Home Blog Page 169

సినిమాల పరంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి చేదు వార్త.. ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని ఊహించలేదు..

Pawan Kalyan Fans
Pawan Kalyan Upcoming Movies

Pawan Kalyan Upcoming Movies: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అనే పేరు ఏ రేంజ్ లో వినిపిస్తుందో మనం ప్రతీ రోజు మీడియా , సోషల్ మీడియా లో చూస్తూనే ఉన్నాం. ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా , పంచాయితీ రాజ్ మరియు పర్యావరణ మంత్రిగా పవన్ కళ్యాణ్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వేరే లెవెల్ లో ఉన్నాయి. ప్రతీ అడుగులోనూ ఆయన తన మార్క్ చూపిస్తున్నాడు. లేటెస్ట్ గా ఆయన పంచాయితీ రాజ్ శాఖకు 5 నేషనల్ అవార్డ్స్ వచ్చేలా చేశాడు. దేశం లో ఏ రాష్ట్రంలో కూడా ఈ రేంజ్ అభివృద్ధి జరగడం లేదనేది వాస్తవం అని చెప్పొచ్చు. అంతే కాదు , పవన్ కళ్యాణ్ లుక్స్ పరంగా కూడా ప్రస్తుతం పీక్ రేంజ్ లో ఉన్నాడు. ఆయన లేటెస్ట్ లుక్స్ ని చూసి అభిమానులు ఎంతగానో మురిసిపోతున్నారు.

పవన్ కళ్యాణ్ లేటెస్ట్ లుక్స్ ని చూసిన అభిమానులు, ఆయన తదుపరి చిత్రాన్ని త్వరలోనే ప్రారంభించబోతున్నాడని , అందుకే తన లుక్స్ ని ఈ రేంజ్ లో మార్చున్నాడని అనుకున్నారు. అలా అభిమానుల ఆనందానికి సోషల్ మీడియా లో లేటెస్ట్ గా జరుగుతున్న ఒక ప్రచారం చెక్ పెట్టింది. పవన్ కళ్యాణ్ కి రీసెంట్ గానే డైరెక్టర్ సురేందర్ రెడ్డి పూర్తి స్థాయి బౌండెడ్ స్క్రిప్ట్ ని రెడీ చేసి వినిపించాడని , కానీ పవన్ కళ్యాణ్ అందుకు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదని, కాబట్టి సురేందర్ రెడ్డి తో సినిమా ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. మరోపక్క పవన్ కళ్యాణ్ అభిమానులు ‘ఓజీ 2’ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా రీసెంట్ గానే సుజిత్ పూర్తి చేశాడని తెలుస్తోంది. జనవరి నుండి ఈ చిత్రాన్ని మొదలు పెడతాడని అంతా అనుకున్నారు.

కానీ అది సాధ్యం అయ్యేలా అనిపించడం లేదని అంటున్నారు విశ్లేషకులు. అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి ఎలాంటి సినిమా కమిట్మెంట్స్ ఇచ్చే మూడ్ లో లేడని, ఆయన ద్రుష్టి మొత్తం ఇప్పుడు పాలన మీదనే ఉందని, వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు జరగబోతున్నాయి , ఈ నేపథ్యం లో పవన్ కళ్యాణ్ ఈ పుష్కరాల బాధ్యతని తన భుజాల మీద వేసుకున్నాడని , ప్రపంచం మొత్తం ఈ పుష్కరాల గురించి అద్భుతంగా మాట్లాడుకునే చేయడమే పవన్ కళ్యాణ్ లక్ష్యమని, ఆ మహోన్నత కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసే వరకు ఆయన ఎలాంటి సినిమా కమిట్మెంట్స్ ని ఒప్పుకునే పరిస్థితి లో లేడని సమాచారం. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.

ముంబైని వదిలిపోవడం గ్యారంటీ.. సూర్య చేరేది ఆ జట్టులోనే.. ఇది మామూలు బ్లాస్టింగ్ న్యూస్ కాదు

Suryakumar Yadav New IPL Team
Suryakumar Yadav New IPL Team

Suryakumar Yadav New IPL Team: మొత్తానికి ఐపిఎల్ లో ముంబై జట్టు నుంచి సూర్య కుమార్ యాదవ్ వెళ్లిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అతడు ముంబై ఇండియన్స్ జట్టును ఇన్ స్టా గ్రామ్ లో అన్ ఫాలో చేశాడు. అంత కాదు ముంబై జట్టుతో గతంలో దిగిన ఫోటోలను మొత్తం డిలీట్ చేశాడు.. ఈ నేపథ్యంలో అతడు వచ్చే సీజన్లో ముంబై నుంచి బయటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేనేజ్మెంట్ కూడా అతడి విషయంలో అంత సానుకూలంగా లేనట్టు కనిపిస్తోంది.

సూర్య కుమార్ యాదవ్ ముంబై జట్టు నుంచి బయటికి వస్తే వచ్చే సీజన్లో అతడు ఏ జట్టులో ఆడతాడు.. ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడు.. అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక వార్త కనిపిస్తోంది. అది ఎంతవరకు నిజమో తెలియదు గాని.. సూర్య కుమార్ యాదవ్ వచ్చే సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడే అవకాశం ఉందని తెలుస్తోంది. ట్రేడ్ లో భాగంగా సూర్య కుమార్ యాదవ్ బెంగళూరు వెళ్తాడని.. బెంగళూరు నుంచి బెతల్.. పావెల్ ముంబై జట్టుకు వెళ్ళిపోతారని తెలుస్తోంది. రెండు జట్ల మధ్య ఈ ట్రేడ్ కుదిరిందని.. అధికారికంగా ప్రకటన మాత్రమే మిగిలి ఉందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇంతవరకు సూర్య కుమార్ యాదవ్ తాను ముంబై జట్టు నుంచి బయటికి వెళ్తున్నట్టు అధికారికంగా ప్రకటించలేదు. ముంబై జట్టు కూడా సూర్యకుమార్ యాదవ్ విషయంలో ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే అతడు ముంబై ఇండియన్స్ జట్టును సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడం రకరకాల ఊహాగానాలకు కారణమవుతోంది. గతంలో ముంబై జట్టు కూడా హార్దిక్ పాండ్యాను గుజరాత్ నుంచి ట్రేడ్ విధానం లో తీసుకుంది. అయితే ఇప్పుడు అదే విధానాన్ని బెంగళూరు కూడా కొనసాగించే అవకాశం కనిపిస్తుందని తెలుస్తోంది. మరోవైపు బెంగళూరు ప్రతిపాదనకు.. ముంబై ఓకే చెబుతుందా.. ఈ ట్రేడ్ కార్యరూపం దాల్చుతుందా.. చూడాల్సి ఉంది.

సూర్య కుమార్ యాదవ్ ఈ సీజన్లో అంతగా ఆడలేదు. అతడు హార్థిక్ పాండ్యాతో కూడా టచ్ మీ నాట్ అన్నట్టుగానే వ్యవహరించాడు. టీ మీడియాకు టి20 వరల్డ్ కప్ సాధించి పెట్టినప్పటికీ.. వ్యక్తిగత ప్రదర్శన అంత గొప్పగా చేయలేదు. అందువల్లే అతడిని మేనేజ్మెంట్ జాతీయ జట్టు నుంచి పక్కనపెట్టింది. ఆటగాడిగా కూడా అతడిని ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలో అతడు గనుక మిగతా టోర్నీలలో అవకాశం వస్తే.. తనను తాను నిరూపించుకుంటే.. జట్టులో స్థానం స్థిరంగా ఉంటుందని.. క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.. ప్రస్తుతం జరుగుతున్న ముంబై t20 లో కూడా సూర్యకుమార్ యాదవ్ తన స్థాయిలో ఆడటం లేదు.

'వర్కింగ్ డే' లో కూడా దుమ్ములేపుతున్న 'పెద్ది' చిత్రం.. ఈరోజు ఎంత గ్రాస్ వస్తుందంటే..

Tollywood Box Office Collection
Tollywood Box Office Collection

Peddi Movie Box Office Collections: సంక్రాంతి తర్వాత టాలీవుడ్ లో విడుదలైన ఏ సినిమాకు కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. ట్రేడ్ మొత్తం నిరాశలో ఉంది , హైదరాబాద్ వంటి టాప్ సిటీలలో కూడా థియేటర్స్ ని మూసి వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయం లో ఒక్క సరైన హిట్ పడకపోతే సినీ ఇండస్ట్రీ సంక్షోభం లోకి వెళ్తుందని అందరూ భయపడ్డారు. అలాంటి సమయం లో ఎన్నో అంచనాలు , ఆశల మధ్య విడుదలైన ‘పెద్ది’ చిత్రానికి ఆడియన్స్ నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రీమియర్ షోస్ నుండే ఈ చిత్రానికి వచ్చిన పాజిటివ్ టాక్ ని చూసి ట్రేడ్ పండితులు ఈ చిత్రం రామ్ చరణ్ కెరీర్ లో మరో మగధీర, రంగస్థలం రేంజ్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని అనుకున్నారు. వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రం ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ దిశగా అడుగులు వేస్తోంది.

నేడు ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద అసలైన పరీక్ష. ఎందుకంటే వర్కింగ్ డే కాబట్టి. ఈ వర్కింగ్ డే టెస్ట్ లో ఈ చిత్రం పాస్ అవుతుందా లేదా ? అనే అనుమానం అభిమానుల్లో ఉండేది. అయితే ఈ టెస్ట్ ని డిస్టింక్షన్ లో పాస్ అయ్యింది ఈ చిత్రం అనడం లో ఎలాంటి సందేహం లేదు. నూన్ షోస్ నుండే ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి వసూళ్లు నమోదు అయ్యాయి. నైజాం ప్రాంతం లో మ్యాట్నీ షోస్ నుండి అద్భుతమైన ఆక్యుపెన్సీలు నమోదు అవ్వడం మొదలయ్యాయి. ఆ కారణం చేత ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో గంటకు 15 వేల టిక్కెట్లు అమ్ముడుపోవడం జరిగింది. ఈమధ్య కాలం లో మన టాలీవుడ్ స్టార్ హీరో సినిమాకు ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ వర్కింగ్ డే లో జరగడం ఎప్పుడూ చూడలేదు.

దీనిని బట్టీ చూస్తుంటే ఈ చిత్రానికి ఏ రేంజ్ లాంగ్ రన్ ఉండబోతుందో అర్థం అవుతుంది. ‘రంగస్థలం’ రేంజ్ లాంగ్ రన్ ఎప్పుడు వస్తుందో మళ్లీ రామ్ చరణ్ కి అని అంతా అనుకునేవారు , ‘పెద్ది’ చిత్రం ఆ స్థాయి బ్లాక్ బస్టర్ అని బలంగా నమ్మారు , వాళ్ళ నమ్మకాలను నిజం చేసింది ఈ చిత్రం. మొదటి వీకెండ్ లో ప్రపంచవ్యాప్తంగా 240 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ చిత్రం , ఈ వీకెండ్ తో 300 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. #RRR తో వెయ్యి కోట్ల గ్రాస్ ని అందుకున్న రామ్ చరణ్ , ఇప్పుడు ‘పెద్ది’ తో 300 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వడం పై చరణ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. మరి లాంగ్ రన్ లో ఈ చిత్రం 400 కోట్ల గ్రాస్ ని రాబడుతుందా లేదా అనేది చూడాలి. నేడు ఈ చిత్రానికి నమోదు అవుతున్న హౌస్ ఫుల్స్ ని చూస్తుంటే, కచ్చితంగా నేడు 15 కోట్ల గ్రాస్ ని కొల్లగొడుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

ఓటీటీ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన సూర్య 'కరుప్పు' చిత్రం.. ఎందులో చూడాలంటే..

Suriya Karuppu OTT Release
Suriya Karuppu OTT Release

Suriya Karuppu OTT Release: ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై , బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని కైవసం చేసుకొని , సునామీ లాంటి థియేట్రికల్ రన్ ని సొంతం చేసుకున్న చిత్రం ‘ కరుప్పు’. చాలా కాలం నుండి సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేక ఇబ్బంది పడుతున్న సూర్య కు , ఈ సినిమా ఇచ్చిన కిక్ మామూలుది కాదు. ఒక్కసారిగా ఆయన దిక్కుతోచని తమిళ సినిమా ఇండస్ట్రీ కి ఈ సినిమాతో గాడ్ ఫాదర్ లాగా మారిపోయాడు. సినిమా విడుదలై మూడు వారాలు పూర్తి అయ్యింది. కానీ ఇప్పటికీ కూడా ఈ చిత్రానికి మంచి వసూళ్లు నమోదు అవుతూనే ఉన్నాయి. వీకెండ్ లో డీసెంట్ స్థాయి ఆక్యుపెన్సీలను నమోదు చేసుకుంటూ , బయ్యర్స్ కి లాభాలు కురిపిస్తూనే ఉంది ఈ చిత్రం. గడిచిన 24 గంటల్లో ఈ సినిమాకు 10 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయి.

ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ఓటీటీ గురించి వచ్చిన ఒక లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు సంచలనంగా మారింది. అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ ని కొనుగోలు చేసింది. వాళ్ళతో మేకర్స్ కుదిరించుకున్న ఒప్పందం ప్రకారం నాలుగు వారాల తర్వాత ఓటీటీ లో స్ట్రీమింగ్ చెయ్యాలి. అందుకే ఈ నెల 12 న ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వీడియో లో తెలుగు , తమిళం , హిందీ మరియు మలయాళం వెర్షన్స్ లో ఒకేసారి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రానికి , ఓటీటీ ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ‘కరుప్పు’ చిత్రానికి పాజిటివ్ టాక్ తో పాటుగా , నెగెటివ్ టాక్ కూడా సమాంతరంగా వచ్చింది.

కానీ తమిళం లో ఆరు నెలల నుండి సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేకపోవడం, ఆడియన్స్ కరువులో ఉండడం వల్ల , ఈ సినిమాని ఎగబడి చూసారు అనేది కొందరి వాదన. అందులో ఎంత మాత్రం నిజముంది అనేది , ఓటీటీ రిలీజ్ తో తేలిపోనుంది. చాలా సూపర్ హిట్ సినిమాలకు థియేటర్స్ లో వచ్చినంత రెస్పాన్స్ ఈమధ్య కాలం లో ఓటీటీ లో రావడం లేదు , అదే సమయం లో కొన్ని ఫ్లాప్ సినిమాలకు ఓటీటీ లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఈ చిత్రం తర్వాత సూర్య ‘లక్కీ భాస్కర్’ డైరెక్టర్ వెంకీ అట్లూరి తో ‘విశ్వనాధ్ & సన్స్ ‘ అనే చిత్రం చేస్తున్నాడు. ‘కరుప్పు’ కారణంగా ఈ చిత్రానికి అటు తమిళం లో ఎంత డిమాండ్ పెరిగిందో , తెలుగులో కూడా అదే రేంజ్ డిమాండ్ పెరిగింది.

ఆఫ్గనిస్తాన్ మీద గెలిచినా.. టీమిండియాకు అదే దుస్థితి.. WTC ఫైనల్స్ వెళ్లాలంటే ఇది జరగాలి

Team India WTC Final Qualification
Team India WTC Final Qualification

Team India WTC Final Qualification: ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన ఏకైక టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 300 పరుగుల విజయం సాధించింది.. తద్వారా టీమ్ ఇండియా టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. టీమిండియా ఈ స్థాయిలో విజయాన్ని అందుకున్నప్పటికీ.. డబ్ల్యూటీసి పాయింట్ల పట్టికలో ఇంకా ఆరవ స్థానంలోనే కొనసాగుతోంది. స్థూలంగా చెప్పాలంటే బంగ్లాదేశ్ కంటే దిగువ స్థానంలో కొనసాగుతోంది.

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్లు ఆడిన ఆస్ట్రేలియా ఏడు విజయాల సొంతం చేసుకుంది.. ఆ జట్టు ఖాతాలో 84 పాయింట్లు ఉన్నాయి. రెండో స్థానంలో సౌత్ ఆఫ్రికా కొనసాగుతోంది. సౌత్ ఆఫ్రికా ఏకంగా నాలుగు మ్యాచ్లు ఆడి.. మూడు విజయాలు సాధించింది. సౌత్ ఆఫ్రికా ఖాతాలో 75 పాయింట్లు ఉన్నాయి. మూడో స్థానంలో శ్రీలంక కొనసాగుతోంది. శ్రీలంక రెండు మ్యాచ్ లు ఆడి.. ఒక దాంట్లో విజయం సాధించింది. మరొక మ్యాచ్ డ్రా అయింది. శ్రీలంక ఖాతాలో 66.67 పాయింట్లు ఉన్నాయి.

నాలుగో స్థానంలో న్యూజిలాండ్ కొనసాగుతోంది. న్యూజిలాండ్ జట్టు నాలుగు మ్యాచ్లు ఆడి.. రెండు విజయాలు సాధించింది. ఇందులో ఒక మ్యాచ్ ఓడిపోగా.. మరొక మ్యాచ్ డ్రా అయింది.. ఐదవ స్థానంలో బంగ్లాదేశ్ కొనసాగుతోంది. బంగ్లాదేశ్ నాలుగు మ్యాచ్ లు ఆడింది. ఇందులో రెండు విజయాలు.. ఒక ఓటమి.. మరొక డ్రా ఉన్నాయి. ఆరో స్థానంలో ఇండియా కొనసాగుతోంది. ఇండియా ఖాతాలో 48.15 పాయింట్లు ఉన్నాయి.

టీమిండియా తదుపరి శ్రీలంక, న్యూజిలాండ్ జట్లతో సిరీస్ లు ఆడుతుంది.. ఈ సిరీస్లలో టీమిండియా కచ్చితంగా గెలవాలి. స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో ఎదురైన వైట్ వాష్ పరాభవానికి బదులు తీర్చుకోవాలి. శ్రీలంక జట్టు మీద కూడా ఏకపక్షమైన విజయాన్ని సాధిస్తేనే టీమ్ ఇండియాకు డబ్ల్యూటీసి ఫైనల్ వెళ్లే అవకాశం ఉంటుంది.

గత రెండు పర్యాయాలు టీమిండియా డబ్ల్యూటీసి ఫైనల్ వెళ్ళింది. ఫైనల్ లో ఒకసారి న్యూజిలాండ్.. మరొకసారి ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. గత సీజన్లో టీం ఇండియా అంతగా ఆకట్టుకోలేదు. అందువల్ల డబ్ల్యూటీసీ ఫైనల్ వెళ్లలేకపోయింది. అయితే ఈసారి న్యూజిలాండ్, శ్రీలంక జట్లతో జరిగే సిరీస్లలో విజయాలు సాధించి.. డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోవాలని భావిస్తోంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా జట్టుతో జరిగే సిరీస్లో అదరగొడితే టీమ్ ఇండియాకు ఇక ఎదురు ఉండదు.

ప్రాణ రక్షణపై CPR, AED శిక్షణతో తానా సేవా స్పూర్తి

TANA New Jersey CPR Training Program

TANA New Jersey CPR Training Program న్యూజెర్సీ: అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడే కీలక నైపుణ్యాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) న్యూజెర్సీ బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన CPR & AED శిక్షణ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. కెండల్ పార్క్ ఫస్ట్ ఎయిడ్ అండ్ రెస్క్యూ స్క్వాడ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి కుటుంబాలు, యువత, విద్యార్థులు, స్థానిక కమ్యూనిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ శిక్షణను కెండల్ పార్క్ ఫస్ట్ ఎయిడ్ అండ్ రెస్క్యూ స్క్వాడ్ చీఫ్ అల్ లో-బీర్ నిర్వహించారు. గుండెపోటు వంటి అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన ఎలా ఉండాలి, సీపీఆర్ (Cardiopulmonary Resuscitation) విధానం ఎలా అమలు చేయాలి, AED (Automated External Defibrillator) పరికరాన్ని ఎలా ఉపయోగించాలి వంటి అంశాలను ఆయన సవివరంగా వివరించారు. పాల్గొన్నవారు ప్రత్యక్ష ప్రదర్శనలతో పాటు శిక్షణ మోడళ్లపై ప్రాక్టికల్‌గా అభ్యసించి, అత్యవసర పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనే నైపుణ్యాలను సొంతం చేసుకున్నారు.

ఈ సందర్భంగా రెండు సంవత్సరాల క్రితం తానా అందించిన LUCAS Chest Compression System గురించి చీఫ్ అల్ లో-బీర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ పరికరం గుండె ఆగిపోయిన రోగులకు నిరంతరాయంగా, నాణ్యమైన ఛెస్ట్ కంప్రెషన్స్ అందించడంలో కీలక పాత్ర పోషిస్తోందని, గత రెండు సంవత్సరాల్లో అనేక ప్రాణాలను కాపాడటానికి ఇది ఎంతో ఉపయోగపడిందని ఆయన తెలిపారు. ప్రజల భద్రత కోసం ఇలాంటి అత్యాధునిక పరికరాన్ని అందించిన తానాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

తానా అధ్యక్షులు డా. నరేన్ కొడాలి, కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు శ్రీనివాస్ లావు నాయకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో తానా కోశాధికారి రాజా కసుకుర్తి, న్యూజెర్సీ రీజినల్ రిప్రజెంటేటివ్ సుధీర్ చంద్ర నారేపలుపు, కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని, యూత్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ చెరుకూరి తదితరులు కీలక పాత్ర పోషించారు.

స్థానిక హైస్కూల్ విద్యార్థిని, EMS వాలంటీర్ వర్షా నారేపలుపు సేవలను తానా నాయకత్వం ప్రత్యేకంగా అభినందించింది. యువతలో సేవా భావాన్ని పెంపొందిస్తూ సమాజ సేవలో ముందుండటం ద్వారా ఆమె ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొంది.

ఈ సందర్భంగా తానా కోశాధికారి రాజా కసుకుర్తి మాట్లాడుతూ, తానా కేవలం సాంస్కృతిక సంస్థ మాత్రమే కాదని, ఆరోగ్యం, విద్య, యువత అభివృద్ధి, రక్తదాన శిబిరాలు, రైతు సహాయ కార్యక్రమాలు, విపత్తు సహాయక చర్యలు వంటి అనేక సేవా కార్యక్రమాల ద్వారా సమాజ అభ్యున్నతికి కృషి చేస్తోందని తెలిపారు. CPR మరియు AED వంటి శిక్షణ కార్యక్రమాలు అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడగల సామర్థ్యాన్ని ప్రజల్లో పెంపొందిస్తాయని అన్నారు.

 

పెద్దలతో పాటు చిన్నారులు కూడా ఉత్సాహంగా పాల్గొన్న ఈ కార్యక్రమం ప్రజారోగ్య అవగాహన, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే సామర్థ్యం, యువతలో సేవా స్పూర్తి మరియు సమాజ సాధికారతను పెంపొందించడంలో తానా చేస్తున్న కృషికి మరో నిదర్శనంగా నిలిచింది. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన చీఫ్ అల్ లో-బీర్, కెండల్ పార్క్ ఫస్ట్ ఎయిడ్ అండ్ రెస్క్యూ స్క్వాడ్, వాలంటీర్లు మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరికీ తానా నాయకత్వం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.

మారని రెపో రేటు... హోమ్ లోన్ తీసుకునేవారికి గుడ్ న్యూస్.. ఇప్పుడు వడ్డీ రేట్లు ఎంతంటే..

Repo Rate Unchanged
Repo Rate Unchanged

Repo Rate Unchanged: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల రేపో రేటు మార్చకుండానే 5.25 శాతంతో నిలిపివేసింది. దీంతో హోమ్‌ లోన్ మార్కెట్ స్థిరత్వాన్ని కొనసాగిస్తోంది. ఫలితంగా బ్యాంకులు వడ్డీ రేట్లలో పెద్ద మార్పులు లేవని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హోమ్ లోన్ తీసుకునేవారితో పాటు రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు ప్రయోజనాలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ప్రస్తుం బ్యాంకుల వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం..

ప్రభుత్వ వ్యయ రంగంలో ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ ఇండియా(BOI) అత్యంత తక్కువ హోమ్ లోన్ ఎమ్‌ఐసిటి 7.10శాతం ను అందిస్తోంది. ఇదే సమయంలో కెనరా బ్యాంక్ 7.15 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా 7.20 వడ్డీతో గృహ రుణాలు అందిస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 7.25 శాతం వడ్డీని వినియోగదారులకు అందజేస్తోంది.

ప్రైవేట్ సెక్టార్లో ఫెడరల్ బ్యాంక్ గరిష్టంగా చౌకగా 7.30 శాతం వడ్డీని అందిస్తోంది. ఇది చిన్న శ్రేణి వినియోగదారులకి ఆకర్షణీయమైన ఆప్షన్. కొటక్ మహీంద్రా బ్యాంక్ 7.60 శాతం , హెచ్‌డీఎఫ్‌సీ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకులు 7.75 శాతం వడ్డీలు విధిస్తున్నాయి. వీటి సేవా నెట్‌వర్క్, అనుబంధ ఫైనాన్షియల్ ఉత్పత్తులు ఇతర అధికారిక ప్రయోజనాలతో కలిసి రుణదారులకు భిన్న ప్రయోజనాలను అందిస్తాయి. యాక్సిస్ బ్యాంక్ మార్కెట్లో గరిష్టంగా 8 శాతం వడ్డీని అమలు చేస్తున్నది. ఇది కొన్నిసార్లు ఫ్లెక్సిబుల్ క్రెడిట్ ఫీచర్లు లేదా వేగవంతమైన ఆప్రూవల్ ప్రక్రియతో సమన్వయం చేయబడి ఉంటుంది.

హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు ప్రైవేట్ బ్యాంకులకు గట్టి పోటీని కల్పిస్తున్నాయి. ముఖ్యంగా ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ 7.15% వడ్డీతో హోమ్ లోన్ అందించడం విశేషం. దీంతో ప్రైవేట్ బ్యాంకులకు మాత్రమే కాకుండా ప్రభుత్వ బ్యాంకులకు కూడా ఒత్తిడిని పెంచుతోంది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ 7.25% రేటుతో ఇస్తున్నప్పటికీ ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ వంటి కొన్ని సంస్థలు అత్యధికంగా 8.5 శాతం వరకు వడ్డీలు వసూలు చేస్తున్నారు. .

బ్యాంకింగ్ నిపుణులు ఈ వడ్డీ రేట్లపై లోన్ తీసుకునేవారికి కొన్ని సూచనలు చేస్తున్నారు. రుణం తీసుకోవడంలో వినియోగదారులు వడ్డీ రేటు మాత్రమే కాకుండా ఇతర ఖర్చులను కూడా పరిగణలోకి తీసుకోవాలి. వీటిలో కొన్ని బ్యాంకులు ప్రీ పేమెంట్/ సర్వీస్ ఛార్జీలు విధిస్తాయి. అంతేకాకుండా శిక్షణలు, ఇన్స్యూరెన్స్ పేరిట అధికంగా ఫీజులు వసూలు చేస్తారు. అందువల్ల ఈ విషయాలను పూర్తిగా తెలుసుకున్న తరువాతే లోన్ తీసుకోవాలని అంటున్నారు.

అయ్యర్ అవసరమొచ్చింది.. నిరూపించుకోవాల్సిన టైం వచ్చింది.. నిలబడితే టీమిండియా భీకరం

Shreyas Iyer Comeback Opportunity
Shreyas Iyer Comeback Opportunity

Shreyas Iyer Comeback Opportunity: ఇది చాలా సంవత్సరాలుగా అనుకుంటున్న మాటే. కానీ అది వాస్తవ రూపం దాల్చలేదు. పైగా అతనికి జట్టులో స్థానం కూడా స్థిరంగా లేదు. దీంతో అతడి గురించి రకరకాల విమర్శలు.. ఆరోపణలు వచ్చాయి. వీటన్నిటిని తట్టుకుంటూ ఇప్పుడు అతడు అనుకున్న స్థానానికి చేరుకున్నాడు. విమర్శకుల నోటికి సరైన విధంగా తాళం వేశాడు. అతడు మరెవరు కాదు శ్రేయస్ అయ్యర్.

డొమెస్టిక్ క్రికెట్ లో అయ్యర్ అద్భుతమైన ప్రతిభ చూపించాడు. అనేక సందర్భాలలో అతనికి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారని చర్చ జరిగినప్పటికీ అది సాధ్యం కాలేదు. అంతేకాదు అతడికి జట్టులో స్థానం కూడా స్థిరంగా లేకుండా పోయింది.. కొన్ని సందర్భాలలో t20.. టెస్ట్ జట్లలో అతడికి అవకాశం కూడా లభించలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత అతడికి అనుకున్న సమయం వచ్చింది. టీమ్ ఇండియా టి20 సారధిగా అతడికి అవకాశం లభించింది.

కొంతకాలంగా ఐపీఎల్లో అదరగొడుతున్నాడు.. ఉదాహరణకు గత మూడు సీజన్లను పరిశీలనలోకి తీసుకుంటే.. 2024 లో కోల్కతా జట్టును అతడు విజేతగా నిలిపాడు. 2014 తర్వాత కోల్కతా మళ్లీ ఛాంపియన్ అవడం వెనక అయ్యర్ కృషి అమోఘం. 2025లో పంజాబ్ జట్టు సారధి అయ్యాడు. ఆ జట్టును ఆ సీజన్లో ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. దీనికంటే ముందు 2020లో ఢిల్లీ జట్టును ఐపీఎల్లో ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. మూడు భిన్నమైన జట్లను ఐపీఎల్లో ఫైనల్ దాకా తీసుకెళ్లిన చరిత్ర అయ్యర్ కు ఉంది.

సారధిగా మాత్రమే కాదు ఆటగాడిగా కూడా అతడు స్థిరమైన ప్రదర్శన చేస్తున్నాడు. గత ఐపిఎల్ సీజన్లో 17 మ్యాచులు ఆడి 604 పరుగులు చేశాడు. ఈ సీజన్లో 14 మ్యాచ్లలో 498 పరుగులు చేశాడు. ఇక జాతీయ జట్టులో అయ్యర్ స్థిరంగా స్థానాన్ని కొనసాగించలేకపోయాడు. గాయాల వల్ల ఇబ్బంది పడ్డాడు. టెస్ట్.. టి20 లలో ఆడినప్పటికీ తన స్థాయి ప్రదర్శన చేయలేకపోయాడు. అయితే ఐపీఎల్ లో అయ్యర్ అద్భుతమైన ప్రదర్శన చేసిన తర్వాత అతడిని సారధిగా తీసుకోవాలని డిమాండ్లు పెరిగిపోయాయి.

అయ్యర్ తో అంతకుముందు ద్రావిడ్.. ఇప్పుడు గంభీర్ కు చెప్పుకునే స్థాయిలో సంబంధాలు లేకపోయినప్పటికీ.. అభిమానుల నుంచి డిమాండ్ రావడంతో.. మేనేజ్మెంట్ అతడికి కెప్టెన్సీ స్థానం కట్టబెట్టాల్సి వచ్చింది. వచ్చే ఐర్లాండ్.. ఇంగ్లాండ్ సిరీస్లలో టీమిండియాకు నాయకత్వం వహించబోతున్నాడు. ఆ సిరీస్లలో అతను చూపించిన ప్రదర్శన ఆధారంగానే.. కెప్టెన్సీ స్థానం ఆధారపడి ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

పెద్ద పనులను ఈజీగా చేసే సాఫ్ట్ వేర్ ఉన్న ఫోన్.. వీరికి చాలా ఉపయోగం..

Vivo X Fold 6 Features
Vivo X Fold 6 Features

Vivo X Fold 6 Features: Vivo కంపెనీ తన తదుపరి తరం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ Vivo X Fold 6ని త్వరలో చైనా మార్కెట్లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ధృవీకరించింది. ఈ ఫోన్‌కు సంబంధించిన ఆసక్తికరమైన వివరాలు, టీజర్లు ఇప్పుడు టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ ఫోన్ గురించి వివరాల్లోకి వెళితె..

Vivo కొత్త ఫోన్ X Fold 6 కేవలం ఒక పెద్ద స్క్రీన్ ఉన్న ఫోల్డబుల్ ఫోన్‌ను అందించడమే కాకుండా.. వినియోగదారులకు బిగ్ టాస్క్ ను పూర్తి చేసే సామర్థ్యాన్ని అందించడంపై దృష్టి పెట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా OriginOS 6-Fold సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఇది మల్టీ టాస్కింగ్ కోసం కొత్త ‘అటామిక్ వర్క్‌బెంచ్’ మోడ్‌ను పరిచయం చేస్తోంది. ఇది ఒకే సమయంలో పలు యాప్‌లను సులభంగా రన్ చేయడానికి, పనులను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది.

Vivo X Fold 6 పూర్తిగా AI ఫీచర్లపై ఆధారపడి పనిచేస్తుంది. ఇందులో మెరుగుపరిచిన AI అసిస్టెంట్స్, ఆన్ డివైస్ AI ప్రాసెసింగ్, డ్యూయల్ డివైస్ బడ్డీ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మల్టీ యాప్ రన్నింగ్, క్రాస్ విండో ఇంటరాక్షన్స్, టాస్క్ ఓరియెంటెడ్ వర్క్‌స్పేస్ వంటివి దీనికి ప్రత్యేక ఆకర్షణలు. ఈ ఫోన్ MediaTek యొక్క సరికొత్త Dimensity 9500 చిప్‌సెట్‌తో రానున్నట్లు సమాచారం.

ఈ ఫోన్ వెనుక భాగంలో ఆకర్షణీయమైన సర్క్యులర్ కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌లతో కూడిన శక్తివంతమైన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండనుంది. ఫోన్ చూడటానికి చాలా స్లిమ్ మరియు ప్రీమియం లుక్‌తో, బ్లూ-గ్రీన్ వంటి కొత్త రంగులలో లభించనుంది.

ఈ ఫోల్డబుల్ ఫోన్‌లో అత్యంత భారీగా 6,900mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీని అమర్చినట్లు తెలుస్తోంది. ఇది ఫోల్డబుల్ కేటగిరీలో చాలా పెద్దది. దీంతో వినియోగదారులు ఎక్కువ సమయం మల్టీ టాస్కింగ్, ప్రొడక్టివిటీ పనులను ఆటంకం లేకుండా పూర్తి చేయవచ్చు. భద్రత కోసం ఇందులో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉంటుంది.

ఈ ఫోన్ నెలాఖరులో చైనాలో అధికారికంగా విడుదల కానుంది. ప్రస్తుతం చైనా మార్కెట్ కోసం దీనిని సిద్ధం చేస్తున్నా, త్వరలోనే అంతర్జాతీయ మార్కెట్లలో కూడా దీనిని విడుదల చేసే అవకాశం ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.

విజయ్ TVK పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాఘవ లారెన్స్.. ఏ స్థానం నుండి పోటీ చేయబోతున్నాడంటే..

Raghava Lawrence TVK Party MLA Candidate
Raghava Lawrence TVK Party MLA Candidate

Raghava Lawrence TVK Party MLA Candidate: తమిళనాడు ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ తన మార్కు పాలనతో ఒక పక్క అభిమానులను గర్వపడేలా చేస్తూ , మరోపక్క జనరంజకమైన పాలనతో , ప్రతీ అడుగు నిజాయితీగా వేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఆయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు సంచలనంగా మారాయి. ఇప్పటి వరకు ఇండియా లో ఏ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కూడా ఈ స్థాయి నిర్ణయాలు , ఆలోచనలు చేయడం లేదు. ఈ విషయం లో విజయ్ ని కచ్చితంగా మెచ్చుకొని తీరాల్సిందే. జనాలు తనకు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తూ , అడుగడుగునా తన మార్క్ చూపిస్తున్నాడు విజయ్. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా విజయ్ ఈ ఎన్నికల్లో తిరుచ్చి, పెరంబూరు స్థానాల్లో పోటీ చేసి , రెండిట్లోనూ బంపర్ మెజారిటీ తో గెలిచిన సంగతి మన అందరికీ తెలిసిందే.

అయితే రాజ్యాంగం ప్రకారం , కచ్చితంగా ఆరు నెలల్లో ఎదో ఒక స్థానం నుండి రాజీనామా చెయ్యాలి , ఆ స్థానం లో తన పార్టీ తరుపున అభ్యర్థిని నిలబెట్టి పోటీ చేయించాలి. విజయ్ ఏ స్థానాన్ని వదులుకుంటాడో అని అందరూ ఆతృతగా ఎదురు చూశారు . ఆయన తిరుచ్చి స్థానానికి రాజీనామా చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించాడు కూడా . అయితే ఈ స్థానం నుండి ప్రస్తుతం సహజీవనం చేస్తున్న హీరోయిన్ త్రిష పోటీ చేస్తుందని , త్వరలోనే ఆమె తమిళనాడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపడుతుందని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమి జరగడం లేదు, త్రిష కి అసలు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే లేదని తెలుస్తోంది. కానీ ఈ స్థానం నుండి టీవీకే పార్టీ అభ్యర్థిగా ప్రముఖ కొరియోగ్రాఫర్ , దర్శకులు కమ్ నటుడు రాఘవ లారెన్స్ పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రస్తుతానికి లారెన్స్ అధికారికంగా ప్రకటించలేదు కానీ, ట్విట్టర్ లో ఆయన లేటెస్ట్ గా వేసిన ట్వీట్ ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది.

ఆయన మాట్లాడుతూ ‘ఈమధ్య కాలంలో తిరుచ్చి స్థానం నుండి నేను పోటీ చేయబోతున్నట్టు మీడియా లో కథనాలు ప్రచారం అయ్యాయి. ఇందులో నిజానిజాలు ఏంటో చెప్పమని మీడియా మిత్రులు కొంతమంది నన్ను సంప్రదించారు. ఈ కథనాలు ఇప్పుడు తారా స్థాయికి చేరుకొని , నేషనల్ లెవెల్ లో ట్రెండ్ అవ్వడం తో నేను స్పందించాల్సి వస్తుంది. ప్రస్తుతానికి నేను ‘బెంజ్’ అనే సినిమా లో హీరో గా నటిస్తున్నాను. ఈ సినిమాకు చెందిన షూటింగ్ షెడ్యూల్ ఈ నెల 10 వ తేదీన ముగియబోతుంది. జూన్ 11 న , నా తల్లి ఆశీస్సులతో నా జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన ప్రకటన ని అధికారికంగా చేయబోతున్నాను , గురువారం ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు లారెన్స్.

ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్ష అందే.. 1.29 కోట్ల మంది విద్యార్థుల భారీ యుద్ధం

Gaokao Exam World Toughest Exam
Gaokao Exam World Toughest Exam

Gaokao Exam World Toughest Exam: భారత దేశంలో అత్యంత కఠినమైన పరీక్ష ఏదంటే చాలా మంది జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌ అని చెబుతారు. కొందరు సివిల్స్‌ కూడా అంటారు. మరి ప్రపంచంలో ఏ పరీక్ష అత్యంత కఠినమైనది అని అడిగితే చాలా మంది నిర్వికారంగా ఒకే పేరు చెబుతారు గావోకావో. చైనా జాతీయ ఉన్నత విద్యా ప్రవేశ పరీక్ష ఇది. ఒక్క పరీక్ష ఫలితం ఒక విద్యార్థి భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుంది. ఇది కేవలం ఎగ్జామ్‌ కాదు, చైనాలో లక్షలాది కుటుంబాల ఆశలు, కలలు, ఒత్తిడి, జీవితాలను ఒకేసారి నిర్ణయించే జాతీయ యుద్ధం.

గావోకావో ఎందుకు టఫెస్ట్‌?
ఈ పరీక్ష మొత్తం 9 గంటలు నడుస్తుంది. సాధారణంగా 2 నుంచి 4 రోజుల వ్యవధిలో నిర్వహిస్తారు. ఒక్కసారి తప్పిపోతే మళ్లీ ఒక సంవత్సరం వేచి ఉండాలి. అత్యంత ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీల్లో సీటు సాధించాలంటే దేశవ్యాప్తంగా లక్షలాది మందితో తీవ్ర పోటీ పడాలి. ఈ ఏడాది (2026) గావోకావోలో 1.29 కోట్ల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఇందులో టాప్‌ యూనివర్సిటీల్లో సీటు సాధించే వారు కేవలం ఒక్క శాతమే.

గావోకావో తర్వాత అత్యంత కఠినం?
ప్రపంచంలోని అతి టఫ్‌ ఎగ్జామ్‌ల జాబితాలో గావోకావో తర్వాత స్థానాలు ఇలా ఉన్నాయి. భారత్‌లో ఇంజినీరింగ్‌లో ఉన్నత స్థాయి సీట్ల కోసం జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష. దీనిని యూపీఎస్‌సీ నిర్వహిస్తుంది. అత్యున్నత ఉద్యోగాలైన సివిల్‌ సర్వీసెస్‌ కోసం నిర్వహించే పరీక్ష ఉంది. తర్వాతి స్థానంలో అల్‌ సోల్స్‌ ప్రైజ్‌ ఫెలోషిప్‌ (యూకే ఆక్స్‌ఫర్డ్‌) ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ఫెలోషిప్‌ పరీక్షల్లో ఒకటి. యూఎస్‌ఎంఎల్‌ఈ(అమెరికా) వైద్యులకు లైసెన్స్‌ పొందడానికి ఈ అన్ని పరీక్షలకూ ఒక సాధారణ లక్షణం ఉంది. అపారమైన పోటీ, అపారమైన ఒత్తిడి, ఒక్క తప్పు కూడా తీవ్రమైన పరిణామాలను తెచ్చిపెట్టే సామర్థ్యం.

విద్యార్థులపై ప్రభావం..
గావోకావో, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ లేదా యూపీఎస్‌సీ వంటి పరీక్షలు విద్యార్థులను కేవలం పరీక్షించడం మాత్రమే కాదు. వారి బాల్యం, యవ్వనం, నిద్ర, ఆరోగ్యం, స్నేహాలు అన్నింటినీ బలి చేసి, ఒకే లక్ష్యం వైపు నడిపిస్తాయి. చైనాలో గావోకావో సీజన్‌లో దేశమంతా ఒక అసాధారణ నిశ్శబ్దం నెలకొంటుంది. నిర్మాణాలు, హార్న్‌లు, ట్రాఫిక్‌ కూడా నియంత్రించబడతాయి. భారత్‌లో కూడా జేఈఈ, యూపీఎస్‌సీ సీజన్‌లో కోచింగ్‌ సెంటర్లు, రాత్రి పగలు అధ్యయనం, కుటుంబాల ఒత్తిడి సాధారణమే. ఈ పరీక్షలు ఒకవైపు మేధావులను ఎంపిక చేస్తాయి. మరోవైపు విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌ను పెంచుతాయి.

ఒక్క పరీక్ష జీవితాన్ని నిర్ణయించే వ్యవస్థ ఎంతవరకు సరైనది అన్నది ప్రపంచవ్యాప్త చర్చగా మారింది. గావోకావో గురించి మాట్లాడేటప్పుడు ఒక విషయం స్పష్టం. ఇది కేవలం పరీక్ష కాదు. ఇది ఒక దేశం యొక్క విద్యా వ్యవస్థ, సామాజిక నిర్మాణం, భవిష్యత్తును రూపొందించే శక్తివంతమైన యాత్ర.

190 అణ్వాయుధాలు.. పాకిస్తాన్‌ కవ్విస్తే ఖతం అవ్వడం ఖాయం..

190 Nuclear Weapons Arsenal
190 Nuclear Weapons Arsenal

190 Nuclear Weapons Arsenal: ప్రపంచ రాజకీయాలు ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో దేశాలు తమ సైనిక బలాన్ని భారీగా పెంచుకుంటున్నాయి. ముఖ్యంగా అణుశక్తి దేశాలు తమ ఆయుధ సంపత్తిని వేగంగా విస్తరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. స్టాక్‌హోమ్‌ అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ (ఎస్‌ఐపీఆర్‌ఐ) సోమవారం విడుదల చేసిన తాజా నివేదిక ఈ వాస్తవాన్ని స్పష్టంగా బయటపెట్టింది. ఎస్‌ఐపీఆర్‌ఐ నివేదిక ప్రకారం, 2026 జనవరి నాటికి భారత్‌ వద్ద 190 అణు వార్హెడ్లు ఉన్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే 10 వార్హెడ్లు పెరిగాయి. పాకిస్తాన్‌ వద్ద 170 ఉన్నాయి. అంటే మన దాయాది కన్నా మన వద్ద 20 అణ్వాయుధాలు ఎక్కువగా ఉన్నాయి.

దూసుకెళ్తున్న చైనా..
ఇక డ్రాగన్‌ కంట్రీ చైనా మాత్రం మరింత వేగంగా ముందుకు వెళ్తోంది. ప్రస్తుతం బీజింగ్‌ వద్ద 620 అణు వార్హెడ్లు ఉన్నాయి, గతేడాది కంటే 20 ఎక్కువ. ప్రపంచంలో అత్యధిక అణ్వాయుధాలు రష్యా(5,420), అమెరికా (5,042) వద్దనే ఉన్నప్పటికీ, చైనా వేగం ఇతర దేశాలకు ఆందోళన కలిగిస్తోంది.

తొమ్మిది అణుశక్తి దేశాలు..
ప్రపంచ వ్యాప్తంగా 9 అణుశక్తి దేశాలు ఉన్నాయి. ఈ దేశాల వద్ద12 వేలకుపైగా అణ్వాయుధాలు ఉన్నాయి. ఫ్రాన్స్‌ (370), యూకే (225), ఇజ్రాయెల్‌ (90), ఉత్తర కొరియా (60) కూడా తమ సంపత్తిని ఆధునికీకరిస్తున్నాయి.

భారత్‌ 5వ స్థానం..
అణు సామర్థ్యంతోపాటు సాధారణ రక్షణ ఖర్చుల్లోనూ భారత్‌ గణనీయమైన పురోగతి సాధించింది. 2025లో భారత్‌ రక్షణ వ్యయం 92.1 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 8.9 శాతం ఎక్కువ. దీంతో ప్రపంచంలోనే అత్యధిక రక్షణ వ్యయం చేసే దేశాల జాబితాలో భారత్‌ 5వ స్థానం సాధించింది. 2021–25 మధ్య కాలంలో ప్రపంచ రక్షణ దిగుమతుల్లో 8.2 శాతం భారత్‌ వాటా ఉంది. ఇది దేశం తన సైనిక అవసరాలను తీవ్రంగా పట్టించుకుంటున్నట్లు సూచిస్తోంది. ఇప్పుడు అణ్వాయుధాలు కూడా పెరిగిన నేపథ్యంలో పాకిస్తాన్‌ తోక జాడిస్తే ఇక ప్రపంచ పటంలో కనుమరుగు కావడం ఖాయం.

వ్యూహాత్మక అవసరం..
ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో భారత్‌ ఈ అడుగులు అనివార్యమే. ఉత్తర సరిహద్దుల్లో చైనా ఆధిపత్య ఆకాంక్షలు, పాకిస్తాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, హిందూ మహాసముద్రంలో పెరుగుతున్న చైనా నౌకాదళ కార్యకలాపాలు ఇవన్నీ భారత్‌ను బలమైన నిరుత్తర శక్తిని నిర్మించుకోవడానికి బలవంతం చేస్తున్నాయి. అయితే, కేవలం సంఖ్యల పెరుగుదల మాత్రమే సమస్య పరిష్కారం కాదు. ఆధునిక డెలివరీ సిస్టమ్‌లు, సాంకేతిక ఆధునికీకరణ, స్వయం సమృద్ధి (ఆత్మనిర్భర్‌ భారత్‌) దిశగా మరింత వేగంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో, ‘‘నో ఫస్ట్‌ యూజ్‌’’ విధానాన్ని కొనసాగిస్తూనే, నమ్మకమైన నిరోధక శక్తిని నిర్మించడం కీలకం.

ప్రపంచం మళ్లీ అణు ఆయుధాలపై ఆధారపడుతున్న ఈ కాలంలో భారత్‌ సమతుల్య వ్యూహంతో ముందుకు సాగాలి. రక్షణ బలోపేతం అనేది కేవలం యుద్ధ సన్నాహాలు కాదు.. శాంతిని కాపాడుకోవడానికి అవసరమైన బలమైన ఆధారం. ఈ ఎస్‌ఐపీఆర్‌ఐ నివేదిక భారత్‌కు ఒకేసారి గర్వకారణం. హెచ్చరిక కూడా. బలం పెంచుకోవాలి, అయితే బాధ్యతావంతంగా, దూరదృష్టితో పని చేయాలి.

ఆఫ్ఘనిస్తాన్ మీద ఊహించిందే.. కానీ ఇది టీమిండియా టెస్ట్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయేది

India Vs Afghanistan Test Match History
India Vs Afghanistan Test Match History

India Vs Afghanistan Test Match History: టీమ్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన ఏకైక టెస్టులో అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఏకంగా 300 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. తద్వారా దక్షిణాఫ్రికా.. అంతకుముందు న్యూజిలాండ్ జట్లతో ఎదురైన దారుణ ఓటముల నుంచి సాంత్వన పొందింది. డబ్ల్యూటీసి పాయింట్ల పట్టికలో ఆరవ స్థానంలో ఉన్న టీమిండియా కు ఈ విజయం ఒక రకంగా రిలీఫ్ ఇచ్చింది.

ఐర్లాండ్, ఇంగ్లాండ్ జట్లతో టి20 సిరీస్ ల తర్వాత టీమిండియా శ్రీలంక, న్యూజిలాండ్ జట్లతో టెస్ట్ సిరీస్ లు ఆడుతుంది. ఆ సిరీస్ లలో టీమిండియా ఇలానే ఆడితే.. కచ్చితంగా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానాన్ని అందిపుచ్చుకుంటుంది. గతంలో రెండుసార్లు టీమ్ ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్స్ వెళ్ళింది. రెండుసార్లు కూడా ఓటమిపాలైంది. అయితే ఈసారి టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ వెళ్లాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికా.. అంతకు ముందు న్యూజిలాండ్ చేతిలో ఎదురైన ఓటములను మర్చిపోయి.. వరుసగా విజయాలు సాధించాలని బలమైన నమ్మకంతో ఉంది.

ఆఫ్గనిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 300 పరుగుల తేడాతో గెలుపును అందుకుంది. ఈ గెలుపు టీం ఇండియా టెస్ట్ క్రికెట్ చరిత్రలో అతి పెద్దది.. ముల్లాన్ పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో గెలుపొందింది. 2018లో వెస్టిండీస్ జట్టుతో రాజ్ కోట్ వేదికగా జరిగిన మ్యాచ్లో 272 పరుగులు తేడాతో విజయాన్ని అందుకుంది. 2018లో బెంగళూరు వేదికగా ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో టీమిండియా 262 పరుగుల తేడాతో గెలిచింది. 2007లో మీర్పూర్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో భారత్ 239 పరుగుల తేడాతో గెలిచింది 2017లో నాగపూర్ వేదికగా శ్రీలంక జట్టుతో జరిగిన మ్యాచ్లో టీమిండియా 239 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయాలు మొత్తం భారత్ ఇన్నింగ్స్ తేడాతో గెలవడం విశేషం.

టీమిండియా ఈ గెలుపును ఇక్కడితోనే ఆపివేయొద్దని అభిమానులు కోరుకుంటున్నారు. వచ్చే మ్యాచ్లో కూడా ఇదే స్థాయిలో జోరు చూపించాలని ఆశిస్తున్నారు. టీమిండియాలో మెరుగైన ప్లేయర్ లు ఉన్నారని.. వారంతా అద్భుతంగా ఆడితే తిరుగు ఉండదని చెబుతున్నారు. గిల్ నాయకత్వంలో టీమిండియా డబ్ల్యూటీసి ఫైనల్ ట్రోఫీ సాధించాలని కోరుకుంటున్నారు. టీమిండియా ఈ విజయంతోనే ఆగిపోతుందా.. వచ్చే సిరీస్లలో కూడా అదరగొడుతుందా.. చూడాల్సి ఉంది.

క్యాబ్ డ్రైవర్ ని చితకబాదిన కాట్ రాజ్ అలియాస్ సుప్రీత్.. అసలు ఏమైందంటే..

Kat Raj Alias Supreeth Assault Case
Kat Raj Alias Supreeth Assault Case

Kat Raj Alias Supreeth Assault Case: అనేక సూపర్ హిట్ సినిమాల్లో విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్టు గా నటించి తనకంటూ సినీ ఇండస్ట్రీ లో ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న నటుడు సుప్రీత్. ఈయన్ని ‘ఛత్రపతి’ సినిమాలో కాట్ రాజ్ గా మనం గుర్తు పట్టొచ్చు . ఇందులో ఆయన ప్రభాస్ తో ఏ రేంజ్ లో తలపడుతాడో మనమంతా చూశాము. అలా ఆయన దాదాపుగా అందరి స్టార్ హీరోల సినిమాల్లోనూ విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసాడు. అయితే ఆయన కేవలం సినిమాల్లోనే కాదు, నిజ జీవితం లో కూడా విలన్ లాగానే వ్యవహరిస్తున్నాడని రీసెంట్ గా జరిగిన ఒక సంఘటన ఉదాహరణ గా నిల్చింది. అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే , ఈయన ఆదివారం రోజున శ్రీహరి అనే క్యాబ్ డ్రైవర్ ని చితకబాదినట్టు తెలుస్తోంది. ఈమేరకు నేడు ఉదయం సుప్రీత్ పై కీసర పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే శ్రీహరి అనే క్యాబ్ డ్రైవర్ ఆదివారం రాత్రి తన ట్రిప్ ని పూర్తి చేసుకొని నాగారం చౌరస్తా లో ఒక రోడ్డు సైడ్ కారు ని పార్క్ చేశాడు. అదే సమయం లో సుప్రీత్ తన కారులో అటువైపుగా వచ్చాడు, శ్రీహరి దగ్గరకు వెళ్లి , నా కారు కి అడ్డంగా పెట్టావు అంటూ కోపం తో ఊగిపోయి , పూర్తిగా విచక్షణ కోల్పోయి దాడికి పాల్పడ్డాడు అని బాధితుడు కంప్లైంట్ లో పేర్కొన్నాడు. దీంతో శ్రీహరి తక్షణమే పోలీసులకు ఫోన్ చేయడం , వాళ్ళు వెంటనే ఘటన స్థలం వద్దకు వచ్చి పరిస్థితి ని సద్దుమణిగేలా చేయడం చేశారట. బాధితుడు శ్రీహరి ఇచ్చిన కంప్లైంట్ మేరకు నేడు నటుడు సుప్రీత్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు.

మరోపక్క సుప్రీత్ వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి తీవ్రమైన ట్రోల్స్ ఎదురు అవుతున్నాయి. సుప్రీత్ కి సెలబ్రిటీ అనే అహంకారం ఎక్కువ అవ్వడం వల్లే , ఇలా ప్రవర్తించాడని అంటున్నారు. అయితే ఇన్ని రోజులు సుప్రీత్ ఇలాంటి వివాదాల్లో చిక్కుకోలేదు , ఇతర సెలబ్రిటీలతో పోలిస్తే సుప్రీత్ మీడియా కి చాలా దూరంగా ఉంటాడు. అలాంటి వ్యక్తి గురించి నేడు ఇలాంటి వార్త వచ్చిందంటే , అక్కడ ఏమి జరిగిందో పూర్తి సమాచారం తెలుసుకోకుండా, నిందించడం కరెక్ట్ కాదని అంటున్నారు నెటిజెన్స్. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. ఇకపోతే సుప్రీత్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఆయనకు సినిమాల్లో డిమాండ్ ఇసుమంత కూడా తగ్గకపోవడం గమనార్హం. ఈ ఏడాది ఆయన తెలుగు లో ‘ది రాజాసాబ్ ‘, ‘గాయపడిన సింహం’ వంటి చిత్రాల్లో నటించగా , తమిళం లో ‘కరుప్పు’ అనే చిత్రంలో నటించాడు.

సరికొత్త Display తో Vivo కొత్త ఫోన్..

Vivo V70 Lite 5G Launch
Vivo V70 Lite 5G Launch

Vivo V70 Lite 5G Launch: Vivo కంపెనీ తన V 70 సిరీస్‌లో భాగంగా కొత్తగా Vivo V70 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా యూఏఈ (UAE) మార్కెట్లో విడుదల చేసింది. స్టైలిష్ గా ఫోన్ ఉండాలని అనుకునే వారితో పాటు అద్భుతమైన కెమెరా కావాలని కోరుకునే వారికి ఈ ఫోన్ స్పెషల్ అని చెప్పవచ్చు. ఈ ఫోన్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

Vivo V70 Lite 5G స్మార్ట్‌ఫోన్ చూడటానికి చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. 7.59mm మందంతో 194 గ్రాముల బరువుతో వస్తుంది. ఇందులో 6.77-అంగుళాల ఫుల్ HD ప్లస్ AMOLED డిస్‌ప్లేను అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉండటంతో పాటు 3,000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది.

ఫోన్ పనితీరు కోసం ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో చిప్‌సెట్‌ను అమర్చారు. ఇది 4nm ప్రాసెస్‌పై ఆధారపడి పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. మెమరీ విషయానికి వస్తే.. ఇందులో 8GB RAM, 128GB లేదా 256GB స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా అవసరమైతే వర్చువల్ ర్యామ్ సపోర్ట్‌తో దీనిని పెంచుకోవచ్చు.

ఫోటోగ్రఫీ కోసం వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌ను ఇచ్చారు. ఇందులో 50 మెగాపిక్సెల్ సోనీ మెయిన్ సెన్సార్ ఉండగా.. దానికి తోడుగా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. సెల్ఫీల కోసం, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఈ కెమెరాతో 4K వీడియో రికార్డింగ్ కూడా సాధ్యమవుతుంది.

ఈ ఫోన్ యొక్క అతిపెద్ద ఆకర్షణ దాని భారీ బ్యాటరీ. ఇందులో 6,500mAh కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఇచ్చారు. ఇది ఎక్కువ కాలం మన్నికను అందిస్తుంది. దీనిని వేగంగా ఛార్జ్ చేయడానికి 90W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. ఇంకా ఈ ఫోన్ IP65 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో వస్తుంది. కనెక్టివిటీ కోసం 5G, వైఫై, బ్లూటూత్ 5.4, NFC వంటి ఆధునిక ఫీచర్లను కూడా ఇందులో చూడవచ్చు.

ప్రస్తుతానికి ఈ ఫోన్ యూఏఈ మార్కెట్లో మాత్రమే అందుబాటులో ఉంది. దీని 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర AED 1,099 (భారత కరెన్సీలో సుమారు రూ. 28,500) గా ఉంది. అలాగే 256GB వేరియంట్ ధర AED 1,299 (సుమారు ₹33,700) గా నిర్ణయించారు. ఇది బ్లాక్ మరియు గోల్డ్ రంగులలో లభిస్తోంది. భారత మార్కెట్లో ఈ ఫోన్ Vivo V70e పేరుతో వచ్చే అవకాశం ఉందని సమాచారం.

'బిగ్ బాస్ 10 ' ప్రోమో పై తీవ్రమైన ట్రోల్స్.. ఇలా అయితే చాలా కష్టం..

Bigg Boss 10 Promo Trolled
Bigg Boss 10 Promo Trolled

Bigg Boss 10 Promo Trolled: ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘బిగ్ బాస్ 10’ రియాలిటీ షో ఈ సెప్టెంబర్ నెల నుండి ప్రారంభం కాబోతుంది. గత సీజన్ అందరి అంచనాలను మించి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో , ఈ సీజన్ పై అంచనాలు ఈ స్థాయిలో పెరగడానికి కారణం అయ్యాయి. ముఖ్యంగా ‘అగ్ని పరీక్ష’ షో ఒక సునామీ నే క్రియేట్ చేసింది. ఈ షో ద్వారా సామాన్యులుగా అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ , బిగ్ బాస్ 9 ని సెన్సేషనల్ హిట్ చేశారు. అందుకే ఈ సీజన్ కి కూడా ‘అగ్నిపరీక్ష’ షో ని నిర్వహించబోతున్నారు. గత సీజన్ కి వేళల్లో దరఖాస్తులు వస్తే , ఈ సీజన్ కి లక్షల్లో దరఖాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే ప్లానింగ్ కూడా వేరే లెవెల్ లో ఉండేలా చూసుకుంటున్నారు.

ఇకపోతే రీసెంట్ గానే ‘బిగ్ బాస్ 10’ కి సంబంధించిన ప్రోమో ని విడుదల చేశారు మేకర్స్. ఈ ప్రోమో లో నాగార్జున ఎప్పటి లాగానే ఫుల్ జోష్ తో కనిపించారు. గ్రాండ్ గా బిగ్ బాస్ 10 లోగో ని కూడా ఆవిష్కరించారు. కానీ టెక్నీకల్ టీం లోపం కారణం గా ఈ ప్రోమో కి ఆడియో సరిగా లేదు. నాగార్జున గొంతు ప్రోమో లో సరిగా వినిపించడం లేదు. ఆ కారణం చేత, సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి టీం పై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. ఇంత పెద్ద రియాలిటీ షో కి సంబంధించిన ప్రోమో ని కట్ చేస్తున్నప్పుడు కాస్త చూసుకోవాలి కదా, ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తారో అర్థం కావడం లేదంటూ ప్రేక్షకులు మండిపడుతున్నారు. త్వరలోనే ‘అగ్నిపరీక్ష’ కి సంబంధించిన ప్రోమో ని కూడా విడుదల చేస్తారట. ఈ నెలలోనే షూటింగ్ కూడా మొదలు అవుతుందని టాక్.

ఇకపోతే ఈ షోకి ‘అగ్నిపరీక్ష’ షో ద్వారా సామాన్యులుగా ఎంట్రీ ఇచ్చి , తిరుగులేని క్రేజ్, పాపులారిటీ ని సంపాదించుకున్న కళ్యాణ్ పడాల , డిమోన్ పవన్, శ్రీజ దమ్ము వంటి వారు కూడా ‘అగ్ని పరీక్ష 2’ లో భాగం కాబోతున్నారని తెలుస్తోంది. వీళ్ళు ఈ షో లో మెంటార్స్ గా వ్యవహరించబోతున్నట్టు టాక్. అదే విధంగా ఈ షో కి జడ్జీలుగా శివాజీ, గీతా మాధురి, అభిజీత్ వంటి వారు వ్యవహరిస్తారట . యాంకర్ గా శ్రీముఖి నే ఉండబోతుంది. ఇక సెలబ్రిటీ కంటెస్టెంట్స్ జాబితాలో పలువురు టాప్ సెలబ్రిటీల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీళ్ళే దాదాపుగా ఖరారు అయ్యినట్టు తెలుస్తోంది . ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో విజయవంతంగా నడుస్తున్న ‘కూకూ విత్ జాతి రత్నాలు 2’ తో పాటుగా , ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్ ‘ షో లో పాల్గొన్న కంటెస్టెంట్స్ ఇందులో కనిపించబోతున్నట్టు సమాచారం, త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.

'పెద్ది' 4 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..తెలుగు రాష్ట్రాల్లో 'దేవర', 'ఓజీ' రికార్డ్స్ అవుట్..

Peddi 20 Days Worldwide Collections
Peddi 20 Days Worldwide Collections

Peddi 4 Days Worldwide Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం విడుదలై అప్పుడే 4 రోజులు పూర్తి అయ్యింది. ఈ నాలుగు రోజుల్లో ఈ చిత్రానికి నమోదైన వసూళ్లు ట్రేడ్ పండితులను సైతం షాక్ కి గురయ్యేలా చేసింది. ఒక్క ఓవర్సీస్ తప్ప, అన్నీ ప్రాంతాల్లోనూ ఈ చిత్రానికి కాసుల కనకవర్షం కురిసింది. ముఖ్యంగా తెలుగు , రాష్ట్రాల్లో అయితే ఈ చిత్రానికి ‘ఓజీ’, ‘దేవర’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ కలెక్షన్స్ ని కూడా దాటేసింది. ఓజీ చిత్రానికి మొదటి వీకెండ్ లో 103 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు తెలుగు రాష్ట్రాల నుండి రాగా, ‘దేవర చిత్రానికి 102 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. కానీ ‘పెద్ది’ చిత్రానికి ఏకంగా 106 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు. ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి ఎంత షేర్ వసూళ్లు వచ్చింది అనేది ఇప్పుడు మనం చూద్దాము.

ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తుంటే, ఈ చిత్రానికి 4 వ రోజున తెలుగు రాష్ట్రాల నుండి 20 కోట్ల 12 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు పుష్ప 2, ‘కల్కి’ చిత్రాలు మాత్రమే , మొదటి ఆదివారం రోజున 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాయి , ఇప్పుడు ఆ జాబితాలోకి పెద్ది చిత్రం కూడా వచ్చి చేరింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో వచ్చినంత వసూళ్లు ఓవర్సీస్ నుండి మాత్రం ఈ చిత్రానికి రావడం లేదు. అక్కడ నాల్గవ రోజున కేవలం 4 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయట. ఓవరాల్ గా ఈ చిత్రానికి మొదటి వీకెండ్ (4 రోజులు) లో ప్రపంచవ్యాప్తంగా 240 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

హిందీ , ఓవర్సీస్ ప్రాంతాల్లో ఈ చిత్రానికి అనుకున్నంత స్థాయిలో వసూళ్లు నమోదు అవ్వడం లేదు. ఆ కారణం చేత ఈ చిత్రం లాంగ్ రన్ లో కచ్చితంగా 300 కోట్ల గ్రాస్ వసూళ్లను దాటుతుంది కానీ, అంతకు మించి ఎక్కువ వసూళ్లు రావడం మాత్రం ప్రస్తుతానికి కష్టమే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి 4 వ రోజున 7 కోట్ల 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి, ఓవరాల్ గా మొదటి వీకెండ్ లో ఈ చిత్రానికి నైజాం నుండి 37 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. 2వ వీకెండ్ లో ఈ చిత్రానికి కచ్చితంగా 50 కోట్ల షేర్ వసూళ్లను వస్తుందని , ఫుల్ రన్ లో 100 కోట్ల గ్రాస్ వసూళ్లు ఈ ప్రాంతం నుండి నమోదు అవుతాయని అంటున్నారు.