Homeఎంటర్టైన్మెంట్Vanda Devullu Review: 'వంద దేవుళ్ళు' ఫుల్ మూవీ రివ్యూ...హిట్టా.? ఫట్టా..?

Vanda Devullu Review: ‘వంద దేవుళ్ళు’ ఫుల్ మూవీ రివ్యూ…హిట్టా.? ఫట్టా..?

Vanda Devullu Review: ‘ కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ‘బిచ్చగాడు’ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాతో విజయ్ అంటోని తన సత్తా ఏంటో చూపించాడు. ఇక అప్పటినుంచి ఆయన చేసిన ప్రతి సినిమాని తెలుగులో డబ్ చేస్తున్నాడు. అయితే అందులో కొన్ని విజయాలను సాధిస్తే, మరికొన్ని అపజయాలుగా మారుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే బిచ్చగాడు సినిమాతో తనకు సక్సెస్ ని అందించిన శశి దర్శకత్వంలో మరోసారి ‘వంద దేవుళ్ళు’ అనే సినిమాతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకుందాం…

కథ

వాసవి (శ్వాసిక) అనే ఆవిడ పాతికేళ్ల వయసులోనే పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిస్తుంది. ఇక ఆ వెంటనే తన భర్త చనిపోవడంతో పిల్లలను ఎలాగైనా సరే బాగా చదివించి ప్రయోజకులను చేయాలనే ఉద్దేశ్యంతో మరో పెళ్లి చేసుకోకుండా పిల్లల బాగోగులు చూసుకుంటూ ఉంటుంది. పొద్దంతా కష్టం చేస్తూ పనిచేసి తమ పిల్లలను కాపాడుకోవడమే తన లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతుంది. ఇక ఈ క్రమంలోనే ఊర్లో ఉండే కొంతమంది ఆకతాయి ఆమెను ఉద్దేశించి కొన్ని సూటిపోటి మాటలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయినప్పటికి ఆమె ఎవరికీ భయపడకుండా ఒంటరిగా జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉంటుంది…

పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత మా అమ్మ ఇన్ని సంవత్సరాల పాటు ఒంటరిగా ఉంటూ మా కోసం ఆమె జీవితాన్ని త్యాగం చేసిందని ఆలోచించి అమ్మకి మరో పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఈ నిర్ణయాన్ని వాసవి ఎలా స్వీకరించింది. ఏడు కొండలు (విజయ్ ఆంటోనీ) అనే ఒక పర్సన్ తన జీవితంలోకి ఎలా వచ్చాడు. వాసవి పిల్లలు తనకి పెళ్లి చేశారా? లేదా అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

దర్శకుడు శశి ఈ సినిమాని పూర్తిగా భావోద్వేగాలతో నిండిన కథగా మలిచాడు. సినిమా మొదటి నుంచి చివరి వరకు చాలా ఎమోషన్స్ ని కనెక్ట్ చేస్తూ స్క్రీన్ ప్లే అయితే రాసుకున్నాడు. అమ్మ పాతికేళ్లకే పెళ్లి చేసుకొని పిల్లలకు జన్మనిచ్చినంత మాత్రాన తన సర్వస్వాన్ని కోల్పోయి పిల్లల కోసమే తన జీవితాన్ని త్యాగం చేయాలా తనకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా… ఆమె స్వేచ్ఛ ను ఎందుకు కోల్పోవాలి పురాతన కాలం నుంచి వచ్చిన కట్టుబాట్లకు లోబడి ఇలాంటి ఒక నిర్ణయాలను అందరు అనుసరిస్తున్నారని ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుందని వాళ్లని కూడా వాళ్లకు తగ్గట్టుగా బ్రతకనివ్వాలి అనే ఒక గొప్ప పాయింట్ ను ఈ సినిమాలో చెప్పే ప్రయత్నం చేశాడు.

ముఖ్యంగా ఫస్టాఫ్ అంతా ఎంటర్టైనింగ్ గా తీసుకెళ్లిన ఆయన సెకండ్ హాఫ్ లో బాధ్యతలు విలువలకు సంబంధించిన కొన్ని విషయాలను చాలా స్ట్రాంగ్ గా చూపించాడు. క్లైమాక్స్ విషయంలో చాలా ఎమోషనల్ గా మలుస్తాడని అందరు అనుకున్నప్పటికి అది చాలా కామెడీ వే లో తీసుకెళ్లాడు. ఎందుకంటే ఇలాంటి సినిమాల్లో క్లైమాక్స్ అంటే పెద్ద పెద్ద డైలాగులు క్లాసులు పీకడాల్లాంటివి ఉంటాయి. కానీ ఆయన మాత్రం ఇది రొటీన్ గా కాకుండా చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశాడు. ఇక సెకండాఫ్ లో వచ్చే కొన్ని యూట్యూబ్ ఎపిసోడ్లు కామెడీని పండిస్తూ ఉంటాయి. దాని వల్ల కూడా సినిమాను చూసే ప్రేక్షకుడు కొంతవరకు ఎంగేజ్ అవుతూ ఉంటాడు… ఇక విజయ్ ఆంటోని వాసవి మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు చాలా బాగున్నాయి.

వాళ్ళిద్దరి మధ్య వచ్చిన ప్రతి సన్నివేశం కూడా స్క్రీన్ మీద అద్భుతంగా పేలింది… కొన్ని సన్నివేశాల్లో బ్యా గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి చాలా వరకు హెల్ప్ అయ్యింది… ఇక సెకండాఫ్ లో మాత్రం సీన్ కి సీన్ కి ఫ్లో బాగా సెట్ అయింది. ప్రతి సీన్లో కూడా ఏదో ఒక డిటెలింగ్ ను చూపించే ప్రయత్నం చేశారు. దర్శకుడు సినిమా కోసం చాలా వరకు హార్డ్ వర్క్ చేసిన విషయం అయితే మనకు స్క్రీన్ మీద చాలా స్పష్టంగా కనిపిస్తుంది…

ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్

అజయ్ ఆంటోనీ కనిపించింది చాలా తక్కువసేపే అయినా కూడా ఆయన చాలా ఎఫెక్టివ్ గా నటించాడు. తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించాడు. ఇంతకుముందే అతను చాలా సినిమాల్లో తన నట విశ్వరూపం చూపించాడు. దానికి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాలోని ఇంటెన్స్ చెడిపోకుండా తన క్యారెక్టర్ యొక్క పరిధిని తెలుసుకొని మరి అందులోనే నటించి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు… ఇక శ్వాసిక అయితే తన పాత్రలో ఒదిగిపోయి నటించింది… బరువు బాధ్యతలను మోస్తున్న ఒక అమ్మాయి ఎలా ఉంటుంది. ఆమె నడవడిక ఎలా ఉంటుంది. ఇతరులతో మాట్లాడినప్పుడు ఆమె భావోద్వేగాలు ఎలా ఉంటాయి అనేది కూడా ఆమె స్పష్టంగా నటించి మెప్పించింది.

మరి దీనికోసం ఆమె స్పెషల్ గా ఏమైనా కసరత్తులు చేసిందా లేదా అనేది తెలియదు కానీ మొత్తానికైతే ఆ పాత్రకి పర్ఫెక్ట్ గా న్యాయం చేసింది… ఇక విజయ్ ఆంటోనీ ఏడుకొండలు పాత్రలో ఒదిగిపోయి నటించాడు. ఆయన చెప్పిన దైపగుపు కూడా ప్రేక్షకులకు బాగా కి ఇస్తున్నాయి… ఇక మిగిలిన ఆర్టిస్టులందరు కూడా వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…

ప్లస్ పాయింట్స్

శ్వాసిక యాక్టింగ్
ఎమోషనల్ సన్నివేశాలు
బ్యాగ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్

కొన్ని సన్నివేశాలు లాగ్ అయ్యాయి…
ఫస్టాఫ్ ఇంకెంచెం బెటర్ గా ఉంటే బాగుండేది..

రేటింగ్ : 2.5/5

చివరి లైన్ : ఎమోషనల్ సినిమాలు నచ్చే వాళ్ళకి ఈ మూవీ బాగా నచ్చుతుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular