Night Diet: ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఏ సమయం అయినా సరే కానీ సరైన సమయానికి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే చాలా సమస్యలు వస్తాయి. బరువు తగ్గాలని కొందరు రాత్రిపూట అన్నం తినడం పూర్తిగా మానేస్తున్నారు. ఇలా చేస్తే నిద్రలేమి, డిప్రెషన్ తో పాటుగా జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. సరైన సమయానికి తినడం వల్ల బరువు పెరగరు. కానీ తినే ఆహారంలో మాత్రం కాస్త చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఏ టైం కు తింటున్నారనేది మీ జీర్ణక్రియ, నిద్ర నాణ్యత, జీవక్రియలను ప్రభావితం చేస్తుంది అంటున్నారు నిపుణులు. 9,10 గంటలకు కాకుండా.. రాత్రి 8 గంటల్లోపు ఆహారం తీసుకోవాలట. ఇలా తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
జీర్ణక్రియ: రాత్రిపూట శరీర మెటబాలిజం తగ్గుతుందట.ఇలాంటి సమయంలో ఆహారం ఆలస్యంగా తింటే త్వరగా జీర్ణం అవదు. దీనివల్ల శరీరంలో కొవ్వులు పేరుకుంటాయి. సో బరువు పెరుగుతారు. కడుపు ఉబ్బరం సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు. కానీ రాత్రి 8 గంటల్లోపు తింటే ఇలాంటి సమస్యలేమీ రావు. అంతేకాదు మీరు తిన్నది బెటర్ గా జీర్ణం కావడానికి సమయం ఉంటుంది కూడా. అలాగే గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు రావు. శరీరంలో కొవ్వులు కూడా పేరుకుపోవు. అందుకే రాత్రి 8 గంటల్లోపు భోజనం చేయాలి.
నిద్రపోతున్న సమయంలో శరీరంలోని అన్ని అవయవాలు విశ్రాంతి తీసుకుంటాయి. ఇలాంటి సమయంలో భోజనం లేట్ గా చేస్తే నిద్రపోయేటపుడు కడుపు ఉబ్బరంగా ఉండి నిద్రకు కూడా భంగం కలుగుతుంది. అవయవాలకు విశ్రాంతి ఉండకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది.
నిద్ర నాణ్యత: రాత్రిపూట మరీ హెవీగా తింటే చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా కడుపు నొప్పి, జీర్ణక్రియ సమస్యల బారిన పడతారు. తెల్లవార్లు నిద్ర కూడా ఉండదు. రాత్రి 8 గంటల్లోపు భోజనం చేస్తే తిన్నది 2 నుంచి 3 గంటల్లో జీర్ణం అవుతుంది. అందుకే రాత్రి 8 కల్లా తినేసి రాత్రి 10 నుంచి 10.30 గంటల మధ్య నిద్రపోతే సమస్యే ఉండదు కద. సో బాగా నిద్ర పడుతుంది.ఉదయం కూడా ఫాస్ట్ గా నిద్ర లేస్తారు. గంటలకు తింటే మీ మీ కడుపు ఎప్పుడు విశ్రాంతి తీసుకుంటుందో మీరే థింక్ చేయండి. పాపం కడుపుకు కూడా విశ్రాంతి అవసరం కదా.అందుకే మీరు త్వరగా తింటే త్వరగా నిద్రపోతారు. దీనివల్ల ఆరోగ్యంగా ఉంటారు.
వెయిట్ లాస్: మీరు త్వరగా భోజనం చేస్తే బరువు తగ్గుతారు అంటున్నాయి కొన్ని అధ్యయనాలు. ఎందుకంటే తిన్న ఆహారం జీర్ణమైతే పొట్టలో కొవ్వు పేరుకుపోదు కదా. దీనికి ప్రధాన కారణం రాత్రిపూట మెటబాలిజం తక్కువగా ఉంటుంది. ఇది క్యాలరీల బర్నింగ్ పై ప్రభావం చూపుతుందని అందుకే లేట్ గా తింటే శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. తద్వారా బరువు పెరుగుతారు. మీరు రాత్రి 8 గంటల్లోపు తింటే మీరు ఆ తర్వాత ఏది తినరు కూడా. బ్రేక్ ఫాస్ట్ వరకు ఇతర పదార్థాలు కూడా తినే సమయం ఉండదు. సో మీ కడుపు సేఫ్. ఆరోగ్యం కూడా సేఫ్.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు..