Nevada Gold Mines: ప్రస్తుతం బంగారం ధరలు ఊహించని ఎత్తుకు చేరాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు రూ.1.30 లక్షలు దాటింది. సాధారణ ప్రజలకు అందుబాటులోనుంచి దూరమైంది. మార్కెట్ విశ్లేషకుల ప్రకారం, ఒక్క సంవత్సరంలోనే ధరల పెరుగుదల సుమారు 50 శాతం దాటింది. ఈ సందర్భంలో చాలామందిలో ‘‘ప్రపంచంలో అత్యధిక బంగారం ఎక్కడ లభిస్తుంది?’’ అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
నెవాడా గోల్డ్ మైన్..
అమెరికా నెవాడా రాష్ట్రంలో విస్తరించిన నెవాడా గోల్డ్ మైన్ ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గనిగా గుర్తింపు పొందింది. ఈ గనిని ప్రసిద్ధ బారిక్ గోల్డ్, న్యూమాంట్ కార్పొరేషన్ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ప్రతీ ఏడాది ఇది సుమారు వంద టన్నుల బంగారాన్ని భూమి గర్భం నుంచి వెలికితీస్తుంది, అంటే దాదాపు లక్ష కిలోల పసిడి ప్రపంచ మార్కెట్‌లోకి వస్తోంది.
అమెరికా ఆర్థిక శక్తికి పునాది..
అగ్రరాజ్యమైన అమెరికా ఆర్థిక వ్యవస్థలో నెవాడా గనుల పాత్ర కీలకమైంది. ఈ ప్రాంతం నుంచి వెలువడే బంగారం దేశ విదేశీ మారక నిల్వలను బలపరుస్తుంది. వరల్డ్ గోల్డ్ రిజర్వ్‌ల పరంగా కూడా యూఎస్‌ఏ అగ్రస్థానంలో నిలవడానికి ప్రధాన కారణాల్లో ఇది ఒకటని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.
Also Read: మోడీ కన్నా ఆరేళ్ళ ముందే చంద్రబాబు నాయుడు సీఎం కానీ..
భారత దేశంలోనూ గోల్డ్ మైన్..
భారతదేశంలో కూడా కర్నాటకలోని కోలార్, హుట్టి వంటి బంగారు గనులు ఉన్నప్పటికీ, వాటి నుంచి ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. తవ్వక వ్యయం అధికంగా ఉండడం వల్ల దేశీయ ఉత్పత్తి పరిమితమవుతోంది. అందువల్ల భారత్ ఎక్కువ మొత్తంలో బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈ అధిక ఆధారపడకం దేశ ఆర్థిక సమతుల్యంపై ప్రభావం చూపుతోంది.
బంగారం మనిషి ఆకాంక్షల ప్రతీకగా ఉంటుంది. కానీ నెవాడా వంటి గనులు భూమి సంపదను సమర్థవంతంగా వినియోగించడం ద్వారా ఆర్థిక యుక్తిని సాదించగలవని ఈ కథ చెబుతోంది.