? హఠాత్తుగా ఇంజిన్‌ శక్తి తగ్గడం, అలారాలు మోగడం, కంట్రోల్‌ లాస్‌ అయ్యే భావన… శరీరం అదుపు తప్పిన విమానం భూమి వైపు పడిపోతుంటే గుండెల్లో కలిగే ఆ భయం, ఆకాశం నుంచి భూమి వైపు వేగంగా పడుతున్న భారం, చివరి క్షణాల్లో ఏదైనా చేయాలనే తపన… ఇవన్నీ మనసును కలచివేస్తాయి. చాలా మంది పైలట్లు ఈ స్థితిలో కూడా కూల్‌గా ఉండి, విమానాన్ని కాపాడడానికి చివరి వరకు పోరాడతారు. కానీ ఆ క్షణాల్లో వారి మనసులో తప్పనిసరిగా కుటుంబం, ప్రియమైనవారు, జీవితం గురించిన ఆలోచనలు తిరుగుతాయి. కొంతమందికి ఇది కేవలం కొన్ని సెకన్ల విషయం కావచ్చు, కానీ ఆ సెకన్లు ఒక జీవితకాలంగా అనిపించవచ్చు.

ఆకాశయానం ఎంత సురక్షితంగా ఉన్నప్పటికీ, కొన్ని అనివార్యమైన క్షణాల్లో మానవ జీవితం ఎంత లేతగా ఉంటుందో. ఏవియేషన్‌ సేఫ్టీ, టెక్నాలజీ, పైలట్‌ శిక్షణలు ఎంత ముఖ్యమో ఈ ఘటన మళ్లీ గుర్తు చేస్తోంది.ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ ప్రమాదం వెనుక ఉన్న నిజమైన కారణాలు బయటపడాలి.

1,523 అధ్యాపక పోస్టులు.. కొన్ని గంటల్లో ముగియనున్న గడువు.. వెంటనే త్వరపడండి

Lecturer Posts Recruitment in AP
Lecturer Posts Recruitment in AP

Lecturer Posts Recruitment in AP: ఆంధ్రప్రదేశ్‌లోని 19 యూనివర్సిటీల్లో అధ్యాపకులు, లైబ్రేరియన్‌లు, లెక్చరర్ల పోస్టుల కోసం పెద్ద ఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదలైంది. మొత్తం 1,523 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులకు ఈరోజు (జూన్‌ 8, 2026) సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

ఏయే పోస్టులు ఉన్నాయి..
వివిధ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ లైబ్రేరియన్, లెక్చరర్‌ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులు రాష్ట్రంలోని 19 యూనివర్సిటీల్లో వివిధ శాఖలలో అందుబాటులో ఉన్నాయి.

అర్హతలు..
పోస్టు మేరకు అర్హతలు మారుతాయి. సాధారణంగా కావాల్సిన విద్యార్హతలు పీజీ(మాస్టర్స్‌ డిగ్రీ), పీహెచ్‌డీ / ఎంఫిల్, నెట్‌ / ఏపీ సెట్‌ / ఏపీ ఎస్‌ఎల్‌ఈటీలో ఉత్తీర్ణత సంబంధిత రంగంలో బోధనా / పరిశోధనా అనుభవం ఉండాలి. ప్రతీ పోస్టుకు సంబంధించిన వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో స్పష్టంగా ఉన్నాయి. అభ్యర్థులు తమ యూనివర్సిటీ, పోస్టును జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి.

ఎంపిక ప్రక్రియ ఇలా…
విద్యార్హతలు, పరిశోధనా అనుభవం, ప్రచురణలు మరియు రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష తేదీ త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.

ఇలా దరఖాస్తు చేయాలి..
ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ https://apuniversitiesrecruitment.apcfss.in/ కు వెళ్లాలి. రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసి, సరైన యూనివర్సిటీ, పోస్టును ఎంచుకోండి. అన్ని వివరాలు, డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చేసి ఫీజు చెల్లించాలి. తర్వాత దరఖాస్తు సమర్పిచాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసిన తర్వాత హార్డ్‌ కాపీ కూడా నిర్దేశిత చిరునామాకు పంపాల్సి ఉంటుంది (జూన్‌ 15 వరకు).

ఉన్నత విద్యా రంగంలో స్థిరపడే అపూర్వ అవకాశం. అర్హత ఉన్నవారు ఆలస్యం చేయకుండా ఈరోజే సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవడం మంచిది.

50 లక్షలు ఇచ్చినా.. అతడి చేతిలో తమిళ సీఎం విజయ్ ఓడిపోక తప్పలేదు

CM Vijay Meets R Praggnanandhaa
CM Vijay Meets R Praggnanandhaa

CM Vijay Meets R Praggnanandhaa: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఒక ఎత్తు వేస్తే.. అతడు అంతకు మించిన ఎత్తులు వేశాడు. మొదట్లో సిపాయితో ఎత్తులు వేశాడు. మద్దెలో గుర్రాన్ని ఉపయోగించాడు. కానీ అవి కూడా అతడిని కాపాడలేకపోయాయి. పైగా రాజు పీఠానికే ఎత్తుపెట్టడంతో.. విజయ్ చేతులెత్తేశాడు. ఇదంతా కూడా సినిమానో.. ఇంకోటో కాదు. ఇది తమిళనాడు సీఎం కార్యాలయంలో జరిగింది.

తమిళనాడు రాష్ట్రానికి చెందిన ప్రజ్ఞానంద నార్వే చెస్ టోర్నీ గెలిచాడు. ఈ ఘనత సాధించిన భారతీయుడిగా అతడు నిలిచాడు. ట్రోఫీ గెలిచిన అనంతరం అతడు నార్వే నుంచి నేరుగా తమిళనాడు వచ్చాడు. తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ ని ఆయన క్యాంపు కార్యాలయంలో సోమవారం కలిశాడు. ఈ సందర్భంగా విజయ్ అతడికి పుష్ప గుచ్చాన్ని అందించి ఘన స్వాగతం పలికాడు. తమిళనాడు ఘనతను.. భారతదేశ ప్రతిష్టను నిలిపారంటూ ప్రజ్ఞానంద ను అభినందించాడు విజయ్. అక్కడితోనే ఆగిపోలేదు.. అతడితో చెస్ ఆడాడు. విజయ్ కి చెస్ ఆడటం వచ్చు. విజయ్ ఒక ఎత్తు వేస్తే.. ప్రజ్ఞానంద అంతకుమించిన ఎత్తులు వేశాడు. అదే కాదు విజయ్ సిపాయిలను.. గుర్రాన్ని కూడా చంపేశాడు. విజయ్ కూడా తనదైన శైలిలో ప్రజ్ఞానంద సిపాయిలను మట్టుపెట్టాడు.

ప్రజ్ఞనంద సాధించిన ఘనతకు ముగ్ధుడైన విజయ్.. తమిళనాడు ప్రభుత్వం నుంచి 50 లక్షల రూపాయలను నజరానాగా అందించాడు. దానికి సంబంధించిన చెక్కు కూడా ప్రజ్ఞానందకు క్యాంపు కార్యాలయంలో అందించాడు. ఈ సందర్భంగా విజయ్ కి ప్రజ్ఞానంద ధన్యవాదాలు తెలియజేశాడు. అతడి తల్లిదండ్రులు కూడా విజయ్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజ్ఞానంద తమిళనాడు రాష్ట్రానికి చెందిన యువ చదరంగ క్రీడాకారుడు. ఇప్పటికే అనేక అంతర్జాతీయ టోర్నీలలో అతడు సత్తా చూపించాడు. చదరంగం క్రీడలో అత్యంత కఠినమైన నార్వే ట్రోఫీని గెలిచి సత్తా చూపించాడు ప్రజ్ఞానంద. తమిళనాడు రాష్ట్రానికి చెందిన విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రజ్ఞానంద.

ప్రజ్ఞానంద మొదట్లో ఈ స్థాయిలో ఉత్సాహంగా ఉండేవాడు కాదు. చదరంగం మీద ఆసక్తిని అతనికి కలిగేలా చేయడంలో తల్లి ముఖ్యపాత్ర పోషించింది. అతడు వెళ్లే ప్రతి టోర్నీలో వెంట ఉండేది. అతడు ఓడిపోయినప్పుడు గెలిచే విధంగా ప్రోత్సాహం అందించేది. గెలిచినప్పుడు మరింత గొప్పగా ఆడాలని స్ఫూర్తి నింపేది. అందువల్లే ప్రజ్ఞానంద ఇప్పుడు ఈ స్థాయిలో నిలిచాడు. ప్రపంచంలో గొప్ప గొప్ప క్రీడాకారులు కూడా సాధించలేనిది.. తన ఖాతాలో వేసుకొని.. సరికొత్త చరిత్ర సృష్టించాడు ప్రజ్ఞానంద. ప్రజ్ఞానంద నార్వే టోర్నీలో గెలిచిన సందర్భాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ప్రస్తావించారు. అతడు భారతదేశ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింప చేశాడని తన ట్విట్టర్ ఖాతాలు నరేంద్ర మోడీ ప్రస్తావించారు.

మళ్లీ యుద్ధ మేఘాలు.. ట్రంప్‌ వద్దన్న వినని ఇజ్రాయెల్‌.. ఇరాన్‌ పరస్పర దాడులు..

Israel Iran Mutual Attacks
Israel Iran Mutual Attacks

Israel Iran Mutual Attacks: మధ్యప్రాచ్యంలో మరోసారి మంట పుట్టింది. యుద్ధం ఉధృతమవుతోంది. ఏప్రిల్‌ 8న జరిగిన సున్నితమైన సీజ్‌ఫైర్‌ తర్వాత కొంతకాలం ఉద్రిక్తత తగ్గినట్లు కనిపించినా, ఇప్పుడు పరిస్థితి వేగంగా మారుతోంది. లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ జరిపిన దాడికి ప్రతీకారంగా ఆదివారం అర్థరాత్రి ఇరాన్‌ ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడి చేసింది. దీనికి ఇజ్రాయెల్‌ సోమవారం ఉదయం భారీ ప్రతిదాడితో స్పందించింది. ఈ ఘటనలు ఏప్రిల్‌ సీజ్‌ఫైర్‌ను పూర్తిగా ప్రమాదంలో పడేస్తున్నాయి.

ఇరాన్‌ దాడికి ప్రతీకారం..
ఇరాన్‌ ఉత్తర ఇజ్రాయెల్‌పై దాదాపు 10 క్షిపణులను ప్రయోగించింది. అదే సమయంలో ఇరాక్‌లోని కొన్ని ప్రాంతాలపై కూడా దాడులు జరిపినట్లు టెహ్రాన్‌ ప్రకటించింది. ఇజ్రాయెల్‌ రక్షణ దళాలు (ఐడీఎఫ్‌) ఈ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు తెలిపాయి. గణనీయమైన నష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం. అయితే ఇజ్రాయెల్‌ ఇక్కడ ఆగలేదు. సోమవారం ఉదయం ఇజ్రాయెల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఇరాన్‌లోని పశ్చిమ, మధ్య భాగాల్లోని సైనిక స్థావరాలు, రక్షణ సంబంధిత లక్ష్యాలపై భారీ ఎయిర్‌ స్ట్రైక్స్‌ చేపట్టింది. టెహ్రాన్, ఇస్పహాన్, తబ్రిజ్‌ నగరాల పరిసరాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఇరాన్‌ ఈ దాడుల్లో ఇజ్రాయెల్‌ ఎయిర్‌ లాంచ్డ్‌ బాలిస్టిక్‌ క్షిపణులను ఉపయోగించినట్లు ఆరోపించింది.

ట్రంప్‌ హెచ్చరికను ధిక్కరించిన ఇజ్రాయెల్‌
ఈ పరిణామాలపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుకు ఫోన్‌ చేసి స్పష్టమైన సందేశం ఇచ్చారు. ‘మనం శాంతి ఒప్పందానికి చాలా దగ్గరలో ఉన్నాం. ఇప్పటికే రెండు వైపులా దాడులు జరిగాయి. ఇక చర్చల వైపు మొగ్గు చూపండి’ అని వారించారు. ‘ఎవరికీ గణనీయమైన నష్టం జరగలేదు కాబట్టి ఎదురుదాడి అవసరం లేదు’ అని ట్రంప్‌ స్పష్టం చేశారు. ‘నేను షాట్స్‌ కాల్‌ చేస్తాను, బీబీ కాదు’ అని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

ట్రంప్‌ను పట్టించుకోని ఇజ్రాయెల్‌..
ట్రంప్‌ సలహాను ఇజ్రాయెల్‌ పట్టించుకోలేదు. తన జాతీయ భద్రతను తన చేతుల్లోనే ఉంచుకోవాలనే నిర్ణయంతో ఇజ్రాయెల్‌ ప్రతిదాడి చేపట్టింది. ఈ ఘటనలు ఏప్రిల్‌ సీజ్‌ఫైర్‌ తర్వాత మధ్యప్రాచ్యంలో వచ్చిన అత్యంత తీవ్రమైన ఎస్కలేషన్‌. ట్రంప్‌ పాలనలో ఇరాన్‌తో ఒక పెద్ద ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌ చేసిన ఈ చర్య, అమెరికా–ఇజ్రాయెల్‌ మధ్య సంబంధాల్లో కూడా ఉద్రిక్తతను సష్టించింది.

ఇజ్రాయెల్‌ మాత్రం తన భద్రతకు ఎలాంటి బెదిరింపు వచ్చినా తగిన స్పందన ఇస్తుంది. ఇరాన్, దాని మద్దతు గ్రూపులు హెజ్‌బొల్లా, హౌతీలు ఇజ్రాయెల్‌ను చుట్టుముట్టి ఉండటం వల్ల ఇజ్రాయెల్‌ ఎప్పుడూ ‘ఎదురు దెబ్బ’ విధానాన్ని అనుసరిస్తుంది. అయితే ఈ విధానం ప్రస్తుతం ట్రంప్‌ యొక్క డీల్‌–మేకింగ్‌ దక్పథంతో తీవ్రంగా ఢీకొంటోంది. ఈ ఘర్షణలు 47 ఏళ్ల చక్రంను మళ్లీ గుర్తు చేస్తున్నాయి. ఇరు వైపులా దాడులు జరిగిన తర్వాత చర్చలకు రావాలని ట్రంప్‌ చెబుతున్నా, ఇజ్రాయెల్‌ భద్రతా ఆందోళనలు ఆయన సలహాలను కొట్టేస్తున్నాయి.

ఇరాన్‌ గగనతలం మూసివేసింది. ఖతార్, సిరియా కూడా తమ ఎయిర్‌స్పేస్‌ను మూసేశాయి. ఇంధన ధరలు పెరగడం, స్ట్రైట్‌ ఆఫ్‌ హార్ముజ్‌ ద్వారా ఆయిల్‌ రవాణా సమస్యలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి ఇవన్నీ రాబోయే రోజుల్లో వాస్తవం కావచ్చు. ప్రస్తుతం రెండు వైపులా ఉన్న ధైర్యం, అసహనం మధ్యప్రాచ్య శాంతిని మళ్లీ దూరం చేస్తున్నాయి. ఇరు వైపులా సంయమనం చూపిస్తే మాత్రమే ఈ మంటలను అరికట్టవచ్చు.

భోగాపురం ఎయిర్ పోర్ట్.. విశాఖ ప్రజలకు రవాణా కష్టాలు!

Bhogapuram Airport Transportation Issues
Bhogapuram Airport Transportation Issues

Bhogapuram Airport Transportation Issues: మరో నెల రోజుల్లో ఉత్తరాంధ్ర ప్రజల కల సాకారం కానుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానుంది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించ బడునుంది. ఎప్పటికీ ప్రైవేటు ఎయిర్లైన్స్ తమ సర్వీసులను భోగాపురం నుంచి ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాయి. దాదాపు ప్రపంచ ప్రఖ్యాత ప్రైవేట్ ఎయిర్లైన్స్ తమ సర్వీస్ లను నడపనున్నాయి. కానీ విశాఖ తో పాటు నగరం అనుసంధానంగా ఉండే ప్రాంతాల నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కు ప్రయాణ భారం కానుంది. అంతర్గత రహదారులు ఉన్నా.. ట్రాఫిక్ సమస్యలను పరిష్కరిస్తేనే రవాణా ఇబ్బందులు తొలుగుతాయి. లేకుంటే చాలా ఇబ్బందికరమే. 50 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో రవాణాకు రెండు గంటల సమయం పట్టి అవకాశం ఉంది. విశాఖ నగరం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కు మూడు నుంచి నాలుగు మార్గాలు ఉన్నాయి. అయితే ట్రాఫిక్ సమస్య దృష్టిలో ఏ మార్గంలో వెళ్లిన గంటన్నరకు పైగా సమయం పట్టి అవకాశం ఉంది. దీనిపై అధికార యంత్రాంగం కూడా అధ్యయనం చేసినట్లు తెలుస్తోంది.

* విశాఖ నగరం నుంచి భోగాపురం ఎయిర్ పోర్టుకు ప్రధానంగా హనుమంతవాక, ఎండాడ, పీఎం పాలెం, మధురవాడ, కొమ్మాది, మారికవలస, అనంతపురం మీదుగా భోగాపురం వెళ్లాలంటే కచ్చితంగా 1.50 గంటల సమయం పట్టనుంది.

* అదే అనకాపల్లి నుంచి భోగాపురం చేరుకోవాలంటే 80 కిలోమీటర్లు ప్రయాణించాలి. గంటన్నరలోగా చేరుకోవచ్చు. దానికి కారణం జాతీయ రహదారి ఉండడమే. 16వ నెంబర్ జాతీయ రహదారి ఉంది. అనకాపల్లి నుంచి ఎన్ హెచ్ 16 బైపాస్ మీదుగా ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేరుకోవచ్చు..

* స్టీల్ ప్లాంట్ నుంచి బయలుదేరాలి అనుకుంటే.. విశాఖ నగరానికి టచ్ చేయకుండా లంకెలపాలెం, సబ్బవరం మీదుగా ఎన్హెచ్ 16 ఎక్కి ఆనందపురం నుంచి భోగాపురం వెళ్లడానికి 1. 40 గంటల సమయం పడుతుంది. గాజువాక నుంచి కూడా అంతే..

* విశాఖ నగరవాసులు భీమిలి మీదుగా చేరుకోవాలి అనుకున్నా గంటన్నర సమయం పడుతుంది.

* హనుమంతువాక నుంచి అడవివరం, ఆనందపురం మీదుగా భోగాపురానికి 1.40 గంటల సమయం పట్టి అవకాశం ఉంది.

* అయితేభో గాపురం ఎయిర్పోర్ట్ కు ప్రత్యేకంగా రోడ్డు మార్గం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు కఠిన ఆంక్షలు అమలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే విఎంఆర్డిఏ ఏడు రహదారులను ప్రతిపాదించింది. వాటిని అందుబాటులోకి తెస్తే కానీ.. భోగాపురం ఎయిర్పోర్ట్ కు ప్రయాణభారం తప్పదు.

మానవ్ సుతార్ కు మరో మూడు.. చండీగఢ్ టెస్టులో ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఎలా ఉందంటే..

Manav Suthar Rising Spin Star
Manav Suthar Rising Spin Star

Manav Suthar Rising Spin Star: మానవ్ సుతార్ అదరగొట్టాడు. చండీగఢ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరుగుతున్న ఏకైక టెస్టులో రెండవ రోజు మూడు వికెట్లు పడగొట్టాడు. మూడో రోజు కూడా మరో మూడు వికెట్లు సొంతం చేసుకుని.. మొత్తంగా ఆరు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు చుక్కలు చూపించాడు. అతడి బౌలింగ్ దూకుడు వల్ల పర్యాటక జట్టు కేవలం 152 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 412 పరుగుల లీడ్ లో కొనసాగుతోంది.

రెండవ రోజు ఆట ముగిసే సమయానికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు 5 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. ఇక మూడో రోజు ఆట మొదలుపెట్టిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు … సుతార్ దెబ్బకు తట్టుకోలేకపోయింది. కేవలం 152 పరుగులు మాత్రమే చేసి కుప్ప కూలిపోయింది. సుతార్ వేస్తున్న బంతులను ఎదుర్కోలేక ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.. ఆ జట్టులో కేవలం రహమద్ షా (60) మాత్రమే పరవాలేదు అనిపించాడు. టెస్టులలో భారత జట్టు మీద అర్థ శతకం చేసిన తొలి ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడిగా అతడు రికార్డు సృష్టించాడు.

సుతార్ దెబ్బకు మిగతా బ్యాటర్లు పెవిలియన్ క్యు కట్టారు. కేవలం 33 పరుగులు మాత్రమే ఇచ్చిన సుతార్ 6 వికెట్లు సాధించాడు. ప్రసిద్ధి కృష్ణ మూడు వికెట్లు సాధించాడు. వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ సాధించాడు. కాగా ఈ మ్యాచ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో భారత్ 564/8 పరుగులు చేసి.. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.

6 వికెట్లు సాధించడం ద్వారా సుతార్ సరికొత్త రికార్డును అందుకున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఇన్నింగ్స్ లోనే ఐదు వికెట్లు పడగొట్టిన తొలి ఇండియన్ బౌలర్ గా ఘనత అందుకున్నాడు. 2008లో అమిత్ మిశ్రా ఆస్ట్రేలియా జట్టు మీద (5/71) ఈ ఘనత సొంతం చేసుకున్నాడు. మరోవైపు ఈ మ్యాచ్లో భారీ లీడ్ అందుకున్న భారత్.. పర్యటక జట్టును ఫాలో అన్ ఆడిస్తోంది. లంచ్ బ్రేక్ తర్వాత ఆఫ్గనిస్తాన్ జట్టు 18/0 పరుగుల వద్ద ఉంది.. అటల్ 16*, మాలిక్ 2* క్రీజులో ఉన్నారు.

టీవీకే విజయ్ ని రాహుల్ గాంధీ ఇలా ముంచేశాడేంటీ..

TVK Vijay And Rahul Gandhi
TVK Vijay And Rahul Gandhi

TVK Vijay And Rahul Gandhi: మొన్న జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకున్నప్పటికీ.. అధికారాన్ని దక్కించుకునే స్థాయిలో స్థానాలను సొంతం చేసుకోలేకపోయింది. దీంతో అనేక రకాల పార్టీల సపోర్ట్ తీసుకోవాల్సి వచ్చింది విజయ్. ఇందులో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ డిఎంకె కూటమిలో ఉన్నప్పటికీ.. ఇండియా కూటమిని లీడ్ చేస్తున్నప్పటికీ.. విజయ్ పార్టీకి సపోర్ట్ చేసింది. ప్రభుత్వ ఏర్పాటులో సపోర్ట్ చేసింది.

విజయ్ కూడా రాహుల్ గాంధీ చేసిన సహాయాన్ని మర్చిపోక.. రాజ్యసభ ఎన్నికల్లో.. ప్రవీణ్ చక్రవర్తి అనే వ్యక్తికి టికెట్ ఇచ్చాడు. అతడు కాంగ్రెస్ పార్టీకి చెందిన వాడు. రాహుల్ గాంధీకి అత్యంత దగ్గరైనవాడు. తనకు సపోర్ట్ ఇచ్చినందుకు ఈ స్థాయిలో విజయ్ రుణం తీర్చుకున్నాడు. అయితే విజయ్ కి రాహుల్ గాంధీ కోలు కోలేని షాక్ ఇచ్చాడు. దీంతో తమిళనాడులో చర్చ మొదలైంది.

రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఢిల్లీలో కీలకమైన ఇండియా కూటమి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో ఇండియా కూటమిలో ఉన్న ఆప్, డీఎంకే మిగతా పార్టీలు హాజరయ్యాయి. అయితే ఈ సమావేశానికి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కి ఆహ్వానం లభించలేదు. కాంగ్రెస్ పార్టీకి ఇటీవల కాలంలో విజయ్ అత్యంత ఆప్తుడిగా మారిపోయాడు. అయినప్పటికీ ఆయనకు ఆహ్వానం లభించకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది.

విజయ్ ని పిలవకపోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇచ్చింది. పార్లమెంట్ లేదా రాజ్యసభలో ప్రాతినిధ్యం ఉన్న పార్టీలకు మాత్రమే ఈ సమావేశానికి ఆహ్వానం అందించామని కాంగ్రెస్ నేతలు చెప్పడం విశేషం. అయితే టీవీకే ఇంతవరకు అధికారికంగా ఇండియా కూటమిలో భాగస్వామి కాలేదు. అందువల్లే ఆయనకు ఆహ్వానం లభించలేదు అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.. కాంగ్రెస్ పార్టీ విజయ్ కి సపోర్ట్ ఇచ్చినప్పటికీ.. బహిరంగంగా మాత్రం ఆ స్థాయిలో అనుబంధాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రదర్శించడం లేదు.

తమిళనాడు ఎన్నికల్లో ఐదు స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ.. డీఎంకేకు హ్యాండ్ ఇచ్చింది. విజయ పార్టీకి సపోర్ట్ చేసింది. దీనిపై స్టాలిన్ కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం గా ఉన్నారు. అంతేకాదు ఇండియా కూటమి సమావేశాన్ని బహిష్కరించారు.. మరోవైపు విజయ్ కి ఆహ్వానం లభించకపోవడం తమిళనాడు రాజకీయాలలో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది.

ఒకరు ఎంపీ.. మరొకరు ఎమ్మెల్యే.. అయ్యన్నపాత్రుడుకు అరుదైన గౌరవం!

Ayyannapatrudu Receives Rare Honor
Ayyannapatrudu Receives Rare Honor

Ayyannapatrudu Receives Rare Honor: ఏపీలో ఇప్పుడు అందరి దృష్టి నర్సీపట్నం నియోజకవర్గం పై పడింది. అక్కడ టిడిపి నుంచి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా కూడా ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో తప్పుకుంటానని అయ్యన్నపాత్రుడు పలుమార్లు ప్రకటించారు. ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకుని కూడా ఇదే మాట చెప్పారు. వయసు రీత్యా అయ్యన్నపాత్రుడు క్రియాశీలక రాజకీయాలకు దూరం కావడం ఖాయం. ఎందుకంటే స్పీకర్ లాంటి గౌరవప్రదమైన, రాజ్యాంగబద్ధ పదవి అనుభవిస్తుండడంతో ఆయన పొలిటికల్ గా రిటైర్మెంట్ అవుతారు. అయితే ఆయన తరువాత నర్సీపట్నం నుంచి ఎవరు పోటీ చేస్తారు అనేది ఇప్పుడు ప్రశ్న. నిన్నటి వరకు ఆ నియోజకవర్గ బాధ్యతలు చూసేవారు ఆయన కుమారుడు విజయ్. ఇప్పుడు రాజ్యసభకు ఎంపిక కావడంతో మరింత యాక్టివ్ అవుతారు. కానీ నర్సీపట్నం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ ఆయనకు లేదు. ఎందుకంటే ఆయన ఆరేళ్లపాటు రాజ్యసభ పదవిలో ఉంటారు. అందుకే ఇప్పుడు నర్సీపట్నంపై పెద్ద చర్చ నడుస్తోంది.

టిడిపి ఆవిర్భావం నుంచి..
అయ్యన్నపాత్రుడు తెలుగుదేశం పార్టీకి అత్యంత వీర విధేయుడు. అదే సమయంలో ముక్కుసూటి మనిషి కూడా. టిడిపి ఆవిర్భావం నుంచి అదే పార్టీలో కొనసాగుతూ వచ్చారు అయ్యన్నపాత్రుడు. ఎన్ని పార్టీల నుంచి ఆహ్వానం వచ్చినా ఆయన మాత్రం వెళ్లలేదు. పార్టీ కష్ట కాలంలో ఉంటే సైలెంట్ గా ఊరుకోలేదు కూడా. తనలోనున్న ఫైర్ బ్రాండ్ ఎప్పటికీ తగ్గలేదు. అయితే తండ్రి మాదిరిగానే దూకుడుగా ఉండేవారు విజయ్. అదే ఆయనకు కలిసి వచ్చింది. రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసేందుకు దోహద పడింది. సుదీర్ఘకాలం ఐటీడీపీకి సేవలు అందించారు విజయ్. ఈ క్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కేసులతో వెంటాడిన భయపడలేదు. వచ్చే ఎన్నికల్లో నర్సీపట్నం నుంచి విజయ్ పోటీ చేస్తారని అంతా ప్రచారం నడిచింది. కానీ ఇప్పుడు రాజ్యసభకు ఎంపిక కావడంతో అయ్యన్న వారసుడు ఎవరు అనేది ప్రశ్న.

రెండో కుమారుడికి ఛాన్స్…
2029 ఎన్నికల నాటికి విజయ్ తన రాజ్యసభ పదవిని మూడేళ్ల పాటు పూర్తి చేసుకుంటారు. అప్పటికి మూడేళ్ల సమయం ఉంటుంది ఆయనకు. అయితే రాజ్యసభకు రాజీనామా చేసి టిడిపి అభ్యర్థిగా బరిలో దిగుతారా? ఆ రాజ్యసభ పదవికి వేరొకరికి ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. పోనీ విజయ్ కాకుంటే ఇతర నేతలకు టికెట్ ఇస్తామంటే.. అయ్యన్న కుటుంబానికి కాదని టిడిపి శ్రేణులు ఆదరించే అవకాశమే లేదు. అయితే అయ్యన్నపాత్రుడు రెండో కుమారుడు రాజేష్ ఉన్నారు. ప్రస్తుతం నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిలర్ గా వ్యవహరిస్తున్నారు. రాజేష్ ను పోటీలో పెట్టి అయ్యన్నపాత్రుడు తో పాటు విజయ్ గెలిపించుకుంటారన్న టాక్ ఉంది.. మొత్తానికి అయితే అయ్యన్నపాత్రుడు తన పెద్ద కుమారుడిని రాజ్యసభకు పంపించి.. చిన్న కుమారుడిని ఎమ్మెల్యేగా చేసి.. పిల్లలిద్దరి రాజకీయ భవిష్యత్తును చూసి ఆనందిస్తారన్నమాట. కానీ చాలా రాజకీయ కుటుంబాలు ఉన్నాయి కానీ.. అయ్యన్నపాత్రుడు లాంటి అవకాశం ఎవరికీ దక్కదన్న మాట.

ఉత్తరాంధ్రలో లోకేష్ టీం రెడీ!

Nara Lokesh Mangalagiri
Nara Lokesh Mangalagiri

Nara Lokesh Team Ready In Uttarandhra: ఏపీ రాజకీయాల్లో ఉత్తరాంధ్ర కీలకం. ఉత్తరాంధ్రలో ఏ పార్టీ మెజారిటీ సీట్లు దక్కించుకుంటే అదే పార్టీ అధికారంలోకి రాగలదు. ప్రధానంగా ఉత్తరాంధ్రలో బిసి వర్గాలు అధికం. మత్స్యకారులు కూడా ఉన్నారు. గిరిజనులు కూడా నివసిస్తున్నారు. అయితే ప్రతి రాజకీయ పార్టీ ఉత్తరాంధ్రను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అదే పనిలో ఉంది. ఉత్తరాంధ్రలో యువనాయకత్వానికి ప్రోత్సాహం అందించడం ద్వారా.. వచ్చే ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించాలని చూస్తోంది. ఆపై తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసి.. మరో నాలుగు దశాబ్దాల పాటు అవసరమైన నాయకత్వాన్ని అందించాలని భావిస్తోంది. అందులో భాగమే చింతకాయల విజయ్ కు రాజ్యసభ పదవి. ఒక్క మాటలో చెప్పాలంటే లోకేష్ టీం ఉత్తరాంధ్రలో రంగంలోకి దిగిందన్నమాట. 2024 ఎన్నికల తరువాత తీసుకున్న నిర్ణయాలు చూస్తే టిడిపి యువతకు పెద్దపీట వేసినట్టే.

కింజరాపు రామ్మోహన్ నాయుడు..
కచ్చితంగా తెలుగుదేశం పార్టీలో యువనేతల్లో లోకేష్ తర్వాత ఎవరు? అంటే ముందుగా గుర్తొచ్చేది కింజరాపు రామ్మోహన్ నాయుడు. పార్టీలో కూడా విపరీతమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు రామ్మోహన్ నాయుడు. కేవలం యువనేతలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో శ్రీకాకుళం పార్లమెంటు స్థానం నుంచి మూడోసారి గెలిచిన రామ్మోహన్ నాయుడుకు కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించారు. కీలకమైన పౌర విమానయాన శాఖను అందించారు. మరోవైపు మొన్నటి ఎన్నికల్లో గజపతినగరం నుంచి యువకుడైన కొండపల్లి శ్రీనివాస్ కు అవకాశం ఇచ్చారు. రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి చింతకాయల విజయ్ ను రాజ్యసభకు పంపించారు. ఉత్తరాంధ్రలో బలోపేతం కావడంతో పాటు టిడిపికి భవిష్యత్తు నాయకత్వం అందించేందుకుగాను ఈ నిర్ణయాలు అన్నట్టు ఉన్నాయి. వీరు మాత్రమే కాదు దాదాపు నేతల వారసులందరికీ ఛాన్స్ అందించింది టిడిపి.

చంద్రబాబుకు మాదిరిగానే..
ఉత్తరాంధ్రలో మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఐదు వరకు పార్లమెంటు సీట్లు కూడా ఉన్నాయి. మొన్నటి ఎన్నికల్లో 32 అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకుంది టిడిపి కూటమి. నాలుగు పార్లమెంటు స్థానాలను దక్కించుకుంది. అయితే ఇదే దూకుడు కొనసాగాలి అంటే యువనాయకత్వం రావాలి అన్న ఆలోచనలో టిడిపి ఉంది. అందుకే కింజరాపు రామ్మోహన్ నాయుడు, కొండపల్లి శ్రీనివాస్, చింతకాయల విజయ్ వంటివారికి ఎనలేని ప్రాధాన్యమిస్తోంది. పైగా వీరంతా లోకేష్ టీమ్ గా ముద్ర ఉంది. ఆముద్రను బలంగా చాటుకోవాలని భావిస్తోంది. గతంలో చంద్రబాబు నాయుడుకు వలయంగా ఉండేవారు కింజరాపు ఎర్రన్నాయుడు, కళా వెంకట్రావు, అయ్యన్నపాత్రుడు, అశోక్ గజపతిరాజు లాంటివారు. ఇప్పుడు వారు వారసులు రంగంలోకి వచ్చారు లోకేష్ కోసం. మొత్తానికైతే చాప కింద నీరులా లోకేష్ టీం విస్తరిస్తోంది ఉత్తరాంధ్రలో..

బాలయ్య ఆ సినిమాలకు బాగా సెట్ అవుతాడు కానీ ఎందుకు చేయడం లేదు..

Balakrishna Suitable Movie Genres
Balakrishna Suitable Movie Genres

Balakrishna Suitable Movie Genres:తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలయ్య బాబు చేసిన సినిమాలు చాలా ప్రత్యేకంగా నిలుస్తున్నాయనే చెప్పాలి. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఆయన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇక బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…

ఈ సినిమా పూర్తయిన తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన థ్రిల్లర్ జానర్ లో మాత్రం సినిమా అయితే చేయడం లేదు. కారణం ఏంటి అంటే ఆయనతో థ్రిల్లర్ సినిమాలు చేస్తే ఎవరు చూస్తారు అనే ధోరణిలోనే కొన్ని అభిప్రాలైతే వ్యక్తమవుతున్నాయి. నిజానికి బాలయ్య బాబు మంచి నటుడు ఎలాంటి క్యారెక్టర్ లో అయిన నటించి మెప్పించగలిగే కెపాసిటి ఆయన సొంతం…

అలాంటి బాలయ్య బాబు డిఫరెంట్ సినిమాలో ఎందుకు చేయడం లేదు… అలాంటి కథలు వస్తే బాలయ్య రిజెక్ట్ చేస్తున్నాడా? లేదంటే కావాలనే అతని దగ్గరికి అలాంటి కథలను తీసుకెళ్లడం లేదా కథల విషయంలో ఏం జరుగుతుంది? ప్రేక్షకులు అతని నుంచి ఏం కోరుకుంటున్నారు.

కేవలం కమర్షియల్ ఎంటర్ టైనర్లు మాత్రమే కావాలని కోరుకుంటున్నారా? లేదా వైవిద్య భరితమైన కథలను కూడా తన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే బాలయ్య బాబు ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు… మొత్తానికైతే ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో ఆయన కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. అందుకే ఆయన ఎక్స్పరిమెంట్లు కూడా చేయడం లేదు.

థ్రిల్లర్ జానర్ లో ఎవరైనా కథలను తీసుకువస్తే చేయడానికి తను రెడీగా ఉన్నాడు. కానీ ఇప్పటివరకు ఎవరైతే అలాంటి కథలను తీసుకురాలేదనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు… ఇకమీదట బాలయ్య ఏదైనా ఎక్స్పరిమెంట్లు చేసే అవకాశం ఉందా లేదంటే ఇలాగే కమర్షియల్ సినిమాలను నమ్ముకొని ముందుకు సాగుతాడా అనేది…

కాంగ్రెస్ కు ఓకే చెప్పిన జగన్.. మధ్యలో డీకే!

YS Jagan
YS Jagan

Jagan Congress Alliance Talks: ఏపీలో విచిత్ర రాజకీయాలు నడుస్తున్నాయి. టిడిపి కూటమి అధికారంలో ఉంది. ఇందులో బిజెపి భాగస్వామిగా ఉంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. బిజెపి నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వంలో టిడిపి తో పాటు జనసేన కీలక భాగస్వామిగా ఉన్నాయి. జాతీయస్థాయిలో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఉంది. అయితే టిడిపి తో పాటు జనసేన ను వ్యతిరేకిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఏపీలో. కేంద్రంలో ఎన్డీఏను పల్లెత్తు మాట అనడం లేదు. రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ను మాత్రం విమర్శిస్తున్నారు జగన్. బిజెపితో పరోక్ష స్నేహం కొనసాగిస్తున్నారు అనేది రాజకీయ కామెంట్. కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకతతోనే ఆయన విషయంలో బిజెపి సాఫ్ట్ కార్నర్ ఉందన్నది బహిరంగ రహస్యం. అయితే ఇప్పుడు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ సమయంలో బిజెపితో పరోక్ష స్నేహం అనే మాట ప్రజల్లోకి వెళితే తనకు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని తెలుసు. అందుకే ఇప్పుడు ఆయన ఆలోచన మారినట్లు తెలుస్తోంది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు నడుస్తుండడంతో.. కాంగ్రెస్ తో స్నేహం చేస్తే ఎలా ఉంటుందోనని ఒక ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

వైయస్ కుటుంబంతో సాన్నిహిత్యం..
జగన్ మనసు మారడం వెనుక కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఉన్నారని పొలిటికల్ వర్గాల్లో ఒక ప్రచారం ఉంది. డీకే శివకుమార్ వైయస్సార్ కుటుంబ సన్నిహితుడు. వ్యాపార భాగస్వామి కూడా. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీలో ఎదుగుతూ వచ్చారు. ఆయన ఎదుగుదల వెనుక రాజశేఖర్ రెడ్డి ఉన్నారనే ఒక టాక్ ఉంది. ఇప్పుడు ఆ కుటుంబం పై అభిమానంతోనే డీకే శివకుమార్ జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ గూటికి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. బిజెపి దాదాపు జగన్మోహన్ రెడ్డికి తలుపులు మూసినట్టే. ఆపై పొత్తు కూడా కొనసాగనుంది ఆ మూడు పార్టీల మధ్య. అందుకే ఇప్పుడు ఏదైనా కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి పై ఏర్పడింది.

కేవలం ఆ భయంతోనే..
జగన్మోహన్ రెడ్డిలో ఒక భయం వెంటాడుతోంది. కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయితే ఏపీలో తన ఓటు బ్యాంకు కచ్చితంగా టర్న్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బలపడుతుందా? ఎప్పుడు చేరుదామా? అన్న రీతిలో చాలామంది వైసిపి నేతలు ఉన్నారు. ఎందుకంటే వైసీపీలో ఉన్న 90 శాతం నేతలు, క్యాడర్ కాంగ్రెస్ పార్టీదే. అందుకే జగన్మోహన్ రెడ్డిలో కూడా భయం వెంటాడుతోంది. మరోవైపు జాతీయ స్థాయిలో ఒంటరిగా ఉంటే ఎటు కాకుండా పోతామన్న భయం ఆయనలో ఉంది. పైగా ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టారు. ఆయనతో ఉన్న సాన్నిహిత్యంతో కాంగ్రెస్ పార్టీకి దగ్గర కావాలన్న ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో డీకే శివకుమార్ తో జగన్మోహన్ రెడ్డి భేటీ అవుతారని ప్రచారం సాగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం!

Pawan Kalyan
Pawan Kalyan

Pawan Kalyan Sensational Decision: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీపై పూర్తి ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా నేతల మధ్య విభేదాలు, కూటమి పార్టీలతో సమన్వయం, సొంత అజెండాతో ముందుకెళ్లే నాయకుల విషయంలో దృష్టి సారించారు. చాలా జిల్లాల్లో ఇటువంటి పరిస్థితి ఉండడాన్ని గమనించారు. అందుకే దిద్దుబాటు చర్యలకు దిగుతున్నారు. తాజాగా నెల్లూరులో పార్టీ కమిటీలన్నింటినీ రద్దు చేశారు. కేంద్ర కార్యాలయం నుంచి అధినేత పవన్ పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే మొన్ననే ప్రకాశం జిల్లాలో కమిటీలన్నింటినీ రద్దు చేశారు. పార్టీ నేతలను రాజమండ్రి కి పిలిచి మరి క్లాస్ పీకారు. ముఖ్యంగా జనసేన నేతలు వర్గ విభేదాలకు అవకాశం కల్పిస్తున్నారు. సొంత అజెండాతో ముందుకు వెళుతున్నారు. అందుకే పవన్ కఠిన చర్యలకు దిగుతున్నారు.

ఆ కమిటీల సిఫారసుతోనే..
మొన్న ఆ మధ్యన రీజియన్ల వారీగా పార్టీ స్థానిక స్థితిగతులపై తెలుసుకునేందుకు కమిటీలను నియమించిన సంగతి తెలిసిందే. ప్రకాశం, నెల్లూరుతో పాటు రాయలసీమ బాధ్యతలను మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి అప్పగించారు. ఆ కమిటీ ప్రత్యేకంగా సమావేశం అయింది పార్టీ శ్రేణులతో. ఈ సందర్భంగా కొంతమంది జనసేన నేతలు దూకుడుగా వ్యవహరించారు. పార్టీ నాయకత్వం ఆదేశాలు లెక్కలేనివిగా భావించి.. బాహటంగానే విమర్శలు చేశారు. దీంతో ఆ సమావేశం హాట్ హాట్ గా సాగింది. దీనిపై హై కమాండ్ కు ఫిర్యాదులు వెళ్లడంతో పవన్ ఒక్కో జిల్లా నేతలపై వేటు వేస్తున్నారు.

అధినేత పేరుతో ప్రకటన..
పవన్ పేరుతో ప్రత్యేక ప్రకటన జారీ అయింది. నెల్లూరు జిల్లాలోని జనసేన నేతల మధ్య విభేదాలు, వారి క్రమశిక్షణ రహిత చర్యలు కారణంగా జనసేన కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని ఆ ప్రకటనలో ఉంది. అందుకే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని జిల్లా, నగర, మండలాలతో పాటు గ్రామస్థాయి కమిటీలను రద్దు చేస్తున్నట్లు ఆ ప్రకటనలో ఉంది. తక్షణం ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని జనసేన స్పష్టం చేసింది. ఉమ్మడి నెల్లూరు జిల్లా సమన్వయ బాధ్యతలు చూస్తున్న నేతలతోపాటు కమిటీలోని ఇతర సభ్యులను కూడా వారికి నిర్దేశించిన బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు జనసేన స్పష్టం చేసింది. క్రమశిక్షణ లేకపోతే వ్యవస్థలను సక్రమంగా నిర్వహించలేమని అభిప్రాయపడింది. జనసేన అధినేత పవన్ పేరుతో ఈ ప్రకటన విడుదల కావడం విశేషం. కేవలం క్రమశిక్షణలోపించిందనే కారణం చూపడం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. మొన్న ప్రకాశం, నేడు నెల్లూరు, రేపు ఏ జిల్లా పై పవన్ ఫోకస్ పెడతారో అన్న చర్చ జనసేనలో జోరుగా సాగుతోంది.

ఎయిర్ కూల్డ్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ల బైక్ ల మధ్య తేడా ఏంటీ.. ఎవరికి ఏది బెస్ట్..

Air Cooled Vs Liquid Cooled Engine Bikes
Air Cooled Vs Liquid Cooled Engine Bikes

Air Cooled Vs Liquid Cooled Engine Bikes: కొత్తగా బైక్ కోనే వారు ధర, డిజైన్, మైలేజ్ వంటి వాటిని మాత్రమే చూస్తారు. వీటి ఇంజిన్ గురించి కొందరు మాత్రమే పరిశీలిస్తారు. అయితే ఇంజిన్ గురించి తెలుసుకునే సమయంలో ఎయిర్ కూల్డ్ (Air-Cooled) ఇంజిన్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ (Liquid-Cooled) అనే విషయాలను తెలుసుకోవాలి. మార్కెట్లో ఉన్న బైకుల్లో ‘లిక్విడ్ కూల్డ్’ తో పాటు ‘ఎయిర్ కూల్డ్’ ఇంజిన్లు ఉన్నాయి. అయితే వీటి మధ్య ఉన్న తేడాలేంటి? ఏది కొంటే బెటర్?

ఎయిర్ కూల్డ్ ఇంజిన్:
ఎయిర్ కూల్డ్ ఇంజిన్లు చాలా కాలంగా వాడుకలో ఉన్నాయి. వీటి పనితీరు చాలా సరళంగా ఉంటుంది. బైక్ నడుస్తున్నప్పుడు బయట గాలి ఇంజిన్ పైన ఉండే ‘ఫిన్స్’ గుండా ప్రవహించి, ఇంజిన్ వేడిని తగ్గిస్తుంది. ఇవి తక్కువ బరువును కలిగి ఉంటాయి. అలాగే వీటి మెయింటెనెన్స్ ఖర్చు కూడా తక్కువ. అయితే, ట్రాఫిక్‌లో బైక్ ఆగి ఉన్నప్పుడు గాలి ప్రసరణ ఉండదు కాబట్టి ఇంజిన్ త్వరగా వేడెక్కే అవకాశం ఉంది. కాబట్టి ఇవి సాధారణ సిటీ ప్రయాణాలకు, తక్కువ సామర్థ్యం గల బైక్‌లకు బాగా సరిపోతాయి.

లిక్విడ్ కూల్డ్ ఇంజిన్:
లిక్విడ్ కూల్డ్ ఇంజిన్లు ఆధునిక సాంకేతికతతో పనిచేస్తాయి. ఇందులో ఇంజిన్ చుట్టూ కూలెంట్ (Coolant) అనే ద్రవం ప్రవహించే పైపులు ఉంటాయి. ఈ కూలెంట్ ఇంజిన్‌లోని వేడిని గ్రహించి, రేడియేటర్ ద్వారా బయటకు పంపుతుంది. ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు కూడా ఫ్యాన్ సాయంతో ఇంజిన్ ఉష్ణోగ్రతను ఇది స్థిరంగా ఉంచుతుంది. ఎక్కువ సేపు ప్రయాణించినా లేదా వేగంగా నడిపినా ఇంజిన్ సామర్థ్యం తగ్గదు. అందుకే స్పోర్ట్స్ బైక్‌లు, హై-పెర్ఫార్మెన్స్ ఇంజిన్లలో వీటిని ఉపయోగిస్తారు.

ఏది బెస్ట్?
పనితీరు పరంగా చూస్తే.. లిక్విడ్ కూల్డ్ ఇంజిన్లు ఎయిర్ కూల్డ్ కంటే మెరుగైనవి. ఎయిర్ కూల్డ్ ఇంజిన్లు వేసవిలో లేదా ట్రాఫిక్ జామ్‌లలో వేడెక్కినప్పుడు ఇంజిన్ పవర్ తగ్గిపోతుంది. కానీ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఇంజిన్‌ను ఎప్పుడూ సరైన ఉష్ణోగ్రత వద్ద ఉంచి, అత్యుత్తమ పవర్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. అయితే, లిక్విడ్ కూల్డ్ బైక్‌లలో కూలెంట్ లెవల్స్ చెక్ చేసుకోవడం, రేడియేటర్ నిర్వహణ వంటి అదనపు బాధ్యతలు ఉంటాయి.దీనివల్ల మెయింటెనెన్స్ ఖర్చు కొంత ఎక్కువగా ఉంటుంది. సిటీలో తక్కువ దూరం ప్రయాణించే వారైతే ,తక్కువ నిర్వహణ ఖర్చు కోరుకుంటే ఎయిర్ కూల్డ్ బైక్ సరిపోతుంది.

వాడీవేడి ఇంటర్వ్యూ: ప్రశ్నించిన యాంకర్.. మైక్ పడేసి వెళ్లిపోయిన ట్రంప్.. వైరల్ వీడియో

Trump Walks Out Of Interview
Trump Walks Out Of Interview

Trump Walks Out Of Interview: అంతటి ట్రంప్ తట్టుకోలేకపోయాడు. ఆమె ప్రశ్నలు ఎదుర్కోలేకపోయాడు. సమాధానం చెప్పే తెలివిలేక పారిపోయాడు. మైక్ కింద పడేసి తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. థాంక్యూ డార్లింగ్ అంటూ తన కోపాన్ని మరో రూపంలో ప్రదర్శించాడు. ట్రంప్ ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడానికి.. ఈ స్థాయిలో అసహనం ప్రదర్శించడానికి అసలైన కారణం ఒకే ఒక్క యాంకర్. ఇప్పుడు ఆమె పేరు ప్రపంచ వ్యాప్తంగా మారు మోగిపోతుంది.

అంతటి ట్రంప్ మూసుకొని పోయాడంటే.. దానికి ప్రధాన కారణం క్రిస్టెన్ వెల్కర్. ఆమె ఎన్ బీసీ అనే న్యూస్ ఛానల్లో పని చేస్తూ ఉంటారు.. ఓపెన్ గా మాట్లాడటం.. ఎవిడెన్స్ తో ప్రశ్నించడం.. పూర్తిస్థాయి సమాచారంతోనే వివరాలు సేకరించడం ఆమెకు మొదటి నుంచి అలవాటు. అందువల్లే అమెరికన్ మీడియా సర్కిల్స్లో ఆమెకు మంచి పేరు ఉంది. అటువంటి వెల్కర్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు చుక్కలు చూపించింది. వాస్తవానికి ట్రంప్ ముందు మాట్లాడాలి అంటే ఎంతటి పాత్రికేయులైన సరే భయపడిపోతుంటారు. కానీ వెల్కర్ అలా కాదు. ఆమె మాట సూటిగా ఉంటుంది. ప్రశ్నించే స్వభావం పదునుగా ఉంటుంది. అందువల్లే ట్రంప్ కూడా ఆమె ప్రశ్నలను తట్టుకోలేకపోయాడు.

ప్రధానంగా 2020 అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగినట్టు ట్రంప్ ఆరోపణలు చేశాడు. దానికి వెల్కర్ ఆధారాలు చూపాలంటూ ఆయనను పదేపదే అడిగారు. అయితే ఆధారాలు లేకపోవడంతో ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు ట్రంప్. అయినప్పటికీ వెల్కర్ వెనకడుగు వేయలేదు. మళ్లీ మళ్లీ అదే ప్రశ్న వేయడంతో ముఖాముఖి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ట్రంప్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అసహనాన్ని ప్రదర్శిస్తూ.. తన కోటుకు ఉన్న మైక్.. వైర్లెస్ ట్రాన్స్మిటర్ ను లాగేసి.. కిందపడేసి వెళ్లిపోయాడు.

ట్రంప్ అలా చేస్తున్నప్పటికీ వెల్కర్ ఏ మాత్రం సహనం కోల్పోలేదు. పైగా అతడి అసలు రూపాన్ని ప్రపంచానికి చూపించాలని నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయింది. వెల్కర్ 1976 జూలై 1న అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో జన్మించింది. ఈమెకు చిన్నప్పటినుంచే జర్నలిజం మీద ఇంట్రస్ట్ ఉండేది. అమెరికాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన హర్వర్డ్ యూనివర్సిటీలో హిస్టరీ చదివారు. ఆ తర్వాత జర్నలిజాన్ని తన వృత్తిగా ఎంచుకున్నారు. స్థానికంగా ఉన్న న్యూస్ ఛానల్స్ లో రిపోర్టర్ గా తన జీవితాన్ని మొదలుపెట్టారు. 2010లో ఆమెకు ఎన్బీసీ ఛానల్ లో పనిచేసే అవకాశం వచ్చింది.

వైట్ హౌస్ కరస్పాండెంట్ గా ఆమె పనిచేసేవారు. అమెరికా అధ్యక్షులు విదేశాలలో పర్యటించే విధానం.. అమెరికా ఎన్నికలు.. నేషనల్ సెక్యూరిటీ వంటి అత్యంత కీలకమైన అంశాల మీద ఆమె పరిశోధనాత్మక జర్నలిజం సాగించేవారు. అయితే 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల జరుగుతున్నప్పుడు ట్రంప్.. బైడన్ మధ్య ముఖాముఖి చోటు చేసుకుంది. నాడు వారిద్దరిని వెల్కర్ సమన్వయం చేశారు. ఆమె వేసిన ప్రశ్నలు.. చర్చను సాగించిన తీరు ప్రశంసలు అందుకునేలా చేసింది.

అమెరికా చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన కార్యక్రమంగా పేరు తెచ్చుకున్న మీట్ ది ప్రెస్.. ను ఆమె నిర్వహించారు. 2023లో జరిగిన ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించారు.. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తొలి ఆఫ్రికన్ అమెరికన్ మహిళా హోస్ట్.. రెండవ మహిళా యాంకర్ గా ఆమె నిలిచి చరిత్ర సృష్టించారు.

వెల్కర్ ట్రంప్ ను ఇంటర్వ్యూ చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో అనేక పర్యాయాలు ఆమె ట్రంప్ తో ముఖాముఖి నిర్వహించారు. బరాక్ ఒబామా.. కమలహరిస్.. బైడన్ లాంటి ఎంతోమంది డెమోక్రటిక్… రిపబ్లిక్ పార్టీలకు సంబంధించిన నాయకులను ఆమె ఇంటర్వ్యూ చేశారు. నాయకులు అస్పష్టమైన సమాధానాలు ఇస్తే వెంటనే ఆమె పట్టేసుకుంటారు. అందులో నుంచి ప్రశ్నలు వేసి సమాధానాలు రాబడతారు. ట్రంప్ ను ప్రశ్నించి ఆమె ప్రపంచ వ్యాప్తంగా చర్చకు కారణమయ్యారు.