Homeఅంతర్జాతీయంTrump Walks Out Of Interview: వాడీవేడి ఇంటర్వ్యూ: ప్రశ్నించిన యాంకర్.. మైక్ పడేసి...

Trump Walks Out Of Interview: వాడీవేడి ఇంటర్వ్యూ: ప్రశ్నించిన యాంకర్.. మైక్ పడేసి వెళ్లిపోయిన ట్రంప్.. వైరల్ వీడియో

Trump Walks Out Of Interview: అంతటి ట్రంప్ తట్టుకోలేకపోయాడు. ఆమె ప్రశ్నలు ఎదుర్కోలేకపోయాడు. సమాధానం చెప్పే తెలివిలేక పారిపోయాడు. మైక్ కింద పడేసి తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. థాంక్యూ డార్లింగ్ అంటూ తన కోపాన్ని మరో రూపంలో ప్రదర్శించాడు. ట్రంప్ ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడానికి.. ఈ స్థాయిలో అసహనం ప్రదర్శించడానికి అసలైన కారణం ఒకే ఒక్క యాంకర్. ఇప్పుడు ఆమె పేరు ప్రపంచ వ్యాప్తంగా మారు మోగిపోతుంది. అంతటి ట్రంప్ మూసుకొని […]

Trump Walks Out Of Interview: అంతటి ట్రంప్ తట్టుకోలేకపోయాడు. ఆమె ప్రశ్నలు ఎదుర్కోలేకపోయాడు. సమాధానం చెప్పే తెలివిలేక పారిపోయాడు. మైక్ కింద పడేసి తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. థాంక్యూ డార్లింగ్ అంటూ తన కోపాన్ని మరో రూపంలో ప్రదర్శించాడు. ట్రంప్ ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడానికి.. ఈ స్థాయిలో అసహనం ప్రదర్శించడానికి అసలైన కారణం ఒకే ఒక్క యాంకర్. ఇప్పుడు ఆమె పేరు ప్రపంచ వ్యాప్తంగా మారు మోగిపోతుంది.

అంతటి ట్రంప్ మూసుకొని పోయాడంటే.. దానికి ప్రధాన కారణం క్రిస్టెన్ వెల్కర్. ఆమె ఎన్ బీసీ అనే న్యూస్ ఛానల్లో పని చేస్తూ ఉంటారు.. ఓపెన్ గా మాట్లాడటం.. ఎవిడెన్స్ తో ప్రశ్నించడం.. పూర్తిస్థాయి సమాచారంతోనే వివరాలు సేకరించడం ఆమెకు మొదటి నుంచి అలవాటు. అందువల్లే అమెరికన్ మీడియా సర్కిల్స్లో ఆమెకు మంచి పేరు ఉంది. అటువంటి వెల్కర్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు చుక్కలు చూపించింది. వాస్తవానికి ట్రంప్ ముందు మాట్లాడాలి అంటే ఎంతటి పాత్రికేయులైన సరే భయపడిపోతుంటారు. కానీ వెల్కర్ అలా కాదు. ఆమె మాట సూటిగా ఉంటుంది. ప్రశ్నించే స్వభావం పదునుగా ఉంటుంది. అందువల్లే ట్రంప్ కూడా ఆమె ప్రశ్నలను తట్టుకోలేకపోయాడు.

ప్రధానంగా 2020 అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగినట్టు ట్రంప్ ఆరోపణలు చేశాడు. దానికి వెల్కర్ ఆధారాలు చూపాలంటూ ఆయనను పదేపదే అడిగారు. అయితే ఆధారాలు లేకపోవడంతో ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు ట్రంప్. అయినప్పటికీ వెల్కర్ వెనకడుగు వేయలేదు. మళ్లీ మళ్లీ అదే ప్రశ్న వేయడంతో ముఖాముఖి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ట్రంప్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అసహనాన్ని ప్రదర్శిస్తూ.. తన కోటుకు ఉన్న మైక్.. వైర్లెస్ ట్రాన్స్మిటర్ ను లాగేసి.. కిందపడేసి వెళ్లిపోయాడు.

ట్రంప్ అలా చేస్తున్నప్పటికీ వెల్కర్ ఏ మాత్రం సహనం కోల్పోలేదు. పైగా అతడి అసలు రూపాన్ని ప్రపంచానికి చూపించాలని నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయింది. వెల్కర్ 1976 జూలై 1న అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో జన్మించింది. ఈమెకు చిన్నప్పటినుంచే జర్నలిజం మీద ఇంట్రస్ట్ ఉండేది. అమెరికాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన హర్వర్డ్ యూనివర్సిటీలో హిస్టరీ చదివారు. ఆ తర్వాత జర్నలిజాన్ని తన వృత్తిగా ఎంచుకున్నారు. స్థానికంగా ఉన్న న్యూస్ ఛానల్స్ లో రిపోర్టర్ గా తన జీవితాన్ని మొదలుపెట్టారు. 2010లో ఆమెకు ఎన్బీసీ ఛానల్ లో పనిచేసే అవకాశం వచ్చింది.

వైట్ హౌస్ కరస్పాండెంట్ గా ఆమె పనిచేసేవారు. అమెరికా అధ్యక్షులు విదేశాలలో పర్యటించే విధానం.. అమెరికా ఎన్నికలు.. నేషనల్ సెక్యూరిటీ వంటి అత్యంత కీలకమైన అంశాల మీద ఆమె పరిశోధనాత్మక జర్నలిజం సాగించేవారు. అయితే 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల జరుగుతున్నప్పుడు ట్రంప్.. బైడన్ మధ్య ముఖాముఖి చోటు చేసుకుంది. నాడు వారిద్దరిని వెల్కర్ సమన్వయం చేశారు. ఆమె వేసిన ప్రశ్నలు.. చర్చను సాగించిన తీరు ప్రశంసలు అందుకునేలా చేసింది.

అమెరికా చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన కార్యక్రమంగా పేరు తెచ్చుకున్న మీట్ ది ప్రెస్.. ను ఆమె నిర్వహించారు. 2023లో జరిగిన ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించారు.. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తొలి ఆఫ్రికన్ అమెరికన్ మహిళా హోస్ట్.. రెండవ మహిళా యాంకర్ గా ఆమె నిలిచి చరిత్ర సృష్టించారు.

వెల్కర్ ట్రంప్ ను ఇంటర్వ్యూ చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో అనేక పర్యాయాలు ఆమె ట్రంప్ తో ముఖాముఖి నిర్వహించారు. బరాక్ ఒబామా.. కమలహరిస్.. బైడన్ లాంటి ఎంతోమంది డెమోక్రటిక్… రిపబ్లిక్ పార్టీలకు సంబంధించిన నాయకులను ఆమె ఇంటర్వ్యూ చేశారు. నాయకులు అస్పష్టమైన సమాధానాలు ఇస్తే వెంటనే ఆమె పట్టేసుకుంటారు. అందులో నుంచి ప్రశ్నలు వేసి సమాధానాలు రాబడతారు. ట్రంప్ ను ప్రశ్నించి ఆమె ప్రపంచ వ్యాప్తంగా చర్చకు కారణమయ్యారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper