Homeబిజినెస్Jio Rs 55 Recharge Plan: రూ.55 తో జియో కొత్త రీఛార్జ్ ప్లాన్.. ఇక...

Jio Rs 55 Recharge Plan: రూ.55 తో జియో కొత్త రీఛార్జ్ ప్లాన్.. ఇక పండుగ చేసుకోండి.. వీరికి బాగా యూజ్ ఫుల్..

Jio Rs 55 Recharge Plan: తక్కువ ధరలో ఎక్కువ వినోదాన్ని అందించాలనే లక్ష్యంతో Jio తన వినియోగదారుల కోసం కొత్త యాడ్-ఆన్ రీఛార్జ్ ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా 1,000కుపైగా లైవ్ టీవీ ఛానళ్లను వీక్షించే అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే యాక్టివ్‌గా ఉన్న జియో మొబైల్ ప్లాన్‌కు అదనంగా ఈ యాడ్-ఆన్ ప్యాక్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చు. అయితే ఎంత రీఛార్జ్ చేస్తే ఈ ప్లాన్ పొందవచ్చు? ఎంత వరకు వ్యాలిడిటీ ఉంటుంది? […]

Jio Rs 55 Recharge Plan: తక్కువ ధరలో ఎక్కువ వినోదాన్ని అందించాలనే లక్ష్యంతో Jio తన వినియోగదారుల కోసం కొత్త యాడ్-ఆన్ రీఛార్జ్ ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా 1,000కుపైగా లైవ్ టీవీ ఛానళ్లను వీక్షించే అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే యాక్టివ్‌గా ఉన్న జియో మొబైల్ ప్లాన్‌కు అదనంగా ఈ యాడ్-ఆన్ ప్యాక్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చు. అయితే ఎంత రీఛార్జ్ చేస్తే ఈ ప్లాన్ పొందవచ్చు? ఎంత వరకు వ్యాలిడిటీ ఉంటుంది?

ఈ యాడ్-ఆన్ ప్లాన్‌కు 30 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. నెల రోజుల పాటు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా లైవ్ టీవీ ఛానళ్లను వీక్షించవచ్చు. ముఖ్యంగా టీవీని మొబైల్‌లోనే చూడాలనుకునే వినియోగదారులకు ఈ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుందని జియో పేర్కొంది. ఈ ప్లాన్‌లో సాధారణ ఛానళ్లతో పాటు 150కుపైగా ప్రీమియం టీవీ ఛానళ్లు కూడా అందుబాటులో ఉంటాయి. వినోదం, సినిమాలు, వార్తలు, క్రీడలు, పిల్లల కార్యక్రమాలు, ఆధ్యాత్మికం, సంగీతం, ప్రాంతీయ భాషల ఛానళ్లు వంటి విభిన్న కేటగిరీలలో కంటెంట్‌ను వీక్షించవచ్చు.

యాడ్-ఆన్ ప్లాన్ ద్వారా జియోస్టార్, సోనీ, సన్ టీవీ, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ వంటి ప్రముఖ బ్రాడ్‌కాస్ట్ నెట్‌వర్క్‌లకు చెందిన ఛానళ్లను యూజర్లు వీక్షించవచ్చని జియో వెల్లడించింది. దీంతో ఒకే ప్లాన్‌లో పలు ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్, న్యూస్ ఛానళ్లు అందుబాటులోకి వస్తాయి.

వినియోగదారులు ముందుగా రూ. 55 యాడ్-ఆన్ ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకోవాలి. అనంతరం జియోటీవీ (JioTV) యాప్‌లో తమ జియో మొబైల్ నంబర్‌తో లాగిన్ అయితే ఈ ప్లాన్‌లో ఉన్న ఛానళ్లను వెంటనే యాక్సెస్ చేయవచ్చు. అదనంగా ఎలాంటి సెటప్ అవసరం ఉండదని కంపెనీ తెలిపింది.

స్మార్ట్‌ఫోన్‌లోనే లైవ్ టీవీ చూడాలనుకునే వారు, ప్రయాణాల్లో వినోదాన్ని ఆస్వాదించాలనుకునే వినియోగదారులు, తక్కువ ఖర్చుతో ప్రీమియం టీవీ ఛానళ్లను వీక్షించాలనుకునే జియో కస్టమర్లకు ఈ ప్లాన్ మంచి ఎంపికగా నిలవనుంది. ఇప్పటికే యాక్టివ్ జియో మొబైల్ కనెక్షన్ ఉన్నవారు ఈ యాడ్-ఆన్ ప్యాక్‌ను సులభంగా పొందవచ్చు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper