Nani Sujith movie update: టాలీవుడ్ లో టాప్ నిర్మాణ సంస్థల్లో ఒకటి DVV ఎంటర్టైన్మెంట్స్. ఎన్నో ఏళ్ళ నుండి వీళ్ళు సినీ ఇండస్ట్రీ లో కొనసాగుతున్నారు. కానీ కరోనా లాక్ డౌన్ తర్వాత ఈ సంస్థ ఎన్నడూ చూడని లాభాలను చూసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. #RRR చిత్రం తో సెన్సేషన్ సృష్టించి భారీ లాభాలను మూటగట్టుకున్న ఈ సంస్థ, ఆ తర్వాత వెంటనే ‘సరిపోదా శనివారం’ చిత్రం తో మరో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత రీసెంట్ గానే ఈ ప్రొడక్షన్ నుండి వచ్చిన పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం ఏ రేంజ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సింగిల్ లాంగ్వేజ్ నుండి 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన అతి తక్కువ ఇండియన్ సినిమాల్లో ఒకటిగా నిల్చింది ఈ చిత్రం.
ఈ చిత్రం తర్వాత మళ్లీ ఈ బ్యానర్ లోనే సుజిత్(Sujeeth) దర్శకత్వం లో నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) సినిమా తెరకెక్కాల్సి ఉంది. కానీ ఎందుకో కొన్ని కారణాల వల్ల దానయ్య ఈ చిత్రం నుండి తప్పుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని నేచురల్ స్టార్ నాని స్వయంగా నిర్మిస్తున్నాడు. ఓజీ మూవీ షూటింగ్ సమయం లోనే నిర్మాత దానయ్య మరియు సుజిత్ మధ్య చిన్నపాటి మనస్పర్థలు ఏర్పడ్డాయని, సినిమాకి చెప్పిన బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు చేసాడని, అప్పటి నుండి వీళ్ళ మధ్య మాటలు కట్ అయ్యాయి అని, అందుకే నాని ప్రాజెక్ట్ నుండి ఈ సంస్థ తప్పుకుందని అంటున్నారు. వచ్చే ఏడాది సెట్స్ మీదకు రానున్న ఓజీ ప్రీక్వెల్, ఓజీ సీక్వెల్ కూడా ఈ ప్రొడక్షన్ నుండి వచ్చే అవకాశాలు చాలా తక్కువ అట. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ రెండు సినిమాలను నిర్మించే అవకాశాలు ఉన్నాయని టాక్.
వాస్తవానికి ఓజీ మూవీ ని నిర్మాణ దశలో ఉన్నప్పుడే కొనుగోలు చేయడానికి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తెగ ప్రయత్నాలు చేసింది. కానీ దానయ్య అందుకు ఒప్పుకోలేదు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బాగా బిజీ అయ్యి, సినిమాని పూర్తి చేయడానికి లాంగ్ గ్యాప్ వచ్చినప్పటికీ కూడా, ఈ సినిమాని వదలకుండా పూర్తి చేసాడు దానయ్య. ఇది పవన్ కళ్యాణ్ మీద ఆయనకు ఉన్న అభిమానం. కానీ సుజిత్ తో టర్మ్స్ మరియు కండీషన్స్ కుదరకపోవడం తో, ఆయనతో సినిమాలను నిర్మించే ఆలోచనలను ప్రస్తుతానికి పక్కన పెట్టాడు దానయ్య.