Homeఅంతర్జాతీయంPrivate Jet Crash Viral Video: విమానం కుప్పకూలిపోతుంటే ఎట్లా ఉంటుందో తెలుసా? వైరల్‌ వీడియో

Private Jet Crash Viral Video: విమానం కుప్పకూలిపోతుంటే ఎట్లా ఉంటుందో తెలుసా? వైరల్‌ వీడియో

Private Jet Crash Viral Video: విమానాలు కూలిపోవడం, హెలిక్యాప్టర్లు క్రాష్‌ అవడం ఇటీవల ఎక్కువగా జరుగుతున్నాయి. గతేడాది గుజరాత్‌లో విమానం టేకాఫ్‌ అయిన కొద్ది నిమిషాలకే మెడికల్‌ కాలేజీని ఢీకొని కూలిపోయింది. ఈ దృశ్యాలను అక్కడి వారు చిత్రీకరించారు. తాజాగా మరో విమానం ల్యాండింగ్‌ అవుతూ క్రాష్‌ అయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఏం జరిగిందంటే..? డొమినికన్‌ రిపబ్లిక్‌లోని లా రొమానా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం జరిగిన భయానక ప్రమాదం […]

Private Jet Crash Viral Video: విమానాలు కూలిపోవడం, హెలిక్యాప్టర్లు క్రాష్‌ అవడం ఇటీవల ఎక్కువగా జరుగుతున్నాయి. గతేడాది గుజరాత్‌లో విమానం టేకాఫ్‌ అయిన కొద్ది నిమిషాలకే మెడికల్‌ కాలేజీని ఢీకొని కూలిపోయింది. ఈ దృశ్యాలను అక్కడి వారు చిత్రీకరించారు. తాజాగా మరో విమానం ల్యాండింగ్‌ అవుతూ క్రాష్‌ అయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఏం జరిగిందంటే..?
డొమినికన్‌ రిపబ్లిక్‌లోని లా రొమానా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం జరిగిన భయానక ప్రమాదం భయాందోళనలు కలిగిస్తోంది. అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న ఒక ప్రైవేట్‌ జెట్‌ కూలిపోయి పైలట్, కోపైలట్‌ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. విమానం క్షణాల్లో భూమిని ఢీకొని మంటల్లో కాలిపోయిన దృశ్యం చూసేవారి ఒళ్లు గగ్గుర్లు పొడుస్తుంది.

ప్రమాదం ఎలా జరిగింది?
ప్రైవేట్‌ జెట్‌ అత్యవసరంగా ల్యాండ్‌ చేయడానికి ప్రయత్నం చేస్తుండగా లా రొమానా విమానాశ్రయంలోనే కూలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర సేవలు, అగ్నిమాపక బృందాలు స్థలానికి చేరుకొని కార్యకలాపాలు చేపట్టాయి. అయితే విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లను కాపాడక మరణించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. విమానం ఎందుకు అత్యవసర ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చింది, ఏయే సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి అనే విషయాలు ఇంకా దర్యాప్తు దశలో ఉన్నాయి.

ప్రమాదంపై దర్యాప్తు..
అధికారులు ప్రకారం, ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్, నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సేఫ్టీ బోర్డు ఈ ఘటనపై విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నాయి. విమానం ఫ్లైట్‌ డేటా రికార్డర్‌ను విశ్లేషించి, ప్రమాదానికి ముందు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. విమానం యజమాని, గమ్యస్థానం, ప్రయాణ ఉద్దేశం వంటి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు.

విమానం కూలిపోతుంటే ఎట్లా ఉంటుంది?
ఈ ప్రమాదం మనల్ని ఒక కఠినమైన ప్రశ్న వైపు నడిపిస్తుంది. విమానం కుప్పకూలిపోతుంటే ఎట్లా ఉంటుంది? ఆ క్షణాల్లో పైలట్లు ఏమనుకుంటారు? హఠాత్తుగా ఇంజిన్‌ శక్తి తగ్గడం, అలారాలు మోగడం, కంట్రోల్‌ లాస్‌ అయ్యే భావన… శరీరం అదుపు తప్పిన విమానం భూమి వైపు పడిపోతుంటే గుండెల్లో కలిగే ఆ భయం, ఆకాశం నుంచి భూమి వైపు వేగంగా పడుతున్న భారం, చివరి క్షణాల్లో ఏదైనా చేయాలనే తపన… ఇవన్నీ మనసును కలచివేస్తాయి. చాలా మంది పైలట్లు ఈ స్థితిలో కూడా కూల్‌గా ఉండి, విమానాన్ని కాపాడడానికి చివరి వరకు పోరాడతారు. కానీ ఆ క్షణాల్లో వారి మనసులో తప్పనిసరిగా కుటుంబం, ప్రియమైనవారు, జీవితం గురించిన ఆలోచనలు తిరుగుతాయి. కొంతమందికి ఇది కేవలం కొన్ని సెకన్ల విషయం కావచ్చు, కానీ ఆ సెకన్లు ఒక జీవితకాలంగా అనిపించవచ్చు.

ఆకాశయానం ఎంత సురక్షితంగా ఉన్నప్పటికీ, కొన్ని అనివార్యమైన క్షణాల్లో మానవ జీవితం ఎంత లేతగా ఉంటుందో. ఏవియేషన్‌ సేఫ్టీ, టెక్నాలజీ, పైలట్‌ శిక్షణలు ఎంత ముఖ్యమో ఈ ఘటన మళ్లీ గుర్తు చేస్తోంది.ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ ప్రమాదం వెనుక ఉన్న నిజమైన కారణాలు బయటపడాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper