Weird Restaurant Concept: మామూలుగా మనం రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు.. ముందుగా చేతులు కడుక్కొని రమ్మంటారు. ఆ తర్వాత టేబుల్ ముందు కూర్చుంటే.. మనం ఆర్డర్ చేసిన పదార్థాలను వండి తీసుకొస్తుంటారు. అయితే ఈ రెస్టారెంట్ మాత్రం పూర్తి విభిన్నం. ఇక్కడ జరిగేది కూడా వింతగా ఉంటుంది. విచిత్రంగా ఉంటుంది.
అక్కడ రెస్టారెంట్ కి వెళ్తే వెయిటర్లు స్పూన్లతో పద్ధతిగా వడ్డించరు. పోర్కులు ఇచ్చి తినమని చెప్పరు. అక్కడ అంతా విచిత్రంగా సాగుతూ ఉంటుంది. విభిన్నంగా ఉంటుంది. అమెరికాలోని ఎల్ సీయోలో అనే రెస్టారెంట్లో ప్రతిదీ వింతగానే ఉంటుంది. అక్కడికి వెళ్ళగానే వెయిటర్ వేడివేడిగా కరిగించిన చాక్లెట్ మొత్తాన్ని నేరుగా తినడానికి వచ్చిన వారి అరచేతుల్లో పోస్తాడు. దాన్నుంచి బయటపడే లోగా.. ఆ చాక్లెట్ మొత్తాన్ని చేతులకు రుద్దుకుంటూ నాకండి అంటూ చెబుతుంటాడు. చదువుతుంటే ఇదేం వింత రా బాబు అనుకున్నప్పటికీ.. అలా చేయాల్సిందే.
ఇలా మనం మన చేతులను నాక్కోవాలి అంటే కచ్చితంగా 26000 ఖర్చు పెట్టాలి. ఈ కాన్సెప్ట్ ను కొలంబియా దేశానికి చెందిన ప్రముఖ మాన్యుయల్ అందుబాటులోకి తీసుకొచ్చాడు. ఇతడు న్యూరో గ్యాస్ట్రోనమీ అనే విధానం ద్వారా దీనిని రూపొందించాడు. రెస్టారెంట్ కి వచ్చే వాళ్లకు కేవలం నాలుకకు మాత్రమే అనుభూతిని ఇవ్వకుండా.. ముక్కు, చర్మం వంటి వాటికి అనుభూతి ఇవ్వాలనే లక్ష్యంతో ఈ చాకో థెరపీని అందుబాటులోకి తీసుకొచ్చాడు.. చేతుల మీద చాక్లెట్ పోయగానే వచ్చే ఆ పరిమళం వెంటనే చిన్నతనంలో ఉన్న జ్ఞాపకాలను ఒకసారి గా గుర్తుకు తెస్తుంది. కేవలం చాక్లెట్ కోసం మాత్రమే అక్కడ 26,000 వసూలు చేయడం లేదు. ఇక్కడ ది ఎక్స్పీరియన్స్ మెనూ అనేది ఒకటి ఉంటుంది. ఇందులో దాదాపు 22 రకాల వంటకాలు ఉంటాయి. వాటి మొత్తాన్ని కస్టమర్లకు వడ్డిస్తుంటారు. అందులో ఒక వంటకమే చాక్లెట్ థెరపీ.. ఇది కూడా ఒక కోర్స్ లాంటిది అన్నమాట.
ఇంత ఖరీదు ఉన్నప్పటికీ చాలామంది ఈ రెస్టారెంట్ కు వచ్చేస్తున్నారు. చాక్లెట్ కి ద్రవాన్ని లొట్టలు వేసుకుంటూ తాగుతున్నారు. అమెరికాలో రకరకాల చాక్లెట్లు అందుబాటులో ఉంటాయి. అవన్నీ కూడా రకరకాల రుచులను కలిగి ఉంటాయి. కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఈ విధమైన పద్ధతిని ఇక్కడ ప్రవేశపెట్టారని వార్తలు వస్తున్నాయి. డబ్బు సంగతి ఎలా ఉన్నప్పటికీ చాక్లెట్ ను నాకడానికి చాలామంది వస్తున్నారు. ఈ హోటల్ విపరీతంగా లాభాలు సొంతం చేసుకోవడానికి చాక్లెట్ థెరపీ ప్రధాన కారణమని ఇక్కడి వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

