Viral News : ఇదేందయ్యా ఇదీ.. అల్లుడితో అత్త పెళ్లి.. ఎంకరేజ్ చేసిన మామ

అయితే ఈ ఘటనను మొత్తం అక్కడ ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే ఆ సమయంలో పక్కనే ఉన్న వారు చప్పట్లు కొడుతూ ప్రోత్సహించడం గమనార్హం.

Written By: NARESH, Updated On : May 3, 2024 9:12 pm

Viral News : The uncle who arranged the marriage of the aunt with the son-in-law

Follow us on

Viral News : కూతురు చనిపోవడంతో అల్లుడు, ఆయన పిల్లలను ఇంటికి తెచ్చుకోవడమే ఆ మామ తప్పు అయ్యింది. ఏకంగా అత్తతోనే దుకాణం పెట్టేశాడు అల్లుడు. ఈ విషయాన్ని పసిగట్టిన మామ వారి బండారాన్ని బయటపెట్టాడు. పెద్దల వద్ద పంచాయితీ పెట్టాడు. అయితే తనకంటే పదేళ్లు పెద్దది అయిన అత్తను ప్రేమిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు అల్లుడు. దీంతో అంతా షాక్ కు గురయ్యారు. వారి విషయంలో గ్రామ పెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నారు. అత్యంత క్లిష్టమైన తీర్పు ఇచ్చారు. బీహార్ లో వెలుగు చూసింది ఈ ఘటన.

45 సంవత్సరాల సికిందర్ యాదవ్ అనే వ్యక్తికి గతంలోనే పెళ్లి అయ్యింది. ఆయనకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పిల్లలు పుట్టిన తర్వాత సికిందర్ యాదవ్ భార్య చనిపోయింది. కుమార్తె చనిపోవడంతో ఆవేదనకు గురైన తండ్రి దిలీశ్వర్ ధార్వే, తల్లి గీతాదేవి చలించి పోయారు. పిల్లలతో పాటు అల్లుడ్ని తమ ఇంటికి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే 55 ఏళ్ల గీతాదేవితో సికిందర్ యాదవ్ ప్రేమలో పడ్డాడు. దీనిని గుర్తించిన దిలీశ్వర్ దార్వే ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. వారిద్దరూ సన్నిహితంగా ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. అనంతరం గ్రామ పెద్దల వద్ద పంచాయతీ పెట్టాడు. అయితే అక్కడే సికిందర్ యాదవ్ ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు. తనకు తన అత్త అంటే ఇష్టమని.. ఆమెను ప్రేమిస్తున్నానని.. పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పుకొచ్చాడు. దీంతో గ్రామ పెద్దలతో పాటు గ్రామస్తులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

అయితే ఈ ఘటనతో మామ దిలీశ్వర్ దార్వే ఆవేదన చెందాడు. భార్య చనిపోయిందని చేరదీస్తే అల్లుడు ఇలా చేశాడు ఏంటి అని కన్నీటి పర్యాంతం అయ్యాడు. చివరకు చేసేదేమీ లేక అల్లుడితో తన భార్య వివాహానికి ఒప్పుకున్నాడు. అందరూ చూస్తుండగానే అత్త నుదుటిపై సికిందర్ యాదవ్ బొట్టు పెట్టాడు. అయితే ఈ ఘటనను మొత్తం అక్కడ ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే ఆ సమయంలో పక్కనే ఉన్న వారు చప్పట్లు కొడుతూ ప్రోత్సహించడం గమనార్హం.